Battery charging
-
స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్‌పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్‌ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కూలింగ్‌తో ఈ–బైక్స్ ఫైరింగ్‌కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్‌తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్‌బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్‌తో ఫైరింగ్‌కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్‌లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్‌బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్‌శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్‌లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్‌తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్‌ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్‌లో ఈ–బైక్స్‌కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్‌పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్‌బాబు వివరించారు. -
ఈవీ బ్యాటరీ చార్జింగ్ నిరీక్షణకు త్వరలో చెల్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాలను (ఈ–వాహనాలను) వేధిస్తున్న బ్యాటరీ చార్జింగ్ సమస్యకు త్వరలో ముగింపు పడనుంది. బ్యాటరీ చార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఇక ఉండదు. అందుకోసం దేశంలో ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రాజెక్టును కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదించింది. దేశంలో స్వర్ణ చతుర్భుజి వెంబడి తొలిదశలో 700 ఈవీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వాహనాల్లో ఇంధనం అయిపోతుంటే సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి పెట్రోల్/ డీజిల్ వెంటనే నింపుకోవచ్చు. కానీ ఈ–వాహనాల బ్యాటరీ చార్జింగ్ అయిపోతే చాలా ఇబ్బంది. బ్యాటరీ చార్జింగ్కు కనీసం రెండు గంటలు పడుతుంది. దేశంలో అవసరమైనన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. దీంతోపాటు చార్జింగ్కు ఎక్కువ సమయం పడుతోంది. ఈ ప్రతిబంధకాలతోనే ఈ–వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి పరిష్కారంగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 2050 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందులో భాగంగా 2027 నాటికి ఈ–ద్విచక్ర వాహనాల మార్కెట్ ను 70 శాతం పెంచాలని భావిస్తోంది. అందుకుగాను జాతీయ రహదారుల వెంబడి ఈవీ చార్జింగ్ స్టేషన్లతోపాటు ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నీతి ఆయోగ్‌కు చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్–అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్ఏసీ)తో కలసి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించింది. ప్రతి 20 కిలోమీటర్లకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఈ–వాహనాల్లో బ్యాటరీ చార్జింగ్ అయిపోతోందంటే సమీపంలోని ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌కు వెళ్తే చాలు. చార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసుకుని అప్పటికే చార్జింగ్ చేసి ఉంచిన బ్యాటరీని ఇస్తారు. బ్యాటరీ చార్జింగ్ రుసుము మాత్రమే తీసుకుంటారు. దాంతో ఈ–వాహనదారులు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. 2030 నాటికి దేశంలో ఈ–వాహనాల మార్కెట్‌ను అంచనా వేస్తూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. తొలిదశలో 700 స్వాపింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించి, అందుకోసం స్థలాలను కూడా గుర్తించారు. వాటిలో ఇప్పటికే 100 స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. (క్లిక్: ఆర్బీకేలతో పీఏసీఏస్‌ల అనుసంధానం) ఆంధ్రప్రదేశ్‌లోంచి వెళుతున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు పరిధిలోని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపైన తొలిదశలో 50 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. త్వరలో నిర్మాణం పూర్తి కానున్న చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి మీద తొలిదశలో 20 ఈవీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2023 మార్చి 31 నాటికి తొలిదశ స్వాపింగ్ స్టేషన్లను నెలకొల్పాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ఈవీ స్వాపింగ్ స్టేషన్ల అవసరాలను అధ్యయనం చేసి తరువాత దశల్లో నెలకొల్పాల్సిన స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటామని విజయవాడలోని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు తెలిపారు. (క్లిక్: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల) -
వారం రోజుల పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్‌ఫోన్..! సరికొత్త ఆవిష్కరణ..!
మనం వాడే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎన్ని రోజుల వరకు వస్తోందంటే..ఏం చెప్తాం..? సుమారు ఒక రోజు లేదా మహా అయితే రెండు రోజులు అది కూడా మనం వాడే వాడకాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్ సుదీర్ఘంగా రెండు రోజులపాటు స్టాండ్ బై ఉంటుంది. బ్యాటరీ సమస్యలనుంచి తప్పించుకోవడం కోసం మనలో చాలా మంది అదనంగా పవర్‌బ్యాంకులను కూడా వాడుతుంటాం. కాగా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కష్టాలకు చెక్ పెడుతూ...ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, శాంసంగ్ సుమారు వారం రోజులపాటు బ్యాటరీ అందించే ఆవిష్కరణకు సిద్ధమైనాయి. స్మార్ట్ఫోన్లలో వాడే సెమీకండక్టర్ల డిజైన్లను మార్చడం ద్వారా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ పొందవచ్చునని ఇరు కంపెనీలు వెల్లడించాయి. వారం రోజులపాటు.. విత్ అవుట్ ఛార్జింగ్..! ఐబీఎమ్, శాంసంగ్ కంపెనీలు దాదాపు వారం రోజులపాటు బ్యాటరీను అందించే సెమీకండక్టర్ డిజైన్‌పై సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ సెమికండక్టర్ విషయంలో పురోగతిని సాధించినట్లు కంపెనీలు వెల్లడించాయి. సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్లను నిలువుగా అమర్చడంతో సిలికాన్ బోర్డులపై ఎక్కువ స్థలాన్ని పొందవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. శాంసంగ్-ఐబీఎమ్ సంయుక్తంగా రూపొందించిన చిప్ సాధారణంగా స్మార్ట్ఫోన్లలో వాడే ఫిన్‌ఫెట్ ట్రాన్సిస్టర్ (ఫిన్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్)తో పోలిస్తే ఐబీఎమ్, శాంసంగ్ సంయుక్తంగా రూపొందించిన కొత్త డిజైన్ వర్టికల్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు(VTFET) సిలికాన్ బోర్డులపై అధిక సాంద్రతను కల్గి ఉండనున్నాయి. ఇలా చేయడంతో బ్యాటరీ శక్తి వినియోగంలో 85 శాతం మేర తగ్గే అవకాశం ఉన్నట్లు ఐబీఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ట్రాన్సిస్టర్ స్విచింగ్ వేగాన్ని మెరుగుపరచడంలో, విద్యుత్ అవసరాలను తగ్గించడంలో సహాయపడనుందని పేర్కొంది. చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..! -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం..!
పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కాగా కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందనే అపోహాలతో తిరిగి సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారికోసం హాంకాంగ్‌కు చెందిన బ్యాటరీ కంపెనీ డెస్టెన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! డెస్టెన్ తయారుచేసిన బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని పేర్కొంది. 900 kW అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో బ్యాటరీలు మెరుపువేగంతో ఛార్జ్ చేయబడతాయని డెస్టెన్ వెల్లడించింది. డెస్టెన్ అభివృద్ధి చేస్తోన్న బ్యాటరీ టెక్నాలజీ పిచ్జిటి ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో వాడే 75kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతోందని డెస్టెన్ పేర్కొంది. డెస్టెన్ బ్యాటరీలు మార్కెట్లలోకి వస్తే ఛార్జింగ్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చును. పిచ్జిటి సింగిల్ ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణించనుంది. డెస్టెన్ తన కంపెనీ బ్యాటరీలపై 3 వేల ఛార్జింగ్ సైకిల్స్, 15 లక్షల కిలోమీటర్ల రేంజ్ వ్యారంటీని కూడ అందిస్తోంది. అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సమయంలో బ్యాటరీలు వెడేక్కకుండా కూలింగ్ టెక్నాలజీను రానున్నాయి. చదవండి: ఫేస్బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్రయ్ అంటూ రాకెట్లా..! -
60 నిమిషాల్లో మూడు గ్యాడ్జెట్స్‌కి ఒకేసారి చార్జింగ్
అమ్మాయిలు విజయాలు సాధించటంలో మెరుపు వేగంతో ముందుముందుకు పరుగులు తీస్తూ, లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు తెస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కొత్త పరికరాన్ని కనిపెట్టిన ప్రేరణ వాడేకర్ భారతీయ మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. బెంగళూరుకు చెందిన ప్రేరణ వాడేకర్ పవర్ బ్యాంక్‌ని పోలిన లిథీనియమ్ అయాన్ పోర్టబుల్ బ్యాటరీ కనిపెట్టి, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఇచ్చే ‘వైస్ చాన్సెలర్స్ సోషల్ ఇంపాక్ట్’ అవార్డును అందుకున్నారు. 2010లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రూ హ్యామిల్టన్ ప్రారంభించిన ఈ అవార్డును, ఆ విశ్వవిద్యాలయంలో ప్రతిభ కనపరుస్తూ, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే విద్యార్థులకు అందిస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డును ప్రేరణ వాడేకర్ అందుకున్నారు. నేను ఊహించుకున్నాను... ప్రేరణ వాడేకర్ ‘జీవ గ్లోబల్’ ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా ఆక్స్ఫర్డ్షైర్కి వలస వచ్చిన వారికి పది సంవత్సరాలుగా అండగా ఉంటున్నారు. వారికి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను కావలసిన సహాయసహకారాలు అందిస్తున్నారు. ‘‘జీవ అంటే శక్తిని ఇచ్చేది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో బలహీనపడిన వారికి శక్తినిస్తుంది మా సంస్థ. ఎనర్జీ (కరెంట్) అతి తక్కువ ధరలో, అందరూ వాడుకునేలా, అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని నేను చాలా సంవత్సరాలుగా ఊహించుకుంటున్నాను’’ అంటున్న ప్రేరణ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎం) నుంచి ‘పబ్లిక్ పోలసీ’లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇప్పుడు తాను తయారుచేసిన పరికరం గురించి, ‘‘ఈ బ్యాటరీ ద్వారా కేవలం అరవై నిమిషాలలో మూడు గ్యాడ్జెట్స్‌ని ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఒక వస్తువును బ్యాటరీ ద్వారా చార్జింగ్ చేయటానికి కనీసం ఐదు గంటల సమయం పండుతుంది. కరెంటు సప్లయి ఉన్న ఏ ప్రదేశంలోనైనా ఈ పరికరం పనిచేస్తుంది’’ అంటూ ఎంతో సంబరంగా చెప్పారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరం సహాయంతో, హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉన్న రిఫ్రిజిరేటర్ని సైతం చార్జింగ్ చేసుకోవచ్చు. లైట్లు, చిన్న చిన్న టేబుల్ ఫ్యాన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాలలో ఉండేవారు, గిరిజనులు సైతం దీని ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. అమ్మ చెప్పింది.. ప్రేరణ తల్లి నీనా వాడేకర్. ఆవిడ కూడా బాగా చదువుకున్నారు. సమాజ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో తోడ్పడుతుందని తల్లి చిన్ననాటి నుంచి ప్రేరణకు తరచుగా చెప్పేవారు. ‘‘అమ్మ నన్ను కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేయమంది. నా వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలని చిన్నతనం నుంచి చెప్పేది. అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ అనిల్ గుప్తా భారతీయులలో దాగి ఉన్న ప్రతిభను ప్రశంసించేవారు. ఆయన మాటలు నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచాయి’’ అంటూ ఎంతో ఆనందంగా చెబుతారు ప్రేరణ. తోపుడు బండి వారి నుంచి... కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో, తోపుడు బండివారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్నారు. వారికి ఎలాగైనా నా వల్ల సహాయం జరగాలనుకున్నాను’’ అంటున్న ప్రేరణకు పది సంవత్సరాలుగా వివిధ చిరు వ్యాపారుల గురించి పూర్తి అవగాహన ఉంది. తాను తయారుచేసిన పరికరాన్ని ముందుగా తోపుడు బండి వారికి అందచేసి, వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా పరికరాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, వారు సౌకర్కయంగా వాడుకునే స్థాయికి తీసుకువచ్చారు. త్వరలో మార్కెట్లోకి... బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయిన లివా ఇన్నొవేషన్స్ సంస్థ ఈ ప్రొడక్ట్‌ను కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకు రావడానికి ముందుకు వచ్చారు. ‘‘నేను కనిపెట్టిన ఈ పరికరం అందరికీ అంటే ఆర్థికంగా దిగువస్థాయి వారికి కూడా అందుబాటులోకి రావాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరాన్ని అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక సోలార్ చార్జిబుల్ పరికరం తక్కువ ధరకి అందరికీ అందుబాటులోకి రాగలదని, అంతర్జాతీయంగా దీనిని అందరూ వాడుకోగలుగుతారని ఇందు కోసం ప్రభుత్వ కార్పొరేట్ రంగాలు సహకారం అందించాలని ప్రేరణ అంటున్నారు. -
ఈ ఒక్క ఛార్జర్‌తో అన్నింటికీ చెక్..! ధర ఎంతంటే..
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్ మన నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, హెడ్ ఫోన్స్‌కు వేరవేరుగా బ్యాటరీ ఛార్జర్లను మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి మనం క్యారీ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు ఛార్జర్లు మర్చిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్‌కు వెళ్లి కొత్తది కొనుకోవాల్సిందే. మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే.. తాజాగా షావోమి రిలీజ్ చేసిన ఛార్జర్‌తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. షావోమి మార్కెట్లోకి 67W సోనిక్ఛార్జ్ 3.0 ను సోమవారం రోజున మార్కెట్లోకి రిలీజ్ చేసింది. షావోమి రిలీజ్ చేసిన కొత్త ఛార్జర్ యుఎస్బీ టైప్-ఎ నుంచి యుఎస్బీ టైప్-సి సపోర్ట్ చేయనుంది. కాగా ఛార్జర్లో ఒకే యుఎస్బి టైప్-ఎ పోర్ట్ ఉండడం గమనార్హం, కానీ షావోమి ఈ ఛార్జర్‌తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు , మరెన్నో పలు పరికరాలను ఛార్జ్ చేయగలదని షావోమి పేర్కొంది. ఛార్జర్ అనేక పరికరాలను వేగంగా ఛార్జ్ చేయడానికి 67W అవుట్‌పుట్‌ను అందిస్తుంది.షావోమి ఈ ఏడాది ప్రారంభంలో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌కు 55W ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలుదారులకు షావోమీ అందిస్తోంది. షావోమి సోనిక్ఛార్జ్ 3.0 క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో వస్తోంది. భారత్‌లో ఎంఐ 67W సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర రూ .1,999 గా నిర్ణయించారు. ఈ ఛార్జర్‌ను షావోమి అధికారిక వెబ్సైట్ నుంచి, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఛార్జర్‌కు 100 సెం.మీ 6A టైప్-సీ కేబుల్‌తో రానుంది. Mi 67W SonicCharge 3.0 Charger Combo#Mi67WCharger #SonicCharge3 Sale Starts Today at 12PM - https://t.co/Sb9Dw2mkHN Available on https://t.co/D3b3QtmvaT, Mi Home and Offline Stores. pic.twitter.com/N9WO1HsuVn — Mi India (@XiaomiIndia) July 12, 2021 -
బ్యాటరీ సేవింగ్ కోసం ఇలా చేయండి!
ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వారికి బ్యాటరీ ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి అత్యవసర సమయాల్లో చార్జింగ్ అయిపోతే మన బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా బ్యాటరీ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది ఫోన్ పనితీరు, జీవితకాలం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాల వరకు మొబైల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం భాగానే ఉన్న.. అదేస్థాయిలో వాడకమూ పెరుగుతోంది. దీంతో సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతోంది. అయితే మీరు ఈ చిట్కాలను పాటిస్తే బ్యాటరీ సామర్థ్యం పెరిగే అవకాశం చాల ఎక్కువ. (చదవండి: వివో వై1ఎస్ వచ్చేసింది) మనం కొన్ని అవసరాల కోసం జీపీఎస్ ఆన్‌లో ఉంచుతాం. ఓలా, ఉబర్, స్విగ్గీ వంటి యాప్స్ వినియోగానికి జీపీఎస్ ఆన్ చేస్తుంటాం. అయితే మనం చాల సార్లు అవసరం లేకున్నా జీపీఎస్ ఆన్‌లో ఉంచుతాం. దీనివల్ల మన ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు. బ్యాటరీ తొందరగా అయిపోతుంది అందుకోసమే మనం అవసరం లేని సమయంలో జీపీఎస్‌ను ఆఫ్‌లో ఉంచడం మంచిది. మన ఫోన్ చాలా సార్లు ఛార్జింగ్ పెట్టి మర్చిపోవడం లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పేలుతుందన్న అపోహ ఉన్నప్పటికీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు చార్జింగ్ పెట్టాక బ్యాటరీకి 100 శాతం ఎక్కితే, చార్జింగ్ ఎక్కకుండా మీ స్మార్ట్ ఫోనే ఆపేస్తుంది. దీనికోసం మీ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ఒక చిప్ ఉంది. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ వేడెక్కడంతో పాటు ఫోన్ జీవితకాలం తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి ఫోన్ ను ఎక్కువ సేపు చార్జ్ చేయడం ఆపండి. ఎప్పుడు 20 శాతం కన్నా ఎక్కువ మరియు 90 శాతం కన్న తక్కువ ఉండేటట్లు ఉంచుకోండి. ఫోన్ నోటిఫికేషన్ బార్లో ఉండే ఐకాన్స్ ను గమనిస్తూ ఉండండి. బ్లూటూత్, వైఫై ఆన్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి. అవసరం లేకున్నా ఆన్ చేసి ఉంటే అవి మీ ఫోన్ బ్యాటరీని తగ్గిస్తాయి. మనం చాలా సార్లు వైఫై అందుబాటులో ఉన్నా కూడా మొబైల్ డేటాని వాడటం చేస్తూ ఉంటాం. దీంతో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది. మీకు వైఫై అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడమే మంచి పద్ధతి. మీ మొబైల్ లో 32 డిగ్రీల ఫారన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లిథియం-ఇయాన్ బ్యాటరీలు చార్జింగ్ కావని ఓ పరిశోధనలో తేలింది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చార్జింగ్ పెట్టడం వల్ల యానోడ్ మీద ఉండే లిథియం మీద ప్లేటింగ్ ఏర్పడుతుంది. ఆ ప్లేటింగ్ ను తీసేయడం కూడా కుదరదు. ఇది కూడా మీ బ్యాటరీ జీవితకాలాన్ని తినేస్తుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫోన్ చార్జింగ్ పెట్టకండి. బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ఫోన్లో ఉండే పవర్ సేవింగ్ మోడ్‌లో వాడడం మంచిది. దీనివల్ల ఫోన్లో ఉండే సీపీయూ ఎంత మేర అవసరమో అంత మేరకే పనిచేస్తుంది. అక్కర్లేని యాప్స్ బ్యాగ్రౌండ్లో రన్ కాకుండా చూస్తుంది. దీనివల్ల ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించొచ్చు. మన అవసరం లేకున్నా మొబైల్ లో లైవ్ వాల్ పేపర్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల మీ ఫోన్ మీద ఎక్కువ సామర్థ్యం పడటంతో బ్యాటరీ లైఫ్ తక్కువగా వస్తుంది. అలాగే మీ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. అందుకోసమే వీటికి దూరంగా ఉండడం మంచిది. ఫోన్ బ్రైట్నెస్ను తగ్గించడం ద్వారా ఫోన్‌ను మరింత ఎక్కువ సేపు వినియోగించొచ్చు. మీ మొబైల్ ఉండే ఆటో బ్రైట్నెస్ను ఎంచుకుంటే మంచిది. దీంతో పాటు పోన్లో ఉండే డార్క్‌మోడ్/నైట్ మోడ్ ఫీచర్‌ను వినియోగిస్తే మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టుకునే బాధ తప్పుతుంది. అలాగే, స్ర్కీన్ టైమ్‌ను కూడా వీలైనంత తక్కువగా సెట్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. -
విద్యుత్ వాహనాలకు ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీల పరస్పర మార్పిడి (స్వాపింగ్) కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ వినియోగదారులుగా పరిగణించి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. లోటెన్షన్ (ఎల్టీ) కనెక్షన్ కలిగిన చార్జింగ్ కేంద్రాలకు యూనిట్‌కు రూ.6.10 టారిఫ్ చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతి కోరాయి. అదే విధంగా హైటెన్షన్ (హెచ్‌టీ) కనెక్షన్లకు సైతం రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని, అయితే పగటి వేళల్లో యూనిట్‌కు రూపాయి అదనం, రాత్రి వేళల్లో రూపాయి రాయితీ ఇస్తామని తెలిపాయి. అంటే, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు యూనిట్‌కు రూ.7.10 చొప్పున, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యూనిట్‌కు రూ.5.10 చొప్పున, మిగిలిన సమయాల్లో యూనిట్‌కు రూ.6.10 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని ప్రతిపాదించాయి. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలో విద్యుత్ వాహనాల పాలసీని ప్రకటించనుందని ఈఆర్సీకి తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరాయి. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలను వచ్చేనెల 12లోగా తెలపాలని, 19న ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని ఈఆర్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే!
♦ పర్యావరణహిత ఇంధనాలకు మళ్లండి... ♦ లేకుంటే మీరు తీవ్రంగా నష్టపోతారు... ♦ పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదు ♦ దిగుమతులకు, కాలుష్యానికి చెక్ పెడదాం ♦ ఎలక్ట్రికల్ వాహనాలపై కేబినెట్ నోట్ సిద్ధం ♦ బ్యాటరీ చార్జింగ్ కేంద్రాల వ్యవహారమూ దాన్లో ఉంటుంది ♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీదారులకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్యాక్సీలు, బైక్లదేనని, దేశం ఈ దిశగా అడుగులు వేయాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కార్ల తయారీవైపు మళ్లాలని ఆటోమొబైల్ కంపెనీలకు సూచించారు. లేకుంటే వాటికి భవిష్యత్తు లేదని, వాటిని పక్కన తీసి పారేయటానికి కూడా తాము వెనకాడబోమని నిష్కర్షగా చెప్పారు. కాలుష్యంతోపాటు దిగుమతులకూ చెక్ పెడతామన్నారు. ‘‘ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మనం అడుగులు వేయాలి. వేసి తీరాలి. మీకు ఇష్టమున్నా, లేకున్నా నేను దీన్ని అమలు చేయబోతున్నాను. దీనికి మీ ఆమోదం కూడా అవసరం లేదు. దిగుమతులను తగ్గించడం, కాలుష్యానికి చెక్ పెట్టడంపై మాకు స్పష్టమైన విధానం ఉంది’’ అని గురువారం ఢిల్లీలో జరిగిన ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల(సియామ్) వార్షిక సమావేశంలో గడ్కారీ ప్రకటించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకునే వారికి ప్రయోజనం ఉంటుందన్న ఆయన, అలా కాకుండా పైసలే పరమావధిగా పనిచేసుకుపోయేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘మేం నిర్ణయం తీసుకుంటాం. ఆ తరవాత... అయ్యో! మా దగ్గర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడవని వాహనాల నిల్వలు చాలా ఉండిపోయాయంటూ ప్రభుత్వం దగ్గరకు రావద్దు. ముందే మేల్కొంటే మంచిది’’ అని స్పష్టంచేశారు. ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించిన విధానాన్ని తీసుకురానుందని గడ్కారీ చెప్పారు. ‘‘కేబినెట్ నోట్ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నాం. దీన్ని సాధ్యమైనంత త్వరలో అమల్లోకి తీసుకువస్తాం’’ అని గడ్కారీ వివరించారు. పాత వాహనాలను తొలగించే విధానం జీఎస్టీ అంశాల కారణంగా నిలిచిపోయిందని, త్వరలోనే వాటిని పరిష్కరించి అమల్లోకి తెస్తామని గడ్కారీ హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టండి ‘‘నేను మిమ్మల్ని (కార్ల తయారీదారులు) గౌరవంగా కోరేదేమంటే ముందు ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయండి. బ్యాటరీ ఖరీదైన వ్యవహారమంటూ మీరు నాకు చెప్పారు. ఇప్పుడు మీరు తయారీ ప్రారంభిస్తే బ్యాటరీ తయారీ వ్యయాన్ని భారీ ఉత్పత్తితో తగ్గించొచ్చు. ప్రారంభంలో ఇబ్బందులనేవి ఎక్కడైనా ఉండేవే’’ అని గడ్కారీ కార్ల కంపెనీలకు హితవు చెప్పారు. దిగుమతులు, కాలుష్యం రెండు సమస్యలన్న ఆయన ఏటా దిగుమతులపై రూ.7 లక్షల కోట్లు వ్యయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక రంగానికి పెద్ద గుదిబండగా దీన్ని వర్ణించారు. ప్రత్యామ్నాయ ఇంధనమే దీనికి పరిష్కారమన్నారు. ప్రభుత్వం రెండో తరం ఎథనాల్ తయారీకి 15 పరిశ్రమలను ప్రారంభించనుందని చెప్పారు. పత్తి, గోధు మ, వరి గడ్డి నుంచి కూడా ఎథనాల్‌ను సులభంగా తయారు చేయొచ్చన్నారు. ఇక, ప్రభుత్వం 2,000 డ్రైవింగ్ స్కూళ్లను ఒక్కోటీ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు గడ్కారీ వెల్లడించారు. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం: సియామ్ సియామ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న వినోద్ దాసరి మంత్రి గడ్కారీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వం దిగుమతులు, కాలుష్యం తగ్గింపు దిశగా అడుగులు వేయడం పట్ల ప్రశంసించారు. ఇందుకు పరిశ్రమ సైతం మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘మూడేళ్లలోనే బీఎస్–4 నుంచి బీఎస్–6కు మళ్లబోతున్నాం. ప్రపంచంలోనే ఇది అత్యంత తక్కువ వ్యవధి. అయితే, విధానంలో నిలకడ ఉండాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒకసారి విధానాన్ని రూపొందించిన తర్వాత దాన్ని మార్చొద్దు. కోర్టులు జోక్యం చేసుకున్నా దాన్ని సమర్థించుకోవాలి’’ అని దాసరి ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమ సిద్ధంగానే ఉన్నప్పటికీ పదేళ్లుగా బీఎస్–4 ఉద్గార ప్రమాణాలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంధన లభ్యత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ... బీఎస్ –6 ప్రమాణాల అమలు సమయంలోనైనా ఈ ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటే పాత వాహనాలను నిషేధించడంపై దృష్టి పెట్టాలని దాసరి సూచించారు. అంతేకానీ కొత్త కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకోరాదన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల్ని నిషేధించాలి కేంద్రానికి సియామ్ సూచన న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్... 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఇలాంటి వాహనాలను రోడ్లపై తిరగనివ్వకుండా చట్టాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ‘కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహన పరిశ్రమ చాలా చేస్తోంది. బీఎస్–6 ఉద్గార నిబంధనలకు మారడంపై పనిచేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కూడా 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను నిషేధించాలి’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ కె దాసరి వ్యాఖ్యానించారు. ఆయన ఇక్కడ జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో మాట్లాడారు. నేషనల్ ఆటోమోటివ్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. తరచూ మారుతున్న పాలసీ విధానాల కారణంగా ప్రస్తుతం దేశీ వాహన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ బలమైన వాహన పరిశ్రమను కలిగి ఉన్నాయని, భారత్ కూడా ఆటోమోటివ్ రంగ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో వాహన పరిశ్రమ దాదాపు 50 శాతం వాటా కలిగి ఉందని గుర్తు చేశారు. -
అమితాబ్ కు శాంసంగ్ షాక్!
ముంబై: బ్యాటరీ పేలుళ్లతో వినియోగదారులను భయపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఎదురవుతున్న ఇబ్బందులను ‘బిగ్ బి’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫోన్ పూర్తిగా చార్జింగ్ ఎక్కడం లేదని ఆయన తెలిపారు. ‘నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ వాడుతున్నాను. ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 60 శాతంకు మించి ఎక్కడం లేదు. 100 శాతం చార్జింగ్ ఎప్పుడు అవుతుంది? శాంసంగ్ వెంటనే స్పందించాల’ని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనిపై అభిమానుల నుంచి వెంటనే స్పందన వచ్చింది. గెలాక్సీ నోట్ 7 పేలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ఫోన్ మార్చాలని వికాస్ సింగ్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. బ్యాటరీలో సమస్య తలెత్తడంతో 25 లక్షల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. అమితాబ్ ట్వీట్ పై శాంసంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆయనకు కొత్త ఫోన్ ఇస్తుందో, బ్యాటరీ మారుస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ రోజే ఎత్తివేసింది. T 2395 -I have Samsung Note 7. Battery charge restricted to 60%. When will it allow me to go 100 ? Mr Samsung please respond ! zara jaldi ! pic.twitter.com/VVkzPqXh1j — Amitabh Bachchan (@SrBachchan) 30 September 2016 -
మేడిన్ ఇండియా ఈ-బైక్!
విద్యుత్తుతో నడిచే బైక్ వాడితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం మనకు తెలిసినా ఈ బైక్ వాడేందుకు ఇష్టపడం. ఎందుకు? వేగం తక్కువ... ఒకట్రెండేళ్లకే బ్యాటరీ మార్చుకోవాలి. బ్యాటరీ చార్జింగ్కు బోలెడంత టైమ్ పడుతుంది. ఇవేనా మీరు చెప్పే కారణాలు? అయితే ఇంకొక్క ఏడాది ఆగండి. ఈ చిక్కులేవీ లేని ఈ బైక్ మీ ముందుకు రాబోతుంది. పైగా ఇది పక్కా మేడిన్ ఇండియా బైక్! మద్రాస్ ఐఐటీ విద్యార్థులు నాలుగేళ్లుగా శ్రమించి తయారు చేసిన ఈ ‘ఎస్ 340’ (ఫొటోలో కనిపిస్తున్నది) నమూనాలను ఇప్పటికే కొందరు పరీక్షిస్తున్నారు. మీ స్మార్ట్‌ఫోన్ కంటే వేగంగా... కచ్చితంగా చెప్పాలంటే ఒక గంటలో దీని బ్యాటరీని రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు 50 వేల కిలోమీటర్ల ప్రయాణం వరకూ బ్యాటరీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యాధునిక కంప్యూటర్ మైక్రోప్రాసెసర్లు, బ్యాటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు ఉపయోగించారు. అన్నింటికీ మించి ఎస్ 340 గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు! అబ్బో భలే ఉందే ఈ బైక్ మనమూ ఒకటి కొందామనుకుంటున్నారా? వచ్చే ఏడాది దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశముంది. ధర ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్! మరిన్ని వివరాలకు http://atherenergy.com/ వెబ్సైట్ చూడండి. -
భలే ఆప్స్
బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్... బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎక్కువకాలం పనిచేయించేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ బ్యాటరీ మరింత ఎక్కువ కాలం మన్నేలా చేయలేవు. కానీ పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఛార్లీ హూ అభివృద్ధి చేసిన ఎస్టార్ అప్లికేషన్ మాత్రం బ్యాటరీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న, లేదా చేసుకోబోతున్న అప్లికేషన్లు ఎంత మేరకు విద్యుత్తు ఖర్చు చేస్తాయో ఎప్పటికప్పుడు లెక్కకట్టి మీకు తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఛార్లీ. ఈ సమాచారం ఆధారంగా మీరు ఎక్కువ విద్యుత్తును వాడుకునే అప్లికేషన్లను తొలగించుకోవచ్చు. ఎస్టార్ సూచించే పొదుపైన ఆప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేసి, బ్యాటరీ ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చునన్నమాట. ఇవన్నీ చేస్తే బ్యాటరీ జీవితకాలం కూడా పెరిగిపోతుందన్నది తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఎస్టార్లో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను పోలిన కోడింగ్ ఉంటుంది. ఆన్లైన్ మ్యూజిక్, రేడియో కోసం వింక్స్.. ప్రముఖ సెల్‌ఫోన్ క్యారియర్ సంస్థ ఎయిర్టెల్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. వింక్స్ పేరుతో ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఐఫోన్లలో ఈ అప్ ద్వారా సంగీతాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్టెల్ కనెక్షన్ లేకున్నా ఉచితంగా పాటలను వినే అవకాశం ఉండటం విశేషం. ఈ సర్వీసులో దాదాపు ఎనిమిది భాషలకు సంబంధించిన 17 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వినే పాటల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారికి ప్రస్తుతం రెండు రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. వింక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా, వింక్ ఫ్రీడమ్ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఆర్టిస్ట్, మూడ్స్, జెనెర్ విభాగాల్లో లభ్యమయ్యే పాటలను 32, 64, 128 కేబీపీఎస్ నాణ్యత ప్రమాణాల్లో వినే అవకాశం ఉంది.