safety
-
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్‌క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దు: బ్రిటన్ హెచ్చరిక
లండన్:బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని బ్రిటన్ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్‌లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు బ్రిటన్ తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది.అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బంగ్లాదేశ్‌లో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.దేశంలో ఇస్లాం మతానికి చెందని వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపైన దాడులు పెరిగాయి. -
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్‌క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.మహీంద్రా థార్ రోక్స్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్
భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త 'డిజైర్'.. గ్లోబల్ ఎన్సీఏపీ (GNCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి మారుతి సుజుకి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు సాధించి సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 42 పాయింట్లకుగా 39.20 పాయింట్లు స్కోర్ చేసి.. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందగలిగింది. అయితే మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ సాధించి బ్రాండ్‌కు సరికొత్త ఘనతను అందించింది.సేఫ్టీ ఫీచర్స్మారుతి డిజైర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు రిమైండర్లతో కూడిన 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, రియర్ ఔట్‌బోర్డ్ సీట్లకు ఇసోఫిక్స్ మౌంట్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో.. టెస్టుకు గురిచేసిన కారు భారతదేశంలో తయారైన మోడల్. ఇది దాదాపు 45 శాతం టెన్సైల్ స్టీల్‌తో తయారైంది.నవంబర్ 11న దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న మారుతి డిజైర్.. 1.2లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.58 పీఎస్ పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.మారుతి కొత్త డిజైన్ ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ నియంత్రణ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్.. హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ధరలు అధికారికంగా నవంబర్ 11న వెల్లడవుతాయి. -
పసుపు రౌడీలా పైశాచికం.. మహిళలకు భద్రత లేని రాష్ట్రంగా ఏపీ.. బాధ్యత లేని కూటమి ప్రభుత్వం
-
వానల వేళ.. కాటేసే కరెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విద్యాసంస్థల్లో తరగతులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరిస్థితి మెరుగుపడిందికానీ, అనేక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే. పెచ్చులూడిపోయి నీరుకారే స్లాబులు, తడిచి చెమ్మెక్కిన గోడలు ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి.అలాంటి విద్యాసంస్థల్లో వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యుత్ వైర్లు, లైన్లు, స్విచ్ బోర్డులు, ఎర్తింగ్, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిపై ఆడిట్ నిర్వహించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు విద్యుత్ ప్రమాదాల నివారణకు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే మేలు » ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్‌లు, జాయింట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. పాడైపోయిన, అరిగిపోయిన వాటిని వెంటనే మార్చాలి » పాఠశాలలు, కళాశాలల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రధాన బోర్డులకు తప్పనిసరిగా కంచె ఏర్పాటుచేయాలి »పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి » అన్ని ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎలక్ట్రికల్ సేఫ్టీ నిబంధనలను అనుసరించాలి » భూమిలో ఉన్న స్తంభాలను సరిగ్గా ఇన్సులేట్ చేయాలి. అన్ని కేబుల్స్, జంక్షన్లను ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు, సరి్టఫైడ్ ఎల్రక్టీషియన్లతో తనిఖీ చేయించాలి » ప్రామాణిక, మంచి నాణ్యత గల ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించాలి. కేబుల్స్, ప్లగ్‌లు కరగకుండా నిరోధించాలంటే సాకెట్‌కు ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎక్కువ పరికరాలు సర్క్యూట్లో ప్లగ్ చేస్తే.. కరెంట్ వైర్లు వేడెక్కి స్పార్క్ వచ్చి మంటలు చెలరేగుతాయి » విద్యార్థులు, సిబ్బందికి లీకేజీలు, ఎలక్ట్రిక్ షాక్‌లను అరికట్టడం, బాధితులను రక్షించడం, షాక్‌కు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాల్లో అవగాహన కల్పించాలి » షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవిస్తే తప్పించుకోవడానికి వీలుగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి »సబ్స్టేషన్లు, సరఫరా లైన్లకు దూరంగా పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి »ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, జంక్షన్ బాక్స్, స్ట్రీట్ బాక్స్ మొదలైనవి కూడా పాఠశాలలకు సమీపంలో ఉండకూడదు »పాఠశాల ఆవరణలోను, విద్యార్థులు వెళ్లే మార్గంలోను ఉండే ట్రాన్స్ఫార్మర్లకు పూర్తి స్థాయిలో కంచె వేయాలి » విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్రిక్ పరికరాల్లో మరమ్మతులు వస్తే తప్పనిసరిగా ఎల్రక్టీషియన్ సహాయం తీసుకోవాలి. సొంతంగా మరమ్మతులు చేయకూడదు » కుళాయి, నీళ్ల ట్యాంకులకు సమీపంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించకూడదు » వర్షం, తుపానుల సమయాల్లో సరఫరా లైన్లు ఉన్న ఏ నిర్మాణం కింద ఆశ్రయం పొందకూడదు »కరెంటు తీగలకు సమీపంలోని చెట్లు ఎక్కడం, తాకడం వంటివి చేయకూడదు »ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులకు మెటల్ నిచ్చెనలు ఉపయోగించకూడదు » స్విచ్ ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ప్లగ్‌ని పట్టుకుని కేబుల్స్‌ను డిస్కనెక్ట్ చేయాలి » త్రీ పిన్ ఎర్త్ ప్లగ్‌లు, సాకెట్లను ఉపయోగించాలి. విరిగిన త్రీ పిన్ ప్లగ్‌లను ఎప్పుడూ వాడకూడదు » ఎక్స్టెన్షన్ కేబుల్స్‌ను వినియోగించకపోవడమే మంచిది. తప్పదనుకుంటే ఒకే సామర్థ్యం (ఆంపియర్ రేటింగ్) ఉన్నదాన్ని ఎంచుకోవాలి » అన్ని కనెక్షన్లు గట్టిగా, చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. ఏవైనా వదులుగా ఉంటే వెంటనే ఎలక్ట్రికల్ ఇన్చార్జికి తెలియజేయాలి » కేబుల్స్ చాలా వేడిగా ఉన్నట్లు అనిపించినా.. షాక్ తగిలినా.. పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేయాలి » వర్షం నీటితో నిండిపోయిన రహదారుల్లో విద్యుత్ వైర్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దారిలో వెళ్లే వాహనాలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి » ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలను తాకకూడదు నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోంది మానవ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం.. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం నుండి ప్రజలను రక్షించడం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ల కర్తవ్యం. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యాసంస్థలు తప్పనిసరిగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలి. మేం అందించిన సూచనల ప్రకారం నడుచుకోవాలి. తద్వారా విద్యార్థులను విద్యుత్ షాక్ నుంచి కాపాడుకోగలుగుతాం. – జి.విజయలక్ష్మి, డైరెక్టర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ -
పోలీస్ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకం
ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతా అంశాలపై అమెరికాకు చెందిన గాలప్ సంస్థ తన వార్షిక నివేదికలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక దశాబ్దకాలం క్రితం కంటే.. నేడు ఎంతో సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 👉గ్లోబల్ సేఫ్టీ ట్రెండ్లను అనుసంచి.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది పెద్దలు రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా భావించారు. ఆసియా, పసిఫిక్, పశ్చిమ ఐరోపా దేశాలలోని 75 శాతం మంది భద్రత విషయంలో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉత్తర ఆఫ్రికాలో 74 శాతం మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.👉యురేషియా ప్రాంతానికి చెందిన 20,063 మంది ఈ సర్వేలో పాల్గొనగా, ఇక్కడ భద్రత విషయంలో 34 శాతం పాయింట్ల మెరుగుదల కనిపించింది. దీంతో యూరేషియా భద్రత విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు. 👉ఇక భద్రతపై ఆందోళన కలిగించే ప్రాంతాల విషయానికొస్తే ఉప సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్లు అత్యల్ప భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. 👉పోలీసులపై నమ్మకం విషయానికొస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం మంది ప్రజలు స్థానిక పోలీసులపై నమ్మకాన్ని కలిగివున్నట్లు తెలిపారు. ఇది దశాబ్ధకాలంతో పోలిస్తే 62 శాతానికి పెరిగింది. కాగా ఈక్వెడార్ భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 👉2023లో కేవలం 27శాతం ఈక్వెడారియన్లు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.👉ఇజ్రాయెల్‌లో సంఘర్షణల ప్రభావం భద్రతా లేమిని స్పష్టంగా చూపింది. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భద్రతతో ఉన్నామనే భావన అక్కడి వారిలో మరింతగా క్షీణించింది. 2022లో ఈ అంశం 82 పాయింట్లుగా ఉండగా, ఇప్పుడది 68 శాతానికి పడిపోయింది.ఇది కూడా చదవండి: కమలా హారీస్ ఆఫీసుపై కాల్పులు -
రోగికి కావల్సిన అసలైన మందు అదే..!
ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడినవారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా.. సమస్యను నివారించే ఉపాయాలు.. సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు.. ఎదుర్కొనే విధానాలు... వీటన్నింటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండచ్చు. ఈ ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ‘రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయడం.’ ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ‘రోగనిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడం’లో ఆగ్నేయాసియా వెనకంజలో ఉందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ సైమా వాజెద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021–2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47 శాతం దేశాలు మాత్రమే రోగనిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసింది.నిర్ధారణ ముఖ్యం..ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్స్సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతోపాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో ‘రోగనిర్ధారణ ప్రాముఖ్యత’ను చర్చించాలని సూచించింది.అత్యవసర సేవలుఅత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచు వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50 శాతానికి పైగా మరణాలు, 40 శాతానికి పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమష్టి బాధ్యత అని తెలియజేసింది. ‘‘మేం ఇప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్‌కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిస్‌లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానూ ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో బాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడాల్సిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను పీలవుతారు. అది వారి ఆయుష్షునూ పెంచుతుంది.అవగాహనతో ..వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబసభ్యులకు చెబుతున్నాం. కౌన్సెలింగ్స్ ఇస్తున్నాం. రొమ్ము కేన్సర్‌తో ఇటీవల ఒకామె చనిపోయింది. ఆమె కూతురుకు 22 ఏళ్లు. పెళ్లయ్యింది. కానీ, ఆమె భర్త ఈ అమ్మాయికి కూడా తల్లికి మాదిరే కేన్సర్ వస్తుందేమో అనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశాం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పాం. ఇప్పుడా అమ్మాయి ఆరోగ్యంగా, భరోసాతో కూడిన జీవనం గడుపుతోంది.మొదటి దశలోనే గుర్తిస్తే..వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్‌నే కాదు వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించీ వివరిస్తున్నాం. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్‌ను చూసుకోవాల్సి విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని వివరించారు శారద లింగరాజు.మరణం అంచుల్లో ఉన్న రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాను కల్పిస్తోంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రం. ప్రధానంగా కేన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడి నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సందర్భంగా వీరిని సంప్రదించినప్పుడు శారదా లింగరాజు చెప్పిన వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తాయి. (చదవండి: గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!) -
ప్రధాని మోదీకి బైడెన్ ఫోన్.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రపంచంలోని వివిధ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్లో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించాలని అన్నారు.బంగ్లాదేశ్, ఉక్రెయిన్లలో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునితో చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చే విషయంలో భారత్ మద్దతు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్లో.. ‘మేము ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితితో సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు జరిపాం. శాంతి, సుస్థిరతలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా చర్చించాం. త్వరలోనే సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాం. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు భద్రత కల్పించాలని కోరాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్, యూఎస్‌ల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై బైడెన్‌కు ఉన్న నిబద్ధతను మోదీ ప్రశంసించారు. ఈ ఫోను సంబాషణలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన కీవ్ పర్యటన గురించి అమెరికా అధ్యక్షునికి వివరించారు. తాను అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని తెలిపారు. దౌత్యానికి అనుకూలంగా భారతదేశ కట్టుబాటును, స్థిరమైన వైఖరిని ప్రధాని మరోమారు పునరుద్ఘాటించారు. Spoke to @POTUS @JoeBiden on phone today. We had a detailed exchange of views on various regional and global issues, including the situation in Ukraine. I reiterated India’s full support for early return of peace and stability.We also discussed the situation in Bangladesh and…— Narendra Modi (@narendramodi) August 26, 2024 -
దేశంలో వైద్య సిబ్బంది భదత్ర కోసం కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో.. ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది. వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు. -
Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు
రాత్రి వేళల్లో మహిళలు, బయటికి వెళ్లాలంటేనే భయపడే రోజులు. మెట్రోలు, క్యాబ్ లాంటిసేవలు ఎన్ని అందుబాటులో ఉన్నా భద్రత ఎపుడూ ఒక సవాల్‌గానే ఉంటుంది. ప్రతీ పదిమంది ఏడుగురు వేధింపులకు లోనవుతున్నారు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు విశేషంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మహిళలు, బాలికల భద్రత, సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు సోదరీమణులు. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకోసం మహిళా డ్రైవర్లతో మహిళలే నిర్వహిస్తున్న సేవలు కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ద్వయం మహిళల కోసమే ఈ బైక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. జైనాబ్ కాతూన్,ఉజ్మా కాతూన్ ప్రత్యేక బైక్టాక్సీ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ ‘డవ్‌లీ’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. డోవ్లీలో రైడర్లు, కస్టమర్లు మహిళలే ఉంటారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీఅందిస్తుంది. వీరికి మహమ్మద్ ఒబైద్ ఉల్లా ఖాన్, మసరత్ ఫాతిమా సహకారం అందించారు.భద్రతకు పెద్ద పీట‘డవ్‌లీ’ వ్యవస్థాపకురాలు,సీఈవో జైనాబ్ ఖాతూన్ మాటల్లో చెప్పాలంటే నగరంలోని మహిళలు , బాలికలకు రోజువారీ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ,సౌకర్యవంతంగా సేవలందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. భద్రతకు పెద్ద పీట వేస్తూ రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అయితే రైడర్ ప్రయాణం ముగిసేవరకు లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా మొదలైన డోవ్లీ సేవలు చాలా తక్కువ సమయంలోనే బాగా విస్తరించాయి. వందలమంది మహిళా డ్రైవర్లకు ఉపాధి లభించింది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పెంచి, భవిష్యత్తులో రైడర్ల సంఖ్య పెంచి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని భావిస్తున్నారు. విరివిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. దీంతో వీరి స్టార్టప్ మరింత విజయం సాధించాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్‌లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది!
#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా కామన్‌గా మారింది. అలా ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ వైరల్‌గా మారింది. రిటన్ గిఫ్ట్ ఏంటి? వైరల్ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు. ఇదీ చదవండి: అపుడు సల్మాన్ మూవీ రిజెక్ట్.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్ కిడ్ ఎవరు? అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కలిసి హెల్మెట్లు ధరించి మరీ డ్యాన్సులు చేసినట్టు సంబరంగా చెప్పుకొచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అటు గిఫ్ట్స్ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ సెద్ను అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు. గతంలో బెంగళూరులో కూడా గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది. తమ పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట శివరాజ్, సవిత. ఇలా అయినా కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామిచ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా తమకు ఆనందమేనని వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ వెల్లడించాడు శివరాజ్. -
మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!
ప్రస్తుతం జీవన విధానంలో మహిళలు బయటకు వెళ్లి సంపాదించాల్సిన పరిస్థితి. పెరుగుతున్న ధరలు, పిల్లల ఉన్నత చదువులని ఇలా రకరకాలుగా ఖర్చులు పెరగడంతో ఒక్కరి సంపాదనతో ఇంటిల్లపాదిని పోషించడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. అందువల్ల మగువలు కూడా కష్టపడక తప్పని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో చిక్కుల్లో పడటమో! లేదా కొందరీ ఆకతాయిల వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొనవలసి రావొచ్చు. లేదా కంపెనీ నిమిత్తం లేదా మరే కారణాలవల్ల కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సిన రావొచ్చు అక్కడ ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి రావొచ్చు. అలాంటి వాటిని చాలా సునాయసంగా హ్యాండిల్ చేసుకుని మిమ్మల్ని భద్రంగా ఉంచుకునేందుకు ప్రతి మహిళ ఈ భద్రతా యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి, తప్పక తెలుసుకోవాల్సినవి కూడా. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన యాప్‌లే. ఈ యాప్‌లు తెలుసుకున్నా లేదా వాటిలో కనీసం రెండు లేదా ఒక్క యాప్‌ని మీ ముబైల్ డౌనలౌడ్ చేసుకున్నా చాలు!. ప్రంపంచమంతా ధైర్యంగా చుట్టి వచ్చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితినైనా సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మహిళలు తెలుసుకోవాల్సిన యాప్‌లు.. బీసేఫ్: ఇందులో రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఉంటాయి. అలాగే ఇబ్బుందుల్లోకి నెట్టే ఫేక్‌కాల్ నుంచి బయటపడేసే రకరకాల ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పైగా ఇది చాలా ప్రసిద్ధ యాప్. సర్కిల్ ఆఫ్ 6: అత్యవసర పరిస్థితుల్లో త్వరగా సంప్రదించగలిగేలా సుమారు ఆరుగురు విశ్వసనీయ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సర్కిల్‌ను ఏర్పరిచేందుకు అనుమతిస్తుంది. సేఫ్టిపిన్: నగరంలో సురక్షితమైన, అసురక్షిత ప్రదేశాల గురించి సమాచారాన్ని అందించే క్రౌడ్-సోర్స్ యాప్. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల గురించి సరైన సమాచారం ఇవ్వడం తోపాటు ట్రాకింగ్ చేసి అత్యవసర హచ్చరికలు జారీ చేయడమే గాక వాటికి భద్రతా రేటింగ్‌ని కూడా ఇస్తుంది. విత్యూ(VithU): జస్ట్ రెండు ట్యాప్‌లతో వారి కాంటాక్ట్స్‌లో ఉన్న నెంబర్స్‌కి సాస్(SOSష్త్ర సందేశాన్ని పంపేందుకు అనుమతిస్తుంది. పరిస్థితికి సంబంధించిన సాక్ష్యాలను సంగ్రహించడానికి ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. మై సేఫ్టీపాల్: మహిళలు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది వివిధ లొకేషన్లలో అత్యవసర హెచ్చరికలు, పానిక్ బటన్, సేఫ్టీ స్కోర్ల వంటి ఫీచర్లను అందిస్తుంది. షేక్2సేఫ్టీ: ముందుగా సేవ్ చేసిన కాంటాక్స్ నెంబర్స్‌కి అత్యవసర సందేశాన్ని పంపడానికి మహిళలు తమ ఫోన్‌ను షేక్ చేయడానికి అనుమతించే సులభమైన యాప్. సాస్ స్టే సేఫ్: జస్ట్ ఒక ట్యాప్‌తో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి సాస్(SOS) సందేశాన్ని పంపడానికి మహిళలకు అనుమతిస్తుంది. యాప్‌లో లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం ఫీచర్‌ను కూడా అందిస్తుంది. ఫైట్‌బ్యాక్: ఇది స్వీయ-రక్షణ యాప్. దీనిలో స్వీయ-రక్షణ ట్యుటోరియల్లు తోపాటు భద్రతా సలహాలను అందిస్తుంది. మహిళలు తాము ఎక్కడున్నారో వారి కుటుంబికులు లేదా స్నేహితులకు తెలియజేసేలా సాస్(SOS) సందేశాన్ని పంపడానికి అనుమతిస్తుంది. లైఫ్ 306: కుటుంబ భద్రత యాప్. ఇది మహిళలు తమ కుటుంబ సభ్యులతో ప్రైవేట్ నెట్వర్క్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు, ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది. నిర్భయం: భారతదేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాప్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లు తోపాటు వన్-టచ్ పానిక్ బటన్‌ను అందిస్తుంది. ఈ యాప్‌లు చాలా వరకు మహిళలను తమను తాము సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వస్తున్న ఈ భద్రతా యాప్‌లను ఉపయోగించుకుని స్వీయ సంరక్షణ పొందండి. దీంతో పాటు కొన్ని విపత్కర పరిస్థితుల్లో అలాంటి యాప్‌లను కూడా వినయోగించలేని పరిస్థితి ఏర్పడొచ్చు అలాంటప్పడు ఈ కింది చిట్కాలు ఫాలోకండి. అవేంటంటే.. మీరు వెళ్లే పరిసరాల గురించి తెలుసుకోండి. ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండండి. అది అర్థరాత్రి అయిన లేదా మరే సమయం అయినా జనసంచారం లేని రోడ్డుపై వెళ్తుంటే బహు అప్రమత్తంగా ఉండండి. కనీసం ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న నిర్లక్ష్యం వహించొద్దు. చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. మీరు ఉన్న ప్రదేశంలో అసౌకర్యంగా అనిపించినా లేదా ఏదో తప్పు జరుగుతుంది లేదా తప్పు జరగబోతోందని అనిపిస్తే.. వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయి సురక్షితంగా ఉండేలా చూసుకోండి స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వంటి సురక్షిత సాధనాలను కూడా మీ వద్ద ఉంచుకోండి. పరిస్థితి చేజారుతుందనుకున్నప్పుడూ మిమ్మల్ని మీరు రక్షించుకునేలా స్వీయ రక్షణ చర్యలను నేర్చుకోండి(అవతలి వ్యక్తిపై తిరగబడటం లేదా భయపడలే చేయడం వంటి పనులు) తెలియని కొత్త ప్రదేశానికి వెళ్తుంటే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వండి. మీ ఆచూకిని వారికి క్లియర్‌గా చెప్పండి. ఎప్పటికప్పుడూ మీ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని తప్పక ఇవ్వండి. ఇప్పుడు చెప్పిన యాప్‌లు, ఈ చిట్కాలు ఫాలో అయితే ప్రతి మహిళకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ఉండగలిగాలే హ్యాండిల్ చేసుకునే ధైర్యం ఆటోమెటిక్‌గా వస్తుంది. బీ కేర్ ఫుల్. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి. భారత్ ఎన్సీఏపీ.. నిజానికి భారత్ ఎన్సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి. (ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!) భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ అండ్ యూరో ఎన్సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి. (ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!) ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది. -
భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత
ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్‌లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు. -
టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..?
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్‌ను అందిస్తోంది. దీంతో స్టార్‌లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. Despite being in the middle of the North Atlantic, we have the internet connection we need to make our #Titanic dive operations a success - thank you @Starlink! pic.twitter.com/sujBmPr3JD — OceanGate Expeditions (@OceanGateExped) June 1, 2023 సాంకేతిక సమస్యా..? జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్‌మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. The wreck of the Titanic lies about 400 miles off the coast of Newfoundland. Without any cell towers in the middle of the ocean, we are relying on @Starlink to provide the communications we require throughout this year’s 2023 Titanic Expedition. More: https://t.co/F7OtKI0En7 pic.twitter.com/wr7HeKlGjj — OceanGate Expeditions (@OceanGateExped) June 14, 2023 ఈ ప్రమాదంపై కమాండ్ షిప్లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్‌మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్లో ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తారని చెప్పారు. ఇదీ చదవండి: టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు.. అందులో పాక్ అత్యంత ధనవంతుడు ఖాతరు చేయలేదు..? జలాంతర్గామి వెల్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్‌గేట్‌కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్‌లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. Wow. OceanGate, the company that owns the missing submersible, fired an employee a few years ago after he filed safety complaints against them. The employee specifically said the sub was not capable of descending to such extreme depths before he was fired.https://t.co/c3s2H3eVEr — Caroline Orr Bueno, Ph.D (@RVAwonk) June 20, 2023 స్టార్ లింక్కూ వైఫల్యమే..? ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్‌కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది. ఇదీ చదవండి: టైటాన్ మిస్సింగ్‌కి రెండురోజులు.. ఆక్సిజన్ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది? -
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్ బదులు లూప్లైన్లోకి వెళ్లడంతో.. లూప్లైన్లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా.. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్రమాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు. ఆ రూట్లో కవచ్ సిస్టమ్ లేదు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని తెలిపారు. కాగా రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను భారత రైల్వేశాఖ డెవలప్ చేస్తోంది. కవచ్ అనేది ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్ వేయడంలో డ్రైవర్ ఫెయిల్ అయితే కవచ్ సిస్టమర్ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. Drone footage of #TrainAccident #CoromandelExpress pic.twitter.com/XCSnJJ0Tcg — Rail Vandi (@rail_vandi) June 3, 2023 Scary Visuals of Balasore Train Accident.. ☺️☺️ . .#TrainAccident #CoromandelExpress #CoromandelExpressAccident #BalasoreTrainAccident #tupaki #Odisha @tupakinews_ pic.twitter.com/mnfCCTqdhA — Tupaki (@tupakinews_) June 3, 2023 -
సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!
కల్లోలిత సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖర్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య జరుగుతున్న హోరాహోరి పోరు హింత్మకంగా మారింది. దీంతో సూడాన్ దారుణంగా దెబ్బతింది. ఈ అత్యర్యుద్ధంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే భారత్ కూడా వారిని అప్రమత్తం చేసి, సూచనలందించింది. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధంలో విమానాశ్రయలే దారుణంగా దెబ్బతినడంతో తరలింపు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించిన భారత్ వారిని సురక్షితమైన భూమార్గం గుండా తరలించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు ఆపరేషన్‌లో సహయం చేయడం కోసం ప్రస్తుతానికి అక్కడే ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, యూఎస్ ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయాన్ని తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని ఉపయోగించి తాత్కాలికంగా నిలిపేసి, సిబ్బంది ఖాళీ చేయించింది. ఈమేరకు మేజేమెంట్ అండ్ సెక్రటరీ అంబాసీడర్ మాట్లాడుతూ..రాపీడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాతో సమన్వయమై యూఎస్ ఆపరేషన్‌కు మద్దతిచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారు సహకరించిన మేరకు సహకరించారు. ఆపరేషన్ సమయంలో మా సభ్యులపై కూడా కాల్పులు జరిపారు. ఐతే వారి స్వప్రయోజనాల కోసం చేశారని భావిస్తున్నాం అని అన్నారు. కాగా, వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా ప్రజలు ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియా చేరుకున్నారు. ఐతే సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నట్లు సమాచారం. అదీగాక తమ పౌరులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నమని విదేశీ దేశాలు తెలిపాయి. అందులో భాగంగా దక్షిణ కొరియ, జపాన్ తమ సమీపంలో ఉన్న దేశాల నుంచి బలగాలను మోహరించి పౌరులను తరలించే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఇదే తరహాలో తరలించే యత్నం చేస్తోంది. ఐతే ఇప్పటి వరకు సూడాన్‌లో జరిగిన పోరాటంలో దాదాపు 420 మందికి పైగా మరణించారని, మూడు వేలమందికి పైగా గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది కూడా. (చదవండి: విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..) -
ఏపీలో మరో కీలక చట్టం
-
డిజిటల్ కూడలిలో మహిళ
వందన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంటా బయట చురుగ్గా ఉండే వందన వారం రోజులుగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేకపోతోంది. కారణం, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్ ఒక సైట్లో కనపడటం ఆమెను కలవరపరుస్తోంది. వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయాలు బయటకు రావడం ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాలను ఇంట్లోవారితో పంచుకోలేక, స్నేహితులతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. రకరకాల డిజిటల్ సమస్యలను ఎదుర్కొనే యువతుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో మహిళల అవకాశాలు ఇంటర్నెట్ ద్వారా విస్తృతమయ్యాయి. ఉపా ధి అవకాశాలను పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని సంపా దించడానికి, జ్ఞానాన్ని, ఆర్థికవృద్ధిని, మరింత సమగ్రమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, సైబర్ శాఖ ఆన్లైన్లో పెరుగుతున్న మహిళా ప్రయోజనాలనే కాదు, వారికి సమస్యగా మారే అంశాలను కూడా పరిశీలిస్తుంది. మహిళలు ఆన్ లైన్ లో తమ సురక్షిత ప్రయాణం సాగించడానికి డిజిటల్ భద్రత తెలుసుకోవడం అత్యవసరం. డిజిటల్ నేరాలలో ప్రధానమైనవి.. డాక్సింగ్ : ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన గతంలోని వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా బహిర్గతం చేసే చర్య. మోసగాళ్లు సాధారణంగా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్లు, గత సోషల్ మీడియా పోస్టింగ్‌లు, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్నిపొంది, ఆన్ లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారితీయవచ్చు. సైబర్‌స్టాకింగ్: ఇది ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి ఒక వ్యక్తిని పదేపదే ట్రాక్ చేయడం. ఉదాహరణకు: అసందర్భంగా ఫోన్ కాల్స్ చేయడం, వాయిస్ సందేశాలు లేదా మెసేజ్‌లు చేయడం, గూఢచర్యం లేదా సోషల్ మీడియా కార్యకలాపా లను పర్యవేక్షించడం లేదా ఇంటర్నెట్లో తగని సమాచారాన్ని పోస్ట్ చేస్తామని బెదిరించడం.. వంటి సైబర్‌స్టాకింగ్ శారీరక, మానసిక క్షోభకు దారితీయవచ్చు. స్వాటింగ్: ఇది పోలీసులను రెచ్చగొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి అత్యవసర ఫోన్ కాల్స్ చేయడం వంటి చర్య. ఇది సైబర్ దోపిడీకి ఒక రూపం. దీని ద్వారా వ్యక్తులు లైంగిక ప్రయోజనాలనుపొందాలని చూస్తారు. లైంగిక వేధింపులు వ్యక్తిగత, సన్నిహిత ఫొటోల పంపిణీకి దారితీయవచ్చు. రివెంజ్ పోర్న్: అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి వేధిస్తారు. ఏ మాత్రం మన అనుమతి లేకుండా ఆన్లైన్లో షేర్ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా బాధితురాలి మాజీ జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ద్వారా జరిగేవి ఉంటాయి. లైంగిక వేధింపులు: తెలియకనో లేక ఏదైనా భావోద్వేగ సమయంలోనో లైంగిక అనుకూల రిక్వెస్ట్‌లకు అనుమతి ఇస్తుంటారు. అంటే, ఫొటోలు, కంటెంట్, జోక్స్, మరొక స్త్రీ ద్వేషానికి సంబంధించినవి అయి ఉండవచ్చు. ఇవి ఒకరి ప్రతిష్ఠకు హాని కలిగించే వాస్తవాలు. ఉదాహరణకు.. ‘దొంగ, అబద్ధాలకోరు లేదా అనైతిక ప్రవర్తన’.. వంటివి. వంచన: మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ సోషల్ మీడియా పరిచయాల నుండి డబ్బు అడుగుతారు, ఇది బాధితు లను వేధించడానికి ఇతరులకు ్రపోత్సాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం, జాతి విద్వేషాన్ని ్రపోత్సహించడం లేదా సమర్థించడం, రాజకీయ, కార్పొరేట్ లేదా పోటీదారుల పోటీలో పా ల్గొనడం వంటివి ఉంటాయి. సేఫ్టీ చిట్కాలు: సమస్యలు వస్తాయని ఎవరూ తమ ప్రయోజనాలను వదులుకోరు. అయితే, బయట మన క్షేమం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఆన్లైన్ బజార్లోనూ అంతే భద్రంగా ఉండటం ముఖ్యం. ► HTTPS:// (ప్యాడ్‌లాక్ సింబల్) ఉన్న వెబ్సైట్లను మాత్రమే బ్రౌజ్ చేయండి. ► పెద్ద అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న సంక్లిష్ట పా స్వర్డ్ను ఉపయో గించండి. ► అన్ని సామాజిక, ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాగిన్ ల (2ఊఅ) కోసం రెండు–దశల ప్రమాణీకరణను పా టించండి. ► ఎస్సెమ్మెస్, వాట్సప్, సోషల్ మీడియా మెసెంజర్ల ద్వారా వచ్చిన చిన్న లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ► సామాజిక మాధ్యమాలలో ఫొటోలను చూస్తున్నప్పుడు లేదా అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ లొకేషన్ స్టేటస్‌ను స్టాప్ చేయండి. ► ఎండ్–టు–ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసెంజర్లను మాత్రమే ఉపయోగించండి. ► అన్ని సోషల్ మీడియా, మెసెంజర్, ఇ– మెయిల్ అప్లికేషన్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (ఆర్థిక, లాగిన్ ఆధారాలు, సంస్థ, వ్యక్తిగత సమాచారం... వంటి) సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► నిజమైన, తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ప్రత్యామ్నాయంగా, గోప్యతా సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ప్రొ ఫైల్‌లను లాక్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. ► ఆఫ్‌లైన్, ఆన్ లైన్ పరస్పర చర్యలలో సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ► మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచవద్దు. ► యాంటీ–వైరస్, యాంటీ–మాల్వేర్ సాఫ్ట్వేర్లతో మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను సురక్షితం చేయండి. ► ఇది సురక్షితమైన నెట్వర్క్ అని మీరు నిర్ధారించుకునే వరకు పబ్లిక్ వై ఫైని ఎప్పుడూ యాక్సెస్ చేయవద్దు. ► ప్రసిద్ధ మూలాధారాల నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేయండి (ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటివి). సైబర్ టాక్ ఆన్లైన్లో మహిళా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే సైట్స్.. https://securityinabox.org/en/ https://exposingtheinvisible.org/resources/# filter=.watching-out-yourself https://ssd.eff.org/ https://hackblossom.org/cybersecurity/ https://www.accessn మీరు సైబర్ క్రైమ్‌కు గురైతే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in/ కు లాగిన్ చేసి, ఫిర్యాదును ఫైల్ చేయండి. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేసి, సహాయంపొందవచ్చు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
విశాఖలో.. భద్రతకు భరోసా
దొండపర్తి (విశాఖ దక్షిణ): నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా విశాఖను సురక్షిత నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం నగర పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా సొసైటీ ఫర్ విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(వీసీఎస్‌సీ) ఏర్పాటుకు నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ సంసిద్ధులయ్యారు. ఇందుకోసం పరిశ్రమలు, ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశాంత విశాఖకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీగా.. విశాఖ పారిశ్రామిక, ఐటీ, పర్యాటక ఇలా అన్ని రంగాల్లో విశేషాభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు నగరానికి తరలివస్తున్నాయి. అలాగే విశాఖ అందాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపొందిన విశాఖను ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా వీసీఎస్‌సీ ఏర్పాటుకు చర్యలు నగరంలో నేర నియంత్రణ కోసం ఇప్పటికే ప్రధాన జంక్షన్లు, ప్రాంతాల్లోనే కాకుండా కాలనీల్లోనూ పోలీస్ శాఖతో పాటు జీవీఎంసీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. అయితే నగర పరిధి విస్తరిస్తుండడం, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖకు వస్తుండడంతో మరింత భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ గుర్తించింది. చదవండి: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి.. దీనికి అనుగుణంగా నిఘా వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీనికి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ప్రజల నుంచి సహాయ సహకారాలు అవసరమన్న విషయాన్ని అన్ని వర్గాల వారికి అవగాహన కలిగిస్తున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత, రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, క్రైం మానిటరింగ్ వంటి రక్షణ చర్యలను మరింత పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ నిర్ణయించారు. ఇందుకోసం సిసీటీవీ, సైబర్ ల్యాబ్ వంటి సాంకేతికతను పెంపొందించేందుకు సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్‌సీ) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సొసైటీ ఫర్ విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి.. అందులో అందరి భాగస్వామ్యం అవసరమన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. –సీహెచ్.శ్రీకాంత్, విశాఖ పోలీస్ కమిషనర్ -
APSRTC: పల్లె వెలుగు బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు.. ఎలా పనిచేస్తాయంటే..
సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘న్యూమాటిక్ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ) -
లైంగిక వేధింపుల నివారణకు వినూత్న కార్యక్రమం
కైకలూరు(పశ్చిమ గోదావరి జిల్లా): పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ, లైంగిక వేధింపుల నిరోధానికి వినూత్న కార్యక్రమానికి ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌తో మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ కమిటీ– హైకోర్టు, రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గోడపత్రికల ద్వారా లైంగిక వేధింపుల నివారణపై 18 సంవత్సరాలలోపు బాలికలకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికలు తాము ఎదుర్కొన్న ఇబ్బందిని స్కూల్లోని ఫిర్యాదుల బాక్సు ద్వారా తెలియజేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఎవరికి చెప్పాలో తెలియక బాలికలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి చేపడుతోంది. 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పాఠశాల భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. ప్రతి పాఠశాలలోనూ పర్యవేక్షణ చేయడానికి భద్రతా కమిటీలను రూపొందించింది. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు బాలికలు తాము ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలను నిర్భయంగా కాగితంపై రాసి వేసేలా ఫిర్యాదుల పెట్టెను ప్రతీ పాఠశాలలోనూ ఏర్పాటు చేశారు. పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాక్సును అమర్చుతున్నారు. ఈ బాక్సుకు మూడు తాళం చేవులు ఉంటాయి. ప్రతీ 15 రోజులకు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను ఎంఈఓ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దారు వద్ద తెరిచి పరిష్కారాలను చూపుతారు. పెద్ద సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తారు. హెచ్ఎంలకు అవగాహన బాలికలపై లైంగిక వేధిపుల నిరోధానికి ప్రభుత్వం పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై మండల స్థాయిలో హెచ్ఎంలకు అవగాహన కలిగించారు. బాలికల శరీర భాగాలను తప్పుడు ఉద్దేశంతో ఎవరైన తాకితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. చైల్డ్ లైన్ – 1098, ఏపీ పోలీసు – 100, దిశ – 112, ఉమెన్ హెల్ప్ లైన్ – 181, ఎమర్జన్సీ – 108, మెడికల్ హెల్ప్ లైన్ – 104కు ఫిర్యాదు చేయాలని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. బాలికలలో తల్లిదండ్రులు గమనించాల్సినవి ప్రవర్తనలో ఆకస్మిక మార్పు ఇతరుల నుంచి దూరంగా ఉండటం శరీర భాగాలలో అనుమానస్పద మార్పులు భయపడుతూ ఉండటం ఆహారం, నిద్రలో మార్పులు బాలికలకు బోధించాల్సినవి మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే గట్టిగా మాట్లాడాలి ఎవరైన హద్దు మీరి ప్రవర్తిస్తే చురుగ్గా ప్రతిఘటించాలి లైంగిక వేధింపును ఎదుర్కొన్న తర్వాత అది వారి తప్పు కాదని గుర్తించేలా, అపరాధ భయాన్ని విడనాడేలా చేయాలి లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులకు చెప్పేలా ప్రోత్సహించాలి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. దిశ యాప్ ద్వారా ఆపదలో మహిళలకు తక్షణ సాయం అందిస్తున్నారు. పాఠశాల స్థాయిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలు ధైర్యంగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాలి. చేతులతో ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా గమనించాలి. ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫోన్ చేయండి - కెఎల్ఎస్.గాయత్రీ, మహిళా ఎస్సై, కైకలూరు ప్రతి పాఠశాలలోనూ ఫిర్యాదుల పెట్టె ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదులు వేసేలా నిర్మానుష్య ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పాం. ప్రతీ ఫిర్యాదును తహసీల్దారు సమక్షంలో విచారణ చేసి తక్షణ న్యాయం చేయనున్నాం. ఇటీవల హెచ్ఎంలకు వీటి నిర్వాహణపై శిక్షణ అందించాం. – డి.రామారావు, మండల విద్యాశాఖాధికారి, కైకలూరు -
ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు
ఆకివీడు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత కోసం.. వారికి భరోసా కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తోంది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడూ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయకుండా ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: ఆయిల్ ఫామ్ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే? ప్రతీ పాఠశాల వద్ద ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. అలాగే బాలికలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నా, తాకినా వెంటనే తల్లిదండ్రులకు గాని, పెద్దలకు తెలియజేయాలంటూ ఫ్లెక్సీలో సూచించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై చర్యలు పాఠశాల వద్ద ఉన్న ఫిర్యాదుల బాక్సులో రాత పూర్వకంగా విద్యార్థినులు సమాచారాన్ని తెలియజేయాలి. ఈ బాక్సుల్లోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ ఎంఈవో పరిష్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాక్సుల్లో ఫిర్యాదులను పరిశీలించి ఎంఈవోకు సమాచారమిస్తారు. ఎంఈవో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 418 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 63,638 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. క్తొతగా ప్రారంభించిన 16 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లోని విద్యార్థినులతో పాటు 36 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,420 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో సుమారు 22,570 మంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వీరికి అభయం కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ప్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు బాలికలు, విద్యార్థినులకు రక్షణగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పలు ఉచిత కాల్ సెంటర్ నెంబర్లు అందుబాటులో ఉంచింది. వేధింపులకు గురైనా, శరీరంపై చేయి వేసినా చైల్డ్ లైన్ నెంబరు 1098, పోలీస్ 100, దిశ హెల్ఫ్‌లైన్ నెంబర్ 112, ఉమెన్ హెల్ప్‌లైన్ 181కు ఫిర్యాదు చేయవచ్చు. దురుసుగా ప్రవర్తించినా, అసభ్యకరంగా మాట్లాడినా ఆ సమయంలో విద్యార్థునులు ఏం చేయాలో అవగాహన కలి్పస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు భేష్ బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సు వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుంది. బాలికలు నిర్భయంగా పాఠశాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు. – ఎన్.సిరి సన్నిత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు వేధింపులకు అడ్డుకట్ట విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పిస్తున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణకల్పించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సులు, హెల్ప్లైన్ల ఏర్పాటుతో వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. – ఎండీ.బషీరా, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు పాఠశాలల్లో ఫిర్యాదు బాక్సులు బాలికా సంరక్షణ పథకం ద్వారా బాలికలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు, హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లైంగిక వేధింపులకు గురి చేసే వారికి శిక్ష పడేలా ఇవి దోహదపడతాయి. విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – డీ.వెంకట రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
బ‘కిల్స్’! సేఫ్టీ ఫీచర్స్ లేని వాహనాల దందా!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై జరిగే కారు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఆయా కంపెనీలు అనునిత్యం అధ్యయనాలు చేస్తున్నాయి. వీళ్లు ప్రవేశపెట్టిన సేఫ్టీ ఫీచర్స్‌కు ‘విరుగుడు’ తయారు చేసే వాళ్లూ ఎక్కువైపోతున్నాయి. కారు ప్రమాదాల తీవ్రత, మృతులను తగ్గించడానికి ఉపకరించే సీట్ బెల్డ్ అలారం ఆపే బకెల్స్ సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కార్ డెకార్స్ దుకాణాలతో పాటు ఆన్లైన్లో వీటిని విక్రయించేస్తున్నారు. ఫలితంగా సీట్ బెల్ట్ స్ఫూర్తి దెబ్బతింటోందని, భద్రతా చర్యలన్నీ వాహనచోదకుల కోసమే అన్నది గుర్తుపెట్టుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణదాత సీట్‌బెల్ట్.. కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా.. హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్లు కచ్చితంగా సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ప్రస్తుతం కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కచ్చితంగా సీటుబెల్ట్ ధరించేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని మిగిలిన వారికీ విస్తరించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ఇలాగే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు సీటుబెల్ట్ ప్రాణదాతగా నిలిచింది. అలారం వచ్చేలా టెక్నాలజీ.. ఇంతటి కీలకమైన సీట్‌బెల్ట్ కచ్చితంగా వాడేలా చేయడానికి కార్ల తయారీ కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తొలినాళ్లలో కేవలం డ్రైవర్, ఇప్పుడు అతడితో పాటు ముందు సీట్లో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దీన్ని ధరించకపోతే అలారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి అనేక మంది వాహనచోదకులు సీట్‌బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. ఇటీవల దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీన్ని సీట్‌బెల్ట్ బకెల్ స్లాట్‌లో ఉంచేస్తే చాలు... కనీసం వెనుక నుంచీ బెల్ట్ పెట్టుకోనక్కర్లేదు. ఈ బకెల్స్ను కార్ డెకార్స్ దుకాణాలు వివిధ రకాలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. ఆన్లైన్లో ఏ కంపెనీ కారు వినియోగిస్తుంటే ఆ కంపెనీ లోగోతో అమ్మే వర్తకులు పట్టుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరిగిందని అధికారులే చెబుతున్నారు. వీటి ద్వారా అలారం మోగకుండా ఆపవచ్చు కానీ ప్రమాదం జరగకుండా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సీట్‌బెల్ట్ అనేది వాహన చోదకుడి ప్రాణాలు రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ బకెల్స్ వినియోగంపై చర్యలకు యోచిస్తున్నామని చెబుతున్నారు. (చదవండి: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
చైనా పౌరుల ప్రతి కదలికపై గట్టి నిఘా! ఎక్కడికి వెళ్లినా..చెప్పాల్సిందే!
increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్హెచ్ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్లో ఒక డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ షటిల్ వ్యాన్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్‌లోని బులిచిస్తాన్ ప్రావిన్స్‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ) -
World Food Safety Day: సంపాదనే ముఖ్యం.. అందుకోసం ఏమైనా కల్తీ చేస్తారు
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి. ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు ►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు. ►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్లీడింగ్ గా పరిగణిస్తారు. ►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు. ►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. ►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి. అనుమతులు తప్పనిసరి తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము. –శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
రెండేళ్లుగా రోడ్డెక్కలేదు.. మరి బడి బస్సు భద్రమేనా?
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు కొంతకాలంగా ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో బడులు ప్రారంభమైనప్పటికీ పెద్ద స్కూల్లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగితా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడి బస్సు భద్రమెంత అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ పరిధిలో 192 స్కూ ల్ బస్సులు, ఆసిఫాబాద్ జిల్లాలో 102 బస్సులు ఉండగా ఒక్కదానికి కూడా ఫిట్నెస్ లేదు. మంచిర్యాల జిల్లాలో 400 బస్సులకు గానూ నాలుగింటికి, నిర్మల్ జిల్లాలో 270 స్కూల్ బస్సులకు గానూ 20 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,430 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 987 ప్రాథమిక, 186 ప్రాథమికోన్నత, 257 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,32,031 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని 146 ప్రైవేట్ పాఠశాలల్లో 26,039 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికిపైగా విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు కొనసాగిస్తుంటారు. 146 ప్రైవేట్ పాఠశాలలకు 192 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటికీ ప్రస్తుతం ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు ఇన్సూరెన్స్ కూడా ముగిసింది. రోజుకు రూ.50 జరిమానా.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించనున్నట్లు రవాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జరిమానా పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలకు ఏడాదిన్నర పాటు వెసులుబాటు కల్పించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకోని వాటికి రోజుకు రూ.50 చొప్పున జరిమానా కట్టించాలన్న నిబంధన విధించింది. బస్సు భద్రమెంత.? కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆర్థికంగా చతికిలపడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్లోనే తరగతులు కొనసాగాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నేరుగా విద్యాబోధన జరుగుతోంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తప్పనిసరి బస్సు భద్రత అవసరమేనని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేసి ఉంచాలి. గతంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ బస్సు యాజమాన్యాలపై ఉంది. ఈ నిబంధనలు తప్పనిసరి.. ► స్కూల్æబస్సుకు పాఠశాల పేరు, సెల్‌ఫోన్ నంబర్, పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి ► డ్రైవర్ వయస్సు 60 సంవత్సరాలకు మించరాదు. తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ► డ్రైవర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. ► ప్రతీ బస్సుకు ఒక అటెండర్ ఉండాలి. ► బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ► బస్సులో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ► బస్సులకు తలుపులు అమర్చబడి ఉండాలి. ► కిటికీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చబడి ఉండాలి. ► విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి. భద్రత విషయంలో రాజీపడం పాఠశాల బస్సుల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. డ్రైవర్లు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలి. బస్సు కండీషన్ ఉంటేనే నడపాలి. నిబంధనలు అతిక్రమించి బస్సు నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆదిలా బాద్, కుమురంభీం జిల్లాల పరిధిలో ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సుకు కూడా ఫిట్నెస్ లేదు. గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
అదసలు ఆటోనేనా? స్కూల్ పిల్లలను కుక్కేసి మరీ..
చెన్నై: పిల్లలను బడులకు పంపే తల్లిదండ్రులు.. వాళ్ల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?. అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్, ఫేస్బుక్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్కూల్ ఆటోలో పిల్లలను జంతువుల్లాగా కుక్కేసి మరీ తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. బయట గ్రిల్ నుంచి చూస్తే.. ఒకరిపై మరొకరు నిల్చుని, వేలాడుతూ బడికి వెళ్తున్నారు. మరోపక్క ఓపెన్ వైపు కూడా ఒకరి మీద మరొకరు ఇరుక్కుగానే కూర్చుని ఉన్నారు. ఇది చూసి ఓ వ్యక్తి.. అదంతా వీడియో తీశాడు. అంతటితోనే ఆగకుండా.. అక్కడే ఉన్న టీచరమ్మను ‘ఏంటి ఇదంతా?’ అని నిలదీశాడు. అయితే ఆమె మాత్రం ఏదో సర్దిచెబుతూ.. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. టెంకాశీలో జరిగిన ఈ వీడియో వైరల్ అయ్యి.. మీడియాకు చేరింది. తమిళనాడులో తాజాగా ఓ విషాద ఘటన జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో.. మ్యూజిక్ వింటూ స్కూల్ బండి నడిపిన ఓ డ్రైవర్, ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. ఈ నేపథ్యంలో.. తాజా వీడియో ఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మరోపక్క వైరల్ అయిన ఈ వీడియోపై దర్యాప్తు చేయిస్తామని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇంకోపక్క పిల్లలను ఇలా ప్రైవేట్ వాహనాల్లో పంపేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సన్ న్యూస్ సౌజన్యంతో.. -
గ్యాస్ సిలిండర్ పేలకుండా ఉండాలంటే.. ఇవి పాటించాల్సిందే!
ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో వంట చేయడమే కనిపిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన వంట గ్యాస్ వినియోగం నేడు గ్రామాల్లోనూ విస్తరించింది. ఎంతో ప్రాముఖ్యమున్న వంట గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గ్యాస్‌తో ఆటలాడుకోవద్దనే వాదనను అందరూ వినిపిస్తుంటారు. ఎందుకంటే అది ప్రమాదవశాత్తు పేలితే ప్రాణ, ఆస్తి నష్టాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వంట గ్యాస్ వాడకంపై వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. మహారాణిపేట(విశాఖ దక్షిణ): గ్యాస్ సిలిండర్ పేలుడు.. సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి. ఏదో మూల.. ఏదో ఒక ప్రాంతంలో గ్యాస్ ప్రమాదాల వార్తలు వింటూ ఉన్నాం. కేవలం అవగాహన లోపం... నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గ్యాస్ సిలిండర్‌తో ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. చిన్న చిన్న జాగ్రత్తలు, గ్యాస్ వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి వాటితో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. చదవండి: హజ్ అరుదైన భాగ్యం.. ఈ నెల 31తో ముగియనున్న గడువు తూకాల్లో మోసాలు.. వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహవసర సిలిండర్ లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలుపుకుని మొత్తంగా 29.500 కేజీలు ఉండాలి. మీకు సరఫరా చేస్తున్న సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణమే తూకం వేయించాలి. తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరిస్తే వెంటనే జిల్లా సరఫరా అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మూడు దశల్లో రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష గ్యాస్ సిలిండర్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించే రీ–క్యాలిబ్రేషన్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ముందుగా విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇందులో సిలిండర్ పనికి రాదని తేలితే దాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే హైడ్రాలిక్ పరీక్షలకు పంపుతారు. అక్కడ సిలిండర్లలో నీటిని నింపి 5 సార్లు ఫ్రెషర్ ద్వారా లీకేజీలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాలు పరిస్థితిని గమనించి నిమాటి ఫ్రెషర్ పరీక్ష చేస్తారు. సిలిండర్లలో గాలి నింపి ఒత్తిడిని పెంచుతారు. అన్ని పరీక్షల్లో సిలిండర్ మంచిదని తేలితే దానిని ప్రజా వినియోగానికి అనుమతిస్తారు. ఈ పరీక్షను ఏడాదిలో 4 సార్లు నిర్వహించాలి. వంటగదిలో పాటించాల్సిన జాగ్రత్తలు.. ►వంటగదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి. ►గ్యాస్ స్టౌకు ఎదురుగా మాత్రం కిటికీ ఉండకూడదు. ►వంట గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్, ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉంచకూడదు. ►అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్‌ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి. ►స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఉండరాదు. ►మీ గ్యాస్ సిలిండర్‌ను ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కారం కాదు. ►గ్యాస్ స్టౌకు సంబంధించిన మరమ్మతులను డీలర్ వద్దగానీ, అనుభవం కలిగిన మెకానిక్ వద్దగానీ చేయించాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోగాలు చేయరాదు. ► వంట చేసే సమయంలో పిల్లలను దగ్గరకు రానీయకూడదు. వంట చేసే సమయంలోనూ, స్టౌవ్ వాడకంలో ఉన్నప్పుడు వంట గదిలోనే ఉండాలి. కంపెనీల నిర్లక్ష్యం ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో వినియోగదారుల మాట అటుంచితే కొన్ని చమురు సంస్థలు తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వినియోగంలో దెబ్బతిన్న సిలిండర్లను మార్చడం లేదా, వాటికి మరమ్మతు లు చేయడంలో కంపెనీలు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి గ్యాస్ సిలిండర్లకు 7 సంవత్సరాల జీవిత కాలం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది పూర్తయితే వాటిని రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే దానిని మరో 5 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. గ్యాస్ వాసన వస్తుంటే... ♦ గ్యాస్ వాసన వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్, తర్వాత స్టౌవ్ ఓపెన్‌ను ఆఫ్ చేయాలి. ♦ విద్యుత్ బోర్డులో స్విచ్‌లు వేయడం, తాకడం వంటివి చేయకూడదు. ♦ అన్ని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ♦ రెగ్యులేటర్‌ను వేరుచేసి సిలిండర్‌పైన సేఫ్టీ కప్ పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. ♦ గ్యాస్ లీకవుతున్నట్టు భావిస్తే ప్రమాదాల నివారణకు దగ్గరలోని అగి్నమాపక కేంద్రాలు, డీలర్లకు ఫోన్ చేయాలి. వినియోగంలో ఇవి తప్పనిసరి.. ♦ గ్యాస్ సిలిండర్ నాబ్కి కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ బిగుతా లేకుండా ఊడిపోయినట్లు ఉంటే తిరస్కరించాలి. ♦ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం.. పక్కకు వంచి ఉంచడం చేయరాదు. ♦ గ్యాస్ సిలిండర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. ♦ వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ కట్టేయాలి. లీకేజీ సమస్య రాకూడదంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత స్టౌపై మంటను అలాగే ఉంచి పరిశీలించాలి. దీని వల్ల ట్యూబులో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు వచ్చి మండిపోతుంది. ♦ సిలిండర్ వినియోగించని సందర్భంలో ప్లాస్టిక్ మూత పెట్టేయాలి. ఖాళీదైనా ఇలాగే చేయాలి. ♦ గ్యాస్ స్టౌని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉంచాలి. ♦ రెగ్యులేటర్‌కు మరో ట్యూబ్‌ను కలిపి మరో స్టౌకు జత చేయరాదు. ♦ రబ్బరు ట్యూబ్‌కు ఏ విధమైన కవర్ని తొడగరాదు. ♦ సిలిండర్‌ను గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ♦ గ్యాస్ సిలిండర్ కాలపరిమితిని సూచించే నంబర్‌ను పరిశీలించాలి. సిలిండరుకు అతికి ఉన్న ఊచల వెనుక వైపు ఈ నంబర్ ఉంటుంది. ♦ గ్యాస్ పరికరాలను ప్రతి రెండేళ్లకోసారి పరీక్షిస్తూ ఉండాలి. ♦ నాణ్యమైన స్టౌలు వాడాలి. వీటి వాడకం వల్ల ఏడాదికి రెండు సిలిండర్లు వరకు ఆదా చేయవచ్చు. ♦సిలిండర్‌కు రెగ్యులేటర్ బిగించే చోట ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది. వాచర్ సరిగ్గా లేకపోతే రెగ్యులేటర్ బిగించిన తరువాత గ్యాస్ లీకవుతుంది. కాబట్టి డెలివరీ బాయ్స్ సిలిండర్ ఇచ్చినప్పుడు దానిపైన ఉన్న సీల్‌ను అతని ముందే తొలగించండి. వాచర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలని కోరండి. వారి వద్ద రెగ్యులేటర్ ఉంటుంది. దానిని సిలిండర్‌కు బిగించి పరిశీలిస్తారు. గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే రబ్బర్ వాచర్ మార్చి మరోసారి చెక్ చేస్తారు. సిలిండర్‌పై నంబర్లు పరిశీలించండి.. రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు సంబంధించి ప్రతి సిలిండర్‌పై భాగాన ఉన్న సపోర్టుల్లో ఏదో ఒక దానిపై లోపలి వైపున ఎబీసీడీల అక్షరాలతో ఒక కోడ్‌తో పాటు రెండు నంబర్లు సంవత్సరానికి సంబంధింనవి సూచిస్తారు. నాలుగు అక్షరాలు సిలిండర్‌కు పరీక్ష నిర్వహించాల్సిన నెల కోడ్‌ను సూచిస్తాయి. జనవరి నుంచి మార్చి వరకు–ఎ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు–బి, జూలై నుంచి సెపె్టంబర్ వరకు–సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు –డి కోడ్‌ను కేటాయించారు. ఉదాహరణకు సిలిండర్‌పై డి–20 అని ఉంటే డిసెంబర్ 2020లో ఆ సిలిండర్ జీవిత కాలం పూర్తవుతుందని అర్థం. ఈ విషయంలో గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సీల్ లేకుండా డెలివరీ వద్దు గ్యాస్ సిలిండర్ డెలివరీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సిలిండర్‌కు తప్పని సరిగా సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఇచ్చే సిలిండర్లను ఎవరూ తీసుకోవద్దు. సీల్ లేకుండా డెలివరీ చేస్తే డెలివరీ బాయ్స్‌పై, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ అంతా తమ వెంట తూనిక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వినియోగదారులు ఎవరైనా అడిగితే సిలిండర్ తూకం వేసి చూపించాలి. వినియోగదారుడి సమక్షంలో గ్యాస్ బాయ్‌లు సీల్ తీసి వాల్వు తనిఖీ చేయాలి. – రొంగలి శివప్రసాద్, రూరల్ డీఎస్వో, విశాఖపట్నం -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరోనా దేశంలో శరవేగంగా దూసుకొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశంలోకి వచ్చేసినట్టేనని వైద్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే లక్ష 17 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్‌ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఆమోదించినన యాంటీ-కోవిడ్-19 డ్రగ్ మోల్నుపిరావిర్‌లో "ప్రధానమైన సేఫ్టీ సమస్యలు" ఉన్నాయని భారతదేశపు ఉన్నత ఆరోగ్య పరిశోధన సంస్థ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ లైట్ తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారనంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్తలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు , ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ పురుషులు, మూడు నెలల పాటు గర్భ నిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చన్నారు.అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. అలాగే డబ్ల్యుహెచ్వో గానీ, యూకేలో గానీ దీన్ని చికిత్సలో భాగంగా చేయలేదన్నారు. దీనిమై మరింత చర్చిస్తున్నామని భార్గవ వెల్లడించారు. #bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe — BharatBiotech (@BharatBiotech) January 5, 2022 ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15-18 సంవత్సరాల వయస్సు వారికి "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడవద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. కోవాక్సిన్‌తో టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. తేలికపాటి ఇబ్బందులు వచ్చినా, రెండు మూడు రోజులకు అవే తగ్గిపోతాయని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 30,000 మందిలో దాదాపు 10-20 శాతం మందికి మాత్రమే సమస్యలొచ్చాయని, చాలా వరకు తేలికపాటివి,1-2రోజులలో తగ్గిపోతాయని మందులు అవసరం లేదని తెలిపింది. వైద్యుడి సలహా మేరకే మందులువాడాలని కూడా పేర్కొంది.అలాగే వ్యాక్సిన్ తరువాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్. ఇది త్వరలోనే అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానుందని డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చిందంటూ వార్త లొచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. కరోనా సెకండ్‌వేవ్ కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. వైరస్ వ్యాప్తిని అడ్డు కునేందుకు భౌతిక దూరం, ఫేస్ మాస్క్, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అనే మూడు మంత్రాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలను, క్లోజ్డ్. వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచింది. అలాగే దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకోవడం, ఇంట్లో అందరం ఉన్నపుడు, కిటికీలు తెరిచి ఉంచుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
-
Viral Video : వేగంగా వెళ్తున కారు.. అకస్మాత్తుగా కూలిన భారీ చెట్టు
ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టింది. ఎలన్‌మస్క్ నేతృత్వంలో వచ్చిన కార్లు అనతి కాలంలోనే యూజర్ల మనసులు దోచుకోవడంతో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయింది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో సక్సెస్ కావన్న కంపెనీలే ఇప్పుడు అదే రూట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టెస్లా నుంచి ఇప్పటికే అనేక సక్సెస్ఫుల్ మోడల్స్ మార్కెట్లో ఉండగా లేటెస్ట్ కారుగా మోడల్ ఎస్ ప్లెయిడ్‌ని ఎలన్‌మస్క్ ఇటీవల మార్కెట్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మోడల్ గురించి ఎలన్‌మస్క్ మాట్లాడుతూ... ఈ కారు వేగంలో పోర్షేను సేఫ్టీలో వోల్వోను మించిన కారంటూ చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారో కానీ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన మాత్రం టెస్లా కార్లు ఎంత సేఫ్టీ అనే విషయాన్ని అన్యాపదేశంగా చెబుతున్నాయి. ఇటీవల అమెరికాను టోర్నోడోలు ముంచెత్తాయి. వేగంగా వీచిన గాలుల దాటికి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయాయి. భారీ గోడౌన్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ టోర్నోడో విశ్వరూపం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఒంటారియాలో వేగంగా వెళ్తున్న ఓ టెస్లా మోడల్ 3 కారుపై భారీ చెట్టు కూలి పోయింది. సుమారు 2000 పౌండ్లు ( 907 కేజీలు) బరువు ఉన్న ఆ చెట్టు ఒక్క సారిగా మీద పడటంతో ఈ కారు తుక్కుతుక్కు అవుతుందని అనుకున్నారు. WATCH: 2,000lb tree falls on @Tesla Model 3 in Ontario in high winds this week. All occupants okay. Teslas continue to be rated the safest cars on the road. @elonmusk $TSLA @WholeMarsBlog @DriveTeslaca Credit Sam Fursey: https://t.co/85PASnUFI7 pic.twitter.com/mYMDeqvyFb — Gary Mark • Blue Sky Kites (@blueskykites) December 16, 2021 టెస్లా సంస్థ తమ కార్ల బిల్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల భారీ చెట్టు మీద పడినా కొద్ది సొట్టు పోవడం, కొంచెం అద్దం పగిలిపోవడం మినహా పెద్దగా డ్యామేజీ ఏమీ జరగలేదు. కారులో ప్రయాణిస్తున వ్యక్తులు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఇటీవల ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ఈ వీడియో చూసిన వారు టెస్లా కార్ల నాణ్యతను ప్రశంసిస్తున్నారు. చదవండి : టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా 50 కిమీ దూసుకెళ్తుంది! -
Whistel Blower : లోపాలు ఎత్తి చూపాడు.. రూ.178 కోట్లు అందుకున్నాడు
హ్యుందాయ్ కార్లలో ఉన్న సాంకేతిక లోపాలు, రోడ్ సెఫ్టీ విషయంలో కంపెనీ చెబుతున్న మాటల్లో డొల్లతనాన్ని ఆధారాలతో సహా నిరూపించిన ఓ విజిల్ బ్లోయర్ భారీ బహుమతిని అందుకున్నాడు. వినియోగదారుల భద్రత విజయంలో రాజీ పడొద్దంటూ ఆ ఉద్యోగి ఎంతగా చెప్పినా కంపెనీ యాజమాన్యం వినకపోవడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గ్వాంగ్ హో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీలో 26 ఏళ్లుగా ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈ ఘటన జరగడానికి ముందు హ్యుందాయ్‌లో క్వాలిటీ స్ట్రాటజీ టీమ్‌లో ఆయన పని చేశారు. అయితే హ్యుందాయ్తో పాటు దాని సబ్సిడరీగా ఉన్న కియా సంస్థ ఉత్పత్తి చేస్తున కార్లలో భద్రపరమైన లోపాలు ఉన్నట్టు కంపెనీ అంతర్గత సమావేశాల్లో అనేక సార్లు కిమ్ గొంతెత్తాడు. అయితే అతని సూచనలను హ్యుందాయ్ మేనేజ్మెంట్ బుట్టదాఖలు చేసింది. దీంతో వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చిన కిమ్ గ్వాంగ్ హో అసలు నిజాలు బయటకు చెప్పారు. హ్యుందాయ్, కియా నుంచి వస్తోన్న కార్లలో నెలకొన్న భద్రతాపరమైన లోపాలను అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ)కి కిమ్ ఉప్పందించాడు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్హెచ్టీఎస్ఏ పరిశీలించగా లోపాలు నిజమేనని తేలింది. దీంతో హ్యుందాయ్, కియా సంస్థలకు జరిమానాగా వరుసగా 140 మిలియన్లు, 70 మిలియన్ డాలర్లు విధించింది. ఐదేళ్ల కాలపరిమితిలో ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. భద్రతాపరమైన లోపాలు తెలియజేసినందుకు ప్రోత్సాహాకంగా కిమ్గ్యాంగ్ హోకి రూ.24 మిలియన్ డాలర్లు (రూ.178 కోట్లు)ను బహుమతిగా ప్రకటించింది ఎన్హెచ్టీఎస్ఏ. వినియోగదారుల భద్రత కోసం నా భవిష్యత్తును ఫణంగా పెట్టినందుకు సరైన న్యాయమే జరిగిందంటూ కిమ్ గ్యాంగ్ హో స్పందించారు. కార్ల భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు త్వరలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో మరింత మంది విజిల్ బ్లోయర్లు ముందుకు వస్తారని, మరిన్ని చీకటి నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని కిమ్ అన్నారు. -
వోల్వో నుంచి 7 సీటర్ వెహికల్.. భద్రతకు భరోసా
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా ఎస్యూవీ ఎక్స్‌సీ90 కొత్త వెర్షన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.89.9 లక్షలు.ఏడు సీట్ల సామర్థ్యంతో 1,969 సీసీ పెట్రోల్ మైల్డ్–హైబ్రిడ్ ఇంజన్, ఇన్ట్యూటివ్ టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్, అత్యాధునిక ఎయిర్ క్లీనర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మందువైపు కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్, వెనుకవైపు కొలీషన్ వార్నింగ్, మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డీజిల్ నుంచి పెట్రోల్ వైపు మళ్లేందుకే ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -
ఇన్వెస్టర్ సర్వీస్ సపోర్ట్.. మార్గదర్శకాలను సరళీకరించిన సెబీ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సర్వీసుల అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సరళీకరించింది. తద్వారా రిజిస్ట్రార్, షేరు బదిలీ ఏజెంట్(ఆర్టీఏ)గా వ్యవహరించే సంస్థల సులభ వ్యాపార నిర్వహణకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఫిజికల్ సెక్యూరిటీస్ కలిగిన వాటాదారులు పాన్, కేవైసీ, నామినేషన్ వివరాలు అందించడంలోనూ మార్గదర్శకాలను జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి తాజా నిబంధనలు అమలుకానున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి సంబంధిత డాక్యుమెంట్లలో ఏ ఒక్కటి లేకున్నా ఆర్టీఏలు ఇన్వెస్టర్ల ఫోలి యోలను నిలిపివేసేందుకు వీలుంటుంది. డాక్యుమెంట్లు లభించాక మాత్రమే తిరిగి యాక్టివేట్ చేసేందుకు అధికారం లభిస్తుంది. ఇన్వెస్టర్లు 2022 మార్చి 31కల్లా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. -
Diwali 2021 Safety Precautions: టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో... వికటిస్తే అంతే చీకటినీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రమాదాలేవీ లేకుండా కేవలం వేడుకల సంబరాలు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అందరూ పాటించాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు. అలాంటి సాధారణ జాగ్రత్తలు మొదలు కళ్లూ, ఒళ్లూ, చెవులూ... విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపేదే ఈ కథనం. చెవులు జాగ్రత్త... దీపావళి బాణాసంచా వల్ల దేహంపై ప్రధానంగా దుష్ప్రభావం చూపే ముఖ్యమైన మూడు అంశాలు శబ్దం, పొగ, రసాయనాలు. అప్పుడే పుట్టిన చిన్నారులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం మరింత ఎక్కువ. వీటిలో శబ్దం వల్ల ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవుల విషయంలో రక్షణ పొందడం ఎలాగో చూద్దాం. కొన్ని టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కానీ మన చెవి కేవలం 7 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే హాయిగా వినగలుగుతుంది. ఆ పైన పెరిగే ప్రతి డెసిబుల్ కూడా చెవిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చెవులను రక్షించుకోడానికి ‘ఇయర్ ప్లగ్స్’ కొంతమేరకు అనువైనవి. ►పెద్ద శబ్దాలతో పేలిపోయే టపాకాయలు కాకుండా చాలా తక్కువ శబ్దంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాల వంటివి కాల్చడం మంచిది. ►ఒకవేళ పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయితే చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వంటివి వెయ్యకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. కళ్ల విషయంలో అప్రమత్తత అవసరం చాలా ఎక్కువ తీక్షణమైన వెలుగు, దానితోపాటు వెలువడే వేడిమి, మంట... ఈ మూడు అంశాలతో కళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి. కాలని / పేలని బాణాసంచాపై ఒంగి చూడటం మంచిది కాదు. ►కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►ప్రమాదవశాత్తు కంటికి ఏదైనా గాయం అయినప్పుడు ఒక కన్ను మూసి, ప్రమాదానికి గురైన కంటి చూపును స్వయంగా పరీక్షించి చూసుకోవాలి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. చర్మం జర భద్రం బాణాసంచాతో చర్మం కాలిపోయే ముప్పు ఎక్కువ. అందునా కాళ్ల, వేళ్ల, చేతుల ప్రాంతంలోని చర్మం గాయపడే ప్రమాదం మరింత అధికం. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచాని కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరిస్తే, అవి వేలాడుతూ మంట అంటుకొనే ప్రమాదం ఉంది. అందుకే కొద్దిగా బిగుతైనవే వేసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. దూరం పెరిగే కొద్దీ చర్మానికి నేరుగా తాకే మంట, వేడిమి తాకే ప్రభావమూ తగ్గుతుంది. ►బాణాసంచా కాల్చే సమయం లో ముందుజాగ్రత్తగా రెండు బక్కెట్లు నీళ్లు పక్కనే ఉంచుకోవాలి. చర్మం కాలితే కంగారు పడకుండా తొలుత గాయంపై నీళ్లు ధారగా పడేలా కడగాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న మామూలు నీళ్ల (ప్లెయిన్ వాటర్)ను వాడాలి. ఐస్ వాటర్ మంచిది కాదు. కాలడం వల్ల అయిన గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు గాయాల్ని తడిగుడ్డతో కప్పి ఉంచవచ్చు. ►కాలిన తీవ్రత చాలా ఎక్కువగా సమయాల్లో చేతుల వేళ్లు ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ►కాలిన గాయాలు తీవ్రమైతే బాధితులకు ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, ఇంటి లోపలా, టెర్రెస్‌పైన కాల్చకూడదు. పేలే బాణాసంచాను డబ్బాలు, పెట్టెలతో పాటు... మరింత శబ్దం కోసం కుండల్లో, తేలికపాటి రేకు డబ్బాల్లో, గాజు వస్తువుల్లో ఉంచి అస్సలు కాల్చకూడదు. అవి పేలిపోయినప్పుడు వేగంగా విరజిమ్మినట్టుగా విస్తరించే పెంకుల వల్ల చర్మం, కళ్లూ, అనేక అవకాశాలు, తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని బాణాసంచా అస్సలు కాల్చకూడదు. పెద్దవాళ్ల సహాయం లేకుండా చిన్నపిల్లలు వాళ్లంతట వాళ్లే కాల్చడం సుతరామూ సరికాదు. పిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండి, జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో మన పండగ... మరింత సురక్షితంగా మారి పూర్తిగా‘సేఫ్ దీపావళి’ అవుతుందని మనందరమూ గుర్తుపెట్టుకోవాలి. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
ప్రాజెక్టుల భద్రతపై కేంద్రం కసరత్తు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులు తమ అధీనంలోకి తీసుకుని నిర్వహించే ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలతో (సీఐఎస్ఎఫ్) భద్రత కల్పించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత ప్రక్రియను త్వరగా చేపట్టాలని జల్ శక్తి శాఖ కోరింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకానికి కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, ఒప్పందాలు తదితరాలపై వివరణ ఇస్తూ గోదావరి, కృష్ణా బోర్డులకు లేఖ రాసింది. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, జీతభత్యాలకు సంబంధించి ముసాయిదా పత్రాన్ని రెండు బోర్డులకు పంపింది. షెడ్యూల్–2 ప్రాజెక్టులకు భద్రత.. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను కేంద్ర జల్ శక్తి శాఖ షెడ్యూల్–2లో చేర్చింది. ఈ ప్రాజెక్టులు, వాటి కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నిచర్‌తో సహా అన్నింటినీ బోర్డులు తన అధీనంలోకి తీసుకుని రోజు వారీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. వాటి పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అంతా బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడని ప్రాజెక్టులను షెడ్యూల్–2 నుంచి తప్పించాలని, జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతలను మాత్రమే కృష్ణా బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గోదావరిపై ఎగువన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించాల్సి ఉంది. బోర్డుల పరిధిని నిర్ణయించడం కోసం రెండు బోర్డులు ఉప సంఘాన్ని నియమించాయి. డీఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ.. షెడ్యూల్–2లోని ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించే డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, బ్యారక్‌లు, కార్యాలయాలు, నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై సవివరంగా ముసాయిదాలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపాయి. ఇవీ చదవండి: Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
ఈ కార్లు.. భద్రతకు భరోసా
ఆధునిక యుగంలో కాలంతో పోటీ పడుతూ అటు ఇటు పరుగులు పెడుతున్నాం. అయితే క్రమంలో రహదారి భద్రతను చాలా మంది గాలికొదిలేస్తున్నారు. దీంతో మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది చనిపోతున్నారు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2019లో 4,37,396 రోడ్డు యాక్సిడెంట్స్ జరిగాయి. వీటిలో 1.54 వేల మంది చనిపోగా.. మరో 4.39 మంది తీవ్రగాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వెబ్‌డెస్క్: ఇండియాలో కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ధనవంతులకే సొంతమైన కారు సౌకర్యం ఇప్పుడిప్పుడే సామాన్యుల చెంతకు వస్తోంది. చాలా మంది కారు కొనేప్పుడు డిజైన్, మైలేజీ, ఇంజన్ సామర్థ్యం తదితర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. కానీ వీటన్నింటినీ మించి ముఖ్యమైన అంశం భద్రత. లక్షలు పోసి వెచ్చించే ఆ కారు ప్రమాదం జరిగినప్పుడు మనకు ఎంత వరకు భద్రత అందిస్తుందనేది ప్రధానం. ఎన్సీపీఏ రేటింగ్ బ్రిటన్‌కి చెందిన జీరో ఆర్గనైజేషన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (NCPA) పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కార్ల భద్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రేటింగ్స్ ఇస్తోంది. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో మంచి రేటింగ్స్ సాధించిన కార్ల వివరాలు మీ కోసం టాటా ఆల్ట్రోజ్ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఏకైక కారు టాటా ఆల్ట్రోజ్. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపే వ్యక్తి తల, మెడ, ఛాతి, మోకాళ్లుకు కచ్చితమైన భద్రత అందిస్తోంది. స్టాండర్డ్ వెర్షన్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ లభిస్తున్నాయి. మోడల్స్‌ని బట్టి ఎయిర్ బ్యాగ్స్ పెరుగుతాయి. ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు సీట్ బెల్డ్ రిమైండర్, ఏబీఎస్, ఈబీడీ బ్రేక్ సిస్టమ్స్, కార్నర్ స్టెబులిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఎన్సీపీఏ సంస్థ ఆల్ట్రోజ్‌కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 5.8 లక్షల నుంచి 9.56 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్ పూర్తిగా ఇండియన్ మేడ్‌గా తయారై ఎన్సీపీఏ నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన కారుగా టాటా నెక్సాన్ నిలిచింది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో భద్రత విషయంలో 5 స్టార్ నెక్సాన్‌కి దక్కాయి. కారులో ముందు వరుసలో కూర్చునే ఇద్దరు వ్యక్తుల తల, మెడ, ఛాతి, మోకాళ్లకు రక్షణ కల్పిస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీలతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మైగ్రేషన్లు ఈ కారులో ఉన్నాయి. టాటా నెక్సాన్ కారు రూ. 7.2 లక్షల నుంచి 12.96 లక్షల వరకు లభిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎన్సీపీఏ నుంచి సేఫర్ కార్ అవార్డు దక్కించుకున్న ఘనత మహీంద్రా ఎక్స్‌యూవీ 300కే దక్కింది. స్టాండర్డ్ వెర్షన్లలలో రెండు ఎయిర్‌బ్యాగ్స్ లభించగా.. హై ఎండ్ మోడల్స్‌లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా పొందు పరిచింది మహీంద్రా. ప్రమాదం జరిగినప్పుడు పెద్దలతో పాటు చిన్న పిల్లలకు కూడా ఇంచుమించు ఒకే రకమైన భద్రత, రక్షణ కల్పించడం ఎక్స్‌యూవీ 300 ప్రత్యేకత. ఈ అంశంలోనే మిగిత కార్ల కంటే ఎంతో ముందుంది ఈ మోడల్. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు మార్కెట్లో 7.96 లక్షల నుంచి 11.47 లక్షల వరకు లభిస్తోంది. మారుతి సుజూకి విటారా బ్రెజా మైలేజీ విషయంలో మిగిలిన కార్లను వెనక్కి తోసే మారుతి భద్రత విషయంలో ఎప్పుడు వెనుకడుగే అన్నట్టుగా ఉండేది. దీంతో విటారా బ్రెజాలో భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మారుతి. దీంతో ఎన్సీపీఏలో 4 స్టార్ రేటింగ్ సాధించింది బ్రెజా కారు. మార్కెట్లో బ్రెజా ధర రూ. 7.52 లక్షల నుంచి రూ.11.26 లక్షల వరకు లభిస్తోంది. రెనాల్ట్ ట్రైబర్ ఎన్సీపీఏ నుంచి లేటెస్ట్గా 4 స్టార్ రేటింగ్ సాధించింది రెనాల్ట్ ట్రైబర్. మల్టీ పర్సస్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్న రెనాల్ట్‌లో పెద్దలతో పాటు పిల్లల భద్రత విషయంలో మెరుగైన రేటింగ్స్ సాధించింది.అడల్ట్ భద్రత విషయంలో 4 రేటింగ్, పిల్లల భద్రత విషయంలో 3 స్టార్ రేటింగ్స్ సొంతం చేసుకుంది. రెనాల్ట్ ట్రైబర్ మోడల్స్ ధర మార్కెట్లో రూ. 5.3 లక్షల నుంచి 7.65 లక్షల వరకు ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ పోలోకి ప్యాసింజర్స్ భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్‌ని ఇచ్చింది ఎన్సీపీఏ. ముందు వరుసలో కూర్చున్న వారికి తల, మెడలకు పూర్తి స్థాయి భద్రత ఇవ్వడంతో పాటు ఛాతికి సైతం ప్రమాద తీవ్రత తగ్గేలా జాగ్రత్తలు పాటించింది వోక్స్ సంస్థ. వోక్స్ వ్యాగన్ పోలో మోడళ్లు రూ. 6.17 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ధరల్లో లభిస్తున్నాయి. మహీంద్రా థార్ స్పోర్ట్ప్ యూటిలిటీ వెహికలసెగ్మెంట్లో థార్‌కి ప్రత్యేక స్థానం. గతేడాది 4 స్టార్ రేటింగ్ సాధించిన థార్‌కి ఈసారి కూడా అదే రేటింగ్‌కి ఇచ్చింది ఎన్సీపీఏ. ఈ ఐకానిక్ ఎస్యూవీ మోడల్ ధరలు రూ. 12.11 లక్షల నంఉచి రూ 12.81 వరకు ఉంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాగ్ సెగ్మెంట్ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా టియాగో సంస్థ భద్రత విషయంలో మెరుగైంది. పెద్దలకు 4 స్టార్, పిల్లలకు 3 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది గ్లోబల్ ఎన్సీపీఏ సంస్థ. స్టాండర్డ్ వెర్షన్లో రెండు ఎయిర్‌బ్యాగులు అందించే ఈ మోడల్ ఈ మోడల్ ధరలు రూ. 5 లక్షల నుంచి రూ. 6.96 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ టాటా టియాగో తరహాలోనే టిగోర్ సైతం పెద్దల విషయంలో 4 స్టార్, పిల్లల విషయంలో 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ మోడల్ ధరలు ధరలు రూ. 5.6 లక్షల నుంచి రూ. 7.74 లక్షల వరకు ఉంది. మహీంద్రా మొరాజో మల్టీపర్పస్ యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో ఇప్పటికే ప్రజల ఆధరణ దక్కించుకున్న మహీంద్రా మోరాజో భద్రత విషయంలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. మార్కెట్లో మొరాజో మెడల్స్ రూ. 12.03 లక్షల నుంచి రూ. 14.04 లక్షల రేంజ్లో లభిస్తోంది. -
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?
‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్ ముష్టాక్, కౌసర్ ఎడప్పగత్ ఈ వ్యాఖ్య చేశారు. కేసు ఏమిటి? కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్ - ఇన్ రిలేషన్లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇంత ఆందోళన ఎందుకు? ‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్ మదర్స్ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది. మగతోడు లేకుండా బతకలేమా? అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్ మదర్స్ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్ మదర్‌గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. చుట్టూ సవాళ్లు ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్ మదర్‌గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది. - సాక్షి ఫ్యామిలీ -
ఈ టాగ్‌తో నోరులేని జీవాలు సేఫ్!
ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. రోడ్డుమీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాలు, నోరులేని జంతువులనూ గుద్దేస్తున్నారు. రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో.. మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతో కాంక్రీట్ జంగిల్‌ల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న.. చైతన్య గుండ్లూరి.. వినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన చైతన్య మూగజీవాల పరిరక్షణకు ఏకంగా ఓ ఎన్జీవోని స్థాపించారు. వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్న కుక్కలకు ఫ్లోరోసెంట్ ట్యాగ్లు, బెల్టులు అమర్చి కాపాడుతున్నారు. చైతన్య మాట్లాడుతూ..‘‘ నా పనిలో భాగంగా నేను ఎక్కువ సమయం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయంలో పలుమార్లు వేగంగా దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు చనిపోవడం చూసేవాడిని. అంతేగాకుండా నాకెంతో ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్ ఒక కుక్కను తప్పించబోయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. దీంతో రోడ్డు మీద తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుపడకుండా, ఇంకా అవి బిక్కుబిక్కుమంటూ తిరగకుండా ఉండేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్‌లో ప్లోరోసెంట్ ట్యాగ్‌లను కుక్కలు, ఆవులు, గేదెల మెడలో వేయడం ప్రారంభించాం. రాత్రి సమయంల్లో అవి రోడ్ల మీదకు వచ్చినా డ్రైవింగ్ చేసేవారికి క్లియర్‌గా కనిపిస్తాయి. దీంతో యాక్సిడెంట్లు అవ్వవు. ఫ్లోరోసెంట్ పదార్థంతో తయారైన ఈ ట్యాగ్‌లపై లైట్ పడగానే మెరుస్తాయి. దీంతో దూరం నుంచే ఎదురుగా జంతువు ఉన్నట్లు గుర్తించి వాహనం స్పీడు తగ్గించి పక్క నుంచి వెళ్లిపోతారు. దీని వల్ల ఇటు మూగజీవాలకు, అటు వాహనదారులకు ఏ ఇబ్బంది ఉండదు’’ అని చైతన్య చెప్పాడు. ప్రస్తుతం చైతన్య ఎన్జీవో ఆరు రాష్ట్రాలో చురుకుగా పనిచేస్తోంది. 36 నగరాల్లో 270 మంది వలంటీర్లు మూగజీవాలను రక్షిస్తున్నారు. రోజుకి దాదాపు 200 కుక్కలకు ట్యాగ్లు వేస్తున్నారు. ఇలా రోజూ జంతువులకు ట్యాగ్లు, ఫ్లోరోసెంట్ బెల్టులు వేయాలంటే భారీసంఖ్యలో అవి అవసరమవుతాయి. అందుకే గ్రామాల్లోని స్మాల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ గ్రూపులతో వీటిని తయారు చేయిస్తూ.. వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. -
ఇలా చేస్తే అడవి అంటుకోదు!
నాగర్‌కర్నూల్: అనుకోకుండా అడవులకు నిప్పు అంటుకుంటే జరిగే నష్టం ఊహించలేనిది. కేవలం వృక్ష సంపదనే కాకుండా అడవుల్లో పెరిగే పశుపక్షాదులు, జంతువులను కూడా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతియేటా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా మంటలు చెలరేగి కొంత మేర నష్టం కలుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రతి వేసవిలో శ్రీశైలం వెళ్లేదారిలో అక్కడక్కడా కొంత మంది పర్యాటకులు, సమీప గ్రామాలకు చెందినవారు పశువులను మేపే సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల మంటలు పుట్టుకురావడంతో వాటిని ఆర్పేందుకు అధికారులు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అసలే వేసవిలో రాలిన ఆకులు ఎండిపోయి ఉండడంతో వేగంగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈసారి అటవీ శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా పొంచి ఉన్న అటవీ ప్రాంతాల్లో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేసి అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుగా అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇది 2,611.39 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా ఇందులో 2,166.37 చదరపు కిలోమీటర్లు అభయారణ్యం కాగా, 445.02 చదరపు కిలోమీటర్లు బఫర్‌జోన్‌గా ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా అగ్గి రాజుకుంటే మంటలు వ్యాపించకుండా ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. 3 మీటర్లు, 5 మీటర్ల వెడల్పుగా ఉండే ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. కేవలం నల్లమల్ల అభయారణ్యం మాత్రమే కాకుండా అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, అమ్మాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మొత్తం 1,200 కిలోమీటర్ల మేరకు ఈ ఫై¯ర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా శ్రీశైలం వెళ్లేదారిలో పర్యాటకులు రోడ్డు పక్కన సేద తీరడానికి, భోజనాలు చేసేందుకు దాదాపు 222 కిలోమీటర్ల మేర వీవ్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నల్లమల పరిధిలో ఎక్కడైనా మంటలు అంటుకుంటే వాటిని ఆర్పేందుకు వెంటనే అక్కడికి చేరుకునేలా 6 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో 5 మంది సిబ్బంది ఉండగా వారికి ఒక వాహనంతోపాటు మంటలను ఆర్పేందుకు ఆధునిక యంత్రాలను అందించారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉండే ఆయా గ్రామాలకు సంంధించిన ప్రజలు పశువులను మేపేందుకు అడవుల్లోకి వెళ్లి ధూమపానం చేసేందుకు అగ్గిరాజేయడం, వాటిని ఆర్పకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా అడవికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడవిలో అగ్ని ప్రమాదాలతో జరిగే నష్టాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. ప్రతిఏటా రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉండగా ఈసారి అధికారులు తీసుకునే చర్యలు ఎంతమేర ఫలిస్తాయో వేచిచూడాలి. అవగాహన కల్పించాం.. అడవిలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్నిరకాలుగా రక్షణ చర్యలు చేపడుతున్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా నిప్పంటుకుంటే వెంటనే అక్కడికి చేరుకుని ఆర్పేలా 6 ప్రత్యేక ఫైర్‌టీంలను ఏర్పాటు చేశాం. అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కూడా ఈ విషయమే అవగాహన కల్పించాం. - కృష్ణగౌడ్, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ అమ్రాబాద్, అడవీ ప్రాంతం, ఎండకాలం, మంటలు, రిజర్వ్‌లు, అవగాహన -
కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!
(వెబ్ స్పెషల్): రేపిస్టుల పాలిట సింహ స్వప్నం, బ్రహ్మాస్త్రమంటూ ‘నిర్భయ’ చట్టాన్ని తెచ్చుకున్నాం.. ఖబడ్దార్... అత్యాచారం చేస్తే మరణ శిక్షే అన్నాం.. ఎన్కౌంటర్లూ చూశాం.. కానీ ఏం జరిగింది. చరిత్ర పునరావృతమైంది. ఘోరాతి ఘోరంగా.. మరింత హేయంగా...దిగ్భ్రాంతికరంగా.. పుణ్య భారతంలో మరో నిర్భయ బలైపోయింది. పసిగుడ్డునుంచి 90 ఏళ్ల వృద్దురాలి దాక, ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధితులను కూడా విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్య దేశంలో హత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంది. ఇపుడు ఏకంగా పోలీసులే సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేశారు. ఇదీ మన నవభారతం. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన 2012 నిర్భయ ఘటనతో వచ్చిన ‘నిర్భయ’ చట్టం తరువాత హత్యాచారాలకు ఏమాత్రం అడ్డకట్ట పడటం లేదు. బాధితులకు ముప్పు పెరిగిందే తప్ప తగ్గలేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా అత్యాచారాలు ఆగలేదు సరికదా గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్, జమ్మూకశ్మీర్ కథువా, తెలంగాణాలో దిశ, మరో దళిత మహిళ.. ఇలా దేశంలో పలు హత్యాచార ఘటనలు మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో అమానుష ఘటన ఆందోళన పుట్టిస్తోంది. తల్లితో కలిసి పొలాలకు వెళ్లిన 19 ఏళ్ల దళిత బాలికను ఎత్తుకెళ్లి ఆధిపత్య కులానికి చెందిన నలుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారం, తీవ్ర చిత్రహింసల పాలు చేశారు. ఏకంగా నాలుక కోసేశారు. ఇక ఈ హింస తన వల్ల కాదంటూ ఈ లోకం నుంచి నిష్ర్రమించింది బాధితురాలు. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వ్యవహారంలో యోగి సర్కార్ వైఖరి మరువక ముందే మరో అమానుష ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అతిదారుణమైన పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం చివరి చూపు దక్కుకుండా, ఈ తంతును ముగించడం వెనక అంతర్య మేమిటి? తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఆ తరువాత రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా బాధితురాలి శవ దహనం చేయడం ఎవరిని రక్షించడానికి? కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, బయటకు రాకుండా పోలీసులు ఎందుకు వ్యవహరించాలి? పోలీసుల రక్షణ వలయంగా ఏర్పడి మరీ ఈ దారుణానికి పాల్పడిన దృశ్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దోషులను కాపాడేందుకు, సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే ఇలా చేశారా? ఈ ప్రశ్నలకు అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'నిర్భయ' నిందితుల ఉరికోసం ఆరాటపడిన బీజేపీ అధినాయకత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి. మరీ ముఖ్యంగా మైనర్ బాలికలను, కూలి పనులకు వెళ్లిన దళిత బలహీన వర్గాల అమ్మాయిలే లక్ష్యంగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. బేటీ బచావో నినాదాన్ని అపహాస్యం చేస్తూ పైశాచికత్వంతో అన్నెంపున్నెం ఎరుగని పసివాళ్లను, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, మరింత రాక్షసంగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. చంపేస్తామనే బెదిరింపులు, హత్యలూ పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు భయంతో మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి...విషయం బయటికి చెబితే బయటపెడతాం అంటూ.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తీరని అవమానంతో, సమాజానికి భయపడి చాలామంది బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడంలేదు. చాలా కేసుల్లో దర్యాప్తుల జాప్యంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. మరోవైపు నేరస్తులతో పోలీసు అధికారులు కుమ్మక్కవ్వడం, బేరసారాలు, ఒప్పందాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2012లో రోజుకు 68 అత్యాచార సంఘటనలు రికార్డయ్యాయి. 2013లో ఈ సంఖ్య 92కు పెరిగింది. 2014లో 100, 2016లో రోజుకు 106 కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా అత్యాచార కేసులు నమోదు కావడం లేదు. తాజాగా హత్రాస్‌లో సామూహిక హత్యాచార ఘటన అమ్మాయిల భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది. హైదరాబాద్ దిశ కేసు మాదిరిగానే తక్షణ న్యాయం కావాలని, నేరస్థులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ‘చట్టం’ తన పని చేస్తోందా? అత్యాచారం, కిడ్నాప్ లాంటి ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి అనేక నిదర్శనాలు వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్ల కనిపించడం లేదు అనగానే వారినోటి నుంచి ముందు "లేచిపోయిందేమో.. రెండు రోజుల్లో వస్తుంది.. లేదంటే ఏదైనా శవం దొరికితే కబురు చేస్తాం'' అనే మాటలే వినిపిస్తాయి. చాలా కేసుల్లో ప్రాథమింగా ఎదురవుతున్న ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వ్యవహారం కాస్తా తీవ్రంగా మారి మేలుకొనే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనికితోడు నిర్భయ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షలు పడే అవకాశముంది. కఠిన శిక్షలు పేరుతో కొందరు పోలీసు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనీ, నిందితులతో లాలూచీ పడుతున్నారనీ పలువురు మానవహక్కుల నేతలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బలహీన సెక్షన్లతో కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారనీ, భారీ ముడుపులు అందుకొని కేసులను నీరు గారుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. సమాజంలో స్త్రీలను ఒక పౌరురాలిగా కాకుండా కేవలం సెక్స్ సింబల్ గా, విలాస వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకూ, చట్టాలు, పోలీసులు సక్రమంగా తమ విధి తాము నిర్వర్తించనంతవరకు, పాలకులు ప్రజలు, మహిళల భద్రత పట్ల చిత్తశుద్ధిగా ఉండనంతవరకూ ఈ అమానుష హింసాకాండ కొనసాగుతూనే ఉంటుంది. -
‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’
ముంబై : ముంబై పోలీస్ అధికారి చేసిన ఓ పని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా. నెలలు నిండని ఓ పసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్ కోలేకర్ అనే వ్యక్తి ముంబైలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు విధులకు వెళ్తుండగా.. 14 రోజుల శిశువు ప్రమాదవశాస్తు సేప్టీ పిన్ను మింగేసింది. రోడ్డుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల నుంచి విషయం తెలుసుకున్న కోలేకర్ చిన్నారిని ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబానికి సహాయం చేశాడు. తన సొంత వాహనంలో చిన్నారిని సమయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందిచి సేఫ్టీ పిన్ను బయటకు తీశారు. (టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే ) ఈ విషయాన్ని ముంబై పోలీసులు గురువారం ఉదయం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ‘సెల్యూట్ ముంబై పోలీస్...మీ మీద మాకున్న గౌరవం మరింత పెరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (గుడ్‌న్యూస్: నెలాఖరుకు కోవిడ్-19 డ్రగ్ ) When in doubt, find your nearest cop! A 14 day old baby was choking on a safety pin he had accidentally swallowed. PC S.Kolekar spotted the worried parents on the road & rushed the kid to KEM using his own vehicle, where the child received timely treatment.#MumbaiFirst pic.twitter.com/yCVNxFQKvW — Mumbai Police (@MumbaiPolice) June 18, 2020 -
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధను ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై పెట్టడం లేదని, కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వలస కార్మి కులు ఎంతమంది ఉంటారో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకపోవడం ఆశ్చ ర్యంగా ఉందని, కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పరిపాలనలోనూ, రైతుల పంటలను కొనుగోలు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో చేపట్టిన ఒక రోజు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్న ఉత్తమ్ మాట్లాడుతూ...ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయన్నారు. వలస కార్మికుల కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామని ప్రభుత్వం చెపుతోందని, అవి ఎక్కడ ఉన్నాయనే వివరాలు కూడా లేవన్నా రు. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వలస కార్మికులు ఊళ్లకు వెళ్లేందుకు రైల్వే శాఖ రూ.50 వసూలు చేస్తోందని, వారి వద్ద డబ్బులు వసూలు చేయవద్దని, కాంగ్రెస్ పార్టీ ఆ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో వైన్ షాపుల విషయంలో అత్యుత్సాహం చూపవద్దని ఉత్తమ్ కోరారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాద వ్, టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు బెల్లయ్య నాయక్, దాసోజు శ్రవణ్, మేడిపల్లి సత్యం తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, టీపీసీసీ నేతలు నిరంజన్, బొల్లు కిషన్, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, మానవతారాయ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కాగా, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కుసుమ కుమార్, మల్లు రవి తదితరులు వారి ఇళ్లల్లో దీక్షలు చేశారు. -
కరోనా కట్టడి ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ, కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటున్నారు. యాచకుల తాత్కాలిక పునరావాసం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. యాచకులను తెచ్చి తాత్కాలిక బసలో ఉంచారు. ఆపై పట్టించుకోకపోవడంతో యాచకులంతా ఇష్టానుసారం తిరిగారు. ఉంచింది ఓ మైదానం కావటంతో కొందరు యువకులు అలవాటుగా అక్కడ జాగింగ్ చేశారు. అంతలో యాచకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలటంతో ఆ చుట్టుపక్కల ఉండే వారందరిలో ఇప్పుడు భయం మొదలైంది. జీహెచ్ఎంసీ అధికారులు తీరిగ్గా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ అంటూ ప్రకటించి హడావుడిగా కట్టడి చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం అత్తాపూర్ తదితర ప్రాంతాల్లోని 50 మంది యాచకులను జీహెచ్ఎంసీ సమీకరించి విజయనగర్ కాలనీలోని మున్సిపల్ ఫుట్‌బాల్ మైదానంలో ఆశ్రయం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అక్కడుంచిన యాచకులను అధికారులు గాలికొదిలేశారు. పగటివేళ ఆ యాచకులు సమీపంలోని ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ యాచిస్తూ వచ్చారు. తిరిగి సాయంత్రం మైదానానికి చేరుకునేవారు. జీహెచ్ఎంసీ సిబ్బంది భోజన వసతి కల్పించినా, కొందరు సొంతంగా వండుకోవటం ప్రారంభించారు. రాత్రి పడుకునే సమయంలో తప్ప యాచకులు మిగతా ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోనే తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితిలో కచ్చితంగా మాస్కు ధరించాల్సి ఉన్నా, యాచకులకు జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని అందించలేదు. దాదాపు యాభై మంది సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తుండటంతో జనం బిత్తరపోయారు. ఒకేసారి ఇంతమంది యాచకులు కొత్తగా కనిపిస్తున్నారంటూ కొంత ఆందోళనకు కూడా గురయ్యారు. ఇక మైదానంలోని బోరు పంపు వద్ద వారు స్నానాలు చేస్తూ, దుస్తులు ఉతుక్కోవటంతో కొన్ని రోజుల పాటు ఆ మురుగునీరు కాలనీలో ఇళ్ల ముందు కాలువకట్టింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు చేతులు కాలాక.. యాచకుల బృందంలోని ఓ వృద్ధురాలికి కరోనా పాజి టివ్ వచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఆ బాధితురాలి తోనే కలిసి ఉన్న మిగతావారి పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు వెంటనే అందరి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. మైదానంలో రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇన్ని రోజులు బాధితురాలు సహా మిగ తా యాచకులు వాటినే వాడారు. కలిసి తిన్నారు, ఒకేచోట పడుకున్నారు. ఆ ప్రాంతాలన్నీ కలియదిరిగారు. యాచకులకు ఆ మైదానాన్ని షెల్టర్ చేసి అక్కడే భోజ నాలు అందిస్తున్నప్పుడు వారు వెలుపలికి రాకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడే వైద్య పరీక్షలు చేసి ఉం టే, కరోనా బాధితులుంటే వెంటనే తేలేది. కానీ, అదే మీ జరగలేదు. ఈలోగా, ఇన్ని రోజులపాటు వారు బస్తీలు, కాలనీల్లో తిరగటం, వారు మైదానంలో ఉండగానే అక్కడ కొందరు యువకులు అటవాటు ప్రకారం జాగింగ్ చేయటం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. అంతా అయ్యాక శుక్రవారం మైదానానికి రెండు వైపులా కంటైన్మెంట్ జోన్ అని రాసి ఉన్న హెచ్చరికలను ఏర్పాటు చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది ట్యాంకర్ సాయంతో మైదానం మొత్తం రసాయన జలాలను పిచికారీ చేశారు. ఏంటీ సంగతి అని ఆరాతీస్తే, అప్పుడుగాని మైదానంలో ఉన్న యాచకురాలికి వైరస్ సోకిందన్న సంగతి స్థానికులకు తెలియలేదు. -
ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్ టన్నెల్‌ను డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ పరికరాన్ని ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. -
ప్రమాదాలకు దూరంగా...
ఒకపక్క వానలు బాగా పడ్డాక... మరో పక్క ఈశాన్య రుతుపవనాలు రాబోయే ముందర వచ్చే పండగ దీపావళి. అంటే రెండు వానల సీజన్ల మధ్య ఇది వస్తుంది . ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. దాంతో ఇళ్లన్నీ చెమ్మతో నిండి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఇంటికి వెల్ల/సున్నం వేశారనుకోండి. అప్పుడా సున్నం ప్రభావంతో ఇంట్లోని హాని చేసే సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అంతేకాదు... వెంటనే రాబోయే ఈశాన్య రుతుపవనాల్లోని మరో చెమ్మ కాలంలో సైతం ఈ సున్నం ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనూ ఇల్లు సూక్ష్మ జీవుల నుంచి సురక్షితంగా ఉంటుంది. ఇక ఈ చెమ్మ సీజన్లో వేగంగా పెరిగిపోయే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేందుకు బాణాసంచా నుంచి వచ్చే పొగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఈ సీజన్లో టపాకాయలు కాలుస్తారు. వాటి నుంచి వెలువడే గంధకం, పొటాషియం వంటి వివిధ రసాయనాలు కీటకాలను, క్రిములను తుదముట్టించడమే కాదు... వాటి పెరుగుదలను చెమ్మతో నిండిన ఈ సీజన్ తగ్గే వరకు అరికడతాయి. అంతేకాదు... ఈ సీజన్లో పడ్డ విపరీతమైన వర్షాల వల్ల గుంతల వంటి వేర్వేరు చోట్ల, మనకు తెలియకుండానే వివిధ ప్రాంతాల్లో పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగీ విస్తరించాయి. ప్రత్యేకంగా ఈ సీజన్లో డెంగీతో పాటు చికన్‌గున్యా జతకట్టి మరింత విజృంభించింది. వర్షాలు పడ్డప్పుడువచ్చే ఈ సీజన్‌లోని వ్యాధుల నుంచి రక్షించడానికి, వ్యాధికారక క్రిములను తుదముట్టించడానికి ఈ బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవీ దీపావళి పటాసుల పాటిజవ్ అంశాలు. కానీ నాణేనికి మరో వైపు ఉన్నట్లే దీపావళి బాణాసంచాతో మరికొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెవులకు బాణాసంచా శబ్దాలు ఎంతో హాని చేస్తాయి. చెవుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీపావళి మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. గట్టి శబ్దాలతో అనార్థాలివే... ►గట్టి శబ్దాల వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్ సౌండ్ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్ సౌండ్. దాంతో ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఉదాహరణకు... అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. చెవిలో నొప్పి, గుయ్‌మనే శబ్దం వినిపిస్తూ ఉండటం. చెవి లోపల ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతినడం. కొన్ని సందర్భాల్లో చెవి నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు. ►ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. ►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల కలిగే స్టిమ్యులేషన్స్తో నొప్పులు వచ్చి నెలలు నిండటానికి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు బాణాసంచా శబ్దాల నుంచి దూరంగా ఉండాలి. ఇక వయోవృద్ధులు కూడా శబ్దాలతో ప్రభావితమవుతారు కాబట్టి వారూ దూరంగానే ఉండాలి. జాగ్రత్తలు: శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు కొందరు చెవిలో దూది పెటుకుంటారు. చెవిలో దూదివల్ల కేవలం 7 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉండే శబ్దాల నుంచి మాత్రమే రక్షణ లభిస్తుంది. టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. అందుకే ఈ శబ్దాల నుంచి రక్షించుకోడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్ వంటివి వాడటం మంచిది. ►పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకూడదు. ►శబ్దాల కారణంగా చెవి ప్రభావితమైనప్పుడు ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. వారు ఆడియోమెట్రీ వంటి పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ►పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
సురక్షిత దీపావళి
దీపావళి పండగ మనసుకే కాదు... దీపకాంతులతో కళ్లకూ పండగే. రంగురంగుల కాంతులీనుతూ వెలిగే బాణాసంచా, మతాబులు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ సంబరాలూ సంరంభాలూ కళ్లకు ప్రమోదమే గానీ ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. సురక్షితమైన దీపావళి వేడుకలతో మన కళ్లను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి. పనిలో పనిగా కళ్లతో పాటు ఒంటినీ సంరక్షించుకోండిలా. జాగ్రత్త ►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే. ►బాణాసంచా కేవలం లైసెన్స్డ్ షాప్‌లోనే కొనాలి. ►ఇంట్లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి. ►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి. ►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు. ►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. ►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. ►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు. ►కాల్చేసమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. ►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం. ►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి. ►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. ►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. ►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్). ►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు. ►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. ►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడి వస్త్రం ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు. ►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు. ►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు. ఐ కేర్ ►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం. ►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు. ►తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దానివల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు. ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి. ►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు. ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►వెలుగులు, రవ్వలతోపాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది. ►రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ►డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ►అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ►గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి. -
ఆస్పత్రిలో నియంత్రణ వ్యవస్థే లేదు..
-
రోగుల ప్రాణాలతో ఆస్పత్రుల ఆటలు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు వైద్యం అందించడంలోనే కాదు.. రోగులకు భద్రత ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుకోని ఘటనలు ఎదురైతే రోగులు, వారి బంధువులను కాపాడేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు ఉంటున్నాయి. అసలు అనేక ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థలే లేకుండా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఒక నెలల శిశువు మాడి మసై పోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో శిశువు కూడా చనిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని సమాచారం. ఆస్పత్రుల్లో కొరవడిన అగ్ని ప్రమాద నివారణ వైఫల్యానికి షైన్ పిల్లల ఆస్పత్రి ఘటన నిలువెత్తు సాక్ష్యం. తూతూమంత్రంగా విచారణ.. తాజా దుర్ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారణకు ఆదేశించారు. దీనిపై జిల్లా వైద్యాధికారి నుంచి ప్రాథమిక నివేదిక కూడా వచ్చింది. కానీ అందులో ఎటువంటి స్పష్టతా లేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి కారణాలు, వైఫల్యాలపై ఎటువంటి వివరాలూ ఇవ్వలేదు. మంటలార్పేందుకు అవసరమైన 50 వేల లీటర్ల సామర్థ్యం గల అండర్‌గ్రౌండ్ నీటి ట్యాంకు ఉండాల్సి ఉంటే, 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగినదే ఉందని తేల్చారు. ఇక సదరు ఆస్పత్రికి అసలు ఫైర్ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టి ఫికెట్) లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉందని వాదిస్తున్నారు. నియంత్రణ వ్యవస్థే లేదు.. రాష్ట్రంలో 8,807 రిజిస్టర్డ్ ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వాటిలో దాదాపు 2 వేల ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థ లేకుండానే నడుస్తున్నాయి. అనుమతులన్నీ సక్రమంగా ఉన్న తర్వాతే డీఎం హెచ్‌వోలు వాటికి లైసెన్స్‌లు ఇస్తారు. కొందరు జిల్లా వైద్యాధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి కళ్లుమూసుకుని ఎడాపెడా లైసెన్స్‌లు ఇస్తున్నారు. గ్రేటర్లో మరీ ఘోరం.. గ్రేటర్ పరిధిలోని చాలా ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఎన్వోసీ లేకుండానే నడుస్తున్నాయని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డీఎంహెచ్వోలు లంచాలకు అలవాటు పడి ఎడాపెడా అనుమతులు జారీ చేస్తున్నారని పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆస్పత్రుల్లో ఫైర్ ఎన్వోసీ లేకుండా లైసెన్స్‌లు ఇవ్వవద్దని, రెన్యువల్ చేయవద్దని సర్క్యులర్ జారీ చేశారు. అయితే చాలామంది డీఎంహెచ్వోలు ఇదేం పట్టించుకోవడం లేదు. అధ్వానంగా నిర్మాణాలు రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులు ఇరుకైన గదుల్లో ఉంటున్నాయి. అందులోనూ గాలీ వెలుతురు వచ్చే అవకాశం లేని కిటికీలు, అత్యవసర పరిస్థితి తలెత్తితే బయటకు వెళ్లలేని స్థితుల్లో ఆస్పత్రుల నిర్మాణాలుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే సాధారణ పౌరుల మాదిరిగా రోగులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆస్పత్రుల్లో అత్యంత ప్రత్యేకమైన నివారణ చర్యలు తీసుకోవాలి. షైన్ ఆస్పత్రిలో నెలల చిన్నారి ఎటు పరిగెత్తగలదు? ఎంతో కీలకమైన ఆస్పత్రుల్లో కనీస ప్రమాదం నివారణ చర్యలే లేవంటే ఎంత దారుణం? -
వీడిన కట్ట లోగుట్టు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్‌స్టాప్‌పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్‌మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్‌మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్‌గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్‌మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్‌మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్‌మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది. ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. 200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, మిడ్‌మానేరు ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు. గతంలో ఓసారి తెగిన కట్ట మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్‌మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం. -
స్కూలు బయట ఎవరిది బాధ్యత?
స్కూలు విద్యార్థుల భద్రతతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా దృక్పథం పెంచడానికి ఎస్టీసీ వ్యవస్థ ఉపకరిస్తుందని పలువురు ప్రశంసించారు. అయితే, 2011 జూన్‌లో ఢిల్లీలోని ఎన్సీఆర్సీలో ఓ పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ఎస్టీసీ విధానం బడి పిల్లల్ని వెట్టి చాకిరీకి వినియోగించడం కిందికే వస్తుందని, దాన్నినిషేధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. విచారించిన కమిషన్.. ఎస్టీసీ వ్యవస్థను రద్దు చేయాల్సిందిగా నగర ట్రాఫిక్ వింగ్‌ను ఆదేశించింది. దీనిపై పోలీసులు అప్పీల్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకుని ఎస్టీసీలుగా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఇదిఆచరణ సాధ్యం కాకపోవడంతో 2012 నుంచి కమెండోలకు బ్రేక్ పడింది.ఈ సమస్య తీరి మళ్లీ వ్యవస్థ ప్రారంభం కావాలంటే ట్రాఫిక్, ఆర్టీఏ, విద్యాశాఖలు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బడిపిల్లల భద్రత కోసం వీరు చొరవ చూపితే వచ్చే ఏడాదికైనా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సాక్షి, సిటీబ్యూరో: భావి పౌరులు, దేశానికి వెన్నెముక అయిన బడి పిల్లల భద్రతకు నగర ట్రాఫిక్ విభాగం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వీరిని తరలించే వాహనాలు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. పాఠశాలలకు వెళ్లి మరీ రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అత్యంత కీలకమైన రెండు అంశాలపై మాత్రం అధికార గణం దృష్టి పెట్టట్లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల క్రితంబ్రేక్ పడిన ‘స్కూల్ ట్రాఫిక్ కమాండోస్’ (ఎస్టీసీ) వ్యవస్థ ఒకటైతే.. పాఠశాలల ప్రారంభ–ముగింపు వేళలు మార్చే ‘స్టాగరింగ్ ఆఫ్ స్కూల్ టైమింగ్స్’ రెండోది.రవీంద్రభారతి వేదికగా స్టాగరింగ్ విషయమై ఏళ్లుగా చర్చిస్తున్నా అమలు మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. బడి పిల్లల భద్రత అంటే స్కూల్ బస్సుల ఫిట్నెస్ టెస్ట్‌లు, ఆటోల్లో ఆరుగురే అనే భావనలో ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగం అధికారులు ఉన్నారు. మరోపక్క స్కూలు పరిసరాలు దాటితే విద్యార్థుల భద్రత తమది కాదన్నట్లు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. పాఠశాల ప్రారంభ–ముగింపు వేళల్లో రోడ్డు క్రాసింగ్, వాహనాలు ఎక్కిదిగేప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. దీంతో నగర ట్రాఫిక్ అధికారులు 11 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన విధానమే ‘స్కూల్ ట్రాఫిక్ కమెండో’ (ఎస్టీసీ) వ్యవస్థ. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ విధానంలో అటు పిల్లల భద్రతతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందే అవకాశం ఉందంటూ అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. అయితే, 2011లో నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషనర్ (ఎన్సీఆర్సీ) ఎస్టీసీ విధానానికి బ్రేక్ వేసింది. దీంతో అప్పటి నుంచి వీరి ఎంపిక, శిక్షణ వంటి కార్యక్రమాలు ట్రాఫిక్ వింగ్ చేపట్టలేదు. పాఠశాల ప్రాంగణం, పరిసరాల్లో బడి పిల్లల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం అమల్లోకి వచ్చిన ఎస్టీసీ విధానం అటకెక్కింది. ఎస్టీసీ వ్యవస్థ పనితీరు ఇలా.. ప్రతి పాఠశాల నుంచి 8, 9 తరగతులకు చెందిన 24 మంది విద్యార్థులను యాజమాన్యం ఎంపిక చేసి ఆ జాబితాను ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చేది. అలా మొత్తం 6,720 మందిని ఎంపిక చేసి వీరికి ఆ పాఠశాలలోనే ట్రాఫిక్ నిబంధనలపై ప్రాథమిక శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌టీసీల నైపుణ్యాన్ని పరిశీలిస్తూ వారితో పరేడ్ నిర్వహించి ట్రాఫిక్ విభాగం అధికారులే స్వయంగా రిఫ్లెక్టివ్ జాకెట్, విజిల్ తదితర ఉపకరణాలను ఇచ్చేవారు. ఈ 24 మందిలో రోజుకు నలుగురు చొప్పున పాఠశాల ప్రారంభ, ముగింపు వేళల్లో స్కూల్ ప్రాంగణంతో పాటు ఎదురుగా ఉండే రోడ్ల మీద విధులు నిర్వర్తించేవారు. ఈ నలుగురికి వారానికి ఒకసారి మాత్రమే విధులు ఉండేవి. వీరికి స్థానిక ట్రాఫిక్ పోలీసులు, పాఠశాలకు చెందిన సెక్యూరిటీ గార్డులు సహకరించేవారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండేది. రెండేళ్ల పాటు సాగిన ఈ విధానంలో చిన్న అపశృతి కూడా జరగలేదు. అమలుకాని ‘బడి వేళల మార్పు’ విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు సమయాల్లో వెల్లువెత్తుతున్న రద్దీ, తలెత్తుతున్న ట్రాఫిక్ ఇక్కట్లకు, జరిగే ప్రమాదాలకు విరుగుడుగా ట్రాఫిక్ పోలీసులు ఒకప్పుడు ప్రారంభించిన ‘బడి వేళల మార్పు’ (స్కూల్ టైమింగ్స్ స్టాగరింగ్) విధానం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మూలనపడింది. 2010లో పాక్షికంగా అమలైన ఈ విధానాన్ని 2011లో పూర్తి స్థాయిలో అమలు చేశారు. సత్ఫలితాన్నించిన ఈ విధానాన్ని మరింత పటిష్టంగా, సమర్థమంతంగా అమలు చేయాలని భావించారు. అయితే, అప్పటి నుంచి ఇది ఇంకా నివేదికల స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా ‘వేళల మార్పు’ దాదాపు మరుగునపడిపోయింది. ఎస్‌టీసీల విధులు ఇవీ.. ♦ పాఠశాల ప్రారంభానికి అరగంట ముందు వచ్చి, పూర్తయిన తర్వాత అవసరమైనంత సేపు ఉండి స్కూల్ ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలి. ♦ పాఠశాలకు సంబంధించిన సైకిళ్లు, మోటారు సైకిళ్ల పార్కింగ్‌కు నిర్దేశిస్తూ రోడ్లపై ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూడాలి. ♦ స్కూల్‌కు చెందిన లోయర్ క్లాస్ విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా రోడ్డు దాటడంతో సహకరించాలి. ♦ స్కూల్ వాహనాలు/ప్రైవేట్ వాహనాల్లో చిన్న పిల్లలు ఎక్కడానికి, రోడ్డు క్రాస్ చేయడానికి సహకరించాలి. ♦ పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చే వాహనాలు వారిని స్కూల్ లోపల దింపేలా చర్యలు తీసుకోవాలి. ♦ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్టీసీలతో పాటు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి రివార్డులు అందేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని భావించారు. పెరుగుతున్న స్కూల్జోన్స్ నగరంలో ప్రస్తుతం స్కూల్ జోన్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ట్రాఫిక్ అధికారుల అధ్యయనంలో తేలింది. పాఠశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని స్కూల్ జోన్‌గా పరిగణిస్తారు. ఒకప్పుడు కేవలం గోపాలపురం, అబిడ్స్, బంజారాహిల్స్లే ఈ జాబితాలో ఉండేవి. ఇప్పుడు జూబ్లీహిల్స్, నారాయణగూడ, ఎస్సార్‌నగర్, మైత్రీవనం, బేగంపేట్, తిరుమలగిరి, ఆసిఫ్‌నగర్ వంటివి కూడా స్కూల్ జోన్స్‌గా మారాయి. ఏ ఏటికేడాది కొత్త పాఠశాలలతో పాటు స్కూల్ జోన్స్ పుట్టుకువస్తున్నాయి. 2011లో గుర్తింపు పొందిన స్కూళ్ల సంఖ్య 3,035 ఉంటే ఆ సంఖ్య 2012 నాటికి 3,218కి చేరింది. అంటే ఏడాదికి 183 స్కూళ్లు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం స్కూళ్ల సంఖ్య 3,500 దాటింది. రానున్న రోజుల్లో ప్రజల అవసరాన్ని బట్టి ఇవి పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్టీసీలను మరింత సమర్థంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఎన్సీఆర్సీ ఉత్తర్వులతో నిలిచిపోయాయి. ‘కేటగిరీలూ’ రూపొందించారు స్కూలు వేళల్లో మార్పును 2011లోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్ విభాగం దానికి అవసరమైన ప్రాథమిక కసరత్తు కూడా చేసింది. స్కూల్ జోన్స్‌ను వివిధ కేటగిరీగా మార్చి జాబితాలు సైతం రూపొందించారు. విద్యా సంస్థల పనివేళల మార్పు కోసం నగర వ్యాప్తంగా అధ్యయనం చేసిన ట్రాఫిక్ వింగ్ కేటగిరీలుగా విభజించింది. ఈ సంఖ్య ఆధారంగా సంస్థల పనివేళల్లో కనీసం 15 నిమిషాల వ్యత్యాసం ఉండేలా చర్యలు తీసుకున్నారు. 500 నుంచి 750 మీటర్ల విస్తీర్ణంలో 8 కంటే ఎక్కువ స్కూల్స్ ఉంటే ‘ఏ’, ఈ విస్తీర్ణంలో 5 నుంచి 7 స్కూళ్ల మధ్య ఉంటే ‘బి’, 3 లేక 4 స్కూళ్లు ఉంటే ‘సి’ అంటూ గ్రేడింగ్ ఇచ్చిచ్చారు. ఈ ఏడాది దీన్ని సినిమా హాళ్లు, ప్రైవేటు కార్యాలయాలకు సైతం అమలు చేయాలని భావించినా ఆచరణలోకి రాలేదు. ఏటా రవీంద్రభారతి కేంద్రంగా జరిగే ‘బడిపిల్లల భద్రత’ సదస్సులో ఈ అంశంపై చర్చ జరుగుతున్నా చర్యలు మాత్రం ఉండట్లేదు. కమిటీలు ఏర్పాటైతేనే మేలు.. స్కూలు/కాలేజీల సమయాల్లో మార్పు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ట్రాఫిక్ విభాగానికి లేదు. దీని కోసం తొలుత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా కొత్తగా ఏర్పడిన స్కూల్ జోన్లను గుర్తించాలి. డీఈఓ సహకారంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ట్రాఫిక్ ఏసీపీ, స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలి. వీరంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యా సంస్థలు, ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేస్తారు. ఆపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించి స్టాగరింగ్ విధానాన్ని రూపొందిస్తారు. వీటిని ఏర్పాటు చేయాలని గతంలో ట్రాఫిక్ వింగ్ ప్రయత్నాలు ప్రారంభించినా విద్యాశాఖ నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా విద్యాసంస్థల ప్రారంభ–ముగింపు వేళలు దాదాపు ఒకేలా ఉండటంతో విద్యార్థులను తరలించే, వ్యక్తిగత వాహనాల కారణంగా తీవ్రమైన రద్దీ ఉంటోంది. సమయం మించిపోకుండా గమ్యస్థానాలకు చేరే తొందరలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. -
డేటా భద్రతకు ‘గూగుల్’ నూతన ఫీచర్లు
న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ కీత్ ఎన్రైట్ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు. క్రోమ్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
భద్రత కట్టుదిట్టం
ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో తొలివిడతగా పోలింగ్ పూర్తయిన జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారాను కట్టుదిట్టం చేశారు. ఒంగోలుకు శివారులోని పేస్ ఇంజినీరింగ్ కళాశాల, రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీంఎలను భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్, ఎస్పీలే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మే 22వ తేది వరకు తహశీల్దార్లకు పర్యవేక్షణ బా«ధ్యతలను అప్పగించారు. వీరు మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు పని చేయాలి. వీరితో పాటు విధుల్లో ఉన్న భద్రతా దళాల విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు కోఆర్డినేటింగ్ అధికారులుగా ఆర్మ్‌ర్డ్ రిజర్వు అధికారులను నియమించారు. మూడంచెల్లో భద్రత నిర్వహించాలి. వాహనాలను బయటే నిలపాలని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లకు రెండు తాళాలు..ఒకటి కలెక్టర్ దగ్గర.. మరొకటి రిటర్నింగ్ అధికారి వద్ద ఉంచాలి. స్ట్రాంగ్ రూమ్ ద్వారం కన్పించేలా సీసీ కెమెరాలు సాయుధ బలగాల గస్తీ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, ఎస్పీ ఆకస్మికంగా స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు తహశీల్దార్లను నియమించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిర్వహించే విధంగా నిర్ణయించారు. ఈ షిఫ్ట్‌లకు నియమించిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. పేస్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లకు.. ♦ ఏప్రిల్ 26వ తేదీ చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్.రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 27వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, ఎస్‌ఎన్‌పాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 28వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారిగా డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 29వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 30వ తేదీ: కొరిశపాడు, సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ మే 1వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 2వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 3వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 4వ తేదీ: చినగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 5వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, ఎస్ఎన్ పాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 6వ తేదీ: మార్టూరు,కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు.పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 7వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, ఆర్.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 8వ తేదీ: కొరిశపాడు, ఎస్ఎన్ పాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈశ్వరరెడ్డి, పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 9వ తేదీ నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అ«ధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 10వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావు. ♦ 11వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 12వ తేదీ: చిన్నగంజాం,మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 13వ తేదీ: వేటపాలెం, సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ జె.రాజారావు. ♦ 14వ తేదీ: మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 15వ తేదీ: కారంచేడు, చిన్నగంజాం, నాగులుప్పలపాడు తహశీల్దార్లు కేవీ శశికుమార్, కె.రామాంజనేయులు, బి.సోమ్లానాయక్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 16వ తేదీ: కొరిశపాడు,సంతనూతలపాడు, వేటపాలెం తహశీల్దార్లు ఐ.ఈ«శ్వరరెడ్డి, డి.పద్మనాభుడు, షేక్ గౌస్‌బుడే సాహెబ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్.ఐ జె.రాజారావు. ♦ 17వ తేదీ: నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్టూరు తహశీల్దార్లు బి.సోమ్లానాయక్, వి.కృష్ణారావు, ఆర్.మల్లేశ్వరరావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 18వ తేదీ: సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చిన్నగంజాం తహశీల్దార్లు డి.పద్మనాభుడు, బి.సోమ్లానాయక్, ఆర్.రామాంజనేయులు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 19వ తేదీ: సంతమాగులూరు, వేటపాలెం, కొరిశపాడు తహశీల్దార్లు కె.నెహ్రూబాబు, షేక్ గౌస్‌బుడే సాహెబ్, ఐ.ఈశ్వరరెడ్డి. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ రాజారావు. ♦ 20వ తేదీ: చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు తహశీల్దార్లు ఆర్.రామాంజనేయులు, ఆర్.మల్లేశ్వరరావు, కేవీ శశికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జి.పూర్ణచంద్రారెడ్డి. ♦ 21వ తేదీ: వేటపాలెం,సంతమాగులూరు, సంతనూతలపాడు తహశీల్దార్లు షేక్ గౌస్‌బుడే సాహెబ్, కె.నెహ్రూబాబు, డి.పద్మనాభుడు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ సీఐ ఎండీ మొయిన్. ♦ 22వ తేదీ:మార్టూరు, కొరిశపాడు, మద్దిపాడు తహశీల్దార్లు ఆర్.మల్లేశ్వరరావు, ఐ.ఈశ్వరరెడ్డి, వి.కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీసీ ఆర్ఐ జె.రాజారావులను నియమించారు. రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ♦ 26వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 27వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 28వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్.రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 29వ తేదీ: హెచ్ఎం పాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 30వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ మే 1వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్, జి.నాంచారయ్య, బీకేఎం ఐయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 2వ తేదీ: తర్లుపాడు,కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.వరకుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 3వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వీవీ రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 4వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందకుమార్, సి.రవీంద్రబాబు.పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీ.ఎక్స్.అజయ్‌కుమార్. ♦ 5వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 6వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 7వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటరత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 8వ తేదీ: తాళ్లూరు,ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 9వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.వరకుమార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీసీఐ కె.రవికిరణ్. ♦ 10వ తేదీ: దోర్నాల, పొదిలి,కనిగిరి తహశీల్దార్లు వీవీఎం రామకృష్ణ , ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 11వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 12వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల,టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎన్.రవీంద్రనాథ్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ రవికిరణ్. ♦ 13వ తేదీ:హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 14వ తేదీ: పామూరు,కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకటత్నం, ఎస్.కె.జాన్‌సైదా, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 15వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకే సధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకెఎం ఐయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 16వ తేదీ: తర్లుపాడు, కొండపి, సింగరాయకొండ తహశీల్దార్లు టి.శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఎస్.రవకుమార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 17వ తేదీ: దోర్నాల, పొదిలి, కనిగిరి తహశీల్దార్లు వవీఎం రామకృష్ణ, ఎస్.కె.హమీద్, కె.రాజ్‌కుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ పి.పరంధామయ్య. ♦ 18వ తేదీ: వీవీపాలెం, లింగసముద్రం, గుడ్లూరు తహశీల్దార్లు జి.సిద్ధార్ధ, జి.ఆనందరావు, సి.రవీంద్రబాబు. పోలీసు అధికారి డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 19వ తేదీ: పీసీపల్లి, వెలిగండ్ల, టంగుటూరు తహశీల్దార్లు ఎస్.సత్యన్నారాయణ, టి.కోటేశ్వరరావు, ఎణ్.రవీంద్రనాధ్. పోలీసు అధికారి వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ 20వ తేదీ: హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, మర్రిపూడి తహశీల్దార్లు ఎస్.రామలింగేశ్వరరావు, శ్రీనివాసులు, వి.రవికుమార్. పోలీసు అధికారి ఒంగోలు సీసీఎస్ సీఐ కె.రవికిరణ్. ♦ 21వ తేదీ: పామూరు, కురిచేడు, పొన్నలూరు తహశీల్దార్లు వెంకట రత్నం, ఎస్.కె.జాన్ సైదులు, ఎంవీ కృష్ణారావు. పోలీసు అధికారి ఒంగోలు డీటీఆర్బీ సీఐ కె.రవికిరణ్. ♦ 22వ తేదీ: తాళ్లూరు, ముండ్లమూరు, యర్రగొండపాలెం తహశీల్దార్లు ఎంవీకె సుధాకర్‌రావు, జి.నాంచారయ్య, బీకేఎం అయ్యంగార్. పోలీసు అధికారి ఒంగోలు వీఆర్ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్. ♦ స్ట్రాంగ్ రూమ్‌ల విధులకు కేటాయించిన వారిని సమన్వయం చేసుకోవడానికి జిల్లా అధికారులను నియమించారు. పేస్ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌ల పర్యవేక్షణకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అదెయ్య, స్టెప్ సీఈవో బి.రవి, మెప్మా పీడీ సింగయ్య, డీఈవో సుబ్బారావు, పీఆర్ ఎస్ఈలను నియమించారు. అలాగే రైస్ ఇంజినీరింగట్ కళాశాలకు ఎస్ఎస్ఏ పీవో వెంకటేశ్వరరావు, ఆర్అండ్బి ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఐసీ జీఎం, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈలను నియమించారు. -
తీరం.. భద్రమేనా..!
ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా కాపలా ఉండాల్సిన మెరైన్ పోలీసులను వసతుల లేమి వెంటాడుతుండడంతో భద్రత చుక్కాని లేని నావలా తయారైంది. కొత్త మెరైన్ పోలీస్ స్టేషన్లు లేవు.. కొత్త బోట్లు రాలేదు.. ఉన్నవి కాస్త మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. సిబ్బంది నియామకం కూడా లేకపోవడంతో చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా కరువైంది. ఫలితంగా మన తీరం.. భద్రమేనా? అన్న సందేహం కలుగుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబో నగరం నెత్తురోడింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో సుమారు 359 మంది మృతి చెందారు. వందల మంది గాయాలపాలయ్యారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం అక్కడి పోలీసు వర్గాలు, సైన్యం తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితులు తప్పించుకునే క్రమంలో సముద్రజలాల ద్వారా మన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందాయి. కేంద్రం నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకించి తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించే మెరైన్‌పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉన్న 22 పోలీసుల స్టేషన్ల పరిధిలో పోలీసులు తీరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదిలకలపై నిఘా పెట్టారు. తీరం వెంట పహారా రాష్ట్రంలోని తడ నుంచి ఇచ్ఛాపురం దాకా 972 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న తీరంపై 22 మెరైన్ స్టేషన్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేకించి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని తీరప్రాంతంపై ప్రధానంగా దృష్టి సారించారు. రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నం మెరైన్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరం వెంట పహారా కాస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రజలాల్లో ఎక్కడైనా, ఎవరైనా కొత్త వ్యక్తులు తారస పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వెంటాడుతున్న వసతులలేమి! కీలకమైన రాజధాని అమరావతి ప్రాంతానికి ఐదు మెరైన్ స్టేషన్లు ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్ పోలీస్స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. కొన్ని స్టేషన్లలో ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసి ఉన్నాయి. గస్తీ నిర్వహణకు ఉన్న ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు తక్కువే. ప్రస్తుతం రెండు జిల్లాల పరిధిలో ఒక్క బోటే పనిచేస్తోంది. దీంతో తీరంలో గస్తీ అంతంతమాత్రంగానే ఉండటంతో చొరబాట్లకు అవకాశం లేకపోలేదని మెరైన్ పోలీసు వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. -
‘వై ప్లస్’ కేటగిరీలో జయప్రద
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, జానపద గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్‌కు పోలీసులు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి, దినేశ్ ఆజంఘఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరిద్దరికీ వై ప్లస్ భద్రత కల్పించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆజంఘఢ్ లో దినేశ్.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో తలపడుతుండగా, జయప్రద.. ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌తో ఢీకొంటున్నారు. వై ప్లస్ కేటగిరీ కింద జయప్రద భద్రత కోసం 17 మంది పోలీసులను కేటాయించినట్టు రాంపూర్ ఎస్పీ శివహరి మీనా చెప్పారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి దగ్గర పెడతామని, మిగతా వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్టుగా ఉంటారని ఆయన వివరించారు. వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందన్నది మదింపు చేసి ఆ మేరకు భద్రత కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ముప్పు స్థాయిని బట్టి నాలుగు రకాలుగా.. ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ + భద్రత కల్పిస్తామన్నారు. జెడ్ ప్లస్ అన్నిటి కంటే ఎక్కువ కేటగిరీ అని చెప్పారు. -
వేప చెట్టూ–పాదుకలూ
నాకు నా గురువు మంచి కథలని చెప్తూ ఉండేవాడు. ఆ కథల్లో బాగా నచ్చిన ఓ కథని చెప్తాను. ఓ పండితుడైన రాజు దగ్గర మహావిద్వాంసుడొకాయన ఆస్థానపండితునిగా ఉంటుండేవాడు. రోజూ ఇద్దరూ కాసేపు ఈ పాండిత్య చర్చ చేసుకుంటూ ఆనందిస్తూ ఉండేవాళ్లు. ఆ ఇద్దర్లో ఎవరికీ ‘నేనెక్కువ –నేనే ఎక్కువ...’ లాంటి అభిప్రాయమే ఉండేది కాదు. ఒకరోజున పండితుడైన రాజు ఆ విద్వాంసుడ్ని ‘‘అనన్యా శ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే’’ ‘‘తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్’’ అనే శ్లోకానికి అర్థాన్ని చెప్పవలసిందని అడిగాడు. ‘విద్వాంసుడివైన నువ్వు నన్ను అడగడమేమిటి?’ అని పండితుడు ఒకటికి రెండుమార్లు అన్నప్పటికీ రాజు విడవలేదు. దాంతో పండితుడు చెప్పాడు. ఏ ఒక్కరూ నాకు దిక్కులేరనే సంపూర్ణ భావంతో ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అలాంటివాళ్లకి లేనిదాన్ని అందిస్తూ – ఉన్నదాన్ని పోకుండా రక్షిస్తూ నిరంతరం వాళ్లను రక్షిస్తూ ఉంటాను’ అని భగవంతుడైన కృష్ణుడు చెప్పడం దీని భావమని. రాజు నవ్వుతూ – మన్నించాలి నన్ను పండితులవారు.. దీని భావాన్ని మీరు సరిగా చెప్పినట్లు లేదు. రేపటి రోజున ఆలోచించుకుని వచ్చి చెప్పండి’ అన్నాడు. మరునాడు ఆ మరునాడూ కూడా ఇదే ఇదే తీరుగా చెప్తే రాజుగారు మరో రోజు సమయం తీసుకోమంటూంటే... అర్థం కాని పండితుడు దిగాలుగా కూచున్నాడు ఇంట్లో. భార్య కూడా విద్వాంసురాలు కావడమే కాక పండితపుత్రిక. దాంతో ఈ కథనంతా విని – అవును! మీకు ఆ శ్లోకం సరిగా అర్థం కాలేదు. ‘ఏ దిక్కూ లేరంటూ నన్నుపాసిస్తే అన్నీ ఆ దైవమే ఇస్తాడు’ అని గదా దానర్థం. మరి అదే నిజమని చెప్తూ ఉన్న మీరు ఆ రాజుగారి దివాణంలో కొలువు చేస్తూ ఆయనిచ్చేది తీసుకుంటూ ఉంటే ఆ శ్లోకభావం మీకేం అర్థమైనట్లు?’ అంది. పండితునికి బుర్ర తిరిగిపోయింది.ఆనాటి నుండి తీవ్రంగా మంత్రమననాన్ని చేస్తూ రాజుగారి కొలువుకి వెళ్లడం మానేశాడు పండితుడు. పది పదిహేను రోజులకి రాజే స్వయంగా పండితుడి ఇంటికొచ్చి ఒక వంశం సుఖంగా జీవించేందుకు కావలసిన భూమిని దానం చేసేస్తూ – పండితుడా! మీకిప్పుడు ఆ శ్లోకం అర్థమైందన్నాట్ట. అంటే ఏమన్నమాట? కేవలం అర్థం తెలియడం కాదు– ఆచరణలో ఉండాలని కదా దానర్థం. ఈ రోజున ఎందరో ఇదే పద్ధతిలో ఉన్నారు. దేవుళ్లంతా ఒక్కటే అని పైకి అంటూ ఉండటం మళ్లీ దేవుళ్లని మారుస్తూ ఉండటం ‘కలిసిరాలేదు’ అనుకుంటూ. ఇది సరికాదు. నేను మంత్రించుకుంటూ ఉండే అల్లా నామాన్నే జపించవలసిందని ఎవరినీ కోరను. నీదైన రామ–కృష్ణ – ఈశ్వర – అంబా.... ఏదో ఒక నామాన్ని మాత్రమే జపించుకుంటూ ఉండవలసిందని కోరుతాను. కొందరు ఈ రహస్యం కూడా తెలియక నా నామజపాన్ని చేస్తూ కనిపిస్తారు. అదీ సరికాదు. నేనే ఆ దైవాన్ని జపిస్తూ ఉంటే వాళ్లెందుకు అర్థం చేసుకోలేరో తెలియదు. వారించినా ప్రయోజనం కనిపించలేదు.ఈ విషయం మీకు అర్థమయిందో లేదో తెలియదు. అర్థం కావాలనుకుంటూ చెప్పాను. విన్నారు కాబట్టి అర్థమయిందని నేననుకుంటాను. అర్థం కావాల్సింది ఇంకా ఉందని మీకనిపించినా లేక అర్థం అయినా సంతోషమే’ అని ముగించాడు సాయి. నడిచి తిరుగుతూండే (జంగమాలు) వాటికి మాత్రమే కాదు స్థిరంగా ఉండే (స్థావరాలు) చెట్లూ ఇళ్లు కొండలూ.. ఇలాంటి వీటికి కూడా చిరకాలపు గుర్తింపు ఉండనే ఉంటుంది. ఆ దృష్టితో గనుక చూస్తే ఇలా ఉదయం విమానం మీద ఎగిరి సాయి దర్శనాన్ని చేసేసి.. మళ్లీ సాయంత్రానికి తిరుగు విమానంలో వెళ్లిపోయిన పక్షంలో షిర్డీలో కనిపించే ఆ వేపచెట్టూ దానికున్న గుర్తింపు ఆ పాదుకలూ వాటి వెనుక చరిత్ర తెలుసుకోగల సదవకాశం ఉండకపోవచ్చు గానీ.. తీరికగా వీలు చేసుకుని గనుక వస్తే.. వేపచెట్టు ముందు నిలబడి నాటి దృష్టితో గమనించగలిగితే ఆనందంతో తన్మయత్వంతో ఒళ్లంతా గగుర్పొడవటమే కాక మనసంతా చల్లబడిపోతుంది తన్మయత్వంతో. వివరించుకుంటూ వెళదాం... మౌనసాక్షి ఈ వేపచెట్టుని కుగ్రామమైన షిర్డీలో ఎందరో ఎన్ని దశాబ్దాల నుండో చూస్తూ ఉన్నా ఆ వేప చెట్టుకి ఓ గుర్తింపు కలిగిన చూపు (దర్శనం) అనేది 1854లోనే ప్రారంభమైంది. అప్పుడే వేపచెట్టు ఎందరో పనులకోసం పొరుగు ప్రాంతాలకి వెళ్తూండే ఆ బాట పక్కగా ఉంటూ ఉండేది. ఆనాటి మార్గం కూడా గోతులు గొప్పులు రాళ్లు రప్పలతో ఉండేది. జీవిక కోసం ఆ సామాన్య ప్రజలు తమ తమ వృత్తికి సంబంధించిన పనిముట్లతో మధ్యాహ్న భోజనపు చద్దిమూటలతో పిల్లల్ని చంకలకెత్తుకుని అలా వెళ్తూ ఉండేవాళ్లు ఇదే వేపచెట్టు సాక్షిగా. ఈ రోజునైతే చుట్టూ భవంతులూ ఈ చెట్టు చుట్టూ జన సందోహం.. అప్పటి రోజుల గురించి చెప్పినా కూడా నమ్మవీల్లేనంతగా ఉండచ్చుగానీ, ఇది యథార్థం. అలాంటి ఆ నడబాట పక్కన దట్టంగా ఆకులతో నిటారుగా బలంగా ఉండేది ఈ వేపచెట్టు. ఇలా ఉండగా ఓ రోజున దానికింద కొత్తగా ఓ 16 సంవత్సరాల యువకుడు పద్మాసనంలో కూచుని కనిపించాడు. ఇటూ అటూ వెళ్తూ వస్తూన్న జనానికి ఆ రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య మాట్లాడుకోవడం కూడా ఓ తప్పుగానే ఉండేది కాబట్టి ఎవరూ అతడ్ని, అతడు ఎవర్నీ పలకరించకుండానే రోజులు వెళ్లిపోతూ ఉండేవి. బాగా మాసిన గుడ్డలో ఉన్న మణి, కొద్దిగా ఆ గుడ్డకున్న చిరుగుల్లో నుంచి కనిపిస్తున్నట్టుగా ఆ యౌవనవంతుడైన బాలుని ముఖంలో చెప్పలేని తేజస్సు, ఏదోతెలియని గొప్పదనం అతనిలో ఉన్నట్టూ అందరికీ అనిపిస్తూ ఉండేది గాని, ఎవరి జీవనపు పరుగుల్లో వాళ్లుండేవారు తప్ప ఇతడ్ని పట్టించుకున్న వాళ్లే లేరు.ఎప్పుడూ కళ్లు మూసుకుని తపస్సు చేసుకుంటున్న మహర్షిలా కనిపిస్తూ ఉండేవాడు. పోనీ! ఏ పగటివేళలోనో పద్మాసనం తపస్సూ అనుకుంటే ఆశ్చర్యం లేదు గానీ, షిర్డీకి పొరుగూరు పనులన్నీ ముగించుకుని రాత్రివేళ వస్తూ ఉండే జనులకు కూడా అదే చెట్టు కింద అదే జపంతో కనిపిస్తూ ఉండేవాడు ఈ యువకుడు. దాంతో జనంలో కదలిక ప్రారంభమైంది. ఎవరితను? ఎక్కడి వాడు? ఎవరి సంతానం? ఎందుకొచ్చి ఉంటాడు? తిండెక్కడ? నిద్ర ఎక్కడ?... అనుకున్నారే గానీ ఎవరూ తమ ఇళ్లకి రమ్మని అనలేకపోయారు– ఇతను ఓ అపరిచితుడు కావడం వల్ల.ఒకసారి తీవ్ర వర్షం వచ్చింది. ఆ చెట్టు కిందే కనిపించాడు ఈ యువకుడు ఒళ్లంతా తడిసి కూడా. మరోసారి వెచ్చటి వేసవి గాడుపు. అయినా అక్కడే ఉన్నాడీ యువకుడు. ఇలాగే శీతాకాలంలోనూ గాలి దుమారాల్లో కూడా అదే చెట్టు కిందా అదే ధ్యానముద్రలో అదే పద్మాసనంలో కనిపిస్తూ ఉండేసరికి జనంలో ఓ చిన్న చర్చ ప్రారంభమైంది.ఇతనిది శరీరమేనా? ఇతనేమైనా ఓ యోగి జాతికి చెందిన వాడే అయ్యుండి మనిషిలా కనిపిస్తున్నాడా? అయినా ఆ శరీరంనిండా బురఖాలా కప్పుకున్న చొక్కాలాంటి (కఫనీ) వస్త్రమేమిటి? అసలు కత్తిరించుకోని శిరోజాలతో ఉన్న ఆ కేశాలేమిటి? స్నానం ఎక్కడ?... ఇలా సమాధానం తెలియవీల్లేని ప్రశ్నలు మరిన్ని అయ్యేసరికి అతడ్నే అడిగారు కొందరు.. రోజూ చూస్తూన్న కారణంగా పరిచయమైనట్లుగా భావించి.తనది కబీరు మతమనీ, తన తండ్రి పేరు సాయిబాబా అనీ, తన వయసు కొన్ని యుగాల సంఖ్య అనీ, తన ఊరు బ్రహ్మలోకమనీ చెప్పేసరికి, జనమంతా అనుకున్నారు– ‘ఇతడ్ని ఏమీ అడగకుండా ఉంటే బాగుండేదేమో’ అని. కొందరికి ఏదో అర్థమైనట్లు అనుకున్నారు.కొందరేదో తెలియనితనంతో ఉండిపోయారు. అయితే అందరూ కలిసి తేల్చిందేమంటే– ఇతడొక ఫకీరు. పిచ్చివాడు– తిండీతిప్పలూ లేకున్నా ఉండే గూడూ (ఇల్లు) నిద్రా లేకున్నా జీవించగల ఓ గోసాయి(ప్రపంచాన్ని విడిచేసిన విరక్తుడు/సన్యాసి) అనీను. 16 సంవత్సరాల యౌవనదశలో ఇలా ఉండగలగడం అన్నికాలాలనూ తట్టుకుంటూ రాత్రింబవళ్లూ వేప చెట్టు(చిన్న ఆకులు కల చెట్టు కారణంగా పెద్ద నీడనియ్యలేనిది – పుష్పాలనీ ఫలాలనీ ఆహారంగా ఇయ్యలేనిది) కిందే ఉండగలగడం కారణంగా ఇతనిలో ఏదో శక్తి ఉందని మాత్రం భావించారు అందరూ. కొందరు దూరం నుండి దణ్ణం పెట్టుకోవడం ఆరంభించారు. కొందరు గౌరవంతో తలదించుకుని భక్తి ప్రపత్తులతో వెళ్లిపోసాగారు. ఇంకొందరు నమస్కరిస్తూ కాసేపు నిలబడి వెళ్లిపోవడం చేయసాగారు.ఒకరోజున ఓ పేదరాలు తన కూతురు వ్యాధితో బాధపడుతూంటే ఏ దిక్కూ తోచక సాయి దగ్గరకొచ్చి ఆయనకి తన పిల్ల బాధపడుతూ ఉన్న వ్యాధిని గురించి వివరించి చెప్పింది. నోరు ఏ మాత్రమూ మెదపకుండా సాయి అలా లేచి కొంత దూరం వెళ్లి పిచ్చిపిచ్చిగా ఎత్తుగా పెరిగిన మొక్కల మధ్య పరిశీలించి ఓ మొక్క ఆకుల్ని తెచ్చి గట్టిగా రెండు అరచేతుల మూలలమీదా నొక్కి మర్దించి పసరుని ఆ పిల్ల నోటిలో పోశాడు.మర్నాడు ఆమె ఎంతో ఆనందంగా పిల్లని తీసుకొచ్చి పాదాల మీద ఉంచి తానూ పాదాభివందనం చేసింది. ఇంకేముంది? ఈ ఫకీరు గొప్ప హకీం (ఆకులూ అలములతో రోగాన్ని నయం చేయగల వైద్యుడు) అనే పేరు వ్యాపించేసింది. దాంతో వరుసలో వ్యాధిగ్రస్తులంతా రావడం మొదలెట్టారు. మనం దానిముందు నిలబడి ఈ చరిత్రని నెమరేసుకుంటూ ఉంటే మౌనంగా వింటోంది వేపచెట్టు! ఇదేమిటి? ఆశ్చర్యం? ఇలా సాయి దగ్గరికి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటే సాయి ఓ రోజున దగ్గర్లోని గ్రామమైన ‘రహతా’కి వెళ్లి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కల్ని తెచ్చాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరికైనా చెప్పాల్సిన అవసరమేముంది? పైగా ఎవరాయనకి అంత పరిచయం ఉన్నవాళ్లు గనుక? ఇలా మొక్కల్ని తేవడానికి ముందే సాయి అక్కడున్న రాళ్లని రప్పల్నీ తొలగించి నేలని చదును చేసి దగ్గర్లో ఉన్న బావి నీటితో ఆ ప్రదేశాన్ని మొక్కలు పెరిగే విధంగా పదును చేశాడు. చేదబావి దగ్గర ఉండేది గాని, మొక్కలకి నీళ్లు పోయడానికి ఏ పాత్రా ఉండేది కాదు సాయికి.ఈ స్థితిని గమనించిన తాత్యా (వామన్ తాత్యా) అదే కుమ్మరి (కుండల్ని చేసే వృత్తి కలవాడు) రోజూ సాయికి రెండు కాల్చని కుండలని (పచ్చి కుండలు) ఇస్తూండేవాడు. సాయి ఆ పచ్చి కుండలతో నీటిని తెచ్చి తాను రహతా నుండి తెచ్చిన మొక్కలకి స్వయంగా నీళ్లు పోస్తూ ఉండేవాడు. పచ్చికుండలేమిటి? నీటిబరువుతో ఉన్న పచ్చికుండలని భుజానపెట్టుకున్నా కూడా విచ్చిపోకుండా ఉండటమేమిటి? అని అంతా ఆశ్చర్యపడుతూ ఈ సాయి సామాన్యుడు కాడనే దృఢనిర్ణయానికి ఏకగ్రీవంగా వచ్చేశారు. దాంతో సాయికి పేరు ప్రతిష్టా పెరిగిపోసాగింది. చిత్రమేమంటే అలా రోజూ తెచ్చిన పచ్చికుండలతో నీళ్లు పోయడం ముగించాక సాయి ఆ కుండల్ని తిరిగి తాత్యాకి ఆములో (కుండల్ని కాల్చే బట్టీ) వేసుకునేందుకు వీలుగా ఇచ్చేవాడు కాడు. వాటిని ఈ వేపచెట్టు మొదట్లోనే బోర్లించి పెట్టేవాడు. ఆ నీటి తడి కారణంగా అవి విచ్చిపోయి మట్టిపెళ్లలుగా అయిపోతూ ఉండేవి. ఇలా రోజూ పూలమొక్కల్ని స్వయంగా నీరు పోసి పెంచుతూ ఉండటంతో మొక్కలు పెద్దవై ఓ తోటగా కనిపించసాగింది జనులకి. దానికి సాయి ‘లెండీ’ తోట అని పేరు పెట్టాడు– ఎంతో మురిపెంగా చూసుకోసాగాడు. ఇలా క్రమక్రమంగా సాయి కీర్తీ ప్రతిష్ఠా పెరిగిపోతుండేసరికి అందరికీ అసలు ‘ఈ సాయి ఎవరు? వివరాలేమిటి?’ అనే ఆలోచన మరింతగా పెరిగి ఓ రోజున ఆ గ్రామదేవత అయిన ‘ఖండోబా’ దేవాలయానికి వెళ్లారు.సహజంగా ఏవైనా అనుమానాలు షిర్డీ ప్రజలకి గాని ఉన్న పక్షంలో ఆ గ్రామదేవత ఆలయంలో ఎవరికో ఒకరికి పూనకం వచ్చిన సమయంలో ఆ పూనిన వ్యక్తిని అడుగుతూ ఉండేవారు సందేహనివృత్తికి. అలా ఈ సాయి గురించి అడగ్గానే ఆ వ్యక్తి చెప్పాడు– గునపాన్ని (గడ్డపార– పలుగు) తేవలసిందని ఆజ్ఞాపించి ఆ నేలని తవ్వించి అక్కడ అడ్డుగా ఉన్న పెద్ద రాతిని తొలగించి ఇంకా వెలుగుతున్న దీపాలనీ జపమాలలనీ... ఇలా (లోగడ అనుకున్నాం కదా!) అందరికీ కనిపించేలా చేశాడు. దాంతో అందరికీ అర్థమైంది. సాయి సామాన్యుడు కాడనీ తీవ్రంగా తపస్సు చేసినవాడేననీ– అది కూడా 12 సంవత్సరాల పాటు అనీను. అప్పుడు ఆ సంఘటనని నిజమేనని దృఢం చేస్తూ సాయి కూడా ఆ ప్రదేశాన్ని తెరిచి ఉంచకూడదనీ దాన్ని గురుస్థానంగా భావిస్తూ ఎవరూ ప్రవేశించరాదనీ చెప్తూ ఆ ప్రదేశం తన గురుస్థానం (తన గురువు తపస్సు చేసిన చోటు అని అందరూ భ్రమపడేలాగా) అని అందరూ నమ్మేలా చెప్పి దగ్గరుండి ఆ స్థానాన్ని మూయించేసాడు. చెట్టు కింద తపస్సా? ఇలా ఆ చెట్టునే తన నివాసస్థలంగా భావిస్తూ ఉన్న సాయి మూడేళ్లపాటే అక్కడుంటూ తపస్సు చేసుకుంటూ కాలాన్ని గడిపాడు. ఈ విషయాన్ని వింటూ ఉంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మహర్షులంతా ఏవో పర్ణశాలల్ని కట్టుకుని తపస్సులు చేసుకున్నారు. రాముడంతటి వాడు కూడా లక్ష్మణునితో పర్ణశాలని వేయించుకుని తపస్సు చేసుకుంటే ఈ సాయి మాత్రమే ఎందుకిలా చెట్టునే ఆశ్రయించుకుని తపస్సు చేశాడు? అనే అనుమానం వస్తుంది మనకి. పోనీ! అలాగే ఇప్పుడు కూడా ఏ వేపచెట్టుకిందో కూర్చుని ఎవరైనా తపస్సు –జపం– ధ్యానం గానీ చేసుకుంటూ కనిపిస్తున్నారా? అంటే అది లేనేలేదు కదా! అనిపిస్తుంది కూడా. పైగా ఈ రోజున ఈ చెట్టు చుట్టూ భవంతుల సమూహం కదా కనిపిస్తోంది! మరి ఏ ప్రాచీనమైన కట్టడమూ లేదు కదా తపస్సు చేసుకునేందుకు!ఇలా ఆలోచిస్తే ఆ చెట్టు గొప్పదనం మనకి తెలియదు. కారణం మరోటుంది. అసలు చెట్టుకీ తపస్సులకీ సంబంధం ఉంది. అందుకే ఏ మహర్షిని చూసినా చెట్టుతో సంబంధం ఉన్నవారుగానే కనిపిస్తారు ఎక్కువ సందర్భాల్లో. ఏ పురాణాన్ని వినబోయినా ‘సూతుడు శౌనకాది మహర్షులకి ఇలా చెప్పాడు... అంటూ ప్రారంభమవుతుంది. ఆ స్థలాన్ని వర్ణిస్తూ – పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తోందనీ, సూతుడు పెద్దదైన వటవృక్షం కింద కూర్చుని చక్కని ఓ అరుగుని వేదికగా చేసుకుని చెప్తున్నాడనీ కనిపిస్తుంది. ఎందుకు చెట్టుని ఆశ్రయించాలి మహర్షులు? చెట్టుకి వేళ్లుంటాయి. అవి దాటి గొప్పదనం తెలిసినవారికి ఔషధులుగా పనిచేస్తాయి. చెట్టుకి కాండం (మాను) ఉంటుంది. అది పశువులని బంధించడానికీ ఆ చెట్టుని ఆశ్రయించి ఉండేందుకు చెట్టునెక్కాలి కాబట్టి, కోతులకీ ఇతరమైన ఉడుతలూ మొదలైన అల్ప ప్రాణులకీ నిచ్చెనలాగా ప్రయోజనపడుతుంది. చెట్టుకుండే కొమ్మలు పక్షులకి ఇళ్లుగా ఉండే గూళ్లుగా వ్రేలాడేందుకు పనికొస్తాయి. చెట్టు ఆకులు కొన్నైతే ఔషధులుగా కొన్ని పువ్వులయితే స్త్రీల కొప్పుల్లో అలంకారాలుగా లేదా ఆహారపదార్థాలుగా పనికొస్తాయి. ఇక పిందెలూ కాయలూ పళ్లూ గురించి చెప్పవలసిందేముంది? వ్యక్తులకీ పక్షులకీ... ఇలా ఎన్నో ప్రాణులకి తినుబండారాలుగా ఉంటాయి. ఇవన్నీ చెట్టు జీవించి ఉన్న కాలంలో కనిపించే ప్రయోజనాలు అవుతూ ఉంటే, చెట్టనేది తాను మరణించాక కూడా వంటచెరకుగా ప్రయోజనాన్ని మనకి కలుగజేస్తుంది. కాబట్టి అలాంటి చెట్టు కింద తపస్సుగాని చేసుకుంటూ ఉన్నట్లయితే.. అదే తీరు పరోపకార లక్షణం ఆ కింద తపస్సు చేసుకునే ఉదారులక్కూడా లభిస్తుందనేది వారి ఉద్దేశం. ఇది నిజం కాబట్టే శ్రీమద్రామాయణంలో సీతమ్మ కూడా అయోధ్యని వీడి వెళ్తూ కొన్ని వృక్షాలకి నమస్కరించి మాత్రమే వెళ్తూ తిరిగి వచ్చింతర్వాత ఆ చెట్టుని గౌరవిస్తానంటూ పలికిందని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో వివరించాడు. అంతేకాదు. శ్రీరామచంద్రుడ్ని గురించి వర్ణిస్తూ వాలికి భార్య అయిన తార– నివాసవృక్ష స్యాధూనా మాపన్నానాం పరా గతిః ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస శ్చైక భాజనమేరామచంద్రుడు సత్పురుషులైన అందరికీ నిరంతరం నివసించే ఇంటిలాంటివాడు. ఆపదల్లో ఉన్నవారికి ఎనలేని దిక్కు. ఆర్తులైనవారికి ఆశ్రయమిచ్చే సర్వరక్షకుడు. అన్ని విధానాలని గురించిన కీర్తులనీ మూటగట్టుకుని కనిపించే సర్వైక (ఏకైక అనకూడదు) మూర్తి ఆయన అంది. – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
భద్రత.. బాధ్యత.. కనపడదెక్కడా!
రాజధాని అమరావతిలోజరుగుతున్న నిర్మాణాల వద్ద ప్రజలు, కూలీల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అటు నిర్మాణ సంస్థలు గానీ,ఇటు అధికారులు గానీ చర్యలు తీసుకున్నపాపాన పోలేదు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. ఈ మేరకు రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఇద్దరు హత్య.. మంగళగిరి మండలం కురగల్లు వద్ద గత ఏడాది డిసెంబర్లో తెలంగా>ణకు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో పని చేయడానికి వచ్చి హత్యకు గురికావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తమ వద్ద పని చేస్తున్న కూలీల వివరాలు, వారి నేర చరిత్ర తెలుసుకోకుండానే నిర్మాణ సంస్థలు పనుల్లో పెట్టుకుంటున్నాయి. నేలపాడు గ్రామం వద్ద జరుగుతున్న తాత్కాలిక హైకోర్టు వద్ద మంగళవారం జరిగిన ప్రమాదం కూడా ఇలాంటిదే. టిప్పర్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..? రాజధానిలో రాత్రి, పగలు తేడా లేకుండా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సుమారు 8 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. అయితే నిర్మాణాలు జరుగుతున్న చోట అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోతోంది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. కొన్ని సంస్థలు మాత్రమే అంబులెన్స్‌లను 24 గంటల పాటు ఉంచుతున్నాయి. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉన్నాయా.? ఇసుక, మట్టిని తరలించేందుకు వేలాది టిప్పర్లను పనుల కోసం వినియోగిస్తున్నారు. అయితే డ్రైవర్లు లైసెన్స్ లేకుండానే కొన్ని నిర్మాణ సంస్థలు పనిలో పెట్టుకుంటున్నాయి. వీరు రయ్ మంటూ దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇప్పటికే టిప్పర్లను తమ గ్రామం మీదుగా వెళ్లనిచ్చేది లేదంటూ కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇలా నిబంధనలకు నీళ్లొదులుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపెట్టుకుంటున్నాం గ్రామాలలో ప్రజలు తిరగాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. నిర్మాణాలు చేపడుతున్నారు కానీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. లారీలు వేగంగా వెళ్తూ బెంబేలెత్తిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, అధికారులు స్పందించాలి. గ్రామ శివారుల్లో, పొలాల్లో నుంచి భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.– కె. వినోద్, నేలపాడు, తుళ్లూరు మండలం చర్యలు తీసుకుంటున్నాం రాజధాని ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అతి వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రెండు రోజుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వాహనదారులు కూడా నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. – కేసప్ప, ఇన్చార్జి డీఎస్పీ, తుళ్లూరు -
రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్‌కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్‌లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్‌గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్‌షాప్‌లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్‌రావు, పి.శ్రీనివాస్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్‌షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
పెందుర్తిలో కార్మికుల సొసైటీ పేరిట అక్రమ తవ్వకాలు
-
అర్హతల ఆధారంగానే వలసలకు అనుమతి
వాషింగ్టన్: అర్హతల ఆధారంగానే వలసలను అనుమతిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. కఠిన వలస విధానాలపై ఇంటాబయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష డెమోక్రాట్లు, మీడియా తీరుపైనా ఆయన విరుచుకుపడ్డారు. అక్రమ వలసదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, బాధితులను శనివారం ట్రంప్ వైట్‌హౌస్‌లో కలుసుకుని మాట్లాడారు. దేశ సరిహద్దులతోపాటు పౌరులకు కూడా భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర దేశాల వారు ఇక్కడికి రావడాన్ని కోరుకుంటున్నామనీ, అయితే, అది పద్ధతి ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ‘సమర్థత ఆధారంగానే వలసలను కోరుకుంటున్నాం. అంతేకానీ, అనర్హులకు కూడా అనుమతి ఇచ్చే డ్రా విధానాన్ని మాత్రం కాదు’ అని ‘యాంజెల్ ఫ్యామిలీస్’గా పేర్కొనే బాధిత కుటుంబాలతో అన్నారు. ‘విదేశీ నేరగాళ్ల కారణంగానే దేశంలో నేరాల రేటు పెరుగుతోంది. బాధిత కుటుంబాల ఇబ్బందులపై చర్చించటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లతోపాటు, బలహీన వలస విధానాలను బలపరిచే కొందరు ఇష్టపడడం లేదు’ అని ట్రంప్ ఆరోపించారు. 2011 గణాంకాల ప్రకారం విదేశీ నేరగాళ్ల కారణంగా దేశంలో 25వేల హత్యలు, 42వేల దోపిడీలు, 70వేల లైంగిక నేరాలు, 15వేల కిడ్నాప్‌లు జరిగాయని తెలిపారు. గత ఏడేళ్లలో ఒక టెక్సస్‌లోనే 6 లక్షల నేరాలకు సంబంధించి 2.5లక్షల మందిని అరెస్ట్ చేశామన్నారు. ‘హెరాయిన్ అతిగా తీసుకున్న కారణంగా కేవలం 2016లోనే 15వేల మంది చనిపోయారు. దేశంలోకి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్‌లో 90 శాతం దక్షిణ సరిహద్దుల నుంచే వస్తోంది’ అని అన్నారు. 2017లో అరెస్టయిన 8 వేల మంది విదేశీ నేరగాళ్లను బలహీన చట్టాల కారణంగానే విడిచి పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘ప్రజలను చంపేస్తోన్న డ్రగ్స్ సరఫరాదారులను పట్టుకుని వదిలి పెడుతుంటే ఈ మీడియా ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు. అక్రమ వలస నేరగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, ఇబ్బందులు పడిన వారికి సాయ పడేందుకు ‘వాయిస్’ అనే విభాగాన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ట్రంప్ 2017లో ఏర్పాటు చేశారు. -
ఆభరణాలు భద్రం
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని ఆభరణాలు, ఇతరేతర అమూల్యమైన సంపద భద్రంగా ఉన్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు కావడంతో స్వామి అమూల్య రత్న సంపద పట్ల పలు అపోహలు ప్రసారం అవుతున్నాయి. ఇవన్నీ నిరాధారంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. రత్న భాండాగారం రెండు అంచెల్లో ఉంటుంది. బాహ్య భాండాగారం(బహారొ భొండారొ), లోపలి భాండాగారం (భిత్తొరొ భొండారొ)గా పేర్కొన్నారు. స్వామి అమూల్య రత్న సంపద లోపలి భాండాగారంలో భద్రంగా ఉంటుంది. నిత్య వినియోగ ఆభరణాలు, పాత్రలు వగైరా సొత్తు బాహ్య భాండాగారంలో ఉంటుంది. అరుదుగా వినియోగించే ఆభరణాలు లోపలి భాండాగారంలో భద్రపరుస్తారు. బాహ్య భాండాగారం తెరిస్తే గానీ లోపలి భాండాగారం లోనికి ప్రవేశించడం అసాధ్యం. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం స్థితిగతుల్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇటీవల బాహ్య భాండాగారం తెరిచారు. గోడలు అక్కడక్కడ స్వల్పంగా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాహ్య భాండాగారం గ్రిల్ నుంచి లోపలి భాండాగారం వైపు దృష్టి సారించారు. ఈ భాండాగారం తలుపుల తాళాలకు సీలు వేసినట్లు అధికార వర్గం గుర్తించింది. ఈ లెక్కన లోపలి భాండాగారం సురక్షితంగా ఉన్నందున దానిలో రత్న సంపద కూడా భద్రంగా ఉండడం తథ్యంగా శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం స్పష్టం చేసింది. తాళం గల్లంతు వాస్తవమే! రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు రత్న భాండాగారం పరిశీలించడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం తెరిచేందుకు తా ళం చెవి కోసం వెతుకులాట మొదలైంది. జిల్లా ట్రెజరీలో ఉండాల్సిన తాళం చెవి కనిపించనట్లు జిల్లా కలెక్టరు బహిరంగపరిచారు. అధికార సమూహం అంతా ఏకమై గాలించిన రత్న భాండాగారం తాళం చెవి కాన రాని మాట వాస్తవం. కాగిత పత్రాలు, దస్తావేజులు వగైరా క్షుణ్ణంగా పరిశీలించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. అంచెలంచెలుగా అధికారులు ఈ పరిస్థితిని సమీక్షించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిర్ణయించారు. 1985 సంవత్సరంలో లోపలి భాండాగారం తెరిచి ఆభరణాలు వగైరా లెక్కించినట్టు దస్తావేజులు స్పష్టం చేస్తున్నాయి. లెక్కింపు ముగించి ఈ భాండాగారానికి 3 తాళాలు వేశారు. ఒక తాళానికి సీలు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల 4వ తేదీన రత్న భాండాగారం పరిశీలించారు. తాళం చెవి గల్లంతుపట్ల 17 మంది సభ్యుల నిపుణుల బృందం తలకిందులు అయి ప్రయత్నించిన గాలించ లేకపోయింది. బాహ్య భాండాగారం తెరిచి పరిశీలన మొక్కుబడిగా ముగించేశారు. లోపలి భాండాగారం పరిశీలించాల్సిన అవసరం లేనట్లు నిపుణుల బృందం ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని విశ్లేషిస్తే తాళం చెవి లేనందున లోపలి భాండాగారం పరిశీలన సాధ్యం కానట్లు తెలుస్తుంది. అంచెలంచెలుగా సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం రత్న భాండాగారం పరిశీలన ముగించిన వెంటనే శ్రీ మందిరం సబ్ కమిటీ అదే రోజు మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయింది. తాళం చెవి గల్లంతు శీర్షికతో ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశం తీర్మానం మేరకు మర్నాడు భువనేశ్వర్ స్పెషల్ సర్క్యుట్ హౌసులో శ్రీమందిరం పాలక మండలి సమావేశం జరిగింది. పూరీ గజపతి మహా రాజా, శ్రీ జగన్నాథుని తొలి సేవకుడు దివ్య సింఘ్ దేవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కూడా తాళం చెవి జాడ కానరానందున విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్ ఆడిట్ తాళం చెవి జాడ కోసం ఇంటర్నల్ ఆడిట్ కూడా నిర్వహించారు. శ్రీమందిరం సేవా పాలక మండలి ప్రముఖుడు ఈ ఆడిట్ నిర్వహించారు. 1985 సంవత్సరంలో రత్న భాండాగారం ఆభరణాల లెక్కింపు పురస్కరించుకుని శ్రీమందిరం పాలక మండలి డిప్యుటీ పాలకుడు రబీంద్ర నారాయణ మిశ్రా నుంచి రత్న భాండాగారం తాళం చెవి తీసుకున్నట్టు ఆడిట్ ఖరారు చేసింది. శ్రీ మందిరం ప్రధాన పాలకునికి ఈ నివేదిక సమర్పించారు. కలెక్టరేటులో రికార్డు రూమ్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంత ప్రయాసపడిన తాళం చెవి జాడ దొరక లేదు. న్యాయ విచారణకు సహకరిస్తాం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని శ్రీ జగన్నాథ ఆలయ అధికారవర్గం(ఎస్జేటీఏ) తెలిపింది. -
ఉసురు తీస్తుండ్రు
సాక్షి, నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత పూర్తిగా కరువైంది. ఇక్కడ పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికులు ఇక్కడి కాంట్రాక్టు కంపెనీల బాధ్యులు, అధికారుల నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్నారు. సరిగ్గా ఆరు నెలల క్రితం ఫిట్నెస్ లేని టిప్పర్ బోల్తా పడగా అందులో ప్రయాణిస్తూ నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్న జిల్లా అధికారులు జరిగిన వాస్తవాలను కప్పిపుచ్చి టిప్పర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయంటూ దాటవేశారు. అదే తరహాలో తాజాగా బుధవారం ఎల్లూరు సొరంగం పనుల్లో పేలుడు సంభవించి ఇద్దరు ఇతర రాష్ట్రాల కార్మికులు ప్రాణాలను వదిలారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ లోపంతో జరుగుతున్న వరుస ప్రమాదాలకు ఇక్కడి అధికారులు ఏదో ఒక సాకు వెతికి తమ నిర్లక్ష్యాన్ని దాచేస్తూ.. కాంట్రాక్టు కంపెనీలకు వత్తాసు పలుకుతుండడం విమర్శలకు తావిస్తోంది. తాజా ఘటనలో ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే జిల్లా ముఖ్య అధికారులు ప్రమాదానికి కారణం పిడుగుపాటు అంటూ తేల్చి చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందుకు సంబంధించి నిపుణులతో విచారణ చేయించకుండానే సొంత అభిప్రాయాన్ని వాస్తవంలా వెల్లడించారు. మరోపక్క ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఇప్పటి వరకు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల కార్మికుల విషయంలో గోప్యత పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ నిర్మాణ పనులను చేపడుతున్న నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ పేలుడు పదార్థాలను అమర్చేందుకు నిపుణులైన కార్మికులను ఒడిశా, చత్తీస్ఘడ్, బీహార్ రాష్ట్రాల నుంచి రప్పించింది. వీరికి రోజువారీ కూలి చెల్లిస్తూ ప్రమాదకర పరిస్థితుల మధ్య పనులు చేయించుకుంటున్నారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతోపాటు వీరి కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందిన సొరంగం పనుల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సదరు ఏజెన్సీ గోప్యంగా ఉంచుతోంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా అధికారులు అడిగిందే తడవుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ మేరకు పనుల ప్రదేశాన్ని కార్మిక శాఖ అధికారులు సందర్శించి తగిన భద్రతా సూచనలు చేయాల్సి ఉంది. వీరందరికీ గుర్తింపు కార్డులను అందజేయడంతోపాటు ఇతర రాష్ట్రాల కార్మికులకు ఇచ్చే అదనపు సౌకర్యాలను కాంట్రాక్టు కంపెనీ నుంచి ఇప్పించాల్సి ఉంటుంది. కానీ బడా కాంట్రాక్ట్ కంపెనీ కావడంతో అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. దీంతో ఈ అంశాలను ప్రశ్నించేందుకు వెళ్లిన పాత్రికేయుల పట్ల కూడా కంపెనీల బాధ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ బడా నేత అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో వారు ఏం చేసినా చెల్లుబాటవుతోందని స్పష్టమవుతోంది. ఒక్కో ఘటనలో ఒక్కో తీరు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకోల్ సమీపంలో ఇటీవల కూలీలను తీసుకెళ్తున్న జీపు ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఆ జీపు యజమానితో పాటు డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించారు. అదే సమయంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల సమీపంలో పంపుహౌజ్ వద్ద టిప్పర్ బోల్తా పడి నలుగురు మరణించారు. పది మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటనలో మాత్రం జిల్లా అధికారులు ప్రమాదానికి వాహనం బ్రేకులు ఫెయిల్ కావడమే కారణమంటూ సాంకేతిక అంశాన్ని జోడించి కేసును నిర్వీర్యం చేశారు. టిప్పర్ యజమానిపై కానీ పనులు జరుగుతున్న కంపెనీపై కఠినంగా వ్యవహరించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. చేతులెత్తేస్తున్న పోలీసులు జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రోజుకో చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వట్టెం రిజర్వాయర్ పనుల్లో ఓ టిప్పర్ దహనమైన సంఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో సంఘటనలో కంపెనీ సూపర్వైజర్ టిప్పర్ కింద పడి మరణించాడు. ఎల్లూరు వద్ద మరో కార్మికుడు టిప్పర్ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఇలా ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సామాన్యులపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు బడా బాబుల విషయంలో మాత్రం మెతకతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. -
ఓ పల్లె.. 20 సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్ : ఉన్మాదులు రెచ్చిపోతున్నారు.. ముక్కుపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.. వీటికి తోడు దొంగల బెడద.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అడుగడుగునా పోలీసులున్న పట్టణాల్లోనే లెక్కలేనన్ని ఘోరాలు జరుగుతుంటే మరి నిఘాలేని పల్లెల పరిస్థితేంటి? అక్కడ రక్షణ మాటేమిటి? ఇదే అంశం ఆ ఊరి యువతను కునుకు లేకుండా చేసింది. పోలీసు ఔట్ పోస్టు కూడా లేని తమ ఊరి భద్రతపై వారిలో అలజడి మొదలైంది. వెంటనే స్పందించి వాట్సాప్ వేదికగా సమాచారం చేరవేశారు.. చర్చోపచర్చలు జరిపారు.. పక్షం రోజులైంది.. కట్ చేస్తే ఇప్పుడా ఊరికి 20 సీసీ కెమెరాలతో నిఘా.. ఇది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామ యువత ‘నిఘా’గాథ. 4 వేల జనాభా.. సుమారు 4 వేల జనాభా ఉన్న అయినాపూర్ గ్రామం విద్యాధికులకు నిలయం. ఇక్కడి యువకులు అనేకమంది సాఫ్ట్వేర్ సహా ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఇతర గ్రామాల్లో పని చేస్తున్నారు. అయితే ఇటీవల తరచూ వార్తల్లో కనిపిస్తున్న అవాంఛనీయ ఘటనలతో గ్రామస్తులు ఆందోళన చెందుతుండటం.. చీకటి పడగానే తలుపులు వేసుకుంటుండటం గమనించిన ఆ ఊరి యువత ఆలోచనలో పడ్డారు. గ్రామ భద్రత విషయమై కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సతీశ్‌కుమార్‌తో చర్చించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా సీసీటీటీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. వారంలో రూ.70 వేలు.. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని నేరుగా సంప్రదించడం జాప్యమవుతుందని తాము నిర్వహిస్తున్న అయినాపూర్ సన్‌రైజర్స్, అయినాపూర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో అభిప్రాయాలు పంచుకున్నారు. ఇందుకు అందరి నుంచీ ఆమోదం లభించడంతో వెంటనే అయినాపూర్ డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విరాళాల సేకరణ మొదలెట్టారు. గ్రూపు సభ్యులు మహిపాల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, అశోక్, వూడెం జైపాల్‌రెడ్డి, కాయిత జైపాల్‌రెడ్డి, యాదగిరి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జిల్లా రవీందర్, మురళీధర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, చెంబురెడ్డి, సంజీవ్‌రెడ్డి తదితరులు తొలుత విరాళాలు ఇవ్వడంతో మిగతావారు కూడా ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ.70 వేలు జమవడంతో తొలుత కొన్ని కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తొలి విడత 9 కెమెరాలు గ్రామ భద్రతపై సర్పంచ్ పబ్బోజు విజయేందర్ కూడా స్పందించారు. మరిన్ని కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇదే గ్రామానికి అనుబంధంగా ఉన్న రసూలాబాద్ను కూడా కలుపుకొని 20 కెమెరాలును ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తొలివిడత 9 కెమెరాలు కొనుగోలు చేసి శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సంతోశ్‌కుమార్‌లకు అందించారు. మిగిలిన కెమెరాలను మరో వారం రోజుల్లో సిద్ధం చేయనున్నారు. అలాగే ఇటీవలి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 చొప్పున నగదు బహూకరించారు. ఇలా సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి గ్రామం అయినాపూర్. -
అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారు ‘నిస్సాన్ లీఫ్’
-
హెల్మెట్‌తో వెన్నెముకకు రక్ష
వాషింగ్టన్: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల వెన్నెముక మెడ పైభాగానికి (సర్వైకల్ స్పైన్) గాయం కాకుండా తప్పించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రమాద సమయంలో వెన్నెముకకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడలేదని.. పైగా హెల్మెట్ వల్ల కొన్నిసార్లు వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం కూడా ఉందని అనేకమంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 2010–15 మధ్య విస్కాన్సిన్ ఆస్పత్రిలో నమోదైన 1,061 మంది వాహన ప్రమాద బాధితుల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వీరిలో 323 మంది ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించగా.. 738 మంది హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ లేని వారిలో ఈ తరహా గాయాలయ్యే అవకాశం 10.8% ఉండగా.. ధరించిన వారిలో 4.6%గా ఉందన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు భద్రత ఏది?: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఎన్నికలలో గెలిచిన యూ నియన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండటంతో కార్మికుల ప్రయోజనాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆర్టీసీకి చెందిన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ప్రకటన ఇంతవరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీ సీని గట్టెక్కించేందుకు రూ.670 కోట్లు ఇస్తామని చెప్పి రూ.260 కోట్లే విడుదల చేశారన్నారు. ఏఐటీయూసీ నేత అబ్రహం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచుతామని సీఎం చెప్పారని, కానీ ఇంతవరకు అమలు కాలేదని, సకల జనుల సమ్మెకు సంబంధించి వేతనంతో కూడిన సెలవుల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు: నగేశ్ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈ యాత్రలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, బస్సు యాత్ర తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ వ్యాఖ్యానించారు. -
సురక్ష బ్యాండ్‌తో లైంగిక వేధింపులకు చెక్
మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి సేఫ్ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్లను అందించనుంది. జీపీఎస్ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది. సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్ ఆధారిత సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు. ఎలా పనిచేస్తుంది... పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్స్టేషన్లు తదితర ఏడు ఫోన్ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్లు ఎంతో సహకరించనున్నాయి. ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్లు అందించనుంది. -
ధన పిశాచం
సాయంకాలం ఆరుగంటలైంది. చలికాలం కావడంతో అప్పుడే చీకటి పడింది.సంజీవ్ హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి న్యూస్ వాచ్ చేస్తున్నాడు.కాలింగ్ బెల్ మోగింది.‘పనిమనిషి ఇప్పుడే గదా వెళ్లింది. మళ్లీ వెనక్కి వచ్చిందా ఏం? లేకపోతే ఎవరొచ్చారు?’ అనుకుంటూ వెళ్లి తలుపు తీశాడు.గేటు దగ్గర ఎవరో యువతి నిలబడి ఉంది. భుజానికి హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకుని, లగేజీ బ్యాగ్ పట్టుకుని కనిపించింది. వరండాలో లైట్ వేసి గేటు దగ్గరికి వెళ్లాడు.ఆమె అతణ్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమెను ఎక్కడా చూసిన జ్ఞాపకం రావడంలేదు.‘‘ఎవరండీ?’’ అడిగాడు సంజీవ్.‘‘హరిత ఫ్రెండ్‌ని. తనని పిలవండి’’ అన్నది.‘‘సారీ అండీ! వదిన లేదు’’‘‘వాట్? నన్ను రమ్మని తను ఎక్కడికి వెళ్లింది?’’‘‘మార్నింగ్ నాగార్జునసాగర్ వెళ్లారండీ’’‘‘నైట్‌కి వచ్చేస్తారా?’’‘‘ఊహూ.. రారండీ. నాగార్జునసాగర్ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్తారు. ఈ నైట్ అక్కడే ఉంటారు. రేపు మార్నింగ్ అక్కడ దైవ దర్శనం చేసుకుని బయల్దేరతారు. లాంచీలోనే తిరుగు ప్రయాణం. నాగార్జునసాగర్ వచ్చి హైదరాబాద్ వస్తారు. రేపు నైట్‌కి ఇంటికి వస్తారు.’’ చెప్పాడు సంజీవ్.‘‘నన్ను గేటు దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఇంట్లోకి రానివ్వరా’’ నిష్టూరంగా అన్నది ఆమె.‘‘సారీ.. వెరీవెరీ సారీ..’’ అంటూ వెళ్లి గేటుకు వేసిన తాళం తీశాడు. ఆమె లోపలకు వస్తూ... ‘‘ఐ యామ్ శాలిని’’ అన్నది చేతిని ముందుకు చాచి. ‘‘సంజీవ్. నందీశ్వర్ కజిన్ బ్రదర్‌ని..!’’ అంటూ కరచాలనం చేశాడు.ఇద్దరూ లోపలకు వచ్చారు. ఆమె సోఫాలో కూర్చుంది.‘‘నన్ను రమ్మని తను టూర్ వెళ్లిందన్న మాట హరిత. బాగుంది. కాల్ చేస్తుంటే లైన్ కలవడం లేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సిటీలో ఉందా? లేదా అని. ఇంటికి లాక్ చేసుంటే చచ్చేదాన్ని. మీరున్నారు కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఏదైనా హోటల్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఒంటరిగా లాడ్జిలో ఉండాలంటే భయంగా ఉంటుంది కదండీ. అసలే రోజులు బాగాలేవు. ఒంటరిగా ఫారిన్గర్ల్స్ వస్తారు పాపం. వాళ్లని రేప్ చేసి మర్డర్ చేశారని చదివితే హడలిపోతాను. ఇండిపెండెన్స్ వచ్చి సెవంటీ ఇయర్స్ అయినా ఆడవాళ్లకు సేఫ్టీ లేదండీ మన దగ్గర..!’’శాలిని టీవీ యాంకర్లా లొడలొడా వాగుతోంది.‘‘ఔనండీ.. ఔను..!’’ అన్నాడు ఆమెవైపు విచిత్రంగా చూస్తూ.ఆమె సెల్‌ఫోన్ తీసి డయల్ చేసింది. విసుగ్గా ముఖం పెట్టింది.‘‘హరిత నంబర్ కలవడం లేదు. వాయించాలి దాన్ని. నన్ను రమ్మని తను టూర్ ఎందుకు వెళ్లిందో? ప్లీజ్ మీరు కూడా ట్రై చెయ్యండి. లైన్ కలుస్తుందేమో?’’ అతణ్ని రిక్వెస్ట్ చేస్తూ అన్నది.సంజీవ్ కూడా సెల్‌ఫోన్ తీసి ట్రై చేశాడు.‘‘లేదండీ.. అన్నయ్య ఫోన్ కూడా కలవడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం అంతా ఫారెస్ట్ ఏరియా కదండీ. టవర్స్ ప్రాబ్లం అనుకుంటాను’’ అన్నాడు. ‘‘అంతే అయివుంటుంది లెండి. ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చుగా నేను. ప్రాబ్లమ్ ఏమీ లేదుగా..!’’ శాలిని ఓరగా చూస్తూ గోముగా అన్నది. ‘‘ఫర్వాలేదండీ.. ఉండండి. మా వదిన ఫ్రెండ్ మీరు...’’ అన్నాడు.‘‘రేపు హైటెక్స్‌లో మ్యారేజ్‌కి వెళ్లాలి. మీరూ నాతోపాటు రావాలి’’ అన్నది శాలిని.‘‘నేనెందుకండీ..?’’‘‘భలేవారే! ఒంటరిగా వెళ్తే అదోలా ఉంటుంది. హరిత ఉంటే వచ్చేది’’‘‘సరేలెండి...’’ అన్నాడు సంజీవ్ ఇబ్బందిగా చూస్తూ.‘‘ఓకే. నేను ఫ్రెష్ అవుతాను.’’ అంటూ లేచి ఒళ్లు విరుచుకుంది శాలిని. సంజీవ్ కన్నార్పకుండా నిండైన ఆమె శరీరాన్ని చూస్తున్నాడు. ఏకాంతం. పాతికేళ్ల పరువంలో ఉన్న బ్యూటీ శాలిని. సెక్సీగా కనిపిస్తుంటే ఒంట్లో అలజడి చెలరేగింది అతనికి.ఆమె ఫ్రెష్ అయి వచ్చింది.‘‘ఆకలి దంచేస్తోంది. నాకు ఏం మర్యాద చేస్తారు?’’ అన్నది.‘‘మర్యాదా?’’‘‘ఔను. హరిత ఉంటే రెడ్‌వైన్‌తో ప్యారడైజ్ బిర్యానీతో మర్యాద చేస్తుంది’’ గోముగా అన్నది.‘‘షూర్....’’ అన్నాడు.సంజీవ్ ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి రెడ్‌వైన్ బాటిల్ తీశాడు. నందీశ్వర్ ఇంటికి ఉదయం ఏడింటికి పనిమనిషి రజిని వచ్చింది. గేటు తీసుకొని వెళ్లింది. మెయిన్ డోర్ నెట్టగానే తెరుచుకుంది.‘‘సంజీవ్ బాబూ..!’’ అని పిలిచింది.అతను పలకలేదు. మాష్టర్ బెడ్రూమ్ తలుపు నెట్టింది.బెడ్ మీద విగతజీవిగా కనిపించాడు సంజీవ్. కళ్లు తెరుచుకొనే ఉన్నాయి. నోరు తెరుచుకొని నాలుక బయటకు ఉంది.రజిని కెవ్వున కేకపెట్టి బయటకు పరుగెత్తింది. గేటు దగ్గర నిలబడి ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. ఎదురింటి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కొందరు కానిస్టేబుల్స్ వచ్చారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఫొటోగ్రాఫర్ సంజీవ్ బాడీని ఫొటోలు తీస్తుంటే, ఫింగర్‌ప్రింట్ ఎక్స్పర్ట్ వాటిని సేకరించే పనిలో పడ్డాడు. పనిమనిషి రజిని ఏడుస్తూ వరండాలో కూలబడి ఉంది. ఆమెను ఎస్సై శ్రీనివాస్ విచారిస్తున్నాడు. ఇంటి యజమాని నందీశ్వర్, అతని భార్య హరిత, పిల్లలు నాగార్జునసాగర్ టూర్ వెళ్లారనీ, ఇంట్లో నందీశ్వర్ బాబాయి కొడుకు ఒంటరిగా ఉన్నాడనీ, తను నిన్న సాయంకాలం ఆరింటి వరకు ఇంట్లో ఉండి పనిచేసి వెళ్లాననీ, ఉదయం వచ్చి చూస్తే తలుపులు తీసే ఉన్నాయనీ, సంజీవ్ చనిపోయి కనిపించాడని చెప్పింది రజిని. మాష్టర్ బెడ్రూమ్ అంతా చిందరవందరగా ఉంది. బీరువాలో దుస్తులన్నీ కిందపడి ఉన్నాయి. దొంగతనం జరిగిందనీ.. డబ్బు, బంగారం పోయివుంటుందని పోలీసులు ఊహించారు.సంజీవ్ శవాన్ని పోస్ట్‌మార్టమ్ రిపోర్టు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కిచెన్ షింక్‌లో రెండు ప్లేట్లు, రెండు గాజు గ్లాసులున్నాయి. ఆ రాత్రి సంజీవ్‌తో ఎవరో ఉన్నారనీ, వాళ్లే అతణ్ని హత్య చేసి డబ్బు, నగలు దోచుకెళ్లారని అర్థమైంది. అతనితో గడిపింది ఎవరో తెలియాల్సి ఉంది.పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో అతణ్ని గొంతు పిసికి చంపారనీ, రాత్రి పన్నెండు గంటలకు చనిపోయాడనీ, అతను ఒక స్త్రీతో గడిపినట్లుగా నిర్ధారణ అయింది. నందీశ్వర్ కుటుంబం ఇల్లు చేరుకునేటప్పటికి రాత్రి పదిగంటలైంది. అతను విపరీతంగా బాధ పడుతుంటే, అతని భార్య హరిత ఏడవసాగింది.‘‘రాత్రి మీ తమ్ముడు ఎవరో ఒక స్త్రీతో గడిపాడని రిపోర్టులో ఉందండీ! అతనికి ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్ ఉందా? ఒంటరిగా ఉన్నానని ఆమెను పిలిపించుకున్నాడా?’’ అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు.‘‘లేదండీ! వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడికి గర్ల్‌ఫ్రెండ్ ఉన్నట్టు మా దృష్టికి రాలేదు’’ అన్నాడు నందీశ్వర్.‘‘మీ వాడికి కాల్ గర్ల్స్‌తో తిరిగే అలవాటు ఏమైనా ఉందా?’’‘‘అబ్బే లేదండీ.. అటువంటి అలవాట్లు లేవు’’‘‘మరి అతను గడిపింది ఎవరితో?’’‘‘అదే అర్థం కావడం లేదు’’‘‘దొంగతనం జరిగిందనేది తెలిసిపోతూ ఉంది. ఏమేం పోయాయో చెప్పండి’’హరిత చెప్పబోతుంటే వారించాడు నందీశ్వర్.‘‘క్యాష్ లక్ష రూపాయల వరకు ఉందండీ. మా ఆవిడకు ముఫ్ఫై తులాల నగలు ఉన్నాయి. అవన్నీ లేవు’’ చెప్పాడు నందీశ్వర్.నందీశ్వర్ బాబాయి, పిన్ని, ఇతర బంధుమిత్రులతో ఇల్లంతా నిండిపోయింది. అంతా సంజీవ్ అన్యాయమయ్యాడని విచారిస్తున్నారు. సంజీవ్ తల్లి గోడు గోడున ఏడుస్తోంది.‘‘వాడు హాస్టల్లో ఉంటున్నాడు. ఇంట్లో ఒక రాత్రి ఉండరా అని నేనే పిలిచాను. వాడి చావుకు నేనే కారణం’’ అని దుఃఖించాడు నందీశ్వర్. ఆ కాలనీ చౌరస్తాలోనే ఉంది నందీశ్వర్ ఉన్న డూప్లెక్స్ హౌస్. ఒక పోల్కి వారం క్రితమే సీసీ కెమెరా ఫిక్స్ చేశారు. ఆ సంగతి చాలా మందికి తెలియదు.ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రికార్డయిన ఫుటేజ్ పరిశీలిస్తుంటే నందీశ్వర్ ఇంటివైపు వెళ్తున్న యువతి కనిపించింది. భుజానికి హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకొని, లగేజ్ ట్రాలీ లాక్కుంటూ వెళ్లింది. ఇన్స్పెక్టర్ ఆ ఫుటేజ్‌ని వాట్సప్‌లో సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాడు. బంజారాహిల్స్‌లో ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న మాలినిగా పోలీసులకి ఆచూకీ దొరికింది. మాలిని సినీ/టీవీ రంగాల్లో జూనియర్ ఆర్టిస్ట్. పోలీసులు మాలినీని తమదైన శైలిలో విచారిస్తే, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్దాయి.నందీశ్వర్ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. కట్టలకట్టలు డబ్బు తెస్తున్నాడు. హరిత అప్పుడప్పుడూ నగరంలోని జ్యూయెలరీ షాపులకు వెళ్లి నగలు కొంటూ ఉంటుంది. పని మనిషి రజినిని తోడు తీసుకెళ్తూ ఉంటుంది. దాంతో రజినికి డబ్బు, బంగారంపై కన్నుపడింది.రజినికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు మునీర్. క్యాబ్ డ్రైవర్. బాగుపడాలంటే నందీశ్వర్ ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అనుకున్నారిద్దరు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మునీర్‌కు మాలినితో కూడా సంబంధం ఉంది. నందీశ్వర్ కుటుంబం టూర్ వెళ్తున్నట్టు, ఆ రాత్రి సంజీవ్ ఒంటరిగా ఉంటాడని రజిని పసిగట్టింది. ముగ్గురు తోడు దొంగలు కలిసి స్కెచ్ వేశారు. మాలిని ఇంట్లో డబ్బు, నగలు దొరికాయి. దాదాపు కోటి రూపాయలు క్యాష్, కిలో బంగారు నగలు లెక్కలోకి వచ్చాయి. అంతా అక్రమార్జన కాబట్టి నందీశ్వర్ చెప్పుకోలేక పోయాడు. ఇప్పుడు పాపం పండి బయటపడింది. దొంగతనం, హత్య కేసుల్లో రజిని, మాలిని, మునీర్ జైలు పాలైతే... అక్రమార్జన కేసులో ఇరుక్కొని నందీశ్వర్ సస్పెండ్ అయ్యాడు.‘అధికారులను ధనపిశాచం పట్టుకుంది. అడ్డగోలు సంపాదన. ఎవర్ని పట్టుకున్నా కోట్ల కొద్దీ కట్టలపాములు, కిలోల కొద్దీ బంగారు నగలు, వందల కొద్దీ ప్లాట్లు, ఫ్లాట్లు బయటపడుతున్నాయి. వీరి సంపాదన చూసి కన్నుకుట్టిన వాళ్లు నేరస్తులవుతున్నారు. దేశం ఇంకేం బాగుపడుతుంది?’ అని పత్రికలు వ్యాఖ్యానించాయి. వాణిశ్రీ -
ఆర్టీసీలో ‘దొంగలు పడ్డారు’!
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో సామగ్రికి భద్రత కరువైంది. దాదాపు ఏడేళ్ల నుంచి కడప డిపో పరిధిలో సామాన్లకు సం బంధించిన ఆడిట్ కూడా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆర్టీసీ బస్సులోల ఏవైనా వస్తువులు ప్రయాణికులు మరిచిపోతే వెంటనే ప్రకటన ఇవ్వడంకానీ, పోలీసులకు ఫిర్యా దు చేయడంగానీ జరగాలి. అలాంటివేమీ చేయకుండానే ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పలు ఆరోపణలకు తావి స్తోంది. ఆర్టీసీలో కొందరు ఇంటి దొంగలైతే, మరికొందరు బ యటివారు ఉన్నారు. అయినా వారిపై నిఘా కరువవుతోంది. ∙సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కడప డిపో గ్యారేజీలో టైర్లు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు కొత్త టైర్లు డిపో గ్యారేజీ ప్రహరీ సమీపంలో ఉన్న ఓ పాఠశాల ఆవరణంలో పడిపోయాయి. వాటిని సంబంధిత పాఠశాల వారే ఆర్టీసీ వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ⇒ ఆర్టీసీ బస్టాండ్‌లోని జనరేటర్ చోరీకి గురైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని విలువ దాదాపు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంటుంది. ⇒ ఎర్నింగ్ సెక్షన్లో కంప్యూటర్, మానిటర్లను ఎత్తుకుపోయినా దిక్కులేదని అనుకుంటున్నారు. ⇒ కండక్టర్లకు సంబంధించిన టికెట్ ట్రేలు దాదాపు 20 దాకా మాయమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ⇒ టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మిషన్) లకు సంబంధించిన సామాన్లు కూడా గల్లంతయినట్లు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు లేవనే చర్చ జరుగుతోంది. ⇒ ప్రతి డిపోకు ఇద్దరు క్యాషియర్లు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ చేయించాల్సి ఉంది. అయితే గత ఏడేళ్లుగా ఎలాంటి ఆడిట్ జరగలేదని సమాచారం. ⇒ అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 800 వివిధ రకాల సామాన్లు, పరికరాలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేకపోయినా, సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాం కడప డిపోతో పాటు అన్ని డిపోలలో ఏవైనా అక్రమాలు జరిగితే వెంటనే ఎవరైనా సరే రాత పూర్వకంగా తమ దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కడప రీజనల్ మేనేజర్ చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం కిషోర్‌లు వివరణ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒకసారి ఆడిటింగ్ డిపోల వారీగా జరగాల్సి ఉందన్నారు. కడప డిపోకు ఆడిటింగ్ ఎపుడు జరిగింది విచారించి తెలియజేస్తామన్నారు. బంగారు ఆభరణాల వ్యవహారానికి సంబంధించి బద్వేలు సంఘటనలో బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. కడప డిపోలో బంగారు ఆభరణాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విలువైన వస్తువుల మాటేమిటి ? కడప, బద్వేల్ డిపోల పరిధిల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహారం ప్రయాణికుల్లో ఆర్టీసీపై విశ్వసనీయత కోల్పోయే విధంగా ఉంది. ∙బద్వేల్ బస్టాండ్‌లో నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడు బ్యాగును మరిచిపోయి వెళ్లాడు. ఆ బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆలస్యంగా బయటకు పొక్కింది. ఐదుగురు ఉద్యోగులు కలిసి పంపకాలు చేసుకోవడంలో భేదాభిప్రాయాలు వచ్చి బయట ప్రచారం జరగడంతో ఉలిక్కిపడ్డారు. ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కంగుతిన్న సదరు ఉద్యోగులు ఎంతోకొంత డబ్బులను జమచేస్తామని చెప్పుకుంటున్నట్లు సమాచారం. ⇒ కడప డిపో పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 27న అనంతపురం నుంచి గంజికుంటకాలనీకి చెందిన షేక్ జిలానీ భార్య రుక్సానాబేగం తన పిల్లలతో కలిసి కడపకు వచ్చింది. ముద్దనూరు వద్ద టిఫెన్ తీసుకుని బస్సులోనే తిన్నారు. కడపకు చేరుకునే సరికి తమ లగేజీలోని సూట్‌కేస్ కన్పించలేదు. దీంతో చిన్నచౌక్, ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరినే నిందించడంతో మిన్నకుండిపోయారు. తర్వాత అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నా సూట్‌కేస్‌లోని వస్తువులను వేలం వేశారని, సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారని తెలిసింది. ⇒ఈ సంఘటనపై ఈనెల 18న సాక్షి దినపత్రికలో ‘కడప డిపోలోనే బంగారు ఆభరణాలు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో బాధితులు తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించారు. అధికారులు బాధితురాలిని విచారించి, త్వరలో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత విచారిస్తామని వెల్లడించినట్లు బాధితురాలు ‘సాక్షి’కి వివరించింది. ∙ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం చేశాం డీజీపీ
-
బుల్లెట్ రైలు కావాలా, భద్రత కావాలా?
న్యూఢిల్లీ: దేశంలోని భారతీయ రైల్వే రోజుకు 19 వేల రైళ్లను నడుపుతున్నాయి. తద్వారా రోజుకు 2.30 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద సంస్థగా గణతికెక్కింది. ఇది మన రైల్వేకు ఒక పార్శిక భాగం మాత్రమే. రైళ్లు తరచుగా ఆలస్యంగా నడుస్తాయి. ఇరుగ్గా, మురిగ్గా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యం ప్రయాణికులకు భద్రత తక్కువ. ఈ పార్శిక భాగమే మన ప్రభుత్వాలకు పట్టడం లేదు. దేశంలో ఒక్క 2014 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 27,581 మంది ప్రయాణికులు మరణించారు. మనకు రైళ్లను పరిచయం చేసిన బ్రిటన్ దేశంలో గడచిన దశాబ్ద కాలంలో రైలు ప్రమాదం కారణంగా ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు మరణించలేదు. నిన్నగాక మొన్న సంభవించిన పూరి–హరిద్వార్–కలింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు మరణించారు. మానవ సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలగా, రైళ్ల రాకపోకలను మూసివేయకుండా రైల్వే లైను మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తాజాగా తేలింది. రైలు పట్టాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, దేశంలోని 40 శాతం ట్రాకులను నూటికి నూరు శాతం ఇప్పటికే ఉపయోగించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో 46 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎక్కువగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు 43 శాతం జరుగుతున్నాయి. అన్ని రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లు అమర్చడం వల్లనో, వంతెనలను నిర్మించడం వల్లనో వీటిని పూర్తిగా నిర్మూలించవచ్చని రైల్వే భద్రతాచర్యలపై వేసిన కకోద్కర్ కమిటీ 2012లో సిపార్సు చేసింది. ఇలాంటి ఎన్నో కమిటీలు ఎన్నో సిఫార్సులు చేస్తున్నా పట్టించుకుంటున్న ప్రభుత్వాలు లేవు. ప్రజా సంబంధాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నామని, కొత్త లైన్లను వేస్తున్నామని ప్రకటిస్తారే తప్ప, నూటికి నూరు శాతం సర్వీసు ఇచ్చిన పాత లైన్లను తీసేసి కొత్త లైన్లను వేస్తున్నామని చెప్పరు. వేయడానికి ప్రయత్నించరు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెడుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడమే కాకుండా నిధులను కూడా విడుదల చేశారు. ఒక్క భారీ ప్రయాణికుల విమానానికయ్యే ఖర్చు ఈ ఒక్క బుల్లెట్ రైలుకు అవుతుంది. కొద్ది మంది ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ రైలు కోసం పెడుతున్న ఖర్చును పాత రైల్వేలైన్ల పునరుద్ధరణకు మళ్లించినట్లయితే 30 శాతం ప్రయాణికుల మతులను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆ నగరంలో కాలుష్యం బాగా తగ్గింది
విశాఖపట్నం: విశాఖ నగరంలో గతంలో కంటే కాలుష్యం బాగా తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతోందని తెలిపారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను ఇండస్ట్రీ హబ్‌గా తయారుచేసి తీరుతామన్నారు. భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కార్యాచరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బస్సు ఎక్కి భద్రతా తెలుసుకుని
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం మధ్యాహ్నం సల్కాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించినంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో కర్నూలులోని రిలయన్స్ మార్టు వరకు ప్రయాణించారు. మార్గమధ్యలో ప్రయాణికులతో మాట్లాడి ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని శాంతిభద్రతల వివరాలు, పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేడియో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిలయన్స్ మార్టులోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి ఉన్నారు. -
ఓఎన్జీసీ భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : భద్రత విషయంలో ఓఎన్జీసీ రాజీ లేకుండా పనిచేస్తోందని ఆ సంస్థ రాజమహేంద్రవరం ఎసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ పేర్కొన్నారు. 46వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఆయన ఓఎన్జీసీ రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్‌లో సోమవారం ప్రారంభించారు. భద్రత నియమాలు ప్రాణాలను కాపాడతాయనే నినాదంతో జాతీయ భద్రతా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సన్యాల్ మాట్లాడుతూ ఆయిల్ , గ్యాస్ నిక్షేపాలను కనుగొనడం, వెలికితీసే పరిశ్రమ హైరిస్క్‌తో కూడుకుందన్నారు. అయినప్పటికీ భద్రతా నియమాలను నిబద్ధతతో పాటిస్తున్నందునే ఓఎన్జీసీలో ప్రమాదాల సంఖ్య తక్కువన్నారు. ఓఎన్జీసీ ఎంతో అనుభవజ్ఞులైన మానవ వనరులను కలిగి అత్యంత సమగ్రమైన మౌలిక సదుపాయాలతో కూడి తమ ఆపరేషన్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రతే మొదటి ప్రాముఖ్యతగా పరిగణించే సంస్థగా ఓఎన్జీసీ నిరంతరం తన వద్ద పనిచేసే ఉద్యోగులకు భద్రతా సంబంధిత విషయాలలో శిక్షణ ఇస్తోందన్నారు. దేబశీష్ సన్యాల్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగులందరూ తమ కుటుంబ, తమ చుట్టూ ఉన్న సొసైటీ, సంస్థే కాకుండా జాతీయ అవసరాల దృష్ట్యా ప్రమాదాలను నివారించడంతో పాటు వ్యాధులు రాకుండా , పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఏడాది థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఉద్యోగులు, సాధారణ ప్రజలతో పాటు స్కూలు పిల్లల్లో కూడా అవగాహన కలిగించడానికి వారం పాటూ సాగే పలు కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తోందన్నారు. ఈ నెల పదో తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.