physical tests
-
TS Police: ఈవెంట్స్ కంప్లీట్.. ఫైనల్ పరీక్షలకు బస్తీమే సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిటెనెన్ టెస్టుల్లో పాల్గొన్నారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈవెంట్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 2.07 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా, 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. 15644 కానిస్టేబుల్ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. కాగా, ఈవెంట్స్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్‌కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్టు బోర్డ్ తెలిపింది. ఈ రిక్రూట్మెంట్లో 53.7 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఇక, 2018-19 నోటిఫికేషన్లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయనట్టు బోర్టు అధికారులు వెల్లడించారు. -
TS: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. -
గర్భిణీ అభ్యర్థికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గర్భిణీగా ఉన్న ఓ మహిళా అభ్యర్థికి పోలీసు రిక్రూట్మెంట్లో దేహదారుఢ్య పరీక్ష నుంచి తాత్కాలిక మినహాయింపునిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గర్భిణీగా ఉన్న నేపథ్యంలో ఆ మహిళను రాత పరీక్షకు అనుమతించాలని పోలీసు బోర్డును ఆదేశించింది. ఫలితాలు వెలువడ్డ నెల రోజుల్లోపు దేహదారుఢ్య పరీక్షకు హాజరవుతానని రిక్రూట్మెంట్ బోర్డుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆమెకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పలు పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో తాను అర్హత సాధించానని, అయితే ప్రస్తుతం తాను 27–28 వారాల గర్భంతో ఉన్నానని, అందువల్ల దేహదారుఢ్య పరీక్ష నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కోరినా బోర్డు అధికారులు స్పందించలేదంటూ సూర్యాపేట జిల్లా సోమ్లా నాయక్ తండాకు చెందిన ఎం.ప్రమీల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో వివాహిత స్త్రీలు అనర్హులని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పిటిషనర్ తాత్కాలికంగానే దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోరుతున్నారని, ప్రసవం తర్వాత ఆమె దేహదారుఢ్య పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మినహాయింపునిచ్చేందుకు ఇది న్యాయమైన కారణమన్నారు. అయితే అధికారులు ఈ విషయంలో ఏ మాత్రం స్పందించట్లేదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, దేహదారుఢ్య పరీక్ష నుంచి ప్రమీలకు తాత్కాలిక మినహాయింపునిచ్చారు. తుది రాతపరీక్షకు ప్రమీలను అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. -
పోలీసు అభ్యర్థులారా.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల కోసం వివిధ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసుశాఖ సూచించింది. నకిలీ ఈమెయిళ్లు, వెబ్సైట్లు సృష్టించి దళారులు అభ్యర్థులను మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత పోలీసు నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదని బుధవారం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) స్పష్టంచేసింది. అభ్యర్థులకు నకిలీ ఈ–మెయిళ్లు, వీడియోలు పంపి మోసగాళ్లు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారని.. ఇలాంటి ఈ–మెయిళ్లు వచ్చినా, వెబ్సైట్లు కనిపించిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఈ తరహా మోసాలకు పాల్పడేవారికి ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని తెలిపింది. అన్ని పరీక్షల ఫలితాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ (https://www.tslprb.in) వెబ్సైట్లోనే తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఇతర సందేహాలు ఏమైనా ఉంటే.. 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. అభ్యర్థులకు పెర్ఫామెన్స్ షీట్లు.. నియామక ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేసుకునే విధంగా ఈ సారి పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఇందుకోసం గత 5 వారాలుగా వివిధ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఆయా పరీక్షల వారి పెర్ఫామెన్స్ షీట్లను వారికి ఆన్లైన్ ద్వారా పంపామని వివరించింది. ఇప్పటివరకు దాదాపుగా 2,17,361 మంది అభ్యర్థులకు జారీ చేశామని తెలిపింది. వీరంతా వారి ఐడీల ద్వారా లాగిన్ అయి చూసుకోవచ్చంది. ఇంకా 250 పెర్ఫామెన్స్ షీట్లు మాత్రం సాంకేతిక కారణాల వల్ల పంపలేకపోయామని, వాటినీ త్వరలోనే పంపుతామంది. ఇక దరఖాస్తులు సమర్పించే సమయంలో కొందరు అభ్యర్థులు కొన్నిచోట్ల పొరపాట్లు చేశారని తెలిపింది. ఈ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వీరందరూ నిరభ్యంతరంగా తర్వాతి పరీక్షలు రాసుకోవచ్చని సూచించింది. త్వరలోనే ఎడిట్ ఆప్షన్ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని బోర్డు వెల్లడించింది. ఫిజికల్ టెస్ట్‌ల సమయంలో తప్పులు జరిగితే.. దేహదారుఢ్య పరీక్షల సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సమర్పణలో జాప్యం చేసిన అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్ మేన్ల ఆప్షన్లు, జెండర్ విషయంలో తప్పులు చేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు.. ఈ నెల 28, 29న అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్ (ఎస్ఏఆర్ సీపీఎల్)లో చీఫ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులను ఉదయం 6 గంటల తర్వాత కలవొచ్చని బోర్డు సూచించింది. అభ్యర్థుల సమస్యలు విన్న తర్వాత వారు పరిష్కరిస్తారని బోర్డు తెలిపింది. -
కొలువే లక్ష్యం..
ఆదిలాబాద్స్పోర్ట్స్: పోటీ ప్రపంచంలో ఉద్యోగసాధనే మంత్రంగా యువత తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా శాయశక్తులా యత్నిస్తోంది. పోలీసు ఉద్యోగం దక్కించుకునేందుకు అభ్యర్థులు లక్ష్యం దిశగా పరుగెడుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నియామకానికి చేపట్టే దేహదారుఢ్య పరీక్షల కోసం కఠోర సాధన చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరీక్షల ప్రక్రియ ప్రారంభం కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభ్యర్థులకు మార్చి 1 నుంచి 19వరకు ఆదిలాబాద్ పోలీసు పరేడ్ మైదానంలో జరగనున్నాయి. అభ్యర్థు లు ఇందులో నెగ్గాలంటే నిరంతర సా ధనతోనే సాధ్యమవుతుంది. పోటీల్లో నేరుగా పాల్గొంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత రుగ్మతలున్నవారు పోటీ నుంచి తప్పుకోవడమే మేలంటున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మెలకువలు పాటించడం ద్వారా సునాయసంగా పరీక్షల్లో నెగ్గవ చ్చని శిక్షకులు సూచిస్తున్నారు. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోటీల్లో నిర్వహించే పరీక్షలపై ప్రత్యేక కథనం.. దేహదారుఢ్య పరీక్షల అర్హత వివరాలు.. ఈవెంట్ పురుషులకు మహిళలకు 100 మీటర్ల పరుగు: 15 సెకన్లు 20 సెకన్లు లాంగ్‌జంప్: 3.80 మీటర్లు 2.50 మీటర్లు షాట్‌పుట్: (7.26కేజీలు) (4కేజీల బరువు) 6.60 మీటర్లు 3.75మీటర్లు హైజంప్: 1.20 మీటర్లు ఉండదు 800 మీటర్ల పరుగు: 170 సెకన్లు ఉండదు శరీరదారుఢ్య పరీక్షల్లో పరీక్షించే అంశాలివే... పోలీసు కొలువుల నియామకానికి నిర్వహించే దేహదారుఢ్య పరీక్షల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఈపరీక్షలు నిర్వహిస్తారు. పురుషులకు లాంగ్‌జంప్, హైజంప్, షాట్పుట్తోపాటుగా 100, 800 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో గా పూర్తి చేసి అర్హత సాధించాల్సి ఉంటుంది. మహిళలకు 100 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుం ది. ఇవి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కొలతలు, నిర్ధారిత సమయాల్లో తేడాలుంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పరుగుపోటీల్లో ప్రధానంగా 100 మీటర్లు, 800 మీటర్ల పోటీలో పాల్గొనే ముందు అభ్యర్థులకు కనీసం 5 నిమిషాల స మయం ఉం టుంది. ఈ సమయంలో నిల్చున్నచోటే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని పరుగుకు అనుకూలంగా మార్చుకునేలా, పరి గెత్తేటప్పుడు కండరాలు పట్టేయకుండా ఉండేలా సంసిద్ధీకరణ (వార్మప్) వ్యాయామాలు చేయాలి. హైజంప్, లాంగ్‌జంప్ ఈరెం డు పోటీల్లో పాల్గొనే ముందు కింద కూర్చుని తమ కాళ్లను వదులుగా చేయాలి. దీనివల్ల తొడ కండరాలు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. షాట్‌పుట్ వేసేముందు భుజాల వ్యాయామం చేయాలి. మెళుకువలతో సాధన చేసినవారు సులువుగా షాట్‌పుట్‌ను విసరవచ్చు. పోటీల్లో పాల్గొనే రోజు ఇలా చేయండి దేహదారుఢ్య పరీక్షల రోజు భోజనం చేయవద్దు. పండ్లు, పండ్లరసాలతోపాటుగా కొద్ది మొత్తంలో డ్రైప్రూట్స్ తీసుకోవాలి. ద్రవపదార్థాలు వెంట ఉంచుకోవాలి. తక్షణ శక్తి కోసం నిమ్మరసం, గ్లూకోజ్పౌడర్ వంటివి వెంట తెచ్చుకోవాలి. అవసరమైన సందర్భంలో మితంగా తీసుకోవచ్చు. కూల్‌డ్రింక్స్ వంటివి వినియోగించవద్దు. దేహదారుఢ్య పరీక్షలకంటే ముందు ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి గురికాకుండా ఉండేలా కొద్దిసేపు ద్యానం చేయాలి. అన్నిటికంటే ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో పోటీలో పాల్గొంటే సులువుగా అర్హత సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరుగు పోటీ కీలకం.. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గాలంటే పరుగు పోటీ అతి కీలకమైంది. ముఖ్యంగా 100, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేయాల్సి ఉం టుంది. ఇందుకోసం అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తీవ్రంగా సా ధన చేసినవారు ఎక్కువ మంది సఫలం అయ్యే అవకాశాలుంటాయి. పరుగులో రాణించేలా ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. శిక్షకుడి పర్యవేక్షణలో పరుగును సాధన చేస్తే త ప్పులు సరిదిద్దుకునే అవకాశముంటుంది. పొరపాటునా కూడా ఏఅభ్యర్థి సాధన లేకుండా ఈ పో టీల్లో పాల్గొనవద్దు. గతంలోలాగా అనారోగ్యంగా ఉన్నవారికి మరోసారి పరీక్షలకు అవకాశం ఇవ్వాలి. – సుదర్శన్, మాజీ సైనికుడు, శిక్షకుడు, ఆదిలాబాద్ సాధన లేకుండా నేరుగా పాల్గొంటే.. దేహదారుఢ్య పరీక్షలకు సాధన లేకుండా నేరుగా పోటీల్లో పాల్గొంటే ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయని వైద్యనిపుణులు సూచిస్తున్నా రు. 100, 800 మీటర్ల పరుగు పోటీల్లో వేగంగా ప రిగెత్తే క్రమంలో గుండె వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకునే సందర్భంలో ఊ పిరితిత్తుల్లోని కవాటాలు మూసుకుపోయి శ్వాస ఆగిపోయే అవకాశం ఉంటుంది. స్పృహ తప్పిపోతారు. ప్రాథమిక చికిత్స అందకపోతే మరణించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఎలాంటి ప్రాక్టీసు లేకుండా హైజంప్, లాంగ్‌జంప్ పోటీల్లో నేరుగా పాల్గొంటే తొడకండరాలు పట్టుకోవడంతోపాటు మోకాలిచిప్పలు దెబ్బతింటాయి. కిందపడ్డప్పుడు ఎముకలు విరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక షాట్‌పుట్‌ను ఎలాంటి సాధన లేకుండా నేరుగా విసిరితే భుజానికి గాయమయ్యే ప్రమాదంతోపాటు షోల్డర్ డిస్లొకేట్ అయ్యే అవకాశాలుంటాయి. ప్రాక్టీసు చేసినవారే పాల్గొనాలి.. పోలీసు ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎట్టి పరిíస్థితుల్లో సాధన చేయకుండా నేరుగా పోటీల్లో పాల్గొనవద్దు. కనీసం మూడు నుంచి నాలుగునెలలైనా ప్రాక్టీసు చేసి ఉండాలి. సాధన చేసేటప్పుడు శ్వాసలో ఇబ్బంది, చాతిలో నొప్పిలాంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపెండిక్స్, హెర్నియా, శస్త్రచికిత్సలు, స్టంట్ పడ్డవారు పోటీల్లో పాల్గొనకపోవడమే ఉత్తమం. గుండె సంబంధ వ్యాధులున్నవారు సైతం పోటీలకు దూరంగా ఉండాలి. పూర్తి స్థాయిలో సన్నద్ధమైనవారే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. – మనోహర్, వైద్యుడు -
కానిస్టేబుల్ రాత పరీక్షకు కసరత్తు
- ఈ నెల 22, 29 తేదీల్లో నిర్వహణ - మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు బయోమెట్రిక్ స్కానింగ్ అమలు - హాజరుకానున్న కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులు కర్నూలు: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు పోలీసు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ నియామక దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 20తో ముగిశాయి. మొత్తం 221 పోస్టులు భర్తీకి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు 16,800 మందికి కర్నూలులోనే రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం కర్నూలులో 27 సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 494 మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. అందులో 14,776 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. వారికి 29వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అయితే అంతకుముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఇతర వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు పరీక్ష కేంద్రం వద్ద చూపితేనే లోనికి అనుమతిస్తారు. బయోమెట్రిక్ స్కాన్ విధానం అమలు... పరీక్షలలో రకరకాలుగా జరిగే మాల్ ప్రాక్టీస్‌లు మోసాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించి సుమారు 94 మందిని పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లుగా నియమించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో వారందరికీ బయోమెట్రిక్ వేలిముద్ర సేకరణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాగ్నటిక్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి హాజరైన భాస్కర్.. బయోమెట్రిక్ విధానం గురించి వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లపై ఉండే బార్‌కోడ్‌ను బయోమెట్రిక్ స్కాన్ చేసిన తర్వాత అభ్యర్థి పూర్తి వివరాలను ధ్రువీకరించనున్నారు. బయోమెట్రిక్ ద్వారా ఎడమ, కుడి చేతి చూపుడు వేలి ముద్రలను తీసుకుంటారు. ఒక అభ్యర్థి బదులు మరొక అభ్యర్థి పరీక్ష రాయడం వంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వర్క్‌షాప్ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై ఇన్విజిలేటర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బయోమెట్రిక్ వేలిముద్రల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, సీసీఎస్ సీఐ ఓబులేసు, ఫింగర్ ప్రింట్స్ సీఐ ఆర్.శివారెడ్డి, ఈ–కాప్స్ సిబ్బంది, ఐటీ కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
31 వరకు ‘కానిస్టేబుల్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కాకినాడలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ శుక్రవారం తెలిపారు. కాకినాడ మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇటీవల తుపాను ప్రభావం కారణంగా కాకినాడలో వాయిదా పడిన దేహదారుఢ్య పరీక్షలను 24 నుంచి ఈ నెల 31 వరకు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,216 సివిల్ కానిస్టేబుల్స్, 1,067 ఏఆర్ కానిస్టేబుల్స్, వార్డర్స్(పురుషులు) 240, మహిళలు 25 పోస్టుల భర్తీకి రాత పరీక్షల అనంతరం దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ చేపట్టినట్టు ఆయన వివరించారు. -
కొలువు కోసం పరుగు
ఏలూరు అర్బన్ : కానిస్టేబుల్ కొలువు కోసం అభ్యర్థులు పరుగుతీశారు. గురువారం స్థానిక అమీనాపేట పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో కానిస్టేబుల్ పోస్టుల రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు గురువారం దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఉదయం ఆరుగంటలకు ఈ పరీక్షలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రారంభించారు. పరీక్షల ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అడిషన్ ఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో 6,213మంది అభ్యర్థులు పాల్గొనాల్సి ఉందన్నారు. మొదటి రోజు 800 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 578 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. వారిలో 67 మంది విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాలేకపోవడంతో వారికి మరో అవకాశం ఇచ్చామని, వారు ఈ నెల 5న పరీక్షకు హాజరు కావచ్చని వివరించారు. అభ్యర్థుల 100, 1600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ సామర్థ్యం పరీక్షించనున్నట్టు వివరించారు. వారంలో వీటిని పూర్తిచేయాల్సి ఉన్నందున శుక్రవారం నుంచి వేయి మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఏ కారణం చేతనైనా ప్రతిభ కనబరచలేకపోయిన వారికి మరో అవకాశం ఇస్తామని అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్ చెప్పారు. సీసీ కెమెరాల నిఘాలో పోటీలు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం పెరేడ్ గ్రౌండ్స్‌లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిటీ డివైస్‌లు ఇచ్చి పోటీలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులు తమ లక్ష్యాలను ఎంత సమయంలో పూర్తి చేశారనే అంశాన్ని అన్లైన్ విధానంలో నమోదు చేశారు. -
కొనసాగుతున్న ‘పరీక్షలు’
వరంగల్ : కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మైదానంలో శనివారం 1028 మందికి పరుగు పందెం నిర్వహించారు. రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. హన్మకొండ జేఎన్ఎస్ మైదానంలో ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించిన సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన పోటీల్లో 826 మంది పురషు లు, 142 మంది మహిళలు పాల్గొన్నారు. అర్హత పొందిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎంపికలో అదనపు ఎస్పీ జాన్ వెస్లీ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎఎస్పీ విశ్వజిత్ కంపాటీ, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్‌కుమార్, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర పాల్గొన్నారు. -
కొనసాగిన దేహదారుఢ్య పరీక్షలు
కొద్దిసేపు మొరాయించిన ఆన్లైన్ ఇబ్బందిపడిన కానిస్టేబుల్ అభ్యర్థులు పర్యవేక్షించిన ఎస్పీ రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ క్రై ం : ఒకవైపు ఆన్లైన్ ఇబ్బంది పెట్టినా.. మరోవైపు వర్షం వచ్చినా అభ్యర్థులు తట్టుకుని ముందుకుసాగారు. జిల్లా క్రీడామైదానంలో శనివారం నిర్వహించిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఆరు గంటల నుంచే ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. పది గంటల తర్వాత ఆన్లైన్ మొరాయించడంతో 800పరుగు కోసం వచ్చే అభ్యర్థులు ఒక్కసారిగా నిలిచిపోయారు. దీంతో అటు పోలీసులకు ఇటు అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ పరుగులో 1,308 మంది పాల్గొంటే వారిలో 923మంది ఇతర నాలుగు రకాల పరీక్షలకు అర్హత సాధించారు. అలాగే అన్ని రకాల పరీక్షలకు 1,092మంది హాజరుకాగా వాటిలో 863మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్షలను ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీ భరత్ పర్యవేక్షించారు. రికార్డు సృష్టించిన యువకుడు దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు లాంగ్‌జంప్‌లో ఎక్కువ దూరం దూకి రికార్డు సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన కె.ఆనందం (1060బ్యాచ్) శనివారం 6.04మీటర్ల (20.03అడుగులు) దూరం దూకాడు. గతంలో ఇంతదూరం జంప్ చేసిన అభ్యర్థులు ఒకరో ఇద్దరో ఉన్నారని అధికారులు చెప్పారు. దీంతోపాటు 800పరుగును నిమిషం 48సెకండ్లలోనే పూర్తి చేశాడు. లాగే 100మీటర్లు 12.73సమయం, హైజంప్‌లో 151ఎత్తు దూకాడు. ఇలా ఐదు రకాల పరీక్షల్లో ఈ యువకుడు ఉత్తమ ప్రతిభ చూపాడు. -
ఎస్సై అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌లు
వరంగల్: సబ్ ఇన్స్పెక్టర్ల నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్), కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ మైదానాల్లో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభించారు. జూలై 1 వరకు వీటిని నిర్వహించనున్నారు. అంతకుముందు అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్‌లను కేయూ గ్రౌండ్స్‌లో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ప్రారంభించగా, జేఎన్ఎస్లో సీపీ జి.సుధీర్‌బాబు ప్రారంభించారు. ఉదయం ఐదు గంటలకు స్టేడియానికి చేరుకున్న అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరించారు. వారి ధ్రువపత్రాలను పరిశీలించి, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. ఈ ప్రక్రియను ఆయూ మైదానాల్లో డీఐజీ, ఎస్పీ, సీపీ పర్యవేక్షించారు. నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉన్న వారికి 100, 800 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ప్రతి క్రీడాంశానికి ఒక ఏసీపీ స్థాయి పోలీస్ అధికారిని ఇన్చార్జిగా నియమించడంతో పాటు వారికి సహాయకంగా ఒక ఇన్స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు.అభ్యర్థులకు గాయూలు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థి కనీసం మూడు క్రీడాంశాలలో తప్పక అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించాల్సిన మూడు విభాగాల్లో 800 మీటర్ల పరుగు పందెం తప్పనిసరిగా ఉండాలి. వీటిలో క్వాలిఫై అయ్యేవారు త్వరలో నిర్వహించనున్న తుది దశ రాత పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత సాధిస్తారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన అధికారిణి స్వరూపారాణి, ఏసీపీ శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. సర్వర్ మొరాయించడంతో ఇక్కట్లు .. ఫిజికల్ టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో సర్వర్ నెమ్మదించింది. దీంతో ఆ ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. ఫలితంగా తెల్లవారుజామునే మైదానాలకు చేరుకున్న అభ్యర్థులు క్యూలైన్లో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా రన్నింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా వేచిచూసిన అభ్యర్థులు నీరసించిపోయారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తామని అధికారులు తెలపడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకుండా వేచిచూసి తాము నీరసించిపోయూమని, ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈవెంట్స్ చేయడం మరింత ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో మిగిలిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను మరుసటి రోజుకు వాయిదా వేశారు.