గూగుల్ తన క్రోమ్ యూజర్లకు బుధవారం సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కొత్త కొత్త ఫీచర్లతో ఈ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. కొన్ని వెబ్‌సైట్‌లలో ఆటోప్లే అయ్యే వీడియోలకు ఈ అప్‌డేట్ శాశ్వత పరిష్కారం అందిస్తోంది. క్రోమ్ 64 పేరుతో ఈ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రోమ్ 64, వెబ్‌సైట్‌లలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునే ఫీచర్ పొందుపరించింది. చాలా వెబ్‌సైట్లలో కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా.. వీడియోలు కూడా ఆటోప్లే అవుతుంటాయి.
అలా ఆ వెబ్‌సైట్లలలో ఆటోప్లే అయ్యే వీడియోలను మ్యూట్‌లో పెట్టుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్ ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ''మ్యూట్ సైట్'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో డీఫాల్ట్‌గానే ఆటోప్లే అయ్యే అన్ని వీడియోలు ఆగిపోతాయని వెర్జ్ రిపోర్టులు పేర్కొన్నాయి. గత నవంబర్‌లోనే గూగుల్ ఈ సమస్యపై చర్చించి, దీనికి పరిష్కారంగా క్రోమ్ 64ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌లలో వచ్చే పాప్-అప్స్‌ను సమస్యపై కూడా గూగుల్ పరిష్కారం తీసుకొచ్చింది. పాప్-అప్స్ అనేవి మూడో వ్యక్తి కంటెంట్ కలిగి ఉన్న కొత్త పేజీలు. క్రోమ్ 64 వెబ్‌సైట్లను ప్రభావితం చేసే మెల్ట్డౌన్, స్పెక్టర్ భద్రతా లోపాలకు కూడా పరిష్కారం కనుగొంది.
Comments
Please login to add a commentAdd a comment