భారతదేశంలో మొత్తం పండుగ సీజన్‌లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్‌లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్‌లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.
2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.
ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment