Focus of people
-
సెకండ్ హ్యాండ్ బైకులకు విశేష స్పందన
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పాత వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొత్త బైకులు కొనుగోలు చేయడం కన్నా.. ఉన్న డబ్బులతో పాత వాహనాల కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ బైకులు విక్రయించే షోరూంలు కూడా ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వారి మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక్కడ కేవలం అర గంటలో ప్రాసెసింగ్ మొత్తం పూర్తి చేసి వినియోగదారులకు బైకు డెలీవరీ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పద్మపూజిత ఆటో ఫైనాన్స్ ఎక్సే్చంజ్ సౌకర్యంలో పాత వాహనాలను మిగిలిన షోరూంల కంటే తక్కువ ధరకు అందించడం, కొనుగోలు చేసిన ప్రతి వాహనానికి స్క్రాచ్ కార్డ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, స్పాట్ ఫైనాన్స్ అందజేస్తున్నారు. తక్కువ వడ్డీకే వాహనాల విక్రయాలు చేపట్టినట్టు ఎండీ ఆర్ఎస్వీపీ బసవరాజు తెలిపారు. అతి తక్కువ వడ్డీతో 2, 4 వీలర్స్ అమ్మకాలు చేపడుతున్నామని చెప్పారు. పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ వారి వీల్స్మార్ట్లో లేటెస్ట్ మోడల్, మంచి ధరకు వెస్పా స్కూటర్ కొనుగోలు చేసినట్టు కొనుగోలుదారుడు డాక్టర్ మనోహర్ తెలిపారు. తక్కువ వడ్డీతో ఫైనాన్స్ కూడా లభించిందని, ఇంకా స్క్రాచ్‌కార్డ్ ద్వారా రూ.2 వేల క్యాష్‌బ్యాక్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. -
దృష్టి మళ్లించడానికే జిల్లాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సమస్యలు, ప్రభుత్వ చేతగానితనం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జిల్లాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజా సౌకర్యం, సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించిన పొన్నం.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, రాజకీయ ప్రయోజనం పొందడానికే జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచారన్నారు. జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జిల్లాల ఏర్పాటులో విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సూచనలు స్వీకరించకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలపై పునస్సమీక్షిస్తామని పొన్నం చెప్పారు.