ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.
మారుతి స్విఫ్ట్ (Maruti Swift)
మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్‌క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.
సిట్రోయెన్ సీ3 (Citroen C3)
రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment