బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి! | 8 Tips to Boost Your Android Phones Battery Life | Sakshi
Sakshi News home page

బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి!

Published Fri, Nov 27 2020 4:49 PM | Last Updated on Fri, Nov 27 2020 5:01 PM

8 Tips to Boost Your Android Phones Battery Life - Sakshi

ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వారికి బ్యాటరీ ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి అత్యవసర సమయాల్లో చార్జింగ్ అయిపోతే మన బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా బ్యాటరీ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది ఫోన్ పనితీరు, జీవితకాలం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాల వరకు మొబైల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం భాగానే ఉన్న.. అదేస్థాయిలో వాడకమూ పెరుగుతోంది. దీంతో సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ డౌన్‌ అయిపోతోంది. అయితే మీరు ఈ చిట్కాలను పాటిస్తే బ్యాటరీ సామర్థ్యం పెరిగే అవకాశం చాల ఎక్కువ. (చదవండి: వివో వై1ఎస్ వచ్చేసింది)

  • మనం కొన్ని అవసరాల కోసం జీపీఎస్‌ ఆన్‌లో ఉంచుతాం. ఓలా, ఉబర్‌, స్విగ్గీ వంటి యాప్స్‌ వినియోగానికి జీపీఎస్‌ ఆన్‌ చేస్తుంటాం. అయితే మనం చాల సార్లు అవసరం లేకున్నా జీపీఎస్‌ ఆన్‌లో ఉంచుతాం. దీనివల్ల మన ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు. బ్యాటరీ తొందరగా అయిపోతుంది అందుకోసమే మనం అవసరం లేని సమయంలో జీపీఎస్‌ను ఆఫ్‌లో ఉంచడం మంచిది. 
  • మన ఫోన్ చాలా సార్లు ఛార్జింగ్ పెట్టి మర్చిపోవడం లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పేలుతుందన్న అపోహ ఉన్నప్పటికీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు చార్జింగ్ పెట్టాక బ్యాటరీకి 100 శాతం ఎక్కితే, చార్జింగ్ ఎక్కకుండా మీ స్మార్ట్ ఫోనే ఆపేస్తుంది. దీనికోసం మీ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ఒక చిప్ ఉంది. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేడెక్కడంతో పాటు ఫోన్ జీవితకాలం తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి ఫోన్ ను ఎక్కువ సేపు చార్జ్ చేయడం ఆపండి. ఎప్పుడు 20 శాతం కన్నా ఎక్కువ మరియు 90 శాతం కన్న తక్కువ ఉండేటట్లు ఉంచుకోండి. 
  • ఫోన్‌ నోటిఫికేషన్‌ బార్‌లో ఉండే ఐకాన్స్‌ ను గమనిస్తూ ఉండండి. బ్లూటూత్‌, వైఫై ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి. అవసరం లేకున్నా ఆన్ చేసి ఉంటే అవి మీ ఫోన్‌ బ్యాటరీని తగ్గిస్తాయి. 
  • మనం చాలా సార్లు వైఫై అందుబాటులో ఉన్నా కూడా మొబైల్ డేటాని వాడటం చేస్తూ ఉంటాం. దీంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. మీకు వైఫై అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడమే మంచి పద్ధతి.
  • మీ మొబైల్ లో 32 డిగ్రీల ఫారన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీలు చార్జింగ్ కావని ఓ పరిశోధనలో తేలింది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చార్జింగ్ పెట్టడం వల్ల యానోడ్ మీద ఉండే లిథియం మీద ప్లేటింగ్ ఏర్పడుతుంది. ఆ ప్లేటింగ్ ను తీసేయడం కూడా కుదరదు. ఇది కూడా మీ బ్యాటరీ జీవితకాలాన్ని తినేస్తుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫోన్ చార్జింగ్ పెట్టకండి.
  • బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ఫోన్‌లో ఉండే పవర్‌ సేవింగ్‌ మోడ్‌లో వాడడం మంచిది. దీనివల్ల ఫోన్‌లో ఉండే సీపీయూ ఎంత మేర అవసరమో అంత మేరకే పనిచేస్తుంది. అక్కర్లేని యాప్స్‌ బ్యాగ్రౌండ్‌లో రన్‌ కాకుండా చూస్తుంది. దీనివల్ల ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించొచ్చు.
  • మన అవసరం లేకున్నా మొబైల్ లో లైవ్ వాల్ పేపర్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల మీ ఫోన్ మీద ఎక్కువ సామర్థ్యం పడటంతో బ్యాటరీ లైఫ్ తక్కువగా వస్తుంది. అలాగే మీ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. అందుకోసమే వీటికి దూరంగా ఉండడం మంచిది.
  • ఫోన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం ద్వారా ఫోన్‌ను మరింత ఎక్కువ సేపు వినియోగించొచ్చు. మీ మొబైల్ ఉండే ఆటో బ్రైట్‌నెస్‌ను ఎంచుకుంటే మంచిది. దీంతో పాటు పోన్‌లో ఉండే డార్క్‌మోడ్‌/నైట్‌ మోడ్‌ ఫీచర్‌ను వినియోగిస్తే మళ్లీ మళ్లీ ఛార్జింగ్‌ పెట్టుకునే బాధ తప్పుతుంది. అలాగే, స్ర్కీన్‌ టైమ్‌ను కూడా వీలైనంత తక్కువగా సెట్‌ చేసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ పెంచుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement