TG: ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు | TSPSC Announce Group 1 Mains From October 21st | Sakshi
Sakshi News home page

ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

Published Wed, Oct 9 2024 3:40 PM | Last Updated on Wed, Oct 9 2024 6:39 PM

TSPSC Announce Group 1 Mains From October 21st

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది.

మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతించరు. ఇక ఈ నెల 14 నుంచి వెబ్ సైట్‌లో హాల్ టికెట్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులంతా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. అదే విధంగా పరీక్ష కేంద్రంలోకి  ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.

ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement