కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
Published Sat, Aug 6 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్
పెనుమూడి (రేపల్లె): కృష్ణా పుష్కరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ చెప్పారు. పెనుమూడి పుష్కరఘాట్‌ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని భావిస్తుండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుష్కరఘాట్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పాత నేరస్తుల కదలికలను పసిగట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను నిర్ణయించామన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆయన వెంట బాపట్ల, నరసరావుపేట డీఎస్పీలు పి.మహేష్, నాగేశ్వరరావు, పట్టణ, రూరల్ సీఐలు వి.మల్లికార్జునరావు, పెంచలరెడ్డి, ఎస్‌ఐలు పి.సురేష్, అహ్మద్‌జానీ, రవీంద్రారెడ్డి, కూచినపూడి మార్కెట్‌యార్డు చైర్మన్ పంతాని మురళీధరరావు, నాయకులు అనగాని శివప్రసాద్, సుఖవాసి సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement