భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి, చిన్న బ్యాటరీలను కలిగిన టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫిక్స్డ్ బ్యాటరీ, రిమూవబుల్ లేదా స్వాపబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కథనంలో దేశీయ విఫణిలో పెద్ద బ్యాటరీలను కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురించి తెలుసుకుందాం.
4 కిలోవాట్ బ్యాటరీ
ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్, రివర్ ఇండీ, టోర్క్ క్రటోస్ ఆర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా 195 కిమీ (ఓలా ఎస్1 ప్రో), 190 కిమీ (ఓలా ఎస్1 ఎక్స్), 161 కిమీ (రివర్ ఇండీ), 180 కిమీ (టోర్క్ క్రటోస్ ఆర్)గా ఉంది. ఒకే పరిమాణంలో ఉన్న బ్యాటరీని కలిగి ఉన్నప్పటికీ రేంజ్ తేడా ఏంటా? అని బహుశా ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఒక వాహనంలో ఉన్న ఫీచర్స్.. దాని పరిధిని (రేంజ్) నిర్థారిస్తారు. అంతే కాకుండా ఎంచుకున్న మోడ్.. ప్రయాణించే రోడ్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి.
4.4 కిలోవాట్ బ్యాటరీ
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైకులో 4.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 187 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఈ రేంజ్ వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో మారే అవకాశం ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఏకైన మోడల్ ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కావడం గమనార్హం.
5 కిలోవాట్ బ్యాటరీ
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఫిక్డ్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలోనూ లభిస్తుంది. 5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జీతో 212 కిమీ రేంజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పటి వరకు 525 సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం.
5.1 కిలోవాట్ బ్యాటరీ
టీవీఎస్ ఐక్యూబ్ వివిధ పరిమాణాల బ్యాటరీలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ చేసిన రెండేళ్ల తరువాత 5.1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జీతో 185 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా ఇది దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు.
ఇదీ చదవండి: రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
7.1 కిలోవాట్ బ్యాటరీ & 10.3 కిలోవాట్ బ్యాటరీ
బెంగళూరుకు చెందిన అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైకులో 7.1 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన ఎఫ్77 మ్యాక్ 2 రీకాన్ మోడల్ 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 323 కిమీ రేంజ్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment