screening test
-
ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?
నాకు ఇప్పుడు 7వ నెల. జీటీటీ టెస్ట్ రాశారు. మా కుటుంబంలో ఎవరికీ షుగర్ లేకపోయినా నేను ఆ టెస్ట్ చేయించుకోవాలా? రిజల్ట్ ఎలా వస్తుందోనని భయపడి టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ అందరికీ చేస్తారా? – షమా ఫిర్దౌజ్, బనగానపల్లె. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒక రక్తపరీక్ష. 7వ నెల మొదట్లో గర్భిణీలందరికీ రొటీన్‌గా చేసే పరీక్ష. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్‌ని కనిపెడుతుంది. మీ శరీరం సాధారణ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను మెయిన్టేన్ చేస్తుందా లేదా అనేది ఈ పరీక్ష ద్వారా చెక్ చేస్తారు. అందుకే జీటీటీ టెస్ట్‌ని గర్భిణీలందరికీ చేస్తారు. ముఖ్యంగా 85 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారికి, తొలి చూలులో బిడ్డ నాలుగున్నర కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టినా.. ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా.. ఈ టెస్ట్ చేయాలి. జీటీటీలో రిజల్ట్ నార్మల్ వస్తే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రిస్క్ లేదని అర్థం. రిజల్ట్ అబ్నార్మల్ వస్తే డయాబెటీస్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. తీసుకోవాల్సిన డైట్, మానిటరింగ్‌ను వివరిస్తారు. ఈ మధ్యకాలంలో 2–12 శాతం వరకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కనిపిస్తోంది. -డా.భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫుడ్ అలెర్జీ ఎందుకొస్తుందో తెలుసా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి) -
అసలు పేచీ స్క్రీనింగ్ టెస్టే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలనుకుంటున్న స్క్రీనింగ్ టెస్ట్ విధానమే వివాదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్ ఆమోదించపోవడానికి ఈ నిబంధనే కారణమని తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు ఇది విరుద్ధమని గరవ్నర్ భావిస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్తగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ అనుమతి కోసం పంపింది. దీనిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయాలని విద్యామంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతోకలసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి సబిత గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. అయినప్పటికీ నెలల తరబడి ఈ బిల్లుకు మోక్షం కలగడంలేదు. అసలా రూల్ ఎక్కడిది? ఇప్పటివరకు వర్సిటీలన్నీ సొంతంగా నియామకాలు చేపట్టేవి. అయితే కామన్ బోర్డు బిల్లులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసేవారికి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక పోస్టుకు 200 మంది దరఖాస్తు చేస్తేనే పరీక్ష పెట్టాలనే నిబంధన ఉన్నట్లు గవర్నర్ కార్యాలయం గుర్తించింది. యూజీసీ నిబంధనల ప్రకారమే చట్టా న్ని తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం... లేని పరీక్ష ను ఎందుకు తెచ్చిందనే దానిపై గవర్నర్ కార్యాల యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీన్ని మారిస్తేనే బిల్లును ఆమోదిస్తామని ప్రభుత్వానికి గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడ ట్లేదు. అవసరమైతే వర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్ ను తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పీటముడి నేపథ్యంలో వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల కోసం నిరీక్షిస్తున్న 3 వేల మంది నిరాశ చెందుతున్నారు. వీసీల నుంచి వ్యతిరేకత... కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటును పలు వర్సిటీల వీసీలు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నియమాక ప్రక్రియకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని వర్సిటీల నిధుల నుంచే ఖర్చు చేసే ప్రతిపాదనను వారు ఆక్షేపిస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా బోర్డు ను ఏర్పాటు చేసినా నియామకాల్లో వీసీలకే ప్రాధా న్యం ఇచ్చారని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే తరహా విధానం కొనసాగుతోందని ఓ వీసీ తెలిపా రు. విశ్వవిద్యాలయాల పరిస్థితులతో సంబంధం లేని ఐఏఎస్ అధికారులకు బోర్డు సభ్యులుగా పూర్తి అధికారాలు ఇవ్వడం వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బోర్డు ఏర్పాటుపై గవర్నర్, ప్రభు త్వం మధ్య నెలకొన్న వివాదం కారణంగా నియామక ప్రక్రియే ఆగిపోయిందని, దీనివల్ల అధ్యాపకులు లేక బోధన కుంటుపడుతోందని వీసీలు అంటున్నారు. ఇది చెల్లదు.. సుప్రీం తీర్పు ఉంది.. ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. 2017లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇది కూడా చేయకుండా కొత్త నియామకాలు ఎలా చేపడతారు. – డాక్టర్ ఎం. రామేశ్వరరావు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ చైర్మన్ -
8న గ్రూప్–1 స్క్రీనింగ్ టెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్–2 పరీక్షలు ఉంటాయని, రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు. హాల్‌టికెట్లు ఈ నెల 31 నుంచి కమిషన్ వెబ్సైట్లో (https://psc.ap.gov.in) అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితా కూడా వెబ్సైట్లో ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్లను ముందుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రం, ఇతర మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. -
క్యాన్సర్‌కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలో స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో విస్తరిస్తున్న క్యాన్సర్ కేసులను పసిగట్టి సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. లైనాక్ మెషిన్లు, 3 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు క్యాన్సర్ కేసుల్లో 60 – 70 శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో వ్యయ ప్రయాసలతో చికిత్స పొందినా ఫలితం దక్కడం లేదు. విస్తృత స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. గ్రామ, వార్డు క్లినిక్స్‌తో పాటు మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. తద్వారా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్ గుర్తింపు, చికిత్సపై సమర్థ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు రెండు చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, గుంటూరు కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. మూడో దశలో గుర్తిస్తే సంక్లిష్టం క్యాన్సర్లలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతోంది. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ధరతోనే నయం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రూ.71 వేల లోపే వ్యయంతో 99 శాతం నయం అవుతోంది. అదే మూడో దశలో గుర్తించి రూ.1.76 లక్షలు వ్యయం చేసినా 29 శాతమే నయంఅవుతోంది. లక్షల్లో మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. మన దేశంలో 2020లో కొత్తగా 13.24 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 6.8 లక్షలు మహిళల్లో క్యాన్సర్ కేసులు కాగా 6.5 లక్షలు పురుషుల్లో క్యాన్సర్ కేసులున్నాయి. 2020లో క్యాన్సర్‌తో 8.5 లక్షల మంది మృతి చెందగా రాష్ట్రంలో 34 వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. 2030 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు 28 శాతం మేర పెరగవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్స వ్యయం రాష్ట్రంలో కొత్త క్యాన్సర్ కేసులు 70 వేల వరకు ఉండవచ్చని అంచనా. పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,768 క్యాన్సర్ కేసులుండగా అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 13 శాతం చొప్పున నమోదయ్యాయి. 16 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 70 వేల వరకు పెరగవచ్చని అంచనా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్ చికిత్స వ్యయం 37.3 శాతం మేర పెరిగింది. 2021–22లో ఆరోగ్యశ్రీలో 1,18,957 క్యాన్సర్ కేసులకు చికిత్స అందించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సలు 24 శాతం పెరిగాయి. -
పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు నగర పోలీసు విభాగం ప్రీ–రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు అర్హతలు, ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరింది. యువత నుంచి భారీగా స్పందన రావడంతో మొత్తం 20,733 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. మంగళవారం నగరంలోని ఐదు జోన్లలోని 36 కేంద్రాల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఈ పరీక్ష జరుగనుంది. అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్కులు, జనరల్ స్టడీస్ 100 మార్కులకు దీనిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న వారు విధిగా హాజరుకావాలని నగర పోలీసులు కోరుతున్నారు. హాల్ టికెట్లను లింకు రూపంలో ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు పంపించారు. సమాచారం అందని వారు పోలీసు అధికారిక వెబ్సైట్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ సంప్రదించాలి. (చదవండి: సాఫీ జర్నీకి సై... అందుబాటులోకి మరో మూడు రోడ్లు) -
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!
న్యూఢిల్లీ : కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పని సరిగా మారింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని ఏయిర్ పోర్టులోనే స్క్రీనింగ్ చేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నుంచి తప్పించుకొని ఓ వృద్ధుడు పరారైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. గార్డెన్ ప్రాంతానికి చెందిన హర్జిత్ సింగ్(72) అనే వ్యక్తి శనివారం AI 1916 విమానంలో కజకిస్తాన్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రమంలో దిగిన అనంతరం అధికారుల కళ్లు గప్పి టెర్మినల్ -3 వద్ద ఉన్న స్క్రీనింగ్ హాల్ నుంచి తప్పించికొని పరారయ్యాడు. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..) ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారమివ్వగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సింగ్ ఉద్దేశపూర్వకంగా స్క్రీనింగ్ విధానాన్ని తప్పించుకొని వెళ్లినట్లు అధికారులు పోలీసులకు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణీకుడు ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా ప్రస్తుతం వాడుకలో లేనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో సింగ్ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన వెహికిల్ ఆధారంగా ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి అతడిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. (లగ్జరీ బైక్‌పై చీఫ్ జస్టిస్; ఫోటోలు వైరల్) -
వారందరికీ సామూహిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు (పూల్డ్ శాంపిలింగ్) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్రా లను ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్ అనుమానిత లక్ష ణాలతో ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్య వేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్లో ఉన్నారు. వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. వాస్తవంగా విదే శాల నుంచి వచ్చే వారు, సంబం ధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధా రణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్ వచ్చి న వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది. 25 మందికి ఒకేసారి.. రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలిమరెస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్)గా పిలిచే ఈ సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షల వల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానంలో 25 మంది శాంపి ళ్లను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఇం దులో పాజిటివ్ వస్తే, వారిలో ఎంత మందికి వైరస్ సోకిందో గుర్తించేం దుకు మరోసారి ఆ 25 మందికి విడివిడిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ నెగెటివ్ వస్తే వారందరికీ కరోనా లేనట్టు గుర్తించి ఇంటికి పంపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సామూహిక కరోనా పరీక్షలను సీసీఎంబీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల వంద మందిలో కరోనా ఉందో లేదో అంచనా వేయాలంటే, నాలుగు పరీక్షలు చేస్తే సరిపోతుంది. దీంతో టెస్టింగ్ కిట్లు సరిపోతాయని, సమయం, డబ్బు ఆదా అవుతాయని అంటున్నారు. ఒక్కో పరీక్షకు సగటున రూ.4,500 ఖర్చవుతుందని అంచనా. ప్రతి ఒక్కరినీ విడివిడిగా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామూహిక పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడనుంది. అదీగాక సర్కారు క్వారంటైన్లలో ఉండే వలసదారులకు, విదేశాల నుంచి వచ్చే వారికి, గ్రీన్జోన్లలో ఉన్నవారికి సామూహిక పరీక్షలు చేయడమే మేలని అంటున్నారు. సిబ్బంది కోసం ఇదీ ప్రొటోకాల్ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రొటోకాల్ రూపొందించింది. దీని ప్రకారం.. శిక్షణ పొందిన లేబరేటరీ సిబ్బంది ఆప్రాన్, హ్యాండ్‌గ్లోవ్స్, గాగుల్స్, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ప్రొటోకాల్ ప్రకారం ఆయా వ్యక్తుల గొంతు నుంచి స్వాబ్ శాంపిళ్లను సేకరించాలి. శాంపిళ్లు ఎవరివనే వివరాలను లేబులింగ్‌పై రాయాలి. ఇలా ఒక ధపాలో సేకరించిన 25 శాంపిళ్లను ట్రిపుల్ లేయర్లో ప్యాకేజ్ చేస్తారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కోల్డ్–చైన్‌లో లేబరేటరీలకు తరలించి వాటిని ఒకేసారి పరీక్షిస్తారు. -
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు. -
విమాన సిబ్బందికి డ్రగ్ పరీక్షలు!
న్యూఢిల్లీ: విమానాలు నడిపే పైలట్లకు, ఇతర సిబ్బందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నియమ నిబంధలన్నీ అమల్లోకి వస్తే విమానంలో పనిచేసే సిబ్బందితోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. తొలిదశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఈ పరీక్షలను చేపడతారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ఒకటి విమానాశ్రయం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వీడియోలో రికార్డు చేస్తారు. గంజాయి, ఓపియం తదితర మత్తుమందులు తీసుకున్నట్లు స్క్రీనింగ్ టెస్ట్‌లో బయటపడితే, మళ్లీ నిర్ధారణకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. డీజీసీఏ అధికారుల నేతృత్వంలో ఏటా ఒక్కో సంస్థ సిబ్బందిలో పదిశాతం మందికి ఈ పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మత్తుమందులు తీసుకున్నట్లు తెలిస్తే ఆ ఉద్యోగిని భద్రత వంటి కొన్నిరకాల విధుల నుంచి తప్పిస్తారు. తదుపరి పరీక్షల్లోనూ మత్తుమందులు తీసుకున్నట్లు రూఢి అయితే తగిన రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపుతారు. -
తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే 'జాకెట్'
సాక్షి, హైదరాబాద్: కేన్సర్.. మనుషులను కబళిస్తున్న మహమ్మారి. ముఖ్యంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ఇందులో అగ్రభాగంలో ఉంది. ముందస్తు పరీక్షలతో తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే దీన్ని నివారించొచ్చు. ఓవైపు అవగాహన లేక.. మరోవైపు పరీక్షలకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పారిశుధ్య మహిళా కార్మికులకు రొమ్ము కేన్సర్ ఉచిత స్క్రీనింగ్‌లను జీహెచ్ఎంసీ చేపట్టింది. దేశంలోని అతి తక్కువ క్లినిక్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ జాకెట్‌ను... పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ఎక్కువ మందికి వినియోగించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ సాంకేతికతతో దాదాపు 8 ఏళ్ల ముందే కేన్సర్ సోకే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక నిర్ధారణతో తదుపరి అవసరమైన చికిత్సలు పొందే అవకాశం ఉంది. కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ ప్రత్యేక జాకెట్‌ను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. ఈ జాకెట్ ధరించేందుకు ఇష్టపడని వారికి శరీరాన్ని తాకకుండానే దాదాపు ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు. థెర్మలిటిక్స్ టెక్నాలజీతో యాక్టివ్ కేన్సర్ కణాల్ని ప్రాథమిక దశలో గుర్తిస్తారు. కేన్సర్ కణాలున్న భాగంలోని శరీర ఉష్ణోగ్రతను బట్టి థర్మల్ ఇమేజెస్ ఏర్పడతాయని పరీక్షలు నిర్వహిస్తున్న మురాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉపకరణాలతో ఎలాంటి నొప్పి ఉండదు. రేడియేషన్ ప్రభావం ఉండదు. కోత, గాట్లు వంటివి ఉండవు. నలభై ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని తాకకుండానే స్క్రీనింగ్, పూర్తి గోప్యత, కణతి ఏర్పడకముందే కేన్సర్ లక్షణాల్ని గుర్తించవచ్చు. సీమెట్ రూపకల్పన... కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో దాని అనుబంధ సంస్థ సీమెట్ ఈ సాంకేతికతను రూపొందించింది. త్రివేండ్రంలోని సీడాక్, కాన్పూర్ మలబార్ కేన్సర్ సెంటర్, నిరామయి స్టార్టప్‌లతో కలిసి ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వినియోగానికి పేటెంట్ పొందిన జపాన్ మురాటా కంపెనీకి అనుబంధ సంస్థగా నగరంలో ఉన్న మురాటా బిజినెస్ ఇంజినీరింగ్(ఇండియా) లిమిటెడ్ ఉపకరణాల ఉత్పత్తితో పాటు స్క్రీనింగ్ పరీక్షలూ నిర్వహిస్తోంది. పబ్లిక్‌హెల్త్‌లో భాగంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇదీ పరిస్థితి థర్మల్ ఇమేజెస్ ద్వారా కేన్సర్ కణాల పెరుగుదలను రెండో సంవత్సరం నుంచే గుర్తించవచ్చు. మామోగ్రామ్ ద్వారా నాలుగేళ్ల వరకు కూడా కనుక్కోవడం కష్టం. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే రొమ్ము కేన్సర్లు ఉండేవి. ప్రస్తుతం యుక్త వయసులోనూ పెరుగుతున్నాయి. రొమ్ము కేన్సర్ లక్షణాలు చాలా వరకు స్టేజ్ 2, ఆ తర్వాతి దశల్లోనే కనిపిస్తాయి. తరచూ పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. బస్తీ దవాఖానాల్లోనూ.. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య మహిళా కార్మికులందరికీ ఈ పరీక్షలు చేయిస్తాం. పేద మహిళల సదుపాయార్థం నగరంలోని బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి తెస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్ అదే మా లక్ష్యం హైటెక్నాలజీతో కూడిన మెడికల్ ఉపకరణాలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనేదే మా లక్ష్యం. స్వదేశంలో స్థానికులతోనే ఉత్పత్తులు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందుకుగాను సాంకేతికంగా కొంత సహకారాన్ని జపాన్ నుంచి పొందుతున్నాం. – కరుణ్మల్హోత్రా, ఎండీ (మురాటా బిజినెస్ ఇంజినీరింగ్ ఇండియా) పేదల కోసం.. చాలామందికి రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండదు. పారిశుధ్య కార్మికులతో సహా పేద మహిళలెందరికో ఉపయోగపడుతుందనే ఆలోచనతో మురాటా నిర్వాహకులతో సీఎస్సార్ కింద ఉచిత స్క్రీనింగ్‌కు ఒప్పించాం. పరీక్షల శిబిరాలతో క్రమేపీ అవగాహన వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్‌కు రూ.10,000 నుంచి రూ.15,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఒక్కో జోన్‌లోని ఒక్కో డివిజన్ వంతున దాదాపు 400 మందికి ఉచిత స్క్రీనింగ్‌కు నిర్వాహకులు ముందుకొచ్చారు. ఒకవేళ ఎవరికైనా తదుపరి పరీక్షలు అవసరమైతే ఈఎస్ఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. – హరిచందన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కేన్సర్ కణాల పెరుగుదల ఇలా... చురుగ్గా ఉండే కేన్సర్ కణాలు ప్రతి 90 రోజులకోమారు రెట్టింపవుతాయి. సమయం కణాలు 90 రోజులు 2 సంవత్సరం 16 రెండేళ్లు 256 మూడేళ్లు 4,896 నాలుగేళ్లు 65,536 ఐదేళ్లు 10,48,576 ఆరేళ్లు 1,67,77,216 ఏడేళ్లు 26,84,35,456 ఎనిమిదేళ్లు 429,49,67,296 -
హైపర్ ‘టెన్షన్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్‌ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది. బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్‌కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తించాలి ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’ – డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి -
50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు స్క్రీనింగ్!
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులను బలవంతగా ఇంటికి పంపించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను వదిలించుకోవడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2018 మార్చి 31 నాటికి 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు(కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి) స్క్రీనింగ్ టెస్ట్ జరిపి ఆ వివరాలను జూలై 31లోపు సమర్పించాల్సిందిగా అన్ని శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో యూపీలో వివిధ శాఖలలో పనిచేస్తోన్న 16లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 4 లక్షల మంది స్ర్కీనింగ్ టెస్ట్ ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉద్యోగి సమయపాలన, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాల ప్రాతిపాదికన రేటింగ్‌లు ఇస్తారు. ఎవరైతే తక్కువ రేటింగ్‌లు పొందుతారో వారిని రిటైర్ చేయాల్సిన జాబితాలో చేర్చనున్నారు. ఆ జాబితాలోని ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉద్యోగులను హింసించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా సర్వీస్ హ్యాండ్‌బుక్‌లో మాత్రం 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి బలవంతంగా విధుల నుంచి తొలగించవచ్చనే నిబంధన ఉంది. -
1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై వైస్ చాన్స్లర్ల కమిటీ కీలక సిఫారసు చేసింది. ఇప్పటివరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తు చేసుకున్న అందరిని ఇంటర్వ్యూలకు పిలిచే విధానానికి పుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో పోస్టుకు పది మందిని మెరిట్స్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఇంటర్వ్యూలకు (1:10 నిష్పత్తిలో) ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం నియమించిన వైస్ చాన్స్లర్ల కమిటీ రెండు రోజుల కింద ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్స్ ఆధారంగా స్క్రీనింగ్ చేయాలని సూచించింది. ఆ మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. ఒక్కో అంశానికి 10 మార్కుల చొప్పున 60 మార్కులకు వెయిటేజీ ఇచ్చి, మెరిట్ ఉన్న వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఇంటర్వ్యూలో 4 కీలక అంశాల్లో అభ్యర్థిని బట్టి 40 మార్కుల వరకు కేటాయించే విధానాన్ని సూచించినట్లు సమాచారం. తద్వారా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నట్లు తెలిసింది. ఏ వర్సిటీ నోటిఫికేషన్‌ను ఆ యూనివర్సిటీనే ఇవ్వాలని, ఒక వర్సిటీలో దరఖాస్తు చేసుకున్న వారు మరో యూనివర్సిటీలోనూ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇంటర్వ్యూ కమిటీలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సబ్జెక్టు నిపుణుడిగా నియమించాలని సూచించినట్లు తెలిసింది. తద్వారా పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టవచ్చని సూచించినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, డిపార్ట్మెంట్ హెడ్, ఇద్దరు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, ఇంటర్వ్యూ కమిటీలో వైస్ చాన్స్‌లర్, డీన్, రిజిస్ట్రార్, సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉండాలని పేర్కొన్నట్లు తెలిసింది. న్యాయశాఖ అభిప్రాయం తర్వాత ఈ 1,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. మెరిట్ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలు.. ► పోస్టు గ్రాడ్యుయేషన్‌లో మార్కులు ► అకడమిక్ రికార్డు (స్లెట్, నెట్, పీహెచ్డీ, విదేశాల్లో చదువులు) ► పబ్లికేషన్స్.. వివిధ అధ్యయన పత్రాలు, రచనలు.. ► ఫెలోషిప్‌లు, పరిశోధనలు, ప్రాజెక్టులు.. వాటి ఫలితాలు ► సర్వీసు, అనుభవం (కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న కాలం, ప్రైవేటు కాలేజీల్లో బోధన అనుభవం) ► అవార్డులు, రివార్డులు) ఇంటర్వ్యూ కమిటీ పరిగణనలోకి తీసుకునే 4 అంశాలు లెక్చర్స్, పరిశోధనలు, సబ్జెక్టు విశ్లేషణ, అభ్యర్థి వ్యక్తిత్వం తదితరాలు. -
అధ్యాపకులకు స్క్రీనింగ్ టెస్ట్
►ఖరారు చేసిన సర్కారు ► శాతవాహనలో40 పోస్టుల భర్తీ ►త్వరలోనే నోటిఫికేషన్ ► అధ్యాపకుల క్రమబద్ధీకరణ కష్టమే? శాతవాహన యూనివర్సిటీ: వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వీసీల కమిటీని నియమించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం మార్గదర్శకాలను రూపొందించిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి ఒకటిరెండురోజుల్లో నివేదించనున్నట్లు సమాచారం. ఇది పూర్తయితే శాతవాహన యూనివర్సిటీలో భర్తీచేయనున్న 40 పోస్టులకు ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఇందులో అధ్యాపకుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించిన అనంతరం ఎంపికైన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపికచేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించడం సాధ్యపడదని ఫ్రొపెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి మ«ధ్యంతర నివేదిక ఇచ్చింది. మరోవైపు శాతవాహన పరిధిలోని కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ఏళ్ల తరబడి పనిచేస్తున్నామని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్చేస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి అధ్యాపకుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టు నిర్వాహించాలని భావించిన ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేయాలని జెఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ వీసీ సీతారామారావుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. యూజీసీ నియమ నిబంధనల ప్రకారం అన్ని యూనివర్సిటీలకు ఒకేరకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించేలా ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధమైంది. స్క్రీనింగ్ టెస్టులో అర్హత సా«ధించిన తర్వాత ఒక్కోపోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. శాతవాహనలో 40 పోస్టులు శాతవాహన యూనివర్సిటీలో మొత్తం 40 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ప్రొపెసర్లు–09, అసోసియేట్ ప్రొఫెసర్లు–16, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే శాతవాహన యూనివర్సిటీ ప్రకటన వెలువరించనున్నుట్ల సమాచారం. వీసీల కమిటీ సూచించిన మార్గదర్శకాలు ప్రభుత్వానికి అందిన తర్వాత అన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకాలను పంపించి వేర్వేరుగా నోటిపికేషన్లుంటాయని తెలిసింది. నోటిపికేషన్ జాతీయ స్థాయిలో ఉంటుందని, భర్తీ పక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుందని, దానికి 100 నుంచి 150 మార్కులు ఉంటాయని సమాచారం. క్రమబద్ధీకరణ కష్టమే? కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ క్రమబద్ధీకరణ కష్టమేనని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి సూచించింది. న్యాయస్థానాల వెలువరింవచిన ఉత్తర్వులు, యూజీసీ నిబంధనలను బట్టి చూస్తే రెగ్యులరైజేషన్ సా«ధ్యపడదని, అయితే వేతనాలు పెంచవచ్చని కమిటీ సూచించినట్లు సమాచారం. శాతవాహనలో కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గతంలో ధర్నాలు, నిరసనలు తెలుపుతూ విధులు బహిష్కరించినా.. ఫలితం లేకుండాపోయింది. -
1,061 అధ్యాపక పోస్టులు
♦ వర్సిటీల్లో భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు ♦ మార్గ్గదర్శకాలు ఖరారు చేసిన వైస్ చాన్స్లర్ల కమిటీ ♦ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక.. ♦ తర్వాత రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు ♦ వర్సిటీల వారీగా వేర్వేరుగా నోటిఫికేషన్లు ♦ ఆబ్జెక్టివ్ విధానంలో స్క్రీనింగ్ టెస్టు ♦ 1:3 రేషియోలో ఇంటర్వ్యూలకు ఎంపిక సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వారం పది రోజుల్లో ఆయా యూనివర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం అనుసరించాల్సిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావులతో కూడిన వీసీల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది. తర్వాత రెండు మూడు రోజుల్లోనే నియమ నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆ వెంటనే వర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. మొత్తంగా యూనివర్సిటీల్లో 1,551 పోస్టులు ఖాళీగా ఉండగా.. మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి గత నెలలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. దీంతో నియమ నిబంధనల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీసీల కమిటీని ఏర్పాటు చేయగా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం మార్గదర్శకాలను సిద్ధం చేశారు. మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ.. అధ్యాపక పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగా ఉంటాయి. అన్ని యూనివర్సిటీలకు ఒకే రకమైన పరీక్షా విధానం ఉంటుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది. భర్తీ ప్రక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. 100 మార్కులకు లేదా 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు అర్హత సాధించిన వారి లో 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వ హించి.. పోస్టులకు ఎంపిక చేస్తారు. యూజీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం... అధ్యాపక నియామకాల్లో పరిశోధనలు, పరిశోధన పత్రాలు, ప్రాజెక్టులు, శిక్షణలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్వ్యూ విధానంలో అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను పరిశీలించాలి. ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధన పబ్లికేషన్స్ (పుస్తకాలు తదితరాలు)కు 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గైడెన్స్‌కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వీటికి 50 శాతం స్కోర్ నిర్ధారించగా.. కనీసంగా 15 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తాజాగా అధ్యాపక పోస్టుల భర్తీలో అమలు చేయనున్నారు. -
నేడు గురుకులాల స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీకి గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఈ నెల 21(బుధవారం)న విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. బుధవారం ఫలితాల విడుదల సాధ్యం కాకపోతే 22న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొంది. పరీక్షల ఫలితాలు విడుదల కాకముందే మెయిన్ పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఎవరు మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారన్న వివరాలు తెలియకపోవడంతో అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అనంతరం మెయిన్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
పావుగంట ముందే గేట్లు బంద్
- నేడు గురుకుల టీచర్ల స్క్రీనింగ్ టెస్టు - ఉదయం 9.45 లోపే పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లాల్సిందే - నిర్ణీత సమయం దాటితే అనుమతించేది లేదు సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యు యేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 31న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,25,635 మంది అభ్యర్థులు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు కొనసాగు తుందని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.45 గంటలకే గేట్లు మూసివేస్తామని వెల్లడిం చింది. అభ్యర్థులు ఆ సమయంలోగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించింది. 9.45 తర్వా త అభ్యర్థులను అనుమతించేది లేదని తెలిపింది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టుల వారు మినహా మిగతా టీజీటీ, పీజీటీ, పీడీ పోస్టుల వారికి ఈ స్క్రీనింగ్ టెస్టు ఉంటుం దని వివరించింది. అభ్యర్థుల ను ఉదయం 8.15 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. వెంట తెచ్చుకోవాల్సినవి.. హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, ప్రభుత్వ సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్). మరిన్ని వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చైన్లు, చేతి గడియారాలు, ఆభరణాలు, షూస్ ధరించొద్దని, చివరకు పర్సు కూడా లోపలికి తీసుకురావద్దని సూచించింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు తెచ్చుకోవద్దని స్పష్టం చేసింది. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాల్లోకి తీసుకొస్తే డీబార్ చేస్తామని హెచ్చరించింది. -
31న టీచర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు
హాజరుకానున్న 1.25 లక్షల మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీజీటీ, పీజీటీ రెండింటికి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా కాకుండా ఒకటే హాల్‌టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తున్నామని, మెయిన్ పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు 1.25 లక్షల మంది హాజరుకానున్నట్లు తెలిపింది. ఇక పీజీటీ, టీజీటీ తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పోస్టులకు వచ్చే నెల 14న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు వివరించింది. త్వరలోనే హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 040–23120301, 040–23120302 నంబర్లలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని వెల్లడించింది. -
ప్రశాంతంగా గ్రూప్–3 పరీక్ష
– జిల్లా వ్యప్తంగా 136 కేంద్రాల్లో నిర్వహణ – పరీక్షకు 34,191 మంది హాజరు – 14,717 మంది అభ్యర్థుల గైర్హాజరు అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్–3 (పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–4) పరీక్ష ‘అనంత’లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 136 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 69.91 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలను ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 34,191 మంది అభ్యర్థులు హాజరు కాగా, 14,717 మంది గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నలుగురు అభ్యర్థులు నిర్ధేశించిన సమయం దాటిన తరువాత వచ్చారు. వారిని పరీక్షకు అనుమతించలేదు. తమ ఆలస్యానికి కారణాన్ని ఇన్చార్జి జేసీకి అభ్యర్థులు చెప్పుకున్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అనుమతించడం కుదరదని వారికి ఇన్చార్జి జేసీ చెప్పారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి వెనక్కి పంపించారు. -
నేడు ఏపీగ్రూప్–2 ఫలితాలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–2 స్క్రీనిం గ్ టెస్ట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ ఫలితాల వెల్లడికి సంబంధించి తుది పరిశీలన రెండ్రోజుల క్రితమే చేపట్టింది. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ఏలూరు సిటీ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాం తంగా ముగిసింది. అడుగడుగునా సమస్యలు, ఇబ్బం దులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా మారాయి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అవగాహన కల్పించకపోవటంతో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్ని ఇబ్బందులో.. జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. గోడు చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ప్రశాంతంగా గ్రూప్2 స్క్రీనింగ్ టెస్ట్ 29,627 మంది హాజరు 10,201 మంది పరీక్ష రాయలేదు గుర్తింపు కార్డుల్లేక వెనుదిరిగిన అభ్యర్థులు ఆర్ట్స్ సబ్జెక్ట్ ఓకే.. సైన్స్ కొంచెం టఫ్ ఏలూరు సిటీ : గ్రూప్2 ఉద్యోగాలకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అడుగడుగునా ఎదురైన సమస్యలు, ఇబ్బందులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా రిలియామి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అభ్యర్థులకు అవగాహన కల్పించకపోవటంతో జిల్లాలో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఽ 10,201 మంది గైర్హాజరు జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది ఽస్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఽఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. తమ గోడును చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
ఏపీ గ్రూప్–2పై అపోహలకు తావులేదు
♦ పక్కపక్కనే ఉన్నా ఒకరికి వచ్చే ప్రశ్నపత్రం మరొకరికి రాదు ♦ 26న ఉదయం 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ ♦ 9.45 దాటితే పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ ♦ ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొంతమంది కలసి ఒకేసారి ఆన్లైన్ దరఖాస్తు చేయడం వల్ల పక్కపక్కనే హాల్టిక్కెట్ల నంబర్లు వచ్చాయని, వారు మాస్‌కాపీయింగ్ చేసే అవకాశముందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నిమిషానికి 200, సెకనుకు 3 చొప్పున దరఖాస్తులు అప్లోడ్ అవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి వేల మంది దరఖాస్తు చేస్తుంటారని, అందువల్ల కలసి దరఖాస్తు చేసేవారికి పక్కపక్కనే హాల్‌టికెట్ల నంబర్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ పక్కపక్కనే ఉన్నా కూడా.. వారిలో ఒకరికి వచ్చే ప్రశ్నపత్రం కోడ్ మరొకరికి రాదని చెప్పారు. ఏ, బీ, సీ, డీలుగా నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఓఎమ్మార్ సమాధాన పత్రాల్లో రోల్‌నంబర్, సెట్కోడ్ను తప్పుగా నమోదు చేస్తే ఆ పత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఏపీపీఎస్సీ బోర్డు సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు 6,57,010 మంది దరఖాస్తు చేశారని, వీరిలో 5 లక్షల మందికి పైగా తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. 26న ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. 9.45 తర్వాత అభ్యర్థులను లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే చూసుకుంటే సకాలంలో పరీక్షకు హాజరుకావచ్చని వివరించారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఏర్పడితే 040–24603493, 94, 95, 96 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే నమూనా ఓఎమ్మార్ షీట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. వచ్చేవారంలో 2011 గ్రూప్–1 రివైజ్డ్ మెరిట్ జాబితా సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకు ముందు నిర్వ హించిన 2011 గ్రూప్–1 మెయిన్స్‌కు సం బంధించి సవరించిన జాబితాను వచ్చే వారంలో విడుదల చేయనుంది. ఈమేరకు కమిషన్ కసరత్తు కొలిక్కి వచ్చిందని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి సాయి తెలిపారు. ఈసారి న్యాయవివాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 2011 గ్రూప్–1కు సంబంధించి తొలినుంచి అనేక ఆటంకాలు ఎదురవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. -
26న గ్రూప్–2 ప్రిలిమ్స్
⇒ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు ⇒ 982 పోస్టులకు 6,57,010 మంది పోటీ ⇒ ఈ పరీక్షకు రిజర్వేషన్లు, లోకల్, నాన్‌లోకల్ కోటా వర్తించదు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్ పరీక్ష) ఈనెల 26న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చిన వారు మినహా మిగతా వారు పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఆప్షన్లు ఇచ్చిన వారు 14వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 982 పోస్టులకు 2016 నవంబర్ 8వ తేదీన గ్రూప్2 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 6,57,010 మంది అభ్యర్థులు (తెలంగాణ వారితో కలిపి) పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు 670 మంది పోటీలో ఉన్నారు. ప్రిలిమ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల విధానం, లోకల్, నాన్‌లోకల్ కోటా వర్తించదు. మెయిన్ పరీక్షలకు వర్తిస్తుంది. లోకల్ కోటాలో 30% పోస్టులు ఉమ్మడి మెరిట్ జాబితా ద్వారా పూర్తిచేసి తక్కిన 70% పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మెయిన్స్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా మే 20వ తేదీన నిర్వహిస్తారు. -
ఏపీ గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్
(నిన్నటి తరువాయి) 137. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణను ఎప్పుడు చేపట్టింది? 1) 1990, డిసెంబర్ 2) 1991, డిసెంబర్ 3) 1992, డిసెంబర్ 4) 1993, డిసెంబర్ 138. ఎవరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు? 1) సుబిమల్ దత్ 2) జి.వి. రామకృష్ణ 3) రంగరాజన్ 4) కేల్కర్ 139. జాతీయ తయారీ విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 1) 2011, అక్టోబర్ 4 2) 2011, నవంబర్ 4 3) 2011, డిసెంబర్ 4 4) 2012, జనవరి 4 140. కింది వాటిలో మహారత్న హోదా లేని ప్రభుత్వ కంపెనీ? 1) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ 3) కోల్ ఇండియా లిమిటెటడ్ 4) మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ 141. మనదేశంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1) 1947, జనవరి 1 2) 1947, ఫిబ్రవరి 1 3) 1947, మార్చి 1 4) 1947, ఏప్రిల్ 1 142. ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ ప్రకారం ‘పనిచేసే హక్కు’ కల్పించారు? 1) 40 2) 41 3) 42 4) 43 143. కింది వాటిలో సరికానిది? 1) ది చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్– 1986 2) ది కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) యాక్ట్ – 1970 3) ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ – 1961 4) ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ యాక్ట్ –1962 144. 2015–16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 264 మిలియన్ టన్నులు కాగా, జరిగిన ఉత్పత్తి? 1) 251.23 టన్నులు 2) 252.232 టన్నులు 3) 253.23 టన్నులు 4) 254.23 టన్నులు 145. ఏ రుతుపవన కాలాన్ని ఖరీఫ్గా పేర్కొంటారు? 1) నైరుతి 2) ఈశాన్య 3) ఆగ్నేయ 4) వాయవ్య 146. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా పేర్కొన్న వ్యక్తి? 1) నార్మన్ బోర్లాగ్ 2) కురియన్ 3) ఎం.ఎస్. స్వామినాథన్ 4) విలియం గాడ్ 147. జతపర్చండి? జాబితా –1 జీ) సిల్వర్ విప్లవం జీజీ) శ్వేత విప్లవం జీజీజీ) పసుపు విప్లవం జీఠి) గోల్డెన్ విప్లవం జాబితా–2 a) నూనె గింజల ఉత్పత్తి b) తేనె, పండ్ల ఉత్పత్తి ఛి) గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఛీ) పాల ఉత్పత్తులు 1) i-a, ii-b, iii-c, iv-d 2) i-b, ii-a, iii-c, iv-d 3) i-c, ii-d, iii-a, iv-b 4) i-d, ii-a, iii-c, iv-b 148. ప్రాంతీయ అసమానతల కొలమానాల్లో లేనిది? 1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పట్టణీకరణ 3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత 4) పారిశ్రామిక ఉద్యోగిత 149. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఏ్చnఛీ bౌౌజు ౌజ S్ట్చ్టజీట్టజీఛిటౌn ్టజ్ఛి ఐnఛీజ్చీn ఉఛిౌnౌఝy (201314) ప్రకారం 2011–12లో పేదరికరేఖ దిగువన ఉన్న దేశ జనాభా? 1) 20.9% 2) 21.9% 3) 22.9% 4) 23.9% 150. అతి తక్కువ స్త్రీ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం? 1) రాజస్థాన్ 2) బిహార్ 3) మధ్యప్రదేశ్ 4) అసోం -
ఎస్ఐ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు
– రోజు వెయ్యి మందికి ఆహ్వానం – మొదటి రోజు 687 మంది హాజరు – 519 మంది రాత పరీక్షకు ఎంపిక కర్నూలు: పోలీసు శాఖలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మ్యాట్రిన్ (మహిళలు) నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టు ప్రక్రియ మంగళవారం ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో ప్రారంభమైంది. రాయలసీమ పరిధిలోని కర్నూలు,కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్ఐ కొలువులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ టెస్ట్‌కు హాజరయ్యారు. ఉదయం 5.30 గంటలకే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలైంది. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టుల సమాచారం ముందుగానే అందజేయడంతో మొదటి రోజు సుమారు 687 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎత్తు, ఛాతి కొలతలను పరీక్షించారు. అందులో అర్హత సాధించిన వారికి 100, 1600 పరుగు పరీక్షతో పాటు లాంగ్‌జంప్ నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్ తదితరుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. అప్పీల్‌కు అవకాశం: ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో (పీఎంటీ) సందేహాలుంటే అభ్యర్థులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆయా అభ్యర్థులు చివరి రోజు 12వ తేదీ డీఐజీ రమణకుమార్‌కు అప్పీల్ చేసుకుని మరోసారి పీఎంటీకి హాజరు కావచ్చు. పీఎంటీతో పాటు 1600 మీటర్ల పరుగు పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలకు అనుమతిస్తారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన అనంతపురం, కర్నూలు కేంద్రంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు 10079 మంది పురుషులు, 613 మంది మహిళలకు ఈ నెల 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు సూచనలు: అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, రెండు జిరాక్స్ సెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. – ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో సందేహాలు ఉంటే అభ్యర్థులు ఈనె 12న అప్పీల్ చేసుకోవచ్చు. – ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మ్యాట్రిన్ పోస్టుల్లో ఏదో ఒకదాని కోసమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగుతో పాటు, 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధించాలి. శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 18,19 తేదీల్లో తుది రాత పరీక్ష జరుగుతుంది. మొదటి రోజు ప్రతిభను కనబరిచి 519 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. -
గ్రూప్2 స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు కసరత్తు
పరీక్షా కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్లకు ఏపీపీఎస్సీ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెల 8న జారీచేసిన గ్రూప్2 నోటిఫికేషన్‌కు అత్యధిక సంఖ్యలో 6.55 లక్షల మంది దరఖాస్తు చేయడంతో స్క్రీనింగ్ టెస్టు నిర్వహణపై కమిషన్ అధికారులు ముందునుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరీక్షలకు అనువైన పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను అనుసరించి పరీక్షకు వసతి ఏర్పాట్లు చేయించాలని సూచించారు. కాగా, 150 మార్కులకు నిర్వహించనున్న ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్ వివరాలను ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పరీక్ష మూడు కేటగిరీల్లో ఉంటుంది. -
ఒక్కో పోస్టుకు 668 మంది
-
ఒక్కో పోస్టుకు 668 మంది
గ్రూప్– 2 ఆన్లైన్ దరఖాస్తులకు ముగిసిన గడువు సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ నవంబర్ 8న విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. మొత్తం 982 పోస్టులకు 6,55,279 మంది దరఖాస్తులు సమర్పించినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టెస్టులో ఒక్కో పోస్టుకు దాదాపు 668 మంది చొప్పున పోటీ పడనున్నారు. స్క్రీనింగ్ టెస్టును ఓఎంఆర్ పత్రాల ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల రూపంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర (ఏపీలో జరిగిన వివిధ సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు), భారత రాజ్యాంగం, భారత ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక పరిస్థితి, గ్రామీణ సమాజంలో ఇటీవలి కాలంలోని సమస్యలు, ఇతర పరిణామాల (ఏపీ స్పెషల్ రిఫరెన్సు)తో ప్రశ్నలుంటాయి. స్క్రీనింగ్ టెస్టు నుంచి ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మే 20, 21 తేదీల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుందని కార్యదర్శి ప్రకటించారు. -
ప్రశాంతంగా ముగిసిన అసిస్టెంట్ ఇంజనీర్ల పరీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ల స్క్రీనింగ్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 32,530 మంది దరఖాస్తు చేసుకోగా 27,827 మంది అభ్యర్థులు ఆదివారం పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని 59 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు సంబంధించి కీ అభ్యంతరాల నమోదు ప్రక్రియను సోమవారం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి ఒకటిన మెయిన్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ విబాగాలకు సంబంధించి ఈఏ పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరులో నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. -
నేటినుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్
– రోజుకు 1000 మందికి ఆహ్వానం – ఈనెల 20 వరకు దేహదారుఢ్య పరీక్షలు – అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలి: ఎస్పీ కర్నూలు: పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో గురువారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గత నెలలో ప్రాథమిక పరీక్ష రాసి 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు 1000 మంది చొప్పున హాజరు కావలసిందిగా ఆహ్వానాలు పంపారు. బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారికి లాంగ్‌జంప్ 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగు పోటీలు నిర్వహించనున్నారు. గతంలో పోలీసు అధికారులు దగ్గరుండి వారి కనుసన్నల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేవారు. అలా కాకుండా ఈసారి కానిస్టేబుళ్ల ఎంపిక పోటీలు సాంకేతిక పద్ధతిలో నిర్వహించనున్నారు. ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగుపందెం కూడా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పద్ధతి ద్వారానే ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం రెండు సాఫ్ట్వేర్ కంపెనీల సిబ్బందికి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ నెల 20 వరకు ప్రతిరోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్రీడామైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అభ్యర్థులకు కేటాయించిన సమయాల్లోనే దేహదారుఢ్య పరీక్షలకు అందుబాటులో ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో అభ్యర్థులు హాజరుకావలసి ఉంటుంది. అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి : ఎస్పీ ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు ఏర్పాట్లను ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. దేహదారుఢ్య పరీక్షల వద్ద విధులు నిర్వహించే సిబ్బందితో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డిగ్రీలు, పీజీలు, ఆపై చదువులు చదివిన అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు హాజరవుతున్నారని వారి పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అసభ్యకర పదజాలాన్ని వాడకూడదని ఆదేశించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పైఅధికారులకు 'సెట్' ద్వారా అందించాలని ఆదేశించారు. -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం!
ఏ కంపెనీ అయినా ముందుగా వందల మంది విద్యార్థుల నుంచి అనర్హులను వడపోయడానికి మొదట స్క్రీనింగ్ టెస్ట్/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ఆయా కంపెనీలు తమకు అవసరమున్న ఖాళీల సంఖ్యకు 1:5 లేదా 1:6 నిష్పత్తిలో విద్యార్థులను తదుపరి దశల్లోకి అనుమతిస్తాయి. ప్రాంగణ నియామకాలైనా, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయినా.. చాలామంది వివిధ కారణాల వల్ల మొదటి దశ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అధిగమించలేక పోతున్నారు. కాబట్టి ఇందులో రాణించాలంటే ఏయే అంశాలపై దృష్టి సారించాలి? ఏయే అంశాలపై ప్రశ్నలుంటాయో తెలుసుకుందాం.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి చదివిన చదువుకూ, నేర్చుకున్న స్కిల్స్‌కు ఫలితం తేలే సమయం. ఇన్ని రోజులు కుస్తీపట్టిన పుస్తకాలు, అలవర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తో కొలువుదీరే అవకాశం కల్పిస్తున్నాయి ప్రాంగణ నియమాకాలు. కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఆప్టిట్యూడ్ టెస్ట్/టెక్నికల్ ఇంటర్వ్యూ/హెచ్ఆర్ ఇంటర్వ్యూ/సిస్టమ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీల ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో బృంద చర్చలు, జామ్ (జస్ట్ ఎ మినిట్) సెషన్స్ కూడా ఉంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాంటి కంపెనీలైతే మరో అడుగు ముందుకేసి మేనేజీరియల్ రౌండ్ కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు టెక్నికల్ దశలోనే రెండు మూడు రౌండ్లు జరుపుతున్నాయి. సాధారణంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ 45 నిమిషాలు లేదా గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభనష్టాలు, ట్రైన్స్, లాగారిథమ్, కసాగు, గసాభా మొదలైన అంశాలపై ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటుగా వడ్డీలపై ప్రశ్నలు, భాగస్వామ్యం, ఎత్తు - దూరం తదితర అంశాలపై ప్రశ్నలడిగే అవకాశం ఉంది. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి బార్గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్టులు, నెట్ డయాగ్రమ్స్, ట్యాబులర్ డేటా ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారు. లాజికల్ రీజనింగ్ ఈ విభాగం నుంచి కోడింగ్ డీకోడింగ్, డెరైక్షన్స్, క్లాక్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, లాజికల్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్స్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, అనాలజీస్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తారు. వెర్బల్ ఎబిలిటీ వోకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, అనాలజీస్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్ కాన్సెప్ట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయానికి.. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు సదరు కంపెనీలు గతంలో నిర్వహించిన ప్రశ్నపత్రాలను సేకరించుకొని ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్సైట్లల్లో గత సంస్థలు నిర్వహించిన ప్రశ్నపత్రాలను పొందొచ్చు. పరీక్ష విధానం, దానికి కేటాయించే సమయం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము హాజరు కాబోయే కంపెనీ అనుసరించే పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి. థర్డ్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. సమస్యను సాధించడం, పజిల్ టెస్టులకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలేజీలో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ (సీఆర్టీ) తరగతులకు తప్పనిసరిగా హాజరవ్వాలి. సందేహాలు వస్తే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సమయపరిమితిని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానాలు గుర్తించడం సులువనేది నిపుణుల సూచన. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానాన్ని గుర్తించవచ్చు. రిఫరెన్స్ బుక్స్ ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్), వొకాబులరీ కోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయీస్, జీఆర్ఈ బారోన్స్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. -
పోలీస్ రాత పరీక్షకు 551 మంది ఎంపిక
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో 8వ రోజు మంగళవారం అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. 800 మందిని ఆహ్వానించగా 713 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్టులో పాల్గొన్నారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 551 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 168 మంది అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రీమీలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ రామకృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాత పరీక్షకు 284 మంది ఎంపిక
కొనసాగుతున్న స్క్రీనింగ్ టెస్ట్ కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి సోమవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో 284 మంది మహిళా అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో ఏడో రోజు మహిళా అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 800 మందిని ఆహ్వానించగా 565 మంది మహిళలు హాజరయ్యారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలోని కంప్యూటరీకరణ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 284 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో 192 మంది మహిళా అభ్యర్థులు క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండో రోజు 330 మంది ఎంపిక
- కొనసాగుతున్న కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో రెండో రోజు మంగళవారం దేహదారుఢ్య పరీక్షలకు 800 మందిని ఆహ్వానించగా 603 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్టుకు హాజరయ్యారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన, బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారిని 30 మంది ప్రకారం బ్యాచ్‌లుగా చేసి1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రెండో రోజు మొత్తంగా 330 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 182 మంది ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో వెనక్కు పంపించారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రిమిలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన స్క్రీనింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలు మినహా వచ్చే నెల 3వ తేదీ వరకు నిరంతరాయంగా దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతాయని ఎస్పీ వెల్లడించారు. -
అత్యాధునిక పోలీస్ స్క్రీనింగ్ టెస్టు
కర్నూలు : పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్ల భర్తీకి (డ్రైవర్, మెకానిక్) ప్రభుత్వం అనుమతించడంతో స్థానిక ఏపీఎస్పీ మైదానంలో సోమవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి అర్బన్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్కీన్రింగ్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన 23,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుళ్ల భర్తీ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికష్ణను ప్రభుత్వం చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించింది. మొదటి రోజు వెయ్యి మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 590 మంది హాజరయ్యారు. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ డివైజెస్(ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ట్రాక్ వెంట అభ్యర్థులు పరిగెత్తేటప్పుడు ఎంత సమయంలో ఎన్ని రౌండ్లు పూర్తి చేశారన్నది బార్ కోడింగ్ ద్వారా అభ్యర్థుల సమయాన్ని లెక్కిస్తున్నారు. మొదటిరోజు 362 మంది స్కీన్రింగ్ టెస్టులో అర్హత సాధించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని 172 మంది అభ్యర్థులను అనుమతించలేదు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్ డీఎస్పీ కె.షరీఫ్, ఈ కాప్స్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు
ఉన్నత విద్యామండలికి బాధ్యత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా పోస్టుల భర్తీకి‘స్క్రీనింగ్ టెస్టు’ పెట్టాలని వర్సిటీల ఉపకులపతులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించారు. బుధవారం విజయవాడలో వీసీల సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు పి.విజయప్రకాశ్, పి.నరసింహారావు, కమిషనర్ బి.ఉదయలక్ష్మి, మండలి కార్యదర్శి వరదరాజన్, 15 యూనివర్సిటీల వీసీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి స్కైప్ ద్వారా వీడియోలో మాట్లాడారు. వర్సిటీల్లో 1,104 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర స్థాయిలో కామన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని,పరీక్ష బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించాలని మొదట భావించారు. దీనిపై వీసీలు, విద్యానిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో తాజా సమావేశంలో దీనిపై చర్చించారు. ఉన్నత విద్యామండలి ఇప్పటికే పలు కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నందున అదే మాదిరి ఒక కన్వీనర్‌ను నియమించి ఈ ‘స్క్రీనింగ్ టెస్టు’ బాధ్యత అప్పగించాలని పలువురు వీసీలు సూచించారు. -
21న స్క్రీనింగ్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ బ్యాంకులు నిర్వహించే ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ ఆ««దl్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని బాలాజీనగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకోసం దరఖాస్తు చేసుకున్న జిల్లా అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పరుగెత్తాల్సింది ఒక మైలే!
పోలీసు ఎంపిక పరీక్షలో కీలక మార్పులు సాక్షి, హైదరాబాద్: పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని స్థానంలో ఒక మైలు(1.6 కి.మీ.) పరుగును చేర్చనున్నారు. డీజీపీ జేవీ రాముడు మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంపిక ప్రక్రియలో మార్పుచేర్పులను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఎంపిక రాత పరీక్ష లోనూ మార్పులు చేయనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించి, తర్వాత దేశదారుఢ్య పరీక్షలతోపాటు ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని అధికారులు సూచించారు. పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టుల భర్తీతోపాటు వీరికిస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని డీజీపీ నిర్ణయించారు. -
డీజే, జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగింపు
* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * సెప్టెంబర్ 16న తుది విచారణ సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జీలు (డీజే), జూనియర్ సివిల్ జడ్జీలు (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను కొనసాగించాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 జిల్లా జడ్జీల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామకపు పత్రాలు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని వారికి స్పష్టం చేయాలని తెలిపింది. అదే విధంగా జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీ విషయంలో 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. అనంతరం రాతపరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేసి, వాటి ఫలితాలను నియామకపు అధికారుల ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచిం చింది. అయితే నియామకపు ప్రక్రియను ఖరారు చేయవద్దని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాస నం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యాలను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, అలాగే జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం.. సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీజే, జేసీజే పోస్టుల భర్తీకి గతంలో విధించిన గడువును పొడిగించాలన్న హైకోర్టు అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సిందేనని, లేకపోతే అది కోర్టు ధిక్కారం అవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
ఆశల ఊసుల్లోనే క్రమబద్ధీకరణ
⇒ జూన్‌లో ఇస్తామన్న ఉత్తర్వులకు ఇంకా దిక్కులేదు ⇒ స్క్రీనింగ్ పరీక్షకు నోటిఫికేషన్ ఎప్పుడు..? ⇒స్థానికులు, స్థానికేతరులతోనే కొత్త పీటముడి ⇒ ఆర్థిక భారం పడుతుందని దాటవేస్తున్న సర్కారు ⇒ 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇంకా మోక్షం సిద్ధించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జూన్‌లోనే ఉత్తర్వులు ఇచ్చి... జూలై నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమం చేపడతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవతరణ దిన వేడుకల్లో ప్రకటించారు. ఈ సంవత్సరంలోనే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులు దాటినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ లేదు. జూన్‌లో జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగింది. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, తెలంగాణ స్థానికేతరులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కారు ఊసెత్తకపోవటంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విషయంలోనే ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు పాటించిన నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులనూ విభజించే వీలుంది. కానీ.. అందుకు సంబంధించిన మార్గదర్శకాల షెడ్యూలును ముందుగా విడుదల చేయాలి. ఆ దిశగా సర్కారు కసరత్తు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. స్థానికేతరుల గుర్తింపే సమస్య ప్రధానంగా స్థానికులు, స్థానికేతరులను గుర్తించాలనే నిర్ణయమే రెగ్యులరైజేషన్‌కు పీటముడిగా మారిందని, అందుకే జాప్యం అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించటంలో ఇబ్బంది లేదని.. అదే సమయంలో ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలా.. వద్దా.. అనే సందిగ్ధత కూడా కొనసాగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రీనిం గ్ పరీక్షకు నోటిఫికేషన్ వేసే సమయంలో రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ చిక్కుముడి తొలగిపోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం పంపించాలని తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలను కోరింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 28 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.9 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఆర్థికం గా రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉం ది. ఈ నేప థ్యంలో కాం ట్రాక్టు ఉద్యోగు ల రెగ్యులరైజేషన్ను వేగవంతంగా పూర్తి చేస్తే అంతకంతకు భారం పడుతుంది. అందుకే సర్కారు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టి సాగదీస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పరిశీలనలో అంశం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో సర్కారు నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌కు మార్గదర్శకాలను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను మొదటగా రెగ్యులరైజ్ చేయాలని సూచించింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. ఈలోగా తెరపైకి వచ్చిన స్క్రీనింగ్ పరీక్ష, స్థానికత అంశాలతో ఈ ఫైళ్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు మళ్లీ కొంతకాలం కంచికి చేరినట్లయింది. -
బంగరు భవితకు పునాది వేద్దాం
విద్యాహక్కు చట్టం వచ్చాక... నిరంతర సమగ్ర మూల్యాంకనను అమల్లోకి తెచ్చారు. టీచర్లకు, విద్యాశాఖకు కూడా దాన్ని వర్తింపజేస్తే మంచిది. విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసి, పాఠశాలల నిర్వహణ, నిఘా, పర్యవేక్షణకు తగు చర్యలు చేపట్టాలి. సిలబస్‌కు, కాలానికి అనుగుణంగా టీచర్లు తమ విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేలా ఐదేళ్లకోసారి వారికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలనే సూచన పరిశీలనార్హం. విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. వారు చిత్త శుద్ధి, అంకితభావం చూపినచోట మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఒరవడి అంతటికీ విస్తరించాలి. నేటి నుంచి మళ్లీ బడులు మొదలవుతున్నాయి. తమ ఆశలు, ఊసులతో పాటు తల్లిదండ్రుల బంగారు కలల్ని మోసుకుంటూ తూనీగల్లా పిల్లలు బడు లకు పరుగులు తీసే రుతువు వచ్చేసింది. పల్లెలు, శివారు జనావాసాల్నుంచి పట్టణాలు, నగరాల వరకు రంగు రంగుల దుస్తుల్లో కళకళలాడే పిల్లల కదలి కలు... అదో సందడి. పిల్లల ఆశలు, ఆశయాలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు, టీచర్ల ప్రతిపాదనలు, మేధావుల చర్చలు, ప్రభుత్వాల నిర్ణయాలు... వెరసి కొత్త వాతావరణం, కొత్త శోభ. ఈ ఏడాదైనా మెరుగైన ప్రమాణాలతో బడి చదువులు బాగుపడాలని యావత్ సమాజం కోరుకుంటోంది. భావి వికాసా నికి పునాదులు పడేది బడిలోనే. బీజం గట్టిదైతేనే, బలమైన పునాదులు పడితేనే... భవిష్యత్ జాతి వికాస సౌధం సుదృఢంగా నిలుస్తుంది. అన్ని రంగాల్లోలాగే ఇక్కడా మంచీ, చెడూ రెండూ ఉన్నాయి. చెడును వీలైనంత తగ్గించి, మంచిని పెంపొందిస్తూ సాగితేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వాలతో పాటు ఈ ప్రక్రియతో సంబంధమున్న వారంతా తమ స్థాయి లో శ్రద్ధాసక్తులు చూపితేనే పాఠశాల విద్య ప్రమాణాలు మెరుగవుతాయి. సక ల అవరోధాల మధ్య కూడా... ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చూపిన ప్రతిభాపాటవాలు ఇందుకు ప్రేరణ కావాలి. పర్యవేక్షణతోనే ఫలితాలు సెలవుల తర్వాత బడులు మళ్లీ తెరుచుకునే వేళకి అన్ని సదుపాయాలు, వస తులు కల్పించాలని అంతా కాంక్షించారు. అదెలా ఉన్నా శుక్రవారం నుండి తెలంగాణలో బడులు మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు, టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రస్తుత చర్చనీయాంశం. టీచర్ల బదిలీల వ్యవహారం సరేసరి! విద్యాప్రమాణాల పెంపుదల మేధావివర్గంలో బాగా నలుగుతోంది. ఏకీకృత సర్వీసు నిబంధనల ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు నిలుపుదల ఉత్త ర్వుల దరిమిలా ఆ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఏపీలో ప్రత్యామ్నా య తాత్కాలిక నిబంధనల్ని రూపొందించుకొని పదోన్నతులు కల్పించారు. తెలంగాణలో అలాంటివేవీ లేనందున పదోన్నతులు లేవు. ఫలితంగా మం డల విద్యాధికారులు (ఎంఈఓ) లేక నిఘా, నియంత్రణ లోపిస్తోంది. 456 ఎంఈఓ పోస్టులకు గానూ పది తప్ప 446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 57 జిల్లా ఉప విద్యాధికారి పోస్టులకు 47 ఖాళీ! తాత్కాలిక నిబంధనలను పక్క నపెట్టి, పోస్టులవారీగా చూస్తే ఏపీలోనూ పరిస్థితి ఇదే. 666 ఎంఈఓ పోస్టు లకు గాను 536 ఖాళీలు. 63 డిప్యూటీ డీఈఓ పోస్టులకు గాను 51 ఖాళీ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన ఎలా ఉంది? టీచర్లు క్రమం తప్పకుండా బడికి వస్తున్నారా? పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా? విద్యార్థుల ప్రమాణాలెలా ఉన్నాయి? తదితర విషయాలపై పర్యవేక్షణే లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానోపా ధ్యాయులకు ఇన్చార్జి ఎంఈఓ బాధ్యతలు అప్పగించినా, అత్యధికులు అటు ఎంఈఓ బాధ్యతలకు, ఇటు ప్రధానోపాధ్యాయ బాధ్యతలకు కూడా పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. మండల విద్యాభివృద్ధి అధికారుల్ని (ఎంఈ డీఓ) నియమించుకోవాలన్న ప్రతిపాదనకూ మోక్షం లభించట్లేదు. తెలంగా ణలో కూడా తాత్కాలిక సర్వీసు నిబంధనలేర్పరచుకొని పదోన్నతులను కల్పిస్తే సమస్య ఎంతో కొంత పరిష్కారమౌతుంది. బడులు ఉంచి, టీచర్లని సర్దాలి టీచర్లు-పిల్లల నిష్పత్తికి తగినట్టుగా బడులు, పోస్టుల ‘హేతుబద్ధీకరణ’ పాఠ శాల విద్యారంగంలో ఇప్పుడు హాట్ టాపిక్. ఎక్కువ మంది పిల్లలున్న చోట ఒకటి, రెండు టీచర్ పోస్టులుండటం, ఐదు, ఆరు టీచర్ పోస్టులున్న చోట పట్టుమని పది, ఇరవై మంది విద్యార్థులు కూడా లేకపోవడంతో రెండు చోట్లా విద్యాప్రమాణాలు అధ్వానంగా ఉంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు అయిదో వంతు బడుల పరిస్థితి ఇదే. దీన్ని చక్కదిద్దే హేతుబద్ధీకరణకు రెండు ప్రభుత్వాలు సన్నద్ధమైనాయి. తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఆ ఉత్తర్వులను (జీవో:6) జారీ చేసింది. బడుల వారీగా గాక, టీచర్ పోస్టుల వారీగా హేతబద్ధీకరణకు సంబంధించిన తాజా ప్రతిపాదనల ఫైలుపై ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు సంతకం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ పోస్టుల్ని రద్దు చేయడమో, పెంచడమో చేస్తారు. పోస్టులకు తగిన సంఖ్యలో విద్యార్థులు లేని బడుల్ని రద్దు చేసి, వాటిని సమీప గ్రామాల్లోని బడులకు కలపాలనే ‘బడుల హేతుబద్ధీకరణ’ ఇక లేనట్టే! జరగాల్సింది ఇదే తప్ప, బడుల్ని రద్దు చేసే హేతుబద్ధీకరణ కాదు. అలా జరిపితే మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాలు, జనావాసాలకు తీరని నష్టం జరుగుతుం ది. 19 మందికి లోబడి విద్యార్థులున్న గ్రామాలు, జనావాసాల్లో ప్రాథమిక బడి ఉండదు. 75 మందికి తగ్గి విద్యార్థులున్న చోట ఉన్నతపాఠశాల రద్దవు తుంది. ఇది, విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి పూర్తి విరుద్దం. 6-14 మధ్య వయ స్కులైన పిల్లలందరికీ నిర్బంధ విద్య ప్రభుత్వ బాధ్యత. టీచర్ పోస్టులు- పిల్లల నిష్పత్తి 1:30కి మించకుండా ఉండాలని చట్టం నిర్దేశిస్తోంది. తెలంగా ణలో 1.28 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుంటే, 30 వేల ప్రభుత్వ బడుల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ఏపీలో ఇంకా మెరుగైన నిష్పత్తే ఉంది. 1.90 లక్షల మంది ప్రభుత్వ టీచర్లుండగా, 48 వేల ప్రభుత్వ బడుల్లో 46 లక్షల మంది విద్యార్థులున్నారు. బడుల్ని రద్దుచేయకుండా, టీచర్ పోస్టుల్ని సర్దుబాటు చేయడమే అన్నివిధాలా మంచిదని ఉపాధ్యాయులు, మేధావి వర్గం కూడా భావిస్తోంది. అక్కడ మరోరకం అన్యాయం ప్రైవేటు బడుల్లో చదువు గొప్పగా ఉంటుందని ప్రచారం ఉన్నా, అక్కడుండే లోపాలు అక్కడున్నాయి. మార్కుల కోసం బట్టీ బ్రాండు చదువులు చెబు తారని, సృజనను పెంపొందింపజేయరనే విమర్శ బలంగా ఉంది. ఇక ఫీజు లపై నియంత్రణే లేదు. ఆట స్థలాలుండవు తప్ప, ఇతర సదుపాయాలు కాస్త నయమే. తెలంగాణ కన్నా ఏపీలో ఉపాధ్యాయులు-విద్యార్థుల నిష్పత్తి ప్రైవేటు రంగంలో మెరుగ్గానే ఉంది. తెలంగాణ(హైదరాబాద్ సహా)లోని 13 వేల ప్రైవేటు బడుల్లో లక్ష మంది టీచర్లు, 31 లక్షల మంది విద్యార్థులుండగా, ఏపీలోని 12 వేల బడుల్లో 1.08 లక్షల ఉపాధ్యాయులు, 26 లక్షల మంది విద్యార్థులున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వీటిపై సరైన ప్రభుత్వ నిఘా, పర్య వేక్షణ, అజమాయిషీ లేవు. ఫీజుల అదుపునకు 2008-09లో ఓ ప్రయత్నం జరిగినా అది సవ్యంగా అమలు కాలేదు. 2010 నుంచి విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమల్లోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు. పాఠ శాలలోని వనరులు, సదుపాయాల్ని బట్టి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఫీజుల్ని సిఫారసు చేయాలని, జిల్లా స్థాయిలో ఇందుకోసం పనిచేసే ఒక కమిటీ క్షేత్ర పరిశీలన చేసి, అంతిమంగా ఫీజుల్ని ఖరారు చేయాలని నిర్దేశిం చారు. కానీ, అవేవీ అమలుకు నోచుకోవట్లేదు. విద్యాహక్కు చట్టం వచ్చాక, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం... వాటి పకడ్బందీ అమలుకు జీవో 42, 43లను, ఫీజులపై నియంత్రణకు జీవో 92, 93లను జారీ చేసింది. కానీ వాటిని హైకోర్టు కొట్టివేసింది. అలాగే ప్రైవేటు బడుల్లో వసతులు, టీచర్- విద్యార్థి నిష్పత్తి, ఫీజులపై ప్రభుత్వమిచ్చిన ప్రాథమిక ఉత్తర్వులను (జీవో:1) కూడా ఎవరూ ఖాతరు చేయట్లేదు. ఈ ఉల్లంఘనల్ని పరిశీలించి తగిన చర్య లు తీసుకునే వ్యవస్థ, యంత్రాంగం కూడా లేవు. ప్రైవేటు బడుల్లో ఫీజులు ఎక్కువ, టీచర్ల కిచ్చే జీతాలు తక్కువ. ఉపాధ్యాయుల విద్యార్హతల విష యంలోనూ రాజీపడి, అయోగ్యులనే గురువులను చేసి నెట్టుకొస్తుంటారు. నిరంతర మూల్యాంకనం విద్యార్థులకేనా? విద్యాహక్కు చట్టం వచ్చాక విద్యాబోధన, పరీక్షలు, ప్రతిభ మూల్యాంకనం లో మార్పులు తెచ్చారు. సంవత్సరాంతంలో పరీక్షల ద్వారా ఉత్తీర్ణతను నిర్ణ యించే పద్ధతి కాకుండా, నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. దీన్ని విద్యార్థులకే గాక ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యా శాఖకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రభుత్వాలు విద్యాశాఖ బడ్జెట్‌ను పెంచడంపైన, తగిన వస తులు, సదుపాయాల కల్పనపైన శ్రద్ధాసక్తులు చూపాలి. పాఠశాలల నిర్వ హణ, నిఘా, నియంత్రణ, పర్యవేక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకో వాలి. అత్యధిక బడుల్లో అధికారికంగా స్వీపర్లు, అటెండర్లు లేరు. బడి నిర్వ హణ నిధుల్లోంచి ఎక్కడికక్కడ నెలకు రూ.200 లేదా రూ.300 ఇచ్చి ఆ పనులు చేయించుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో గదుల్ని శుభ్రం చేయడం, గంట కొట్టడం తదితర పనులన్నీ పిల్లలతోనే చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం విషయంలో అన్నీ లోపభూయిష్టమే. అపరిశుభ్రమైన ఆహారం తిని పిల్లలు వాంతులు, విరేచనాలు ఇతర జబ్బుల పాలవుతుం టారు. ప్రభుత్వం చొరవ చూపి వీటన్నిటికీ చరమగీతం పాడాలి. మారుతున్న సిలబస్ ప్రకారం, కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ విషయ పరిజ్ఞానాన్ని, మేధను మెరుగుపరచుకోవట్లేదనే విమర్శ ఉంది. టీచర్లకు కనీసం ప్రతి అయిదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, కనీసార్హత సాధించేలా చూడాలనే సూచన వస్తోంది. ఏదేమైనా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. వారు చిత్తశుద్ది, అంకిత భావం చూపినచోట చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. నిర్లక్ష్యం వహించిన చోట విద్యా ప్రమాణాలు నీరుగారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షలకు పైగా ఉన్న పాఠశాల ఉపాధ్యాయుల మనఃపూర్వక ఆశీస్సులే బాల్యా నికి దీవెన! భారత బంగారు భవితవ్యం మొగ్గతొడిగేది ఈ బడుల్లోనే!! - దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మహిళా డ్రైవర్లకు అద్భుతభవిష్యత్తు
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి 24న ఆర్టీఏలో స్క్రీనింగ్ టెస్ట్ ఆసక్తి గల వారికి ఆహ్వానం ‘సాక్షి’తో జేటీసీ రఘునాథ్ సిటీబ్యూరో: షీక్యాబ్స్ విధి విధానాలపై ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న (బుధవారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి రహదారి భద్రతా నిబంధ నలకు అనుగుణంగా మరింత శిక్షణనిస్తారు. నగరంలో షీ క్యాబ్స్ నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఇప్పటి వరకు 47 మంది మహిళా డ్రైవర్లు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల డ్రైవర్లు కూడా వీరిలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళా డ్రైవర్ల నైపుణ్యం, వాహనాలు నడపడంలో వారి అనుభవం, ఆసక్తి, ఎలాంటి వాహనాలను నడపగలరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అదే రోజు సాయంత్రం విధివిధానాలను రూపొందిస్తారు. బ్యాంకులు, ఇతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు కాబట్టి లోపాలకు. వైఫల్యాలకు తావు లేకుండా, సమర్థంగా నిర్వహించేందుకు రవాణా శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని త్రివేండ్రంలోని షీ క్యాబ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసిన అధికారులు అక్కడి కంటే విజయవంతంగా దీనిని నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల కొనుగోలుతో పాటు, 35 శాతం ప్రభుత్వమే సబ్సీడీని అందజేయడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు అన్ని విధాలుగా బాసటగా నిలిచి శిక్షణతో పాటు, అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఆఖరు తేదీలు లేవు: రఘునాథ్, సంయుక్త రవాణా కమిషనర్ మహిళలు వాహనాలు నడపడం ఏ మాత్రం సమస్య కాబోదు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రహదారులపై పరుగులు తీయవచ్చు. డ్రైవింగ్ వల్ల ఉపాధి లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేదీలంటూ ఏమీ లేవు. హైదరాబాద్‌లో ఈ వృత్తిని స్వీకరించబోయే మహిళలు ఒక సామాజిక బాధ్యతను కూడా తమ భుజాన వేసుకోబోతున్నారు. తోటి మహిళల భద్రతకు తాము భరోసా ఇవ్వబోతున్నారు. ఆ రకంగా వారు విజయం సాధించాలని ఆశిస్తున్నాం. మహిళా డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అంద జేస్తుంది. -
పరిశోధనలే ప్రామాణికం!
వర్సిటీలు, డిగ్రీ అధ్యాపకుల నియామక, పదోన్నతుల విధానాల్లో మార్పులు సవరణ మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ స్ర్కీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన వ్యాసాలకు ప్రాధాన్యం కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి అధ్యాపకుల నియామకాల్లో అభ్యర్థుల పరిశోధనా సామర్థ్యమే ప్రామాణికం కానుంది. వారి విజ్ఞానానికి, బోధనా సామర్థ్యానికి తోడు సహ పాఠ్య కార్యక్రమాలు కూడా నియామకాల్లో కీలకం కానున్నాయి. అభ్యర్థుల అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (ఏపీఐ)కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి అనుసరించే విధానాల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పలు మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ వర్సిటీలు, డి గ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సరైన సామర్థ్యం లేనివారు అధ్యాపకులుగా నియమితులవుతున్నారని.. విద్యార్థులకు ప్రమాణాల మేరకు బోధన జరగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజీసీ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం అధ్యాపకుల నియామకానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులో పరిశోధనలు, పరిశోధన పేపర్లు, ప్రాజెక్టులు, శిక్షణ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇకపై అధ్యాపకుల నియామకంలో అన్ని రాష్ట్రాల్లోని వర్సిటీలు, నియామక సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని యూజీసీ ఆదేశించింది. నియామకాల్లోనే కాదు పదోన్నతుల్లోనూ ఈ నిబంధనలను పాటించాలంటూ యూజీసీ జాయింట్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పరిగణనలోకి తీసుకునే అంశాలు.. అధ్యాపకుల నియామకాల్లో రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. ఇందులో ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధనల ప్రచురణకు (పుస్తకాలు తదితరాలు) 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గెడైన్స్‌కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్ నిర్ధారించాలని పేర్కొంది. అభ్యర్థుల విజ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలకు 50 శాతం స్కోర్ నిర్ధారించాలని... ఇందులో కనీసం 15 శాతం స్కోర్ సాధించాలని స్పష్టం చేసింది. పదోన్నతుల్లోనూ.. అధ్యాపకుల పదోన్నతుల్లోనూ ఇదే విధానాన్ని పాటించాలని యూజీసీ పేర్కొంది. పదోన్నతులకు సంబంధించి... లెక్చర్లు తదితరాలకు 50 పాయింట్లు, ఇతర బోధన పనులకు 10 పాయింట్లు, సిలబస్‌కు సంబంధించి వినూత్న కార్యక్రమాలు, జ్ఞానానికి 20 పాయింట్లు, బోధన, నేర్చుకునే విధానాలకు 20 పాయింట్లు, పరీక్ష విధులు, మూల్యాంకన విధుల్లో పనితీరుకు 25 పాయింట్లు.. మొత్తంగా 125 పాయింట్లు ఉంటాయి. అభ్యర్థులు కనీసం 75 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది. -
డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్.. సీడ్
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్).. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో డిజైనింగ్ విభాగంలో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను ఐఐటీ-బాంబే పర్యవేక్షిస్తుంది. సీడ్ ద్వారా ఆర్కిటెక్చర్, మెకానికల్ తదితర విభాగాల్లో డిజైన్ సంబంధిత కోర్సులు అభ్యసించవచ్చు. రెండు భాగాలుగా: సీడ్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్ భాషలో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలు ఉంటుంది. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-బిలో డిజైన్, హ్యాండ్ డ్రాయింగ్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పార్ట్-బి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. పార్ట్-ఎ ఆబ్జెక్టివ్: పార్ట్-ఎలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 50 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, జీకే-కరెంట్ అఫైర్స్, అనలిటికల్ ఎబిలిటీ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా ప్రముఖ కట్టడాలు, వ్యక్తులు, ఆర్కిటెక్చర్, కళలు వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. జీకే-కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలు కూడా డిజైన్, కట్టడాలు సంబంధిత నేపథ్యంగా ఉంటాయి. ఉదాహరణకు గతేడాది పరీక్షలో ఉత్తరాఖండ్‌లో 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయమేది? అదేవిధంగా వాస్తు, శిల్ప కళలు, ఫోటోగ్రిఫీ, ప్రింటింగ్ తదితర రంగాల్లో కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా చిత్రాలు ఇచ్చి అందులోని వ్యక్తులను లేదా కట్టడాలను గుర్తించడం, వివిధ సంస్థల లోగోలు, సరైన డిజైన్‌ను ఎంచుకోవడం వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆలోచనలను ప్రతిబింబించే: పార్ట్-బిలో మీలోని ఆలోచనలను చిత్రం, కథల రూపంలో వివరించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి రెండు గంటల సమయం కేటాయించారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం తప్పనిసరి, రెండో విభాగం ఐచ్ఛికం (ఆప్షనల్). మొదటి విభాగంలో స్కెచింగ్, క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ అంశాలు ఉంటాయి. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. స్కెచింగ్‌లో ఏదైనా నేపథ్యం ఆధారంగా డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. దీనికి 20 మార్కులు. డిజైన్లను ప్రెజెంట్ చేయడం, ఇచ్చిన డిజైన్‌కు ప్రత్యామ్నాయ డిజైన్లను చిత్రించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన డిజైన్‌లో లోపాలను గుర్తించి- దానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు సరైన డిజైన్ ను సూచించడం వంటి ప్రశ్నలను కూడా ఈ విభాగం నుంచి అడుగుతారు. క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ విభాగంలో.. ఇచ్చిన చిత్రం నేపథ్యాన్ని కథ రూపంలో వివరించాలి. ఈ ప్రశ్నకు 15 మార్కులు కేటాయించారు. తర్వాత ప్రశ్నలో ఏదో ఒక వస్తువునిచ్చి దాని ప్రత్యామ్నాయా ఉపయోగాలను పేర్కొనమనంటారు. దీనికి 15 మార్కులు. రెండో విభాగంలో విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటారక్షన్, ప్రొడక్ట్ డిజైన్, యానిమేషన్ డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. ఇందులో ఇచ్చిన సందర్భాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, యానిమేషన్, ప్రొడక్ట్ డిజైన్ నమూనాను చిత్రించాలి. నైపుణ్యాల పరీక్ష: సీడ్లో అకడమిక్ అంశాల కంటే అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థిలోని దృశ్యగ్రాహ్యత సామర్థ్యం (విజువల్ పర్సెప్షన్ ఎబిలిటీ), సృజనాత్మకత, తార్కిక విశ్లేషణ, డ్రాయింగ్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. గత పేపర్లను పరిశీలిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి (సీడ్ వెబ్సైట్లో గత ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి). పరీక్షలో లభించే సమయం ప్రకారం వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్కు వీలవుతుంది. డ్రాయింగ్ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. ఈ క్రమంలో షేడ్, లైన్స్, సృజనాత్మకత, తార్కిక వివేచన వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒక డిజైన్‌ను చూసిన వెంటనే.. లోపాలు గుర్తించే సామర్థ్యం, కారణాలను విశ్లేషించే నైపుణ్యం, ప్రత్యామ్నాయ డిజైన్లను రూపొందించే సృజనాత్మకత ఉండాలి. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు ఇలా మీ దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువును వివిధ కోణాల్లో చిత్రించేందుకు ప్రయత్నించాలి. అదేక్రమంలో వివిధ రకాల డిజైన్లపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా డ్రాయింగ్ సామర్థ్యాలు పెరుగుతాయి. అంతేకాకుండా వాటికి సంబంధించిన విభిన్న ఉపయోగాల గురించి కూడా ఆలోచించాలి. వాటిని ఒక క్రమ పద్ధతిలో రాయడం, చిత్రం ఆధారంగా కథను వివరించడం వంటి అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రెండేళ్లపాటు: ఫలితాలు వెల్లడించిన రోజు నుంచి రెండేళ్లపాటు సీడ్ స్కోర్ చెల్లుబాటులో ఉంటుంది. సీడ్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ స్కోర్ ఆధారంగా ఆయా కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ఇన్స్టిట్యూట్లు నిర్దేశించే అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు ఆయా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ల నుంచి సంబంధిత సమాచారాన్ని పొందడం మంచిది. ప్రవేశం:ఆయా ఇన్స్టిట్యూట్లు సీడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి పీజీ కోర్సుల్లో ప్రవేశాన్ని ఖరారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ ఇన్స్టిట్యూట్లు అనుసరించే విధానం.. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ డిజైన్/ ఇంటీరియర్ డిజైన్/ తత్సమానం లేదా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ డిజైన్ (10+2 తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లేదా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ లేదా తత్సమాన హోదా ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి నాలుగేళ్ల కోర్సు) లేదా బీఎఫ్ ఏ (10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్/సైన్స్/కంప్యూటర్ ఆప్లికేషన్స్ (10+2+3 తర్వాత రెండేళ్ల కోర్సు) లేదా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆర్ట్ (10వ తరగతి తర్వాత ఐదేళ్ల కోర్సు)తోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా రదఖాస్తు ఫీజు: రూ. 2,000 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళ అభ్యర్థులకు రూ.1,000) దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2014. పరీక్ష కేంద్రాల ఎంపిక వ్యవధి: అక్టోబర్ 15-30 వరకు. రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2014. ఫలితాల వెల్లడి: జనవరి 15, 2014 వివరాలకు: www.gate.iitb.ac. in /ceed-2015 ఇన్స్టిట్యూట్ ప్రవేశప్రక్రియ ఐఐఎస్సీ-బెంగళూరు సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ ఐఐటీ-బాంబే సీడ్ స్కోర్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ మూడు దశలు ఐఐటీ-కాన్పూర్ సీడ్/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఐఐటీ-హైదరాబాద్ సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ ఐఐటీ-గౌహతి సీడ్ స్కోర్, క్రియేటివ్ ఇంటరాక్టివ్ సెషన్, ఇంటర్వ్యూ. పీహెచ్డీ కోర్సుల్లో పీహెచ్డీ ప్రపొజల్, పబ్లికేషన్స్, ప్రొఫైల్, డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. -
ప్రశ్నలతో పాటు జవాబులూ..!
జేఎన్టీయూహెచ్లో రిక్రూట్మెంట్ ‘రగడ’ పరిపాలనా భవనం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష ఈ నెల 26కు వాయిదా: రిజిస్ట్రార్ సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో నిర్వహిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకపు ప్రక్రియ అధికారుల డొల్లతనాన్ని వెల్లడించింది. ఈ నెల 15 నుంచి నిర్వహిస్తున్న పరీక్షల్లో లొసుగులు బయటపడుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్న ఇద్దరు డెరైక్టర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. బుధవారం నిర్వహించిన మెథమేటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ అస్తవ్యస్తంగా ఉండడంతో అభ్యర్థులు పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. నియామకపు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రంతో జవాబులు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న లెక్కల పరీక్షలో ప్రశ్నపత్రంతో పాటు జవాబులూ ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను టిక్ చేసి పెట్టారు. ప్రశ్నపత్రం అందుకున్న అభ్యర్థులు జవాబులు కూడా టిక్ చేసి ఉండడంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు తెలియజేశారు. 60 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నపత్రంలో 57 ప్రశ్నలకు సరైన సమాధానాలు పెన్సిల్‌తో చిన్నగా మార్క్ చేసి ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. కీలకమైన పరీక్షలకు చేతితో రాసిన ప్రశ్నపత్రాలు ఇవ్వడం.. అందులో సమాధానాలను పెన్సిల్‌తో టిక్ చేసి ఉండడంతో ఎవరికోమేలు చేసేందుకే ఇలా చేశారని.. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటినీ రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై జేఎన్టీటీయూహెచ్ ఉపకులపతి రామేశ్వర్రావు స్పందిస్తూ... మానవ తప్పిదం వల్లే పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరు కావాల్సిందిగా అభ్యర్థులను కోరారు. కాగా, నియామక ప్రక్రియలో అవకతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు అభ్యర్థులు వెళ్లారు. పరీక్ష 26కు వాయిదా: రిజిస్ట్రార్ బుధవారం మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో జవాబులు మార్క్ చేసి ఉన్నట్లు పరీక్ష ప్రారంభ మైన కొద్దిసేపటికే గుర్తించామని, ఆ ప్రశ్నాపత్రాలను వెనక్కి తెప్పించామని రిజిస్ట్రార్ రమణరావు చెప్పారు. రద్దయిన పరీక్షను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.