ఇంటర్నెట్ ప్రపంచం చాలా విస్తృతమైనది. ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ అనేది మొత్తం ఇంటర్ నెట్ ప్రపంచంలో ఒక శాతమే. అందుకే దీనిని ఒక సముద్రం అనడం మంచిది. దీని ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. కానీ మనం చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనకు ఇంటర్ నెడ్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేని వాటిని చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మేము కొన్ని ట్రిక్స్ అందిస్తున్నాం.(చదవండి: 499కే 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్)
01) ఏ సాఫ్ట్‌వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయండి
Https:// wwwతర్వాత “SS” అనే కీవర్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ఏ సాఫ్ట్‌వేర్ లేకుండా యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వివిధ ఫార్మాట్లలో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వేరే వెబ్ సైట్ కి తీసుకువెళ్తుంది. అక్కడ మీకు నచ్చిన ఫార్మాట్ లో వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02) కోట్స్ ఉపయోగించడం(” “)
మీరు గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేస్తున్నపుడు మీకు అవసరమైన వాటితో పాటు అనవసరమైన వాటిని ఒక్కోసారి గూగుల్ చూపిస్తుంది. మీకు ఖచ్చితమైన పదం కోసం సెర్చ్ చేసేటప్పుడు ఇప్పుడు కోట్స్ (“ ") ఉపయోగించి సెర్చ్ చేయండి. అప్పుడు ఆ పదానికి సంబదించిన వాటిని మాత్రమే చూపిస్తుంది. కీలకపదాలను సెర్చ్ చేసేటప్పుడు దీన్ని ఒకసారి ప్రయత్నించండి.
03) గూగుల్ నుండి నేరుగా mp3ని డౌన్‌లోడ్ చేసుకోండి
మీరు ఏదైనా mp3 ఫార్మాట్ లో పాటని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు చాలా సులభంగా పాటని డౌన్లోడ్ చేసుకోవచ్చు. intitle: index.of? Mp3 తర్వాత మీకు నచ్చిన పాటని టైపు చేసి సెర్చ్ చేయండి.
04) క్రోమ్ లో మూసివేసిన టాబ్‌ను తెరవండి
కొన్నిసార్లు మీరు చాలా ముఖ్యమైన పని చేస్తున్నపుడు అనుకోకుండా మీరు టాబ్‌ను మూసివేసిన లేదా షట్ డౌన్ అయినప్పుడు మనం సమాచారాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఆ సమస్య కోసం చింతించకండి. ఎప్పుడైనా మీ ట్యాబ్ మూసివేసినప్పుడు మీరు కీబోర్డ్ నుండి ఒకేసారి Ctrl + Shift + Tకీని నొక్కి పట్టుకోవడం ద్వారా క్రోమ్ టాబ్‌ను తిరిగి పొందవచ్చు. ఇది ఉత్తమ ఇంటర్నెట్ ట్రిక్ కానప్పటికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
05) గూగుల్ సెర్చ్‌లో డిఫైన్ కీవర్డ్‌ని ఉపయోగించండి
మీరు ఏదైనా ఒక పదం యొక్క నిర్వచనం పొందాలనుకున్నపుడు Ex: Define: Internet ఇలా టైపు చేస్తే మీకు త్వరగా దానికి సంబందించిన నిర్వచనం మీకు లభిస్తుంది.
06) ఇంటర్నెట్‌లో బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్‌లను ఉపయోగించడం
కొన్ని సార్లు మన దేశంలో నిషేదించిన కొన్ని వెబ్‌సైట్‌లను VPN ఉపయోగించి మీ కంప్యూటర్ నుండి చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీ కంప్యూటర్‌లో VPNని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి. దాని తర్వాత అందులో మన దేశానికి సంబందించిన సర్వర్‌ను వేరే దేశానికి సంబందించిన సర్వర్‌ను కనెక్ట్ చేయడం ద్వారా నిషేదించిన వెబ్ సైట్ ని ఉపయోగించవచ్చు
07) ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియోలను చూడండి
మీరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నపుడు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. ఇలా యాడ్స్ రాకుండా యూట్యూబ్ వీడియోలను చూడాలని అనుకుంటే యాడ్‌బ్లాకర్‌ను ఉపయోగించండి. కానీ ఈ యాడ్‌బ్లాకర్ ఉపయోగిస్తుంటే కొన్ని వెబ్‌సైట్‌లను మీరు యాక్సెస్ చేయలేరు.
08) గూగుల్ లో టాస్ వేయండి
మీరు క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు లేదా ఎప్పుడైనా టాస్ వేయాలని అనుకున్నపుడు మీ దగ్గర కాయిన్ లేకపోతె చింతించకండి ఇప్పుడు గూగుల్ లో కూడా మీరు టాస్ వేయవచ్చు ఎటువంటి కాయిన్ లేకుండా దాని కోసం మీరు గూగుల్ సెర్చ్ లో flip a coin టైపు చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది. అలాగే డైస్ కూడా రోల్ చేయవచ్చు.
09) కాలిక్యులేటర్, అజ్ఞాత మోడ్ ఉపయోగించడం
మీ మొబైల్ లో కాలిక్యులేటర్ యాప్ లేకపోతే గూగుల్ శోధనలో కాలిక్యులేటర్‌ను సెర్చ్ చేసి వాడుకోవచ్చు. అలాగే మీరు ఎవరికీ తెలియకుండా, అలాగే మీ హిస్టరీ కూడా రికార్డు చేయకుండా ఉండటానికి ఏదైనా బ్రౌజర్ లో incognito మోడ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా VPNని ఉపయోగిస్తే ఇంకా సురక్షితంగా ఉంటారు. వీటి గురుంచి మీకు తెలిసే ఉంటుంది.
10) స్లో మోషన్‌లో యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడం
యూట్యూబ్ వీడియోను ప్లే చేస్తున్నప్పుడు కీబోర్డ్ నుండి స్పేస్ కీని నొక్కి ఉంచడం ద్వారా మీ యూట్యూబ్ వీడియో స్లో మోషన్‌లో ప్లే అవుతుంది. దీని కోసం మీరు యూట్యూబ్ సెట్టింగ్ నుండి ప్లేబ్యాక్ వేగాన్ని సెట్ చేయవలసిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment