
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.
2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.
ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయం
టయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్‌షిప్‌లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్‌లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment