Toyota
-
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
కింగ్ నాగార్జున గ్యారేజిలోని కార్లు ఇవే (ఫోటోలు)
-
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్‌షిప్‌లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. -
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
టయోటా క్యాంపర్ వ్యాన్: ఒకటే వెహికల్.. ఉపయోగాలెన్నో (ఫోటోలు)
-
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్‌లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
టయోటా వాహనాలకు యూనియన్ బ్యాంక్ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టయోటా వాహనాల కొనుగోలుకై కస్టమర్లకు సమగ్ర రుణ సౌకర్యాన్ని బ్యాంకు కల్పించనుంది.ఆన్‌రోడ్ ధరపై 90 శాతం వరకు లోన్ సమకూరుస్తారు. యూనియన్ వెహికిల్ స్కీమ్ కింద 84 నెలల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంది. యూనియన్ పరివాహన్ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య వాహనాలకు 60 నెలల వరకు వాయిదాలు ఆఫర్ చేస్తారు. అన్ని రకాల టయోటా వాహనాలకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్‌తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు. -
11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది. సమస్య ఏంటంటే? 2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్‌ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు
బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది. 2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు. మల్టీ–యుటిలిటీ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్‌తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్‌కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్ ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు. -
ప్రపంచ చరిత్రలో సరికొత్త మైలురాయి.. అదరగొట్టిన జపాన్ కంపెనీ!
కార్ల తయారీలో సరికొత్త రికార్డు నమోదైంది. జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం (టయోటా) ఈ రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదలై 88 సంవత్సరాలు కాగా.. మొత్తం 30 కోట్ల కార్లు తయారు కావడం విశేషం. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఇన్ని కార్లు తయారు చేసిన కంపెనీ ఇంకోటి లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. 1933లో టయోడా ఆటోమాటిక్ లూమ్ వర్క్స్‌లో భాగంగా కార్ల తయారీ ప్రారంభించింది ఈ కంపెనీ. మోడల్ -జీ1 కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కు. ఆ తరువాత 1937లో టయోటా మోటర్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కంపెనీ తయారు చేసిన కార్లు మొత్తం 30 కోట్లు. అయితే ఇందులో జపాన్‌లో ఉత్పత్తి అయినవాటితోపాటు ఇతర మార్కెట్లలోనివి కూడా చేర్చారు. జపాన్‌లో మొత్తం 18.05 కోట్ల కార్లు ఉత్పత్తి కాగా.. ఇతర దేశాల్లో తయారైనవి 11.96 కోట్లు. టయోటా 1941 నుంచి విస్తరణ పథం పట్టింది. టయోడా మెషీన్ వర్క్స్ (1941), టయోటా ఆటోబాడీ (1945) వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంది. 1960, 70లలో జపాన్‌లో తయారు చేసిన కార్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1982లో టయోటా మోటర్ కంపెనీ కాస్తా... టయోటా మోటర్ కార్పొరేషన్ గా మారింది. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో టయోటా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన 'కొరొల్లా' (Corolla) ఉత్పత్తి మొత్తం 5.33 కోట్ల కంటే కంటే ఎక్కువ. 1966 నుంచి ఈ సెడాన్ అనేక అప్డేట్స్ పొంది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ బాగా అమ్ముడుపోతోంది. భారతీయ మార్కెట్లో కూడా టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. -
భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీనర్ ఫ్యూయెల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని గత కొన్ని రోజులుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ఒక వీడియోలో తన గ్యారేజిలోని ప్రపంచంలోనే మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా రాజకీయ నాయకులు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను వినియోగిస్తారు. కానీ గడ్కరీ దీనికి భిన్నంగా ఇథనాల్ శక్తితో నడిచే 'ఇన్నోవా హైక్రాస్' ప్రోటోటైప్ హైబ్రిడ్ కారుని ఉపయోగిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో ప్రజలకు చెప్పడమే కాకుండా.. తానూ ఆచరిస్తుండటం నిజంగా గొప్ప విషయం. ఈ వీడియోలో తన కారు గురించి వెల్లడిస్తూ.. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనమని తెలిపారు. దీనికి కావలసిన ఇంధనం రైతుల దగ్గర నుంచి లభిస్తుందని, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, పెట్రోల్ కంటే చౌకగా లభిస్తుందని పేర్కొన్నాడు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహనాలు త్వరలోనే మార్కెట్లో లభిస్తాయని, ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ద్వారా ఇటువంటి ఇంధనాలను అందించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇథనాల్ నుంచి ఏవియేషన్-గ్రేడ్ ఇంధనాన్ని వెలికితీసే పనిలో ఉందని తెలిపారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే పెట్రోలియం దిగుమతులు రానున్న రోజుల్లో తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దీపావళికి కొత్త స్కూటర్ కొనాలా? బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి! నితిన్ గడ్కరీ గ్యారేజీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే టయోటా మిరాయ్ కారు కూడా కనిపిస్తుంది. ఇది ఫ్యూచరిస్టిక్ కారు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కారు 1.2 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ, మూడు హైడ్రోజన్ ట్యాంకులు కలిగి ఉంటుంది. కావున ఇది 647 కి.మీ రేంజ్ అందిస్తుంది. -
రతన్ టాటా కలల కారు ‘నానో’ ఈవీ కారుగా వచ్చేస్తుందా? అందులో నిజమెంత?
రతన్ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. అలాంటి రతన్ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్లో తిరిగి ఎలక్ట్రిక్ వెహికల్‌గా విడుదలవుతుందుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత? త్వరలో, టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్ సోషల్ మీడియా ఫోటో సారాశం. ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ‘టయోటా ఐగో’ హ్యాచ్‌బ్యాక్ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్‌లో మాత్రం అందుబాటులో లేదు. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్ బడ్జెట్ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. నానో కారు ఇలా పుట్టిందే నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్ రంగంలో అదో పెను సంచలనం. రతన్ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ 2008 జనవరి 10న టాటా మోటార్స్ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. చదవండి👉ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
భారత సైన్యంలోకి బలిష్టమైన వాహనాలు - ఇవి చాలా స్పెషల్!
భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు. ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు. డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ పుట్టుకొచ్చింది. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్‌లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి. ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్‌లో కస్టమర్లు - కారణం ఇదే! ఇథనాల్.. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. -
ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్‌లో కస్టమర్లు - కారణం ఇదే!
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ఒక్కసారిగా షాక్ ఉత్పత్తి నిలిపివేసి కస్టమర్లకు షాకిచ్చింది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అక్కడ మొత్తం 14 తయారీ కేంద్రాలలో ఈ రోజు (మంగళవారం) ఉత్పత్తి నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి సంస్థకు సంబంధించిన విడిభాగాల ఆర్డర్స్ పర్యవేక్షించే కంప్యూటర్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేదా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ మంది వాహన వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేసే బ్రాండ్లలో టయోటా ఒకటి. అయితే కంపెనీ ఉత్పత్తి నిలిపివేసిందనే వార్త కష్టమరల్లో ఒకింద భయాన్ని కలిగించింది. కాగా మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అంతే కాకుండా ఏ మోడల్స్ ఉత్పత్తులు నిలిచిపోయాయి అనేదానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే ఉద్యోగుల పంట పండినట్లే.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ గురూ! కరోనా వైరస్ విజృంభించిన సమయంలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా గతంలో కూడా కంపెనీ ఉత్పత్తి కొన్ని రోజులు నిలిపివేసింది. కాగా ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోయింది, కొత్త సమస్య పుట్టుకొచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి.