Camry Hybrid
-
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
టయోటా కామ్రీ హైబ్రిడ్ కారు
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కొత్త కామ్రీ హైబ్రిడ్ కారును లాంచ్ చేసింది. కామ్రీ హైబ్రిడ్ 2018 వెర్షన్‌ను భారత మార్కెట్లో 37.22 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. దీని ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొత్తగా అప్ గ్రేడ్ చేసింది. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో నావిగేషన్ ఫీచర్‌ను జోడించింది. టయోటా కామ్రీ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 2.5 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజీన్, 160 పీఎస్, 5,750 ఆర్పీఎం, గరిష్ట టార్క్ 213 ఎన్ఎం, 12 స్పీకర్ స్టీరియో వ్యవస్థ , వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 17ఇంచెస్ అల్లోయ్ వీల్స్ , రేడియల్ టైర్స్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 9 ఎయిర్ బాగ్స్, యాంటి లాకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటివి సెక్యూరిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఎకో, ఈవీ రెండు డ్రైవింగ్ మోడ్స్‌లో ఈ హైబ్రిడ్ కారు అందుబాటులో ఉంది. -
టయోటా కామ్రి హైబ్రిడ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ కామ్రి హైబ్రిడ్‌ను భారత్‌లో బుధవారం ఆవిష్కరించింది. దేశీయంగా తయారవుతున్న తొలి హైబ్రిడ్ కారు ఇదేనని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ, సీఈవో హిరోషి నకగవ చెప్పారు. ఈ కామ్రి హైబ్రిడ్ ధరను రూ. 29.75 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించామని తెలిపారు. బెంగళూరు సమీపంలోని బిదాడి ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ లైన్లో ఈ కారును తయారు చేస్తామని వివరించారు. 2.5 పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ ఉన్న ఈ కారు హైబ్రిడ్ సినర్జీ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుందని, 19.16 కి.మీ. మైలేజీ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల హైబ్రిడ్ కార్లను విక్రయించామని టీకేఎం డిప్యూటీ ఎండీ, సీఈవో(ఎమ్‌అండ్‌సీ) సందీప్ సింగ్ పేర్కొన్నారు.