Second hand bikes
-
Hyderabad: సెకండ్ హ్యాండ్ బైక్‌లకు వడ్డీల మీద వడ్డీ
పట్టణానికి చెందిన అంకిత్ అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. పనిలో భాగంగా అక్కడక్కడా తిరగాల్సి రావడంతో మోటార్ సైకిల్ అవసరం పడింది. దీంతో సెకండ్ హ్యాండ్ బైక్‌లు విక్రయించేవారి వద్ద రూ.60 వేలకు బైక్ మాట్లాడుకున్నాడు. మొదట రూ.20 వేలు చెల్లించి బైక్ తీసుకున్నాడు. మిగితా డబ్బులు నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తానని నిర్వాహకుల వద్దే అధిక వడ్డీకి ఫైనాన్స్ చేసుకున్నాడు. రెండు నెలలు వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలోనే కుటుంబ ఆరి్థక పరిస్థితుల కారణంగా ఫైనాన్స్ కట్టలేదు. వెంటనే ఫైనాన్స్ వారు వచ్చి బైక్ తీసుకెళ్లారు. దీంతో ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇది కేవలం అంకిత్ పరిస్థితే కాదు. విద్యార్థులు, కారి్మకులు, చిరు వ్యాపారులందరిదీ ఇదే పరిస్థితి. తూప్రాన్: ఈజీ ఫైనాన్స్ ముసుగులో రూపాయికి రూపాయి.. వడ్డీలకు చక్రవడ్డీ.. ఏ చట్టానికి చిక్కకుండా గుట్టుగా వ్యాపారం.. ఆటోమొబైల్ వ్యాపారంలో బడా ఆరి్థక నేరం.. బడుగులే టార్గెట్.. యువత కోరికలు, బలహీనతలే కాసులు కురిపిస్తున్నాయి.. పల్లెలకు సైతం విస్తరించిన సెకండ్ హ్యాండ్ బైక్ ఫైనాన్స్ సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పుట్టగొడుగుల్లా షోరూమ్లుప్రతీ మండల కేంద్రంలోనూ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు, రోజువారి కూలీలు, చిరుద్యోగులు, దిగువస్థాయి, మధ్యతరగతి వారికి యువకులు, కాలేజీ స్టూడెంట్లకు ఎటువంటి షరతులు లేకుండా కేవలం ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులతో సెకండ్ హ్యాండ్ బైక్‌లను నెలవారి చెల్లింపుల పద్ధతిలో అమ్ముతున్నాయి. దీంతో ఈ వర్గాల జనానికి బైక్ ముచ్చట తీరుతోంది. కానీ బైక్ తీసుకున్న తర్వాత అసలు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. బైక్ సొంతం చేసుకోవాలనే కుతూహలంతో ఫైనాన్షియర్లు చెప్పిన చోటల్లా సంతకాలు చేస్తున్నారు. నెల వాయిదా ఆలస్యం అయితే ఈ మొత్తం రోజువారి వడ్డీ కింద వ్యాపారులు లెక్కిస్తారు. వాయిదాల వసూలుకు ఎన్ని దఫాలు వస్తే చార్జీలు అదనంగా చెల్లించాలి. ఇదంతా అప్పడికప్పుడు తెలియదు. వాయిదాలు అన్నీ తీరాక బైక్ ఆర్సీ బుక్ అడిగితే ఇవన్నీ లెక్కగట్టి ఆఖరులో చెబుతారు. కొనుగోలు దారులకు బైక్‌పై ఎలాంటి హక్కులు లేకపోవడంతో నోరెత్తకుండా నగదు చెల్లించి బయటపడుతున్నారు. దారి తప్పుతున్న విద్యార్థులు చాలా మంది యువకులు కాలేజీలకు బైక్‌లపైనే వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కొనే పరిస్థితి లేకున్నా ఒత్తిడి చేయడంతో ఫైనాన్స్‌లో బైక్ ఇప్పిస్తున్నారు. తీరా కొన్ని నెలలపాటు ఫైనాన్స్ డబ్బులు కట్టకపోయేసరికి విద్యార్తుల ఇళ్ల వద్ద ఫైనాన్సి యర్లు గొడవ చేస్తే పరువుపోతుండటంతో పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీరుస్తున్నారు. అంతే కాకుండా దొంగ బైక్‌లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసుల్లో పట్టుబడినప్పడు ఈ విషయం బహిర్గతమవుతున్న ఘటనలు ఉన్నాయి. సులువుగా అప్పు దొరికేసరికి ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు.పట్టించుకోని అధికారులు ఫైనాన్స్ వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఎంత వడ్డీ గుంజుకున్నా ఇచ్చేవాడి ఇష్టం.. తీసుకునే వాడి అవసరం అన్నట్లుగా సాగిపోతుంది. సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ తక్కువకు కొని ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. పెద్దపెద్ద షోరూంలు ఏర్పాటు చేస్తున్నా కస్టమ్స్ శాఖ గానీ, వాణిజ్య పన్నుల శాఖ గానీ, ముస్సిపాలిటీ, పంచాయతీలు చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులను అప్పుల ఊబిలో దించే ఈ వ్యాపారంలో కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వెనక్కిరాని డబ్బులు ఇదిలా ఉంటే మరికొన్ని కేసుల్లో ధరలో పాతికి శాతం డబ్బు కడితే బైక్ ఇస్తున్నారు. తర్వాత రెండు వాయిదాలు సరిగా కట్టకపోతే బైక్‌ను ఫైనాన్షియర్ మనుషులు స్వా«దీనం చేసుకుంటారు. ఇటువంటి సందర్భంలో ముందు చెల్లించిన పాతిక శాతం డబ్బులూ వెనక్కి ఇవ్వరు. ఇలా వీరు దోపిడీకి పాల్పడినా అడ్డుకునేందుకు వీలుగా నిబంధనలు లేవు. దొంగిలించిన వాహనాలు, ప్రమాదాలకు గురైన వాహనాలను సైతం సులువుగా అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు వ్యాపారు లు హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి బ్రాంచీలుగా పల్లెల్లో నిరుద్యోగ యువకులను ఏజెంట్లుగా ఎంపిక చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవలె తూప్రాన్‌లో బైక్ జోన్లపై పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.చర్యలు తీసుకుంటాం సెకండ్ హ్యాండ్ బైక్‌ల విక్రయాలు పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్నాయి. సులభ వాయిదాల్లో బైక్ కొనాలనుకున్నవారు సెంకడ్ హ్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. బైక్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగా చూసుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అలాగే, వ్యాపారులు ఫైనాన్స్ పేరులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రంగాకృష్ణ, సీఐ తూప్రాన్ -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
రోడ్లపై వాహన వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులపై వాహన వరద పారుతోంది.. రోడ్లపై హారన్ సౌండ్ చేయనిదే బండ్లు ముందుకు నడిచే పరిస్థితి కనిపించటం లేదు.. 7 నెలల్లో కొత్తగా 4.39 లక్షల ద్విచక్ర వాహనాలు, 89 వేల కార్లు.. ఇటు సెకండ్ హ్యాండ్‌వి 2.52 లక్షల వాహనాలు.. వీటికి తోడు అప్పటికే ఇళ్లలో ఉన్న సొంత వాహనాలు.. మొత్తం అన్నీ రోడ్లపైకి పోటెత్తాయి.. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, కి.మీ.ల కొద్దీ వాహనాల బారులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జంట నగరాలు లాక్‌డౌన్‌కు ముందుకంటే ఎక్కువ ట్రాఫిక్ సమస్యతో ఇప్పుడు సతమతమవుతున్నాయి. 10 కి.మీ. ప్రయాణానికే పీక్ అవర్స్‌లో గంటన్నర సమయం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తెచ్చిన మార్పులెన్నో.. ఈ వాహన వరద కూడా దాని ప్రభావమే..! వ్యక్తిగత వాహనాలు సురక్షితమని.. కోవిడ్ అనగానే భౌతిక దూరం ముందుగా గుర్తుకొస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మనిషికి మనిషికి మధ్య దూరం లాక్డౌన్ సమయంలో మరింత ఎక్కువగా ఉండేది. అప్పట్లో కోవిడ్ అంటే కనిపించిన భయం అంతా ఇంతా కాదు. దీంతో భౌతిక దూరం పాటించే ఉద్దేశంతో ప్రయాణాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగంపై జనం దృష్టి సారించారు. అలా వాటి వరద మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కోవిడ్ భయం మటుమాయమైంది. ప్రస్తుతం మాస్క్ వాడేవాళ్ల సంఖ్య కూడా తక్కువైపోతోంది. ఇక వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావటంతో జనంలో ఆ మహమ్మారి భయం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బజార్లలో భౌతిక దూరం ఊసే లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరి భయం పూర్తిగా మటుమాయమైనా.. భౌతికదూరం కోసం వ్యక్తిగత వాహనాల వినియోగానికి అలవాటు పడ్డ జనం మాత్రం వెనక్కు రావటం లేదు. లాక్డౌన్లో మొదలైన వ్యక్తిగత వాహన వినియోగం ఇంకా కొనసాగటమే కాదు, మరింతగా పెరుగుతోంది. బస్సెక్కేందుకు ససేమిరా.. లాక్డౌన్ సమయంలో 2 నెలల పాటు బస్సులు తిరగలేదు. ఆ తర్వాత అవి క్రమంగా రోడ్డెక్కాయి. కానీ జనం మాత్రం బస్కెక్కేందుకు ససేమిరా అంటున్నారు. 2 నెలల క్రితం వరకు కూడా 50 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో అతికష్టమ్మీద 65కు చేరుకుంది. ఎప్పుడూ ఫుట్‌బోర్డుపై జనం వేళ్లాడుతుండటంతో ఓ పక్కకు ఒరిగినట్టుగా పరుగుపెట్టే సిటీ బస్సులు.. ఇప్పుడు సగం సీట్లు ఖాళీగానే ఉండి నీరసంగా నడుస్తున్నాయి. ఇటు జనం దెబ్బకు ఏసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరపట్టణాలకు తిరిగే ఏసీ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఇందులో కొంత కోవిడ్ భయమున్నా.. సొంత వాహనాలకు అలవాటు పడటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆ రెండు నెలలే డల్.. లాక్డౌన్ వల్ల ఉపాధికి ఇబ్బందైందని, ఆదాయం బాగా తగ్గిందని చెప్పేవాళ్లే ఎక్కువ.. అలాంటప్పుడు వాహనాల విక్రయాలు బాగా పడిపోవాలి. కానీ అలా జరగలేదు. లాక్డౌన్లో 2 నెలలు మినహా మిగతా నెలల్లో వాహనాలు మామూలుగానే అమ్ముడయ్యాయి. గత రెండు నెలల గణాంకాలు పరిశీలిస్తే.. గతేడాది అదే నెలల కంటే ఎక్కువగా అమ్ముడవటం విశేషం. గత 7 నెలల్లో రాష్ట్రంలో 4.40 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.68 లక్షలు విక్రయమయ్యాయి. తేడా స్వల్పమే. ఇక.. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడైతే గత నవంబర్‌లో అది 75 వేలుగా ఉంది. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే గతేడాది డిసెంబర్లో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక గత 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్మితే గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, గత డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. లాక్డౌన్ ప్రభావం తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుండటంతో సొంత వాహనాలు కొనుగోలు గతం కంటే పెరుగుతోందని అర్థమవుతోంది. పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయం.. కొత్త వాహనాలు అంతకుముందు సంవత్సరంలాగే అమ్ముడవుతుండగా, సెకండ్‌హ్యాండ్ వాహనాలు మాత్రం గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.10 లక్షల ద్విచక్రవాహనాలు చేతులు మారగా, 2020లో అదే సమయంలో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. అదే కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు కాగా, గతేడాది 99,807గా ఉండటం విశేషం. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలు కొనలేని వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపారు. అయితే వర్క్ ఫ్రం హోమ్ అమలులో ఉండటం, విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవటం వల్ల వాహనాల రద్దీ తక్కువగా ఉండాలి. కానీ అంతకుముందు కంటే పెరగటం గమనార్హం.. ఆర్టీసీ అధ్యయనంలో ఇలా.. నగరంలో సిటీ బస్సులు తిరిగే మార్గాల్లో కొన్నింటిలో బస్సులు నిరంతరం రద్దీగా ఉంటాయి. జియాగూడ, ఎల్బీనగర్, రామంతాపూర్, పటాన్చెరు.. తదితర రూట్లు బాగా బిజీగా ఉంటాయి. నగర రోడ్లపై రద్దీ విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ రూట్లలో తిరిగే సిటీ బస్సులు పూర్తిగా వెలవెలబోతున్నాయి. దీనిపై తాజాగా ఆర్టీసీ అధికారులు ఓ పరిశీలన జరిపారు. గతంతో పోలిస్తే ఈ మార్గాల్లో బస్సులకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని డ్రైవర్లు గుర్తించారు. అంటే వాటి సంఖ్య బాగా పెరిగిందన్నది వారి మాట. అదే సమయంలో ఆక్యుపెన్సీ రేషియో సగానికి తక్కువగా ఉంది. రోడ్లపై వాహనాలు పెరిగాయి, బస్సుల్లో జనం తగ్గారు. వెరసి నగర రోడ్లపై వ్యక్తిగత వాహనాలు బాగా పెరిగాయని ఆర్టీసీ గుర్తించింది. సిటీ బస్సులు మొదలై ఇన్ని నెలలైనా ఆక్యుపెన్సీ రేషియో పెరగకపోవటానికి ఇదే కారణమని వారు ఉన్నతాధికారులకు ఓ రిపోర్టు సమర్పించారు. ఢిల్లీ తరహా ముప్పు వాటిల్లుతుంది.. ‘కొన్ని రోజులుగా రోడ్లపై వాహనాల సంఖ్య బాగా పెరిగింది. కోవిడ్ భయంతో ఇలా జనం తాత్కాలికంగా సొంత వాహనాలు వాడుతున్నారని సరిపెట్టుకుంటే మాత్రం ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. లేకుంటే ఢిల్లీ తరహా సమస్య మనల్ని చుట్టుముడుతుంది. ఒకసారి జనం సొంత వాహనమే మేలన్న అభిప్రాయంలోకి వస్తే ప్రజారవాణావైపు మళ్లటం కష్టమవుతుంది. కోవిడ్ భయం పోగానే ప్రజా రవాణా కిక్కిరిసిపోయేలా చేయాలి. లేకుంటే భూమి నుంచి ఎత్తుకుపోయే కొద్ది చల్లబడాల్సిన వాతావరణం వేడిగా మారుతుంది. పదో అంతస్తువారు కూడా నేలపై ఉన్న వేడినే అనుభూతి పొందుతారు. అది కాలుష్యం వాతావరణంలో పొరలా మారటంతో ఏర్పడే సమస్య. అది ఏర్పడిందంటే జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అక్కడి దాకా సమస్యను రానీయకూడదు’ – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త రోజుకు 200 కి.మీ. బండిపైనే.. మా గ్రామం నుంచి హైదరాబాద్ 90 కి.మీ. దూరంలో ఉంటుంది. నేను ఆర్గానిక్ ఫుడ్‌కు సంబంధించి ఓ సంస్థ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. రోజూ బైక్‌పై వచ్చి వెళ్తున్నాను. అంతకుముందు బస్సుల్లో వచ్చే వాడిని లాక్‌డౌన్‌నుంచి బైక్‌పైనే వస్తున్నా.. – ఐలి గణేశ్‌కుమార్, రసూలాబాద్, సిద్దిపేట జిల్లా నెల ద్విచక్ర వాహనాలు కార్లు 2019 2020 2019 2020 జూన్ 67,869 67,562 11,652 8,364 జూలై 64,338 55,783 9,772 9,326 ఆగస్టు 60,557 56,290 11,104 10,575 సెప్టెంబర్ 47,042 53,303 9,314 11,322 అక్టోబర్ 1,03,430 77,273 18,815 18,400 నవంబర్ 72,464 75,673 12,045 13,852 డిసెంబర్ 52,385 53,304 17,135 17,506 మొత్తం 4,68,085 4,39,188 89,837 89,345 -
రూ. 18 వేల బండికి రూ. 96 వేలు చెల్లింపు!
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో చూసిన సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాన్ని రూ. 18 వేలకు కొనాలని భావించిన నగరవాసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 96 వేలు నష్టపోయాడు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ చిరువ్యాపారి సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలని భావించాడు. దీనికోసం మార్కెట్ ప్లేస్‌లో సెర్చ్ చేసిన ఆయనకు ఓ వాహనం నచ్చింది. అందులో ఉన్న నంబర్‌కు సంప్రదించడంతో అవతలి వ్యక్తి ఆర్మీ ఉద్యోగిగా మాట్లాడాడు. బేరసారాల తర్వాత వాహనాన్ని రూ. 18 వేలకు అమ్మడానికి అంగీకరించాడు. ఆర్మీ నిబంధనల ప్రకారం వాహనాన్ని కేవలం ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్‌లోనే పంపాలని చెప్పిన అతగాడు... దాని చార్జీల కింద రూ. 3100 తొలుత చెల్లించాలని చెప్పాడు. తన గూగుల్ పే నంబర్ ఇచ్చి అందులో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత సైతం వివిధ కారణాలు చెప్తూ మొత్తం రూ. 96 వేలు కాజేశాడు. ప్రతి సందర్భంలోనూ వాహనంతో పాటు మిగిలిన మొత్తం రిఫండ్ వస్తాయని నేరగాళ్లు చెప్పడంతో బాధితుడు నమ్మాడు. నగదు ముట్టిన తర్వాత అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
సెకండ్స్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, కర్నూలు: మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వచ్చేస్తున్నాయి. బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు సరికొత్త హంగులతో ప్రయాణానికి, రవాణాకు వీలుగా పలు కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు తమ అవసరాలకు అనుగుణగా వాహనాలను కూడా మార్చుతూ వస్తున్నారు. గతంలో ఉన్న వాహనాలను మార్కెట్లో అమ్మేస్తూ కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలను కొనుగోలు చేయలేకపోవడం, మరి కొందరు తాత్కాలిక అవసరాలకు పాత వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో సెకండ్ సేల్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ లెక్కల ప్రకారం 3,71,79 వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో 28 కారు, 52 బైక్ సెకండ్ సేల్ కేంద్రాలు ఉన్నాయి. అయితే పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తత అవసరమని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించక పోవడమే పెద్ద సమస్యగా మారుతోందని, కొద్దిపాటి నిర్లక్ష్యం భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్ సౌకర్యం పెరగడంతో గత ఐదేళ్లలో వీటి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పాత వాహనాల మార్కెట్ కూడా బాగా పెరిగింది. గతంలో వాహనం విక్రయించే సమయంలో సేల్ లెటర్‌పై సంతకం చేస్తే కొనుగోలుదారు రవాణా శాఖ కార్యాలయంలో చలానా చెల్లించి దాన్ని మార్చుకునేవారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ పద్ధతికి కాలం చెల్లింది. సులభంగా మార్పు... వాహన బదిలీకి ప్రస్తుతం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో వాహనాన్ని ఒకరి నుంచి మరొకరి పేరిట మార్చుకోవడం చాలా సులువు. విక్రయ, కొనుగోలు దారులిద్దరూ సీఎస్ఈ (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లి వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సరి్టఫికెట్, ఇద్దరి ఆధార్ కార్డ్‌లు సమరి్పంచాలి. తర్వాత ఇద్దరూ బయోమెట్రిక్ డివైస్‌తో వేలిముద్రలు వేసి.. అవసరమైన వివరాలు నమోదు చేస్తే కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట వాహనం బదిలీ అవుతోంది. కేవలం పది నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సమస్యలు ఇవీ.. పాత వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట బదిలీ చేయకపోతే.. తర్వాత ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే విక్రయించిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసాంఘిక, సంఘ విద్రోహక కార్యకలాపాలకు ఆ వాహనం వినియోగించినా.. విక్రయించిన వ్యక్తినే పోలీసులు మొదట అదుపులోకి తీసుకుంటారు. ఆయన ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తిని సంఘటనకు బాధ్యుడిని చేస్తారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు విధించే అపరాధ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా విక్రయదారు కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. 5 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాహనం అప్పగించాలి పాత వాహనం కొనుగోలుదారుడి పేరుతో బదిలీ అయ్యాక వాహనం అప్పగించాలి. పాత వాహనాలు కొనుగోలు చేసేవారు, విక్రయించే వారు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సరి్టఫికెట్స్ సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలి. ఆర్సీ ప్రకారం చాసీస్ నంబర్ తనిఖీ చేసుకోవాలి. విక్రయం పూర్తయిన వెంటనే.. వాహన బదిలీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. –జి.వివేకానందరెడ్డి, జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ -
సెకండ్ హ్యాండ్ బైకులకు విశేష స్పందన
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పాత వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొత్త బైకులు కొనుగోలు చేయడం కన్నా.. ఉన్న డబ్బులతో పాత వాహనాల కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ బైకులు విక్రయించే షోరూంలు కూడా ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వారి మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక్కడ కేవలం అర గంటలో ప్రాసెసింగ్ మొత్తం పూర్తి చేసి వినియోగదారులకు బైకు డెలీవరీ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పద్మపూజిత ఆటో ఫైనాన్స్ ఎక్సే్చంజ్ సౌకర్యంలో పాత వాహనాలను మిగిలిన షోరూంల కంటే తక్కువ ధరకు అందించడం, కొనుగోలు చేసిన ప్రతి వాహనానికి స్క్రాచ్ కార్డ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, స్పాట్ ఫైనాన్స్ అందజేస్తున్నారు. తక్కువ వడ్డీకే వాహనాల విక్రయాలు చేపట్టినట్టు ఎండీ ఆర్ఎస్వీపీ బసవరాజు తెలిపారు. అతి తక్కువ వడ్డీతో 2, 4 వీలర్స్ అమ్మకాలు చేపడుతున్నామని చెప్పారు. పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వారి వీల్స్మార్ట్లో లేటెస్ట్ మోడల్, మంచి ధరకు వెస్పా స్కూటర్ కొనుగోలు చేసినట్టు కొనుగోలుదారుడు డాక్టర్ మనోహర్ తెలిపారు. తక్కువ వడ్డీతో ఫైనాన్స్ కూడా లభించిందని, ఇంకా స్క్రాచ్‌కార్డ్ ద్వారా రూ.2 వేల క్యాష్‌బ్యాక్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. -
బైక్ అమ్ముతున్నారా.. బీ కేర్ ఫుల్..!
మీరు ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటిస్తున్నా మీ పేరుపై ఈ–చలానాలు ఇంటికి వస్తున్నాయా..? హెల్మెట్ ధరించలేదనో.. ట్రిపుల్ రైడింగ్ చేశారనో.. ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంపింగ్ వంటివాటికి పాల్పడ్డారనో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఈ–చలానాలు ఇంటికి పంపిస్తున్నారా..? కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే.. మీ పేరుపై ఇప్పటికే ఒక వాహనం ఉందని, రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే అదనపు మొత్తం చెల్లించాలని చెబుతున్నారా..? అయితే, వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిందే. మీ పాత వాహనాన్ని విక్రయించిన సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తి అతని పేరుపై వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చుకోకపోవడం, ఆ వాహనం ఇప్పటికీ మీ పేరుతోనే ఉండటమే అందుకు కారణం. దీనిపై ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఏ అధికారుల కార్యాలయాల్లో సంప్రదించి జాగ్రత్తపడటం ఉత్తమం. సాక్షి, ఒంగోలు: మార్కెట్లోకి కొత్త వాహనం వస్తే చాలు.. పాత బైక్ ఇచ్చేసి కొత్తది కొనుగోలు చేయడం వాహనప్రియులకు పరిపాటి. అయితే ఈ విధానమే నేడు వారికి తిప్పలు తెచ్చిపెడుతోంది. అమ్మిన పాత బైక్‌లు ఇంకా వారి పేరు మీద ఉండటంతో ఇటీవల ఈ చలానాల పరంపర మోత మోగిస్తోంది. తాము విక్రయించిన వాహనం ఎవరి వద్ద ఉందో కూడా తెలియని స్థితిలో ఉన్నవారు కొందరైతే, కొన్నవారు రిజిస్ట్రేషన్‌కు వెనుకాడుతుండటంతో మరికొందరు ఈ చలానాల మోతతో తిప్పలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గత ఎనిమిది నెలల్లోనే దాదాపు 40 లక్షలకుపైగా ఈ చలానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఈ మొత్తంలో కనీసంగా రూ.పది లక్షలకు పైగా మొత్తం పాత వాహనాలకు సంబంధించిన మొత్తమే అని అంచనా. వాహన విక్రేతలు బెంబేలు గతంలో వాహనాలను విక్రయించిన వారు నేడు బెంబేలెత్తుతున్నారు. సెకండ్ హ్యాండ్ షోరూముల్లో లేదా తెలిసిన వారికి వాహనాలను ఇవ్వడం, వారు మరొకరికి విక్రయించడం జరిగినా మరోమారు రిజిస్ట్రేషన్ జరగక పోవడంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అనే విషయమై జిల్లా పోలీసు అధికారులతోపాటు రవాణా శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా వారు స్పెషల్ డ్రైవ్, రిజిస్ట్రేషన్ రద్దు, ఫిర్యాదు చేయడం తదితర మార్గాలను సూచించారు. సమస్యలు ఇలా.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుల్లెట్ వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ‘గతంలోనే ఒక వాహనం మీ పేరు మీద ఉంది. కొత్త వాహన రిజిస్ట్రేషన్‌కు రూ.17 వేలు అదనంగా చెల్లించాలి’ అని చెప్పారు. తనకు వాహనమే లేదంటూ సుబ్రహ్మణ్యం అధికారులతో వాదించాడు. తీరా కంప్యూటర్లో పరిశీలిస్తే 1986లోనే అతని పేరుపై ఒక బైక్ రిజిస్ట్రేషన్ అయినట్లు స్పష్టమైంది. దీంతో తాను ఆ బైకును అప్పట్లోనే వేరేవారికి విక్రయించానని, తనవద్ద ఎటువంటి బైక్ లేదన్నా అధికారులు మాత్రం ‘నో యూజ్.. రూ.17 వేలు కట్టాల్సిందే’ అని స్పష్టం చేయడంతో అడిగినంత చెల్లించి కొత్త బైక్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే పాత వాహనం ఎవరివద్ద ఉందన్నది సుబ్రహ్మణ్యంను నిద్రపట్టనీయకుండా చేస్తోంది. # రామారావు ఒక వాహనం కొనుగోలు చేశాడు. కొత్త వాహనంపై ఆశపడి పాత వాహనాన్ని తెలిసిన స్నేహితునికి విక్రయించాడు. స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకుని అతనికి సి–బుక్‌తోపాటు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేసి ఇచ్చేశాడు. అయితే రామారావు తాజాగా కొనుగోలు చేసిన బైక్ రిజిస్ట్రేషన్‌కు అధిక మొత్తంలో ఫీజు కట్టాలనడంతో పాత బైక్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆ బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మార్చుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించినట్లు స్పష్టమైంది. # నాలుగేళ్లుగా ఒకే బైకు వాడటం నాగేంద్రం అనే వ్యక్తికి నచ్చలేదు. దీంతో తన పాత బైకును ఒక సెకండ్ హ్యాండ్ వాహనాల షాపులో విక్రయించాడు. వారు ఇతను బండి విక్రయించినట్లు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేయించుకున్నారు. కానీ కొన్నది ఎవరనే స్థానంలో ఎవరి పేరూ రాయలేదు. ఆ వాహనాన్ని వేరే వ్యక్తులకు విక్రయించే సమయంలో అక్కడ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రాయాలనేది వారి ఉద్దేశం. ఈ క్రమంలో వారు ఆ వాహనాన్ని అమ్మినప్పటికీ దానిని వారు రికార్డుపరంగా తమ వద్ద ఉంచుకోలేదు. వాహనం కొన్న వ్యక్తి మూడేళ్లు గడిచినా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు. ఎలాగూ బండికి రిజిస్ట్రేషన్ ఉంది కదా అని దాంతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బండికి సంబంధించి ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంపింగ్‌కు సంబంధించి ఆధునిక సాంకేతికత ద్వారా జారీ అయిన చలానాలు పాత యజమానికి చేరుతున్నాయి. ఇదేమని అధికారులను అడిగితే ‘బైక్ ఇంకా మీ పేరు మీదే ఉంద’ని సమాధానం ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తాం ఈ చలానాల విధానం మొదలైన తర్వాత బైక్ రిజిస్ట్రేషన్ సమస్య ఎక్కువగా వస్తోంది. వాస్తవానికి వాహన యజమాని తన వాహనాన్ని విక్రయించేటపుడు సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినపుడే అందజేయాలి. కానీ అలా చేయకపోతుండటంతో సమస్య ప్రారంభమైంది. ఈ చలానా పొందిన వారు ఎవరైనా తమ వాహనాన్ని ఫలానా వ్యక్తికి విక్రయించినట్లు స్పష్టంగా తెలిసి ఉంటే, తమకు ఫిర్యాదు చేస్తే చలానాను అతని పేరు మీదకు బదిలీ చేస్తాం. అయితే ఇందుకు కనీసం అతనికి విక్రయించినట్లు ఆధారం తప్పనిసరి. గతంలో వాహనం విక్రయించినప్పటికీ ఆ వాహనం ఏదైనా నేర ఘటనలో చిక్కుకుంటే ఆ కేసు వాహనం ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ వ్యక్తి మీద నమోదవుతుంది. అయితే ఈ సమస్యకు జిల్లా వ్యాప్తంగా ఈ చలానాలు కావచ్చు లేదా వాహనం విక్రయించినా తమ పేరుమీదే ఇంకా ఉందని భావించేవారు ఎవరైనా తమకు ఫిర్యాదు చేసేలా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలనే ఆలోచన ఉంది. సాధ్యపడుతుందనేది పరిశీలిస్తున్నాం. తద్వారా ఇరువర్గాల వారు ముందుకు వస్తే సమస్యలు తొలగిపోతాయి. అలా కాకుండా నేరం చేయాలనే తలంపుతో ఎవరైనా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లు గనుక తమ దృష్టికి వస్తే వాహనాన్ని నడిపిన వ్యక్తిని కూడా వదిలే ప్రశ్న ఉండదు. ఈ చలానాల వ్యవహారం పక్కనబెట్టి ఎవరైనా తమ పాత వాహనాన్ని గతంలో విక్రయించి ఉంటే వారు ఆన్లైన్లో వెరిఫై చేసుకుని పేరు మారిందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి. – సత్య యేసుబాబు, ప్రకాశం జిల్లా ఎస్పీ వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసుకోవడమే బెటర్ వాహనానికి సంబందించి ఈ చలానాల బెడద ఆగాలన్నా లేక భవిష్యత్తులో ఆ వాహనం ద్వారా జరిగే ఎటువంటి నేరమైనా తమ మీదకు రాకుండా ఉండాలన్నా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇందుకు వాహనం గతంలోనే తమ వద్ద కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే దానికంటే గతంలోనే వాహనం కొని కాగితాలు అన్నింటిపైనా సంతకం చేసినందువల్ల లీగల్‌గా సమస్యలు రాకుండా ఉండాలంటే ఫలానా నంబర్‌గల వాహనానికి తాను యజమానినని, దానిని తాను ఫలానా సమయంలో ఫలానా వ్యక్తికి లేదా సెకండ్ హ్యాండ్ షోరూం వారికి విక్రయించినట్లు పేర్కొంటూ పత్రికలో ఒక ప్రకటన ఇవ్వాలి. అందులో వారం రోజుల్లోగా సంబంధిత వాహనం కలిగి ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేని పక్షంలో రిజిస్ట్రేషన్‌ను తాను రద్దు చేయించడం జరుగుతుందని పేర్కొనాలి. ఈ ప్రకటన ఇచ్చిన వారం రోజుల్లో కూడా స్పందించకపోతే సంబంధిత వాహనాన్ని రద్దు చేయాలని కోరుతూ వాహనం ఏ కార్యాలయంలో అయితే రిజిస్ట్రేషన్ చేశారో అక్కడికే వెళ్లి రద్దు చేయాలని విజ్ఞప్తి చేయవచ్చు. పత్రికలో ప్రచురితమైన ప్రకటన కాపీ, వాహనం యజమానిని తానే అని నిరూపించేందుకు వీలుగా స్వయంగా రాసిన ఒక పత్రం, బండికి సంబంధించిన నకలు కాపీ(నకలు కాపీ లేని పక్షంలో అడ్వకేట్ ధ్రువీకరించిన అఫిడవిట్ జత చేయాలి. తద్వారా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. అయితే ఈ ప్రక్రియ జరగాలంటే ఇప్పటి వరకు ఆ వాహనంపై ఉన్న బకాయిలు మొత్తం ముందుగా చెల్లించక తప్పదు. ఆ తర్వాత తాను ప్రకటన చూడలేదని, అందువల్ల తనకు అన్యాయం జరిగిందంటూ కొనుగోలు చేసిన వ్యక్తి వస్తే.. సంబంధిత వాహన బదిలీ ఫీజు, ఇంతవరకు వాహనాన్ని తన పేరుమీదకు మార్చుకోనందుకు అపరాధ రుసుం రవాణా శాఖకు జమ చేసి వాహనాన్ని అతనిపేరు మీదకు మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే ఇదంతా గతంలో జరిగిన విక్రయానికి సంబంధించింది. ప్రస్తుతం మాత్రం ఎవరైనా తన వాహనాన్ని విక్రయించాలనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్లో తమ వేలిముద్ర ద్వారా సంతకం పెట్టడంతోపాటు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అయితే అమ్మిన వ్యక్తి వేలిముద్ర వేసినపుడు ఒక టోకెన్ నంబర్ వారికి వస్తుంది. ఆ టోకెన్ నంబర్ ఆధారంగా దానిని కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌కు రావడం లేదంటే పేరు మార్పుకు అతను వచ్చేంత వరకు వాహనం లేదా పత్రాలు కానీ ఇవ్వనని కరాఖండీగా చెప్పాలి. కొనుగోలు చేసిన వ్యక్తి ఎప్పుడో వేలిముద్ర వేస్తాడని ఎవరైనా చెబితే నమ్మవద్దు. దీనిపై సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే షోరూం యాజమాన్యాలకు కూడా ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా వారు వాహనాలను ఎలా కొనుగోలు చేయాలి, ఎలా విక్రయించాలనే దాంతోపాటు వారి వద్ద ప్రస్తుతం ఉన్న స్టాకును కూడా పరిశీలించి సంబంధిత ఫైనాన్స్ సంస్థ ఆధీనంలో ఉన్నట్లు రికార్డు చేస్తున్నాం. అంతే కాకుండా ఫైనాన్స్ సంస్థలు తాము గతంలో వాహనాలను విక్రయించిన వారికి కూడా అవగాహన కల్పించి వారు కూడా పేరు మార్చుకునేలా ఒత్తిడి తీసుకువస్తున్నాం. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ.. ప్రస్తుతం అతి తక్కువ అపరాధ రుసుం మాత్రమే ఉన్నందున కొనుగోలుదారులు స్వయంగా ముందుకు వచ్చి తమ పేరు మీదకు మార్చుకుంటే మంచిది. – సీహెచ్‌వీకే సుబ్బారావు, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ -
వాడేసిన బైకుకూ వారంటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాలకు ఎన్నో వెబ్‌సైట్లున్నాయి. వీటికోసం ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. కాకపోతే సెకండ్ హ్యాండ్ బైక్‌లు మాత్రమే కావాలనుకుంటే మాత్రం... క్రెడ్‌ఆర్‌ను (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఆర్ఈడీఆర్.కామ్) సందర్శించాల్సిందే. ఇంకో చిత్రమేంటంటే బైక్ కావాల్సి వచ్చి... దాన్ని కొనుక్కోవటానికి ఇబ్బంది పడ్డ వ్యక్తులే ఈ సంస్థను ఆరంభించటం. దీని గురించి వ్యవస్థాపకులు నిఖిల్, సుమిత్ ఏమంటారంటే... ఉద్యోగ రీత్యా ముంబయిలో మాకు బైక్ కావాల్సి వచ్చింది. కొత్తది కొనేంత డబ్బు లేక సెకండ్ హ్యాండ్ బైకు కొందామనుకున్నాం. ముంబయిలాంటి నగరంలో ఎక్కడ కొనాలో... ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. ఆన్లైన్లో వెతికితే అక్కడ పెట్టే బైకు ఫొటోలు, డాక్యుమెంట్లు ఒకలా ఉండేవి. తీరా ఫోన్ చేసి వెళ్లి చూస్తేనేమో పరిస్థితి వేరేలా ఉండేది! అలాంటపుడే అనిపించింది... కొత్త బైకుల్లాగే సెకండ్‌హ్యాండ్ బైకులనూ నమ్మకంగా.. నాణ్యంగా అందించే సంస్థ ఉంటే బాగుండునని!! ఆ ఆలోచనతోనే రూ.25 లక్షల పెట్టుబడితో 2015లో ముంబై కేంద్రంగా క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించాం. అమ్మేవాళ్లు ఎక్కువ పైసలు రావాలనుకోవటం... కొనేవా ళ్లు తక్కువకు కొనాలనుకోవటం జరిగేది ఒక్క సెకండ్‌హ్యాండ్ వ్యాపారంలోనే. ఆరంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. రూ.40 కోట్ల టర్నోవర్ సాధించాం. క్రెడ్ఆర్లో కొన్న వాహనానికి మేం వారంటీ కూడా ఇస్తున్నాం. 40 నుంచి 4 వేల బైకులకు.. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పుణె, హైదరాబాద్‌లో సేవలందిస్తున్నాం. గత నెలలో హైదరాబాద్‌లో ప్రారంభించాం. 40 బైకులతో ప్రారంభించిన క్రెడ్ఆర్లో ఇపుడు 4 వేలకు పైగా వాహనాలు రిజిస్టరై ఉన్నాయి. రోజుకు 75-80 బైకులను విక్రయిస్తున్నాం. ప్రతి బైకు విక్రయం మీద అమ్మకం దారు నుంచి రూ.500 చార్జీ వసూలు చేస్తాం. 8 నెలల్లో రూ.40 కోట్ల టర్నోవర్.. సంస్థను ప్రారంభించిన 8 నెలల్లోనే 10 వేల బైకులను విక్రయించాం. అంటే రూ.40 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. రోజుకు 1,000 బైకులను విక్రయించాలనేది మా లక్ష్యం. అందుకే వచ్చే ఏడాది మార్చి నాటికి 10 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రెడ్ఆర్ సేవలను ప్రారంభిస్తాం. రెండేళ్ల పాటు నిధుల జోలికెళ్లం.. క్రెడ్‌ఆర్‌ను ప్రారంభించిన ఏడాదిలోపే రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. సీడ్ రౌండ్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో స్నాప్‌డీల్ ఫౌండర్లు కునాల్ బహల్, రోహిత్ బన్సల్, బిగ్ బాస్కెట్ చైర్మన్ గణేష్ కృష్ణన్, అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్‌లు 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సిరీస్-ఎలో సెప్టెంబర్‌లో ఫిడెలిటీ ఇన్వెస్టర్స్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. రెండేళ్ల పాటు వ్యాపార విస్తరణ మీద దృష్టిపెట్టాం. ఆ తర్వాతే మరోసారి నిధుల సమీకరణ చేస్తాం. నేటి నుంచి బిగ్ బైక్ ఫెస్టివల్: సెకండ్ హ్యాండ్ బైకుల వ్యాపారంలో నమ్మకాన్ని పెంచేందుకు, క్రెడ్ఆర్కు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ది బిగ్ బైక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. అంటే ఒక బైకు కొంటే ఇంకో బైకును ఉచితంగా అందిస్తాం. మూడు రోజుల్లో తొలి 400 మంది కస్టమర్లు మాత్రమే దీనికి అర్హులు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...