- l మెయిన్ రాత పరీక్షలకు
- 5,963 మంది అర్హత
- l ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ
- l విధులు నిర్వర్తించిన వారికి అభినందనలు
ముగిసిన కానిస్టేబుళ్ల ఎంపిక పోటీలు
Published Sat, Aug 6 2016 12:15 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
వరంగల్ : రూరల్ పోలీసుశాఖ పరిధిలో ఉద్యోగాల భర్తీ కోసం గత నెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పరుగు పందెం, దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిసినట్లు ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ తెలిపారు.
రూరల్ పరిధిలోని కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం కేయూ మైదానంలో నిర్వహించిన పో టీల్లో 12,000 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజ రైనట్లు తెలిపారు. ఇందులో 4,829 మంది పురుషులు, 1,134 మంది మహిళలు రాత పరీక్షలకు అర్హత సాధించినట్లు చెప్పారు. త్వరలో జరిగే కానిస్టేబుళ్ల మెయిన్ రాత పరీక్షల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక పరీక్షలు, పోటీలు పారదర్శకంగా నిర్వహించామని, ఈవెంట్లను వీడియో కెమెరాల్లో చిత్రీకరించామని తెలిపారు. చివరి రోజు న 390 మంది దేహదారుఢ్య పరీక్షలు హాజరయ్యా రు. పరీక్షలు, పోటీలల్లో భాగస్వాములైన పీఈటీలు, డాక్టర్లు, పోలీసు అధికారులను, డీపీఓ, ఐటీ కోర్ సభ్యులు, సిబ్బందిని, ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ రూర ల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ, డీఎస్పీలు సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, మరళీధ ర్, రాజమహేంద్రనాయక్, రాంచందర్‌రావు, కుమారస్వామి, పోలీసు అ«ధికారులు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement