
అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు
బైపీసీలో కరీంనగర్ అమ్మాయికి వేయికి 997 మార్కులు
మొదటి సంవత్సరం ఎంపీసీలో ముగ్గురికి 469 మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో నలుగురు విద్యార్థులు 1,000కి 996 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ముగ్గురు విద్యార్థులు 469 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలోనూ 440 మార్కులకు నలుగురు 339 మార్కులు సాధించారు. ఈ సంవత్సరం బైపీసీలో టాప్ మార్కులు 997గా నమోదయ్యాయి. ఇంటర్‌బోర్డ్ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టాపర్ల వివరాలు ఇలా..
మొదటి సంవత్సరం (ఎంపీసీ): సి.అక్షయ, పుప్పాలగూడ, హైదరాబాద్ 469/470; పుట్టపోగుల వర్షిణి, బాచుపల్లి, హైదరాబాద్ 469/470; మామిడి సంహిత, వనస్థలిపురం, హైదరాబాద్ 469/470.
బైపీసీ: బి. లావణ్య, టీఎస్‌ఆర్‌జేసీ, మహబూబ్‌నగర్ 439/ 440; సయ్యద్ అర్షియా సమ్రీన్, మలక్‌పేట్, హైదరాబాద్ 439/440; హస్పాబేగం, టోలీచౌక్, హైదరాబాద్ 439/440 ; వాదుల వైష్ణవి, బాలానగర్, మహబూబ్‌నగర్ 439/440.
సీఈసీ: ఎండీ ఫర్హాన్, గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా495/500; మునీబ్ అహ్మద్ ఖాన్, కార్వాన్, హైదరాబాద్ 494/500.
హెచ్‌ఈసీ: తంగోరు వెన్నెల, సుదిమళ్ల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ 494/500; జంగం గ్లోరీ, సికింద్రాబాద్ 493/500.
మొత్తంగా ఇంటర్ టాపర్స్
ఎంపీసీ: ఇందూరి రషి్మత, రోటరీనగర్, ఖమ్మం 996/1,000 ; వారణాసి మనస్వి, జీడిమెట్ల, రంగారెడ్డి 996/1,000; కూనా రుతి్వక్, కొత్తపల్లి, కరీంనగర్ 996/1,000; పల్లెపంగ వసంత్‌కుమార్, సూర్యాపేట 996/1,000.
బైపీసీ: జక్కు అంజన, కొత్తపల్లి, కరీంనగర్ 997/1,000; కేతావత్ అఖిల, పెంచికల్‌పాడ్, దేవరకొండ 996/1,000; డి జ్యోత్స్నశ్రీ, కరీంనగర్ 996/1,000.
సీఈసీ: ఎనుబారి కెవిక్ జోష్, మేడ్చల్ 988/1,000; భక్తు గ్రీష్మ, భగత్‌నగర్, కరీంనగర్ 987/1,000.
హెచ్‌ఈసీ: గుండెబోయిన ధనప్రియ, మదీనాగూడ, రంగారెడ్డి 983/1,000; ఓనీ అభినా‹Ù, శేరిలింగంపల్లి, రంగారెడ్డి982/1,000.
కాగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
గ్రూప్స్ సాధించడమే లక్ష్యం
పల్లెపంగు వసంత్ కుమార్, (996) ఎంపీసీ, ప్రతిభ జూనియర్ కళాశాల, సూర్యాపేట
సూర్యాపేట: స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో గ్రూప్– వన్ ఆఫీసర్ కావాలన్నదే నా కల. నాన్న కానిస్టేబుల్ శీనయ్య, అమ్మ జానకమ్మల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. ప్రతిభ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
నా లక్ష్యం డాక్టర్
నేను చదివిన కాలేజీ యాజమాన్యం అందించిన ప్రణాళికాబద్ధమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి రాష్ట్రంలో టాపర్‌గా నిలవడం గర్వంగా ఉంది. నీట్ పరీక్షలో సత్తాచాటి సీటు సాధించడంతో పాటు వైద్య విద్య అభ్యసించడమే నా లక్ష్యం.
– జె.అంజనా, కొత్తపల్లి, కరీంనగర్ (బైపీసీ 997/1000)
సివిల్ సర్వెంట్‌గా..
ఇంటర్ సెకండియర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. పటిష్ట ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో అగ్రభాగాన నిలిచినందుకు సంతోషిస్తున్నా. రాబోయే కాలంలో ఉన్నత విద్యనభ్యసించి యూపీఎస్సీ సాధించి సివిల్ సర్వెంట్‌గా సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా. – కె.రుత్విక్, కొత్తపల్లి, కరీంనగర్ (ఎంపీసీ996/1000)