కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.
పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్‌లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదే
ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్‌ను 11 శాతానికి చేర్చింది.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment