ముంబై: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ముసాషి తాజాగా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్ న్యూ ఎనర్జీ కంపెనీ (బీఎన్‌సీ) మోటార్స్‌తో జట్టు కట్టింది. మోటార్, పీసీయూ, గేర్ బాక్స్‌తో కూడిన కొత్త ఈవీ యూనిట్లను ఉత్పత్తి చేయనున్నట్లు ముసాషి ఇండియా తెలిపింది. బెంగళూరు ప్లాంటులో అక్టోబర్ నుంచి ఈ-యాక్సిల్‌ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది.
దీనికి సంబంధించిన అసెంబ్లీ లైన్ కోసం తొలి దశలో రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ముసాషి సైమిత్సు ఇండస్ట్రీస్‌కి ముసాషి ఇండియా అనుబంధ సంస్థగా ఉంది. తమ అనుభవం, అధునాతన సాంకేతికతను భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లోకి తేనున్నట్లు ముసాషి సైమిత్సు సీఈవో (భారత విభాగం) తోషిహిసా ఒత్సుకా తెలిపారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
భారత్‌లో తయారు చేసిన ఈ-యాక్సిల్‌ను ఇతర దేశాలకు కూడా సరఫరా చేయాలని ముసాషి భావిస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్‌కి చెందిన స్ట్రోమ్, వియత్నాం సంస్థ ఈవీ గో, కెన్యాకు చెందిన ఆర్క్ రైడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?)
మరిన్ని ఇంట్రస్టింగ్‌వార్తలు, బిజినెస్‌అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment