29లక్షల టయోటా కార్లు రీకాల్
29లక్షల టయోటా కార్లు రీకాల్
Published Thu, Mar 30 2017 8:25 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
టోక్యో: టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ మొత్తంలో కార్లను రీకాల్ చేస్తోంది. చైనా, జపాన్ ఓషియానియా, ఇతర ప్రాంతాలలో మొత్తం 29 లక్షల వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపాల కారణంతో తమ కోరోల్లా యాక్సియో సెడాన్, ఆర్ఏవీ4 ఎస్యూవీ క్రాస్ ఓవర్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోనున్నట్టు తెలిపింది. ఎయిర్ బ్యాగ్స్ లోని లోపంతో అంతకముందు కూడా భారీ మొత్తంలో కార్ల రీకాల్ ను టయోటా చేపట్టింది. ఫుజి హెవీ ఇండస్ట్రీస్, మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్, ట్రక్ తయారీదారి హినో మోటార్స్ కూడా 2,40,000వేల వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించాయి.
జపాన్ ఎయిర్ బ్యాగ్ ల సంస్థ టకటా లోపాల కారణంగా ఆటో ఇండస్ట్రీస్ లో భారీ ప్రమాదాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా వాటిల్లుతున్నాయి. టకటా బ్యాగుల లోపంతో ఎన్నడూ లేనంతగా ఆటో ఇండస్ట్రీలో రీకాల్ ప్రాసెస్ నడుస్తోంది. ఓషియానియా, మధ్య ప్రాశ్చ, ఇతర చిన్న మార్కెట్లలో అమ్మిన 1.16 మిలియన్ వెహికిల్స్ కు టయోటా ఇప్పటికే రీకాల్ నోటీసు పంపింది. అంతేకాక, జపాన్ లో 7,50,000 వాహనాలను రీకాల్ చేసింది. టయోటాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న నార్త్ అమెరికా ఈ తాజా రీకాల్ నుంచి తప్పించుకుంది. ఓ వైపు నుంచి రీకాల్స్ కు సంబంధించిన ఖర్చులను భరించడానికి తమకు ఎవరైనా సాయం చేయాలంటూ టకాటా కోరుతోంది.
Advertisement