సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కొత్త కామ్రీ హైబ్రిడ్ కారును లాంచ్ చేసింది. కామ్రీ హైబ్రిడ్ 2018 వెర్షన్‌ను భారత మార్కెట్లో 37.22 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. దీని ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొత్తగా అప్ గ్రేడ్ చేసింది. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టంలో నావిగేషన్ ఫీచర్‌ను జోడించింది. టయోటా కామ్రీ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 2.5 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజీన్, 160 పీఎస్, 5,750 ఆర్‌పీఎం, గరిష్ట టార్క్ 213 ఎన్‌ఎం, 12 స్పీకర్ స్టీరియో వ్యవస్థ , వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 17ఇంచెస్ అల్లోయ్ వీల్స్ , రేడియల్ టైర్స్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 9 ఎయిర్ బాగ్స్, యాంటి లాకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటివి సెక్యూరిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఎకో, ఈవీ రెండు డ్రైవింగ్ మోడ్స్‌లో ఈ హైబ్రిడ్ కారు అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment