టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు | Toyota Camry Launched in India | Sakshi
Sakshi News home page

టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు

Published Thu, Dec 12 2024 5:24 PM | Last Updated on Thu, Dec 12 2024 8:07 PM

Toyota Camry Launched in India

టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్‌లైట్‌ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్

టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్‌పీ, 220 ఎన్ఎమ్‌ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement