కొనసాగుతున్న ‘పరీక్షలు’
Published Sun, Jul 31 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
వరంగల్ : కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో శనివారం 1028 మందికి పరుగు పందెం నిర్వహించారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. హన్మకొండ జేఎన్‌ఎస్ మైదానంలో ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించిన సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన పోటీల్లో 826 మంది పురషు లు, 142 మంది మహిళలు పాల్గొన్నారు. అర్హత పొందిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎంపికలో అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎఎస్పీ విశ్వజిత్ కంపాటీ, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌కుమార్, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర పాల్గొన్నారు.
Advertisement
Advertisement