
‘ఫాస్టింగ్ మోడ్’ ఫీచర్‌ను ప్రారంభించిన స్విగ్గీ
రంజాన్, నవరాత్రి వంటి ఉపవాస సమయాల్లో
నో ఫుడ్ నోటిఫికేషన్స్, ఉపవాసాల్లో నో నోటిఫికేషన్స్..
ప్రస్తుత రంజాన్ మాసంతో పాటు నవరాత్రి వంటి ఇతర ఉపవాస సమయాల్లో కస్టమర్లను నోటిఫికేషన్లతో ఇబ్బంది పెట్టకుండా ‘ఫాస్టింగ్ మోడ్’ అనే వినూత్న ఎంపికను ‘స్విగ్గీ’ ప్రారంభించింది. ఇది ఉపవాస సమయాల్లో వినియోగదారులు ఫుడ్ డెలివరీ నోటిఫికేషన్‌లను పాజ్ చేయడానికి అనుమతించే సరికొత్త ఫీచర్. ఈ ఫీచర్ ఉపవాస సమయాల్లో జోక్యం చేసుకోదు. వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రం ఈ వేదిక సిద్ధంగా ఉంచుతుంది. వినియోగదారులు యాప్ నుంచి ఈ సెట్టింగ్‌ను సులభంగా ప్రారంభించ వచ్చు.
అవసరం లేని సమయంలో నిలిపివేయవచ్చు. వినియోగదారులు స్విగ్గీ యాప్ నుండి ఎప్పుడైనా ఫాస్టింగ్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాక్టివేట్ చేసిన తర్వాత.. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండే వినియోగదారులు అందరికీ సహర్ (తెల్లవారుజామున), సాయంత్రం 4 గంటల మధ్య ఫుడ్ నోటిఫికేషన్‌లు పాజ్ చేయబడతాయి. వినియోగదారుల ఉపవాస సమయం పూర్తయిన తరువాత నోటిఫికేషన్‌లు తిరిగి ప్రారంభమవుతాయి. మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్విగ్గీ ఆహార పదార్థాలపై 50 శాతం వరకూ తగ్గింపుతో రుచికరమైన వంటకాలు, ప్రత్యేక రంజాన్ భోజనాలను అందిస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ ఫీచర్‌ను సంస్థ సృజనాత్మక భాగస్వామి టాలెంటెడ్ రూపొందించింది.

రోబోఆల్–ఇన్–వన్ కిచెన్
వండర్‌చెఫ్‌లోపద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్
దక్షిణ భారత్‌లో వండర్‌చెఫ్ ఔట్‌లెట్లను రెట్టింపు చేస్తామని పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు. కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్‌లో వండర్‌చెఫ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణాది మార్కెట్లో వంట గది వినూత్న పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వండర్‌చెఫ్ బ్రాండ్ ఔట్‌లెట్లను రెట్టింపు చేస్తామని, ఇందులో హైదరాబాద్ మార్కెట్ ముఖ్యమైందని తెలిపారు. వండర్ చెఫ్ వినూత్న ఆవిష్కరణలతో హోమ్ చెఫ్‌లు ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసుకునేందుకు వీలుంటుందన్నారు. అధునాతన మౌల్డింగ్ టెక్నాలజీలో కాస్ట్ ఐరన్ వంట సామగ్రి ‘ఫెర్రో’ని ప్రవేశపెట్టింది. కత్తిరించడం, ఆవిరి చేయడం, సాటింగ్, కలపడం, బ్లెండింగ్ చేసేందుకు ఆల్–ఇన్–వన్ కిచెన్ రోబోలా పనిచేస్తుంది. చెఫ్ సంజీవ్ కపూర్ స్వయంగా క్యురేట్ చేసిన 370కి పైగా వంటకాలతో కూడిన గైడ్ సహాయంతో స్క్రీన్లపై చూస్తూ హోమ్ చెఫ్‌లు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment