- జిల్లా ఎస్పీ రవిప్రకాష్
400 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు
Published Thu, Oct 13 2016 10:22 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
రంగంపేట :
జిల్లాలో 400 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయవాల్సి ఉందని, ఇందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపా రు. రంగంపేట పోలీసుస్టేçÙ¯Œæను గురువారం ఆయన పరిశీలించి స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 64 మండలాల్లో ఎస్సై పోస్టులు పూర్తిగా ఉన్నాయని, 12 పోలీసు స్టేషన్‌లు, కార్యాలయా లు అద్దె భవనాల్లో ఉన్నాయని, వీటికి సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని, అధిక లోడు లారీలు, మద్యం సేవించి వాహనాలు నడపకుండా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మలుపులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుకు, ఏడీబీ రోడ్డు నునుపు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. పోలీసుస్టేçÙన్లలో సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా దేవతల జాతరల్లో అశ్లీల ప్రదర్శనలు చేస్తే చర్యలు తప్ప వన్నారు. శిథిలావస్థకు చేరిన రంగంపేట స్టేçÙన్‌ను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు, సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సై ఎన్.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement