బెంగళూరు: కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండు రావు స్విమ్మింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారటంలో రాష్ట్ర బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘రాష్ట్రంలో ఒక వైపు నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి కేసులు పెరుగుతున్న క్రమంలో ఏమి పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శుభ్రమైన స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది’ ’అని బీజేపీ విమర్శలు చేసింది.
📢 Tragedy hits Karnataka as 7, including children, succumb to Dengue and Zika Virus outbreaks. Meanwhile, the Health Minister flaunts his swimming skills! 🏊♂️ The epidemic is out of control, yet leaders are more focused on who gets the DCM/CM chair. Congress leaders' priorities… pic.twitter.com/g1kIE4Vja7
— BJP Karnataka (@BJP4Karnataka) July 6, 2024
మంత్రి స్విమ్మింగ్ వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేస్తూ.. ‘‘ నీటీలో నీరో రావు’ వైద్య ఆరోగ్య విభాగం ఉంది’’ కాప్షన్ జతచేసింది. రాజ్యం తగలబడుతుంటే సింగీతం వాయించిన రోమన్ రాజు నీరోతో పోల్చుతూ బీజేపీ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. అయితే బీజేపీ చేసిన విమర్శలపై అంతే స్థాయితో కాంగ్రెస్ వైద్యమంత్రి దినేష్ గుండు రావు కౌంటర్ ఇచ్చారు.
‘‘స్విమ్మింగ్, వ్యాయామం నా ఫిట్‌నెన్ దినచర్యలో భాగం. బీజేపీ నేతలు కూడా దీనిని అనుసరించాలి. ఇలా చేయటం వల్ల మీ(బీజేపీ నేతలు) ఆరోగ్యం బాగుంటంతోపాటు మెదడు కూడా షార్ప్‌గా ఉంటుంది. అబద్దాలు, దృష్టి మళ్లించే ఆలోచనలు రాకుండా సాయం చేస్తుంది’అని చురకలు అంటించారు. అదే విధంగా మంగళూరులో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్ష చేయడానికి ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ఇంటింటి తిరిగి మరీ నీటి నిల్వలు పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమని చెప్పారు.
మంత్రి కౌంటర్‌పై కూడా బీజేపీ మరోసారి విమర్శలు చేసింది. ‘‘వ్యాయామం చేయటం ముఖ్యమే. కానీ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక మంత్రిగా అంటువ్యాధులు పెరగకుండా పనిచేయటం ఇంకా ముఖ్యం. అది మీ(కాంగ్రెస్) పార్టీకి అస్సలు అర్థం కాదు. వచ్చే మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రజల డబ్బులు దండుకోవటంలోనే మీరు బిజీగా ఉన్నారు’’అని బీజేపీ విమర్శలు చేసింది. ఇక.. గత ఆరు నెలలుగా కర్ణాటకలో 7006 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment