దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు.. | Not the First Case Karnataka Health Minister Dinesh Gundu Rao Comments on HMPV | Sakshi
Sakshi News home page

దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..

Published Mon, Jan 6 2025 1:58 PM | Last Updated on Mon, Jan 6 2025 3:38 PM

Not the First Case Karnataka Health Minister Dinesh Gundu Rao Comments on HMPV

బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ తరహాలో హెచ్‌ఎంపీవీ (​hmpv) వైరస్‌ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్‌ బారిన పడగా.. తాజాగా, భారత్‌లో మూడు వైరస్‌ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్‌ ఆస్పత్రిలోని  3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్‌ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.

వైరస్‌ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్‌ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్‌లో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్‌లు సైతం అలాగే ఉన్నాయి.  

హెచ్‌ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్‌. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్‌ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.

చైనా నుంచి వచ్చిన రిపోర్ట్‌లు  చిన్నారుల్లో వైరస్‌ వ్యాప్తికి హెచ్‌ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది.  ఈ సందర్భంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ  లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement