పోచమ్మమైదాన్ : ఎట్టకేలకు ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఎంపీసీ పాస్ అయి ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోసం గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అధికారులు జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 15, 19 తేదీలలో సెలవు ఉంటుంది.
ఎస్టీ విద్యార్థులు అన్ని ర్యాంక్‌ల వారు వ రంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హె ల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు జరు కా వాలి. సర్టిఫికెట్ల పరిశీలన కోసం మూడు హెల్ప్‌లైన్ సెంటర్‌లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెబ్ అప్షన్‌కు తేదీలను ప్రకటించాల్సి ఉంది.
ఈ సర్టిఫికెట్లు తీసుకురండి....
పదవ తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు
4వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, టీసీ
బీసీ, ఓసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు అయితే
రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండీక్యాప్, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు హైదారాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్ జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి.
నేటి నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
Published Thu, Aug 14 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement