MPC
-
RBI MPC: రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది. జీడీపీ 6.7% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7%గా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2% వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథతథంగా కొనసాగించారు. అయితే, నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి (CRR) 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం.రెపో రేటు అంటే.. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. -
తగ్గిద్దామా? వద్దా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.యథాతథ స్థితికే ఓటు..!కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుభేటీలో ముగ్గురు కొత్త సభ్యులుఆర్బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్లు ఉన్నారు. -
బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మొదటి సమావేశం.. రేపటి నుంచే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 వరకు జరగనుంది. బడ్జెట్ తర్వాత మొదటి సమావేశం కావడం, మరోవైపు సెప్టెంబరులో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలను సూచిస్తుండటంతో కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఆర్బీఐ ఎంపీసీ గత సమావేశం జూన్‌లో జరిగింది. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలను చూసింది. అయితే ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలందరూ రేపటి ఆర్బీఐ ఎంపీసీ ఎనిమిదవ వరుస సమావేశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా రెపో రేటును 6.5% వద్దే ఉంచుతారని అంచనా వేస్తున్నారు. ప్రధాన ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఒత్తిడి నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ జాగ్రత్తగా ఉండవచ్చని బార్క్లేస్లో ప్రాంతీయ ఆర్థికవేత్త శ్రేయా సోధాని ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. "4-2 మెజారిటీతో ద్రవ్య విధాన కమిటీ విధాన సెట్టింగ్‌లను మార్చకుండా ఉంచుఉంచుతుందని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు. స్థిరమైన వృద్ధి ఉండటం, ప్రస్తుతానికి రేట్లు తగ్గించడానికి అత్యవసరం లేకపోవడం వలన మొదటి రేటు తగ్గింపు డిసెంబర్ తర్వాతే ఉంటుందని పేర్కొన్నారు. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలనే ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. రెపో రేటులో ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఆర్బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ మీటింగ్‌లో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు."మారుతున్న స్థూల ఆర్థిక పరిణామాలు, దృక్పథాలను వివరణాత్మకంగా అంచనా వేసిన తర్వాత ద్రవ్య విధాన కమిటీ ఐదుగురు సభ్యుల మెజారిటీతో పాలసీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మళ్లీ జూన్‌లోనే... ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ముందుగానే అంచనా వేసింది. ఊహించినట్టుగానే ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. -
రుణగ్రస్తుల ఆశలపై ఆర్బీఐ నీళ్లు?
రుణ గ్రస్తులు ఎంతో ఆతృగా ఎదురు చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అక్టోబర్ 4- 6 తేదిల్లో జరగనుంది. సాధారణంగా ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అంటే ప్రధానంగా వడ్డీ రేట్లు పెంపు, తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మరో రెండ్రోజుల్లో జరిగే ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సమాచారం. 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో వివిధ దశల్లో ఆర్బీఐ రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత వరుసగా రెపో రేట్లను యథాతదంగా కొనసాగిస్తూ వచ్చింది. దీంతో రిటైల్, గృహ, వాహన రుణాలు ప్రియమయ్యాయి. రుణ గ్రహీతలపై భారం పడింది. ఈ తరుణంలో వచ్చే సమీక్షాలోనూ ఆర్బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని రుణగ్రస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంది. -
రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ఇటీవలి పావుశాతం పెంపునకు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ఇరువురు ఇరువురు వ్యతిరేకించారు. గవర్నర్‌సహా నలుగురు పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు. ద్రవ్యోల్బణం భయాలతో ఈ నెల మొదట్లో రెపో పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ముగ్గురు ప్రభుత్వం నామినేట్ చేసిన– ఎక్స్‌టర్నర్ సభ్యులు –– శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు ఉన్నారు. వీరిలో వర్మ గోయల్‌లు ఇరువురూ రేటు పెంపును వ్యతిరేకించినట్లు బుధవారం వెలువరించిన మినిట్స్ తెలిపాయి. ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తున్నందున, రేటు పెంపునకు బదులుగా వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని వీరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం ఇరువురు సభ్యుల అభిప్రాయాల నేపథ్యం. -
ఈ దఫా రేటు పెంపు పావు శాతమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశ కీలక నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. అయితే ఈ దఫా రేటు పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెపె్టంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతానికి ఎగసింది. విశ్లేషకుల అంచనాలు నిజమైతే ఈ రేటు తాజా పాలసీ సమీక్ష సందర్భంగా 6.50 శాతానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం విశ్లేషకుల తాజా అంచనాల నేపథ్యం. -
షాకింగ్ న్యూస్...వడ్డీరేట్లు పెరిగే అవకాశం...ప్రభావమెంతంటే..?
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు వెసులుబాటు అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్‌లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్‌లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్‌లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. చదవండి: అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఇండోనేషియా నిషేధం...సామాన్యులపై మరో పిడుగు....! -
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
ముంబై, సాక్షి: వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దనే కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా నిర్ణయించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపీసీ మూడు రోజులపాటు సమాశాలు నిర్వహించింది. దీనిలో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. అంచనాల సవరణ ఈ ఆర్థిక సంవత్సరానికి(2020-21) జీడీపీపై తొలుత వేసిన -9.5 శాతం అంచనాలను ఆర్బీఐ తాజాగా -7.5 శాతానికి సవరించింది. ద్వితీయార్థం(అక్టోబర్- మార్చి)లో ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని సాధించనున్నట్లు భావిస్తోంది. ఈ బాటలో క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో 0.1 శాతం వృద్ధి సాధించవచ్చని ఊహిస్తోంది. ఇంతక్రితం 5.6 శాతం క్షీణతను అంచనా వేయడం గమనార్హం. ఇదే విధంగా క్యూ4(జనవరి- మార్చి)కి జీడీపీ వృద్ధి అంచనాలను సైతం 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచింది. కాగా.. క్యూ3లో రిటైల్ ధరలు(సీపీఐ) 6.8 శాతంగా నమోదుకావచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4లో 5.8 శాతానికి దిగిరావచ్చని భావిస్తోంది. -
యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ ఓటు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో భాగంగా ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా అమలుకానుంది. ఇదేవిధంగా రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21)కల్లా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు అభిప్రాయపడింది. వ్యవసాయం, కన్జూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. కోవిడ్-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆగస్ట్ నెలలోనూ సీపీఐ 6.69 శాతానికి ఎగసింది. ముగ్గురు సభ్యుల ఎంపికలో ఆలస్యంకారణంగా గత నెలాఖరున వాయిదా పడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ముగిశాయి. ఇప్పటికే 2.5 శాతం కోత 2019 ఫిబ్రవరి మొదలు ఆర్బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం(250 బేసిస్ పాయింట్లు) కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్వహించిన సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ మొగ్గు చూపింది. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం చొప్పున అమలవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో అవసరమైతే కీలక రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా తగిన చర్యలు తీసుకునే వీలున్నట్లు పేర్కొంది. ఎంపీసీ ఇలా ఆరుగురు సభ్యులలో ముగ్గురుని కొత్తగా ఎంపిక చేయడంలో జరిగిన ఆలస్యంకారణంగా గత నెలలో జరగవలసిన ఎంపీసీ సమావేశాలు అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఆషిమా గోయల్, శశాంక బిడే, జయంత్ వర్మలను ఎంపీసీ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ మూడురోజుల విధాన సమీక్ష ప్రారంభం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం దేశీయ, అంతర్జాతీయ ఆరి్థక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, వ్యవస్థలో డిమాండ్ వంటి కీలక అంశాలపై చర్చించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోసహా కీలక నిర్ణయాలను గురువారం ఆర్బీఐ వెలువరిస్తుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కూ2లో ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోవడం, ఆరి్థకవ్యవస్థ మందగమనం తీవ్రతను స్పష్టంచేస్తూ పలు గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని వృద్ధికి ఊపందించడమే లక్ష్యంగా ఆర్బీఐ రెపోరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గడచిన ఐదు సమావేశాల్లో ఆర్బీఐ రెపోరేటు 135 బేసిస్ పాయింట్లు (1.35 శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచి్చంది. -
ఆర్బీఐ రూటు ఎటు..?
ముంబై: ఒకపక్క అంతకంతకూ ఎగబాకుతున్న ముడిచమురు ధరలు... మరోపక్క దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఆర్బీఐకి ఈసారి పాలసీ నిర్ణయం కత్తిమీద సాముగా మారనుంది. నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్న పరపతి విధాన సమీక్ష కమిటీ(ఎంపీసీ) భేటీలో పాలసీ రేట్ల నిర్ణయంలో ఈ రెండే కీలకం కానున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 6న(బుధవారం) పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడనుంది. కాగా, తాజాగా వెలువడిన నాలుగో త్రైమాసికం(క్యూ4) స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ బాటలో పయనిస్తోందన్న సంకేతాలు బలపడ్డాయి. 2017–18 క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతానికి ఎకబాకిన సంగతి తెలిసిందే. గడిచిన ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇదిలాఉంటే... ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు ఇక ఆస్కారం లేదనేది నిపుణుల అభిప్రాయం. ఆగస్టు నుంచీ అక్కడే... 2017 నవంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పైనే నమోదవుతూ వస్తోంది. వృద్ధికి ఊతమిచ్చే విధంగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి(2 శాతం అటూఇటుగా) కట్టడి చేయాలని ఆర్బీఐకి ప్రభుత్వం నిర్ధేశించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల కారణంగానే 2017 ఆగస్టు నుంచీ ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగానే కొనసాగిస్తూ వస్తోంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతానికి ఎగబాకాయి. ప్రధానంగా ఇంధన ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) 6 శాతం, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం) 4 శాతంగా ఉన్నాయి. కాగా, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్రతిసారీ రెండు రోజుల పాటు భేటీ అవుతుంది. ఈసారి సమీక్షను మాత్రం మూడు రోజులు నిర్వహిస్తుండటం విశేషం. పెంపు సంకేతాలు...! తాజాగా పలు ప్రధాన బ్యాంకులు ఈ నెల 1 నుంచి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా మరికొన్ని బ్యాంకులు డిపాజిట్ రేట్లను కూడా ఇటీవలే పెంచాయి. ఇవన్నీ రానున్న కాలంలో ఆర్బీఐ రేట్ల పెంపునకు సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘మార్కెట్లో రేట్ల పెంపు సంకేతాలు ఉన్నప్పటికీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సరిపోతుందని మేం భావిస్తున్నాం’ అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. జీడీపీ గణంకాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, ప్రైవేటు వినియోగం ఇంకా పడిపోతూనే ఉండటాన్ని(2016–17లో 7.3 శాతం నుంచి 2017–18లో 6.6 శాతానికి తగ్గింది) ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తావించింది. కాగా, ఇప్పటివరకూ అనుసరిస్తున్న సరళ పాలసీ విధానానికి ఇక తెరదించాల్సి ఉందంటూ గత పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య కూడా సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. గత భేటీలో మరో ఎంపీసీ సభ్యుడు మైఖేల్ పాత్రా అయితే రెపో రేటు పెంపునకు ఓటు వేశారు కూడా. అయితే, ఐదుగురు సభ్యులు యథాతథానికే ఓటు వేయడంతో రేట్లలో ఎలాంటి మార్పులూ జరగలేదు. కాగా, ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరిగినప్పటికీ.. తక్షణం రేట్ల పెంపు ఉండకపోవచ్చ ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఎండీ, సీఈఓ నరేశ్ టక్కర్ అభిప్రాయపడ్డారు. వృద్ధి అంచనాలను మించి పుంజుకుంటుండటం, ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో రానున్న కాలంలో రేట్ల పెంపునకు ఆస్కారం ఉందని చెప్పారు. పాలసీ సమీక్షలో ఈ సంకేతాలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు. -
ముడిచమురు ధరల మంటే రేట్లకోతకు అడ్డేసింది
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల మొదటి వారం నాటి సమావేశ వివరాలు బయటకు వచ్చాయి. ఈ భేటీలో కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ నిర్ణయం తీసుకోగా, దీనికి పెరుగుతున్న ముడిచమురు ధరలే కారణమని తెలిసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ ప్రపంచ చమురు ధరలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ద్రవ్యపరమైన, ఇతర అంశాల పరంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపైనా పటేల్ ఆందోళన వ్యక్తీకరించారు. ఇతర సభ్యుల్లో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ దేబబ్రత పాత్ర పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని లేవనెత్తారు. ఇందుకు సంబంధించి ఈ నెల 5, 6 సమావేశ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆరుగురు సభ్యుల ఎంపీసీలో రవీంద్ర ఢోలాకియా ఒక్కరే రేట్లను 0.25 శాతం తగ్గించేందుకు మొగ్గుచూపగా, మిగిలిన వారు ఏకాంగీకారంతో యథాతథ స్థితికే ఓటేశారు. -
కీలక రేట్లు యథాతథం?
ముంబై: రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశం బుధవారం ముగుస్తుంది. అనంతరం రెపో, రివర్స్ రెపో, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ వంటి కీలక రేట్లకు సంబంధించిన ప్రకటన విడుదలవుతుంది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో. ప్రస్తుతం ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి 6 శాతం దగ్గరుంది. దీన్ని తగ్గించాలని, తద్వారా వృద్ధికి ఊతమివ్వాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్నే కోరుకుంటోంది. అయితే ఆర్బీఐ ఎంపీసీ మాత్రం ఆగస్టు తగ్గింపు నిర్ణయం తరువాత– ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకర్లకూ సూచిస్తోంది. ఈసారీ మార్పుండదు!! ఈ దఫా కూడా తన విధానాన్ని యథాతథంగా కొనసాగించే వీలుందని మెజారిటీ విశ్లేషణలు వస్తున్నాయి. టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59 శాతంగా నమోదయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇక ఇదే నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయి 3.58 శాతానికి ఎగిసింది. ఇక జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతం (ఏప్రిల్–జూన్) నుంచి కొంత మెరుగుపడి 6.3 శాతానికి పెరిగింది. జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల దిగువబాటను వీడడం పట్ల ఆర్థిక విశ్లేషకుల్లో కొంత సంతృప్తి వ్యక్తమయింది. -
నో సర్ప్రైజ్ : ఎక్కడ రేట్లు అక్కడే
-
నో సర్ప్రైజ్ : ఎక్కడ రేట్లు అక్కడే
సాక్షి, న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెండు రోజుల నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటనలో మెజార్టీ విశ్లేషకులు అంచనావేసిన మాదిరిగానే కీలకవడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ తెలిపింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. అదేవిధంగా రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 5.75 శాతంగానే ఉంచింది. కేవలం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను(ఎస్ఎల్ఆర్) మాత్రమే 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చన్న ఆందోళనలూ నెలకొనడంతో ఆర్బీఐ, మెజార్టీ విశ్లేషకులు అంచనాల మేరకే పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. మందగమనంలో ఉన్న వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపో రేటుకు కోత పెట్టాలని ఇటు పారిశ్రామిక వర్గాలు కోరుకొనగా.. రేటు తగ్గింపు ద్వారా తమకు ఆర్బీఐ నుంచి స్నేహహస్తం అందుతుందని అటు ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ వారి ఆశలను ఆర్బీఐ అడియాసలు చేసింది. కీలకవడ్డీరేటు రెపో యథాతథం వీడియో వీక్షించండి -
పావుశాతానికే ఉర్జిత్ మొగ్గు
♦ బ్యాంకులు ఇంకా ఎక్కువే తగ్గించొచ్చని అభిప్రాయం ♦ఎంపీసీ భేటీ మినిట్స్‌తో వెల్లడి ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 1–2వ తేదీల్లో జరిగిన సమావేశంలో గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేవలం 0.25 శాతం వరకే రేట్ల తగ్గింపు ఉండాలని తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉండడం అసాధారణమని, ఇవి పెరిగేందుకు ఒత్తిళ్లు ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన మోస్తరు రేట్ల కోతనే ఎంచుకున్నారు. నాటి సమావేశపు వివరాలు (మినిట్స్) తాజాగా వెల్లడయ్యాయి. ద్రవ్యోల్బణేతర వృద్ధికి పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కచ్చితంగా బదిలీ చేయడం ఎంతో ముఖ్యమని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. బ్యాంకులకు ఇప్పటికీ రేట్లు తగ్గించేందుకు అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఎంపీసీ సమావేశంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా కీలకమైన రెపో, రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యులకు గాను నలుగురు పావు శాతం తగ్గింపునకు ఓటేయగా, ఒకరు అర శాతం తగ్గింపునకు అనుకూలంగా ఉన్నారు. మరొకరు తటస్థంగా ఉండిపోయారు. అయితే, పారిశ్రామిక, ఇతర వర్గాలు ఇంతకంటే ఎక్కువ తగ్గింపునే ఆశించాయి. ఇటీవలి కాలంలో ఆహార విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, సాధారణ వర్షాలే ఉన్నప్పటికీ ఈ విషయంలో మరింత సమాచారం అవసరమని పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాల వృద్ధి కూడా తక్కువగా ఉండడానికి, మొండి బకాయిల ఒత్తిడే కారణమన్నారు. రుణ వృద్ధికి, పెట్టుబడుల పురోగతికి ఒత్తిడితో కూడిన బ్యాంకుల బ్యాలన్స్ షీట్లకు పరిష్కారం కనుగొనడం కీలకమైన అంశంగా పేర్కొన్నారు. -
ఈఎంఐ 'ఈజీ' ?
♦ తగ్గనున్న గృహ, ఆటో, కార్పొరేట్ ఈఎంఐల భారం ♦ రెపో రేటు పావు శాతం తగ్గించిన రిజర్వు బ్యాంకు ♦ 6 శాతానికి దిగివచ్చిన ఆర్బీఐ ‘బ్యాంకింగ్’ రుణ రేటు ♦ ఇది ఆరేళ్ల కనిష్ఠం; రివర్స్ రెపో కూడా 0.25 శాతం తగ్గింపు ♦ 10 నెలల విరామం తరువాత ఆర్బీఐ కీలక ప్రకటన ♦ ద్రవ్యోల్బణం భయాలు తగ్గడంతో తాజా నిర్ణయం ♦ వృద్ధి రేటు అంచనా 7.3 శాతం వద్దే యథాతథం ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై తీసుకునే వడ్డీరేటు రెపోను... పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది ఆరేళ్లకు పైగా కనిష్ట స్థాయి. అదే విధంగా బ్యాంకులు తమ వద్ద స్వల్పకాలికంగా ఉంచే అదనపు నిధులకు సంబంధించి చెల్లించే రేటు– రివర్స్ రెపోను కూడా పావు శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 5.75 శాతానికి తగ్గింది. అయితే తమకు రెపో తగ్గింపు ద్వారా లభిస్తున్న ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వల్ల గృహ, ఆటో, కార్పొరేట్ల నెలవారీ రుణ పునః చెల్లింపుల (ఈఎంఐ) భారం కొంత తగ్గుతుంది. దాదాపు పది నెలల నుంచీ ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలతో రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ, ప్రస్తుతం ఈ భయాలు తగ్గడంతో రెపో రేటు పావుశాతం తగ్గించినట్లుగా వివరించింది. వృద్ధికి ఇది భరోసా కల్పిస్తున్న అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా 7.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం– 4 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో ఎటువంటి మార్పు లేదు. అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్), బ్యాంక్ రేటు కూడా 6.25 శాతానికి దిగివచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా పటేల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీలో పావు శాతం రెపో రేటు కోత నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీసీ మెజారిటీ నిర్ణయం ఆధారంగా పాలసీ చర్యలు కూడా అదే భేటీలో మొదలు కావడం గమనార్హం. మెజారిటీనే... ఏకాభిప్రాయం కాదు... ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో నలుగురు సభ్యులు పావుశాతం తగ్గింపునకు ఓటు చేయగా, ఒకరు అరశాతం కోతకు సిఫారసు చేశారు. అయితే మరొకరు యథాతథ పరిస్థితికి ఓటు చేశారు. పావుశాతం కోతకు మొగ్గు చూపిన వారిలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఛేతన్ ఘాటే, పామీ దువాలు ఉన్నారు. మరో సభ్యుడు రవీంద్ర హెచ్ దోలాకియా అరశాతం రేటు కోతకు సిఫారసు చేశారు. కాగా ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ దేబబ్రత పాత్ర యథాతథ పరిస్థితిని కొనసాగించడానికి తాను సానుకూలమని తెలిపారు. ఎంసీఎల్ఆర్ విధాన మార్పు సంకేతం బ్యాంకింగ్ రుణ మంజూరు రేటు నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం అనుసరిస్తున్న మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధాన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి లేదని ఆర్బీఐ పేర్కొంది. దీనికి మార్కెట్ అనుసంధాన బెంచ్‌మార్క్ ప్రాతిపదికగా ఉంచే విధంగా ఒక అధ్యయనం జరుగుతున్నట్లు సూచించింది. ఈ మేరకు ఏర్పాటయిన గ్రూప్ సెప్టెంబర్ 24న తన నివేదికను అందించనున్నట్లు తెలిపింది. తన తాజా నిధుల సమీకరణ వ్యయాలపై చెల్లిస్తున్న వడ్డీ ప్రాతిపదికన బ్యాంకింగ్ ఎంసీఎల్ఆర్ రేటును ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక కాలాల ప్రాతిపదికన సవరిస్తోంది. ప్రస్తుతం నెలవారీగా ఈ సమీక్ష జరుగుతోంది. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనం కొంత త్వరితగతిన కస్టమర్‌కు అందుతోందన్న అభిప్రాయమూ నెలకొంది. అయితే ఇప్పటికీ ఈ ప్రయోజనం అందించే విషయంలో ఇంకా వెనుకడుగులోనే ఉన్నట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది. మరిన్ని ముఖ్యాంశాలు.. ♦ ప్ల్లస్ 2 లేదా మైనస్ 2 శ్రేణితో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం లక్ష్యాలను కొనసాగించడంపై దృష్టి. పే కమిషన్ సిఫారసుల అమలు, వస్తు, సేవల పన్ను అనంతరం ధరల సర్దుబాట్ల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై మరింత అప్రమత్తత. ♦ ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు భారీ ఊతం లభించాల్సిన అవసరం ఉంది. మౌలిక రంగానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి. ♦ గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అమలు మరింత ముమ్మరం కావాలి. ♦ 2017 జూలై 28కి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 392.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం కేటాయింపులపై కేంద్రం– ఆర్బీఐ కలిసి పనిచేస్తాయి. ♦ అటు కార్పొరేట్, ఇటు బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇది ♦ కొత్త పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ♦ ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు రూ.5,000 కోట్ల ప్రత్యేక ఐఆర్ఎఫ్ (ఇంట్రస్ట్ రేట్ ఫ్యూచర్) పెట్టుబడుల విండో. ♦ ఆర్బీఐ తదుపరి పరపతి విధాన సమీక్ష ఏడాది అక్టోబర్ 3, 4 తేదీల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక సమావేశం) జరుగుతుంది. తగిన నిర్ణయమే.. ఇంకా తగ్గిస్తే బాగుండేది! తాజా ఆర్బీఐ నిర్ణయం పట్ల బ్యాంకింగ్, పారిశ్రామిక, రియల్టీ తదితర వర్గాల నుంచి మొత్తంమీద హర్షం వ్యక్తమైనా, కొంచెం భిన్నత్వం ధ్వనించింది. రుణ వృద్ధికి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడటానికి, వృద్ధి బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అరశాతం రేటు కోత అవసరమని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఆయా వర్గాల స్పందనలను పరిశీలిస్తే... మార్కెట్ సెంటిమెంట్ బలోపేతం తాజా నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా రుణ వృద్ధి ఊపందుకోడానికి, డిమాండ్ మెరుగుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాం. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్మన్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం ఆర్థిక వ్యవస్థకు తాజా ఆర్బీఐ నిర్ణయం సానుకూలమైనదని నేను భావిస్తున్నాను. ఎంసీసీ తగిన మంచి నిర్ణయం తీసుకుందని విశ్వసిస్తున్నాను. వృద్ధికి ఈ నిర్ణయం ఊతం ఇస్తుంది. – దీపక్ పరేఖ్, హెచ్డీఎఫ్సీ చైర్మన్ సరైన నిర్ణయం ఇది... ఆర్బీఐ తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంది. గణాంకాలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లో పెట్టుబడుల పట్ల గ్లోబల్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుంది. – చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ వృద్ధి దిశలో కీలక అడుగు ఆర్బీఐ తాజా నిర్ణయం వృద్ధి దిశలో కీలక అడుగు. ద్రవ్యోల్బణంపై భయాలను సైతం అధిగమించేలా తాజా నిర్ణయం ఉంది. పెట్టుబడుల సెంటిమెంట్‌కు ఊతం లభిస్తుంది. – సుభాశ్ చంద్ర గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరశాతం రేటు కోత అవసరం: పరిశ్రమలు తాజా నిర్ణయం హర్షణీయమైనదే అయినప్పటికీ, ప్రస్తుతం వ్యవస్థలో పెట్టుబడుల పెంపునకు భారీగా అరశాతం రేటు కోత అవసరమని పారిశ్రామిక వర్గాలు డి మాండ్ చేస్తున్నాయి. ఒకపక్క ద్రవ్యోల్బ ణం అదుపులో ఉండటం, మరొకపక్క పెట్టుబడుల నత్తనడక నేపథ్యంలో, వృద్ధికి పునరుత్తేజం ఇవ్వడానికి ఆర్బీఐ నిర్ణయం దోహదపడుతుందని సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అరశాతం కోత మరింత ప్రయోజనం చేకూర్చుతుందనీ విశ్లేషించింది. ఫిక్కీ కూడా ఇదే అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ ప్రస్తు తం అత్యంత బలహీనంగా ఉందని తెలిపింది. పావు శాతం కోత కార్పొరేట్ల రుణ భారాన్ని పెద్దగా తగ్గించబోదని అసోచామ్ పేర్కొంది. కొంత సెంటిమెంట్ ను మాత్రం తాజా నిర్ణయం బలపరుస్తుందని భావిస్తోంది. రేటు కోత చాలా స్వల్పమని జేకే పేపర్ వైస్ చైర్మన్, ఎండీ హర్స్ పతి సింఘానియా పేర్కొన్నారు. హౌసింగ్ అమ్మకాలకు బూస్ట్... ‘పండుగుల సీజన్లో గృహ విక్రయాలకు తాజా ఆర్బీఐ నిర్ణయం ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఆర్బీఐ నుంచి అందిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్‌కు అందించడంపై బ్యాంకులు శ్రద్ధ వహించాలి’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్షయ్ షా చెప్పారు. ఎన్పీఏల కట్టడికి క్రెడిట్ రిజిస్ట్రీ! రాష్ట్రాల వ్యవసాయ రుణ మాఫీ విధానం ద్రవ్య క్రమశిక్షణ కట్టు తప్పడానికి దారితీసే వీలుంది. ప్రభుత్వ వృద్ధి వ్యయాలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది. ఇక తాజా ఆర్థిక క్రియాశీల పరిస్థితిని గమనిస్తే, వ్యవసాయ రంగం సానుకూలంగా ఉంది. పరిశ్రమ, సేవల రంగాల్లో మాత్రం బలహీన వృద్ది ధోరణులు కనబడుతున్నాయి. కార్పొరేట్ రంగంలో రుణ ఒత్తిళ్లు ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు మరింత డిమాండ్ పెరగాల్సి ఉంది. తాజా గణాంకాల ప్రకారం– రెపో రేటు పావుశాతం తగ్గింపునకు వీలుంది. అలాగే రెపో రేటు కోత ద్వారా అందుతున్న ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్‌కు మరింతగా అందించే వీలుంది. గృహ, ఆటో రంగాలే కాకుండా మరికొన్ని రంగాలకూ రెపో తగ్గింపు ప్రయోజనం అందాలి. రుణాల అందుబాటు, మొండిబకాయిల పరిస్థితిపై తగిన పర్యవేక్షణ కోసం పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీని నెలకొల్పనున్నాం. దీన్ని రూపొందించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ చర్యలు... రుణ నాణ్యత మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి. తాజా రేటు కోత ప్రైవేటు ఇన్వెస్టŠట్మెంట్ను పెంచుతుందని భావిస్తున్నాం. ఇది తిరిగి ఉత్పత్తి వృద్ధికి, తద్వారా కంపెనీల బ్యాలెన్స్షీట్ల మెరుగుదలకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఇక డిమాండ్ ఒకసారి పుంజుకున్న తర్వాత, ఉత్పాదక రంగాలకు రుణ అందుబాటు మరింత మెరుగుపడ్డానికి చర్యలు తీసుకోవాలి. – ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ -
నేడు ఆర్బీఐ పాలసీ ప్రకటన
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల సమావేశం గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మంగళవారమిక్కడ ప్రారంభమైంది. బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు (రెపో– ప్రస్తుతం 6.25 శాతంగా ఉంది)పై బుధవారం కీలక నిర్ణయాన్ని ఎంపీసీ ప్రకటించనుంది. ఇటు ప్రభుత్వ వర్గాల నుంచీ, అటు పారిశ్రామిక ప్రతినిధుల నుంచీ రెపో రేటు తగ్గింపునకు డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. వరుసగా ఎనిమి ది త్రైమాసిక సమీక్షల్లో ‘ద్రవ్యోల్బణం’ భయాల కారణంగా యథాతథ రేటు పరిస్థితిని కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ, ఈ దఫా అరశాతం వరకూ రేటు కోత నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు గణాంకాలూ సానుకూలంగా ఉన్నాయి. ఆయా అంశాలు చూస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.54 శాతానికి చేరింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి కావడం గమనార్హం. పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పతనమయింది. 2017 మే నెలలో వృద్ధి రేటు కేవలం 1.7 శాతంగా నమోదయ్యింది. 2016 ఇదే నెలలో ఈ రేటు 8 శాతం. వృద్ధి పెరగాలంటే పరిశ్రమలకు నిధులు అందుబాటులోకి రావాలి. వడ్డీ రేట్ల పెంపు దీనికి తోడ్పాటునిస్తుంది. 8 పరిశ్రమల కీలక గ్రూప్ వృద్ధి రేటు జూన్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. కేవలం 0.4% వృద్ధి (2016 జూన్ ఉత్పత్తితో పోల్చి– అప్పట్లో వృద్ధి 7%) నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.1%. నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 47.9 పాయింట్ల క్షీణతకు పడిపోయింది. జూన్‌లో ఈ రేటు 50.9. -
నేడు ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయం
ప్రారంభమైన ఎంపీసీ సమావేశం ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయం బుధవారం వెలువడనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రెండు రోజుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ మంగళవారం ఆరంభమైంది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఈ ద్వితీయ ద్వైమాసిక సమావేశం రెండు రోజుల పాటు చర్చిస్తుంది. బలహీనంగా పారిశ్రామిక వృద్ధి, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 6.1 శాతం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు నమోదయిన నేపథ్యంలో, వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపోను (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం కోరుతోంది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ ప్రభుత్వం కూడా రెపోను తగ్గించాలనే భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ రేటును తగ్గించే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలై 1వ తేదీ నుంచీ అమలవుతుందని భావిస్తున్న జీఎస్టీ ప్రభావం ద్రవ్యో ల్బణంపై ఏమేరకు ఉంటుందన్న అంశాన్ని ఎంపీ సీ చర్చిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. -
లిక్విడిటీకి ఆర్బీఐ చెక్!
ప్రారంభమైన ఎంపీసీ భేటీ; నేడు విధాన ప్రకటన ⇒ డీమోనిటైజేషన్‌తో బ్యాంకులవద్ద దండిగా నిధులు; రుణాలకు తగ్గిన డిమాండ్ ⇒ రూ.4 లక్షల కోట్లు అదనపు లిక్విడిటీ ఉందన్న హెచ్ఎస్బీసీ ⇒ సర్దుబాటు చర్యలు ప్రకటించొచ్చన్న అభిప్రాయం ⇒ మొండి బకాయిలపైనా దృష్టి; రేట్ల కోత కష్టమేనని అంచనా... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం గురువారంతో ముగుస్తుంది. ఎంపీసీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఆరో ద్వైమాసిక సమీక్ష ఇది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి వెలువడే చర్యలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్కెట్లో, బ్యాంకింగ్ వ్యవస్థలో అధికంగా ఉన్న నగదు లభ్యతను తగ్గించడం, రుణాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో పుంజుకునేందుకు చర్యలు, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల(ఎన్పీఏ) సమస్యకు పరిష్కారాలపై తాజా సమీక్షా సమావేశంలో ఎంపీసీ దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక రేట్లను ఎంపీసీ యథాతథంగా కొనసాగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూ ఉండటం ఆర్బీఐ బెంచ్‌మార్క్ పాలసీ రేటు ఈ స్థాయికి మించి తగ్గదన్న సంకేతాన్నిస్తోందని... దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను బట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగేందుకూ అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరిగా ఫిబ్రవరిలో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయని విషయం తెలిసిందే. రెపో రేటును 6.25 శాతంగానే కొనసాగిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణి నుంచి తటస్థ విధానానికి మళ్లుతున్నట్టూ ప్రకటించింది. ద్రవ్య లభ్యత తగ్గించే చర్యలు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత భేటీలో ప్రధానంగా అధికంగా ఉన్న ద్రవ్య లభ్యతకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో డీమోనిటైజేషన్ నిర్ణయం తర్వాత వెనక్కి తీసుకున్న నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం రూ.14 లక్షల కోట్ల వరకు తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. ఈ క్రమంలో వ్యవస్థలో అదనంగా ఉన్న ద్రవ్య లభ్యతను సర్దుబాటు చేసేందుకు వీలుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) వంటి చర్యలను ఆర్బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా బ్యాంకుల వద్ద వున్న అధిక నిధుల్ని ఆర్బీఐ డిపాజిట్ చేసుకుంటుంది. ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మార్కెట్లో రూ.4 లక్షల కోట్ల అదనంగా నగదు లభ్యత ఉందని, దాన్ని సర్దుబాటు చేసే నిర్ణయాలను సెంట్రల్ బ్యాంకు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ద్రవ్యపరపతి విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన గల ఓ ప్యానెల్ గతంలో ఎస్డీఎఫ్ను ప్రతిపాదించింది. భిన్నమైన పరిస్థితి.. ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ఎంపీసీ సమావేశం వివరాలను పరిశీలిస్తే... బ్యాంకింగ్ రంగంలో రుణాలకు డిమాండ్ క్షీణించడం, పలు రంగాల్లో పెట్టుబడుల్లోనూ ఇదే ధోరణి ఉండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి భారీగా నగదు డిపాజిట్లు వెల్లువలా వచ్చిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ కార్యక్రమం ముసిగి 3 నెలలు గడిచినా లిక్విడిటీ వ్యవహారం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. రుణాలకు డిమాండ్ పెద్దగా లేకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరంగా తయారైంది. బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తంలో తీసుకోనివి ఇంకా రూ.2 లక్షల కోట్ల మేర ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ అంచనా. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి లిక్విడిటీ సర్దుబాటు దిశగా కచ్చితంగా చర్యలు ఉంటాయని అంచనా. -
నోట్ల రద్దు ప్రభావంపై అస్పష్టతే అడ్డుపడింది: పటేల్
• ధరల పెరుగుదల సంకేతాలు కారణమే • రుణ రేట్లను ఇంకా తగ్గించేందుకు బ్యాంకులకు అవకాశం ఉందని వెల్లడి ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) బుధవారం నాటి సమీక్షా సమావేశంలో తప్పకుండా కీలక రేట్ల కోత ఉంటుందని అధిక శాతం అంచనాలున్నాయి. కనీసం పావు శాతమైనా కోత ఉంటుందని ఆశించారు. కానీ, రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఉర్జిత్ వివరించారు. స్పష్టత లేదు... పెద్ద నోట్ల రద్దు తర్వాత స్థూల ఆర్థిక రంగంపై దాని ప్రభావం ఏ మేరకు అన్న స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్లే రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకోలేకపోయినట్టు పటేల్ చెప్పారు. అలాగే, ధరల పెరుగుదలకు అనుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ఉండడం, ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టడం వంటివి సైతం యథాతథ స్థితిని కొనసాగించేలా చేసినట్టు చెప్పారు. ఈ అస్థిరమైన ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూనే ద్రవ్యోల్బణానికి సంబంధించి స్పష్టమైన అంచనాల కోసం వేచిచూస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ విలేకరులకు తెలిపారు. వృద్ధి ప్రాధమ్యాలను దృష్టిలో ఉంచుకుని వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు ఎంపీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి దిగొచ్చినప్పటికీ, చమురేతర, ఆహారేతర ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని పటేల్ గుర్తు చేశారు. బ్యాంకులు ఇటీవల రుణాలపై వడ్డీ రేట్లను కొంత తగ్గించినప్పటికీ, రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశం ఉన్నట్టు పటేల్ అభిప్రాయపడ్డారు. -
ఇప్పట్లో ఆర్బీఐ రేట్లు తగ్గవ్
పాలసీ రేట్లు యథాతథం • రేట్లలో మార్పు లేకపోవడం ఇది వరుసగా రెండవసారి • ఇక ముందు తగ్గింపు కష్టమని సూచన • ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూపు • వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.9 శాతానికి కోత ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారంనాటి తన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) వంటి కీలక రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఎందుకంటే... విధానం యథాతథంగా కొనసాగించడానికి పలుకారణాలనూ కమిటీ సూచించింది. ద్రవ్యోల్బణంపై అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత రావాలన్నది వీటిలో కీలకమైనవి. ఉత్పత్తి, సరఫరాల పరిస్థితి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తంమీద ఇప్పటి వరకూ రేట్ల తగ్గింపునకు సంబంధించి సరళతర విధానాన్ని అవలంబించిన ఆర్బీఐ ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లేననీ సూచించింది. దీనితో రేట్ల తగ్గింపునకు సంబంధించి ఆర్బీఐ విధానం ‘‘తగిన ధోరణి’’ నుంచి ‘‘తటస్థం’’ వైపునకు మారినట్లయ్యింది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు 6.25 శాతంగా కొనసాగనుంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2015 జనవరి నుంచీ ఆర్బీఐ 175 బేసిస్ పాయింట్లు (1.75 శాతం)రెపో రేటును తగ్గించింది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు 7.4 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లూ వివరించింది. ⇔ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం శ్రేణి 4 నుంచి 4.5 శాతంగా ఉంటుంది. తరువాత ఆరు నెలలో 4.5 శాతం నుంచి 5 శాతంగా ఉండవచ్చు. నాలుగు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి కట్టుబడి ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలు, ఇతర ఆహార ధరలపై పడలేదనీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. చమురు, కరెన్సీ ధరల్లో ఒడిదుడుకులు ద్రవ్యోల్బణానికి సవాలని వివరించింది. ⇔ తన నిర్వహణ, పర్యవేక్షణా చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చూడడం కోసం ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఆర్బీఐ నిర్ణయం. ⇔ 2017లో ప్రపంచ వృద్ధి ఒక మోస్తరుగా ఉండే వీలుంది. ⇔ అభివృద్ధి చెందిన దేశాల్లో రక్షణాత్మక విధానాల అమలు పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం సేవలు, దేశీయ విమాన, రైల్వే రవాణా, ఆటోమొబైల్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు హై ఫ్రీకెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. అయితే స్టీల్ వినియోగం, పోర్ట్ ట్రాఫిక్, విదేశీ పర్యాటకుల రాక, అంతర్జాతీయ విమాన రవాణా విభాగాలు ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాయి. ⇔ మొండిబకాయిల సమస్య త్వరగా తగ్గడం, బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధన కల్పన వంటి అంశాలు రుణాలపై వడ్డీ రేటును మరింత దిగివచ్చేలా చేయడానికి దోహదపడతాయి. ⇔ తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది. నిర్ణయం ఏకగ్రీవం... రెపో రేటు యథాతథంగా కొనసాగించాలన్న అంశంపై ఎంపీపీలోని ఆరుగురు సభ్యులూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎంపీపీ ఏర్పాటయిన తర్వాత జరిగిన ప్రతి పాలసీ సమీక్షలోనూ ఆరుగురు సభ్యులు ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుండడం గమనార్హం. తన తొలి సమావేశంలో కమిటీ వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. డిసెంబర్‌లోనూ అలాగే తాజా సమీక్షల్లో రేట్లను మార్చలేదు. ► ఎవరేమన్నారంటే.. బ్యాంకుల రేట్లు తగ్గాలి ఇప్పుడు బ్యాంకులు తమ రుణ రేటును తగ్గించాలి. రుణ మంజూరీలో ప్రత్యేకించి చిన్న తరహా పరిశ్రమలు, హౌసింగ్, వ్యక్తిగత రుణాలవైపు దృష్టి సారించాలి. ద్రవ్యలోటు 3.2% లక్ష్యం సాధ్యమవుతుంది. – శక్తికాంత్‌దాస్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఊహించిన విధంగానే.. ఆర్బీఐ విధానం ఊహించిన విధంగానే ఉంది. ఇక రేట్లు తగ్గించలేని పరిస్థితికి విధానం మారింది. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు దీనికి కారణం. ఎన్పీఏలు తగ్గడం, మూలధన కల్పన, పొదుపురేట్ల పెరుగుదల ద్వారా రుణ రేట్లు మరింత తగ్గుతాయన్న ఆర్బీఐ అంచనాలు తగిన విధంగా ఉన్నాయి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ సమతుల్యతను సూచిస్తోంది... అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఇబ్బందుల రీత్యా ఆర్బీఐ తగిన పాలసీ విధానాన్ని అవలంబించింది. కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణం– వృద్ధి మధ్య సమతుల్యం అవసరమని పాలసీ సూచి స్తోంది. ఇది దీర్ఘకాలిక వృద్ధికి దారితీసే అంశం. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యోల్బణమే కీలకం ఆర్బీఐ నిర్ణయానికి ద్రవ్యోల్బణం అం శాలే కీలకం. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కల్పన, ప్రభుత్వ సెక్యూరిటీలకు అనుగుణంగా చిన్న పొదుపు స్కీమ్‌లకు వడ్డీరేట్ల నిర్ణయం... ఇవన్నీ బ్యాంకింగ్‌కు సానుకూల అంశాలు. – రాజీవ్ రిషి, ఐబీఏ చైర్మన్ -
ఆర్బీఐ రూటు ఎటు..?
► రేట్ల కోతపై ఉత్కంఠ... ► యథాతథమేనని ఫిక్కీ అంచనా ► తగ్గించే చాన్స్ ఉందంటున్న బ్యాంకర్లు ► 8న పాలసీ సమీక్ష న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 8న (బు«ధ వారం) చేపట్టనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన డిపాజిట్ నిధుల ప్రభావం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచిఉండటం వంటి అంశాలతో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సేవల రంగం వరుసగా మూడో నెలలోనూ(జనవరి) క్షీణించడం చూస్తే.. రేట్ల కోత ఉండొచ్చని కొందరు బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోట్ల రద్దుతో భారీగా నిధులు వచ్చిచేరడంతో బ్యాంకులు గత నెలలో రుణ రేట్లను ఒక శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పాలసీ సమీక్షలో ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతానికి చేర్చారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) తొలి భేటీలోనే ఈ నిర్ణయం వెలువడింది. అయితే, నవంబర్ 8న రూ.1,000; రూ.500 నోట్లను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్లో జరిగిన భేటీలో కచ్చితంగా పావు శాతం కోత ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ మాత్రం పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ జనవరిలో బ్యాంకులు వరుసగా రుణ రేట్లను భారీగా తగ్గించడంతో ఆర్బీఐపై ఒత్తిడి కాస్త తగ్గినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 6.25%, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం... ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అడ్డంకిగా భావిస్తున్నారు. ముడి చమురు ధర ఎగబాకుతుండటం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న పలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని పేర్కొంది. అయితే, 2017–18 ప్రథమార్ధంతో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంటోంది. బ్యాంకర్లు అటూఇటూ... బ్యాంకుల వద్దకు భారీగా డిపాజిట్ నిధులు వచ్చి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ రానున్న పాలసీలో రేట్లను తగ్గించకపోవచ్చని బంధన్ బ్యాంక్ ఎండీ చంద్ర శేఖర్ఘోష్ అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు బ్యాంకర్లు మాత్రం కోతకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ‘ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలన్నీ రెపో తగ్గింపునకు అనుకూలంగానే ఉన్నాయి. వృద్ధికి చేయూతనిచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చర్యలు ప్రకటించింది. ఇక ఆర్బీఐ కూడా దీనికి అనుగుణంగానే పాలసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. 8న సమీక్షలో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్కే గుప్తా వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అధిక ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండటంతో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని యూకో బ్యాంక్ ఎండీ సీఈఓ ఆర్కే టక్కర్ పేర్కొన్నారు. ముప్పావు శాతం తగ్గించాలి: అసోచామ్ డీమోనిటైజేషన్‌తో చౌక డిపాజిట్ నిధుల రూపంలో బ్యాంకులకు భారీగా లాభం చేకూరిందని.. దీన్ని రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో బదలాయించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఆర్బీఐ రెపో రేటును 0.5–0.75 శాతం మేర తగ్గించాల్సిందే. ఈ కోతను బ్యాంకులు కూడా రుణ గ్రహీతలకు బదలాయించేలా ఆర్బీఐ, ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలి. రుణవృద్ధి మందగమనం.. వినియోగ డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడులకు పునరుత్తేజం కల్పించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు చాలా కీలకం’ అని ఆసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాదికి పావు శాతమే..: నోమురా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ద్రవ్యోల్బణం విషయంలో మధ్యకాలానికి సానుకూలంగానే(ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణ చర్యలు) ఉందని.. ఈ నేపథ్యంలో రానున్న సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రెపో రేటును తగ్గించొచ్చని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా పేర్కొంది. అధిక క్రూడ్ ధరలు ఇతరత్రా విదేశీ అంశాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్బీఐ కోతకే మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనితర్వాత ఈ ఏడాదిలో(2017) ఇక తగ్గింపులు ఉండకపోవచ్చనేది నోమురా అంచనా. -
ఉర్జిత్ పండుగ ధమాకా!
గృహ, వాహన, కార్పొరేట్ రుణాలు ఇక చౌక... • రెపో రేటు కోతకు ఆర్బీఐ ‘ఎంపీసీ’ ఏకగ్రీవ ఆమోదం • పావు శాతం తగ్గి 6.25 శాతానికి డౌన్; ఆరేళ్ల కనిష్టస్థాయి ఇది... • రుణ రేట్ల తగ్గింపునకు బ్యాంకర్లు సై... • ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల హర్షం న్యూఢిల్లీ: విశ్లేషకులు, మార్కెట్ల అంచనాలకు భిన్నంగా గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి దిగింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. దీనితో దసరా, దీపావళి ముందస్తు బహుమతిని ఆర్బీఐ ఇచ్చినట్లయ్యిందని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజా నిర్ణయంతో గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు చౌకయ్యే అవకాశం ఉంది. కేవలం ఆర్బీఐ గవర్నర్ కాకుండా, ఆరుగురు సభ్యుల విస్తృత స్థాయి కమిటీ రెపోపై నిర్ణయం తీసుకోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరపు నుంచి ముగ్గురు సభ్యులు ఉండగా, ఆర్బీఐ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. రేటుపై నిర్ణయంలో కమిటీ సమానంగా చీలిపోతే- ఆర్బీఐ గవర్నర్ అదనపు ఓటు కీలకం అవుతుంది. తాజా నాల్గవ ద్వైమాసిక సమీక్షలో నిర్ణయం ఏకగ్రీవం కావడంతో ‘అదనపు’ ఓటు అవసరం ఏదీ లేకుండా పోయింది. మరోవైపు బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఆర్బీఐ ఇచ్చే రుణ రేటు సైతం 5.75 శాతానికి తగ్గింది. ఇదీ ఆరేళ్ల కనిష్ట స్థాయి. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా రాజన్ పదవీ విరమణ తరువాత డిప్యూటీ గవర్నర్ నుంచి పదోన్నతి పొందిన ఉర్జిత్ పటేల్‌కు గవర్నర్‌గా ఇది మొట్టమొదటి పాలసీ సమీక్ష కావడం మరో విశేషం. రేటు కోత ఆరు నెలల్లో ఇది తొలిసారి. 2010 నవంబర్‌లో రెపో రేటు 6.25 శాతంగా ఉండేది. అక్టోబర్ 2011నాటికి 8.5%కి ఎగసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒకపక్క చెబుతూనే మరోపక్క రేటుకోతకు ఆర్బీఐ మొగ్గుచూపడం గమనార్హం. ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరిని అవలంబించే వ్యక్తిగా ఉర్జిత్ పటేల్‌కు పేరుంది. ముఖ్యాంశాలు... ⇔ రెపో, రివర్స్రెపో రేటు వరుసగా 6.25 శాతం, 5.75 శాతానికి తగ్గాయి. ⇔ బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్బీఐ ఉంచాల్సిన మొత్తానికి సంబంధించి నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా కొనసాగుతుంది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.6 శాతం. వచ్చే ఏడాది 7.9 శాతానికి పెరిగే అవకాశం. ⇔తగిన వర్షపాతం వృద్ధి ఊపునకు దోహదపడుతుంది. ⇔ ద్రవ్యోల్బణం మార్చి 17 నాటికి 5 శాతంగా ఉంటుంది. పెరిగేందుకే అవకాశాలు ఉన్నాయి. 2017 జనవరి - మార్చి మధ్య ద్రవ్యోల్బణం రేటు 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ పరిశోధనా విభాగం అంచనా. వేతన సంఘం సిఫారసుల అమలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే వీలుంది. వచ్చే ఐదేళ్లూ ప్లస్ 2 లేదా మైనస్ 2 పరిమితితో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండేలా చర్యలు ఉండాలని ప్రభుత్వం ఆర్బీఐకి నిర్దేశిస్తోంది. ⇔ అమెరికా ఎన్నికల నేపథ్యంలో క్రూడ్ ధరలు, గ్లోబల్ డిమాండ్ వంటివి అనిశ్చితిలోనే కొనసాగుతాయి. ⇔ సెప్టెంబర్ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయి 372 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ⇔ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 3 మిలియన్ డాలర్ల వరకూ సమీకరించుకోడానికి స్టార్టప్స్‌కు అనుమతి. రూపాయిలు లేదా విదేశీ కరెన్సీల్లో వీటిని సమకూర్చుకోవచ్చు. ⇔బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ సేవల విస్తరణ. రుణ గ్రహీతలకు ప్రయోజనం: ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వం ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు రేటు కోతకు అవకాశం కల్పిస్తాయని మూడవ ద్వైమాసిక సమీక్ష సందర్భంగా ఆర్బీఐ చేసిన సూచనను ఈ సందర్భంగా విధాన ప్రకటన సందర్భంగా పటేల్ ప్రస్తావించారు. ఇలాంటి చర్యలే ప్రస్తుతం రేటు కోతకు సహకరించాయని వివరించారు. ఆర్బీఐ రేటు తగ్గింపు, ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు రేట్ల కొరత వెరసి- బ్యాంకింగ్ కస్టమర్‌కు రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించడానికి దోహదపడతాయని పటేల్ వివరించారు. ద్రవ్యలభ్యతకు సైతం ఆర్బీఐ పలు మార్కెట్ చర్యలు తీసుకుంటోందని అన్నారు. తగిన వర్షపాతంతో వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్ పెంపు, అలాగే వేతన కమిషన్ సిఫారసు నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పెరిగే వినియోగం స్థూల దేశీయోత్పత్తికి దోహదపడతాయని పటేల్ అభిప్రాయపడ్డారు. పరపతి విధానం, తగిన లిక్విడిటీ పరిస్థితులు ఉత్పాదక రంగాల్లో రుణ పునరుద్ధరణకు దోహదపడతాయని విశ్లేషించారు. కాగా బ్యాంకింగ్ మొండిబకాయిలు సమస్యేనన్న ఆయన, అయితే ఈ సమస్య పరిష్కారంలో నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. వృద్ధికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ అంశాలు భారత్ వాణిజ్యంపై ప్రభావాన్ని కొనసాగిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వృద్ధి మరింత కింద చూపు చూసే అవకాశాలే ఉన్నాయని అన్నారు. 8 శాతం వృద్ధికి దోహదం: కేంద్రం తాజా నిర్ణయం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), జీడీపీ 8 శాతం వృద్ధికి దోహదపడే నిర్ణయంగా అభివర్ణించింది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రత్యేకించి పప్పుల ధరలు ప్రభుత్వం తగిన చర్యలు అన్నీ తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని వివరించింది. ద్రవ్యోల్బణం లక్ష్యాల గురించి ప్రభుత్వం - ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని ఫైనాన్స్ సెక్రటరీ అశోక్ లవాసా పేర్కొన్నారు. ఆర్థికంగా సమాజంలోని అన్ని వర్గాలకూ దోహదపడే నిర్ణయమని అన్నారు. బ్యాంకులు రేటు తగ్గిస్తాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, ‘ఇది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ సెంటిమెంట్‌కు అనుగుణంగా బ్యాంకులు నడుచుకుంటాయి’ అని అన్నారు. సానుకూల నిర్ణయం: పరిశ్రమలు తాజా ఆర్బీఐ రేటు కోతను పరిశ్రమ ‘దీపావళి ముందస్తు బహుమతి’గా అభివర్ణించింది. బ్యాంకులు ఈ నిర్ణయాన్ని వినియోగదారులకు బదలాయిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఇది వినియోగ సెంటిమెంట్‌కు దోహదపడే అంశంగా వివరించాయి. కొన్ని విభాగాల అభిప్రాయాన్ని చూస్తే... వినియోగం... ⇔బిజినెస్ సెంటిమెంట్‌ను గణనీయంగా పెంచడానికి దోహదపడే చర్య ఇదని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయెన్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ మనీష్ శర్మ అన్నారు. ఇది పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణానికి దోహదపడుతుందని వివరించారు. ⇔తగిన సమయంలో రేటు కోత తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థకు ఊతం ఇస్తుందని, ఇది తమ ఉత్పత్తుల గ్రామీణ డిమాండ్‌ను బలపరచడానికి దోహదపడుతుందని ప్యానాసోనిక్ ఇండియా హెచ్ (సేల్స్అండ్సర్వీస్) అజయ్ సేథ్ అన్నారు. ⇔ఆర్బీఐ నిర్ణయం వినియోగ ఉత్పత్తుల పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బరాంజా అన్నారు. ⇔వినియోగ ఉత్పత్తుల పరిశ్రమ పండుగల సీజన్లో 15 నుంచి 20 శాతం వృద్ధికి తాజా నిర్ణయం సహాయపడుతుందని భావిస్తున్నట్లు లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ డెరైక్టర్ నిపున్ సిఘాల్ అన్నారు. ⇔పావుశాతం రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తాయన్న విశ్వాసాన్ని ఇంటెక్స్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ రాజీవ్ జైన్ వ్యక్తం చేశారు. ఆటోమొబైల్... పరిశ్రమకు మొత్తానికి ఇది హర్షదాయకమైన అంశమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఆర్బీఐ ఇచ్చిన దీపావళి బహుమతిగా హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి అవసరమని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాలను హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ వ్యక్తం చేస్తూ, ఇది సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడే అంశంగా వివరించారు. రియల్ ఎస్టేట్... రేటు ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించాలని తాము కోరుకుంటున్నట్లు క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా రేటు కోత, తదుపరి వృద్ధి అవకాశాలతో హౌసింగ్ తదితర రియల్టీ విభాగం వృద్ధి ఊపందుకుంటుందని ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ చైర్మన్ తల్వాన్ అన్నారు. రెండుమూడేళ్లుగా బలహీనతలో కొనసాగుతున్న రియల్టీ రంగం సెంటిమెంట్‌కు ఈ నిర్ణయం ఉత్తేజం ఇస్తుందని ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ ప్రెసిడెంట్ ప్రవీణ్ జైన్ అన్నారు. తక్షణమే రేట్లు తగ్గిస్తాం: బ్యాంకర్లు రిజర్వు బ్యాంక్ రెపో రేటు తాజా తగ్గింపు ప్రయోజనాన్ని తక్షణం రుణగ్రహీతలకు అందిస్తామని బ్యాంకర్లు చెప్పారు. 2015 జనవరి 15 నుంచి 2016 ఏప్రిల్ 5 మధ్య ఆర్బీఐ 1.50 శాతం రేటు తగ్గిస్తే... ఇందులో సగం కూడా (సగటున 60 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు కస్టమర్‌కు బదలాయించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా రేటు కోతపై ఆయా బ్యాంకుల చీఫ్‌లు ఇలా స్పందించారు.... ఐబీఏ: ఆర్థిక సంవత్సరం కీలక సమయంలో రెపోరేటు కోత హర్షణీయమని దేనా బ్యాంక్ సీఎండీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ అశ్విన్ కుమార్ అన్నారు. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధానం ఇప్పటికే స్థిరపడినందున తాజా రేటు కోత ప్రయోజనాన్ని వేగంగా కస్టమర్లకు అందిస్తామని చెప్పారు. ఎస్బీఐ: తగిన లిక్విడిటీ పరిస్థితుల్లో రేటు కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకులు మొగుచూపుతాయని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. పాలసీ విధానం ఊహించినట్లే ఉందని ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్ పీకే గుప్తా పేర్కొన్నారు. బ్యాంక్ ఇప్పటికే తగిన రేటు కోత నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇందుకు అనుగుణంగా డిపాజిట్ రేట్లూ ఇటీవలే తగ్గాయన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఆరంభం... ఆర్బీఐ రేటు కోత ప్రయోజనంలో కొంత ఐసీఐసీఐ బ్యాంక్ వెనువెంటనే వినియోగదారుకు బదలాయించింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారిత వార్షిక రుణ రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.05 శాతానికి దిగింది. అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా నెలవారీ రుణ రేటును సైతం 8.90% నుంచి 8.85 శాతానికి తగ్గించింది. పెట్టుబడులకు అలాగే వినియోగానికి రేటు కోత ఉత్సాహాన్ని ఇస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ చందా కొచర్ అన్నారు. ఇది లిక్విడిటీకి ఎంతో సానుకూల అంశంగా పేర్కొన్నారు. సరఫరాలవైపు ప్రభుత్వ దృష్టి ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశమన్నారు. త్వరలోనే ఆర్బీఐ రేటు నిర్ణయ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తామని వివరించారు. యస్‌బ్యాంక్: వచ్చే నెలల్లో 75 బేసిస్ పాయింట్ల వరకూ రేటు కోత ఉండొచ్చని యస్‌బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ తెలిపారు. -
కీలక వడ్డీరేట్ల నిర్ణాయకులు ఇక వీరే
న్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఇకనుంచి కీలక వడ్డీ రేట్లను నిర్ణయించనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్టం ప్రకారం 'ద్రవ్య విధాన కమిటీ' ని నోటిఫై చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలోతెలిపింది. అక్టోబర్ 4న ఈ కమిటీ తొలి సమీక్ష నిర్వహించనుందని వెల్లడించింది. ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతివిధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఈ కొత్త మానిటరీపాలసి కమిటీ నిర్ణయించనుందని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ముగ్గురు , రిజ్వర్ బ్యాంకు కు చెందిన ముగ్గురు మొత్తం ఆరుగురు సభ్యులతో మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైంది ఇందులో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పాత్రా, ఆర్థిక నిపుణులు చేతన్ ఘాటే, పామి దువా, రవీంద్ర హెచ్ ధోలకియాలతో కూడిన ద్రవ్య విధాన కమిటీని ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఎంపీసీకి ముగ్గురు ఆర్థికవేత్తలు
నియమించిన కేంద్రం... * ద్రవ్య పరపతి విధాన రేటు నిర్ణయ ప్రక్రియలో తాజా నిర్ణయం * పదవీకాలం నాలుగేళ్లు..! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ఏర్పాటవుతున్న పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)కి ప్రభుత్వం తరఫున ముగ్గురు ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలను కేంద్రం గురువారం నియమించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాల పేర్లను నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. వీరి పదవీ కాలం నాలుగేళ్లు. పునర్నియామకానికి అవకాశం లేదు. కాగా ప్రస్తుతం ఆర్బీఐ ఐదుగురు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల్లో చేతన్ ఘాటే ఒకరు. రెపోకు ఇక మెజారిటీ నిర్ణయం ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 4న జరిగే 2016-17 ఆర్బీఐ నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఏకాభిప్రాయ నిర్ణయం ప్రాతిపదికనే జరుగుతుందని భావిస్తున్నారు. -
మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల నియామకం
న్యూడిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..మానిటరీ పాలసీ కమిటీకి (ఎంపీసీ) సంబంధించిన ముగ్గురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నాలుగేళ్ళ కాలానికి ముగ్గురు ప్రముఖులును నియామకాల కేబినెట్ కమిటీకి (ఏసీసీ) ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ పామి దువా, ఐఐఎం అహ్మదాబాద్ కు చెందిన ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలకియాలను ద్రవ్య విధాన కమిటీ సభ్యులుగా ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యుల్లో హెడ్ గా ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ సహా మరో వ్యక్తి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ముగ్గురు ఆర్బీఐ సభ్యులతో పాటు, ప్రభుత్వం నేడు నియమించిన ఈ ముగ్గురు సభ్యులు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను నిర్ణయించనున్నారు . ప్రభుత్వం తరఫున బాధ్యత వహించే సభ్యులో ఒకరు మహిళా(పామి దువా)ఉండడం విశేషం. కాగా ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ విశేష అధికారాలకు ముగింపు పలికిన కేంద్రం, మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనున్న సంగతి తెలిసిందే. -
ప్రభుత్వంతో విభేదాలు..తెరవెనకే ఉండాలి: దువ్వూరి
ముంబై: వడ్డీ రేట్ల నిర్ణయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)తో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి మెరుగుపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఎంపీసీతోపాటు తాను ఇటీవలే తీసుకొచ్చిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకంలోని అంశాలపై దువ్వూరి ‘పీటీఐ’తో మాట్లాడారు. క్రమశిక్షణ అలవడుతుంది... ‘ఎంపీసీ ఆర్బీఐ స్వతంత్రతను బలహీనపరుస్తుందని నేను అనుకోవడం లేదు. పైగా స్వయం ప్రతిపత్తిని పెంచుతుంది. ఎంపీసీ ఏర్పాటుతో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఆర్బీఐ, ప్రభుత్వం రెండు వైపులా క్రమశిక్షణ సాధ్యమవుతుంది’ అని దువ్వూరి చెప్పారు. ఎంపీసీలో గవర్నర్‌కు వీటో అధికారం కల్పించడాన్ని స్వాగతించారు. ఎంపీసీ అనేది మనం ఆవిష్కరించినది కాదని, ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు పాటిస్తున్న ఉత్తమ విధానమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, పరిణతి సాధించిన ప్రజాస్వామ్య దేశాల్లో ఈ విధానం ఉందని, ఇప్పుడు దాన్ని మనం అనుసరించబోతున్నామని చెప్పారు. ఆర్బీఐ శక్తివంతంగానే వ్యవహరించాలి.. పరపతి విధానం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శక్తివంతంగానే ఉండాలని, ప్రభుత్వం విభేదించినా తన స్వతంత్రకు భంగం వాటిల్లనంతవరకు పట్టించుకోనక్కర్లేదని అన్నారు. ‘ఎన్నికలతో ముడిపడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో విభేదాలు సహజమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ద్రవ్యోల్బణం కంటే వృద్ధి రేటుకే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ సెంట్రల్ బ్యాంకు మాత్రం ధరల స్థిరత్వం కోసం దీర్ఘకాల దృష్టితో వ్యవహరించాలి. దీని వల్ల స్వల్ప కాలంలో వృద్ధిని త్యాగం చేయాల్సి రావచ్చు’ అని సుబ్బారావు చెప్పారు. ప్రభుత్వ దృక్పథం పట్ల ఆర్బీఐ గవర్నర్ సున్నితంగానే ఉండాలని, అదే సమయంలో ఆర్బీఐ స్వతంత్రతను కూడా గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విభేదాలు ఏమున్నా అవి తెరవెనకే ఉండిపోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చిదంబరమంత ఉదారత నాకు లేదు... తాను రచించిన ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పుస్తకానికి ఆమోదం తెలిపే విషయంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎంతో ఉదారతతో, ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని దువ్వూరి సుబ్బారావు అన్నారు. కానీ, తాను మాత్రం ఆయన పట్ల అంత ఉదారతతో వ్యవహరించ లేదని స్పష్టం చేశారు. తాను ఈ పుస్తకంలో చిదంబరంతో విభేదించిన విషయాలు మాత్రమే కాకుండా ఆయనలోని సానుకూలతల గురించి కూడా మాట్లాడానని చెప్పారు. ఆయన పదవీ కాలం ఓ పాఠం: చిదంబరం ‘ఆర్బీఐ గవర్నర్‌గా డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల పదవీ కాలం.. నేర్చుకోదగిన, నిజాయితీతో కూడుకున్నది. ఆయన మేథ స్సు, కచ్చితత్వం పుస్తకంలోని ప్రతి పేజీలోనూ ప్రస్ఫుటమవుతోంది’ అంటూ హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్స్ అనే పుస్త కంలో చిదంబరం స్వయంగా రాసి తన సంతకం చేశారు. -
మానిటరీ పాలసీ కమిటీ పని మొదలు కానుందా?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏర్పాటు నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి నివాసంలో జైట్లీ ని కలిసిన రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్ల విధానంలో కొత్త విధానాన్నిత్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్చిస్తున్నాయన్నారు. ఆగస్టు 9 న నిర్వహించే వడ్డీ రేట్ల సమీక్షలో ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటి (మానిటరీ పాలసీ కమిటీ) మెకానిజం అమలుపై ఈ భేటీ జరిగిందని తెలిపారు. అయితే ఆగస్టు 9న సమీక్ష నుంచే కమిటీ పని మొదలు కానుందా అని ప్రశ్నించినపుడు దానికోసమే ప్రయత్నిస్తున్నామని.. ఎంత తొందరగా ఇది సాధ్యమవుతుందో చూడాలని చెప్పారు. ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసిన కేంద్రం,మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. ప్రస్తుత విధానం ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనుంది అయితే, ఈ కమిటీ నిర్ణయాన్ని ఆమోదించడం లేదా తోసిపుచ్చే (వీటో) అధికారం మాత్రం ఆర్బీఐ గవర్నర్‌కే ఉంటుంది. అంటే తుది నిర్ణయం ఆర్బీఐ గవర్నర్‌కే ఉన్నట్లు లెక్క. ఎంపీసీ ఏర్పాటుతో గవర్నర్‌కు ఉన్న ఈ అధికారానికి బ్రేక్ పడుతుంది. అయితే, ఆరుగురు సభ్యుల నిర్ణయం టై (రెండు వాదనలవైపు చెరో ముగ్గురు ఉంటే ) అయితే, ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తోంది. కాగా దేశంలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలన్నది ఇకపై రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండదు. ఇప్పటిదాకా ఆర్బీఐ గవర్నరు తీసుకుంటున్న ఈ నిర్ణయా న్ని ఇక ప్రభుత్వమే తీసుకోనుంది. కీలకమైన పాలసీ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలకు కేంద్రం ముగింపు పలికిన సంగతి తెలిసిందే. -
ధరలపై పోరు కీలకం కావాలి...
* ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ * ఇదే విధానం కొనసాగుతుందన్న విశ్వాసం ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే దేశాభివృద్దికి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. తన పదవీ విరమణ తరువాత బాధ్యతలు చేపట్టే ఆర్బీఐ కొత్త చీఫ్, అలాగే ఏకాభిప్రాయం ప్రాతిపదికన కీలక రేటు నిర్ణయానికి ఏర్పడబోతున్న ప్రతిపాదిత పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నిలువరించడంపైనే దృష్టి సారిస్తాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను అందుబాటులో ఉంచడం, అలాగే ఏకాభిప్రాయ ప్రాతిపదికన రేటు నిర్ణయానికి ఎంపీసీ ఏర్పాటు కేంద్రం తీసుకున్న కీలక చర్యలుగా వివరించారు. ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ సంస్థలో ‘ద్రవ్యోల్బణంపై పోరు... పరపతి విధాన వ్యవస్థలో పటిష్టత’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే.. ఒడిదుడుకులను భారత్ తట్టుకుంటుందని వివరించారు. ఎంపీసీ ఏర్పాటు విప్లవాత్మకం ఎంపీసీ ఏర్పాటు నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగని రాజన్ అన్నారు. దేశంలో పలు సంవత్సరాల నుంచి అధిక ద్రవ్యోల్బణం సమస్య ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల వాస్తవ వడ్డీరేటు ధోరణి అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. ఈ నేపథ్యంలో తగిన గణాంకాల రూపకల్పన, ఏకాభిప్రాయం ప్రాతిపదికన తగిన రేటు నిర్ణయం దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఎంపీసీల ఏర్పాటు కీలకమని వివరించారు. గత మూడేళ్లుగా ద్రవ్యోల్బణంపై జరుపుతున్న పోరాటం ఫలితంగా పలు ఆర్థిక అంశాల్లో స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. మన పరపతి విధాన లక్ష్యాల పట్ల పెట్టుబడిదారుల విశ్వాస్వాన్ని పెంపొందించడానికి ‘స్థిర రూపాయి విలువ’ దోహదపడుతుందని రాజన్ ఈ సందర్భంగా వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భారీ పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో భారీ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ద్రవ్యలోటు కట్టడి ఆర్థికవృద్ధిలో కీలకమని అన్నారు. త్వరలో రాజన్ వారసుని పేరు! రాజన్ తరువాత ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి పేరును త్వరలో కేంద్రం ప్రకటిస్తుందని సంబంధిత అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కొత్త గవర్నర్ నియామకానికి ప్యానల్ ఏర్పాటు వంటి ఊహాగానాలను ఒక సీనియర్ అధికారి కొట్టిపారేస్తూ... అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేశారు. అనవసర ఊహాగానాలకు తావివ్వకుండా ముందస్తుగానే కొత్త గవర్నర్ ఎవరన్న ప్రకటన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 4న రాజన్ పదవీ విరమణ చేయనున్నారు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య సహా పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. -
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 4వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మొత్తం 97 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 62 కేంద్రాలను అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో, మిగిలిన 35 కేంద్రాలను ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 18,243 మంది హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 14,426 మంది ఉన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఎంపీసీ విద్యార్థుల్లో 12,462 మంది అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు కాగా, 822 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. మోడల్ స్కూళ్ల నుంచి 135 మంది, సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి 272 మంది, ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుంచి 418, కాంపోజిట్ కళాశాల నుంచి 27, కోఆపరేటివ్ జూనియర్ కళాశాల నుంచి 262, ఇన్సెంటివ్ జూనియర్ కళాశాల విద్యార్థులు 18 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. బైపీసీ విద్యార్థులు 3,817 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 2,558 మంది అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులు కాగా, 587 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, మోడల్ స్కూలు జూనియర్ కళాశాల నుంచి 93, సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి 269, ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుంచి 183 మంది, కాంపోజిట్ జూనియర్ కళాశాల నుంచి 18, కోఆపరేటివ్ జూనియర్ కళాశాల నుంచి 109 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. మారిన నిబంధనలు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది నిబంధనలను మార్చింది. ఇప్పటి వరకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను ఇంటర్మీడియెట్ బోర్డు నియమిస్తోంది. ఇంటర్నల్ ఎగ్జామినర్లుగా(స్కిల్ అసిస్టెంట్) ఆయా కళాశాలలోని సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డిపార్టుమెంటల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. అయితే అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఆర్ట్స్ అధ్యాపకులు, ఫిజికల్ డెరైక్టర్లను డిపార్టుమెంట్ అధికారులుగా గత ఏడాది వరకు నియమించారు. ఈ ఏడాది రెవెన్యూ అధికారులను డిపార్టుమెంట్ అధికారులుగా నియమించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి లేఖలు కూడా రాసింది. గత ఏడాది నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో వివాదం రావడంతో అక్కడి డిపార్టుమెంట్ ఆఫీసర్లను తొలగించి, వారి స్థానంలో రెవెన్యూ అధికారులను నియమించడంతో పక్కాగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను డిపార్టుమెంట్ అధికారులుగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే డిపార్టుమెంట్ అధికారులుగా జూనియర్ అధ్యాపకులను తప్పించి ఇతర శాఖల అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు డిపార్టుమెంట్ ఆఫీసర్లుగా నియమించకపోతే ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామని, జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా హాజరు కాబోమని జూనియర్ అధ్యాపకుల సంఘ రాష్ట్ర శాఖ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శికి నోటీస్ కూడా ఇచ్చిందని జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షలు.. 70 ‘డే’స్ ప్లాన్
ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో మార్చి 9 నుంచి 27 వరకు; ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దీంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రూప్ ఏదైనా.. ప్రథమ సంవత్సరమైనా లేదా ద్వితీయ సంవత్సరమైనా సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సాధించడం తప్పనిసరిగా మారింది. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులకు ఆయా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వెయిటేజీ ఇస్తుండటం; ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ మార్కులు కీలకంగా మారుతుండటమే ఇందుకు కారణం. ఇప్పటి నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉన్న 70 రోజుల సమయంలో అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళికలపై గ్రూప్‌ల వారీగా నిపుణులు, ఇంటర్మీడియెట్- 2014 టాపర్స్ అందిస్తున్న సలహాలు, సూచనలు.. ఎంపీసీ ఎంపీసీ.. జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ; అడ్వాన్స్‌డ్‌లోనూ టాప్-20 పర్సంటైల్ విధానం.. ఎంపీసీ విద్యార్థుల కోణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యత లభిస్తోంది. మ్యాథమెటిక్స్.. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఎంపీసీ విద్యార్థులు ఇప్పటికే దాదాపు సిలబస్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుతమున్న సమయంలో స్వల్ప సమాధాన ప్రశ్నలపై బాగా దృష్టిసారించాలి. వీటిని కూడా కేవలం ప్రశ్న- సమాధానంలా కాకుండా డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అదే విధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా సిలబస్‌లకు అనుగుణంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-సమాధానాల రూపంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ‘ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి చేసేశాం కదా.. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమిద్దాం’ అనే ధోరణి సరికాదు. ఎందుకంటే ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఇంటర్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటి నుంచి దాదాపు 90 శాతం సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఫిబ్రవరి మధ్య నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ సబ్జెక్టులనే చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్‌కు ప్రాధాన్వమివ్వాలి. వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు రాయడం తప్పనిసరి. అదేవిధంగా కనీసం రెండు ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరవ్వాలి. సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అంశాల వారీగా లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రాధాన్యత ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు; సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్.. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై దృష్టి విద్యార్థులు జనవరిలో స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నల సాధనకు ఎక్కువ కృషి చేయాలి. ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తి చేసుకుని ఉంటారు కాబట్టి.. ఫిబ్రవరిని పూర్తిగా రివిజన్‌కు, ప్రాక్టికల్స్‌లో నైపుణ్యం సాధించడానికి కేటాయించాలి. ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి.. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ వంటి అంశాల్లో పట్టు సాధించేలా పునశ్చరణ చేయాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్‌లో దీర్ఘ సమాధాన ప్రశ్నలను సాధన చేసేటప్పుడు అంచెలవారీ పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ఫలితంగా సదరు సమస్యకు సంబంధించి ప్రాథమిక భావనలపైనా పట్టు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది. కెమిస్ట్రీ.. ముఖ్యాంశాలు నోట్ చేసుకుంటూ కెమిస్ట్రీ ప్రిపరేషన్ విషయంలో ప్రస్తుత సమయంలో కలిసొచ్చే విధానం.. ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం. దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. వీటికి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలను రివైజ్ చేయడం; మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు జనవరి చివరి నాటికి సబ్జెక్ట్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసుకుని, ఫిబ్రవరి మొత్తాన్ని రివిజన్‌కు కేటాయించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఆయా చాప్టర్లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా విద్యుత్ రసాయన శాస్త్రం; పి-బ్లాక్ మూలకాలు, డి, ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం; సాలిడ్ స్టేట్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవడం మేలు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక చాప్టర్ పూర్తి చేసుకునేలా అధ్యయనం చేయాలి. బైపీసీ బైపీసీలో ఎక్కువ మంది విద్యార్థుల టార్గెట్‌గా నిలుస్తున్న ఎంసెట్‌లో అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారితమే. బోటనీ.. అనలిటికల్ అప్రోచ్ విద్యార్థులు బోటనీ సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. ప్రశ్న-సమాధానం అనే కోణంలో కాకుండా.. ఒక ప్రశ్నకు సమాధానం సాధించే క్రమంలో ఇమిడి ఉన్న అనువర్తిత అంశాలను నిజ జీవితంలోని పరిస్థితులతో బేరీజు వేస్తూ సాగాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయోటెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. బోటనీకి సంబంధించి బాగా కలిసొచ్చే అంశం.. గ్రాఫికల్ ప్రజంటేషన్పై అవగాహన. కాబట్టి ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా సాధన చేయాలి. జువాలజీ.. ఇలా జువాలజీకి సంబంధించి సమయపాలన ఎంతో కీలకం. ఆయా యూనిట్లకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్‌కు సమయం కేటాయించుకోవాలి. జనవరి చివరి నాటికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి - సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ-సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. జువాలజీలో మార్కుల సాధనకు గ్రాఫికల్ ప్రజంటేషన్ చాలా అవసరం. కాబట్టి డయాగ్రమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటివరకు ఏమాత్రం దృష్టిపెట్టని అంశాలకు ఇప్పుడు ఎక్కువ సమయం కేటాయించడం సరికాదు. దీనివల్ల ఒత్తిడికి గురవడం తప్పితే అదనపు ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగా ముఖ్యమైనవి, ఇప్పటివరకు చదవనివి అని భావించిన అంశాల ప్రిపరేషన్‌ను జనవరి చివరి నాటికి పూర్తి చేసుకోవడం ఉపయుక్తం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లు రెండింటిలోనూ ఉండే సబ్జెక్ట్‌లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీలు. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టుల ప్రిపరేషన్లో ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఫిజిక్స్‌కు సంబంధించి ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. దీనివల్ల తుది ఫలితాల్లో నిరాశకు గురవుతున్న వారెందరో! ఫిజిక్స్‌ను నిజ జీవిత పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకు సర్ఫేస్ టెన్షన్ అంశాన్ని నిత్య జీవితంలో పరిస్థితులతో అన్వయించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్ అప్రోచ్‌తో ఫిజిక్స్‌ను తేలిగ్గానే గట్టెక్కొచ్చు. ఫిజిక్స్‌కు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. కెమిస్ట్రీలో మొదటి సంవత్సరంలో ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేస్తూనే వీలైతే సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సీఈసీ సీఈసీ.. సంప్రదాయ బీకాం డిగ్రీ మొదలు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల సిలబస్‌లకు సంబంధించి ప్రాథమిక భావనలపై అవగాహన కల్పించే గ్రూప్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే సీఈసీ గ్రూప్‌నకు ప్రాధాన్యం పెరుగుతోంది. కారణం.. పలు ప్రొఫెషనల్ కోర్సులకు ఈ గ్రూప్ సబ్జెక్ట్‌లు బేసిక్స్‌గా ఉపయోగపడుతుండటమే. ఇదే సమయంలో మూడు సబ్జెక్ట్‌లు కూడా విస్తృతంగా, గణాంకాల పరిజ్ఞానం అవసరమైన రీతిలో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. సివిక్స్, ఎకనామిక్స్‌కు విశ్లేషణ ఎంతో అవసరం. కామర్స్ సబ్జెక్ట్ విషయంలో తులనాత్మక అధ్యయనం మేలు చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ను జనవరి చివరి వారానికల్లా పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత సమయాన్ని ప్రాక్టీస్‌కు, రివిజన్‌కు కేటాయించాలి. సైన్స్ విద్యార్థులతో పోల్చితే సీఈసీ విద్యార్థులకు సమయం పరంగా కలిసొచ్చే అంశం.. ప్రాక్టికల్స్ లేకపోవడం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. సివిక్స్‌కు ఇలా భారత రాజ్యాంగం- శాఖలు- రాజ్యాంగ సంస్థలు తదితర అంశాలతో ఉండే సివిక్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. రాజ్యాంగం, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన ఎంతో అవసరం. సివిక్స్ మొదటి సంవత్సరానికి సంబంధించి.. రాజ్యాంగం స్వభావం, తీరుతెన్నులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి నిర్వచనాలు షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో లాభిస్తుంది. ముఖ్యంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చదివేటప్పుడే అందులో పేర్కొన్న నిర్వచనాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. ద్వితీయ సంవత్సరం సివిక్స్‌లో భారత రాజ్యాంగం, ప్రభుత్వం, పరిపాలన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. విద్యార్థులు రాజ్యాంగ సంస్థల(పార్లమెంట్, సర్వీస్ కమిషన్లు తదితర) గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇప్పటివరకు వీటిపై దృష్టి పెట్టని విద్యార్థులు కూడా కొద్ది రోజులు ఏకాగ్రతతో చదివితే సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు. కామర్స్‌లో మంచి మార్కులకు ప్రాక్టీస్ కామర్స్‌లో మంచి మార్కుల సాధనకు ప్రాక్టీస్ ఒక్కటే ఏకైక మార్గం. పార్ట్-1 (వాణిజ్య శాస్త్రం), పార్ట్-2 (వ్యాపార గణాంక శాస్త్రం)గా 50 మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు పార్ట్-1కు సంబంధించి వ్యాపారం-భావనలు, స్వరూపాలు, వ్యవస్థాపన-వ్యవస్థాపకులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. వ్యాపార పరమైన సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న విద్యార్థులకు పార్ట్-1 సులభంగానే ఉంటుంది. ఇతర విద్యార్థులు కూడా కొద్దిపాటి శ్రమతో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. అకాడమీ పుస్తకాల్లో పేర్కొన్న అంశాలను సునిశితంగా అధ్యయనం చేయాలి. సిలబస్‌కు అనుగుణంగా ఆయా అంశాల ప్రాథమిక భావనలు-నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను తెలుసుకుంటే 90 శాతం మార్కులు సాధించొచ్చు. పార్ట్-2గా పేర్కొన్న వ్యాపార గణాంక శాస్త్రంలో మెరుగైన మార్కుల కోసం సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు కంప్యుటేషనల్ నైపుణ్యాలు, తులనాత్మక అధ్యయన నైపుణ్యం పెంచుకోవాలి. ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్, బ్యాంకింగ్ రీకన్సిలియేషన్ సిస్టమ్‌లపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటిపై పట్టు కోసం ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. కామర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. పార్ట్-1గా పేర్కొనే థియరీ ఆధారిత వాణిజ్య శాస్త్రం కోసం మార్కెటింగ్, వ్యాపారం, స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు, కంప్యూటర్ అవగాహనలో ముందుండాలి. పార్ట్-2గా పేర్కొనే వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించి ట్రేడింగ్, కన్సైన్మెంట్, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. మొత్తంమీద కామర్స్ సబ్జెక్ట్‌లోని అంశాల్లో నైపుణ్యం దిశగా.. ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం రీడింగ్‌కు పరిమితమవడం సరికాదు. ప్రాక్టీస్ చేస్తూనే ముఖ్యమైన భావనలను నిర్వచనాల రూపంలో గుర్తుంచుకోవాలి. ఎకనామిక్స్ ‘చాలా విస్తృతం.. సంక్లిష్టం’ అని భావించే ఎకనామిక్స్ (అర్థశాస్త్రం)లోనూ మెరుగైన మార్కులు పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి. సబ్జెక్ట్‌లోని అంశాల మూల భావనలను వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ చదవడం ద్వారా ఆసక్తిని పెంపొందించుకోవచ్చు. ఇది సబ్జెక్ట్‌పై అవగాహన కల్పించడంతోపాటు మంచి మార్కుల సాధనకు దోహదం చేస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు.. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలు- వాటి నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలను అనునిత్యం చదవాలి. వీటితోపాటు బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, జాతీయాదాయం వంటివి కీలక అంశాలు. వీటి విషయంలో గ్రాఫికల్ అవేర్నెస్ కూడా మెరుగైన మార్కులకు దోహదం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు... ఆర్థిక సమస్యలు-కారణాలు-నివారణ చర్యలు, గణాంక వివరాలపై దృష్టిపెట్టాలి. మార్కుల పరంగా ఎక్కువ వెయిటేజీ ఉన్న జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలను ప్రధానంగా చదవాలి. ప్రతి అంశాన్ని చదివేటప్పుడు దాని మూల భావనలు, సదరు అంశంలో సమకాలీన సమస్యలు-నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు సినాప్సిస్ రూపంలో షార్ట్‌నోట్స్ రూపొందించుకుంటే స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా సంసిద్ధత లభిస్తుంది. కామన్ టిప్స్ ఫర్ త్రీ గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ.. మూడు ప్రధాన గ్రూప్‌ల విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో పాటించాల్సిన వ్యూహాలు.. ⇒ జనవరి చివరి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ⇒ ఫిబ్రవరి నుంచి పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. ⇒ ప్రాక్టికల్స్ ఉండే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు జనవరి మూడో వారానికే సిలబస్ పూర్తి చేసుకుని తర్వాత ప్రాక్టికల్స్‌పై దృష్టి పెట్టడం మంచిది. ⇒ ప్రస్తుత సమయంలో కొత్త అంశాలను చదవడం సరికాదు. ఒకవేళ బాగా ముఖ్యమైన అంశాలు అనుకుంటే వాటిని జనవరి పదిహేనో తేదీలోపు పూర్తి చేయడం మంచిది. ⇒ ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వాటి నుంచి అడిగే అవకాశం ఉన్న షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌కు సంబంధించిన అంశాలు (ఉదా: నిర్వచనాలు, ఫార్ములాలు, భావనలు తదితర) గుర్తించి నోట్స్ రూపంలో రాసుకోవాలి. ⇒ జేఈఈ, ఎంసెట్ వంటి పరీక్షలకు కూడా పోటీ పడుతున్న విద్యార్థులు వాటి ప్రిపరేషన్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి.. తర్వాత సమయం మొత్తం ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ⇒ విద్యార్థులు క్లాస్‌రూం లెక్చర్‌కు అదనంగా ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల స్వీయ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ⇒ ఈ సమయంలో ప్రాక్టికల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు 40 శాతం; థియరీ సబ్జెక్ట్‌లకు 30 శాతం చొప్పున కేటాయించడం వల్ల అన్ని అంశాలు పూర్తి చేసుకునే వీలు లభిస్తుంది. ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అభ్యర్థుల సామర్థ్యంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ⇒ అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే మెమొరీ టిప్స్ (విజువల్ ఇమాజినేషన్; షార్ట్ నోట్స్)ను పాటించడం మేలు. ⇒ కేవలం రీడింగ్‌కే పరిమితం కాకుండా కచ్చితంగా పెన్/పేపర్ ప్రాక్టీస్ అవసరం. ⇒ కనీసం రెండు ప్రీ-ఫైనల్స్‌కు హాజరుకావాలి. ఈ ప్రక్రియ జనవరిలోపు పూర్తి చేసుకుంటే తమలోని లోపాలు, బలహీనతలపై స్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా తర్వాత అందుబాటులో ఉన్న నెల రోజుల వ్యవధిలో సదరు అంశాల్లో ఏ విధంగా రాణించాలనే అవగాహన పొందొచ్చు. అన్ని చాప్టర్లపై అవగాహన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో బైపీసీ విద్యార్థులు అన్ని చాప్టర్లపై అవగాహన పెంపొందించుకునే విధంగా చదవాలి. ఇప్పటికే సిలబస్ పూర్తయి ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అధిక శాతం రివిజన్‌కు కేటాయించాలి. బైపీసీలో చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ అంటే భయంతో చాయిస్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలను చదవరు. కానీ ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ సిలబస్‌లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయా అంశాల్లో కనీసం ప్రాథమిక భావనలపైనైనా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. వ్యక్తిగతంగా నిర్దిష్ట టైం టేబుల్‌ను రూపొందించుకుని దాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. మోడల్ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు, షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్‌పై అవగాహన అదనపు ప్రయోజకాలుగా నిలుస్తాయి. - ఎం. రిషిత, బైపీసీ టాపర్ (989 మార్కులు) ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ఎంపీసీ విద్యార్థులు రెండు నెలల సమయంలో స్వీయ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటి వరకు క్లాస్‌రూంలో విన్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, సమస్యలను వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో కేవలం మ్యాథమెటిక్స్‌కే పరిమితం కాకుండా ఫిజిక్స్‌కు కూడా ప్రాధాన్యమివ్వాలి. రివిజన్ కోణంలో విద్యార్థులు తమకు అనుకూలమైన టెక్నిక్స్‌ను (షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, ముఖ్యమైన ఫార్ములాలను పట్టిక రూపంలో పొందుపర్చుకోవడం) పాటిస్తే రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంట్రన్స్ టెస్ట్‌ల ఆలోచనను దరి చేరనీయకూడదు. - నిఖిల్, ఎంపీసీ టాపర్ (994 మార్కులు) -
మెరిసేందుకు మేలిమి వ్యూహాలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు రాబోయే ఆర్నెల్లు చాలా ముఖ్యమైనవి. నచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో, ఇష్టమైన బ్రాంచ్‌లో చేరాలనుకునే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందే. పటిష్ట ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలకు సమాంతరంగా పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఎంపీసీ+ఎంసెట్ ప్రిపరేషన్ ప్రణాళికఅక్టోబర్ 10 నుంచి జనవరి 10 వరకు ఇంటర్ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. జనవరి 11 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రాక్టికల్స్ చేయడానికి, రికార్డులు రాయడానికి, భాషల సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు, ఇంటర్లో అధిక మార్కుల సాధనకు కేటాయించాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. ఆపై ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్‌లో ఎంసెట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌తో పాటు రోజువారీ పరీక్షలు, వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. మ్యాథమెటిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మ్యాథమెటిక్స్‌లో 2-ఎకు 75 మార్కులు, 2-బికు 75 మార్కులు కేటాయించారు. అదే విధంగా ఎంసెట్‌లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్‌కు ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించడం ద్వారా ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకును కైవసం చేసుకోవచ్చు. ఎంసెట్‌లో విజయానికి కచ్చితత్వంతో పాటు వేగం అవసరం. అందువల్ల ప్రతి చాప్టర్‌ను ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోణంలో అధ్యయనం చేసిన తర్వాత,ఎంసెట్ కోసం సంక్షిప్త సమాచారం, సూత్రాలపై దృష్టి కేంద్రీకరించాలి. సమస్యలను సాధించాలి. ముఖ్య అంశాలు (ఇంటర్ పరీక్షలకు): ద్విపద సిద్ధాంతం- 16 మార్కులు సంకీర్ణ సంఖ్యలు, ఈ్ఛ కౌజీఠిట్ఛ*ట ఖీజిౌ్ఛట్ఛఝ 17 మార్కులు సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు సంభావ్యత- 15 మార్కులు వృత్తాలు- 22 మార్కులు నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు - 33 మార్కులు అవకలన సమీకరణాలు- 13 మార్కులు ముఖ్య అంశాలు (ఎంసెట్‌కు): ఇంటెగ్రల్ కాలిక్యులస్, 3డీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్-డిటెర్మినెంట్స్, సర్కిల్స్ చాప్టర్ల ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. ఎంసెట్ 2014,2013 ప్రకారం వివిధ చాప్టర్ల వెయిటేజీ: చాప్టర్ ప్రశ్నలు బీజ గణితం 26 కలనగణితం 19 రేఖాగణితం 17 త్రికోణమితి 9 సదిశా బీజగణితం 6 3డీ-జ్యామితి 3 ఫిజిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాలా కష్టమైనవిగా భావిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివి, ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎంసెట్: ఎంసెట్ కోణంలో చూస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఫిజిక్స్‌ను క్లిష్టమైందిగా భావిస్తారు. అయితే కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మూలసూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్‌లోని శక్తి, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ సూత్రం, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తన కాలం వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.సీనియర్ ఇంటర్ సిలబస్‌లోని కిర్కాఫ్ నియమాలు, ఫ్లెమింగ్ కుడి, ఎడమ చేయి సూత్రాలు, ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను నేర్చుకోవాలి.ఎలక్ట్రో మ్యాగ్నటిజం, ఫిజికల్ ఆప్టిక్స్, వేవ్ మోషన్, సౌండ్, హీట్, కొలిజన్, మ్యాగ్నటిజం అంశాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి ఇంటర్లో 60 మార్కులు, ఎంసెట్‌లో 40 మార్కులు ఉంటాయి. కెమిస్ట్రీ తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివితే ఇంటర్, ఎంసెట్ రెండింటిలోనూ అధిక మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని సమీకరణాలను వీలైనంతలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమని భావిస్తారు. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణాత్మకంగా చదవడం ద్వారా ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు. ఒక్క ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్యా సాధనలు మినహా మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు.ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది. 70% నుంచి 80% ప్రశ్నలకు సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్ష న్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.సూత్రాలన్నింటినీ నేర్చుకుని, వాటిపై ఆధారపడిన సమస్యల్ని సాధన చేయాలి.ఎంసెట్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్‌లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. 2014 ఎంసెట్‌లో ప్రశ్నలు: ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (Mixed Concepts) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. మొదటి సంవత్సరం: అంశం ప్రశ్నలు అటామిక్ స్ట్రక్చర్ 2 పీరియాడిక్ టేబుల్ 1 కెమికల్ బాండింగ్ 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 స్టాకియోమెట్రీ 1 థర్మోడైనమిక్స్ 1 కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స అండ్ బేసెస్ 2 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ 1 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ 2 గ్రూప్ 13 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 14 ఎలిమెంట్స్ 1 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్ 4 ద్వితీయ సంవత్సరం అంశం ప్రశ్నలు సొల్యూషన్స్ 2 సాలిడ్ స్టేట్ 1 ఎలక్ట్రో కెమిస్ట్రీ 2 కెమికల్ కెనైటిక్స్ 1 మెటలర్జీ 1 గ్రూప్ 15 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 16 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 17 ఎలిమెంట్స్ 1 డి-బ్లాక్ ఎలిమెంట్స్ 1 నోబెల్ గ్యాసెస్ 1 పాలిమర్స్ 1 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ కాంపౌండ్స్ 4 సర్ఫేస్ కెమిస్ట్రీ 1 వృక్షశాస్త్రం ఎంసెట్ లేదా ఇతర పోటీ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశించే ప్రక్రియలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగింది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి, నచ్చిన కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఐపీఈలో 90 శాతానికి (540/600) తక్కువ కాకుండా మార్కులు సాధించారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంటర్, ఎంసెట్ పరీక్షలకు సబ్జెక్టులు ఒకటే అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం భిన్నంగా ఉండాలి. వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ప్రధానంగా వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు వివిధ పాఠ్యాంశాల్లో చేర్చిన కొత్త విషయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేనందున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెయిటేజీ: యూనిట్ మార్కుల వెయిటేజీ 1. వృక్ష శరీరధర్మ శాస్త్రం 28 2. సూక్ష్మజీవ శాస్త్రం 6 3. జన్యుశాస్త్రం 6 4. అణుజీవ శాస్త్రం 8 5. జీవసాంకేతిక శాస్త్రం 16 6. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు 12 మొత్తం మార్కులు 76 మొత్తం దీర్ఘ సమాధాన ప్రశ్నలు 15. ఇవి సాధారణంగా 1, 5, 6 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది. గమనించాల్సిన అంశాలు: వీలైనంత వరకు పాఠ్యపుస్తకాల్లోని వాక్యాలను/ నిర్వచనాలను యథాతథంగా రాయాలి.పాఠ్యపుస్తకాల్లో లేని ఉదాహరణలు రాయకూడదు.చక్కని చిత్రపటాలు గీచి, భాగాలు రాయాలి. శరీరధర్మ శాస్త్రంలోని క్రెబ్స్, కెల్విన్ వలయాలు పూర్తిగా ఉండాలి. ప్రతి చర్యను విశదీకరించాలి.మొదటి యూనిట్‌కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్‌పై అధికంగా దృష్టి సారించాలి.సమాధానాలను రాసే క్రమంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లో చార్ట్ వేయడంవంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.అవసరమైన చోట పటాలను చక్కగా వేయడంతోపాటు మంచి వివరణ కూడా ఇవ్వాలి. ఎంసెట్ ప్రణాళిక: పాఠ్యాంశాలను చదవడం ప్రారంభించాలి. సిలబస్ మొత్తం జనవరి చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాక్టికల్స్ కారణంగా రెగ్యులర్ విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రిపరేషన్లో జాప్యం జరుగుతుంది. అందువల్ల పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పబ్లిక్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలి. 2014లో ఎంసెట్ పరీక్ష తేలిగ్గానే ఉన్నప్పటికీ మొత్తంమీద తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కొంత నిరాశ ఎదురైంది. చిత్రపటాలకు సంబంధించి అనవసర స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఈసారి శాస్త్రవేత్తల చిత్రపటాలపై ప్రశ్నలు రావని ఆశిద్దాం! 2014 ఎంసెట్ వెయిటేజీ: ప్రథమ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 4 యూనిట్-2 4 యూనిట్-3 3 యూనిట్-4 1 యూనిట్-5 4 యూనిట్-6 2 యూనిట్-7 1 ద్వితీయ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 8 యూనిట్-2 2 యూనిట్-3 2 యూనిట్-4 3 యూనిట్-5 3 యూనిట్-6 3 మొదటి, రెండో సంవత్సరం పాఠ్యాంశాల్లో సారూప్యం ఉన్నవాటిని కలిపి చదవాలి. ఎంసెట్‌కు కనీసం 20 రోజులు ముందుగా సిలబస్ పూర్తిచేయాలి. దీనివల్ల పునశ్చరణకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జంతుశాస్త్రం విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల సన్నద్ధతకు దాదాపు వంద రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, ఎంసెట్‌కు మధ్య దాదాపు 40-45 రోజుల వ్యవధి ఉంటుంది. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధత: ఇంటర్ ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్‌లో ఎనిమిది అధ్యాయాలున్నాయి. వీటిలో మొదటి అయిదు మానవ అంతర్నిర్మాణం, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించినవి. మిగిలినవి జన్యుశాస్త్రం, పరిణామం, అనువర్తిత జీవశాస్త్రానికి చెందినవి. జంతుశాస్త్రానికి 60 మార్కులు కేటాయించారు. వీటిలో అతి స్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 76 మార్కుల పేపర్లో 60 మార్కులకు సమాధానాలు రాయాలి. యూనిట్ల వారీగా వెయిటేజీ: యూనిట్ మార్కులు యూనిట్ 1 10 యూనిట్ 2 10 యూనిట్ 3 8 యూనిట్ 4 8 యూనిట్ 5 12 యూనిట్ 6 12 యూనిట్ 7 8 యూనిట్ 8 8 మానవ నిర్మాణానికి సంబంధించిన యూనిట్ల నుంచి 48 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించి 28 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గమనించాల్సిన అంశాలు: ఇప్పటి వరకు పూర్తయిన ప్రిపరేషన్‌ను విశ్లేషించుకోవాలి. ఎంత వరకు సిలబస్ పూర్తయింది? మిగిలిన సిలబస్‌కు ఎంత సమయం కేటాయించాలి? ఏ అంశాలు క్లిష్టంగా ఉన్నాయి? తదితర అంశాలపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ హృదయ నిర్మాణం-పనిచేసే విధానం, మానవుని విసర్జక వ్యవస్థ, మూత్రం తయారీ విధానం, కండర సంకోచ విధానం, మానవుని మెదడు-నిర్మాణం, విధులు తదితర అంశాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. {పతి అధ్యాయం చివర ఇచ్చిన ప్రశ్నలను ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలి. పటాలను ప్రాక్టీస్ చేయాలి. ఎంసెట్‌కు ఎలా సిద్ధమవాలి? ఎంసెట్ మెడికల్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను జంతుశాస్త్రం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌కు దాదాపు సమాన ప్రాధాన్యమిస్తారు. 2014 ఎంసెట్ వెయిటేజీ: యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 2 యూనిట్-2 2 యూనిట్-3 3 యూనిట్-4 2 యూనిట్-5 2 యూనిట్-6 6 యూనిట్-7 3 యూనిట్-8 2 తెలుగు అకాడమీ నుంచి నేరుగా: ఎంసెట్-2014 జంతుశాస్త్రం ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు సరళంగా ఉన్నాయి.తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకం నుంచి ప్రశ్నలు నేరుగా వచ్చాయి.ప్రతి పాఠ్యాంశంలోని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రతి చాప్టర్‌ను ఇంటర్ పరిధిలో చదువుతున్నప్పటికీ ఎంసెట్‌కు ఉపయోగపడేలా ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని రెండింటికీ సమాంతరంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.సమయ పాలన, కచ్చితత్వం ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గుర్తుంచుకోండి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్‌ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ సమాధానాలు గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి.హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ యూనిట్లలోని పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అధిక శాతం సమాధానాలు వీటితోనే ముడిపడి ఉంటాయి.ప్రతి యూనిట్ చివర ఇచ్చిన అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను కచ్చితంగా నేర్చుకోవాలి. మెరుగైన మార్కుల సాధనకు ఇవి బాగా ఉపయోగపడతాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు పాయింట్ల వారీగా జవాబులు రాయాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో పటాలతో కూడిన ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించొచ్చు. -
నేటి నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పోచమ్మమైదాన్ : ఎట్టకేలకు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోసం గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అధికారులు జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 15, 19 తేదీలలో సెలవు ఉంటుంది. ఎస్టీ విద్యార్థులు అన్ని ర్యాంక్‌ల వారు వ రంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హె ల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల పరిశీలనకు జరు కా వాలి. సర్టిఫికెట్ల పరిశీలన కోసం మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెబ్ అప్షన్కు తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్లు తీసుకురండి.... పదవ తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, టీసీ బీసీ, ఓసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండీక్యాప్, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు హైదారాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్ జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. -
జూనియర్ ఇంటర్లో 64 ఉత్తీర్ణత
ఎంపీసీలో 466/470 నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి కొండూరు కార్తికేయన్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో జిల్లా 64 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత నెల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 26,947 మంది మొదటి ఏడాది పరీక్షలు రాశారు. వీరిలో 17,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గోస్థానాన్ని జిల్లా దక్కించుకొంది. గత ఏడాది కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది 14,384 మంది బాలురు పరీక్ష రాయగా 8,885 మంది ఉత్తీర్ణులై 62 శాతం సాధించారు. 12,563 మంది బాలికలు పరీక్ష రాయగా 8,396 మంది ఉత్తీర్ణత సాధించి 67 శాతం నమోదు చేశారు. సరాసరి 64 శాతం విజయం సాధించినప్పటికీ ఫలితాల్లో బాలికలదే పైచేయి. రాష్ట్రంలో కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్టణం జిల్లాల తర్వాత నెల్లూరులో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి, అధిక మార్కులు సాధిం చాలనుకునే వారికి ప్రభుత్వం వచ్చే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. మే 6వ తేదీ లోపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. -
పది తర్వాత పయనమెటు?
‘పది’ అడుగులు తడబడకుండా వడివడిగా పడ్డాయి.. మరి మలి అడుగు ఎక్కడేస్తే అది మేలిమి భవిష్యత్తుకు పునాది అవుతుంది? చదువుల పయనంలో తొలి దశ అయిన పదో తరగతి పూర్తయిన తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, ప్రవేశ మార్గాలు, కెరీర్ ప్రస్థానం తదితరాలపై విశ్లేషణ.. ఇంటర్మీడియెట్ ఇంజనీరింగ్‌కు ఎంపీసీ: ఇంజనీరింగ్ దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారు ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరవచ్చు. గణితం అంటే బాగా ఆసక్తి ఉండే, ఒక అంశాన్ని వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు సరైన గ్రూప్ ఎంపీసీ. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ-మెయిన్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ద్వారా ఐఐటీ, ఐఎస్ఎం ధన్బాద్లో చేరొచ్చు. ఇప్పుడు సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరగడంతో ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అందుకోవచ్చు. బైపీసీతో వైద్యం: పరిశోధనలంటే బాగా ఆసక్తి ఉండి, వృక్ష, జీవశాస్త్ర సబ్జెక్టులపై ఇష్టం ఉన్నవారికి సరిపడే గ్రూప్ బైపీసీ. బైపీసీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ఉండాలి. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత కూడా అవసరం. ఇక.. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ తదితర పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా జీవితంలో స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియనే చెప్పాలి. రెండేళ్ల పాటు ఇంటర్ చదివిన తర్వాత ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ మెడిసిన్ (సూపర్ స్పెషాలిటీ) కోర్సు చేయాలి. దీనర్థం బైపీసీలో చేరొద్దని కాదు.. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆసక్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ తర్వాత బీడీఎస్, పారామెడికల్, అగ్రికల్చర్, హోమియోపతి తదితర కోర్సుల్లో కూడా చేరొచ్చు. లేదంటే వినూత్న కాంబినేషన్లతో డిగ్రీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తినిబట్టి వాటిలో చేరొచ్చు. ఆసక్తి ప్రధానం పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అంటే విద్యార్థులు తమ విద్యా జీవితంలో ఒక భాగాన్ని పూర్తిచేశారు. దీని తర్వాత మరో రెండు దశలుంటాయి. అవి.. ఇంటర్ విద్య; ప్రొఫెషనల్ కోర్సు లేదా డిగ్రీ కోర్సు. ఇంటర్మీడియెట్ విద్య.. విద్యార్థి భావి జీవితాన్ని నిర్దేశించే దశ. ఇందులో ఎంపిక చేసుకునే గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. 9, 10వ తరగతులలో ఉన్నప్పుడు విద్యార్థులు తాము ఎక్కువగా ఏ సబ్జెక్టులను ఇష్టపడేవారో చూసుకోవాలి. ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్‌లపై ఆసక్తి కనబరిచారా? లేదంటే జీవరసాయన శాస్త్రాలపై అభిరుచి కనబరిచారా? విశ్లేషించుకోవాలి. వీటి ఆధారంగానే ఇంటర్లో గ్రూపును ఎంపిక చేసుకోవాలి. గ్రూపు ఎంపిక విషయంలో తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ పిల్లల స్వీయ అభిరుచికి అనుగుణంగా మార్గనిర్దేశనం చేయాలి. లేదంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. ఒక ప్రణాళిక ప్రకారం, నిజాయితీగా కష్టపడితే ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఏ గ్రూప్‌లో చేరినా, భవిష్యత్తులో పుష్కలంగా par అవకాశాలున్నాయి.ఙ- ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ. సీఈసీ, ఎంఈసీ: సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాల అభ్యాసంపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. అంతేకాకుండా ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కామర్స్‌లో నైపుణ్యాలు పొందిన వారికోసం అన్వేషణ సాగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన కోర్సులు సీఈసీ, ఎంఈసీ అని చెప్పొచ్చు. అరతేకాకుండా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే. ఈ గ్రూప్‌లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు అత్యంత ఆవశ్యకంగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం సహనం కోల్పోయినా నిర్దిష్ట అంశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి. ఇక సీఈసీ, ఎంఈసీ తర్వాత చాలా మంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు. హెచ్ఈసీ: హెచ్ఈసీ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. అంతేకాకుండా సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటు చేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్న వారికి ఎంతో చక్కని గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నతవిద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాయం చేసుకుని ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్ఈసీ తర్వాత అనేక అవకాశాలున్నాయి. ఒకప్పుడు హెచ్ఈసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, సోషల్ వర్క్ తదితర వృత్తి విద్య స్పెషలైజేషన్లు) అందుబాటులోకి వచ్చాయి. సైన్స్ గ్రూప్‌లకు పోటీగా.. ఎంఈసీ, సీఈసీ గ్రూపులను హ్యుమానిటీస్ గ్రూపులని కూడా అంటారు. సైన్స్ గ్రూప్‌ల స్థాయికి ఏమాత్రం తగ్గని గ్రూపులివి. వ్యాపార, వాణిజ్య రంగాలలో (బ్యాంకు, బీమా..) ఉజ్వల భవిష్యత్తుకు ఇవి దారిచూపుతాయి. చార్టర్డ్ అకౌంటెంట్లుగా, ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ వంటి ఉన్నత స్థాయి కొలువులు అందుకునేందుకు ఎంఈసీ, సీఈసీ గ్రూపులను వేదికలుగా చేసుకోవచ్చు. ఏపీఆర్జేసీ ఆశ్రమ తరహాలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. విద్యార్థులను ఉన్నత శిఖరాల దిశగా నడిపించే వేదికలు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ముఖ్యంగా గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారికి తోడ్పాటునందించేందుకు ఏర్పాటైన ఈ కళాశాలలను ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ నిర్వహిస్తోంది. వీటిలో ప్రవేశానికి ఏటా ఏపీఆర్జేసీ సెట్ జరుగుతుంది. పదో తరగతి తర్వాత ఇందులో మంచి ర్యాంకు సాధించి రెసిడెన్షియల్ కాలేజీలలో చేరొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,465 సీట్లున్నాయి. ఆఫర్ చేస్తున్న గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. వొకేషనల్ కోర్సులు: ఈఈటీ, సీజీడీటీ (కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీ మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తుంది). ప్రవేశాలు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీఆర్జేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఎంచుకున్న గ్రూపును బట్టి మూడు సబ్జెక్ట్‌లలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. అంతా ఆహ్లాదకరం: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నాణ్యమైన లేబొరేటరీలు, చక్కటి లైబ్రరీలు, విశాలమైన రీడింగ్ రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అన్ని వసతులతో కూడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ మాదిరి పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సరైన వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ కళాశాలలు (5), కో-ఎడ్యుకేషన్ కళాశాలలు (2), మహిళా కళాశాలలు (3), బాలుర కళాశాలలు(5), కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్.. మొత్తం 15 కళాశాలల్లో 1,465 సీట్లకు ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ నిర్వహించనున్నాం. ఈ కళాశాలల్లో విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. కళాశాలల్లో విద్యార్థుల చదువుతో పాటు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. - పి.జగన్మోహన్ రెడ్డి, కన్వీనర్, ఏపీఆర్జేసీ సెట్-2014. వొకేషనల్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ.. సాధారణంగా ఇంటర్మీడియెట్ అంటే విద్యార్థులకు టక్కున గుర్తొచ్చే గ్రూపులివే. వీటితోపాటు అనేక ఇతర గ్రూపులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో వొకేషనల్ గ్రూపులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్మీడియెట్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. కానీ ఈ వొకేషనల్ కోర్సులను అందించే కళాశాలల సంఖ్య పరిమితంగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమకు అనుకూలమైన వొకేషనల్ గ్రూప్, దాన్ని అందించే కళాశాలలను అన్వేషించాలి. ఈ వొకేషనల్ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రాక్టికల్ అప్రోచ్, క్షేత్రస్థాయిలో పనిచేసే సన్నద్ధత అవసరం. - కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు.. అత్యధిక మందికి జీవనాధారాలు! పొలాన సిరుల పంట పండి, అన్నదాత ఆనందంగా ఉండాలన్నా, అందరికీ ఆహార భద్రత లభించాలన్నా మెరుగైన సాగు పద్ధతులు అవలంబించాలి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చేరువ కావాలి! దీన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వివిధ పథకాలకు జీవం పోశాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఒంటబట్టించుకునే వ్యవసాయ నిపుణులకు డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లు వ్యవసాయ కోర్సులూ యువతకు దగ్గరవుతున్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌లు: గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోనూ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. ఇవి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొ మా ఇన్ సీడ్ టెక్నాలజీ,అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా (2013-14) సీట్ల వివరాలు.. కోర్సు {పభుత్వ {పైవేటు అగ్రికల్చర్ 700 1,010 సీడ్ టెక్నాలజీ 85 150 ఇంజనీరింగ్ 90 2,400 డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. అర్హత, ప్రవేశాలు: పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.కరిక్యులంలో సేద్య విజ్ఞాన శాస్త్ర అంశాలు, నేల సారం, చీడపీడలు-వాటి యాజమాన్యం, వ్యవసాయ శక్తివనరులు, యంత్ర పరికరాల వాడకం, సాగు పద్ధతులు తదితర అంశాలుంటాయి. అవకాశాలు: దేశంలో ఆహార భద్రత సవాలుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని బాగా పెంచాల్సి న అవసరం ఏర్పడింది. దీంతో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను నేర్చుకునే వారికి కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయ క్షేత్రాలు,టీ గార్డెన్లు, రబ్బర్ ప్లాంటేషన్లలోనూ అవకాశాలుంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. వేతనాలు: ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది. అనుభవం, తగిన అర్హతలుంటే రూ.30 వేల వరకు ఆర్జించవచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందుబాటులో ఉన్న మరో మార్గం పాలిటెక్నిక్ కోర్సులు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు రాచబాటలు వేస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి. అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. కోర్సులు: రాష్ట్రంలో ఏయూ రీజియన్, ఓయూ రీజియన్, ఎస్వీయూ రీజియన్లలో కలిిపి దాదాపు 500 వరకు పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అపై్లడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ), కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్; పెట్రో కెమికల్స్; ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ. కెరీర్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు. వేతనాలు: చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. కోర్సులు- ఉపాధి వేదికలు: సివిల్ ఇంజనీరింగ్: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వే లు, సర్వే, వాటర్ సపై్ల తదితరాలతో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలుంటాయి. కాం ట్రాక్టర్లుగా, డ్రాఫ్ట్‌మెన్‌గా స్వయం ఉపాధి పొందొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్: మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్‌తో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. యాన్సిలరీ యూనిట్లు, సేల్స్ ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. ఎలక్ట్రిక్ టెక్నీషియన్లు, వైండర్లుగా స్వయం ఉపాధిని పొందొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ తదితరాల్లో అవకాశాలు. సేల్స్, సర్వీసెస్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి వాటితో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి. కంప్యూటర్ సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో స్వయం ఉపాధిని పొందొచ్చు. డిప్లొమాలు.. అవకాశాలకు వారధులు పాలిటెక్నిక్ కోర్సులు మధ్య తరగతి విద్యార్థులకు వరం. ఈ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల బయట పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతున్నాయి. డిప్లొమా కోర్సులు యువతకు విస్తృత ఉపాధి అవకాశాలకు వారధులుగా నిలుస్తున్నాయి. ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి. ఉదాహరణకు వారి వారి బ్రాంచ్‌లను బట్టి రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. ఉన్నత విద్యపరంగా అవకాశాలు చూస్తే ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీఈ/ బీటెక్ కోర్సుల్లో రెండో సంవత్సరంలో par చేరొచ్చు.ఙ- కె.రాములు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాద్. ఐటీఐ/ఐటీసీ మేలిమి వృత్తి నైపుణ్యాలున్న మానవ వనరులు.. దేశ ఆర్థికాభివృద్ధికి అసలుసిసలైన సారథులు! ఆర్థిక పురోగతిని పరుగులుపెట్టించడంలో కీలకమైన పారిశ్రామిక రంగానికి నైపుణ్యాలున్న శ్రామిక శక్తి ఎంతో అవసరం. ఇలాంటి శక్తిని అందించే ఇంజిన్లు ఐటీఐలు! తొలుత దేశంలో పారిశ్రామికీకరణకు ఊపిరిలూదే క్రమంలో పుట్టిన ఇవి నేడు యువతకు ఉపాధి చూపడంలోనూ, పరిశ్రమల అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉపాధికి నిచ్చెనలు: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. పదో తరగతి తర్వాత వీటిలో చేరి, తక్కువ ఖర్చుతో వివిధ విభాగాల్లో శిక్షణ పొందొచ్చు. అనంతరం చిన్న వయసులోనే ఉపాధిని సొంతం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 800కుపైగా ఐటీఐ/ఐటీసీలు ఉన్నాయి. అర్హత: ఐటీఐ/ఐటీసీలలో అందుబాటులో ఉన్న చాలా ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు. జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎంపిక కమిటీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అభ్యర్థులు తమకు అనువైన వాటిలో చేరవచ్చు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, పెయింటర్, బుక్ బైండింగ్, కటింగ్ అండ్ స్యూయింగ్ తదితర కోర్సులున్నాయి. కెరీర్: కోర్సులు పూర్తిచేసిన తర్వాత మెరిట్ ప్రాతిపదికన అప్రెంటీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థి వేతనం (స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు వెలువడుతుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు. తర్వాత అనుభవం ద్వారా రూ.20 వేల వరకు సంపాదించవచ్చు. బహుముఖ నైపుణ్యాలు.. అపార అవకాశాలు ‘‘ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ వంటి సంప్రదాయ ట్రేడ్లతో ప్రారంభమైన ఐటీఐలు నేడు ఆధునికతను సంతరించుకొని ఎన్నో నిత్యనూతన కోర్సులను అందిస్తున్నాయి. ఐటీఐలలో చేరి, బహుముఖ వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకున్న యువతకు 20 ఏళ్ల లోపే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఓ చిన్న వర్క్‌షాప్ నుంచి ఆర్ఐఎన్ఎల్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) వంటి పెద్ద సంస్థల వరకు ఐటీఐలలో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలకు వేదికలవుతున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిశ్రమలు నడుస్తున్నాయి కాబట్టి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేందుకు ఐటీఐలు కృషిచేస్తున్నాయి’’. - వి.పరమేశ్వరరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయనగరం. స్వయం ఉపాధికి ఎదురుండదు నైపుణ్యాలను అలవరచుకోవాలన్న తపన, కష్టపడి పనిచేసే తత్వం.. ఐటీఐ చదవాలనుకునే విద్యార్థులకు అవసరం. ఐటీఐలో థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ప్రాధాన్యత ఉంటుంది. ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) చేసిన వారికి ఆర్ అండ్ బీలో సివిల్ వర్క్స్, ల్యాండ్ సర్వేయర్లుగా; డీజిల్ మెకానిక్ చేసిన వారికి రైల్వే, ఆర్టీసీ, డాక్‌యార్డ్‌ల వంటి వాటిలో అవకాశాలు లభిస్తాయి. ఇలా మిగిలిన వారికి ఆయా ట్రేడ్లను బట్టి ఉపాధి లభిస్తుంది. ఐటీఐలో కోర్సులు పూర్తిచేసిన వారికి స్వయం ఉపాధికి కూడా ఢోకా ఉండదు. కోర్సు పూర్తయ్యాక అప్రంటీస్‌కు వెళ్లొచ్చు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు అప్రంటీస్‌లో ప్రతిభ చూపిన వారికి పూర్తిస్థాయి ఉద్యోగాలు par ఇస్తున్నాయి.ఙ- వై.శివరామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ. -
జూనియర్ కళాశాలల్లో అటకెక్కిన ప్రయోగాలు
సాక్షి, అనంతపురం : గుడిబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో 63 మంది, సెకండియర్‌లో 44 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలలో ప్రయోగశాల (ల్యాబ్) లేదు. దీంతో సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బైపీసీ ఫస్టియర్‌లో 15 మంది, సెకండియర్‌లో 16, ఎంపీసీ ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 19 మంది చదువుతున్నారు. వీరు ప్రయోగాల కోసం ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు కళాశాలల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉండడంతో సైన్స్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే సీబీఎస్ఈ తరహాలో ఇంటర్లో ప్రవేశపెట్టిన కొత్త సిలబస్‌తో సైన్స్ విద్యార్థులు భయపడుతున్నారు. దీనికితోడు కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు కరువవడం, ఉన్నచోట కూడా అరకొర పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రయోగశాలల అభివృద్ధి, నిర్వహణకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు లేకపోవడంతో అధ్యాపకులు సైతం చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (రెండు వొకేషనల్ కళాశాలలతో కలుపుకుని) ఉన్నాయి. వీటిలో ఫస్టియర్ విద్యార్థులు (అన్ని గ్రూపులు కలుపుకుని) 10,333, సెకండియర్ 11,124 మంది ఉన్నారు. ఫస్టియర్, సెకండియర్ కలుపుకుని సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) గ్రూపుల విద్యార్థులు 4,876 మంది చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. రెండున్నర నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పుడు అన్ని కళాశాలల్లోనూ విద్యార్థులతో ప్రయోగాలు చేయించాల్సి ఉంది. గుత్తి, ముదిగుబ్బ, రొద్దం, రామగిరి, గుడిబండ కళాశాలల్లో అసలు ప్రయోగశాలలే లేవు. మిగిలిన చోట్ల ఉన్నా.. పరికరాలు, రసాయనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 కళాశాలలకు గానూ (రెండు వొకేషనల్ మినహాయించి) 17 కళాశాలలకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ నిధులు మంజూరు చేసింది. చిలమత్తూరు, గుంతకల్లు, కదిరి (బాలురు), హిందూపురం (బాలికలు), కళ్యాణదుర్గం, కుందుర్పి, మడకశిర, పామిడి, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ (బాలురు) కళాశాలలకు రూ.2 లక్షల చొప్పున, తాడిమర్రిలో రూ.1.81 లక్షలు, అమరాపురం, కంబదూరు, కణేకల్లు, లేపాక్షి, ఉరవకొండ (బాలికలు) కళాశాలలకు రూ.1.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే.. ట్రెజరీలలో ఇంకా బిల్లులు పాస్ కాలేదు. దీనివల్ల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఇబ్బందిగా మారింది. ఇక మిగిలిన కళాశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనిపించని నూతన పరికరాలు ‘నీట్’ పరీక్ష తెరపైకి రావడంతో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌ను సీబీఎస్ఈ స్థాయిలో మార్పు చేశారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగశాలల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రసాయనశాస్త్రం సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిగ్రీ స్థాయిలోనూ లేని, అధ్యాపకులు సైతం నేర్చుకోవాల్సిన స్థాయిలో ప్రయోగాలు వచ్చి చేరాయి. దీంతో నూతన పరికరాల అవసరం ఏర్పడింది. క్రొమొటోగ్రఫీ, కొలాయిడల్ వంటి ద్రావణాల తయారీకి పదార్థాలు, సామగ్రిని కొత్తగా కొనాల్సి వుంది. విద్యార్థుల రెగ్యులర్ ప్రాక్టికల్స్ వల్ల రసాయనాలు అయిపోతుంటాయి. వీటిని ఏటా కొనాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్క రసాయశాస్త్ర ప్రయోగశాలకే రూ.20 వేలకు పైగా ఖర్చు వస్తుంది. బ్యారెట్లు, పిపెట్స్, పరీక్ష నాళికలు.. ఇలా గాజు వస్తువులు పగిలిపోతుంటాయి. వాటినీ కొనకతప్పదు. భౌతిక శాస్త్రం విషయానికొస్తే... సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగాలూ మారాయి. ట్రాన్సిస్టర్, స్ప్రింగ్ బలస్థిరాంకం.. ఇలా కొత్త పరికరాలను కొనాల్సి ఉంది. బాటనీ, జువాలజీ ల్యాబుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నిధులు మంజూరైన కళాశాలలకు బిల్లులు పాస్ చేయడానికి ట్రెజరీల్లో కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంజూరు కానీ వాటిలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తం వెచ్చించి పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసుకోవాలంటూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఆదేశాలందాయి. అయితే ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు, రసాయనాలు కొనాలంటే ఒక్కో కళాశాలకు రూ.50 -60 వేల వరకు అవసరం అవుతోంది.