eagleton golf resort
-
ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపించేసిన కాంగ్రెస్
శివాజీనగర (బెంగళూరు): కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు బస ముగిసింది. అయితే, క్యాంపులో ఉండగా తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గణేశ్ సస్పెన్షన్‌కు గురికాగా, అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రలోభాల భయంతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుగా బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులో 70 మందికిపైగా తమ ఎమ్మెల్యేలను ఉంచిన విషయం తెలిసిందే. వీరందరినీ సోమవారం ఇళ్లకు పంపించి వేసింది. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి కన్నుమూయడం, ఇద్దరు ఎమ్యెల్యేల ఘర్షణ వివాదాస్పదం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. సోమవారం సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి, బీజేపీ ప్రలోభాలకు లొంగరాదని హితబోధ చేసినట్లు సమాచారం. రిసార్టులో ఉండగానే హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేశ్ కొట్టుకున్న ఘటన వివాదాస్పదమైంది. ఆనంద్‌సింగ్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గణేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆనంద్ సింగ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు గట్టిగా పట్టుబట్టారు. గత్యంతరం లేక వారు ఫిర్యాదు చేసేందుకు అంగీకరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేయలేదని గణేశ్ తనపై కోపంతో ఉన్నాడనీ, అలాగే, తన బంధువు ఒకరు గణేశ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించిన విషయం ప్రస్తావనకు వచ్చి గొడవ మొదలైందని ఆనంద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
బెంగళూరు: సహచర ఎమ్మెల్యేపై దాడికి దిగిన కర్ణాటక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంది. హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌పై దాడి చేసిన కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కృష్ణా బైరి, కేజే జార్జి సభ్యులుగా ఉంటారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో శనివారం రాత్రి ఆనంద్ సింగ్‌పై గణేశ్ దాడి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆనంద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆనంద్‌పై తాను దాడి చేయలేదని, జారి పడటం వల్ల ఆయన గాయపడ్డారని గణేశ్ చెప్పారు. తన వల్లే ఆయన గాయపడ్డారని భావిస్తే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన క్షమాపణ చెబుతానని అన్నారు. (కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర) -
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
-
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తాత్కాలికంగా తెర పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు తెలిపారు. జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకే తమ శాసనసభ్యులను రిసార్ట్‌కు తరలించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చిన విధంగా సోమవారం సీఎల్పీ సమావేశం జరగలేదు. ‘ఈరోజు సీఎల్పీ సమావేశం ఉంటుందని గతరాత్రి నాకు చెప్పారు. ఇప్పుడేమో సమావేశం లేదంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మరికొంత మంది వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కారణంగానే ఈ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెప్పారు. ఈగల్టన్ రిసార్ట్‌లో తనతోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై తాను చేసినట్టు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే కంప్లి జేఎన్ గణేశ్ తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఆనంద్‌పై తాను దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన బాధపడివుంటే తన కుటుంబంతో కలిసి ఆయనను క్షమాపణ అడుగుతానని చెప్పారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) -
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్‌పై ఉన్న మద్యం బాటిల్‌తో ఒక్కసారిగా ఆనంద్‌సింగ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌సింగ్‌ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్‌పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్‌ను గణేశ్ ఆనంద్‌సింగ్‌తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్‌ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్‌సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్‌సింగ్ తలపై మద్యం బాటిల్‌తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్‌సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు : ఐటీ దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని, తమను బదనాం చేసేందుకే దాడులు చేశారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ నివాసాలపై ఐటీ శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే శివకుమార్, సురేశ్ సోదరులు, బంధువుల ఇళ్లతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగల్ టన్ రిసార్ట్‌లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టారు. కాగా ఐటీ సోదాల్లో సుమారు 7.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేసి, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. -
మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు
బెంగళూరు : కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ నివాసాలపై ఐటీ శాఖ దాడి చేసింది. ఐటీ అధికారులు బుధవారం ఉదయం మంత్రి శివకుమార్, ఎంపీ నివాసాలతో పాటు, ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టులోనూ సోదాలు చేపట్టింది. కాగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్‌లోనే బస చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందంటూ 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు, రిసార్టులో ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం. సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.