new update
-
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్‌లో పరిస్థితి ఏంటి? భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్‌డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్‌ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్‌కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్‌లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్‌కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్‌ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్‌తో సంబంధం లేకుండానే బ్లాస్ట్‌పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్‌పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
టయోటా ప్లాంట్ మూసివేత మరి వాళ్ళ పరిస్థితి ఏంటి
-
ఆదిపురుష్ తుఫాన్ అదుర్స్ గెట్ రెడీ ఫర్ సలార్ సునామి
-
500 ఎయిర్ బస్ విమానాలకు ఇండిగో ఆర్డర్
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
-
చిరంజీవి కొత్త కోడలు శ్రీలీల
-
ముల్లోక వీరుడిగా చిరంజీవి?
-
ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం
న్యూఢిల్లీ: WWDC 2023లో టెక్ దిగ్గజం యాపిల్‌కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 17 లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను ప్రకటించింది. దీంతోపాటు 16 ఆపరేటింగ్ సిస్టంపై మరిన్ని అప్డేట్స్ ప్రకటించింది. లేటెస్ట్ iOS సాఫ్ట్వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది. ఐవోఎస్ 17 అందుబాటులో ఉండే ఐఫోన్ల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ ను తొలగించింది. సంస్థ ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం యాపిల్ ఎక్స్ఎస్, తరువాత మోడల్స్‌ను దీనికి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఐవోఎస్ 17 అప్డేట్ లేని ఐఫోన్లలో క్రిటికల్ లోపాన్ని సవరించేందుకు స్పెషల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇది ప్రస్తుతం డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులకు అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వెర్షన్ వచ్చే నెలలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ కానుందని అంచనా. IOS 17 సపోర్ట్‌తో యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా పరిచయం చేసింది. ఐవోఎస్ 17 అప్డేట్ను పొందని ఐఫోన్లు ఐఫోన్ X iPhone 8 ఐఫోన్ 8 ప్లస్ iPhone SE ఫస్ట్ జెన్ -
TSPSC కేసులో కొత్త కోణం
-
వాట్సాప్ అప్డేట్: ఫొటోలు, వీడియోలకు సంబంధించిన సరికొత్త ఫీచర్!
ఆసక్తికరమైన మరో కొత్త అప్డేట్పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు వివరణను జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు వివరణలను జోడించేందుకు వీలు కల్పిస్తోంది. (Isha Ambani: లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!) అయితే స్టేటస్ అప్డేట్లను వీక్షించడం, వీడియోలను డౌన్లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తదుపరి అప్డేట్తో ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) వాట్సాప్ తాజా అప్డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది. ఇలా సొంత వివరణతో ఫార్వార్డ్ చేసినప్పుడు అది అసలైనది కాదని మాత్రం గ్రహీతలకు తెలిసిపోతుంది. ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు దాని ప్రయోజనం గురించి మరింత బాగా తెలుస్తుంది. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు సందర్భం, ఇతర వివరాలను జోడించడం ద్వారా గ్రహీతలు వాటి గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) -
ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ యూజర్ల కోసం ఐవోఎస్ iOS 16.4 అప్డేట్ను విడుదల చేసింది. తాజా అప్డేట్లో కొత్త ఎమోటికాన్‌ల (ఎమోజీ) సెట్, ఆడియో సపరేషన్, వెబ్సైట్ పుష్ అలర్ట్‌లు వంటి విభిన్న ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ అప్డేట్లో iPadOS 16.4, tvOS 16.4, macOS వెంచురా 13.3 కూడా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే!) కొత్త iOS అప్డేట్లో హ్యాండ్ గెశ్చర్స్, పింక్ హార్ట్, జెల్లీ ఫిష్, Wi-Fi చిహ్నంతో సహా మొత్తం 21 కొత్త ఎమోజీ చిహ్నాలు ఉన్నాయి. ఫోటోలకు సంబంధించి మరో ఫీచర్ కూడా ఈ అప్డేట్లో ఉంది. దీని ద్వారా iCloud షేర్ ఫోటో లైబ్రరీలలో డూప్లికేట్ ఫోటోలు, వీడియోలను తీసివేయవచ్చు. సోనీ ప్లేస్టేషన్ 5 డ్యూయల్‌సెన్స్ ఎడ్జ్ కంట్రోలర్‌కు ఇన్‌బిల్ట్ సపోర్ట్‌తో పాటు ఐఫోన్ 14 సిరీస్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్‌కు కొత్త అప్డేట్లో మెరుగుదల చేశారు. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) iOS 16.4లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే.. యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల ద్వారా ఫ్లాష్ లేదా లైట్‌ను గుర్తించినప్పుడు వీడియో ఆటోమేటిక్‌గా డిమ్ అవుతుంది. జంతువులు, హ్యాండ్ గెశ్చర్స్, ఆబ్జెక్ట్స్ వంటి 21 కొత్త ఎమోజీలు యాడ్ అయ్యాయి. వీటిని ఎమోజీ కీబోర్డ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీలో డూప్లికేట్ ఫోటోలు, వీడియోలను గుర్తించవచ్చు. వాయిస్ ఐసోలేషన్‌తో మెరుగైన వాయిస్ కాల్ నాణ్యత, ఇది యూజర్ వాయిస్‌కు ప్రాధాన్యతనిచ్చి ఎక్స్టర్నల్ వాయిస్‌ను నిరోధిస్తుంది. వాతావరణ యాప్ ద్వారా మ్యాప్‌ల కోసం వాయిస్ ఓవర్ సపోర్ట్ ఉంటుంది. వెబ్ యాప్ నోటిఫికేషన్లను హోమ్ స్క్రీన్‌కి జోడించవచ్చు. -
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
సాధారణంగా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే మనకి మొదట గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు ఏ ప్రాంతానికైనా ఈజీగా వెళ్లచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడే ఓ చిక్కు కూడా ఉంది. ఈ యాప్ గమ్యాన్ని చూపించే క్రమంలో ఒక్కో సారి మనం వెళ్లాల్సిన ప్రదేశం పక్కనే ఉన్న చుట్టూ తిరిగేలా చేస్తుంది. దీని వల్ల వాహనదారులు సమయం వృథా కావడంతో పాటు ఇంధనపు ఖర్చు కూడా ఎక్కవగానే అవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ సమస్యను అధిగమించేలా సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఎకో ఫ్రెండ్లీ రూట్ పేరుతో వినియోగదారుడు వెళ్లాల్సిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం అయ్యేలా చూస్తుంది. దీని వల్ల మన సమయం, పెట్రోల్ తద్వారా మన ఖర్చు కూడా ఆదా అవుతుంది. "ఎకో-ఫ్రెండ్లీ రూట్" ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫీచర్ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ చెప్పింది. ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
త్వరలో వాట్సప్‌లోకి కొత్త అప్డేట్.. చూస్తే వావ్ అంటారండోయ్!
ప్రస్తుత రోజుల్లో చాటింగ్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు వాట్సప్. యువతను అంతలా ఆకట్టుకుంది. అందుకే వాట్సప్ యాజమాన్యం కూడా మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు ఇందులో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకర్షించేలా అప్డేట్స్ని ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటివాటిని తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ స్టేటస్ అప్డేట్లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. వావ్ అనేలా కొత్త అప్డేట్ వాట్సప్ స్టేటస్‌లో ఇప్పటివరకు వీడియోలు, ఫోటోలు లేదా మనకి నచ్చని టెక్ట్స్.. వీటి వరకు స్టేటస్‌గా పెట్టుకుంటున్నాం. అయితే వాట్సప్ డెవలప్మెంటీ టీం ఈ ఆప్షన్‌కి అదనపు ఫీచర్‌ను జత చేయనున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచరుతో తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్, ఏదైనా వాయిస్ నోట్స్‌ను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం వాట్సప్‌లో స్టేటస్ బార్ని క్లిక్ చేస్తే కెమెరా, టెక్స్ట్ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే త్వరలో ఈ ఆప్షన్లకి అదనంగా ఆడియో స్టేటస్ పెట్టుకునేందుకు వీలుగా మైక్ సింబల్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. ఈ మేరకు వాట్సప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. చదవండి: డోలో-650 తయారీ సంస్థ అక్రమాలు.. బయటపడ్డ సంచలన విషయాలు! -
కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.2.. స్పందించిన డబ్ల్యూహెచ్ఓ
లండన్: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. మరొవైపు ఒమిక్రాన్ కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక కొత్త వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు. కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఏ.1, బీఏ.1.1 వేరియంట్లను గుర్తించామని, గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్‌కి 96 శాతం.. ఓమిక్రాన్ వేరియంట్‌ను పోలి ఉందని పరిశోధకులు వెల్లడించారు. బీఏ.2 వేరియంట్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో పరిశోధకుల్లో ఒకరైన వాన్ కెర్ఖోవ్ బీఏ.2 వేరియంట్‌పై స్పందిచారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్ కెర్ఖోవ్ చెప్పుకొచ్చారు. చదవండిః సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు? -
అమ్మాయిలూ.. అది ఉత్సాహం కాదు సెక్స్ అప్పీల్!
కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్ ఎమోజీ డే. స్మార్ట్ ఫోన్లలో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్డేట్స్లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్ సింబల్‌ను కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్ సింబల్స్. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం. డ్యాన్సింగ్ ట్విన్స్ విత్ హార్న్స్ ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్ అప్పీల్’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్ కాన్సెప్ట్‌లో ఫిక్షన్ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. ప్లీడింగ్ ఫేస్ ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్ ఐస్ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్ చేశావ్’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. షూటింగ్స్టార్ మ్యాజిక్ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. ది పూప్ ఎమోజీ సింబల్ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్ చేసి చూడడండి. ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్ అవుట్ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్ జెర్మీ బర్గ్(37).. 2014 జులై 17న వరల్డ్ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అప్డేట్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్ : మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అప్డేట్ సమయం వచ్చింది అంటూ ఊరించిన యూనిట్ చివరకు మేకింగ్ వీడియోను తీసుకొచ్చింది. అంతేకాదు అక్టోబరు 22న "రామరాజు ఫర్ భీమ్'' కోసం ఎదురుచూడమని చిత్ర బృందం వెల్లడించింది. తద్వారా అభిమానుల ఎదురు చూపులకు తెరదించినా మరో ఉత్కంఠకు తెరతీసింది. అక్టోబరు 22 రామ్ చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది. తెలుగు సహా అన్ని బాషల అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఏడు నెలల విరామం తరువాత హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ మళ్లీ ప్రారంభించింది. ఈ సందర్బంగా యూనిట్ బృందాన్ని మాదాపూర్‌లోని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన హోటల్లో ఉంచినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు బయటి వ్యక్తులను కలిసేందుకు అనుమతి లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సెట్లో ఒక వైద్య బృందం అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయిట. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియోని ఇంతకుముందే రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజున ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటూ ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలియా భట్, అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 2022 జనవరిలో విడుదల కానుందని అంచనా. Lovely to be back on the sets of #RRR! My dear brother @tarak9999, something that was long overdue is getting ready and as promised I am gonna give you the best, this 22nd Oct. https://t.co/yQ2mP1vA4W@ssrajamouli #RamarajuforBheemOnOct22 #WeRRRBack — Ram Charan (@AlwaysRamCharan) October 6, 2020 -
గూగుల్ మ్యాప్స్ పుట్టిన రోజు : కొత్త అప్డేట్స్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన యాప్‌లలో ప్రధాన యాప్ గూగుల్ మ్యాప్‌ను కొత్త లోగో, కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. గూగుల్ మ్యాప్ 15 వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం నుంచి ఈ కీలక మార్పులు చేసింది. గూగుల్ మ్యాప్స్ 15 ఏళ్లు మైలురాయిని అధిగమించిన సందర్భంగా కలర్‌ఫుల్ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూజర్ల సౌలభ్యం కోసం తాజాగా అయిదు కొత్త సదుపాయాలను పరిచయం చేసింది. యాప్ అడుగుభాగంలో ఎక్స్ప్లోర్, కమ్యూట్, సేవ్డ్, కంట్రిబ్యూట్, అప్డేట్స్ (అన్వేషించండి, ప్రయాణించండి, సేవ్ చేయండి, సహకరించండి, నవీకరణ) అనే ఐదు ట్యాబ్స్ ను కొత్తగా జోడించింది. దీంతో ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ లో అంతర్గతంగా ఉన్న సదుపాయాలన్నీ ఈ ఐదు ట్యాబ్స్‌లో ఇక మీదట సులభంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అన్వేషించండి: సమీప రెస్టారెంట్లు, ముఖ్య ప్రదేశాలు, సమీక్షలు , అలాగే సమీక్షలను వ్రాయడానికి, ఫోటోలను అప్లోడ్ చేయడానికి, ఇతర సిఫార్సులను అనుమతినిస్తుంది. కమ్యూట్ : ఒక ప్రదేశానికి దిశలను ఇస్తుంది, ప్రయాణ సమయ అంచనాలు, ట్రాఫిక్ హెచ్చరికలను అందిస్తుంది ఎప్పటిలాగానే. సేవ్డ్ : సులభంగా సెర్చ్ చేసేందుకు వీలుగా ఇప్పటివరకు వినియోగదారులు సేవ్ చేసిన హోం, ఆఫీస్, నచ్చిన రెస్టారెంట్లు, తదితర వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. అలాగే గతంలో ఎక్కడెక్కడ తిరిగారో అన్ని వివరాలు చూపించే టైం లైన్ ఆప్షన్ కూడా దీంట్లోనే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే లొకేషన్ హిస్టరీ డిజేబుల్ చేసుకోవచ్చు. కంట్రిబ్యూట్: ఎప్పటికప్పుడు వెళ్లే ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు, ఆయా రెస్టారెంట్లు ఇతర స్థలాల గురించి రివ్యూలను ప్రపంచంతో షేర్ చేసుకునే అవకాశం. అలాగే ఇప్పటికే ఉన్న ప్రదేశాలకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సూచించవచ్చు. అప్డేట్స్ : ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అన్ని ప్రదేశాలకు సంబంధించిన రికమండేషన్లు, స్థానిక నిపుణులు, వివిధ వ్యాపార సంస్థల మెసేజ్‌ల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి..అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణం గురించి ప్రయాణం ముగిసిన వెంటనే మరింత సమాచారం ఇచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లను ఇక మీదట ప్రోత్సహిస్తుంది. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతుంది. మీరు ఈ టాబ్ ద్వారా నేరుగా మ్యాప్స్‌లోని ఇతర వ్యాపారాలతో కూడా సంభాషించవచ్చు. వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇక మీదట అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వీల్ ఛెయిర్ వంటి సదుపాయాలు లాంటి వివరాలు లభ్యం. ఇక చివరగా నిర్దిష్ట ప్రాంతాల్లో, మహిళల కోసం కొత్త భద్రతా సమాచారం కూడా ఉంది. ఇందులో సురక్షితమైన రవాణా మార్గాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అక్కడ ఉండే సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది. -
ఫేస్బుక్లో కొత్త అప్డేట్ ‘న్యూస్ ట్యాబ్’
వాషింగ్టన్: ఫేస్బుక్లో ‘న్యూస్ ట్యాబ్’తో కూడిన కొత్త అప్డేట్ శుక్రవారం నుంచి వినయోగదారులకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం తెలిపారు. ఇందులో వినియోగదారులు తమ ఇష్టాలకు అనుగుణమైన వార్తలను పొందే అల్గారిథమ్‌ను ఉపయోగించనున్నారు. ఫేస్బుక్లో వస్తున్న అసత్య వార్తల రీత్యా పలు చోట్ల నిరసనలు, ప్రభుత్వాల నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసత్య వార్తలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత్రికేయ వృత్తికి మార్క్ జుకర్‌బర్గ్ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు ఆయన్ను పొగిడారు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 200 వార్తా సంస్థలతో వార్తలు అందించేందుకు ఫేస్బుక్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
వాట్సాప్ కొత్త అప్డేట్...వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఊరట నిస్తూ సరికొత్త అప్డేట్ను తీసుకు రానుంది. యూజర్ల ప్రొఫైల్ చిత్రాలు సేవ్ అవకాశాన్ని తొలగించింది. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్ప్లే పిక్‌లను చేసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బేటా అప్డేట్ను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉందని వాబేటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరోలనే పూర్తిగా అమల్లోకి రానుంది. -
వాట్సాప్‌లో కొత్త అప్డేట్
సాక్షి, ముంబై: ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ తన ఐఓఎస్ బీటా యూజర్లకు కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్లో యూజర్లు తమకు వచ్చిన వీడియో మెసేజ్‌లను నోటిఫికేషన్ బార్లోనే ప్లే చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే ప్రస్తుతానికి బీటా వెర్షన్ 2.18.102.5కు అప్డేట్ అయిన ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కేవలం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఐఓఎస్‌తో పాటు, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌కు కూడా విస్తరిస్తామని కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. ఈ ఫీచర్‌ను వాడటానికి లేదా ఆపివేయడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రివ్యూ మోడ్‌ను ఆఫ్ లేదా ఆన్ చేసుకోవాలి. -
హానర్ 9లైట్: అద్భుతమైన ఫీచర్
సాక్షి, ముంబై: హువాయి సబ్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఆసక్తికరమైన అప్‌గ్రేడ్‌ను అవిష్కరించింది. హోటా (హూవాయ్ ఓవర్ ది ఎయిర్) ద్వారా "రైడ్ మోడ్" ఫీచర్‌తో హానర్ 9 లైట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో విడుదల చేసింది. బైక్ నడిపేటపుడు ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానంగా యువతే టార్గెట్‌గా ఈ ఫీచర్‌ను జోడించింది. తమ సరికొత్త రైడ్ మోడ్ ఫీచర్ లక్షలాది కస్టమర్లకు డ్రైవింగ్ సమయంలో సురక్షితమైన స్మార్ట్‌ఫోన్ వినియోగ బాధ్యతను గుర్తు చేస్తుందని హువాయ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పి. సంజీవ్ వెల్లడించారు. రైడ్ మోడ్ యాక్టివేషన్ హానర్ 9 లైట్ కొత్తగా తీసుకొస్తున్న ఈ రైడ్‌మోడ్ ఫీచర్‌ను మెనూలోంచి డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకుకోవడంద్వారా గాని యాక్టివ్టే చేసుకోవచ్చు. లేదా ఫోన్ సెటింగ్స్‌లో రైడ్‌మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. దీంతో యూజర్ బైక్ రైడింగ్‌లో ఉన్నపుడు ఎవరైనా కాల్ చేస్తే.. వినియోగదారుడు ప్రస్తుతం డ్రైవింగ్‌లో ఉన్నారనీ...కాల్ ఆన్సర్ చేయలేరనే మెసేజ్ కాలర్స్‌కి అందుతుంది. అంతేకాదు ఒక వేళ అత్యవసరమైతే.. 1 నెంబర్ ప్రెస్ చేస్తే..కాల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. ఈ సదుపాయం మార్చి చివరినాటికి తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంజీవ్ చెప్పారు. హానర్ 9 లైట్ ఫీచర్లు 5.65 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో కిరిన్ 659 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటెర్నెల్ మెమొరీ 256 జీబీ ఎక్స్టర్నల్ మెమొరీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 13 ఎంపీ +2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 13 ఎంపీ +2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. అయితే నాలుగు కెమెరాలతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టిన ఆరు నిమిషాల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. -
మ్యూట్‌లో ఆటోప్లే వీడియోలు.. ఎలా?
గూగుల్ తన క్రోమ్ యూజర్లకు బుధవారం సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. కొత్త కొత్త ఫీచర్లతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. కొన్ని వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలకు ఈ అప్డేట్ శాశ్వత పరిష్కారం అందిస్తోంది. క్రోమ్ 64 పేరుతో ఈ అప్డేట్ను ప్రవేశపెట్టింది. ఈ క్రోమ్ 64, వెబ్సైట్లలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునే ఫీచర్ పొందుపరించింది. చాలా వెబ్సైట్లలో కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా.. వీడియోలు కూడా ఆటోప్లే అవుతుంటాయి. అలా ఆ వెబ్సైట్లలలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునేందుకు సంబంధిత వెబ్సైట్ ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ''మ్యూట్ సైట్'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో డీఫాల్ట్‌గానే ఆటోప్లే అయ్యే అన్ని వీడియోలు ఆగిపోతాయని వెర్జ్ రిపోర్టులు పేర్కొన్నాయి. గత నవంబర్లోనే గూగుల్ ఈ సమస్యపై చర్చించి, దీనికి పరిష్కారంగా క్రోమ్ 64ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. వెబ్సైట్లలో వచ్చే పాప్-అప్స్‌ను సమస్యపై కూడా గూగుల్ పరిష్కారం తీసుకొచ్చింది. పాప్-అప్స్ అనేవి మూడో వ్యక్తి కంటెంట్ కలిగి ఉన్న కొత్త పేజీలు. క్రోమ్ 64 వెబ్సైట్లను ప్రభావితం చేసే మెల్ట్‌డౌన్, స్పెక్టర్ భద్రతా లోపాలకు కూడా పరిష్కారం కనుగొంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
► నేడు చండీగఢ్‌లో పర్యటించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దక్షిణ, మధ్య ఆసియాలో శాంతి పరిరక్షణ, కో-ఆపరేటివ్ మెంట్ సదస్సును ప్రారంభించనున్న ప్రణబ్. ► నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్ ►నేడు పోగాకు రైతులకు అండగా టంగుటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష ► నేడు టీడీపీ, జాతీయ, ఏపీ, తెలంగాణలకు కొత్త కమిటీలు, ఈ రోజు కమిటీలను ప్రకటించనున్న పార్టీ అధినేత చంద్రబాబు ► నేడు ప్రజాసంఘాల చలో అసెంబ్లీ.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు ►నేడు రైతు సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు ►నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన