
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్ సింగ్
బెంగళూరు: సహచర ఎమ్మెల్యేపై దాడికి దిగిన కర్ణాటక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంది. హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌పై దాడి చేసిన కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కృష్ణా బైరి, కేజే జార్జి సభ్యులుగా ఉంటారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ)
బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్‌టన్ రిసార్టులో శనివారం రాత్రి ఆనంద్ సింగ్‌పై గణేశ్ దాడి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆనంద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆనంద్‌పై తాను దాడి చేయలేదని, జారి పడటం వల్ల ఆయన గాయపడ్డారని గణేశ్ చెప్పారు. తన వల్లే ఆయన గాయపడ్డారని భావిస్తే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన క్షమాపణ చెబుతానని అన్నారు. (కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర)
Comments
Please login to add a commentAdd a comment