
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
ఎనిమిదో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్–2 పరీక్షలు ఉంటాయని, రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు.
హాల్‌టికెట్లు ఈ నెల 31 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో (https://psc.ap.gov.in) అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితా కూడా వెబ్‌సైట్‌లో ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్‌లను ముందుగా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రం, ఇతర మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment