14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు | Group1 Mains Hall Tickets on TGPSC website from 14th | Sakshi
Sakshi News home page

14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు

Published Thu, Oct 10 2024 5:09 AM | Last Updated on Thu, Oct 10 2024 5:09 AM

Group1 Mains Hall Tickets on TGPSC website from 14th

21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు: టీజీపీఎస్సీ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్‌ సూచించింది. మెయిన్స్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్‌ స్పష్టం చేసింది. 

అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్‌ హాల్‌టికెట్‌ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకు నేందుకు వీలుగా పరీక్ష హాల్‌లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్‌ వివరించింది. 

హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్‌ కార్యాలయం పనిదినాల్లో 040– 23542185 లేదా 040–23542187 ఫోన్‌ నంబర్ల లో, లేదా హెల్ప్‌డెస్క్‌కు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement