100మీటర్ల పరుగులో పాల్గొన్న మహిళా అభ్యర్థులు
-
కొద్దిసేపు మొరాయించిన ఆన్‌లైన్
-
ఇబ్బందిపడిన కానిస్టేబుల్ అభ్యర్థులు
-
పర్యవేక్షించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రై ం : ఒకవైపు ఆన్‌లైన్ ఇబ్బంది పెట్టినా.. మరోవైపు వర్షం వచ్చినా అభ్యర్థులు తట్టుకుని ముందుకుసాగారు. జిల్లా క్రీడామైదానంలో శనివారం నిర్వహించిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం ఆరు గంటల నుంచే ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. పది గంటల తర్వాత ఆన్‌లైన్ మొరాయించడంతో 800పరుగు కోసం వచ్చే అభ్యర్థులు ఒక్కసారిగా నిలిచిపోయారు. దీంతో అటు పోలీసులకు ఇటు అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ పరుగులో 1,308 మంది పాల్గొంటే వారిలో 923మంది ఇతర నాలుగు రకాల పరీక్షలకు అర్హత సాధించారు. అలాగే అన్ని రకాల పరీక్షలకు 1,092మంది హాజరుకాగా వాటిలో 863మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్షలను ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీ భరత్ పర్యవేక్షించారు.
రికార్డు సృష్టించిన యువకుడు
దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు లాంగ్‌జంప్‌లో ఎక్కువ దూరం దూకి రికార్డు సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన కె.ఆనందం (1060బ్యాచ్) శనివారం 6.04మీటర్ల (20.03అడుగులు) దూరం దూకాడు. గతంలో ఇంతదూరం జంప్ చేసిన అభ్యర్థులు ఒకరో ఇద్దరో ఉన్నారని అధికారులు చెప్పారు. దీంతోపాటు 800పరుగును నిమిషం 48సెకండ్లలోనే పూర్తి చేశాడు. లాగే 100మీటర్లు 12.73సమయం, హైజంప్‌లో 151ఎత్తు దూకాడు. ఇలా ఐదు రకాల పరీక్షల్లో ఈ యువకుడు ఉత్తమ ప్రతిభ చూపాడు.