ఆటో రంగానికి మంత్రి గడ్కరీ సూచన
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment