Electric Vehicle Division
-
రెండేళ్లలో ఈవీల వినియోగం వేగవంతం..
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది. మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు. -
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్‌మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ టూవీలర్స్ పోటీ!
ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా జూలై నెలలో సేల్స్ దాదాపు రెట్టింపు కావడం దీనికి నిదర్శనం. మరోపక్క, ఈ విభాగంలో పోటీ ఫాస్ట్ చార్జింగ్ అవుతోంది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు షాకిస్తున్నాయి. ధరల యుద్ధానికి తెరతీసి, ఓలా మార్కెట్ వాటాకు గండికొడుతున్నాయి. ఐపీఓ సక్సెస్‌తో దండిగా నిధుల జోష్‌లో ఉన్న ఓలా.. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది! ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,07,016 ఈ–టూవీలర్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన 54,616 వాహనాలతో పోలిస్తే 96 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో అమ్మకాలు 79,868 మాత్రమే. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సేల్స్ మళ్లీ ఎలక్ట్రిక్ వేగంతో దూసుకెళ్తున్నాయి. పెట్రోలు టూవీలర్లలో రారాజులుగా ఉన్న సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో సైతం ఎలక్ట్రిక్ బరిలో తగ్గేదేలే అంటూ కాలుదువ్వడమే దీనికి ప్రధాన కారణం. జూలైలో బజాజ్ ఆటో ఏకంగా 17,642 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం విశేషం. జూన్‌తో పోలిస్తే 80 శాతం సేల్స్ పెరిగాయి. మార్కెట్ వాటా సైతం 11.6 శాతం నుంచి 16.9 శాతానికి జంప్ చేసింది. ఇక టీవీఎస్ అమ్మకాలు 30 శాతం పైగా ఎగబాకి 19,471 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రెండింటితో పోలిస్తే వెనుకబడ్డ హీరో మోటో 5,044 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సత్తా చాటింది. మొత్తంమీద చూస్తే, ఈ మూడు దిగ్గజాల ‘ఎలక్ట్రిక్’ వాటా 40 శాతానికి పైగా ఛార్జింగ్ అయింది. ఇందులో టీవీఎస్, బజాజ్ వాటాయే దాదాపు 35 శాతం గమనార్హం. ఓలాకు షాక్... రెండు నెలల క్రితం, మే నెలలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో తిరుగులేని స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌కు పోటీ సెగ బాగానే తగులుతోంది. జూన్‌లో కంపెనీ 36,781 వాహనాలు విక్రయించగా.. జూలైలో ఈ సంఖ్య కాస్త మెరుగుపడి 41,597కు చేరింది. అయితే, మార్కెట్ వాటా మాత్రం జూన్‌లో 47.5 శాతానికి, ఆపై జూలైలో ఏకంగా 40 శాతానికి పడిపోయింది. ఓలాకు తగ్గుతున్న మార్కెట్ వాటాను సాంప్రదాయ టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేగంతో కొట్టేస్తున్నాయి. మరోపక్క, పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న ఏథర్ ఎనర్జీ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. జూన్‌లో 6,189 (8% మార్కెట్ వాటా), జూలైలో 10,080 (10% వాటా) వాహనాలను అమ్మింది. అయితే, దీని స్కూటర్ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు రూ. లక్ష లోపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుండటంతో.. ఓలా, ఏథర్ వంటి పూర్తి ఈవీ కంపెనీలు కూడా ధరల యుద్ధంలోకి దూకాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాటా పతనంతో ఓలా ఇక పూర్తిగా ఈ–టూవీలర్లపైనే దృష్టిసారించాలని నిర్ణయించుకుంది.భారీ నెట్వర్క్, సర్వీస్ ప్లస్..తొలిసారిగా రూ. లక్ష లోపు స్కూటర్లను ప్రవేశపెట్టడం కూడా బజాజ్, టీవీఎస్, హీరో అమ్మకాలు పుంజుకున్నాయి. ‘ఈ 3 సాంప్రదాయ టూవీలర్ కంపెనీలకు విస్తృత డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్, బ్రాండ్ విలువ, సర్వీస్ సదుపాయాలు దన్నుగా నిలుస్తున్నాయి.మార్కెట్ వాటాను కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని రీసెర్చ్ సంస్థ నోమురా ఆటోమోటివ్ రిటైల్ విభాగం హెడ్ హర్షవర్ధన్ శర్మ పేర్కొన్నారు. ధరల పోరు, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటివి ఈ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. తాజా పరిణామాలతో ఛార్జింగ్ స్టేషన్ల భారీ పెరుగుదలతో పాటు ఇతరత్రా మౌలిక సదుపాయాలు జోరందుకుంటాయని, వినియోగదారులకు కూడా ఇది మేలు చేకూరుస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
ఈవీలపై ఎంత దూరమైనా ప్రయాణించేలా..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా వాటి అమ్మకాలు హెచ్చవుతున్నాయి. కానీ విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టి చాలాకాలం అయినా ఇప్పటికీ వాటికి బ్యాటరీ సమస్యగానే ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఛార్జింగ్రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్గ మధ్యలో వాటిని ఛార్జ్ చేసుకోవాలన్నా చాలా సమయం పడుతుంది. అందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేలా క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ, బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇదీ చదవండి: రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే.. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల బ్యాటరీను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందం దేశంలోని అతిపెద్ద బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సహకారం ద్వారా 25 నగరాల్లోని 900కి పైగా స్వాప్ స్టేషన్ల్లో ‘బ్యాటరీ స్మార్ట్’ కంపెనీకు చెందిన బ్యాటరీలను క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మార్చుకోవచ్చు. దాంతో క్వాంటమ్ వినియోగదారులు దూరప్రయాణాలు వెళ్తున్నపుడు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని రెండు నిమిషాల్లో పొందే వీలుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
టాటా ప్యాసింజర్ ఈవీ రైడ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చే ఏడాదిన్నరలో అయిదుకుపైగా ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఆధునిక ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ అయిన యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై విభిన్న బాడీ, సైజుల్లో ఇవి రూపుదిద్దుకుంటాయని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. యాక్టి.ఈవీ ఆధారంగా తొలుత పంచ్ ఈవీ వస్తోందని ప్రకటించింది. ఈ ఈవీ మోడళ్లలో 300 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే యాక్టి.ఈవీ బ్యాటరీ ప్యాక్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ, భారత్ ఎన్సీఏపీ భద్రతా ప్రమాణాలను అనుసరించి మోడళ్ల తయారీ చేపడతామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. కాగా, పంచ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.21,000 చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. -
2030 నాటికి 40 శాతానికి ఈవీలు
ముంబై: దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ దిశ మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక నివేదిక వెల్లడించింది. బ్లూమ్ వెంచర్స్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ రిపోర్ట్ 2023 ప్రకారం.. ఈవీ పరిశ్రమ గణనీయ వృద్ధికి సిద్ధంగా ఉంది. ఈవీ వాటా ప్రస్తుతం 5 శాతం నుండి 2030 నాటికి 40 శాతానికి పైగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు రెండింటిలోనూ 45 శాతంపైగా బలమైన స్వీకరణ ద్వారా ఈవీ రంగం వృద్ధి చెందుతుంది. కార్ల విస్తృతి 20 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ అంచనాలను చేరుకోవడానికి కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పంపిణీ, కస్టమర్ల సెగ్మెంట్ ప్రాధాన్యత, సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఛార్జింగ్ మౌలిక వసతుల అంశాల్లో అనేక నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అని వివరించింది. 100 బిలియన్ డాలర్లు.. ‘ప్రస్తుతం ఉన్న 5 శాతం నుండి 2030 నాటికి 45 శాతానికి పైగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ మార్కెట్ చొచ్చుకుపోవచ్చు. ఈవీ తయారీ కంపెనీలు మధ్యస్థాయి మోడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా స్కూటర్ల విభాగంలో 50 శాతానికి పైగా వాటా కైవసం చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఎంట్రీ–లెవల్ ఈ–మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాలి. త్రిచక్ర వాహన మార్కెట్ ఈవీల వైపు స్థిరంగా మారుతున్న ఈ సమయంలో మోడళ్లు సీఎన్జీ వాహనాలతో సరితూగాల్సి ఉంటుంది. ఈవీల రంగంలో 100 బిలియన్ డాలర్ల అవకాశాలను అందుకోవాలంటే కస్టమర్ల సూచనల ఆధారంగా ఉత్పత్తుల అభివృద్ధి,, మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు మించి అభివృద్ధి చెందడానికి పంపిణీ నమూనాలను పునర్నిర్మించడం, బీ2బీ/ఫ్లీట్ కస్టమర్ విభాగాలకు ప్రాధాన్యత, భిన్నత్వం కోసం సాఫ్ట్వేర్ వినియోగం, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడం వంటివి కీలకం’ అని నివేదిక వెల్లడించింది. -
ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్
మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్, విద్యుత్ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ రింగ్ ప్లస్ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్, రింగ్ ప్లస్ అక్వా, మైనీ ప్రెసిషన్లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్‌లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
భారత మార్కెట్లోకి జపాన్ ముసాషి: త్వరలోనే ఈ-యాక్సిల్
ముంబై: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ముసాషి తాజాగా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్ న్యూ ఎనర్జీ కంపెనీ (బీఎన్సీ) మోటార్స్‌తో జట్టు కట్టింది. మోటార్, పీసీయూ, గేర్ బాక్స్‌తో కూడిన కొత్త ఈవీ యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు ముసాషి ఇండియా తెలిపింది. బెంగళూరు ప్లాంటులో అక్టోబర్ నుంచి ఈ-యాక్సిల్‌ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన అసెంబ్లీ లైన్ కోసం తొలి దశలో రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ముసాషి సైమిత్సు ఇండస్ట్రీస్‌కి ముసాషి ఇండియా అనుబంధ సంస్థగా ఉంది. తమ అనుభవం, అధునాతన సాంకేతికతను భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి తేనున్నట్లు ముసాషి సైమిత్సు సీఈవో (భారత విభాగం) తోషిహిసా ఒత్సుకా తెలిపారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) భారత్‌లో తయారు చేసిన ఈ-యాక్సిల్‌ను ఇతర దేశాలకు కూడా సరఫరా చేయాలని ముసాషి భావిస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్‌కి చెందిన స్ట్రోమ్, వియత్నాం సంస్థ ఈవీ గో, కెన్యాకు చెందిన ఆర్క్ రైడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) మరిన్ని ఇంట్రస్టింగ్వార్తలు, బిజినెస్అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
హ్యుందాయ్ రూ.20,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌లో రూ.20,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వచ్చే 10 ఏళ్లలో ఈ మొత్తాన్ని దశలవారీగా వెచ్చించనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అభివృద్ధి, వాహనాల ప్లాట్‌ఫామ్స్ ఆధునీకరణకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంటును ఈవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. 1,78,000 యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. అయిదేళ్ల వ్యవధిలో ప్రధాన రహదార్లలోని కీలక ప్రదేశాలలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. హ్యుందాయ్ వార్షిక తయారీ సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది. -
ఈవీలకు సిడ్బీ ఫైనాన్సింగ్!
ముంబై: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉత్తమ ఫైనాన్సింగ్‌కు వీలుగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బీ) పైలట్ పథకానికి తెరతీసింది. తద్వారా మొత్తం ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) పరిశ్రమ పటిష్టతకు మద్దతివ్వనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు రుణ సౌకర్యాలు కల్పించనుంది. వెరసి ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లకు ఎంఎస్ఎంఈలు, ఈవీ లీజింగ్ కంపెనీలకు ప్రత్యక్షంగా ఆర్థిక తోడ్పాడును అందించనుంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్సహా చార్జింగ్ సదుపాయాల కల్పనకు సైతం అండగా నిలవనుంది. ఈవీ ఎకోసిస్టమ్‌లో రుణాలందించేందుకు వీలుగా చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు పోటీ రేట్లకు ఫైనాన్సింగ్‌ను ఏర్పాటు చేయనుంది. -
ఎలక్ట్రిక్ విభాగంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు!
ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ సౌత్ తైవాన్‌లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫాక్స్‌కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్‌లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్‌కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. -
ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (రూ. 2,475 కోట్లు) సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే నష్టాల నుంచి బయటపడి, లాభాలు ఆర్జించగలదన్న అంచనాల నడుమ కంపెనీ తాజా నిధుల సమీకరణకు తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) 2023, 2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్‌సైకిల్, మల్టిపుల్ ప్రీమియం బైక్స్ లాంటి మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. అలాగే 2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే మొత్తం టూవీలర్స్, 2030 నాటికి దేశంలో విక్రయించేకార్లన్నీఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనేది కంపెనీ మిషన్ ఎలక్ట్రిక్ లక్క్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) దీనికి తోడు ఇటీవలే తమిళనాడు క్రిష్ణగిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భూమి సేకరణకు అక్కడి ప్రభుత్వంతో MOU సంతకం కుదుర్చుకుంది ఓలా. ఇందులోసెల్ ఫ్యాక్టరీ, ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ, సప్లయర్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. -
హీరో ఎలక్ట్రిక్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ నూతన ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. లుధియానా వద్ద నెలకొల్పుతున్న ప్లాంటు నిర్మాణ దశలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని పీతాంపుర వద్ద ఉన్న మహీంద్రా గ్రూప్ ప్లాంటును వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2022–23లో ఒక లక్ష యూనిట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ ఆశిస్తోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భాగస్వాములతో కలిసి పనిచేస్తునట్టు హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు. రెండు మూడేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకం స్థాయికి చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో కంపెనీ ఇప్పటి వరకు 6 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. మూడు కొత్త మోడళ్లు.. హీరో ఎలక్ట్రిక్ తాజాగా కొత్త ఆప్టిమా సీఎక్స్5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్2.0 (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ) మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ.85 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంది. జపనీస్ మోటార్ టెక్నాలజీ, జర్మన్ ఈడీయూ సాంకేతికతతో ఇవి తయారయ్యాయి. బ్యాటరీ సేఫ్టీ అలారమ్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి హంగులు ఉన్నాయి. 3 కిలోవాట్ అవర్ సీ5 లిథియం అయాన్ బ్యాటరీతో ఆప్టిమా సీఎక్స్5.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో ఎన్వైఎక్స్ 113 కిలోమీటర్లు, సీఎక్స్2.0 మోడల్ 89 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ రెండు మోడళ్లూ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
విద్యుత్ వాహనాల్లోకి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దీనిపై గ్రూప్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లోకి కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను వివరిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరి రావు ఈ విషయాలు తెలిపారు. నాలుగు చక్రాల వాహనాల తయా రీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఎప్ప ట్లోగా ప్రారంభించే అవకాశం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ప్రణాళికలు తుది దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు తమిళనాడులోని సేలంలో మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి సా మర్థ్యంతో ఉక్కు ప్లాంటు ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సహా ఆటోమొబైల్ కంపెనీలకు అవసరమయ్యే హై– వేల్యూ ఉక్కును ఈ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, సిమెంటు, పెయింట్స్ మొదలైన వివిధ రంగాల్లోనూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విస్తరించింది. -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్‌లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్‌లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్‌లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
హీరో మోటోకార్ప్ ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే నెలలో విడా బ్రాండ్ కింద తొలి మోడల్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. రవాణా రంగంలో కొత్త శకాన్ని ఆవిష్కరించేలా అక్టోబర్ 7న రాజస్థాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ( క్లిక్: మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ) తద్వారా పరోక్షంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంట్రీని వెల్లడించింది. జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డీలర్లు, ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పంపిణీదారులను ఆహ్వనించింది. జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఈ వాహనాన్ని రూపొందించినట్లు, విడా బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న ప్లాంటులో వీటి తయారీ చేపట్టవచ్చని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
2030 నాటికి 10,000 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: షెల్ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లు నెలకొల్పుతున్న ఐవోసీ, రిలయన్స్–బీపీ తదితర సంస్థల జాబితాలో తాజాగా షెల్ కూడా చేరుతోంది. 2030 నాటికి దేశీయంగా 10,000 పైచిలుకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం తమ తొలి ఈవీ చార్జర్లను ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. తొలి విడతలో బెంగళూరులోని యశ్వంత్‌పూర్, బ్రూక్‌ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది. -
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు ఎలాన్ మస్క్ శుభవార్త!
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. 2014 నుంచి ఎలాన్ మస్క్ టెస్లా సెల్ఫ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కార్లపై పనిచేస్తున్నారు. నాటి నుంచి ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో లోపాలు తలెత్తడం, టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేలా అనుమతి ఇచ్చేందుకు ఆయా దేశాలు నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో యూరప్ దేశమైన నార్వేలో జరిగిన ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మస్క్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టిని స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్, సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై కేంద్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని భావిస్తున్నా. ఆమోదాన్ని బట్టి అమెరికా, ఐరోపాలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాం అని అన్నారు. చమురు, గ్యాస్ అవసరం ఈ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో అంతకుముందు, మస్క్ మాట్లాడుతూ..ప్రపంచ నాగరికత కొనసాగాలంటే చమురు, గ్యాస్ వెలికితీతను కొనసాగించాలన్నారు. అదే సమయంలో స్థిరమైన శక్తి వనరులను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. వాస్తవానికి మనం చమురు, గ్యాస్‌ను స్వల్పకాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. లేకపోతే నాగరికత (Civilization )కూలిపోతుంది అని మస్క్ స్పష్టం చేశారు. చమురు, గ్యాస్ కోసం నార్వే ఆయిల్ డ్రిల్ ప్రాసెస్ చేయాలా అని అడిగినప్పుడు, మస్క్ ఇలా అన్నాడు: "ఈ సమయంలో కొంత అదనపు అన్వేషణ అవసరమని నేను భావిస్తున్నాను."కాగా, ఇంధన సంక్షోభంతో యూరోప్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రిలయన్స్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎం సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..వచ్చే ఏడాది నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం అంటే వెహికల్స్‌ను తయారు చేయడం కాదు. వాటికి అవసరమైన పరికరాల్ని రిలయన్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే స్థానిక ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల నుంచి ఆ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. తద్వారా దేశీయ ఈవీ వెహికల్స్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. రిలయన్స్ ఇప్పుడు ఆ అవసరాన్ని తగ్గించేందుకు గిగా ఫ్యాక్టరీలో కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ "బ్యాటరీ మెటీరియల్‌ల నుండి సెల్ తయారీ వరకు ఎండ్-టు-ఎండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, ఫాస్ట్ ఛార్జింగ్, సురక్షితమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లను అందించడమే మా ఆశయం. "కెమిస్ట్రీ, మెటీరియల్స్‌పై లోతైన అవగాహన, పరిజ్ఞానం ప్రపంచ స్థాయిలో బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడుతుందన్నారు. కాగా, రిలయన్స్ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే ఎలక్ట్రిక్ బ్యాటరీ, సోలార్ ప్యానళ్లు, ఫ్యూయల్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ బ్యాటరీలను తయారు చేయనుంది. మా లక్ష్యం అదే "గత సంవత్సరం, నేను నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్ నగర్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాను. ఈ రోజు, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం మా కొత్త గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. 2023 నాటికి ఈ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగించే బ్యాటరీలు (బ్యాటరీ ప్యాక్స్) తయారు చేయడం ప్రారంభిస్తాం.2024 నాటికి 5జీడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను తయారు చేసే దిశగా, 2027 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 50 జీడబ్ల్యూహెచ్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
1.7 కోట్ల వార్షిక యూనిట్లకు ఈవీ మార్కెట్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2021-2030 మధ్య ఏటా 49 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది. వార్షిక అమ్మకాలు 2030 నాటికి 1.7 కోట్లకు చేరుకుంటాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అందులో ద్విచక్ర ఈవీలు 1.5 కోట్లుగా ఉంటాయని తెలిపింది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, కొత్త కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం, ఈవీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ మద్దతు, ఉద్గారాల విడుదల ప్రమాణాలు ఇవన్నీ ఈవీ విక్రయాలు పెరిగేందుకు మద్దతుగా నిలుస్తున్న అంశాలని పేర్కొంది. 2020లో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ల నుంచి ఈవీ పరిశ్రమ చాలా వేగంగా కోలుకున్నట్టు గుర్తు చేసింది. 2021లో మొత్తం ఈవీ విక్రయాలు 4.67 లక్షల యూనిట్లలో సగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉండగా, ఆ తర్వాత తక్కువ వేగంతో నడిచే త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. ఇతర విభాగాల్లోనూ విక్రయాలు పుంజుకున్నట్టు పేర్కొంది. 2021–2030 మధ్య ఈవీ బ్యాటరీ డిమాండ్ ఏటా 41 శాతం మేర పెరుగుతూ, 142 గిగావాట్ హవర్‌కు (జీడబ్ల్యూహెచ్) చేరుకుంటుందని వెల్లడించింది. 2021లో 6.5 జీడబ్ల్యూహెచ్‌గా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీల ధరలు తగ్గుతుండడం, ఈవీ సాంకేతికతల్లో అత్యాధునికత వల్ల ఈవీల ధరలు కంబస్టన్ ఇంజన్ వాహనాల ధరల స్థాయికి (2024-25 నాటికి) చేరుకుంటాయని అంచనా వేసింది. భారత ఈవీ మార్కెట్లో లెడ్ యాసిడ్ ఆధారిత బ్యాటరీల ఆధిపత్యం కొనసాగుతోందని, 2021లో 81 శాతం మార్కెట్ వీటిదేనని పేర్కొంది. లిథియం అయాన్ బ్యాటరీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుందంటూ, 2021లో మొదటిసారి 1గిగావాట్‌కు చేరుకున్నట్టు వివరించింది. -
కాలుష్యం పెరిగిపోతుంది..ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగించండి!
ముంబై: ‘భారత వాహన పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.7.5 లక్షల కోట్లు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక పన్నులు ఇవ్వడంతోపాటు గరిష్టంగా ఉపాధి అవకాశాలను ఈ రంగం కలిగి ఉంది. 2024 చివరి నాటికి పరిశ్రమను రూ.15 లక్షల కోట్లకు చేర్చడం నా కల. ఇది సాధ్యం కూడా’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముడి చమురు దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించడం కోసం వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని గురువారం పిలుపునిచ్చారు. దేశంలో తొలిసారిగా ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ బస్‌లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘దేశంలో డీజిల్, పెట్రోల్ కారణంగా 35% కాలుష్యం ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ వాహనాలు అవసరం’ అని తెలిపారు. బస్‌లో 66 మంది..: హిందూజా గ్రూప్‌లో భాగమైన అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ ఈఐవీ 22 పేరుతో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్‌లను తయారు చేసింది. ప్రస్తుత డబుల్ డెక్కర్ స్థానంలో 66 సీట్లు గల ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ముంబైలో బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై, ట్రాన్స్పోర్ట్ (బీఈఎస్‌టీ) నడపనుంది. బీఈఎస్‌టీ నుంచి 200 బస్‌లకు ఇప్పటికే స్విచ్ మొబిలిటీ ఆర్డర్ దక్కించుకుంది. ఇతర నగరాల్లోనూ వీటిని పరిచయం చేసేందుకు తమ కంపెనీతో ప్రభుత్వ సంస్థలు చర్చలు జరుపుతున్నాయని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్ బాబు తెలిపారు. యూకేలోనూ స్విచ్ మొబిలిటీ డబుల్ డెక్కర్ ఈ–బస్‌లు పరుగెడుతున్నాయి. -
హడావుడి అంతా దాని గురించే, కానీ చాప కింద నీరులా..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే టూ వీలర్ సెగ్మెంట్లో అయితే కుప్పలు తెప్పలుగా ఈవీ మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కార్ల విభాగంలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. అయితే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోయినా త్రీ వీలర్ విభాగంలో ఈవీ వాహనాల జోరు కనిపిస్తోంది. తాజాగా ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్లు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. మహీంద్రా మోటార్స్ సక్సెస్ఫుల్ మోడళ్లలో ఒకటైన స్కార్పియో నుంచి సరికొత్తగా ఎన్ సిరీస్ రాబోతోంది. మహీంద్రా నుంచి ఈ ప్రకటన రావడం, అందుకు సంబంధించిన వీడియో విడుదల కావడంతో ఒక్కసారిగా ఎన్ సిరీస్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. నెట్టింటా ఎన్ సిరీస్ విశేషాలు అంతటా వ్యాపించాయి. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ప్రస్తావిస్తూ.. అందరూ స్కార్పియో ఎన్ సిరీస్ గురించే మాట్లాడుకుంటుకున్నారు. కానీ మేము చాలా నిశ్శబ్ధంగా ఇంకో విజయాత్సోవాన్ని కూడా జరుపుకున్నామని తెలిపారు. మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వెహికల్ అమ్మకాలు యాభై వేల మైలు రాయిని దాటాయి. ఈ విశేష సందర్భం స్కార్పియో ఎన్ హడావుడిలో మరుగున పడిపోయింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోయే క్రమంలో త్రీ వీలర్ వాహనాలు చాపకింద నీరులా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయనే విధంగా ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. All the attention yesterday was on the #ScorpioN But we quietly celebrated another milestone in a journey which, in the long run, will transform mobility in India… Three-wheelers are the tidal wave of electric transport… https://t.co/G55qeeY4Hn — anand mahindra (@anandmahindra) June 28, 2022 చదవండి: వారెన్ బఫెట్: చనిపోయాక కూడా మంచి మనసు చాటుకోవాలనుకున్నాడా? -
ప్రపంచంలో తొలి సోలార్ పవర్ కారు.. విశేషాలు ఇవే
జమానా అంతా పెట్రోల్/డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆలోచిస్తుంటూ నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకు వేసి సోలార్ కారుకి రూపకల్పన చేసింది. సరికొత్తగా డిజైన్ చేసిన ఈ సోలార్ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది. ఈ కారుకి లైట్‌ఇయర్ జీరోగా పేరు పెట్టారు. ప్రస్తుతం మేజర్ కార్‌మేకర్ కంపెనీలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టారు. సరికొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌ను వేధిస్తూనే ఉంది. దీంతో ఈవీ వెహికల్స్‌కి అదనపు మైలేజీ అందివ్వడం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే అవకాశం తగ్గించాలనే కాన్సెప్టుతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారుని డిజైన్ చేశారు. ఫస్ట్ ఈవీనే లైట్ ఇయర్ జీరో కారు స్వహతాగా ఎలక్ట్రిక్ కారు. 60 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంది కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్ పవర్‌ను జత చేశారు. గత ఆరేళ్లుగా ఈ కాన్సెప్టుపై పని చేయగా తొలి కారుకి ఇప్పుడు తుది రూపం వచ్చింది. సోలార్ బెనిఫిట్స్ లైట్‌ఇయర్ జీరో బాడీలో రెండు చదరపు మీటర్ల అధునాత సోలార్ ప్యానెళ్లను అమర్చారు. వీటి సాయంతో బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. ఫలితంగా అదనంగా కనీసం 50 కి.మీ మైలేజీ లభిస్తుంది. ఇలా వచ్చే అదనపు మైలేజీకి కనీస ఖర్చు కూడా ఉండకపోవడం విశేషం. బయటకు వెళితే ఛార్జింగ్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ధర ఎంతంటే లైట్ ఇయర్ జీరో కారు ధరను 2,50,00 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్ మార్కెట్లో సింహభాగం తామే ఆక్రమిస్తామని లైట్ ఇయర్ జీరో మేకర్స్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: టెస్లాలో ఉంటే సేఫ్! కావాంటే మీరే చూడండి -
తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు..ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న యూఎస్ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ తెలంగాణలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 200 ఎకరాల్లో ఈ కేంద్రం రానుంది. తొలి దశ వచ్చే ఏడాది, రెండవ దశ 2024 నాటికి పూర్తి కానుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లు. ఇది కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన తయారీలో ప్రపంచంలో అతి పెద్ద ప్లాంటు కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ సుమారు రూ.1,144 కోట్లు ఖర్చు పెడుతోంది. 3,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. టాస్క్‌మన్ కార్గో, అర్బన్ ప్యాసింజర్ వాహనాలను ప్లాంటులో తయారు చేస్తారు. బిలిటీ వాహనాల తయారీ భాగస్వామిగా హైదరాబాద్‌కు చెందిన గయమ్ మోటార్ వర్క్స్ వ్యవహరిస్తోంది. యూఎస్, జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ తదితర 15 దేశాల్లో 1.2 కోట్ల టాస్క్‌మన్ కార్గో వాహనాలు పరుగెడుతున్నాయని బిలిటీ ఎలక్ట్రిక్ సీఈవో రాహుల్ గయమ్ తెలిపారు. అమెజాన్, ఐకియా, బిగ్‌బాస్కెట్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ వంటి సంస్థలు ఉత్పత్తుల డెలివరీకి ఈ వాహనాలను వినియోగిస్తున్నాయి. చదవండి: ఓలా స్కూటర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన భవీశ్ అగర్వాల్ -
డెలివరీ సర్వీస్ టార్గెట్‌గా ఈ కామ్ ఎక్స్‌ప్రెస్
ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌లో తమ టూవీలర్లను పరిచయం చేసింది. ఈ కామర్స్ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించి గిగా ఎకానమి వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీస్ ఫస్ట్ టార్గెట్‌గా ఈ కామ్ టూ వీలర్లు తీసుకువచ్చింది. 2025 నాటికి ఈ కామర్స్ డెలివరీ వాహనాల్లో సగం వాటా సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్ ఫెసిలిటీతో సహా ఈవి రోల్-అవుట్ సర్వీస్‌లను ఈకామ్ ఎక్స్‌ప్రెస్ అందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో గణనీయమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్.. ప్రస్తుతం అక్కడ 3 వీలర్ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. కంపెనీతదుపరి విస్తరణలో భాగంగా హైదరాబాద్, జైపూర్‌లో సేవలు ప్రారంభించింది. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్, వందల కోట్లతో కేంద్రం మాస్టర్ ప్లాన్!
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. రద్దీగా ఉండే 100 జాతీయ రహదార్లలో 2023 మార్చి నాటికి 100 కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా 2,000 స్టేషన్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 2024–25 నాటికి ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను 7,000కు చేర్చాలన్నది లక్ష్యమని బీపీసీఎల్ రిటైల్ ఈడీ బి.ఎస్.రవి తెలిపారు. అంచనాలను మించి ఈవీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కనీస మౌలిక వసతుల ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తాం. తొలినాళ్లలో కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో వాణిజ్య పరంగా చార్జింగ్ స్టేషన్స్ లాభదాయకత కాదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలను కోరతాం’ అని వివరించారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ బీభత్సం..మరీ ఈ రేంజ్‌లోనా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 2020–21లో ఈవీల అమ్మకాలు 1,34,821 యూనిట్లుగా ఉండగా 2021–22లో 4,29,217 యూనిట్లకు ఎగిశాయి. 2019–20లో అమ్మకాలు 1,68,300 యూనిట్లు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. 41,046 యూనిట్ల నుంచి 2,31,338 యూనిట్లకు ఎగిశాయి. 65,303 వాహనాలతో 28.23 శాతం మార్కెట్ వాటాతో హీరో ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో నిల్చింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4,984 యూనిట్ల నుంచి 17,802 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటర్స్ 15,198 వాహనాల విక్రయాలు, 85.37 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఎఫ్ఏడీఏ లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలు 88,391 నుంచి రెట్టింపై 1,77,874 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విక్రయాలు 400 యూనిట్ల నుంచి 2,203 యూనిట్లకు పెరిగాయి. 1,605 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉండగా.. 1,397 ఆఫీసుల నుంచి ఎఫ్ఏడీఏ ఈ డేటా సేకరించింది. చదవండి: 11ఏళ్ల కష్టానికి ఫలితం, దేశీ స్టార్టప్‌కు యూరప్ నుంచి భారీ డీల్! -
చైనా కంపెనీ ‘స్వోల్ట్’తో జట్టు కట్టిన ఇండియన్ కంపెనీ
కోల్‌కతా: స్టోరేజీ బ్యాటరీ తయారీ సంస్థ ‘ఎక్సైడ్ ఇండస్ట్రీస్’ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ దిశగా కీలక ముందడుగు వేసింది. చైనాకు చెందిన ‘స్వోల్ట్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్’తో బహుళ సంవత్సరాల సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘‘ఈ ఒప్పందం కింద.. లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, టెక్నాలజీ వాణిజ్యీకరణకు అవసరమైన హక్కులు, లైసెన్స్ లభిస్తాయి. టర్న్‌కీ ప్రాతిపదికన గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని సైతం స్వోల్ట్ అందిస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయి’’ అని ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తెలిపింది. దేశంలో స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సైతం ప్రోత్సాహకాలకు ఎంపికవడం తెలిసిందే. స్వోల్ట్‌కు ఉన్న పటిష్టమైన సాంకేతికతకుతోడు, లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న గొప్ప అనుభవం ఆసరాగా.. మల్టీ గిగావాట్ లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు ఎక్సైడ్ తెలిపింది. -
హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు
చూస్తుండగానే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిపోతుంది. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్లోకి వస్తోంది. మరోవైపు పెట్రోలు ధరలు భయపెడుతూనే ఉన్నాయి. అయితే ఈవీ వాహనాలకు కొందామనుకునే వారికి ఎదురయ్యే పెద్ద సమస్య దారి మధ్యలో బ్యాటరీ డిస్ఛార్జ్ అయితే పరిస్థితి ఏంటీ అని? పెట్రోల్ బంకుల తరహాలో బ్యాటరీలు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండని భావన అనేక మందిలో ఉంది. ఎలక్ట్రిక్ వాహానాల వాడకంలో ఉన్న ఇబ్బందులను గుర్తించి బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు నగరంలో ఏర్పాటు చేసే సన్నహాలు చేస్తోంది తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్ (టీఎస్ఆర్ఈడీసీవో). ఈ మేరకు నగరంలో ఫస్ట్ ఫేస్‌లో కనీసం ఆరు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నాలుగు దిక్కులతో పాటు నగరం మధ్యన రెండు బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు రానున్నాయని టీఎస్‌ఈర్‌ఈడీసీవో అధికారులు తెలిపారు. బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లలో ఒక్కోక్కటి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల విలువైన స్వాపింగ్ బ్యాటరీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈవీ సెగ్మెంట్‌కి సంబంధించి టూ, త్రీ వీలర్లే ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణమైన బ్యాటరీలను ఫస్ట్ ఫేజ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఎల్పీజీ సిలిండర్ మార్చుకున్నంత తేలికగా ఈ స్టేషన్లలో బ్యాటరీలు మార్చుకోవచ్చని అధికారులు అంటున్నారు. చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం! -
కీలక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు..!
ముంబై: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంతకాలంగా వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెళుతోంది. కొత్త కొత్త రంగంలో పెట్టుబడులు పెడుతూ రిలయన్స్ సంస్థ ప్రస్తుతం దేశంలో దూసుకెళ్తుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతుంది. ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రూ.50.16 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొపల్షన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు లాస్ట్ మైలేజ్ రవాణాకు సంబంధించి సేవలను అందిస్తూ ఉంటుంది. 2/3/4 చక్రాల వాహనాలకు తమ సేవలను అందిస్తుంది. 100 శాతం తన సొంత టెక్నాలజీతో సదరు సంస్థ ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేసింది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవస్సరంలో రూ.104 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ పెట్టుబడుల ప్రక్రియ మార్చి 2022 నాటికి పూర్తవుతుందని తెలిపింది. "కొత్త శక్తి, కొత్త మొబిలిటీ పర్యావరణ వ్యవస్థలలో సృజనాత్మక కంపెనీలతో సహకరించాలనే మా కంపెనీ వ్యూహాత్మక ఉద్దేశ్యంలో ఈ పెట్టుబడి భాగం" అని ఆర్ఐఎల్ తెలిపింది. (చదవండి: కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!) -
Electric Tractor: తయారీ హైదరాబాద్‌లో అమ్మేది మెక్సికోలో
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో హైదరాబాద్ హవా కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లుగా ఈవీ సెగ్మెంట్లో పని చేస్తున్న కంపెనీలు ఇప్పుడు ఫలితాలను అందిస్తున్నాయి. తాజాగా సెలెస్టియల్ ఈ మొబిలిటీ సంస్థ తమ ఈ ట్రాక్టర్లను మెక్సికన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. సెలెస్టియల్ ఈ మొబిలిటీ కంపెనీ 2019లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ మొత్తం 35 రకాల వాహనాలను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 2500 డీలర్షిప్ కేంద్రాలతో పాటు 800 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. 2020 మార్చిలో ఇ ట్రాక్టర్‌ను ప్రవేశపెట్టగా మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1800 ట్రాక్టర్లు బుక్ అయ్యాయి. ఇ ట్రాక్టరులో 150 ఏఎహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ అమర్చారు. ఇ ట్రాక్టర్లో 18 బీహెచ్పీ, 15 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో మంచి స్పందన రావడంతో విదేశాలకు తమ ట్రాక్టర్లను ఎగుమతి చేసే యత్నంలో ఉంది సెలెస్టియల్ సంస్థ. అందులో భాగంగా మెక్సికన్ కంపెనీ గ్రూపో మార్వెల్సా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాబోయే మూడేళ్లలో మెక్సికో మార్కెట్లో 4000 ఇ ట్రాక్టర్లు విక్రయించడం ఈ ఒప్పందం లక్ష్యం. త్వరలోనే అమెరికా మార్కెట్లోనూ అడుగు పెడతామని సెలెస్టియల ఈ మొబిలిటీ ఫౌండర్, సీఈవో సిద్ధార్థ దురైరాజ్ తెలిపారు. చదవండి: ప్రారంభానికి ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రెడీ -
పెట్రోల్ డీజిల్ కష్టాలకు చెక్! మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ ఆటో
Mahindra launches electric three-wheeler: పెరుగుతున్న ఫ్యూయల్ రేట్లు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుంటూ ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి ఆదాయానికి గండి పెడుతున్నాయి. ఫ్యూయల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి వాహనాలు రావడం లేదనే లోటు ఉండేది. తాజాగా మహీంద్రా గ్రూపు ఈ లోటును భర్తీ చేసింది. ఈ ఆల్ఫా కార్గో పేరుతో త్రీ వీలర్ ఈవీ సెగ్మెంట్లోకి మహీంద్రా గ్రూపు అడుగు పెట్టింది. 2022 జనవరి 18న ఈ ఆల్ఫా కార్గో ను ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర 1.44 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఈ వాహనాన్ని ఛార్జ్ చేస్తే 310 కిలోల లోడుతో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నంత తేలిగా ఈ ఆల్ఫాను ఛార్జ్ చేయోచ్చని మహీంద్రా చెబుతోంది. ఫ్యూయల్ రేట్లు పెంచిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో కార్గో సేవలు అందించే ఆటోడ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కార్గో సేవల్లో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ఫ్యూయల్‌కే పోతుంది. ఇ ఆల్ఫాతో ఈ సమస్య తీరిపోతుందని మహీంద్రా చెబుతుంది. ప్యాసింజర్ విభాగంలో ఈ ఆల్ఫా మినీ కూడా మహీంద్ర పోర్ట్‌ఫోలియోలో ఉంది. -
హైదరాబాద్‌లో ఈ వీలర్స్ మొబిలిటీ ఫుల్‌ఫిల్ సెంటర్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఈవీలర్స్ మొబిలిటీ’ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. కస్టమర్లకు ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయాలన్న కంపెనీ లక్ష్యం దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. -
బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. మీ ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉందనిపి పెట్రోలు, డీజిల్ కొట్టించినంత ఈజీగా బ్యాటరీనీ మార్చుకోవచ్చు. హెచ్పీసీఎల్తో కలిసి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగంలో ఉన్న రేస్ ఎనర్జీస్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో కలిసి బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నగరంలో మొత్తం మూడు సెంటర్లు ఓపెన్ చేయాలని రేస్ లక్ష్యంగా పెట్టుకోగా అందులో మొదటి సెంటర్‌ని హైటెక్ సిటీ సమీపంలో ఐకియా ఎదురుగా ఉన్న పెట్రోలు బంకులో అందుబాటులో తెచ్చింది. రెండు నిమిషాల్లో రేస్ ఎనర్జీస్, హెచ్‌పీసీఎల్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లో డిస్ ఛార్జ్ అయిన బ్యాటరీ స్థానంలో ఛార్జ్డ్ బ్యాటరీని కేవలం రెండు నిమిషాల్లో ఫిట్ చేస్తారు. బ్యాటరీ స్వాపింగ్కి అనుగుణంగా బైకులు, ఆటోలు (త్రీ వీలర్స్) వరకు ప్రస్తుతం ఇక్కడ బ్యాటరీలు స్వాప్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఆటలోకు ఈ స్వాపింగ్ సెంటర్ ఉపయోగకరంగా మారనుంది. అయితే బ్యాటరీ స్వాపింగ్కి ఎంత్ ఛార్జ్ చేస్తున్నారనే అంశంపై రేస్ ఎనర్జీస్ స్పష్టత ఇవ్వలేదు. చదవండి:కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా? -
ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..!
స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కాసుల వర్షం కురుపిస్తోంది. గత 12 నెలలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేర్ విలువ ఏకంగా 540 శాతం ఎగబాకి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందజేసింది. సరిగ్గా 12 నెలల క్రితం కంపెనీలో పదివేల పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు రూ . 67000 రాబడిని అందించింది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్. భారత్‌లోనే అతిపెద్ద సంస్థగా..! హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థ నిలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దాదాపు 40 శాతం వాటాలను ఒలెక్ట్రా కల్గి ఉంది. ఈ సంస్థ చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో భారీ ప్లాంట్..! ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు దృష్టిసారించాయి. అయితే వీరు కేవలం టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. హెవీ వెహికిల్స్‌పై ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దృష్టిసారించింది. అందులో భాగంగా 2020 డిసెంబర్లో, హైదరాబాద్ శివార్లలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని ప్రారంభ వ్యయం సుమారు రూ. 600 కోట్లు. 10,000 యూనిట్ల సామర్థ్యంతో 150 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. షేర్ ధర ఎందుకు పెరుగుతోంది..! ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేర్ ధర గత ఏడాది నుంచి కొత్త రికార్డులను నమోదుచేస్తోంది. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో భారత్‌లోని ఆయా రాష్ట్రాలు ప్రజారవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను వాడేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల కోసం భారీ ఆర్డర్స్‌ను ఇచ్చాయి. అంతేకాకుండా దీంతో కంపెనీ షేర్ విలువ గణనీయంగాపెరుగుతోంది. భవిష్యత్తు ఎలా ఉందంటే...? ప్రజారవాణా కోసం పలు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించడంతో కంపెనీ భవిష్యత్తుపై ఎలాంటి ఢోకా లేదని నిపుణులు పేర్కొన్నారు. దాంతో పాటుగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో 6 వేల బస్సుల కోసం కంపెనీ టెండర్లు దాఖలు చేసిందని ఒలెక్ట్రా చైర్మన్ కెవి ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వ రవాణా సంస్థకు మరో 50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి బిడ్‌ను గెలుచుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా రూపొందించాలని ఆయా సంస్థలతో కంపెనీ జత కట్టింది. 2022-23లో వాటి ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనాకు చెందిన బీవైడీ సంస్థ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోవాలని కంపెనీ చూస్తోన్నట్లు సమాచారం. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
150 కి.మీ. రేంజ్‌తో భారత్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్..! ధర ఎంతంటే..?
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో పాటుగా స్టార్టప్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. తాజాగా ఒడిశాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ షెమా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఈవీ ఇండియా ఎక్స్పో 2021లో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఎస్ఈఎస్ టఫ్ హైస్పీడ్ విభాగంలో ఎస్ఈఎస్ టఫ్, లో స్పీడ్ విభాగంలో ఎస్ఈఎస్ హాబీని ఆవిష్కరించింది. ఎస్ఈఎస్ టఫ్ బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) సెగ్మెంట్ కోసం రూపొందించారు. ఎస్ఈఎస్ టఫ్ గరిష్టంగా 60 కెఎమ్‌పీహెచ్ వేగంతో 150 కిమీ మేర ప్రయాణించనుంది. ఎస్ఈఎస్ టఫ్ స్కూటర్ 150 కిలోల లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. డ్యూయల్ 60V, 30 Ah లిథియం డిటాచ్బుల్ బ్యాటరీతో రానుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది ఎస్ఈఎస్ హాబీ ఎస్ఈఎస్ హాబీ అనేది తక్కువ-స్పీడ్ కేటగిరీలో ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గరిష్ట గరిష్ట 25 kmph, ఒక సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. మేర ప్రయాణించనుంది. ఎస్ఈఎస్ హాబీలో కూడా 60 V, 30 Ah డిటాచబుల్ బ్యాటరీతో రానుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. SES తన మొత్తం ఉత్పత్తి శ్రేణిని EV ఎక్స్పో 2021లో తక్కువ-స్పీడ్ విభాగంలో ప్రదర్శించింది. ఈవీ ఎక్స్‌పోలో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ...షేమా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు & సీవోవో యోగేష్ కుమార్ లాత్ మాట్లాడుతూ..."భారత్‌లో ఈవీ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈవీ విభాగంలో భారత లక్ష్యాలను చేరుకునేందుకు తమ కంపెనీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో 2 నుంచి 3 కొత్త హై-స్పీడ్ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం షెమా నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను చేస్తోంది. రాబోయే ఆరు నెలల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక , గుజరాత్ వంటి కీలక మార్కెట్లలో తన నెట్‌వర్క్‌ను విస్తరించే యోచనలో ఉందని పేర్కొన్నారు. చదవండి: భారత్‌కు రానున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..! -
2021లో విడుదలైన దిగ్గజ కంపెనీల టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
2020తో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం చేత ఈ ఏడాది ఈవీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. 2021లో ఎలక్ట్రిక్ లగ్జరీ కారు మార్కెట్ విభాగంలో అనేక కొత్త ఈవీలు లాంచ్ అయ్యాయి. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ తన రెండవ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. 2021లో ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు తమ వాహనలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ దిగ్గజ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల గురుంచి ఒకసారి తెలుసుకుందాం.. జాగ్వార్ ఐ-పేస్ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ఈ ఏడాది తన ఎలక్ట్రిక్ కారును ఐ-పేస్ పేరుతో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు 90కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత నడుస్తుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ గల కారు 550 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర రూ.1.06 కోట్లు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. (చదవండి: టాటా మరో రికార్డ్ ! చెప్పారంటే చేస్తారంతే..) టాటా టిగోర్ ఈవీ ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ 2020లో విడుదల చేసిన టాటా నెక్సాన్ కారు విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా టాటా టిగోర్ ఈవీను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. టిగోర్ ఈవీ 26కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇది 74 బీహెచ్పీ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 306 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలో 4-స్టార్ రేటింగ్ పొందింది. టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.11.99 లక్షల(ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది. ఆడి ఇ-ట్రాన్ 50 & ఇ-ట్రాన్ 55 జర్మనీ విలాస కార్ల దిగ్గజం ఆడి సరికొత్త విద్యుత్ కారు ఇ-ట్రాన్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. రెండు బాడీ స్టైల్స్ ఆడి ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55 వెర్షన్లను తీసుకొచ్చింది. ఇ-ట్రాన్ ఎస్యూవీ కొనుగోలు చేసే వినియోగదార్లకు రెండు ఛార్జర్లు- ఒక 11కి.వా. కాంపాక్ట్ ఛార్జర్, అదనంగా వాల్ బాక్స్ ఏసీ ఛార్జర్ ఇవ్వనుంది. వీటితో వినియోగదారులు కోరుకున్న ప్రదేశంలో ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. దశలవారీగా ఆడి ఇండియా విక్రయశాలల్లో 50 కి.వా. డీసీ ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆడి ఇ-ట్రాన్ 50 71కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఇది 308 బీహెచ్పీ పవర్, 540 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇ-ట్రాన్ 55 కారు 95కెడబ్ల్యుహెచ్ బ్యాటరీని పొందుతుంది. ఇది 402 బీహెచ్పీ పవర్, 664 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పూర్తి ఛార్జ్ పై 359 కిలోమీటర్లు, 484 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఆడి ఇ-ట్రాన్ జీటీ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి భారత మార్కెట్లోకి ఇ-ట్రాన్ జిటి, అర్ఎస్ ఇ-ట్రాన్ జిటి కూపే సెడాన్‌ను విడుదల చేసింది. ఇ-ట్రాన్ జిటి, ఆర్ఎస్ మోడల్‌ను పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు సాంకేతిక జోడింపుతో దీన్ని అభివృద్థి చేసింది. ఇక ఇ-ట్రాన్ జిటి కారు ధరను రూ. 1.8 కోట్లుగా నిర్ణయించింది. ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి కూపే ధర రూ 2.05 కోట్లుగా పేర్కొంది. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీని సొంతమని తెలిపింది. 93కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల ఇ-ట్రాన్ జిటి కారు 523 బీహెచ్పీ పవర్, 630 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆర్ఎస్ మోడల్ 637 బీహెచ్పీ పవర్, 830 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటి కంబైన్డ్ ఎలక్ట్రిక్ రేంజ్ 388 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో, కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసుకున్న వారికి 2022 ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ఆల్ వీల్ డ్రైవ్ వాహనంగా వస్తోంది. ఇందులో రెండు విద్యుత్ మోటార్లు అమర్చారు. ఈ వాహణం 6.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద స్మార్ట్ బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ఉచితంగానే అందిస్తున్నారు. 71కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల బీఎండబ్ల్యూ ఐఎక్స్ కారు 326 బీహెచ్పీ పవర్, 630 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. పోర్షే టేకాన్ జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే తొలి విద్యుత్తు కారు టేకాన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.1.5 కోట్లు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించారు. టేకాన్, టేకాన్ 4ఎస్, టర్బో, టర్బో ఎస్ అనే నాలుగు మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. 4ఎస్, టర్బో, టర్బో ఎస్ మోడళ్లలో క్రాస్ టూరిస్మో అనే వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వీటిని వినియోగదారులకు అందించనున్నారు. వీటి ధరలు రూ.1.50 కోట్ల నుంచి ప్రారంభమై రూ.2.30 కోట్ల వరకు ఉండనుంది. టేకాన్ కార్ల బ్యాటరీ సామర్థ్యం 79.2 - 93.4 కేడబ్ల్యూహెచ్ మధ్య ఉంది. టేకాన్ టర్బో ఎస్ స్పోర్ట్స్ మోడల్ పోర్షే కార్లలో అన్నింటికంటే శక్తిమంతమైందని సంస్థ తెలిపింది. 750 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుందని పేర్కొంది. 2.8 సెకన్లలో 0-100 కి.మీ/గం.కు వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456-484 కి.మీ వరకు ప్రయాణిస్తుందని వెల్లడించింది. (చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు) -
Electric Mobility: ఐదేళ్లు.. రూ. 94,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వచ్చే అయిదేళ్లలో దాదాపు రూ. 94,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయంగా వ్యాపార అవకాశాలు కల్పించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కోలియర్స్ ఇండియా, ఇండోస్పేస్ సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ఫుల్ గేర్‘ నివేదిక ప్రకారం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పరిశ్రమ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. అయితే, ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహకాలు, వాతావరణ మార్పులపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2070 నాటికి కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా స్థాయికి తేవాలని భారత్ నిర్దేశించుకుంది. దేశీయంగా కర్బన ఉద్గారాలను వెలువరించే రంగాల్లో రవాణా రంగం మూడో స్థానంలో ఉంది. దీని వల్ల వాతావరణానికి జరుగుతున్న హానిని అంతా గుర్తిస్తున్న క్రమంలో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగగలదని నివేదిక వివరించింది. వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థలం అవసరమవుతుందని, తద్వారా రియల్ ఎస్టేట్‌కు కూడా డిమాండ్ పెరుగుతుందని నివేదిక తెలిపింది. 2030 నాటికి 110 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని సాధించడానికి 1300 ఎకరాల పైగా స్థలం అవసరమవుతుందని పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 26,800 పబ్లిక్ చార్జింగ్ స్పాట్లు అవసరమవుతాయని వివరించింది. వీటి కోసం 13.5 మిలియన్ చ.అ. స్థలం కావాలని తెలిపింది. ‘స్థల యజమానులు రద్దీ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లను చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు అవుట్సోర్స్ చేయొచ్చు. అలాగే చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లతో ఆదాయంలో వాటాల ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు‘ అని నివేదిక తెలిపింది. ప్రస్తుతం 15 రాష్ట్రాలు ఇప్పటికే ఈవీ విధానాలను ఆమోదించడమో లేదా నోటిఫికేషన్ ఇవ్వడమో చేశాయి. ఈవీల తయారీ, నిల్వ, చార్జింగ్ స్టేషన్లు, డీలర్‌షిప్‌లు వంటి అంశాల్లో అవకాశాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అందిపుచ్చుకోవాలని కోలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు తమ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
రిలయన్స్‌తో జట్టు కట్టిన మహీంద్రా గ్రూపు.. ఆ సెక్టార్లో సంచలన మార్పులు
దేశీ పారిశ్రామిక రంగంలో దిగ్గజ సంస్థలైన రియలన్స్, మహీంద్రా గ్రూపులు చేతులు కలిపాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈవీ సెగ్మెంట్లో ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటాయి.ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా జియో బీపీ పేరుతో ఫ్యూయల్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఇక్కడ సంప్రదాయ పెట్రోలు డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలి ఫ్యూయల్ స్టేషన్‌ని ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీగా పేరున్న మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించింది. ఆటో మొదలు బస్సుల వరకు మహీంద్రా పలు రకాల వాహనాలను మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్ల కొరత దేశ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయల కొరత అధిగమించే దిశగా పని చేయాలని మహీంద్రా, రిలయన్స్ నిర్ణయించాయి. జియో బీపీ స్టేషన్లలో ఛార్జింగ్, స్వాపింగ్, సర్వీసింగ్ తదితర సేవలు మహీంద్రా వాహనాలకు అందుతాయి. -
వచ్చే 5 ఏళ్లలో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
గ్లోబల్ వార్మింగ్ సమస్యలను ఎదుర్కొవడం కోసం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. అంతేకాకుండా కంపెనీలు కూడా పెట్రోల్, డిజీల్‌తో నడిచే సాంప్రదాయ వాహనాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రిక్ వాహనాలపై అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు కూడా ప్రత్యామ్నాయాలపై చూస్తున్నారు. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. భారత ఈవీ మార్కెట్ల్పై దిగ్గజ కంపెనీల దృష్టి..! దేశీయ కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా భారత ఈవీ మార్కెట్లపై దృష్టిసారించాయి. టెస్లా లాంటి కంపెనీలు భారత మార్కెట్లలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. భారత్‌లో అధిక దిగుమతి సుంకాలు ఉండడంతో పలు విదేశీ కంపెనీల రాక ఆలస్యమవుతోంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ కంపెనీ, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రధాన పోటీదారులగా నిలవనున్నాయి. లగ్జరీ కార్ స్పేస్‌లో...మెర్సిడెస్-బెంజ్ ఇండియా, ఆడి ఇండియా , జాగ్వార్ ఇండియా వంటి బ్రాండ్లతో పాటుగా బీఎండబ్ల్యూ, వోల్వో కంపెనీలు కూడా భారత ఎలక్ట్రిక్ మార్కెట్లపై దృష్టిసారించాయి. వచ్చే 5ఏళ్లలో 78 బిలియన్ డాలర్లకు..! రీసెర్చ్ అండ్ మార్కెట్స్ చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం... భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 78 బిలియన్ డాలర్లకు పైగా చేరుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి సాంకేతికతలో నిరంతర పురోగతి మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌కు డిమాండ్‌ను పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. దక్షిణ భారతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత ఆదరణ ఉందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ వెల్లడించింది. గణనీయమైన వృద్ధి..! ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్సైట్ల ప్రకారం...ఈ-స్కూటర్లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్‌సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్ డయల్ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జస్ట్ డయల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు కేంద్రం శుభవార్త..! -
ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రావాలంటే..ఇలా చేయాల్సిందే..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. టెస్లా లాంటి కంపెనీలు భారత్‌లోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తుండగా...అధిక దిగుమతి సుంకాలతో టెస్లా ఏంట్రీ కాస్త నెమ్మదించింది. ఇతర విదేశీ కంపెనీలు కూడా భారత్‌లోనే అడుగుపెట్టేందుకు సన్నహాలను చేస్తున్నాయి. కాగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకోవాలని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సూచించింది. ఒక నిర్ణీత కాలం పాటు లేదా పరిమిత యూనిట్లపై ఇంపోర్ట్ టాక్స్ తగ్గించాలని బీఎండబ్ల్యూ పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ వెల్లడించింది. తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం..! అధిక దిగుమతి సుంకాలు తగ్గితే...భారత్‌లోనే పలు దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ అభిప్రాయపడింది. బీఎండబ్ల్యూ వాహనాలకు భారత్‌లో క్రేజ్ ఉండడంతో గత 15 ఏళ్లుగా తమ కంపెనీ భారత్‌లోనే పలు మోడళ్లను తయారు చేస్తోందని బీఎండబ్ల్యూ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మూడు విద్యుత్తు కార్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు బీఎండబ్ల్యూ ఇటీవల ప్రకటించింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు 100 శాతం వరకు..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం -
ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరీ ఇంతగా ఉందా...!
Demand For Electric Vehicles Justdial Report: అధిక ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలకు గుడ్‌బై చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని జస్ట్‌డయల్ తన నివేదికలో వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో ఈవీ ట్రెండ్‌లో ముందున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై లాంటి టైర్ 1 నగరాల్లో ఈ-స్కూటర్, ఈ-కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. గణనీయమైన వృద్ధి..! ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్సైట్ల ప్రకారం...ఈ-స్కూటర్లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్‌సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్ డయల్ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జస్ట్ డయల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది. ఇక టైర్ 2 నగరాల్లో మైసూర్, ఇండోర్, జైపూర్, సూరత్, ఆగ్రా, జోధ్‌పూర్, సాంగ్లీ, వడోదర, నాసిక్, చండీగఢ్ నగరాలు టాప్-10 లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వచ్చినప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు మొదటి మూడు టైర్ 1 నగరాల్లో నిలవగా... తరువాతి స్థానాల్లో హైదరాబాద్, పూణే, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నిలిచాయి. నాసిక్, లక్నో, నాగ్‌పూర్, కోయంబత్తూర్, జైపూర్, విజయవాడ, గోవా, సూరత్, జబల్పూర్ , విశాఖపట్నం ఈ-కార్ల డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ విభాగంలో కూడా ఎక్కువే..! లగ్జరీ కార్ల విభాగంలో కూడా డిమాండ్ పెరిగిందని జస్ట్ డయల్ నివేదిక వెల్లడించింది. బుగట్టి, ఫెరారీ, లంబోర్ఘిని , పోర్స్చే డిమాండ్‌లో పెరుగుదల కనిపించింది. బుగట్టి అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా సుమారు...ఈ పండుగ సీజన్లో 167 శాతం డిమాండ్‌ను కల్గి ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త ఎలక్ట్రిక్ ఆటోపై అదిరిపోయే ప్రారంభ ఆఫర్!
దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. వారానికి ఒక కొత్త ఈవీ మార్కెట్లోకి విడుదల అవుతుంది. తాజాగా మరో కంపెనీ తన త్రీ-వీలర్ కార్గో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒమేగా సైకి మొబిలిటీ, బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ భాగస్వామ్యంతో నేడు భారతదేశపు అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ Rage+ ర్యాపిడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్లలో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. రూ.10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ఎలక్ట్రిక్ ఆటోను సొంతం చేసుకోవచ్చు. Rage+ ర్యాపిడ్ ఈవీ ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు, 140 క్యూబిక్ అడుగుల టాప్ బాడీ కంటైనర్ గల Rage+ ర్యాపిడ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99గా ఉంది. ఈ ఆటోను కొన్న మొదటి వెయ్యి మంది కస్టమర్లకు ప్రారంభ ఆఫర్ కింద రూ.1 లక్ష వరకు తగ్గింపు అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ మొదటి 1,000 వెయ్యి మందికి మాత్రమే వర్తిస్తుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్ పొందడం కోసం కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ rapidev.liveని సందర్శించవచ్చు. ఆన్లైన్ ప్రీ-బుకింగ్ చేసిన తర్వాత మిగిలిన చెల్లింపు ప్రక్రియ, ఫార్మాలిటీలను పూర్తి చేయడం కోసంఒమేగా సైకి/ లాగ్ 9 బృందం కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతారు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) వాహనం వారి ప్రీ-బుకింగ్ చేసిన తేదీ నుంచి 4-6 వారాలలోపు కస్టమర్‌కు డెలివరీ చేయనున్నారు. ఒమేగా సైకి Rage+ ర్యాపిడ్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వాహనాలను ఫాస్ట్ చార్జర్ సహాయంతో 35 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 90కిమీల వరకు వెళ్తుంది. లాగ్ 9 ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ ద్వారా పనిచేసే Rage+ ర్యాపిడ్ ఈవీలు 5 సంవత్సరాలలోపు (కొనుగోలు చేసిన తర్వాత) రూ. 1 లక్ష బైబ్యాక్ గ్యారెంటీతో పాటు వస్తాయి. ఈ బైబ్యాక్ గ్యారెంటీ భారతీయ మార్కెట్లో మొదటిది. అదనంగా, Rage+ ర్యాపిడ్ ఈవీ 5 సంవత్సరాల వాహన వారంటీ, 6 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తుంది. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) -
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
Multibagger Olectra Greentech: స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్‌మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్‌గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్‌క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. కోటికి పది కోట్ల రూపాయలు ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది. పెట్రోలు ధరలు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్‌కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్‌లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా హైడ్రోమెకానిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్ -
జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీసంస్థ హీరో ఎలక్ట్రిక్ అక్టోబర్ నెలలో గణనీయంగా అమ్మకాలు జరిపింది. గత నెలలో తన 6,366 హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ నెలలో 6,500 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాల(314 యూనిట్లు)తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 1900 శాతం ఎక్కువగా పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 50,331 యూనిట్లకు చెరినట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "వినియోగదారులకు 50,000 బైక్ లను డెలివరీ చేయడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ, డెలివరీల కోసం వెయిటింగ్ జాబితాలో ఉన్న మరో 16,500 మంది కస్టమర్లకు మేము క్షమాపణ చెప్పాలి. పెరుగుతున్న డిమాండ్లకు తగ్గట్టు రాబోయే రోజుల్లో వాహన డెలివరీ చేయడానికి సంస్థ తన సామర్థ్యాలను పెంచాలని చూస్తోందని" ఆయన అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ఐదు లక్షల యూనిట్ల వరకు విస్తరించనున్నట్లు కంపెనీ ఇంతకు ముందు తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్‌న్యూస్!) హైస్పీడ్ కేటగిరీలో హీరో ఎలక్ట్రిక్ సిటీ స్పీడ్ స్కూటర్లు ఆప్టిమా, ఎన్ వైఎక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య కాలంలో ఈ రెండు ఎలక్ట్రిక్ హైస్పీడ్ స్కూటర్లు భారత్ అంతటా 15,000 అమ్ముడయ్యాయి. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశం అంతటా 1650 ఛార్జింగ్ స్టేషన్లను హీరో ఎలక్ట్రిక్ కలిగి ఉంది. -
ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో మొబైల్ దిగ్గజ కంపెనీ
భవిష్యత్తు రవాణా రంగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక గమ్య స్థానంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం వాహన మార్కెట్లో ఉన్న దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. అలాగే, కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కూడా ఎలక్ట్రిక్ వాహానాల తయారీపై దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ కార్లను 2024 ప్రథమార్థంలో లాంచ్ చేయనున్నట్లు షావోమీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రిక్ మార్కెట్లోకి రియల్మీ తాజాగా వస్తున్న సమాచార ప్రకారం ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ రియల్మీ, ఎలక్ట్రిక్ వేహికల్(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో రియల్మీ ఒకటి. కంపెనీ ఏప్రిల్ 2021లో ఒక మిలియన్ యూనిట్లను విక్రయించింది. 100 మిలియన్ స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా రియల్మీ నిలిచింది. ఈ ఘనతను కేవలం 37 నెలల వ్యవధిలో సాధించింది. చైనాతో పాటు భారతదేశంలో కూడా రియల్‌మీకి బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ కొద్ది రోజుల క్రితం 'రియల్మీ టెక్ లైఫ్' బ్రాండ్ పేరుతో మనదేశంలో ట్రేడ్ మార్క్ చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్(షెన్ జెన్)కో లిమిటెడ్ ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకుంది. (చదవండి: రేషన్ షాపుల్లో ముద్రా లోన్ సేవలు) ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ఈవీల ఉత్పత్తిలో చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. సమీప భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు భారతదేశం గమ్యస్థానంగా మారే అవకాశం ఉండటంతో రియల్మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ వేహికల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ ఆలోచన చేస్తున్నట్లు ట్రేడ్ మార్క్ నిరుపిస్తుంది. కంపెనీ సొంతంగా వెళ్తుందా లేదా మరో మొబిలిటీ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పరిస్తుందా అనేది ఇంకా తెలీదు. రియల్మీ ప్రారంభంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. (చదవండి: ముఖేశ్ అంబానీ కూతురికి అరుదైన గౌరవం) -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం..!
పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కాగా కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందనే అపోహాలతో తిరిగి సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారికోసం హాంకాంగ్‌కు చెందిన బ్యాటరీ కంపెనీ డెస్టెన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! డెస్టెన్ తయారుచేసిన బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని పేర్కొంది. 900 kW అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో బ్యాటరీలు మెరుపువేగంతో ఛార్జ్ చేయబడతాయని డెస్టెన్ వెల్లడించింది. డెస్టెన్ అభివృద్ధి చేస్తోన్న బ్యాటరీ టెక్నాలజీ పిచ్జిటి ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో వాడే 75kWh బ్యాటరీ ప్యాక్ కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతోందని డెస్టెన్ పేర్కొంది. డెస్టెన్ బ్యాటరీలు మార్కెట్లలోకి వస్తే ఛార్జింగ్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చును. పిచ్జిటి సింగిల్ ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణించనుంది. డెస్టెన్ తన కంపెనీ బ్యాటరీలపై 3 వేల ఛార్జింగ్ సైకిల్స్, 15 లక్షల కిలోమీటర్ల రేంజ్ వ్యారంటీని కూడ అందిస్తోంది. అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సమయంలో బ్యాటరీలు వెడేక్కకుండా కూలింగ్ టెక్నాలజీను రానున్నాయి. చదవండి: ఫేస్బుక్ డౌన్ అయ్యిందో లేదో...! టెలిగ్రామ్ రయ్రయ్ అంటూ రాకెట్లా..! -
మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. కుర్రకారు ఫిదా కావాల్సిందే!
బెంగళూరు: ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక లెక్క నేను ఒక లెక్క అంటుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటి మార్కెట్లో హీట్ పెంచుతున్నాయి. త్వరలోనే ఈ పోటీలో చేరడానికి అల్ట్రా వయొలెట్ ఎఫ్77 స్పోర్ట్స్ బైక్ రాబోతుంది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ తన మొదటి బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77ను మార్చి 2022 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అల్ట్రా వయొలెట్ ఎఫ్77. ఇప్పటివరకు ఇదే భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్. (చదవండి: 6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!) అయితే, కంపెనీ ఇంకా అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ ధరను ఆవిష్కరించలేదు. అయితే, ఫేమ్ 2 సబ్సిడీకి ముందు ఈ బైక్ సుమారు రూ.3 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు లాంఛ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఆటోమేకర్ పేర్కొంది. రాబోయే ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ ఛార్జ్ పై సుమారు 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వేహికల్ మేకర్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీలో బైక్ లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ మొదటి సంవత్సరంలో సుమారు 15,000 యూనిట్లను తయారు చేయగలదని పేర్కొంది. ఈ బైక్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇది ఓలా ఎస్1 ప్రొ కంటే కనీసం 30 కిలోమీటర్లు ఎక్కువ. 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలో మూడు బ్యాటరీలు ఉంటాయి. దీనిని ఫాస్ట్ చార్జర్ సహాయంతో 1.5 గంటలు, సాధారణ చార్జర్ సహాయంతో 5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. ఇండలో Eco mode / Sport mode / Insane mode ఉన్నాయి. ఇంకా ఇతర స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
రివ్వున దూసుకుపోయిన టాటా మోటార్స్ షేర్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో టాటా మోటార్స్ షేరు 1.3 శాతం బలపడింది. ఎలక్ట్రిక్ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్ క్లయిమేట్ బిలియన్ డాలర్లు (రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా టాటా షేర్లు జూమ్మంటూ దూసుకుపోయాయి. దీంతో షేర్ వాల్యూ గరిష్టంగా రూ. 421 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో అయితే రూ. 436 సమీపంలో ట్రేడయ్యి 52 వారాల గరిష్టాన్ని తాకింది. భారీ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహన తయారీకి ఇటీవలే ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలో ఏడీక్యూతో కలిపి టీపీజీ రైజ్ క్లయిమేట్ బిలియన్ డాలర్లు(రూ. 7,550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. తద్వారా 11–15 శాతం మధ్య వాటాను పొందనున్నట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ తెలియజేసింది. 9.1 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో తాజా పెట్టుబడులు లభిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. భవిష్యత్‌లో షేర్లుగా మార్పిడయ్యే(తప్పనిసరి) సెక్యూరిటీల జారీ ద్వారా ఈవీ అనుబంధ సంస్థలో ఏడీక్యూ, టీపీజీ రైజ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 18 నెలల్లోగా రెండంచెలలో పెట్టుబడులు లభించనున్నట్లు తెలియజేసింది. అబుధాబి ప్రభుత్వానికి వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించే ఏడీక్యూ దేశ, విదేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రధాన పాత్రకు సిద్ధం తమ ఎలక్ట్రిక్ వాహన ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లయిమేట్ జత కలవడం ఆనందాన్నిస్తున్నట్లు టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో మార్పులు తీసుకురాగల ఈవీ విభాగంలో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని తెలియజేశారు. ఈ బాటలో 2030కల్లా ఎలక్ట్రిక్ వాహన వాటాను 30 శాతానికి పెంచే ప్రభుత్వ ప్రణాళికలు(విజన్)కు అనుగుణంగా ప్రధాన పాత్రను పోషించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. టాటా మోటార్స్కున్న ప్రస్తుత పెట్టుబడులు, సామర్థ్యాలను కొత్త ఈవీ కంపెనీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్ పెట్టుబడులను ఎలక్ట్రిక్ వాహనాలు, బీఈవీ ప్లాట్పామ్స్, అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో 10 ఈవీలతోకూడిన పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ భాగస్వామ్యంతో ఛార్జింగ్ మౌలికసదుపాయాలను వేగవంతంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా ఈవీలకు భారీ అవకాశాలున్నట్లు టీపీజీ రైజ్ క్లయిమేట్ వ్యవస్థాపక భాగస్వామి జిమ్ కౌల్టర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ విధానాలు ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: అదృష్టమంటే ఇదేనేమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ క్రేజ్,కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ:జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్ వాహనాలకు సౌలభ్యత కలిగించడానికి చార్జింగ్ మౌలిక వ్యవస్థను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు. ఒక వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న ఆటోమొబైల్ పరిశ్రమ, క్రమంగా రికవరీ చెందుతుండడం తనకు సంతోషం కలిగిస్తోందని తెలిపారు. భారత్ జీడీపీ వ్యవస్థలో ఆటో రంగం వాటా 7.1 శాతం అని ఆయన పేర్కొంటూ, తయారీ జీడీపీ విషయంలో 49 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లుకాగా, ఎగుమతుల విలువ రూ.3.5 లక్షల కోట్లని వివరించారు. జూలై 2021లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలవారీగా 229 శాతం పెరిగి 13,345 యూనిట్లకు చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. వార్షికంగా చూస్తే 836 శాతం పురోగతి ఉందని వివరించారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన అంశమని పేర్కొన్నారు. రవాణా రంగం విషయంలో పర్యావరణ పరిరక్షణ విధానాలకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చదవండి: ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే -
ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త!
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ఏబీబీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్‌ని "టెర్రా 360" పేరుతో విడుదల చేసింది. దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికలతో వచ్చినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా విడుదల చేసిన టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగలదు. 15 నిమిషాల్లో 500 కి.మీ వెళ్లగల ఒక ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఎలక్ట్రిక్ కారును 3 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 100 కి.మీల దూరం వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 360 kW అవుట్‌పుట్ కలిగి ఉంది. ఈ ఏడాది చివరినాటికి యూరప్, యునైటెడ్ స్టేట్స్లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో 2022లో తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఏబీబీ ఛార్జర్లకు డిమాండ్ పెరుగుతోంది. 2010లో ఈ-మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి 88కి పైగా మార్కెట్లలో 4,60,000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను విక్రయించింది. ఎలక్ట్రో ఛార్జింగ్ వ్యాపారంలో తన హవాను కొనసాగించాలని కోరుకుంటుంది. 2020లో 220 మిలియన్ డాలర్ల విక్రయాలు కలిగిన ఏబీబీ వాహన ఛార్జింగ్ వ్యాపారం ఒక ఫ్లోట్లో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువను సాధించగలదని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!) -
రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. అంతేకాకుండా శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. కాగా తాజాగా బీఎమ్‌డబ్య్లూకు చెందిన ప్రముఖ బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టింది. రోల్స్‌రాయిస్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో ‘స్పెక్టర్’ తొలి కారుగా నిలవనుంది. రోల్స్‌రాయిస్ తన తొలి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టార్‌ను 2023 నాలుగో త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1100 కిలోమీటర్లు..వరల్డ్ రికార్డ్ పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్...! పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రోల్స్‌రాయిస్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని..శిలాజ ఇంధనాల కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనుందని రోల్స్ రాయిస్ సీఈవో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు రోల్స్‌రాయిస్ పేరెంట్ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ముడిచమురునుపయోగించి వాడే కార్లను ఎప్పుడూ నిలిపివేయనుందనే విషయం స్పష్టంగా లేదు. కానీ 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేస్తోందని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ కూడా 2025 నాటికి ఎలక్ట్రిక్‌వాహనాలను ఉత్పత్తి చేయనుంది. చదవండి: మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్ కార్ -
20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. టెస్లా కార్లు ఒక్క సారి ఛార్జ్ చేస్తే సుమారు 758 కిలోమీటర్లకు వరకు ప్రయాణిస్తాయి. రేంజ్ విషయంలో టెస్లాను అధిగమించడానికి పలు ఆటోమొబైల్ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా టెస్లాకు పోటీగా అమెరికన్ స్టార్టప్ లూసిడ్ మోటార్స్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ కారును తీసుకురానుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! లూసిడ్ కార్లు టెస్లా కార్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. టెస్లా కార్లకు పోటీగా లూసిడ్ తన కారును తయారుచేస్తోంది. ఈ కారున ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 840 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి.ఇది టెస్లా మోడల్ ఎస్ లాంగ్ రేంజ్ కంటే 161 కిమీ ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌ను ఏర్పాటుచేయడంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్ వెల్లడించింది. ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఈ ఎడాది చివర్లో అమ్మకాలను జరపాలని కంపెనీ భావిస్తోంది. ఈ కారు సుమారు రూ. 57 లక్షల నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ 113కేడబ్ల్యూహెచ్ బ్యాటరీను అమర్చారు. ఈ కారులో డ్యూయల్ ఆక్టివ్ కోర్ మోటార్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కారులో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకుగాను సెమి ఆక్టివ్ సప్సెన్షన్‌ను వాడారు. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. కొన్ని కంపెనీలు కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా తయారుచేయాలని నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులపై దిగ్గజ కంపెనీలు మెర్సిడెజ్ బెంజ్, వోల్వో వంటి కంపెనీలు దృష్టిసారించాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో యూరప్‌కు చెందిన ఫ్యూచరికం కంపెనీ సంచలనాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 1,099కి.మీ మేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..! డిపీడీ స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్స్ భాగస్వామ్యంతో వోల్వో ట్రక్ యూనిట్‌ను మాడిఫై చేసి ఫ్యూచరికం ట్రక్‌ను డెవలప్ చేసింది. కంపెనీ నిర్వహించిన రేంజ్ టెస్ట్‌లో సుమారు ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నారు. ఓవల్ టెస్ట్ ట్రాక్ మీద ట్రక్ సుమారు 23 గంటల్లో 392 ల్యాప్‌లను పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ట్రక్ సరాసరి గంటకు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. డీపీడీ స్విట్జర్లాండ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ డైరక్టర్ మార్క్ ఫ్రాంక్ మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఇదొక సంచలన విజయమని పేర్కొన్నారు. ఫ్యూచరికం కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్‌లో సుమారు 680కేడబ్య్లూహెచ్ బ్యాటరీను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ట్రక్ పూర్తి బరువు 19 టన్నులు. 680కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సుమారు 680హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయనుంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ బైక్ ధర మరింత ప్రియం..! కొత్త ధర ఏంతంటే -
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..!
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చింది. ఆటోమొబైల్ కంపెనీల సహయం లేకుండా ఒంటరిగానే ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆపిల్ పేర్కొంది. మెయిల్ ఎకనామిక్ డైలీ కథనం ప్రకారం.. ఆపిల్ ప్రస్తుతం వాహన వీడిభాగాల సరఫరా కోసం పలు కంపెనీలు ఎంచుకుంటుందని తెలిసింది.గతంలో ఆపిల్ పలు ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు బీఎమ్‌డబ్ల్యూ, హ్యుందాయ్, నిస్సాన్, టయోటాలను సంప్రదించింది. ఉమ్మడిగాగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్లాన్ చేయడంకోసం ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావించింది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! ఎలక్ట్రిక్ వాహనాల తయారీ భాగంగా ఆపిల్ ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (ఆర్ఎఫ్ఐ), రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పి), రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్ఎఫ్క్యూ) లను గ్లోబల్ ఆటోమొబైల్ పార్ట్ తయారీదారులకు పంపే ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను రూపోందించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రొడక్షన్, స్టీరింగ్, డైనమిక్స్, సాఫ్ట్వేర్,ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అనుభవం ఉన్న ఇద్దరు మాజీ మెర్సిడెస్ ఇంజనీర్లను ఆపిల్ నియమించింది. ప్రస్తుతం వీరు ఆపిల్ స్పెషల్ ప్రాజెక్ట్ గ్రూప్‌లో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆపిల్ ఉత్పత్తుల విశ్లేషకుడు మిండ్-చికుయో 2025-2027 వరకు ఆపిల్ కార్ల విడుదల అవకాశం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆపిల్ కార్ల లాంచ్ మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆపిల్ ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్ట్ హెడ్ డౌగ్ ఫీల్డ్ కంపెనీ విడిచిపెట్టి ఫోర్డ్ మోటర్స్‌లో చీఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆఫీసర్‌గా జాయిన్ కానున్నాడు. దీంతో ఆపిల్‌కు ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో దెబ్బ తగిలినట్లుగా నిపుణుల విశ్లేషిస్తున్నారు. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! -
ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్‌గేట్స్, జెఫ్‌బెజోస్..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్..! ఎంత త్వరగా వీలైతే అంతా తక్కువ సమయంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్ శక్తిని ఉపయోగించి వాహనాల తయారీ కోసం ఇప్పటికే పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. చదవండి: Elon Musk SpaceX: కక్ష్యలో 3 రోజుల ప్రయాణానికి సర్వం సిద్ధం ఎలన్‌మస్క్‌కు చెందిన టెస్లా ఒక అడుగు ముందేకేసి ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్‌చేస్తే ఆరు వందల కిలోమీటర్లమేర ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ అనేది ఆయా వాహనాల మెటల్ బాడీపై ఆధారపడి ఉంటుంది. అత్యంత మన్నికైన, తేలికైన, శక్తివంతమైన, మెటల్ బాడీల తయారుకోసం పలు శాస్త్రవేత్తలు పరిశోధనలను చేపట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లోహలకోసం చేపట్టే పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చేందుకు గాను ప్రపంచ బిలియనీర్లు అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కోబోల్డ్ అనే మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ స్టార్టప్‌లో భారీగా నిధులను ఇన్వెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. కోబోల్ట్ స్టార్టప్, బీహెచ్పీ కంపెనీ భాగస్వామ్యంతో ఈవీ వాహనాల్లో వాడే లోహలను వెతకడం కోసం పరిశోధనలను చేపట్టనున్నారు. వీరు అందించే లోహలు ప్రాథమికంగా టెస్లా కార్ల తయారీకి ఉపయోగపడనుంది. కోబోల్డ్ మెటల్స్ , బిహెచ్పి కలిసి ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్, కోబాల్ట్, రాగి కోసం శోధిస్తాయని కోబోల్డ్ సిఇఒ కర్ట్ హౌస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెస్లా కార్ల బ్యాటరీలో వాడే నికెల్ అందించడంకోసం టెస్లాతో బీహెచ్పీ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృత్రిమ మేథస్సు ఏఐ టెక్నాలజీనుపయోగించి ఈవీ వాహనాల లోహలకోసం కోబోల్డ్ మెటల్స్ అన్వేషణ చేపట్టనున్నాయి. ఈ కంపెనీల్లో ఎనర్జీ వెంచర్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటుగా బ్లూమ్‌బర్గ్ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్లూమ్‌బర్గ్ పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. వీరు ఎంతమేర పెట్టుబడిపెట్టారనే విషయంపై కోబోల్ట్ స్పందించలేదు. ఈవీ వాహనాల లోహల పరిశోధనలకోసం 14 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనుంది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
అన్నీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లు ఒకే యాప్‌లో
దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, సమర్థత, ఉపాధి కల్పన అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా, టీవీఎస్, అథెర్స్ లాంటి చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రతి ఎలక్ట్రిక్ వాహన కంపెనీ తమ వాహన దారుల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌తో వస్తున్నాయి. ఈ యాప్ ద్వారా వాహన దారులు తమ వాహనాల ఛార్జింగ్ కోసం తమ దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను చూడవచ్చు. అయితే, ఆ యాప్‌లో ఆ వాహన కంపెనీకి చెందిన ఛార్జింగ్ స్టేషన్లను మాత్రమే చూసే అవకాశం ఉంది. కానీ, తమ దగ్గరలో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లను చూసే అవకాశం లేదు. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ "ఈవి ప్లగ్స్(EV Plugs)" అనే ఒక కొత్త మొబైల్ యాప్ మార్కెట్లోకి వచ్చింది. ఈ యాప్ ఇతర కంపెనీల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను చూపిస్తుంది. ఈ యాప్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ లభ్యం అవుతోంది. (చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు) ఢిల్లీకి చెందిన మనీష్ నారంగ్, కపిల్ నారంగ్, అశ్వనీ అరోరా కలిసి 2021లో "ఈవీ ప్లగ్స్" అనే ఈ యాప్‌ను స్థాపించారు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత, మీరు చేయాల్సిందల్లా దానికి జీపీఎస్ యాక్సెస్ ఇవ్వడమే. దీని తర్వాత, మీరు ఏ కంపెనీకి చెందిన ఈవీ ఛార్జర్ కోసం చూస్తున్నారని యాప్ మిమ్మల్ని అడుగుతుంది(కారు లేదా బైక్). మీరు ప్రముఖ బ్రాండ్ కు చెందిన వాహనాన్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యాప్ మీ సమీపంలోని అన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఈవి ఛార్జింగ్ స్టేషన్ రకాలను చూపిస్తుంది. అంతేగాక, మీరు స్టేషన్ పూర్తి వివరాలను కూడా చూడవచ్చు. -
ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..!
భారత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ వాదనను అంగీకరించారు. తాజాగా ఎలన్ మస్క్ ట్విటర్ వేదికగా కార్లను ఉత్పత్తి చేయడం కష్టంతో కూడుకున్న పని అని స్పష్టంచేశారు. అంతేకాకుండా లాభాలతో కంపెనీలను నడపడం మరింత కష్టమని తెలపగా.. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆటోమొబైల్ రంగంలో గత నలభై సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నామని, చివరకి అదే తమ జీవన శైలిని పూర్తిగా మార్చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. చదవండి: భారత్‌లో సొంత షోరూమ్స్.. ఆన్లైన్ ద్వారా ఆ ఫీట్ సొంతం అయ్యేనా? ప్రముఖ బ్రిటిష్ శాస్త్రవేత్త, బిలియనీర్ జేమ్స్ డైసన్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. జేమ్స్ డైసన్ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీగా మొత్తంలో ఖర్చు చేశారు. తాజాగా జేమ్స్ డైసన్‌కు సంబంధించిన విషయాలను ఆంటోనీ అనే ఓ ఇంజనీర్ ట్విటర్లో ప్రస్తావించాడు. ఈ ట్విట్‌కు స్పందిస్తూ ఎలన్ మస్క్.. ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడం కష్టంతో కూడుకున్న పని అని ట్విటర్లో వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు తక్కువ లాభాలకే వాహనాలను విక్రయిస్తున్నాయిని పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీలు ఎక్కువగా వాహనాల విడిభాగాల అమ్మకాల ద్వారానే లాభాలను గడిస్తున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆగస్టులో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదిలో కంపెనీ సుమారు 13,651 యూనిట్లను విక్రయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా ఎలన్‌మస్క్ ట్విట్‌పై స్పందించిన ఆనంద్ మహీంద్రా ట్విట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. కాగా ఆనంద్ మహీంద్రా ట్విట్‌కు ఇంకా ఎలన్ మస్క్ స్పందించాల్సి ఉంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..!
మ్యునీచ్: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి వచ్చే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్, లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లను బీఎమ్‌డబ్ల్యూ ఐఏఏ-2021 మొబిలిటీ షోలో టీజ్ చేసింది. ఈ షోలో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్‌ను, బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ ఏఎమ్బీవై ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! రేంజ్లో రారాజు..! బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ తెలిస్తే ఔరా అనాల్సిందే..! ఎలక్ట్రిక్ వాహన రంగంలో బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్ సంచలానాన్ని నమోదు చేయనుంది. బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్లో అధిక శక్తి గల మోటార్, అత్యధిక సామర్థ్యం ఉన్న 2000Wh బ్యాటరీని ఏర్పాటుచేసింది. బ్యాటరీ ఏర్పాటుచేయడంతో ఒక్క సారి చార్జ్ చేస్తే నార్మల్ పవర్ మోడ్‌లో ఈ సైకిల్ సుమారు 300 కిమీ దూరం మేర ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ-సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్నుపయోగించి కూడా ఆపరేట్ చేయవచ్చును. ఈ సైకిల్ కనిష్టంగా గంటకు 25 వేగంతో, గరిష్టంగా 60 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఈ బైక్‌లో సరికొత్త జియోఫెన్సింగ్ మోడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ మోడ్‌తో బైక్ ఆటోమోటిక్గా స్పీడ్‌ను నియంత్రిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ఈ సైకిళ్లను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! -
మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...!
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా తన ఎలక్ట్రిక్ బైక్స్‌ను భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది తాజాగా ఓలా ఎలక్ట్రిక్ అదే ఒరవడిలో మరో సంచలనానికి కూడా తెర తీయనుంది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి బైక్‌లనే కాకుండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓలా కో ఫౌండర్ భవీష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి ట్విటర్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లలోకి లాంచ్ అయ్యే సంవత్సరాన్ని వెల్లడించారు. చదవండి: Gautam Adani : గౌతమ్ అదానీకి భారీ షాక్..! ట్విటర్లో ఓ నెటిజన్ భవీష్ అగర్వాల్‌ను ట్యాగ్ చేస్తూ మీకు ఉన్న కారు డీజిలా..పెట్రోలా లేక ఎలక్ట్రిక్ కారా అని అడగ్గా భవీష్ అగర్వాల్ ట్విట్‌కు రిప్లే ఇస్తూ..రెండు నెలల క్రితం వరకు నాకు కారు లేదు. ఇప్పుడు హైబ్రిడ్ కారు ఉంది. తరువాత 2023లో ఎలక్ట్రిక్ కారు...అది కూడా ఓలా ఎలక్ట్రిక్ కారు..’అని రిప్లే ఇచ్చాడు. దీంతో ఓలా నుంచి వచ్చే ఎలక్ట్రిక్ కారు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తాజాగా ఓలా కో ఫౌండర్ భవీష్ అగర్వాల్ భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పగానే 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది. Never owned a car till 2 months ago. Now a hybrid. Next one will be electric in 2023. Ola’s electric car 😉 — Bhavish Aggarwal (@bhash) August 16, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ఇంధనం-కొవిడ్ ఎఫెక్ట్.. ఇక ఈవీ బస్సులపై ఫోకస్
చెన్నై: కోవిడ్–19 ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా సుమారు 80,000 బస్‌లు అమ్ముడయ్యేవి. మహమ్మారి కారణంగా బస్సుల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 15,000 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఈ సంఖ్య 5,000 మాత్రమే. దీనినిబట్టి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2021లో డిమాండ్ నెమ్మదిగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుత తరుణంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు, నూతన మోడళ్ల అభివృద్ధికి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు తయారీ సంస్థలు సుముఖంగా లేవు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూస్తామని అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ చెబుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్‌ల తయారీపై కంపెనీలు ఫోకస్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాలపై.. పూర్తి స్థాయి తయారీ సామర్థ్యాన్ని వినియోగించనప్పుడు కొత్త పెట్టుబడులు కనీసం మరో రెండేళ్లు వాయిదా పడే అవకాశం ఉందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ గుప్తా వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణంపై దృష్టిసారించిన తయారీ సంస్థలు మాత్రమే కొత్త పెట్టుబడులు చేస్తాయని అన్నారు. అశోక్ లేలాండ్ ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన ప్లాంటులో ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో అదనపు సామర్థ్యం జోడించడానికి ఈ కంపెనీకి అవకాశం లేదు. రూ.966 కోట్లలో అత్యధికం యూకేకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ స్విచ్‌లో పెట్టుబడి చేసింది. ఎలక్ట్రిక్ విభాగంలో తేలికపాటి వ్యాన్స్, బస్‌లను భారత్‌లో అశోక్ లేలాండ్ ప్రవేశపెట్టనుంది. దక్షిణ కొరియా ముందంజ.. పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడడంతో బస్‌లకు డిమాండ్ తగ్గిపోయింది. సొంత వాహనాల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం తగ్గింది. ఆయా అంశాల నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని పెంచే అవసరం లేదని వోల్వో ఐషర్, దైమ్లర్ స్పష్టం చేశాయి. బస్‌లకు డిమాండ్ పూర్తిగా పడిపోయిందని టాటా మోటార్స్ సీఎఫ్‌వో పి.బాలాజీ తెలిపారు. ‘కొంత కాలం కంపెనీ వేచి చూస్తుంది. బస్‌ల తయారీ సామర్థ్యం పెంచే ఆలోచన లేదు. కొత్త ఉత్పాదనలపై పెట్టుబడులను దశలవారీగా ఉపసంహరించుకుంటున్నాం’ అని తెలిపారు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత డిమాండ్ పెరుగుతుందని అన్నారు. రోడ్డు రవాణా సంస్థల వద్ద ఉన్న బస్‌లకు వయసు మీరుతోందని గుర్తుచేశారు. 1,000కి భారత్‌లో 1.5 బస్‌లు మాత్రమే ఉన్నాయి. దక్షిణ కొరియాలో 70, జపాన్ 30, చైనాలో ఈ సంఖ్య 6 ఉంది. దేశంలో 11 లక్షల బస్‌లకు కొరత ఉందని పరిశ్రమ అంచనా. భారత్‌లో ఎలక్ట్రిక్ బస్‌ల జోరు దేశంలో 2025 నాటికి కొత్త బస్‌ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాటా 8–10 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ప్రజా రవాణా వ్యవస్థ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించింది. ‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఫేమ్ పథకం రెండేళ్లపాటు పొడిగించడం ఈ రంగానికి తోడుగా నిలవనుంది. ఈ పథకం కింద 7–12 మీటర్ల పొడవున్న బస్‌లకు రూ.35–55 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంధనం విషయంలో సాధారణ బస్‌లతో పోలిస్తే ఈ–బస్‌లకు అయ్యే వ్యయం అయిదింతలు చవక కూడా. మొత్తం వ్యయం చూస్తే సబ్సిడీల కారణంగా సీఎన్జీ బస్‌లకు సమానంగా ఈ–బస్‌లు ఉంటాయి. దేశీయంగా తయారీ, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, నిర్వహణ వ్యయాల నియంత్రణ ఈ–బస్‌ల అమ్మకాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఫేమ్–2 పథకం కింద సబ్సిడీ కారణం గా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానానికి కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించింది. -
ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాలపై నీతి ఆయోగ్ సలహాలు!
న్యూఢిల్లీ: విద్యుత్‌తో నడిచే వాహనాలకు చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి సహాయకారిగా ఉండే ఒక హ్యాండ్‌బుక్‌ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. విధానాల రూపకల్పన విషయంలో రాష్ట్రాలు, స్థానిక పాలక మండళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నీతి ఆయోగ్ తెలిపింది. ప్రణాళికల రూపకల్పన, ఈవీ చార్జింగ్ సుదుపాయాల ఏర్పాటు విషయంలో సమగ్ర విధానాన్ని అనుసరించేందుకు కావాల్సిన సమాచారం ఇందులో ఉన్నట్టు తెలిపింది. వివిధ సంస్థలు, శాఖలతో కలిసి నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ హ్యాండ్‌బుక్‌ను రూపొందించాయి. -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్‌వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్‌లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్‌లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్‌వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్‌వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీగా కె.వి. ప్రదీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రదీప్.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్‌లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు. ఆర్డర్ బుక్ 1,325 బస్‌లు.. ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్‌లకు ఆర్డర్ ఉంది. ఇందులో 87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్‌ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్ బిడ్డర్‌గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్ పంపిణీకి అవసరమైన సిలికాన్ రబ్బర్/కంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దేశంలో అతిపెద్ద కంపెనీ. -
ఎలక్ట్రిక్ సైకిల్, కిలోమీటర్ ఖర్చు 7 పైసలేనా
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా జోరందుకుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు రోజుకో కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ, మోటార్లను అమర్చడంతో పాటు నాలుగు రకాలైన పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ రైడింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. ఈ సైకిల్ కు రెండు రకాలైన నార్మల్ మోడ్, ఎలక్ట్రిక్ మోడ్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్‌తో కావాలనుకుంటే సైకిల్‌గా తొక్కొచ్చు లేదంటే ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చెయ్యవచ్చు. సైకిల్ ఆఫ్, ఆన్‌ను బట్టి మీరు ఎంత వేగంతో వెళ్లాలనేది చెక్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ డెకల్స్ తో దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ వాటర్ ప్రూఫ్ డెకల్స్తో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే..,ip67 లిథియం అయాన్ బ్యాటరీతో 3,4గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోచ్చు. 2ఏళ్లు వారెంటీగా ఉన్న ఈ సైకిళ్లను ఒక్కసారి ఛార్జింగ్ పెడిగే 25 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ సైకిళ్లపై కిలోమీటర్‌కి 7పైసలే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల వీటిని వాడేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సైకిల్‌కి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి కాదు. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు, 22 నగరాల్లో 500 ఛార్జింగ్ పాయింట్లు -
ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా?
వెబ్‌డెస్క్: లగ్జరీ కార్లలో ఆడిది ప్రత్యేక స్థానం. రాబోయే ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఆడి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ కార్లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మాత్రమే కొత్త మోడళ్లు తేవాలన్నది ఆ సంస్థ వ్యూహంగా ఉంది. ఈ మేరకు జర్మన్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 2026 వరకే ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ ప్రతీ ఏడు ఓ కొత్త మోడల్ని మార్కెట్లోకి ఆడి రిలీజ్ చేస్తోంది. ఆడిని ప్రమోట్ చేస్తోన్న వోక్స్వ్యాగన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆడిని పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కే పరిమితం చేసే విధంగా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్‌కు సంబంధించి చివరి మోడల్ని 2026లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత మరో పదేళ్ల పాటు డిజీల్, పెట్రోల్ ఇంజన్ వెహికల్స్‌కి సర్వీస్ అందివ్వనుంది. అనంతరం పూర్తిగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్ నుంచి తప్పుకోవడం ఖాయమని తేల్చి చెబుతోంది ఆడి యాజమాన్యం. ఇప్పటికే కంబస్టర్ ఇంజన్ తయారీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చును గణనీయంగా తగ్గించింది. ఓన్లీ ఈవీ వోక్స్వ్యాగన్ నుంచి ఎంట్రీ, మిడ్ రేంజ్ కార్లు వివిధ పేర్లతో మార్కెట్‌కి వస్తుండగా.... లగ్జరీ విభాగంలో ఆడీ, హై ఎండ్ విభాగంలో పోర్షే, స్పోర్ట్స్ సెక్షన్లో లాంబోర్గిని కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఆడిని పూర్తి స్థాయి ఈవీ కార్ల తయారీకే వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆడి నుంచి ఈ ట్రోన్, ఈ ట్రోన్ స్పోర్ట్ బ్యాక్, క్యూ 4 ఈ ట్రోన్, ఈ ట్రోన్ జీటీ కార్లను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో తెచ్చింది. ఇందులో ఈ ట్రోన్ పేరుతో కొత్త ఈవీ లగ్జరీ కారుని ఇండియా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. చదవండి : స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్‌కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్‌యూవీతో మోడల్స్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్‌లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో సుజుకీ హయబుసా బైక్‌తో మోడల్