సెకండ్‌ హ్యాండ్‌ బైకులకు విశేష స్పందన | Customers focus On Second hand bikes | Sakshi
Sakshi News home page

సెకండ్‌ హ్యాండ్‌ బైకులకు విశేష స్పందన

Published Wed, Oct 17 2018 11:43 AM | Last Updated on Wed, Oct 17 2018 11:43 AM

Customers focus On Second hand bikes - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర):  పాత వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొత్త బైకులు కొనుగోలు చేయడం కన్నా.. ఉన్న డబ్బులతో పాత వాహనాల కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ బైకులు విక్రయించే షోరూంలు కూడా ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌ వారి మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక్కడ కేవలం అర గంటలో ప్రాసెసింగ్‌ మొత్తం పూర్తి చేసి వినియోగదారులకు బైకు డెలీవరీ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

 పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ ఎక్సే్చంజ్‌ సౌకర్యంలో పాత వాహనాలను మిగిలిన షోరూంల కంటే తక్కువ ధరకు అందించడం, కొనుగోలు చేసిన ప్రతి వాహనానికి స్క్రాచ్‌ కార్డ్, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్, స్పాట్‌ ఫైనాన్స్‌ అందజేస్తున్నారు. తక్కువ వడ్డీకే వాహనాల విక్రయాలు చేపట్టినట్టు ఎండీ ఆర్‌ఎస్‌వీపీ బసవరాజు తెలిపారు. అతి తక్కువ వడ్డీతో 2, 4 వీలర్స్‌ అమ్మకాలు చేపడుతున్నామని చెప్పారు. పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌ వారి వీల్స్‌మార్ట్‌లో లేటెస్ట్‌ మోడల్, మంచి ధరకు వెస్పా స్కూటర్‌ కొనుగోలు చేసినట్టు కొనుగోలుదారుడు డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. తక్కువ వడ్డీతో ఫైనాన్స్‌ కూడా లభించిందని, ఇంకా స్క్రాచ్‌కార్డ్‌ ద్వారా రూ.2 వేల క్యాష్‌బ్యాక్‌ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement