పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్‌మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.
ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్‌యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్‌లోనూ పెద్ద కంపెనీలే..
ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్‌మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment