Vehicle tax
-
ప్రజలపై ట్యాక్స్ పిడుగు.. భారీగా పెరిగిన వెహికల్స్ ధరలు
కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదేఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్‌ను 11 శాతానికి చేర్చింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లించాల్సి ఉంది. కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో పన్ను చెల్లింపు తేదీని పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో 10 రైళ్లు రద్దు ఏపీ: వాహన విక్రయాల్లో జోష్ -
వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి నెల రోజుల్లో పన్ను మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి అడ్వాన్సు త్రైమాసిక పన్ను మార్చి 30 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. ఏటా ఈ గడువు దాటాక నెలపాటు గ్రేస్ పీరియడ్ వర్తింపచేస్తారు. వెరసి ఆ సమయం ఏప్రిల్ 30తో ముగిసింది. ఈలోపు పన్ను చెల్లించని వారు అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు పన్ను చెల్లించాలంటూ కొందరు వాహనదారులను మౌఖికంగా ఆదేశించారు. అయితే లాక్డౌన్ సమయంలో పన్ను చెల్లింపు కోసం ఒత్తిడి చేయటం తగదని, వెంటనే గడువు పెంచాలని 20 రోజుల క్రితమే అధికారులకు తెలంగాణ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అత్యవసర సరుకులు తరలిస్తున్న లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ కమిషనర్ సిఫారసు మేరకు ప్రభుత్వం గడువు పెంచింది. -
బకాయి @19 కోట్లు
- నామమాత్రంగా వాహన పన్ను వసూళ్లు - మొక్కుబడిగా దాడులు.. దృష్టి పెట్టని రవాణాశాఖ ఖమ్మం క్రైం: వాహన పన్ను చెల్లించని యజమానులపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని కూడా సూచించింది. కానీ జిల్లా ఆర్టీఏ అధికారులకు మాత్రం ఇదేది పట్టడం లేదు. ఇప్పటి వరకు సరైన దృష్టి పెట్టడం లేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పన్ను చెల్లించాల్సిన వాహన యూజమానులు 11వేల మంది ఉండగా రూ.19 కోట్ల ఆదాయం వసూలు కావాల్సి ఉంది. వీటిలో నిరుపయోగంగా ఉన్న వాహనాలు ఎన్ని, కండీషన్లో వున్న వాహనాలు ఎన్ని తమకు ఓ నివేదికను అందజేయాలని కూడా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు జిల్లా రవాణాశాఖ సిబ్బంది దీనిపై ఎటువంటి నివేదికనూ తయూరు చేయలే దు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రోడ్డు రవాణశాఖ జారుుంట్ కమిషనర్ పాండురంగారావు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ట్యాక్స్ పేమెంట్‌పై గురువారం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మొక్కుబడిగా.. ఇటీవల జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీవో ఆధ్వర్యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పన్నులు వసూలు కాని ప్రాంతాల్లో అదనపు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని నిర్ణరుుంచారు. కనీసం వాహన యజమానులకు నోటీసులు సైతం జారీ చేయకపోవడంతో పన్నులు చెల్లింపునకు ఎవరూ ముందుకు రావడం లేదు. సెప్టెంబర్ 30 నాటికి వాహన పన్ను స్వచ్ఛందంగా చెల్లిస్తే జరిమానా నుంచి బయటపడవచ్చని రాష్ట్ర రవాణశాఖ సూచించింది. ఒకవేళ పన్ను చెల్లించకుండా తనిఖీ సమయంలో పట్టుబడితే 200 శాతం అదనపు జరిమానా విధించాలని కూడా నిర్ణరుుంచింది. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించాల్సిన 11వేల వాహనాలను గుర్తించగా వాటిలో ఈనెల 17 నుంచి ఇప్పటి వరకు 510 మంది వాహన యజమానులు మాత్రమే పన్ను చెల్లించారు. అయినా ఆర్టీవో సిబ్బంది మేల్కోవడం లేదు. స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా పన్నుల వసూళ్లపై స్పెషల్‌డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పన్ను చెల్లించని వాహ నాలు 11వేలు ఉన్నట్లు గుర్తించాం. వాటిలో ఎన్ని వాహనాలు కండీషన్లో ఉన్నాయో తెలియడం లేదు. దీని మీద నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. కండీషన్ లేని వాహనాల యజమానులు ఆర్టీవో కార్యాలయానికి తెలియజేయూలి. - మోమిన్, ఆర్టీవో -
పన్నులు సకాలంలో చెల్లించాలి
తమ్మరబండపాలెం(కోదాడరూరల్):వాహనదారులు తమ వాహనాల పన్నులను సకాలంలో చెల్లించి ఆర్టీఓ అధికారులకు సహకరించాలని జిల్లా ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం కోదాడ మం డలంలోని తమ్మరబండపాలెం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను, అధికారుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ఆర్టీఓ కార్యాలయ పరిధిలోని ఏడు మండలాలలోని పన్ను మినహాయింపు పోగ మిగి లిన వాహనదారులు తమ పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. లేకుంటే 200 శాతం అధిక పన్ను విధించాల్సి వస్తుందన్నారు. జిల్లాలోనే మూడు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయని తెలి పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ నెల చివరి వరకు జిల్లాలో రూ.44.2కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పన్నుల ద్వారా రూ.16.42 కోట్లు, జీవితకాలం పన్నుల ద్వారా 18.40 కోట్లు, ఫీజుల ద్వారా 4.6కోట్లు, సర్వీస్ ట్యాక్స్ ద్వారా 1.42 లక్షలు, తనిఖీల ద్వారా 3.5 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీఓ ద్వారా జిల్లాకు కోట్లరూపాయాల ఆదాయం ఉండి సూర్యాపేటకు మాత్రమే సొంత భవనం ఉందన్నారు. మిగిలిన కార్యాలయాలకు కూడా నూతన భవనాల నిర్మాణాలకు, సొంతస్థలం కొరకు రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యాలయనికి వచ్చిన వాహనాదారులకు సమాచారాన్ని, సల హాలు ఇచ్చేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడను యూనిట్ ఆఫీసుగా మార్చేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు.. జిల్లాలోని వాహనదారులకు, డ్రైవర్లకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివి ధ శాఖల అధికారుల సమన్వయంతో కలెక్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల బస్సుల డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. విద్యార్ధులను పరిమిత సంఖ్యలో ఎక్కించుకోవాలని ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెక్‌పోస్టుల పరిశీలన కార్యాలయ పరిశీలన అనంతరం మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులోని అంతరాష్ట్ర ట్రాన్స్‌పోర్టులను పరిశీలించారు. జిల్లాలోని చెక్‌పోస్టులను మరింత పటిష్టంగా మారుస్తామని, కంప్యూటరైజ్డ్ బిల్లులుకు, అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రవాహనాలతో పాటు జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయినా వాహనాలకు చెక్‌పోస్టులలో తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు. ఆయన వెంట కోదాడ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి, చెక్‌పోస్టు ఎంవీఐలు షౌకత్అలీఖాన్, సాదుల శ్రీనివాస్ తదితరులున్నారు. -
తెలంగాణ ఆదాయం...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ప్రతినెలా మూడువేల కోట్ల రూపాయలు దాటుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాస్త నిరాశపరుస్తున్నా, వ్యాట్, ఎక్సైజ్ మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉంటున్నాయి. గత ఐదునెలల్లో వచ్చిన ఆదాయం రూ.15,641 కోట్లు. మొదటి నాలుగు నెలల్లో రూ.12,381 కోట్లు కాగా, అక్టోబర్‌లో 3260 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. ఐదు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద మొత్తం రూ.20 వేల కోట్ల వరకు ఖర్చుచేసి ఉం టుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ఐదునెలలుగా వ్యాట్ 2100 కోట్ల రూపాయల నుంచి 2400 కోట్ల మధ్య ఉంటున్నట్టు వాణిజ్యపన్నుల శాఖ పేర్కొంది. అక్టోబర్‌లోనే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ద్వారా సమకూరింది. వాహనాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్కోదానికి 180 కోట్ల రూపాయల మేర వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. భూగర్భ ఖనిజాలు, అటవీ ఉత్పత్తులతోపాటు ఇతర వి భాగాల నుంచి 400 కోట్ల వరకు వచ్చింది.