FADA
-
పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?
భారతదేశంలో మొత్తం పండుగ సీజన్లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది. -
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
టాప్గేర్లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
సేల్స్ పెరిగాయ్..ఏ వాహనాలు ఎన్ని అమ్ముడు పోయాయంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా జూన్ నెలలో అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్ విక్రయాలు 18,63,868 యూనిట్లు నమోదయ్యాయి. 2022 జూన్తో పోలిస్తే ఇది 10 శాతం అధికం అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2023 మే నెలతో పోలిస్తే జూన్ అమ్మకాలు 8 శాతం క్షీణించడం గమనార్హం. ‘జూన్ మాసంలో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 5 శాతం ఎగసి 2,95,299 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 7 శాతం పెరిగి 13,10,186 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 75 శాతం దూసుకెళ్లి 86,511 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 45 శాతం అధికమై 98,660 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది. మే నెలతో పోలిస్తే జూన్లో ద్విచక్ర వాహన విక్రయాలు 12 శాతం క్షీణించాయి. అలాగే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 56 శాతం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గించడమే ఈ క్షీణతకు కారణం.