తండ్రి జనార్ధన్ సింగ్ కానిస్టేబుల్(ఎడమవైపు) కుమారుడు అనూప్ సింగ్ ఎస్పీ
లక్నో : పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. తాము సాధించలేని వాటినో.. లేక తమ కంటే ఇంకా మంచి విజయాలని తమ పిల్లలు సాధించాలిన ప్రతి తల్లిదండ్రుల కోరుకుంటారు. ఆ కలలు నిజమైన క్షణంలో వారు పోందే గర్వాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ప్రస్తుతం ఇలాంటి పుత్రోత్సాహాన్నే అనుభవిస్తున్నారు విభూతి ఖండ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న జనార్థన్ సింగ్. ఎందుకంటే ఆయన కుమారుడు అనూప్ సింగ్ ఇప్పుడు తనకు బాస్‌గా వచ్చారు. విషయమేంటంటే జనార్ధన్ సింగ్ కుమారుడు అనూప్ ఇప్పుడు లక్నో ఎస్పీ(సూపరిండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు.
ఈ విషయం గురించి జనార్ధన్ సింగ్ ‘ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు నేను నా కుమారునికి సెల్యూట్ చేయాలి. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నా హృదయం గర్వంతో ఉప్పొంగి పోతుంది. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’ అని తెలిపారు. ‘వ్యక్తిగతంగా తండ్రి, కొడుకులం. కానీ వృత్తిపరంగా నా కొడుకు నా కంటే సుపీరియర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మా బాధ్యతలను నిర్వర్తిస్తాము అని జనార్థన్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment