rural sp
-
గుంటూరు రూరల్ ఎస్పీని కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు
సాక్షి, గుంటూరు : బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా వ్యవహరించిన గురజాల సీఐపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి గురజాల సీఐ రామరావుపై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం కేసును ప్రత్యేక డీఎస్పీతో దర్యాప్తు చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు. అంతేకాక కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అసలు ఓట్లు తొలగించి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. -
రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష
పాతగుంటూరు: జిల్లా సూపరింటెండెంట్ కె.నారాయణ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నేర సమీక్షసమావేశం ఆదివారం ఉమేష్ చంద్ర సమావేశమందిరంలో జరిగింది. సమావేశంలో కృష్ణా పుష్కరాలు అత్యంత సమర్థవంతంగా పనిచేసిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ఈనెల 11న జరిగిన లోక్ అదాలత్‌లో జిల్లాపోలీసులు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాను మూడో స్థానం నిలిపినందుకు అభినందనలు తెలిపారు. రానున్న మహాశివరాత్రికి కోటప్పకొండ, జిల్లాలోని ఇతర శైవక్షేత్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేసి, నేరాలను అరికట్టాలన్నారు. స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఆప్రాంతంలో ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రామాంజనేయులు, వై.టి.నాయుడు, ఏఎస్పీ తుళ్లూరు విక్రమ్‌పాటిల్, డీఎస్పీలు మధుసూధనరావు, నాగేశ్వరరావు, మహేష్, రమణమూర్తి, వెంకటనారాయణ, సుధాకర్, సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, లక్ష్మయ్య, విక్రమ్ శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పాల్గొన్నారు. -
రూరల్ ఎస్పీకి మానవహక్కుల సంఘం నోటీసులు
దుగ్గిరాల (గుంటూరు): ఆస్తి విషయమై కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదంతో దళితులను బలిగొన్న సంఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ళ సీతమ్మ కుటుంబంలో తలెత్తిన వివాదంలో ప్రమేయం లేని ఎస్సీలపై పాశవికంగా దాడి చేయడంతో ఇద్దరు దళితులు బలయ్యారు. ఈ ఘటనలో కుటుంబ యజమానులను కోల్పోయి దిక్కుతోచని దుస్థితిలో ఉన్న మతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ చిలువూరు గ్రామనికి చెందిన చిలువూరు నాగరాజు గత నెల 17న మానహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.స్పందించిన కమిషన్ ఈ ఘటనకు సంబందించి సమగ్ర నివేదికను నవంబర్ 28వ తేదీ లోగా అందజేయాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి నోటీసులు జారీ చేసినట్టు నాగరాజు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు ఐటీఐ భవనం పరిశీలన
మహబూబాబాద్ : తాత్కాలిక ఎస్పీ కార్యాలయ ఏర్పాటు కోసం పట్టణ శివారులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవనాన్ని బుధవారం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయ ఏర్పాటుకు భవనం అనుకూలంగానే ఉందన్నారు. ఎస్పీ కార్యాలయం, ఏఆర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆ భవనం చుట్టూ పరిసరాలను కూడా పరిశీలించామన్నారు. ఆ భవనం సమీపంలోనే సబ్‌జైల్ ఉండటం వల్ల భద్రత కూడా బాగానే ఉంటుందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. క్రైం టీమ్‌లను పెంచి చోరీలను అరికడతామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మూడు విభాగాలుగా చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐలు నందిరామ్ నాయక్, ఎస్.కృష్ణారెడ్డి ఉన్నారు. -
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం
కమాండ్ కంట్రోల్ అండ్ వాట్సప్ నంబర్ ఏర్పాటు పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వాట్సప్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ తెలిపారు. రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన వాట్సప్ నెంబర్‌ను అధికారికం గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో జరి గే అక్రమాలు, శాంతిభద్రతలకు భంగం కల్గించే ఘటనలను, ఆపద సమయంలో పోలీసుల స హాయం కోసం సమాచారం అందించేందుకు 85009 27777 నంబర్‌తో వాట్సప్‌కు సమాచా రం అందిస్తే వెంటనే పోలీసుల సహాయం అం దుతుందన్నారు. ఈ నంబర్‌తో వచ్చే సమాచా రం, ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలు అందుబాటులో... పోలీసులు ఎంత నిఘా పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అక్రమాలను అరికట్టలేమన్నారు. ఈ వాట్సప్ నెంబర్‌కు రూరల్ పరిధిలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, ఇసుక అక్రమ రవాణా, గుట్కా, గుడుంబా తయారీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తే పోలీసు అధికారులు వెంటనే స్పందిస్తారని అన్నారు. వాట్సప్ కమాండ్ కంట్రోల్‌కు ఎస్ఐ ఇన్చార్జి నేతృత్వంలోని ముగ్గురు కానిస్టేబుళ్ల బృందం 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నేరాల నియంత్రణలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలి రూరల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నlకేసుల పరిష్కారానికి వెంటనే చేపట్టాలని ఎస్సీ కిషోర్‌ఝూ పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులతో నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. జిల్లాల విభజన నేపథ్యంలో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, డీపీవో ఏవో సత్యనారాయణరెడ్డి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల డీఎస్సీలు పద్మనాభరెడ్డి, రాజమహేంద్రనాయక్, మురళీధర్, సుదీంధ్ర, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలాజీ, వరంగల్ రూరల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
‘అమరవీరుల సంస్మరణ’ పోటీల గడువు పెంపు
వరంగల్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్, రూరల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 30వ తేదీ వరకు అందించవచ్చని సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగా అన్ని పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే అందించాలని గడువు విధించామన్నారు. అయితే అందరి విజ్ఞప్తి మేరకు ఈనెలాఖరు వరకు గడుపు పెంచినట్లు వారు పేర్కొన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌పై కథనాలు, వార్తలు, వీడియోలను కమిషనరేట్ పరిధిలోని ఎంట్రీలను పీఆర్వో మో హన్కృష్ణ(94409–04687), రూరల్ జిల్లా పోలీసు పరిధిలోని ఎంట్రీలను రూరల్ ఎస్పీ పీఆర్వో తాళ్లపల్లి రామారావు (94409–04670)కు అందించాలన్నారు. -
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ పెనుమూడి (రేపల్లె): కృష్ణా పుష్కరాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ చెప్పారు. పెనుమూడి పుష్కరఘాట్‌ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని భావిస్తుండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుష్కరఘాట్ పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పాత నేరస్తుల కదలికలను పసిగట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను నిర్ణయించామన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆయన వెంట బాపట్ల, నరసరావుపేట డీఎస్పీలు పి.మహేష్, నాగేశ్వరరావు, పట్టణ, రూరల్ సీఐలు వి.మల్లికార్జునరావు, పెంచలరెడ్డి, ఎస్ఐలు పి.సురేష్, అహ్మద్‌జానీ, రవీంద్రారెడ్డి, కూచినపూడి మార్కెట్‌యార్డు చైర్మన్ పంతాని మురళీధరరావు, నాయకులు అనగాని శివప్రసాద్, సుఖవాసి సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
హరిత తెలంగాణకు పాటుపడాలి
రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా రఘునాథపల్లి : సామాజిక బాధ్యతగా అందరూ మొక్కలు నాటి హరిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వరంగల్ రూరల్ ఎస్సీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. హరితహారంలో బాగంగా బుధవారం మండల కేంద్రంలోని సేయింట్ మేరీ పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఎండీ సఫియాబేగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. వరంగల్ రూరల్ పరిధిలో ప్రజలతో మమేకమై ఇప్పటికే 5 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటడమే ఏకైక మార్గమన్నారు. ఎమ్మెల్యే టి.రాజయ్య మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి, రూరల్ సీఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు, ట్రైనీ ఎస్సై సుధాకర్, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ మల్కాపురం లక్ష్మయ్య, ఫాదర్ చిన్నపురెడ్డి, ప్రిన్స్‌పాల్ ఆల్బర్ట్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. –––––––––––––––––––––– 03ఎస్టిజి501 రఘునాథపల్లిలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న ఎస్పీ, ఎమ్మెల్యే -
హరితవనంతోనే బంగారు తెలంగాణ
మొక్కలను పిల్లల్లా పెంచాలి అడవుల శాతం పెరగడానికి కృషి చేయాలి ఎస్పీ అంబర్ కిశోర్ ఝా పరకాల : హరితవనంతోనే బంగారు తెలంగాణకు బాటలు పడతాయని జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీసు అమరవీరుల స్మారకార్థం మంగళవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయన్నారు. నాటిన మొక్కలను చిన్న పిల్లల మాదిరిగా పెంచితే తర్వాత అవి పండ్లు ఇస్తాయన్నారు. మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం నెలకు కొంత మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. 33 శాతం ఉన్న అడవుల శాతాన్ని 50 శాతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్మారకార్థం మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సబ్ డివిజన్లో లక్ష మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, తహసీల్దార్ పి.హరికృష్ణ, ములుగు ఫారెస్ట్ రేంజర్ పూర్ణిమ, ఎస్సైలు దీపక్, రవీందర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ‘పరీక్షలు’
వరంగల్ : కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో శనివారం 1028 మందికి పరుగు పందెం నిర్వహించారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. హన్మకొండ జేఎన్ఎస్ మైదానంలో ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించిన సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన పోటీల్లో 826 మంది పురషు లు, 142 మంది మహిళలు పాల్గొన్నారు. అర్హత పొందిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎంపికలో అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎఎస్పీ విశ్వజిత్ కంపాటీ, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్‌కుమార్, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర పాల్గొన్నారు. -
ఖాకీ జాగా.. అయినా పాగా!
► ఆక్రమణలకు గురవుతున్న పోలీస్ శాఖ స్థలాలు ► వినుకొండ, మాచర్ల, రేపల్లెలో అన్యాక్రాంతం ► గుర్తించిన రూరల్ ఎస్పీ తొలిగించాలంటూ ఆదేశాలు సార్.. దౌర్జన్యంగా నా ఇంటిని ఆక్రమించారు... నా భూమిని రియల్ మాఫియా కబ్జా చేసింది...న్యాయం చేయండి.. అంటూ నిత్యం బాధితులు పోలీసులను ఆశ్రయించడం చూస్తూనే ఉంటాం. ఇదంతా మామూలే అనుకుంటాం. కానీ.. పోలీసు శాఖకు చెందిన స్థలాలే ఆక్రమణకు గురవుతున్నాయంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. స్వయానా పోలీసు ఉన్నతాధికారులే ఈ విషయాన్ని గుర్తించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు తమ స్థలాలను ఎలా రక్షించుకుంటారో వేచి చూడాలి.. సాక్షి, గుంటూరు : జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ పాత భవనాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువచేసే స్థలాలు ఆక్రమణల చెరలోకి వెళ్లాయి. ముఖ్యం గా శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్‌లో సిబ్బంది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఎవరూ లేరుకదా అని కొందరు వీటిని ఆక్రమించేశారు. అనేక ఏళ్లుగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్నా అప్పటి పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. తర్వాత వచ్చిన పోలీసులు మనకెందుకే గొడవ.. అన్ని మిన్నకున్నారు. పోలీస్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా కనీసం ఫిర్యాదు చేసేవారు లేకపోవడం, పోనీ మనశాఖ స్థలాలే కదా సుమోటోగా కేసులు నమోదు చేద్దాం అనే ఆలోచన ఏ ఒక్క పోలీస్ అధికారికీ రాకపోవడం శోచనీయం. ఎస్పీ పర్యటనతో వెలుగులోకి.. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ జిల్లాలో పోలీసుల పనితీరు తెలుసుకునేందుకు ఇటీవల విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో మాచర్ల, కారంపూడి, వినుకొండ, రేపల్లెతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీస్‌శాఖ స్థలాలు ఆక్రమణలో ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు తెలిసింది. దీంతో అక్కడి ఆక్రమణదారులను ఖాళీ చేయించి స్థలాలను స్వాధీనం చేసుకోవాలని అక్కడి పోలీస్ అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఆక్రమణలకు గురైన స్థలాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించినట్లు తెలిసింది. స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటకుతీసి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆక్రమణల్లో ఉన్న పోలీస్ స్థలాలను వెనక్కు తీసుకుని సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించి తిరిగి వాటిని వినియోగంలోకి తేవాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐదు పాత పోలీస్స్టేషన్ల స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆక్రమణలను తొలగిస్తే స్థలం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. -
టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు..
* గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు * రక్షణ కల్పించాలని వినతి గుంటూరు క్రైం: ‘మా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ భార్య ఉద్దేశపూర్వకంగా నిత్యం మమ్మల్ని దుర్భాషలాడుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం గుంటూరులోని నగరంపాలెం పోలీసుస్టేషన్లో మాపై అక్రమ కేసు బనాయించింది...’ అని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్వార్టర్స్‌కు చెందిన పలువురు మహిళలు రూరల్ ఎస్పీ పి.హెచ్.రామకృష్ణను కలిసి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు గ్రీవెన్స్ జరిగింది. మొత్తం వందకు పైగా అందిన ఫిర్యాదులను ఎస్పీ రామకృష్ణ, అదనపు ఎస్పీ డి.కోటేశ్వరరావులు పరిశీలించారు. సంబంధిత ఫిర్యాదు వివరాలను ఆయా స్టేషన్లకు అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కొందరు బాధితుల సమస్యలు వారి మాటల్లోనే... కక్ష పెంచుకున్నారు.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాను. అప్పటినుంచి నాపై కక్ష పెంచుకున్న టీడీపీకి చెందిన కార్యకర్తలు చల్లా రాజశేఖరరెడ్డి, ఓర్సు శ్రీను, గోవిందు, గరికపాటి శ్రీను, ఎస్.మంగమ్మలు నిత్యం పలు సాకులు చూపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈనెల 24న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు మా ఇంటిపై దాడి చేశారు. దుర్భాషలాడి కులం పేరుతో దూషించడంతోపాటు, కాలనీ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే హతమారుస్తామని హెచ్చరించారు. వారినుంచి ప్రాణ రక్షణ కల్పించి కులం పేరుతో దూషించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. - జాజుల శాంత, ఆదర్శనగర్ కాలనీ,పిడుగురాళ్ళ మండలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. మా గ్రామంలోని సి.హెచ్.మహేశ్వరరెడ్డి 21 సెంట్ల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు నా వద్ద తాకట్టు పెట్టి రూ.10 లక్షలు ఈ ఏడాది జూన్‌లో తీసుకున్నాడు. అనంతరం అతని పేరుతో రిజిస్టర్ అయిన స్థలాన్ని నాకు తెలియకుండా రహస్యంగా రిజిస్టర్ రద్దు చేయించాడు. విషయం తెలియడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశాను. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. ఇదే విషయంపై పిడుగురాళ్ళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలి. - భవిరిశెట్టి సూర్యనారాయణ, పిడుగురాళ్ల బెల్టుషాపు తొలగించాలి.. రేపల్లె, చెరుకుపల్లి రహదారిలో ఇటీవల నూతనంగా బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దాని పక్కనే బెల్టుషాపును కూడా కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో బెల్టుషాపులు కొనాగిస్తుండటంతో సమీప ప్రాంతంలో ఉన్న మేం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. - కె.సాయికుమారి, నగరం -
రక్షణ కల్పిస్తారా.. ఊరు ఖాళీ చేయమంటారా ?
టీడీపీ వర్గీయుల దాడులపై రూరల్ ఎస్పీతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సాక్షి, గుంటూరు: జిల్లాలోని అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు వారికే సహకరిస్తూ తమపై ఎదురు కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ►ముఖ్యంగా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని, రెండు నెలల వ్యవధిలో ఆ గ్రామంలో ఏడుసార్లు దాడులకు తెగబడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఎస్పీని కోరారు. ►ఎస్పీగా మీరు రక్షణ కల్పిస్తే గ్రామంలో ఉంటారని లేదంటే గ్రామం విడిచి వెళ్లిపోతారని తెలిపారు. ►గ్రామంలో శిలాఫలకాలు ధ్వంసం చేయడం, వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెలు పగలగొట్టడం, ఇళ్లపై దాడులు చేసి ధ్వంసం చేయడం ఇలా ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా వారిపై కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఎస్పీ దృష్టికి తెచ్చారు. ►దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఇతర గ్రామాల నాయకులను ఆసుపత్రిలోనే కొట్టినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ►మేం చేసేదేమీ లేదు..సారీ అంటూ నరసరావుపేట పోలీసు అధికారులంతా చేతు లెత్తేస్తున్నారని వారి వల్ల తమకు న్యాయం జరిగే పరిస్థితి లేదని ఎస్పీకి తెలిపారు. ►ఒకటికి మించి ఎక్కువ కేసుల్లో ఉన్న నిందితులను గుర్తించి వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడం ఈ ప్రభుత్వానికి చేతకాదంటే చెప్పండి మేమే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతామంటూ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎస్పీతో చెప్పారు. ►దీనికి స్పందించిన రూరల్ ఎస్పీ రామకృష్ణ యల్లమంద గ్రామంపై ప్రత్యే దృష్టి సారించి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాడులపై అసెంబ్లీలో చర్చకు అనుమతించకపోవడం దారుణం... ►వైఎస్సార్ సీపీ నాయకులను హతమార్చినా, దాడులకు పాల్పడిన సంఘటనలపై అసెంబ్లీలో చర్చకు కూడా స్పీకర్ అనుమతించకపోవడం దారుణమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ►రూరల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ మనుషుల ప్రాణాల కంటే ముఖ్యమైన చర్చ ఏముంటుందో చెప్పాలని టీడీపీ నాయకులను కోరారు. ►జిల్లాలో టీడీపీ నాయకులు పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి మరీ దాడులు చేస్తున్నారని, ఇప్పటికైనా వీటిని ఆపకపోతే వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు
రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ సాక్షి, గుంటూరు: జిల్లాలో ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించేందుకు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్‌లు ఉన్న పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించినా, అరికట్టడంలో అలసత్వం వహించినా పోలీసు అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు..ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఇప్పటికే దాడులు నిర్వహించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, లారీలు, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నాం. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొల్లిపర ఎస్సై ప్రభాకర్‌ను వీఆర్‌కు పిలిచాం. ►శాంతి భద్రతల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తా, పోలీసుల వైఫల్యం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటా. లాటరీ, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలకు వెనుకాడం. ►పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం.. రూరల్ పరిధిలో సిబ్బంది కొరత వల్ల పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, తొలిసారిగా సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు మంజూరు చేస్తున్నా. స్టేషన్‌లోని సిబ్బందిని బట్టి రోజుకు ముగ్గురు, నలుగురు చొప్పున సెలవు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చా. ►‘వారథి’ కార్యక్రమం ద్వారా సిబ్బందికి ఉండే పాలనాపరమైన సమస్య లు తెలుసుకునేందుకు ఒక సీఐతో టీమ్‌ను ఏర్పాటు చేసి ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించాం. ►సిబ్బంది నిత్యవసర వస్తువులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు త్వరలో గురజాలలో పోలీసు సబ్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదే తరహాలో నరసరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి, తెనాలిలలో కూడాఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 20 నుంచి 40 శాతం రాయితీతో నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తాం. ►కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్న 15 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవడం లేదు. మేం కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తాం. ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం ... ►జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఫ్యాక్షన్‌కు పాల్పడు తున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు జిల్లా రూరల్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ తెలిపారు. ►గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. ►గొడవలకు పాల్పడేవారిని గుర్తించి తమదైన పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికే ఆయా ప్రాంతాల పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.