అత్యాధునిక పోలీస్ స్క్రీనింగ్ టెస్టు
Published Tue, Nov 8 2016 12:23 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కర్నూలు :
పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి (డ్రైవర్, మెకానిక్) ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక ఏపీఎస్పీ మైదానంలో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్కీన్రింగ్ టెస్టు నిర్వహిస్తున్నారు.
ఆరు జిల్లాలకు సంబంధించిన 23,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుళ్ల భర్తీ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికష్ణను ప్రభుత్వం చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించింది. మొదటి రోజు వెయ్యి మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 590 మంది హాజరయ్యారు. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ డివైజెస్(ఆర్‌ఎఫ్‌ఐడీ) ద్వారా ట్రాక్ వెంట అభ్యర్థులు పరిగెత్తేటప్పుడు ఎంత సమయంలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారన్నది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారు.
మొదటిరోజు 362 మంది స్కీన్రింగ్ టెస్టులో అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని 172 మంది అభ్యర్థులను అనుమతించలేదు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement