Dinesh Gundu Rao
-
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్‌లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్‌లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
స్విమ్మింగ్ వీడియోపై బీజేపీ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన వైద్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండు రావు స్విమ్మింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారటంలో రాష్ట్ర బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘రాష్ట్రంలో ఒక వైపు నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి కేసులు పెరుగుతున్న క్రమంలో ఏమి పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శుభ్రమైన స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది’ ’అని బీజేపీ విమర్శలు చేసింది.📢 Tragedy hits Karnataka as 7, including children, succumb to Dengue and Zika Virus outbreaks. Meanwhile, the Health Minister flaunts his swimming skills! 🏊♂️ The epidemic is out of control, yet leaders are more focused on who gets the DCM/CM chair. Congress leaders' priorities… pic.twitter.com/g1kIE4Vja7— BJP Karnataka (@BJP4Karnataka) July 6, 2024 మంత్రి స్విమ్మింగ్ వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేస్తూ.. ‘‘ నీటీలో నీరో రావు’ వైద్య ఆరోగ్య విభాగం ఉంది’’ కాప్షన్ జతచేసింది. రాజ్యం తగలబడుతుంటే సింగీతం వాయించిన రోమన్ రాజు నీరోతో పోల్చుతూ బీజేపీ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. అయితే బీజేపీ చేసిన విమర్శలపై అంతే స్థాయితో కాంగ్రెస్ వైద్యమంత్రి దినేష్ గుండు రావు కౌంటర్ ఇచ్చారు.‘‘స్విమ్మింగ్, వ్యాయామం నా ఫిట్‌నెన్ దినచర్యలో భాగం. బీజేపీ నేతలు కూడా దీనిని అనుసరించాలి. ఇలా చేయటం వల్ల మీ(బీజేపీ నేతలు) ఆరోగ్యం బాగుంటంతోపాటు మెదడు కూడా షార్ప్‌గా ఉంటుంది. అబద్దాలు, దృష్టి మళ్లించే ఆలోచనలు రాకుండా సాయం చేస్తుంది’అని చురకలు అంటించారు. అదే విధంగా మంగళూరులో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్ష చేయడానికి ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ఇంటింటి తిరిగి మరీ నీటి నిల్వలు పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమని చెప్పారు.మంత్రి కౌంటర్‌పై కూడా బీజేపీ మరోసారి విమర్శలు చేసింది. ‘‘వ్యాయామం చేయటం ముఖ్యమే. కానీ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక మంత్రిగా అంటువ్యాధులు పెరగకుండా పనిచేయటం ఇంకా ముఖ్యం. అది మీ(కాంగ్రెస్) పార్టీకి అస్సలు అర్థం కాదు. వచ్చే మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రజల డబ్బులు దండుకోవటంలోనే మీరు బిజీగా ఉన్నారు’’అని బీజేపీ విమర్శలు చేసింది. ఇక.. గత ఆరు నెలలుగా కర్ణాటకలో 7006 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. -
డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య
సాక్షి,న్యూఢిల్లీ: ఓ వైపు భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. 11 మందిలో 8 మంది బుధవారం బీజేపీలో చేరారు. దీంతో హస్తం పార్టీ సీనియర్ నేతలు కమలం పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యను ఆపరేషన్ కీచఢ్(బురద)గా అభివర్ణించారు. డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. 'భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం చూసి బీజేపీ ఆపరేషన్ కీచఢ్(బురద)ను వేగవంతం చేసింది. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి కమలం పార్టీ నిరాశ చెందుతోంది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు రోజూ ప్రజల దృష్టి మళ్లించే పనులు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. మేం నిరాడంబరంగానే ఉంటాం. బీజేపీ డర్టీ ట్రిక్స్‌ను అధిగమిస్తాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. Operation Kichad of BJP in Goa has been fast tracked because of the visible success of the #BharatJodoYatra. BJP is nervous. A daily dose of diversion & disinformation is handed out to undermine the Yatra. We remain undeterred. We will overcome these dirty tricks of the BJP. — Jairam Ramesh (@Jairam_Ramesh) September 14, 2022 మరో సీనియర్ నేత, ఏఐసీసీ గోవా ఇంఛార్జ్ దినేశ్ గుండూరావు బీజేపీ చర్య ప్రజాస్వామ్య విలువలను నిర్వీర్వం చేసేలా ఉందని మండిపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ధనం, పదవి ఆశలుజూపి ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది డబ్బు, అధికార మదంతో కూడిన సిగ్గుచేటు చర్య అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే బీజేపీలోకి వెళ్లి దింగబర్ కామత్, మైకేల్ లోబోలు నమ్మక ద్రోహం చేశారని, పాతాళానికి దిగజారారని గుండూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్‌లోనే ఉంటాం, బీజేపీలో చేరం' అని దైవ సాక్షిగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇప్పుడు పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. The destruction of democratic principles is in full display in #Goa. Offering huge monies, ministries and inducements the #BJP is trying to uproot the opposition. Shameful exercise of power and money by an authoritarian establishment. — Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) September 14, 2022 చదవండి: పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ -
కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ శ్రేణులు రోడ్డెక్కి నిరసనకు దిగాయి. వివరాలు.. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అధికారం చేజారిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా పార్టీని నెట్టుకొస్తున్న నారాయణస్వామిపై నిరసన మేఘాలు కమ్ముకున్నాయి. పార్టీని బలోపేతం చేస్తూ, నిరసన నిప్పును ఆర్పివేసేలా పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలతో సమావేశం కావాలని రాష్ట్ర ఇన్చార్జ్ దినేష్ గుండూరావు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన పుదుచ్చేరికి చేరుకున్నారు. అప్పటికే సమావేశం కోసం గుమికూడిన ఇరువర్గాలు బాహాబాహాకి దిగాయి. ఈ సమయంలో దినేష్ గుండూరావు సమావేశం ప్రాంగణానికి చేరుకోగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. గుండూరావు కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సమావేశం హాలులోకి వెళ్లకుండా గుండూరావుకు పార్టీ శ్రేణులు చుక్కలు చూపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లురువ్వారు. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణస్వామిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇక కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి భౌతిక దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ సీఎం నారాయణ స్వామి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. -
‘కర్ణాటక కాంగ్రెస్’ రద్దు
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, సంకీర్ణ ప్రభుత్వంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తుల వల్ల కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు. నిజాయితీతో పని చేసేవారికే... పార్టీలో నూతన కార్యవర్గానికి అవకాశం కల్పిస్తామని, నిజాయితీగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉండే వారికే అవకాశం ఇస్తామని దినేశ్ స్పష్టం చేశారు. 280 మందిని తొలగించి అదే స్థాయిలో నాయకులను నియమించే అవకాశం ఉంది. నిజం చెబితే తొలగిస్తారా ? లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయానికి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ దినేశ్ వంటి కొందరు నేతలే కారణమంటూ కాంగ్రెస్ మైనార్టీ నేత రోషన్ బేగ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించింది. నిజాలు మాట్లాడితే తొలగిస్తారా ? నాపై చర్యలు తీసుకున్నారు సరే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లపై చర్యలు లేవా అంటూ మండిపడ్డారు. -
చీర వెనుక దాక్కోవడం ఆపేయండి!
బెంగళూరు/న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యల ప్రహసనం కొనసాగుతోంది. హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలంటూ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్య చేసిన హెగ్డే.. సోమవారం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూ రావుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ముస్లిం యువతిని దినేశ్ గుండూరావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.(‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’) దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్ స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో లేని ఒక సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొని రాజకీయాలు చేయడం ఆపేయాలని హెగ్డేకు సూచించారు. వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చే స్థాయికి దిగజారారంటూ హెగ్డేను గుండూరావు విమర్శించారు. మరోవైపు హెగ్డే ఆదివారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. హిందువు అయిన తన భార్యపై చేతులేసి దిగిన ఒక ఫోటోను మహారాష్ట్ర బీజేపీ నేత తెహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు. ‘హిందూ మహిళపై చేయి వేసాను.. ఏం చేస్తావో చేసుకో’ అంటూ హెగ్డేకు సవాలు విసిరారు. -
మైక్ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది
-
‘ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం మాత్రమే తెలుసు’
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావుల మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం కొడగులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ.. హిందూ మహిళలను తాకిన చేయి ఎవరిదైనా సరే కులమతాలకు అతీతంగా ఆ చేతిని నరికేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు... ‘ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నందుకు మీరు సాధించిందేమిటి? కర్ణాటక అభివృద్ధిలో మీ పాత్ర ఎంత? ఇలాంటి వ్యక్తులను ఎంపీలుగా, మంత్రులుగా కలిగి ఉండటం విచారకరం’ అని ట్వీట్ చేశారు. ఇందుకు స్పందనగా.. ‘దినేష్ గుండూరావుకు నేను కచ్చితంగా సమాధానం ఇచ్చితీరతాను. అయితే అంతకన్నా ముందు తన విజయాల వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్నకి ఆయన బదులివ్వాలి. నాకు తెలిసినంత వరకు ఓ ముస్లిం మహిళ వెంట పడటం మాత్రమే తనకు తెలుసు’ అంటూ అనంత్ కుమార్ విమర్శించారు. దీంతో.. ‘ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అనంత్ కుమార్ తన స్థాయిని దిగజార్చుకున్నారు. నాకు తెలిసి ఆయనకు సంస్కారం లేదు. హిందూ వేదాలు ఆయనకు ఏమీ నేర్పలేదేమో. ఇంకా సమయం మించి పోలేదు. ఇప్పటికైనా పద్ధతైన మనిషిగా మారేందుకు అవకాశం ఉంది’ అంటూ దినేష్ రావు ఘాటుగా స్పందించారు. కాగా దినేష్ గుండూరావు టబూ అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మతాంతర వివాహాన్ని కారణంగా చూపి బీజేపీ ఎంపీ శోభా కరాంద్లజే, ప్రతాప్ సింహా తదితర నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దినేష్ గుండూరావుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తానేమీ రాజకీయాల్లో లేనని, తన మతం గురించి ప్రస్తావించి దినేష్‌ను ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటూ టబూ రావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. I shall definitely answer this guy @dineshgrao's queries, before which could he please reveal himself as to who he is along with his achievements? I only know him as a guy who ran behind a Muslim lady. https://t.co/8hVJ2wQXMU — Anantkumar Hegde (@AnantkumarH) January 27, 2019 Sad to see @AnantkumarH stoop to such low levels as to bring in personal issues. Guess it’s his lack of culture. Guess he hasn’t learnt from our Hindu scriptures. Time hasn’t run out, he can still try and become a more dignified human. https://t.co/AaX5OuUAVb — Dinesh Gundu Rao (@dineshgrao) January 28, 2019 -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
బెంగళూరు: సహచర ఎమ్మెల్యేపై దాడికి దిగిన కర్ణాటక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంది. హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌పై దాడి చేసిన కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కృష్ణా బైరి, కేజే జార్జి సభ్యులుగా ఉంటారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో శనివారం రాత్రి ఆనంద్ సింగ్‌పై గణేశ్ దాడి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆనంద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆనంద్‌పై తాను దాడి చేయలేదని, జారి పడటం వల్ల ఆయన గాయపడ్డారని గణేశ్ చెప్పారు. తన వల్లే ఆయన గాయపడ్డారని భావిస్తే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన క్షమాపణ చెబుతానని అన్నారు. (కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర) -
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
-
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తాత్కాలికంగా తెర పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు తెలిపారు. జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకే తమ శాసనసభ్యులను రిసార్ట్‌కు తరలించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చిన విధంగా సోమవారం సీఎల్పీ సమావేశం జరగలేదు. ‘ఈరోజు సీఎల్పీ సమావేశం ఉంటుందని గతరాత్రి నాకు చెప్పారు. ఇప్పుడేమో సమావేశం లేదంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మరికొంత మంది వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కారణంగానే ఈ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెప్పారు. ఈగల్టన్ రిసార్ట్‌లో తనతోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై తాను చేసినట్టు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే కంప్లి జేఎన్ గణేశ్ తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఆనంద్‌పై తాను దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన బాధపడివుంటే తన కుటుంబంతో కలిసి ఆయనను క్షమాపణ అడుగుతానని చెప్పారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) -
కేపీసీసీ చీఫ్‌గా దినేశ్ గుండూరావు
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి(కేపీసీసీ)గా దినేశ్ గుండూరావు(48) నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నందున ఈ నియామకం చేపట్టినట్లు ఏఐసీసీ పేర్కొంది. బెంగళూరులోని గాంధీనగర్ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికైన గుండూరావు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన గత కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేగా ఈశ్వర్ ఖంద్రేను కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో యువ రక్తాన్ని నింపాలన్న రాహుల్ ఆలోచన మేరకే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. -
కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక మార్పు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పార్టీని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ రాష్ట్రస్థాయి పదవుల్లో పలు మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత దినేశ్ గుండురావును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అశోక్ గెహ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగిన జీ పరమేశ్వర కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పీసీసీ చీఫ్‌గా దినేశ్ గుండురావును రాహుల్ నియమించారు. మాజీ సీఎం ఆర్ గుండురావు తనయుడైన దినేశ్ ఐదుసార్లు బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. తమకు మంత్రి పదవులు రాకపోవడంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నేతలను బుజ్జగించే పార్టీలో అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేసేందుకు రాహుల్ ఈ నియామకం చేపట్టారు. -
గుండూరావ్ గెలుపును అడ్డుకోగలరా ?
జయనగర : గాంధీనగర నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్న కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ గెలుపు అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నారు. గత రెండు ఎన్నికల్లో దినేశ్ గుండూరావ్ ప్రత్యర్థిగా పోటీ చేసిన పీసీ.మోహన్ ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలోకి దిగడానికి పలువురు టికెట్లు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి నగర కార్యదర్శి ఎస్.నరేశ్‌కుమార్, చిక్కపేటే కార్పోరేటర్ లీలా శివకుమార్, ఆమె భర్త ఎల్.శివకుమార్, మాజీ ఎంఎల్సీ రామచంద్రేగౌడ కుమారుడు సప్తగిరిగౌడ, విశ్రాంత ఏసీసీ గంగాధర్, మాజీ కార్పోరేటర్ గోపాలకృష్ణ పేర్లు వినబడతున్నాయి. ఇక జేడీఎస్ పార్టీనుంచి సర్వోదయ నారాయణస్వామి టికెట్ రేసులో ఉండగా ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళ ఓటర్లు కలిగిన గాంధీనగరలో ఈసారి ఏడీఎంకే పార్టీ నుంచి అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంగళూరు సెంట్రల్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా నియోజకవర్గ పరిధిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గంలో చాలాప్రదేశాలు వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గాంధీనగర, ఓకళిపుర, సుభాష్‌నగర, కాటన్‌పేటే మురికివాడ ప్రాంతాలు ఉన్నాయి, అన్నిమతాలకు చెందిన ఓటర్లు గాంధీనగర నియోజకవర్గంలో ఉన్నారు. గాంధీనగర నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ గత ఏడాది కురిసిన భారీవర్షాలకు ఆనందరావ్ రైల్వేఅండర్పాస్ వద్ద వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మెజస్టిక్ వరకు ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది. ఓకళిపుర జంక్షన్లో మల్లేశ్వరం, మెజస్టిక్, మాగడిరోడ్డుకు అనుసంధానంగా భారీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులు గత ఐదేళ్లుగా జరుగుతున్నాయి. ఇటీవల టెండర్ష్యూర్ పథకం కింద కొన్ని రోడ్లు అభివృద్ధి చేపట్టారు. రాష్ట్రంలో అత్యంత పాత నియోజకవర్గంగా ఉన్న గాంధీనగర ను ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దాలని డిమాండ్ ప్రజల్లో నెలకొంది. గాంధీనగర నియోజకవర్గ పరిధిలో 7 వార్డులు ఉండగా అందులో 5 వార్డుల్లో కాంగ్రెస్ కార్పోరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తుండగా, రెండు వార్డుల్లో బీజేపీ కార్పోరేటర్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,224 ఓట్లు కాగా పురుష ఓటర్లు 1,16,240, మహిళాఓటర్లు 1,06,978 ఓట్లు ఉన్నారు. కెంపేగౌడ బస్టాండు, కర్ణాటక ప్రజల ఆరాధ్యదైవం అణ్ణమ్మదేవి ఆలయం ఇక్కడే ఉంది. -
తమ రక్తం..తల్లిదండ్రులెవరో తెలియని వారు..
సాక్షి, బెంగళూరు: ఆయన ఎంపీ, కేంద్ర మంత్రి కూడా. అయితే ఆయన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఆయనే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే. తనదైన శైలి వ్యాఖ్యలతో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడుతూ చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం రోజున కొప్పళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్‌కుమార్ హెగ్డే....‘కొంత మంది తాము లౌకికవాదులమని చెప్పుకుంటూ ఉంటారు. తమ రక్తం గురించి, తమ తల్లిదండ్రులెవరో తెలియని వారు మాత్రమే ఇలా చెప్పుకుంటారు. హిందుత్వానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఎవరో ఒకరిద్దరు వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి మాట్లాడినంత మాత్రాన మేం మారబోము. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగాన్ని మార్చేందుకే మేం వచ్చాం’ అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి హెగ్డేకి మతి తప్పింది: దినేష్ గుండూరావ్ సాక్షి, బెంగళూరు: ‘కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేకు మతిస్థిమితం తప్పింది. అధికారం తలకెక్కింది. అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావ్ మండిపడ్డారు. సోమవారం కేపీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హెగ్డే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు రాజ్యాంగాన్ని కాపాడతానని, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రమాణానికే విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం విచారణకు అనుమతించరాదు భూపసంద్ర డీనోటిఫికేషన్ అంశానికి సంబంధించి సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని కోరారు. ఎమ్మెల్సీ ఉగ్రప్ప మాట్లాడుతూ మంత్రి హెగ్డే వల్లే కరావళిలో కులఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
పరేషన్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల మంది ఎన్నిక ల గుర్తింపు కార్డులు లేదా ఆధార్ నంబర్లు సమర్పించనందున, ఆహార ధాన్యాల పంపిణీని నిలి పివేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మం త్రి దినేశ్ గుండూరావు తెలిపారు. శుక్రవారం ఆ యనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత మూడున్నర నెలల కిందట ఎనిమిది లక్షల మంది ఆధార్ నంబరు లేదా ఎన్నికల గుర్తింపు కార్డును సమర్పించలేదని వెల్లడించారు. వారికి కిరోసిన్ పంపిణీని నిలిపివేశామని చెప్పారు. దీంతో ఐదు లక్షల మంది వాటిని సమర్పించామన్నారు. మిగిలిన వారి రేషన్ కార్డులను సస్పెన్షన్‌లో ఉంచి, ఆహార ధాన్యాల పంపిణీని నిలిపి వేశామన్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. నెల లోగా కొత్త నియమావళిని రూపొందించి, అనంతరం కొత్త కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తామని తెలిపారు. -
సహకార సంఘాలకు రేషన్ దుకాణాలు
మంత్రి దినేశ్ గుండూరావు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి సహకార సంఘాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. తన శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. రేషన్ షాపులు వంశ పారంపర్యంగా కొందరికే పరిమితమవుతున్నాయని, దీని వల్ల ఫిర్యాదులు కూడా ఎక్కువవుతున్నాయని వెల్లడించారు. ఇకమీదట వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలకు రేషన్ షాపులను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాగా పని చేస్తున్న స్వయం సహాయక సంఘాలకు కూడా షాపులను కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న షాపులను కాలక్రమేణా రద్దు చేస్తూ పోతామని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సహకార సంఘాల చేతుల్లోకి వెళ్లాలనేది ప్రభుత్వ ఆశయమని తెలిపారు. కాగా రాష్ర్టంలో కొత్తగా వెయ్యి రేషన్ షాపులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటిని మంజూరు చేసేటప్పుడు వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రేషన్ షాపులకు భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. లెవీకి స్వస్తి రాష్ట్రంలో ఇకమీదట రైస్ మిల్లర్ల నుంచి లెవీ బియ్యాన్ని సేకరించే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి బదులు రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ధాన్యాన్ని ఆహార, పౌర సరఫరాల శాఖ బియ్యం ఆడించి రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు తరలిస్తామని తెలిపారు.