
పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కాగా కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందనే అపోహాలతో తిరిగి సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారికోసం హాంకాంగ్‌కు చెందిన బ్యాటరీ కంపెనీ డెస్టెన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది.
చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
డెస్టెన్ తయారుచేసిన బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని పేర్కొంది. 900 kW అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో బ్యాటరీలు మెరుపువేగంతో ఛార్జ్ చేయబడతాయని డెస్టెన్ వెల్లడించింది. డెస్టెన్ అభివృద్ధి చేస్తోన్న బ్యాటరీ టెక్నాలజీ పిచ్‌జిటి ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో వాడే 75kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతోందని డెస్టెన్ పేర్కొంది. డెస్టెన్ బ్యాటరీలు మార్కెట్లలోకి వస్తే ఛార్జింగ్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చును.
పిచ్‌జిటి సింగిల్ ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణించనుంది. డెస్టెన్ తన కంపెనీ బ్యాటరీలపై 3 వేల ఛార్జింగ్ సైకిల్స్, 15 లక్షల కిలోమీటర్ల రేంజ్ వ్యారంటీని కూడ అందిస్తోంది. అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సమయంలో బ్యాటరీలు వెడేక్కకుండా కూలింగ్ టెక్నాలజీను రానున్నాయి.
చదవండి: ఫేస్‌బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్‌రయ్ అంటూ రాకెట్‌లా..!
Comments
Please login to add a commentAdd a comment