Dengue cases
-
మళ్లీ ‘డెంగీ’ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో డెంగీ ప్రతాపం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి. మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్‌లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్‌గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్‌గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒకేసారి రకరకాల జ్వరాలు ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్‌గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్‌గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. -
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు రాలిపోతున్న ప్రాణాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అచ్చబా గ్రామానికి చెందిన గిరిజన బాలిక బిడ్డిక రషి్మత(8) మలేరియాతో గత నెల 6వతేదీన మృత్యువాత పడింది. జూన్ 22న సరుబుజ్జిలి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరిన ఈ చిన్నారి నాలుగు రోజుల అనంతరం జ్వరం బారిన పడింది. పీహెచ్సీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రషి్మతతో పాటు మరికొందరు బాలికలు కూడా మలేరియా బారినపడ్డారు. గత నెలలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి రెండు రోజుల వ్యవధిలో 30 మంది పిల్లలు జ్వరాలతో రాగా 15 మందికి మలేరియా నిర్ధారణ అయింది. పాడేరు మండలం దేవాపురంలో కె.రత్నామణి(37) గత నెల పాడేరు ప్రభుత్వాస్పత్రిలో మలేరియాకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యం అధ్వానంగా మారడంతోపాటు అంటురోగాలు, విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నా సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. ప్రజారోగ్య విభాగం పడకేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయకపోవడంతో జూన్, జూలైలో డయేరియా ప్రబలగా, ఇప్పుడు డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టినవారే కనిపిస్తున్నారు. అనారోగ్య పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇక జ్వరాల బాధితుల్లో వింత లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నెగిటివ్ అని వచి్చనప్పటికీ కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు నిర్వహించి కొత్త రకం వైరల్ జ్వరాలు, వైరస్ల వ్యాప్తిౖò³ ప్రజలను జాగృతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మృత్యు ఘంటిక మోగిస్తున్న డెంగీ ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా మలేరియా కేసులు, 2 వేలకుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గత సోమవారం విశాఖ కేజీహెచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక డెంగీతో మరణించింది. గుంటూరు జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ డెంగీకి చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత పడింది. గత వారం బాపట్ల జిల్లా ముత్తాయపాలెంలో డెంగీ లక్షణాలతో ఓ అంగన్వాడీ కార్యకర్త చనిపోగా చిత్తూరు జిల్లా మేలుపట్ల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి బాలిక ఈ నెలలోనే కన్ను మూసింది. ఇక రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో అధిక శాతం ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. గత నెల 15వతేదీ నుంచి 28 మధ్య రెండు వారాల్లో ఏఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 260, పార్వతీపురం మన్యంలో 178 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ ఓపీల్లో మూడో వంతు జ్వర బాధితులే ఉన్నారు. పాడేరు ప్రభుత్వాస్పత్రి కిక్కిరిసిపోతోంది. రోజుకు 400 వరకూ ఓపీలు నమోదవుతుండగా మలేరియా, డెంగీ, విష జ్వరాల కేసులు అధికంగా ఉంటున్నాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి వైరల్ జ్వరాల్లో కొత్త లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల శరీర ఉష్ణోగ్రత 103, 104 వరకూ వెళుతోంది. వికారం, కీళ్లు, ఒంటి నొప్పులు, నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కాళ్లు, చేతులు వాపులు, ఒంటిపై ఎర్రటి దద్దుర్లు, కళ్ల మంట లాంటి లక్షణాలు వారం నుంచి 10 రోజులు ఉంటున్నాయి. ప్లేట్లెట్స్ 30 వేల వరకూ పడిపోతున్నాయి. బాధితులు తీవ్ర నొప్పులతో మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. డెంగీ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతోంది. దీంతో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా విలయతాండవం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాగునీటిని సరిగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో జూన్, జూలైలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 56 చోట్ల డయేరియా ప్రబలింది. ఈ ఏడాది జూన్‌లో జగ్గయ్యపేట నుంచి డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి కన్నుమూయగా గత నెలలో కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో నాలుగేళ్ల చిన్నారిని మత్యువు కబళించింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఏకంగా 250 మందికి డయేరియా సోకగా ఏడుగురు మృతి చెందారు. మంత్రి నారాయణ సమీక్షలు నిర్వహించినా పారిశుద్ధ్య నిర్వహణలో మాత్రం మార్పు రాలేదు. ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి డ్రోన్ల ద్వారానే మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను తెస్తాం. సీజనల్ వ్యాధులను సున్నాకు కట్టడి చేస్తాం..’ అని వైద్య శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలో సీఎం చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం డ్రోన్లను ఎగరేసి దోమలను చంపే లోపే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫీవర్ సర్వే ఊసే లేదు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. ఇందుకోసం సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేది. ఆశా, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర లక్షణాలున్న వారిని గుర్తించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి ప్రజలకు జాగ్రత్తలు సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలను గాలికి వదిలేసింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వే ఇప్పటి వరకూ నిర్వహించనే లేదు. దీంతో మలేరియా, డెంగీ బారిన పడ్డ బాధితులు ఆస్పత్రులకు వెళ్లడంలో జాప్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, రక్షిత నీటి సరఫరా, ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం. మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి మురికి కూపాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ⇒శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నంలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,932 మంది జ్వర పీడితులున్నట్లు ప్రకటించారు. డెంగీ కేసులు 25 నమోదు కాగా, మలేరియా 30, టైఫాయిడ్ 196, డయేరియా 3,113 కేసులున్నాయి. ⇒విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు 491 నమోదయ్యాయి. జిల్లాలో 2.45 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు.⇒విశాఖ జిల్లాలో 329 డెంగీ కేసులు, 114 మలేరియా కేసులు నమోదు అయినట్టు జిల్లా మలేరియా అధికారి తులసి తెలిపారు. ⇒పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెలలో 24 డెంగీ కేసులు, 345 మలేరియా, 911 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. èఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జ్వరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.èఅనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 52 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి.⇒విజయవాడ ప్రభుత్వాస్పత్రితో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి పది మంది అనారోగ్య పీడితుల్లో ఐదుగురు విష జ్వరాలతో బాధపడుతుండగా ఇద్దరు డెంగీ బాధితులు ఉంటున్నారు. డెంగ్యూ ఎన్ఎస్ 1 పాజిటివ్ కేసులు విజయవాడలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ⇒ప్రకాశం జిల్లాలో డెంగీ కేసులు 56 నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీన కంభం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. టైఫాయిడ్ కేసులు సుమారు 800, విషజ్వరాలు 1,100 నమోదయ్యాయి.⇒ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైరల్ జ్వరాలు చెలరేగుతున్నాయి. గత రెండు నెలలుగా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో 150 మంది వైరల్ జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు.⇒డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో 60 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరుగురు డెంగీ బారినపడ్డారు. కొత్తపేట మండలం వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో ఈ నెలలో సుమారు 800 జ్వరాలు కేసులు రాగా 100 టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐదు వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సుమారు 32 డెంగీ కేసులు నమోదయ్యాయి.èశ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, ధర్మవరం, కదిరి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మడకశిరలో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరంలో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ⇒వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకు డెంగీ కేసులు 244, మలేరియా కేసులు 11 నమోదయ్యాయి. ⇒కర్నూలు జిల్లాలో డెంగీ కేసులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో 63 నమోదయ్యాయి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడురు నగర పంచాయతీలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నంద్యాల జిల్లాలో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 77 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత జూన్ 21న జూపాడు బంగ్లా మండలం చాబోలులో అతిసార ప్రబలి 20 మంది ఆసుపత్రి పాలు కాగా నడిపి నాగన్న మృతి చెందాడు.⇒అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు 132 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఈ నెలలో 45 డెంగీ, 30 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. రాయచోటిలోని వంద పడకల ఆస్పత్రిలో 69 డెంగీతోపాటు 104 మలేరియా కేసులు నమోదయ్యాయి. ⇒అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్, రూరల్, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు వందకు పైగా నమోదైనట్లు సమాచారం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇంటి ఆవరణ, పరిసరాల్లో పనికిరాని వస్తువులు,టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు ఉంచాలి. ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి. తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలుమలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం డయేరియా: విరేచనాలు, కడుపు నొప్పి, వికారంటైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపులో నొప్పికలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడండెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలుకామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం -
తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్..
-
డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్‌గున్యా వంటి వాటికి తెల్ల రేషన్‌కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్‌గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్‌గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్‌పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్‌గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్ -
ఇంటికో రోగి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఇంటికో రోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇంటికి ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన ప డ్డారు. చలి జ్వరం, కీళ్లు, ఒంటి నొప్పులతో అల్లాడుతున్నా రు. నీరసం ఆవహించి అడుగు తీసి అడుగు వేయలేకపోతు న్నారు. గ్రామంలో 700 వరకు ఆవాసాలు ఉండగా 2 వేల వరకు జనాభా ఉంది. అక్కడ 20 రోజులుగా వైరల్ జ్వరా లతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా జ్వరంతో బాధపడుతూ చేతికి సెలైన్ ఎక్కించుకొనేందుకు పెట్టుకున్న సూదులతో కనిపించడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు ఆ గ్రామమే కాదు.. తిప్పర్తి మండలంలోని ఎస్సీ కాలనీలో ç60 మంది, నూకలవారిగూడంలో 40 మంది, సైదిబాయిగూడంలో 20 వరకు విషజ్వరాల బారినపడ్డారు. నల్లగొండ పట్టణం, కనగల్, దామరచర్ల తదితర మండలాలతోపాటు జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణకు నిధుల్లేక మురికి కాలువలు శుభ్రం చేయడం, ఫాగింగ్ చేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.మరోవైపు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు పీహెచ్సీలవారీ లెక్కల ప్రకారం 466 డెంగీ కేసులు నమోదవగా అందులో గత నెలలోనే 162 కేసులు నమోదయ్యాయి. కానీ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం జిల్లాలో 157 డెంగీ కేసులు, 7 చికున్‌గున్యా కేసులు, ఒక మలేరియా కేసు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అనధికార లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 1500కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. నాన్నా.. నన్ను కాపాడు తీవ్ర జ్వరం బారినపడిన ఓ టెన్త్ విద్యార్థిని వేడుకోలువైద్యం కోసం తరలిస్తుండగా మృతికౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచ్చింది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
స్విమ్మింగ్ వీడియోపై బీజేపీ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన వైద్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండు రావు స్విమ్మింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారటంలో రాష్ట్ర బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘రాష్ట్రంలో ఒక వైపు నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి కేసులు పెరుగుతున్న క్రమంలో ఏమి పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శుభ్రమైన స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది’ ’అని బీజేపీ విమర్శలు చేసింది.📢 Tragedy hits Karnataka as 7, including children, succumb to Dengue and Zika Virus outbreaks. Meanwhile, the Health Minister flaunts his swimming skills! 🏊♂️ The epidemic is out of control, yet leaders are more focused on who gets the DCM/CM chair. Congress leaders' priorities… pic.twitter.com/g1kIE4Vja7— BJP Karnataka (@BJP4Karnataka) July 6, 2024 మంత్రి స్విమ్మింగ్ వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేస్తూ.. ‘‘ నీటీలో నీరో రావు’ వైద్య ఆరోగ్య విభాగం ఉంది’’ కాప్షన్ జతచేసింది. రాజ్యం తగలబడుతుంటే సింగీతం వాయించిన రోమన్ రాజు నీరోతో పోల్చుతూ బీజేపీ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. అయితే బీజేపీ చేసిన విమర్శలపై అంతే స్థాయితో కాంగ్రెస్ వైద్యమంత్రి దినేష్ గుండు రావు కౌంటర్ ఇచ్చారు.‘‘స్విమ్మింగ్, వ్యాయామం నా ఫిట్‌నెన్ దినచర్యలో భాగం. బీజేపీ నేతలు కూడా దీనిని అనుసరించాలి. ఇలా చేయటం వల్ల మీ(బీజేపీ నేతలు) ఆరోగ్యం బాగుంటంతోపాటు మెదడు కూడా షార్ప్‌గా ఉంటుంది. అబద్దాలు, దృష్టి మళ్లించే ఆలోచనలు రాకుండా సాయం చేస్తుంది’అని చురకలు అంటించారు. అదే విధంగా మంగళూరులో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్ష చేయడానికి ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ఇంటింటి తిరిగి మరీ నీటి నిల్వలు పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమని చెప్పారు.మంత్రి కౌంటర్‌పై కూడా బీజేపీ మరోసారి విమర్శలు చేసింది. ‘‘వ్యాయామం చేయటం ముఖ్యమే. కానీ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక మంత్రిగా అంటువ్యాధులు పెరగకుండా పనిచేయటం ఇంకా ముఖ్యం. అది మీ(కాంగ్రెస్) పార్టీకి అస్సలు అర్థం కాదు. వచ్చే మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రజల డబ్బులు దండుకోవటంలోనే మీరు బిజీగా ఉన్నారు’’అని బీజేపీ విమర్శలు చేసింది. ఇక.. గత ఆరు నెలలుగా కర్ణాటకలో 7006 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్‌కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
రాష్ట్రంలో 5,263 డెంగీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది జనవరి నుంచి సెపె్టంబర్ వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది అదే సమయానికి 5,263 కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గడిచిన వారం పది రోజుల సమయంలో ఫీవర్ కేసుల్లో స్వల్పంగా పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుందన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధి నిర్ధారించే ఎన్ఎస్1 కిట్స్, ఐజీఎం కిట్లకు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 24 గంటల్లో వైద్య పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, ప్లేట్లెట్స్ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ఆసుపత్రుల పట్ల జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా అందుతున్న సేవల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్నెస్ సెంటర్లను సందర్శించి, అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను మంత్రి ఆదేశించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానాల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పగటి దోమ కాటు ప్రాణాంతకమే!
పగటిపూట కుట్టే దోమ ప్రాణాంతకంగా పరిణమించింది. డెంగీ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమలతో జ్వర బాధితులు పెరుగుతున్నారు. డెంగీ కారక దోమల బెడద నుంచి రక్షించుకోవడమే శ్రేయస్కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారణమయ్యే నిల్వ నీరు లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ వానలు కురిసి తగ్గిన తర్వాత సీజన్లో సాధారణంగా డెంగీ వ్యాపిస్తుంది.. కానీ ఈ వ్యాధి ప్రస్తుతం నగరవ్యాప్తంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకుపైగా డెంగీ కేసులు నమోదైతే.. అందులో సగానికి పైగా నగరంలో నమోదవడం వ్యాధి తీవ్రతకు నిదర్శనం. గత ఆగస్టు నుంచి నెలకు 10 రెట్ల చొప్పున కేసులు పెరుగుతున్నాయని ఆసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. డెంగీ జ్వరం వస్తే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపధ్యంలో దోమల నివారణకు నగర ప్రజలు ప్రాధాన్యమివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏడిస్ ఈజిప్టి దోమ కాటేసే వేళలివే.. డెంగీకి దోహదం చేసే ఏడిస్ ఈజిప్టి అనే దోమనే ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో దోమలు కుట్టకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయని గ్రహించాలి. వీలుంటే ఆయా శరీర భాగాల్లో మనకు మార్కెట్లో లభించే దోమల నివారణ లేపనం పూయాలి. నిల్వ నీరే స్థావరాలు నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో ఈ దోమలు విపరీతంగా గుడ్లను పొదుగుతాయి. అవి మూడేళ్ల వరకు జీవించగలవు. కాబట్టి ఇంట్లో లేదా మరెక్కడైనా సరే మూలల్లో తడిగా, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు మొక్కల కుండీల్లో నీటిని వదిలేస్తారు. అది కూడా ఈ దోమలకు స్థావరంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. దోమను ఎలా గుర్తించాలంటే.. ఏడిస్ ఈజిప్టి దోమను గుర్తించడానికి సులభమైన మార్గం వాటి నలుపు రంగు. కాళ్లపై తెల్లటి మచ్చలుంటాయి. దోమలను బయటకు తరిమికొట్టేందుకు ఇప్పుడు మార్కెట్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో చాలా వరకూ పరోక్షంగా ఆరోగ్యానికి హాని కలిగించేవే. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -
డెంగీతో బీటెక్ విద్యార్థి మృతి
నిజామాబాద్‌నాగారం: డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి భరత్ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు నెలల్లో 120 వరకు డెంగీ కేసులు నమో దు అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు నిత్యం పదుల సంఖ్యలో డెంగీ బాధితులు వస్తున్నా అధికారికంగా నమోదు కావడం లేదు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో జూలై, ఆగష్టు నెలలో ఒక్కొక్కరి చొప్పున డెంగీతో మరణించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీతో భరత్ మృతి అధికారులకు సమాచారం లేదు. -
తెలంగాణ లో డెంగ్యూ జ్వరాల డేంజర్ బెల్స్
-
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్‌సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్‌లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్‌పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్‌ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
తెలంగాణాలో డెంగీ డేంజర్ బెల్స్.. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వందమందికి పైగా దీని బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే 599 మందికి జ్వరం సోకడం వ్యాధి విజృంభణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు 6,151 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి జూలై వరకు 1950 కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క ఆగస్టులోనే ఏకంగా 3,602 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లోనే.. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 2,998 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్‌లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి మొదలైన వర్షాలు కొన్ని రోజులు మినహా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. జ్వర సర్వే.. దోమల నియంత్రణ డెంగీ జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. చాలామందికి ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లోనే ఉండాల్సి వస్తోంది. అనేక ఆసుపత్రులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. కాగా డెంగీ తీవ్రత నేపథ్యంలో జ్వర సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి దోమల నివారణ చర్యలు చేపట్టింది. డెంగీ అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు 20,912 డెంగీ నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను సరఫరా చేసింది. మరో 6,501 కిట్లను సిద్ధంగా ఉంచింది. అలాగే అన్ని జిల్లాలకు మలేరియా నిర్ధారణకు అవసరమైన 5.25 లక్షల ఆర్డీటీ కిట్లను పంపించింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 40 వేల కిట్లను పంపించింది. అయితే శాఖల మధ్య సరిగ్గా సమన్వయం లేకపోవడంతో దోమల నివారణ చర్యలు పూర్తిస్థాయిలో జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు కుట్టకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటివి డెంగీ ప్రధాన లక్షణాలని చెబుతున్నారు. -
డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగుతున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం ఆయన జూమ్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 డెంగీ కేసులుంటే, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ఎంత రక్తం అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర సర్వేతోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు: కేటీఆర్ ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్ చెప్పారు. డెంగీ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచినీటిలో ఉంటాయని అందువల్ల నీరు నిలువ లేకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో, డెంగీ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ఇదీ చదవండి: ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్ -
3,109 మందికి డెంగీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లక్షణాలున్నవారి నుంచి శాంపిళ్లను సేకరించి వైద్య ఆరోగ్యశాఖ డెంగీ కేసులను గుర్తిస్తోంది. ఆ విధంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 32,449 నమూనాలను సేకరించి పరీక్షించింది. అందులో 3,109 మందికి డెంగీ (9.58% పాజిటివిటీ) నిర్ధారణ అయిందని పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు. భారీ వర్షాలకు పట్టణాలు, పల్లెల్లో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో..: అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా హైద రాబాద్‌లో 12,205 రక్త నమూనాలను పరీక్షించగా, అందు లో 1,470 మంది డెంగీ బారిన పడ్డారు. అంటే ఇక్కడ 12. 04 పాజిటివిటీ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 2,044 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 322 మందికి డెంగీ (15.75 శాతం పాజిటివిటీ) సోకింది. మేడ్చల్ జిల్లాలో 1,375 నమూనాలకు గాను 165 మందికి, ఖమ్మం జిల్లాలో 3,815 మందికి గాను 126 మందికి, కరీంనగర్ జిల్లాలో 1,011 మందికి గాను 123 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 1,662 మంది నమూనాలను పరీక్షించగా 88 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 729 మంది నమూనాలను పరీక్షించగా, 81 మందికి డెంగీ సోకినట్లు తేలింది. కాగా రాష్ట్రంలో 378 మందికి మలేరియా, 44 మందికి చికున్‌గున్యా సోకింది. డెంగీ లక్షణాలివే..: ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపి తే నొప్పి పుడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. కండరా లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్ ఒక్కటే సరిపోదు: డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేల లోపునకు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవి స్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడుస్తుండాలి. ఎల క్ట్రాల్ పౌడర్, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ముందు జాగ్రత్తలే మంచిది: దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాలల పరిస రాలు శుభ్రంగా ఉంచాలి. కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ అయితే మంచినీరు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. -
అనంతపురంలో డెంగీ కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకటీ, రెండు నమోదయ్యే కేసులు పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తక్కువగా ఉన్నా.. అనంతపురం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)లను రంగంలోకి దించారు. తొలకరి జల్లులు పడగానే డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటికే నాలుగు సెంటినల్ సర్వేలెన్స్ కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు. ప్లేట్లెట్స్ పేరిట భారీగా దోపిడీ వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయి. అయితే డెంగీ జ్వరమని చెబుతూ రోగిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించి.. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఎవరైనా వసూళ్లు చేస్తే నేరుగా జిల్లా వైద్యాధికారికి గానీ, కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ డెంగీ నిర్ధారణ కాకున్నా ప్లేట్లెట్స్ పేరిట దోపిడీ చేయడం ఆస్పత్రుల యాజమాన్యాలకు రివాజుగా మారింది. ధర్మవరం పట్టణానికి చెందిన ఖాదర్‌బాషా వారం రోజుల క్రితం జ్వరంతో అనంతపురం కమలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, డెంగీ లక్షణాలున్నాయని తెలిపి చికిత్స పేరుతో రూ.40వేలు వసూలు చేశారు. చివరకు అతనికి వైరల్ ఫీవర్ అని తేలింది. అనంతపురంలోని పాతూరుకు చెందిన నాగభూషణం వాంతులు, జ్వరంతో సాయినగర్‌లోని ఓ నర్సింగ్‌హోంలో చేరాడు. డెంగీ పేరుతో అతనినుంచి రూ.50వేలకు పైగా లాగారు. రోగి కోలుకున్నాడు కానీ, డెంగీ జ్వరం నిర్ధారణ కాలేదు. -
హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ఓ వైపు కరోనా కేసులు..మరో వైపు చాప కింద నీరులా ఆ వ్యాధులు..
బనశంకరి(బెంగళూరు): ఓ వైపు కరోనా కేసులు జోరుగా పెరుగుతుండగా మరో వైపు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,838 డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గత ఏడాదితో (జనవరి 1 నుంచి జూన్ 10) పోలిస్తే ఈ ఏడాది 50 శాతం డెంగీ కేసులు పెరిగాయి. బెంగళూరు నగరంలో 388 కేసులు, ఉడుపిలో 217, మైసూరులో 171, చిత్రదుర్గలో 105, కొప్పళలో 94 కేసులు నమోదయ్యాయి. 2021లో 916, (2022లో 1,838 జనవరి నుంచి జూన్ 10 వరకు) గత నెలలోనే 532 కేసులు నమోదయ్యాయి. 2021లో 2987 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరాల కట్టడికి చర్యలు: డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్ రోగానికి కారణమైన ఈడీస్ దోమల సంతానోత్పత్తి తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా కార్యకర్తలు, ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామీణ, నగర ప్రాంతాల్లో ప్రజలను జాగృతం చేయాలని సూచించింది. పొడిచెత్తను త్వరితగతిన సేకరించాలని అన్ని జిల్లాల అంటురోగాల నియంత్రణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కాగానే ఈడీస్ దోమలు మురుగునీటిలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. ఈ దోమలు కుడితే డెంగీ జ్వరం వస్తుంది. డెంగీ లక్షణాలు ► జ్వరం, తలనొప్పి, అలసట, జలుబు, గొంతునొప్పి, వాంతులు, కడుపునొప్పి, చేతులు కాళ్ల నొప్పులు, శరీరంపై గుల్లలు ఏర్పడటం డెంగీ నియంత్రణకు చర్యలు ► పగలు దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి ► శుభ్రమైన నీటిని వేడిచేసి తాగాలి ► నీటితొట్టెలు, ట్యాంకులపై మూతలు ఉంచాలి ► పాత్రలు, బిందెల్లో నీరు నిల్వ ఉంచరాదు ► ఇంటి చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, మురుగు నీరు నిల్వ ఉండరాదు. చిప్పలు, టైర్లులాంటి చెత్తను తొలగించాలి -
హైదరాబాద్‌లో పెరుగుతోన్న డెంగ్యూ కేసులు
-
హైదరాబాద్‌ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్ వేసుకుంటే కాటేస్తాయి
సాక్షి, హైదరాబాద్: దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. నగరవాసులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపన్న ప్రాంతాల్లో అధికం.. కొంత కాలంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని సంపన్న ప్రాంతాల్లో సైతం కేసులు బాగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. డెంగీ దోమకి గుడ్డు పెట్టడానికి 10మి.లీ ద్రవం చాలు. కూలర్స్, ఫ్రిజ్‌లు, ఏసీలు తదితరాల నుంచి వృథా నీరు ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, ఇళ్లల్లో ఇంటీరియర్ అందం కోసం ఎక్వేరియమ్స్ నీళ్లలో తాబేలు, ఫ్లవర్ పాట్స్ లాంటి డెకరేటివ్ ఉత్పత్తుల్లో నీళ్లు రోజూ మార్చకపోవడం దోమల విజృంభణకు కారణమవుతోంది. వేసవి సెలవులు కారణంగా.. ఊరు వెళుతున్నప్పుడు వారం, పదిరోజుల పాటు ఆ నీటిని అలాగే వదిలేస్తుండడం.. ఈ నిల్వ నీటిలో సులభంగా డెంగీ దోమ గుడ్లు పెడుతోంది. షార్ట్స్ వేసుకుంటే.. కాటు.. డెంగీ దోమ అడుగున్నర మించి ఎగరలేదు. మోకాళ్ల పైదాకా వచ్చి కుట్టలేదు. కాబట్టి డెంగీ దోమ షార్ట్స్ వేసుకునే అలవాటు ఉన్నవారికి తరచుగా కాటేస్తున్నట్టు గుర్తించారు. సిబ్బంది దోమల మందు పిచికారీ చేయడానికి కూడా కొన్ని కాలనీస్లలో అడ్డుకుంటున్నారు. ఇది సరికాదు.. ప్రస్తుతం తుంపర్లు లేకుండా గాలిలోనే కలిసిపోయేలా మందు పిచికారీ చేస్తున్నారు. కాబట్టి కాలనీలలో అడ్డు చెప్పకుండా సహకరించాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 48.5 శాతం అంటే 2,091 కేసులు హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి ఖాళీ బీరు, విస్కీ తదితర బాటిల్స్ ఇంట్లో, మేడమీద ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు. ఫ్లవర్ పాట్స్ కింద ఉంచే ప్లేట్స్ నుంచి నీటిని తొలగిస్తూ ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తుండాలి. ప్రతి నాలుగైదు రోజులకోసారి ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రం చేస్తుండాలి. పగిలిన వినియోగించని ప్లాస్టిక్ కంటైనర్లు, వాడేసిన కొబ్బరి చిప్పలు, పాత సామాన్లు పడేసే స్టోర్ రూమ్స్ దోమల నివాసాలని గుర్తించాలి. షౌకత్‌నగర్‌లో ఎక్కువ... నాన్ సింప్టమాటిక్ డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటిదాకా ఇన్ పేషెంట్ చికిత్స అవసరం ఎవరికీ రాలేదు. ఒక్క కేసు వచ్చినా చుట్టూ 100 ఇళ్లు ఫీవర్ సర్వే చేస్తూ, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. కేవలం షౌకత్ నగర్లో తప్ప ఒకసారి డెంగీ గుర్తించిన ప్లేస్‌లో మళ్లీ కేసులు రావడం లేదు. సిటీలో షౌకత్ నగర్లో 6 కేసుల వరకూ వచ్చాయి. నగరంలోని 152 బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు.. ఇలా అన్ని చోట్ల ఉచిత పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. – నిరంజన్, జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి, హైదరాబాద్ -
డెంగీతో ‘జ్వర’భద్రం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 506 డెంగీ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వానాకాలం ముగుస్తున్న సమయంలో డెంగీ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగీ కేసులు నమోదు కావడం, దీనికితోడు చికెన్ గున్యా బాధితులు సైతం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షం రోజుల్లో మారిన సీను... రాష్ట్రంలో గత రెండు వారాలుగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో డెంగీ ప్రభావం కనిపించనప్పటికీ... ప్రస్తుతం రోజుకు సగటున 10–15 పాజిటివ్ కేసులు నమోద వుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 42, కరీంనగర్ జిల్లాలో 39 కేసులున్నాయి. వరంగల్, సంగా రెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, మేడ్చ ల్, మహబుబాబాద్, కొత్తగుడెం, ఖమ్మం, గద్వాల జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీని సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట దోమకాటే డేంజర్... డెంగీ జ్వరం ఎడిస్ దోమ కాటుతో వస్తుంది. ఎడిస్ దోమ నీరు నిల్వ ఉండే చోట ఉంటుంది. ప్రధానంగా పగటిపూటే కుడుతుంది. ఈ దోమకాటుకు గురైన తర్వాత 103–104 డిగ్రీల మధ్య జ్వరం వస్తుంది. రోగికి జ్వరం తగ్గాక క్రమంగా ప్లేట్లెట్లు తగ్గుతాయి. జ్వరం తగ్గిందని ప్లేట్లెట్ల పరీక్ష చేయిం చుకోకపోతే డెంగీ దొంగదెబ్బ తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్లెట్ల సంఖ్య ఉండాల్సి ఉండగా లక్షన్నరకన్నా దిగు వకు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుం టుంది. దీన్ని సకాలంలో గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల సమక్షంలో చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలకన్నా పడిపోతుంటే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ లక్షణాలు, చికిత్స ►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల. ►ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి. ►ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి. ►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ►రోగికి ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు మళ్లీ పెరుగుతాయి. -
తెలంగాణలో డెంగీ కేసులు 6,284
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ నాటికి 6,284 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో దేశంలో డెంగీ కేసులు ఏస్థాయిలో నమోదయ్యాయో సమగ్ర నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేసుల విషయంలో పదో స్థానంలో ఉందని వివరించింది. అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 27,506 డెంగీ కేసులు నమోదు కాగా, అత్యంత తక్కువగా అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక లడఖ్, లక్షద్వీప్‌లో డెంగీ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 44,585 డెంగీ కేసులు నమోదు కాగా, 66 మంది చనిపోయారు. ఈ ఏడాది 1.64 లక్షల కేసులు నమోదు కాగా, 146 మంది చనిపోయారు. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 70 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. -
రాష్ట్రంలో జ్వరపీడితులు 13 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఊరూ, వాడా అనే తేడా లేకుం డా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ ఇంట చూసినా ఒక్కరన్నా ఏదోరకమైన జ్వరంతో మంచంపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జ్వర లక్షణాలున్నవారు లక్షల్లో ఉన్నారు. రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న సర్వేలో అనేక కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో గతనెల నుంచి ఇప్పటివరకు అంటే ఆరువారాల్లో 1.62 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. ఇవిగాక జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు వచ్చేవారిని కలుపుకుంటే 2 లక్షల జ్వరం కేసులు ఉండొచ్చని అంచనా. అత్యధి కంగా హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల మంది జ్వరాల బారినపడినట్లు అంచనా. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏకంగా 13 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కరోనాతో జ్వరాలు నమోదు కాగా, జూలై నుంచి అటు కరోనా, ఇటు వైరల్ జ్వరాలు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఐదు వేల డెంగీ కేసులు...? రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నా యి. ఈ ఏడాది నమోదైన డెంగీ కేసుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లోనే అత్యధికం. 2020లో 2,173 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8నాటికి 4,714 కేసులు న్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నమోదైన వాటిని కలుపుకుంటే దాదాపు ఐదువేల డెంగీ కేసులు ఉంటాయని అంచనా. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,188 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 8 వరకు 632 మలే రియా కేసులు నమోదయ్యాయి. 2019లో 1,168... 2020లో 664 నమోదయ్యాయి. బయటకు రానివి ఇంతకుమించి ఉంటాయని వైద్యనిపుణులు అంటు న్నారు. మరోవైపు పలు ఆసుపత్రులు డెంగీ బాధి తులను ఫీజుల రూపేణా పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇవీ కారణాలు... రాష్ట్రంలో పలు చోట్ల పారిశుధ్య నిర్వహణ సరిగా లేక దోమలు విజృంభిస్తున్నాయి. పగటిపూట కుట్టే దోమలతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మలే రియా కేసులూ వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ దోమలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. డెంగీ, మలేరియా కేసులు మరింతగా నమోదయ్యే అవకాశాలున్నాయి. నిర్లక్ష్యం తగదు.. ప్రస్తుతం గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. గతంలో డెంగీ, కరోనా కేసులు అధికంగా రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువ ఉంటున్నాయి. డెంగీకి, కరోనా లక్షణాలకు మధ్య తేడాను గుర్తించవచ్చు. డెంగీలో 102–103 జ్వరం కూడా ఉంటుంది. పారాసిటమాల్ మాత్ర వేసినా అది తగ్గదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. -
ప్రాణి చిన్నదే.. హాని పెద్దది
సాక్షి, కడప కార్పొరేషన్/రూరల్: జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడంతో దోమల వ్యాప్తి అధికమవుతోంది. దీంతో కొద్దిపాటి జ్వర లక్షణాలు కనిపించినా ప్రజలు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. డెంగీ నిర్ధారణ పరీక్షలకు క్యూ కడుతున్నారు. జిల్లాలో 19 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా నమోదయ్యే కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల పేరుతో దోపిడీ జిల్లా వ్యాప్తంగా డెంగీతోపాటు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటం ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులకు వరంగా మారింది. జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ప్రజలు అది కోవిడ్ వల్ల వచ్చిందా, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవరా తెలియక పరీక్షలకు వేలకు వేలు ఖర్చు చేస్తూ అవస్థలు పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ప్లేట్లెట్ కౌంట్ పరీక్షల పేరుతో ప్రైవేటు ల్యాబ్‌ల వారు రోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. జిల్లాలో కడప రిమ్స్, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి, పులివెందుల ఆసుపత్రుల్లో డెంగీకి ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇవి అందుబాటులో ఉన్నాయని తెలియక, అవగాహన లేక ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి నష్టపోతున్నారు. నిజానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే డెంగీ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. దడ పుట్టిస్తున్న దోమలు మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ఎక్కువగా దోమ కాటువల్లే సంభవి స్తాయి. వ్యాధి కలిగిన జీవిని ఇది కుట్టి ఆరోగ్యంగా ఉన్న మరో జీవిని కుట్టడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాయి. వీటి ద్వారా మలేరియా, బోదకాలు, చికున్‌గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రస్తుత వర్షా కాలంలో దోమల వల్ల ప్రతి ఇంట్లో జనం జ్వరాల బారిన పడటం అధికమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దగ్గు, జలుబు, విష జ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. గతంలో దోమలు ఆయా కాలం, వాతావరణ పరిస్థితులను బట్టి ఉధృతంగా ఉండేవి. అయితే ఇటీవల అన్ని కాలాల్లోనూ, అన్ని వేళల్లోనూ దోమలు ఉంటున్నాయి. దోమల ఆవాసాలుగా ఖాళీ స్థలాలు: పారిశుధ్యంపై మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం దోమల ఉధృతి పెరగడానికి కారణమవుతోంది. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంటున్న నీరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఫాగింగ్, స్ప్రేయింగ్ సరిగా చేయకపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల నివారణకు మలాథియాన్ స్ప్రేయింగ్ సక్రమంగా చేస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. చాలా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ మెషీన్లు పనిచేయక మూలనపడ్డాయి. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఒక వైపు చెబుతున్నా తప్పని పరిస్థితి ఏర్పడుతోంది డెంగీ లక్షణాలు ♦ శరీర ఉష్ణోగ్రత పెరగడం ♦ వాంతులు, విరేచనాలు ♦ కళ్లు మంటలు, తీవ్రమైన తలనొప్పి ♦ చర్మ సమస్యలు ♦ చిగుళ్ల నుంచి రక్తస్రావం ♦ మూత్రంలో, మలంలో రక్తం పడటం ♦ కడుపు నొప్పి, జలుబు, దగ్గు ♦ నీరసం అప్రమత్తంగా ఉండాలి డెంగీ, మలేరి యా, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, పెద్దలు పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. 101 డిగ్రీలకు మించి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వాంతులు తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. – కె. నాగరాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి -
పుణెకు.. డెంగీ నమూనాలు
సాక్షి, అమరావతి: డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో 25 శాతం రక్త (సీరం) నమూనాలు పుణెలోని కేంద్రీకృత ల్యాబొరేటరీలకు పంపించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నమూనాలను పుణెలోని ఎన్ఐవీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) ల్యాబొరేటరీకి పంపించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీతాప్రసాదిని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. ఏపీలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. డెంగీలో టైప్–2 వేరియంట్ ఏదైనా వచ్చిందా? ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయనే విషయమై సెంట్రల్ ల్యాబొరేటరీల్లో పరిశీలన చేస్తారు. ఆ ఫలితాలను బట్టి నియంత్రణా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మన రాష్ట్రంలో 37 వారాల్లో 2వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. -
94.75 శాతానికి తగ్గిన డెంగీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి ఏకంగా 94.75 శాతానికి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించింది. ఆ వివరాలను కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సీజనల్ వ్యాధులపై తాజాగా జాతీయ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా ఇళ్లల్లో పరిశుభ్రత పెరగడం.. వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం.. ప్రజలు మాస్క్‌లు ధరించడంతో ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పరిస్థితి తగ్గిందని వెల్లడించింది. దీంతో సీజనల్ వ్యాధులు ఈసారి తగ్గిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఏడాది 699 డెంగీ కేసులు.. వరుసగా మూడేళ్లపాటు దేశంలో వర్షాకాల సీజన్లో డెంగీ కేసులు గణనీయంగా నమోద య్యాయి. 2017లో దేశంలో 1.88 లక్షల కేసులు నమోదు కాగా, 325 మంది చనిపో యారు. 2018లో 1.01 లక్షల కేసులు రికార్డు కాగా, 172 మంది మరణించారు. 2019లో 1.57 లక్షల కేసులు నమోదు కాగా, 166 మం ది చనిపోయారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో 13,587 డెంగీ కేసులు నమోదవ్వగా, 9 మంది చనిపోయారు. ఇక గతేడాది తెలంగాణలో డెంగీతో జనం విలవిలలాడిపోయారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ జ్వరం కేసులు నమోదయ్యాయి. 2017లో తెలంగాణలో 5,369 డెంగీ కేసులు నమోదైతే, 2018లో 4,592 కేసులు వచ్చాయి. 2019లో ఏకంగా 13,331 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో 699 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి 5.25 శాతమే రికార్డయ్యాయి. ఒకవేళ మున్ముందు కొద్దిపాటి కేసులు నమోదైనా సీజన్ ముగుస్తున్నందున తీవ్రత పెద్దగా ఉండదని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇక గతేడాది రాష్ట్రంలో మలేరియా కేసులు 1,711 రికార్డవ్వగా, ఈ ఏడాది జూలై వరకు 570 కేసులు నమోదయ్యాయి. అలాగే చికున్‌గున్యా కేసులు గతేడాది 5,352 నమోదవ్వగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 364 కేసులే వచ్చాయి. కరోనా, సీజనల్ వ్యాధులపై సర్కార్ చర్యలు ► ఇంటింటి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించారు. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే, మరోవైపు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులను నియంత్రించడంపై దృష్టి సారించారు. ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించారు. ► కరోనా నిబంధనలను పాటించడంపై ప్ర జలను చైతన్యం చేయడంతో పాటు దోమ ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. ► కరోనా జాగ్రత్తలతో పాటు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జనాన్ని జాగృతం చేశారు. ► అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాలను చేపట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడిన మాస్క్‌లు కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై సర్కారు పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో దోమల నిర్మూలన జరిగింది. ప్రజలు కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ లు ధరించారు. భౌతిక దూరం పాటించారు. దీంతో జలుబు, జ్వరం వంటి ఫ్లూ వంటి లక్షణాలున్న వారి నుంచి ఇతరు లకు వ్యాప్తి తగ్గింది. దోమల నిర్మూలన కార్యక్రమాలతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఇటువంటి చర్యలు తీసుకోవడంతో సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు -
కాలుష్యంతో వ్యాధుల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యం లో ‘హెల్త్ హైదరాబాద్’పేరుతో ఆదివారం స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కరుణా గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు. -
డెంగీ కేసుల్లో తెలంగాణకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 13,200 కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉందని తెలిపింది. డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం సీఎస్ ఎస్.కే జోషి నిర్వహించిన సమావేశంలో పాల్గొంది. అనంతరం కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి చేరుకుని డెంగీ నిర్మూలనకు చేపడుతున్న చర్యలను పరిశీలించింది. రాష్ట్రంలో డెంగీ నివారణకు ఏర్పాటు చేసిన కేంద్ర నోడల్ ఆఫీసర్, జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుమన్ లతా పటేల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) కన్సల్టెంట్ కౌషల్ కుమార్‌లు ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 58 మంది మరణించారన్నారు. తెలంగాణలో ఇద్దరు డెంగీ కారణంగా మరణించారని, కర్ణాటకలో 12 మంది, ఉత్తరాఖండ్‌లో 8 మంది డెంగీతో మరణించారన్నారు. తెలంగాణలో 40 నుంచి 50% వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయన్నారు. ఎక్కువ రోజులు వర్షాలు కురవడం వల్లే ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవడం వల్లే డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర బృందం అంగీకరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలుంటే, ఈ ఏడాది 28కి పెరిగాయన్నారు. గతేడాది తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెద్దగా లేవని, కానీ ఈ ఏడాది ఏకంగా 350 చోట్ల వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు జరిగాయన్నారు. ఇటీవలకాలం వరకు రోజుకు 100 వరకు డెంగీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు రోజుకు 50కి పడిపోయాయన్నారు. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని బృందం స్పష్టం చేసింది. కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రణాళిక గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ జోషి ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాధులపై బి.ఆర్.కె.ఆర్.భవన్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్‌రావు, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. -
వారంలో వెయ్యికిపైగా డెంగీ కేసులా?
సాక్షి, హైదరాబాద్: గడిచిన ఒక్క వారంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 1,120 మంది డెంగీ బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వైద్య సదుపాయాలు ఉన్న హైదరాబాద్ మహానగరంలోనే పరిస్థితులు ఇలా ఉంటే, తెలంగాణలోని గ్రామాల్లో పరిస్థితులు ఇంకెలా ఉన్నాయో ఊహించవచ్చని వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడం తీవ్రమైన విషయమని కూడా వ్యాఖ్యానించింది. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. పరిస్థితులు చేయిదాటిపోయే తీరులో ప్రమాద ఘంటికలు మోగకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పింది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వైద్య సేవలు అందడం లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే సరిహద్దు రాష్ట్రాల నుంచి వైద్య సేవలు అందుకోవాలని సూచించింది. హైదరాబాద్ నగరంలో డెంగీ, ఇతర విషజ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సమరి్పంచిన నివేదిక పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యల్ని సమగ్రంగా తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డెంగీ జ్వరాల్ని అదుపుచేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, ఇదే అంశంపై న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను సుమోటో పిల్‌గా పరిగణించిన ధర్మాసనం వాటిని బుధవారం మరోసారి విచారించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. -
డెంగ్యూకి చికిత్సకన్నా ముందు నివారణ అవసరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వ్యాధుల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో విడుదలైన నివేదికల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో డెంగ్యూ వల్ల మరణించిన వారి సంఖ్య 50కు చేరింది. దీని గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, హార్ట్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (హెచ్సీఎఫ్ఐ) అధ్యక్షులు డాక్టర్ కేకే అగర్వాల్ మాట్లాడుతూ 'ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న దోమకాటు వ్యాధి డెంగ్యూ. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ప్రతి రోజూ డెంగ్యూ కేసుల నమోదవుతూనే ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనబడటం లేదా ఒక్కోసారి కనిపించకపోవడమూ ఉంటుంది. ఈడిస్ ఈజిప్టి అనే దోమ ఈ వ్యాధి కారకం. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. తాజా నీటిలోనూ, నిల్వ నీటిలోనూ ఇవి సంతానాన్ని వృద్ధి చేసుకోగలవు. ఇండియాలో ఈ దోమ వృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ దోమలు కాంతిని గుర్తిస్తూ ఏ సమయంలోనైనా కుట్టడానికి అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చేసిన అధ్యయనంలో, దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, లెప్టోస్పిరోసిస్ లాంటి వ్యాధులలో సమర్థవంతంగా పనిచేసే డాక్సీసైక్లిన్ డెంగ్యూలో సైతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింద'ని అన్నారు. గుర్తించాల్సిన అంశాలు: దోమల బ్రీడింగ్ ప్రక్రియ 7 నుంచి 12 రోజుల కాలంలో పూర్తవుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల సంతతి వృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. వ్యాధి తీవ్రతను గుర్తించడంలో ఫిజీషియన్లు తప్పనిసరిగా 20 ఫార్ములాను అనుసరించాలన్నారు. బీపీ సాధారణ స్థితి కన్నా తక్కువ, ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. బీపీ సాధారణ స్థితి కన్నా 20ఎంఎం/హెచ్‌జీ తక్కువగా ఉంటే, ప్లేటలెట్స్ వేగంగా పడిపోవడం జరుగుతుంది. టర్నిక్యుట్ పరీక్ష తరువాత చేతిపై 20 హెమరాజిక్ స్పాట్స్ ఉంటే ఆ రోగి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు భావించవచ్చు. ఆ సమయంలో అతనికి బరువుకు తగినట్లు కిలో బరువుకు 20 మి.లీ. ఫ్లూయిడ్‌ను తక్షణమే అందించడంతో పాటు వైద్య పరంగా శ్రద్ధ అవసరం అవుతుంది. డెంగ్యూ నివారణకు సూచనలు: ► మనీ ప్లాంట్ కుండీలు లేదా సరిగా కప్పని నీటి ట్యాంకులలో కూడా దోమలు గుడ్లు పెట్టవచ్చు. కనుక ఇంటి చుట్టు పక్కల పరిసరాలు శుభ్రంగా, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ► పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి. ► దోమ తెరలు/దోమ నివారణ మందులు వాడాలి. -
ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’
సాక్షి, న్యూఢిల్లీ : ఒక్క భారత దేశాన్నే కాదు, ఆగ్నేయాసియాలోని వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలను కూడా ఈసారి డెంగ్యూ జ్వరలు తీవ్రంగా వణికిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలియజేస్తున్నాయి. వియత్నాంలో ఒక్క జూలై నెల నాటికే 1,15,186 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 29 వేల డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈసారి లక్ష దాటి పోవడం గమనార్హం. ఫిలిప్పీన్స్‌లో జూలై నెల నాటికి 1, 46, 062 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది అదే ఫిలిప్పీన్స్‌లో 69 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 43, 200 డెంగ్యూ కేసులు నమోదవడంతో ఆ దేశంలో వైద్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అక్కడే గతేడాది జూలై నెల నాటికి 28,100 డెండ్యూ కేసులు నమోదయ్యాయి. కంపోడియాలో 39 వేల కేసులు, గతేడాది మూడు వేల కేసులు నమోదయ్యాయి. లావోస్, మలేసియా, సింగపూర్, తైవాన్ దేశాల్లో కూడా ఈసారి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ఆగ్నేయాసియా దేశాల్లో కాకుండా అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అమెరికా దేశాల్లో కూడా డెంగ్యూ వ్యాధి ఎక్కువగానే ఉంది. ఈసారి బ్రెజిల్, కొలంబియా, హోండురస్, నికరాగ్వా దేశాల్లో ఆగస్టు మూడవ తేదీ నాటికి 5,84,263 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా 1970 దశకం నుంచే డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అత్యధిక జన సాంద్రతతో కిక్సిర్సిన రియో డీ జెనీరియో, ఓ చి మిన్ సిటీ నగరాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా జూలై నెలలో వాతావరణం వామ్ (వేడిగా) ఉండడమని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన డాక్టర్ రాచెల్ లోవే తెలియజేశారు. భారత లాంటి సమశీతోష్ణ మండలాల్లో ఉష్ణోగ్రత సగటు 25 సెంటిగ్రేట్ డిగ్రీలు ఉంటే వామ్గాను, 35 డిగ్రీలు ఉంటే హాట్‌గాను పరిగణిస్తాం. మొత్తం అంతర్జాతీయంగా, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎన్నడు లేని విధంగా (ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా నోట్ చేస్తున్న 1880 సంవత్సరం నుంచి) జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందట. ఈ వామ్ వాతావరణంలో డెంగ్యూ వైరస్, వాటిని క్యారీ చేసే దోమలు క్రియాళీలకంగా ఉంటాయని డాక్టర్ రాచెల్ తెలిపారు. మురుగు నీరు, కుంటలతోపాటు ప్లాస్టిక్ వాటర్ కంటెనైర్లు, మొక్కల కుండీలు దోమల గుడ్లకు నిలయాలుగా మారుతున్నాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. డెంగ్యూ వైరస్ సోకితే కళ్లలోపల మంట, జ్వరంతోపాటు విపరీతమైన తలనొప్పి వస్తుందట. ఫలితంగా మూత్రంలోకి రక్తం రావడం, శరీరంలోని అవయవాలకు ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగ్గా అందించలేక శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడడం, ఆక్సిజన్ అందక శరీరంలోని ఏదైన అవయం దెబ్బతింటుందని, కీళ్ల నొప్పులు వస్తాయని తెలిపారు. బీపీ కూడా తీవ్రంగా పడిపోతుందని, కొన్ని సందర్భాల్లో మత్యువు కూడా సంభవిస్తుందని డాక్టర్ రాచెల్ వివరించారు. దీన్ని నిరోధించేందుకు ఇప్పటి వరకు సరైన మందులేదని, మానవ శరీరంలో ప్రవేశించిన ఈ వైరస్ తన సైకిల్‌ను పూర్తి చేసుకొని బయటకు వెళ్లి పోయే వరకు శరీరంలోని ఏ అవయవం దెబ్బతినకుండా రక్షించుకోవడం, వాటి పరిరక్షణకు అవసరమైన మందులు తీసుకోవడం మంచిదని ఆయన చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల డెంగ్యూ కేసులు నమోదయినాయని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో 2005లో అత్యధికంగా 15 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఫలితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న విష జ్వరాలను అరికట్టడానికి తమ శాఖ గత నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోందని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డెంగ్యూ లక్షణాలు మారాయని.. ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగినా.. త్వరగానే నయం అవుతుందని అన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో 51వేల మందికి టెస్ట్ చేస్తే.. కేవలం 62 మందికే డెంగ్యూ ఉన్నట్లు తెలీందన్నారు. గాంధీ ఆస్పత్రిలో కూడా 419మందికి నయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, భోదన ఆస్పత్రుల్లో సాయంత్రం కూడా ఓపీ నడుపుతున్నామన్నారు. సెలవులు లేకుండా వైద్యులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. మందులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి రోజు మినిస్టర్ పేషీ జ్వరాల మీద పని చేస్తోందని.. జూన్ నుంచి జ్వరాలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని.. అవసరమైతే అద్దెకు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రజలు కూడా వారి పరిసరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఈ పరిస్థితుల నుంచి భయటపడగలమన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేసి పని చేసే వారి స్థైర్యాన్ని దెబ్బ తీయవద్దని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతి రోజు సాయంత్రం ఖచ్చితంగా పేషెంట్స్ నివేదికను డీఎంహెచ్ఓకి అందించాలని ఆదేశించామన్నారు. సాధరణ జ్వరంతో వచ్చే వారిని డెంగ్యూ అని భయపెట్టవద్దని ప్రైవేట్ ఆస్పత్రులను హెచ్చరించారు ఈటెల. -
డెంగీపై జర పైలం
దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ఒకటిగా వనపర్తి జిల్లా పొలికిపాడు పీహెచ్సీ పరిధిలోని ఆముదాలకుంట తండా నిలిచింది. గత నెల ఒకే ఒక్క రోజు ఇక్కడ 19 మందికి డెంగీ సోకింది. దీంతో ఆ గ్రామంలో ఆరోగ్య నిఘా పెంచారు. నీటి నిల్వ ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తేలింది. హైదరాబాద్‌లో గత బుధవారం ఒక్క రోజే దాదాపు 500 మందికి డెంగీ సోకినట్లు అంచనా. ప్లేట్లెట్లు 20 నుంచి 30 వేలకు పడిపోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వందల్లో వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని డెంగీ వణికిస్తోంది. వేలాది మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్లేట్లెట్లు పడిపోతుండటం ప్రాణాలమీదకు వస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం.. ఈ జనవరి నుంచి గత బుధవారం వరకు 1,687 డెంగీ కేసులే నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 11 వేల మందిని పరీక్షించగా ఆ కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య ఎంతనేది వైద్య, ఆరోగ్యశాఖ లెక్కగట్టకపోవడం, నిఘా పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆముదాలకుంట తండాలో ఒకేసారి అన్ని కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అయినా ఇక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుస్తోంది. డెంగీ ప్రభావం ఇలా.. ఎడిస్ అనే దోమ వల్ల డెంగీ వస్తుంది. ఇది పగలే కుడుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. జ్వరం విపరీతంగా ఉన్నప్పు డు కూడా ప్లేట్లెట్ సంఖ్య తగ్గదు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్లు గణనీయంగా పడిపోతాయి. చాలా మంది ఇది గమనించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరికి తీవ్ర రక్తస్రావం అవుతుంది. ముక్కు, మలం ద్వారం లేదా బ్రష్ వేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధిక రక్తస్రావం అయితే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలి. 15 వేల కన్నా తగ్గినా గుర్తించకపోతే డెంగీ మరణాలు సంభవిస్తాయి. ప్లేట్లెట్ల గుర్తింపులో మతలబు.. ప్లేట్లెట్ గుర్తించేందుకు మెషీన్ కంటే మైక్రోస్కోప్ పరీక్ష మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒక రోగికి ప్లేట్లెట్ పరీక్ష చేస్తే మెషీన్ కౌంట్‌లో 32 వేలు చూపిస్తే, మైక్రోస్కోప్ ద్వారా మాన్యువల్‌గా లెక్కిస్తే 65 వేల వరకు ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రక్త కణాలు ఒక్కోసారి మూడునాలుగు కలిపి ముద్దగా ఉంటాయి. దాన్ని మెషీన్ ఒకే రక్త కణంగా లెక్కిస్తుంది. అదే మైక్రోస్కోప్ పద్ధతిలో పరిశీలిస్తే నాలుగు రక్త కణాలుగా చూపిస్తాయి. డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి -
స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ కేసుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన స్వైన్‌ప్లూ, డెంగ్యూ కేసుల వివరాలను తమ ముం దుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు ప్రబలినట్లు గుర్తించిన 117 ప్రాంతాల వివరాలను కూడా సమర్పించాలంది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని నియమించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులకు చికిత్స అందించేందుకు సౌకర్యాలు లేవంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ చికిత్స కేవలం గాంధీ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంటే మారుమూల ఉన్న ప్రాంతాల ప్రజల సంగతేమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పంజా విసురుతోన్న డెంగీ
సాక్షి, హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్‌లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్‌తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు... మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్సీజన్లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి–ఏప్రిల్‌ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి. 2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చింద ని డాక్టర్ కమల్‌నాథ్ అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్’ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. -
రాష్ట్రంపై మలేరియా పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,475 మలేరియా కేసులు నమోదైతే.. అందులో 1,163 మందికి ఫాల్సిపారం మలేరియా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు శనివారం ప్రభుత్వానికి నివేదించాయి. ఫాల్సిపారం మలేరియా ఆఫ్రికా దేశాల్లో సాధారణమైనా, ఆసియా దేశాల్లో ప్రమాదకరంగా మారింది. మలేరియా మరణాల్లో అధికంగా ఫాల్సిపారం మలేరియా ద్వారానే జరుగుతాయి. ఈ మలేరియా ప్రధానంగా మెదడుపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. వేగంగా రక్తస్రావం అవడం, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 12 ఏళ్ల చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 425 ఫాల్సిపారం మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లాలో 312 కేసులు, హైదరాబాద్‌లో 264 కేసులు, ఆసిఫాబాద్ జిల్లాలో 42 కేసులు రికార్డు అయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు గిరిజన ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఇటీవల వైవాక్స్ మలేరియా కూడా ప్రమాదకరంగా తయారైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైవాక్స్ మలేరియా కేసులు 312 నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 114, భూపాలపల్లి జిల్లాలో 42, మేడ్చల్‌లో 25, కొత్తగూడెం జిల్లాలో 23, ఆసిఫాబాద్ జిల్లాలో 20, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. భారీగా డెంగీ కేసులు.. మరోవైపు రాష్ట్రంలో అధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 15,058 మంది రక్త నమూనాలు సేకరిస్తే, అందులో 3,121 మందికి డెంగీ సోకినట్లు నిర్దారణ అయింది. అందులో ఒకరు చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 503 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో 363, కొత్తగూడెం జిల్లాలో 357, ఆదిలాబాద్ జిల్లాలో 338, పెద్దపల్లి జిల్లాలో 217, మహబూబ్‌నగర్ జిల్లాలో 199, కరీంనగర్ జిల్లాలో 124 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేర్లు చెప్పి రోగుల నుంచి వేలకు వేలు పిండేస్తున్నాయి. ఎన్నికల విధుల్లో సిబ్బంది.. కిందిస్థాయిలో వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లోనే మునిగిపోయింది. ఫలితంగా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే కనిపిస్తుంది. చెత్త ఊడ్చే సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరినీ ఎన్నికల విధుల్లోనే ఉంచుతున్నారు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అస్సాం పర్యటనకు అధికారులు.. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు వచ్చే సోమవారం నుంచి ఐదు రోజులు అస్సాంలో జరిగే ఒక సదస్సుకు వెళ్తుండటం విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు సంబంధిత మంత్రి లక్ష్మారెడ్డి ఆపద్ధర్మంగా ఉన్నారు. కాబట్టి అధికారులే అంతా నడపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన అధికారులు టూర్లకు వెళితే రాష్ట్రంలో జ్వరాలు, కంటి వెలుగు వంటి వాటిని పర్యవేక్షించే కీలక అధికారే ఉండే అవకాశం లేదు. లోపించిన పరిశుభ్రత రాష్ట్రంలో పరిశుభ్రత లోపించింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నెలలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యులు తినడానికి కూడా సమయం దొరకడం లేదు. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
జ్వర పీడితులను దాచేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జ్వరాలతో అల్లాడుతున్న బాధితుల వివరాల నమోదులో గోల్మాల్ జరుగుతోంది. ప్రతి జిల్లాలో డెంగీ జ్వరాలు, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాటిలో కనీసం 5 శాతం కూడా రికార్డుల్లో నమోదు చేయడం లేదు. జ్వరాల కేసులను ఎక్కువగా నమోదు చేస్తే సస్పెండ్ చేస్తామంటూ ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో 30 కేసులు నమోదైతే కేవలం ఒకటి లేదా రెండు కేసులను మాత్రమే రికార్డుల్లో చూపిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో బాధితుల నమోదులో అవకతవకలు జరుగుతున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నట్లు తేలితే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావని ప్రభుత్వం భయపడుతోందని, అందుకే బాధితుల వివరాలను నమోదు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పరిధిలో గడిచిన 10 నెలల్లో 922 డెంగీ కేసులు వెలుగుచూడగా, కేవలం 43 కేసులనే ప్రభుత్వ రికార్డుల్లో చూపడం గమనార్హం. ఎంఎఫ్–7 రికార్డులేవీ? మలేరియా లేదా డెంగీ కేసులను ఎంఎఫ్–7(మలేరియా ఫ్యాక్ట్–7) రిజిస్టర్లో నమోదు చేశారు. ఇందులో బాధితుల పేర్లు, చిరునామా ఉంటాయి. కానీ, కొన్నినెలలుగా ఈ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తెల్లకాగితంపై వివరాలు రాసి, ఉన్నతాధికారులకు పంపిస్తే వాళ్లు ఒకటో రెండో కేసులను ఎంఎఫ్–7 రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అంతిమంగా ఈ వివరాలే అధికారికంగా ప్రభుత్వ వెబ్సైట్లో, ముఖ్యమంత్రి కోర్‌డ్యాష్ బోర్డులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తన పరువు కాపాడుకోవడానికే జ్వర పీడితుల వివరాలను దాచేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎస్ఎస్హెచ్ ల్యాబొరేటరీల్లో అసలు నిజాలు ప్రతి జిల్లాలో డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసుల నిర్ధారణకు సివిలిటేనియస్ శాంపుల్ అండ్ హోల్డ్(ఎస్ఎస్హెచ్) ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ వచ్చిన ప్రతి కేసునూ బాధితుడి పేరు, చిరునామాతో సహా నమోదు చేస్తారు. కొన్ని జిల్లాల్లో ఎస్ఎస్హెచ్ ల్యాబ్‌ల్లో ‘సాక్షి’ పరిశీలించగా.. వాస్తవ జ్వరాల కేసులకు, ప్రభుత్వం వెల్లడించిన బాధితుల గణాంకాలకు పొంతనే లేదు. రాజధాని ప్రాంతం విజయవాడలో గత 10 నెలల్లో 1,600కు పైగా మలేరియా కేసులు బయటపడగా, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది కేవలం 25 కేసులే. అంటే కనీసం 2 శాతం కేసులను కూడా రికార్డుల్లో చేర్చలేదు. డెంగీ, మలేరియా, ఏవైనా విష జ్వరాలతో ఎవరైనా మృతి చెందితే ఆ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం కరాలవలస గ్రామంలో నెల రోజుల్లో విష జ్వరాలతో 11 మంది మృతి చెందారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాధితులు డెంగీ జ్వరంతో మరణించారు. ఇవేవీ ప్రభుత్వ రికార్డుల్లోకి చేరకపోవడం గమనార్హం. -
గ్రేటర్‌పై డెంగీ పంజా
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌పై మళ్లీ డెంగీ, మలేరియా వ్యాధులు పంజా విసురుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత మూడు మాసాల్లో 20 డెంగీ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. తాజాగా మరో 14 డెంగీ, 12 మలేరియా కేసులు నమోదయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. మురికివాడల్లో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతుండగా, ఐటీ అనుబంధ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలు, ధనవంతులు అధికంగా నివసించే కాలనీల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షా నికి తోడు...రోజుల తరబడి ఫాగింగ్ నిర్వహించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రేటర్లో ప్లాస్మోడియం పాల్సీఫారమ్ మలేరియా: మలేరియాలో ప్రమాదకరమైన ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) నగరంలో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎక్కడో గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఈ రకం కనిపించేది. ప్రస్తుతం నగరంలోనూ వ్యాపిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. మూడు నెలల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. ప్లాస్మోడియం అనే పరాన్న జీవి ద్వారా మలేరియా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్(పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారమ్(పీఎఫ్) అనేవి రెండు రకాలు. పీవీ వ్యాపించినప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు ఉంటాయి. మందులు వాడితే తగ్గిపోతుంది. అంత ప్రమాదకరమైనది కాదు. కానీ పీఎఫ్ మలేరియా చాలా ప్రమాదకరమైనది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి లేదంటే కాలేయం, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. మెదడుపైనా దాడి చేసి రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. దోమ కుట్టిన పది నుంచి ప ద్నాలుగు రోజుల్లో జ్వరం వస్తుంది. డెంగీ లక్షణాలతో బాధపడే వారికి కొంతమంది స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారని, అయితే ఇవి వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు. పారాసిటమాల్ తప్పఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదన్నారు. -
మశక.. మశక.. చీకటిలో..
మశకమన్నాక కుట్టక తప్పదు.. కుట్టాక దద్దుర్లూ రాకా తప్పదు.. అనివార్యమగు ఈ విషయము గురించి శోకింప తగదు.. జనన మరణాల గురించి భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ప్రస్తుతమున్న పరిస్థితులకు తగ్గట్లు మార్చేసుకుని.. నగరవాసులు ఇలా సర్దుకుపోతున్నారు.. దోమ(మశకం).. బతికేది కేవలం 20 నుంచి 30 రోజులే.. అయితే, చప్పట్లు కొడితే చచ్చిపోయే ఈ చిన్నప్రాణి ఇప్పుడు నగరవాసులతో కబడ్డీ ఆడేస్తోంది.. పిసినారి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టిస్తోంది.. దోమల నియంత్రణ కోసం నగరవాసులు ఏడాదికి ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసా? దాదాపుగా రూ.700 కోట్లు! అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రతి కుటుంబం దోమల నివారణకు నెలకు రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని ఆరోగ్య శాఖతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఎండాకాలం మరింత వ్యథే.. మళ్లీ దోమల టార్చర్ మొదలైంది. చలికాలంలో కొంత ఊపిరిపీల్చుకున్న ప్రజలకు.. వేసవి ప్రారంభంలోనే దోమల బాధ పట్టుకుంది. రాత్రిళ్లు అయితే.. వీర విజృంభణే.. గుంపులుగా వచ్చేస్తున్నాయి.. అలాగనీ పగటి పూట కనికరం చూపడం లేదు. గతంలో సీజనల్‌గా మాత్రమే కనిపించే దోమలు.. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా గడిచిన నెలన్నర మొత్తం దోమలకు అనువుగా మారింది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న దోమలు.. ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎనాఫిలిస్, క్యూలెక్స్ వంటి దోమలు పగటి పూట ఇళ్లల్లోనే మకాం వేసి రాత్రులు స్వైరవిహారం చేస్తుండడంతో జనాలు మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. అన్ని మార్గాల్లోనూ.. దోమలను శాశ్వతంగా వదిలించుకోవడం అంత సులభం కాకపోవడంతో తాత్కలిక ఉపశమనానికి పెట్టే ఖర్చు తెలియకుండానే కోట్లకు చేరిపోతోంది. అటు దోమలు సైతం ప్రజలు చేస్తున్న నివారణ చర్యలను ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. దోమల నివారణకు జీహెచ్ఎంసీ చేసే ఫాగింగ్ ఓ పథకం ప్రకారం లేకపోవడంతో వాటి విజృంభణ మరింత పెరిగింది. ఇందుకు ప్రజలు కాయిల్స్ ప్రయోగించడం, అవి పనిచేయకపోవడంతో లిక్విడ్, మస్కిటో బ్యాట్స్ వాడకం పెంచారు. ఇలా రాజధానిలోని ఒక్కో కుటుంబం దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రతి నెలా రూ.100 నుంచి రూ.300 ఖర్చు చేస్తున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. అంటే ప్రతి కుటుంబం ఏటా కనీసం రూ.2 వేల నుంచి రూ.2,500 ఖర్చు చేస్తున్నాయని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేశాయి. ఇలా రాజధానిలో నివసించే 35 లక్షల కుటుంబాలు దోమల నివారణకు ఏటా రూ.700 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనంలో తేలింది. 20 నుంచి 30 రోజులు.. దోమల జీవితకాలం చాలా తక్కువే. ఓ దోమ 20 రోజుల నుంచి నెల రోజుల వరకే బతుకుతుంది. కానీ ఒకే సమయంలో వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి పిల్ల దోమలు బయటకు రావడానికి 7 రోజులు పడుతుంది. ఆ లోపు యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తేనే.. దోమల ఉత్పత్తిని నివారించగలం. కానీ సరైన సమయానికి మందులు చల్లకపోవడం వల్ల దోమలు వీరవిహారం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ తీసుకుంటున్న దోమల నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితం చూపించడం లేదు. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ వంటివి విఫలం అవుతున్నాయి. అక్కడా..ఇక్కడా అని లేదు.. జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల నుంచి సెంటర్ సిటీ వరకు అన్నీ చోట్లా దోమలు విజృంభిస్తున్నాయి. మెహిదీపట్నం, ఆసీఫ్‌నగర్, షాలిబండ, మారేడ్‌పల్లి, న్యూబోయిన్‌పల్లి, అల్వాల్, కీసర, కొండాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. దోమ పోటుతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. గత ఏడాది 296 మలేరియా కేసులు నమోదుకాగా, డెంగ్యూ కేసులు 117 నమోదయినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటిస్తేనే దోమల నివారణ సాధ్యమవుతుందని జీహెచ్ంఎసీ అధికారులు చెప్తున్నారు. నల్లా గుంతలు, నీటి సంపులు ఇంటి పరిసరాల్లోని టైర్లు, పూల కుండీలు, పాత బకెట్లలో ఉండే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, నీరు నిలవకుండా చర్యలు చేపడితే దోమల నివారణ సగం పూర్తయినట్లే అని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ నెల ఖర్చు రూ.100-300 దోమల నివారణకు రాజధానిలో ఓ కుటుంబ ఏడాది ఖర్చు రూ.2000-2500 దోమల నివారణకు రాజధానిలో ఏడాదికయ్యే ఖర్చు రూ.700 కోట్లు – సాక్షి, హైదరాబాద్ -
అనంతను వణికిస్తున్న డెంగీ..
సాక్షి, అనంతపురం: డెంగీ జ్వరాలు అనంతపురం జిల్లాను వణికిస్తున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 48 గంటల్లో 8మంది మృతిచెందారు. మృతి చెందిన వారిలో అరు మంది చిన్నారులు ఉన్నారు. మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం మడేనహళ్లి గ్రామంలో ఇప్పటి వరకు డెంగీ జ్వరాలతో నలుగురు మృతిచెందారు. -
డెంగీ డేంజర్
-
దేశంలో 80 వేల మందికి డెంగీ
-
దేశంలో 80 వేల మందికి డెంగీ
7.42 లక్షల మలేరియా కేసులు నమోదు మలేరియాతో 188.. డెంగీతో 166 మంది మృతి - తెలంగాణలో 1,916 డెంగీ కేసులు.. మృతులు ముగ్గురు! - 1,765 మలేరియా కేసులు - ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య పరిస్థితి ఇదీ.. - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. ఏడేళ్లలో ఏకంగా మూడు రెట్లు అధికంగా డెంగీ కేసులు నమోదయ్యారుు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ఈ మేరకు ఒక నివేదికలో తెలిపింది. అలాగే మలేరియా కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నారుు. పారిశుధ్య లోపం, దోమల స్వైర విహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 79,800 డెంగీ కేసులు నమోదు కాగా.. 166 మంది చనిపోరుునట్లు కేంద్రం తన నివేదిక వెల్లడించింది. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదవగా.. 110 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏడాదికేడాదికి కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 2012లో ఏకంగా 50 వేల మందికి డెంగీ సోకగా... 242 మంది చనిపోయారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 193 మంది మృత్యువాత పడ్డారు. 2015లో లక్ష డెంగీ కేసులు నమోదుకాగా... 220 మంది చనిపోయారు. అలాగే మలేరియా కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 లక్షలు నమోదయ్యారుు. 188 మంది చనిపోయారు. గతేడాది 11.69 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 384 మంది మరణించారు. రాష్ట్రంలో ముగ్గురేనట తెలంగాణలో డెంగీతో ముగ్గురు మాత్రమే చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అరుుతే ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఏకంగా 22 మంది చనిపోయారని వెల్లడైంది. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,916 డెంగీ కేసులు నమోదయ్యాయని కేంద్ర నివేదికలో వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 29 మంది డెంగీతో చనిపోయారు. ఆ రాష్ట్రంలో 5,456 డెంగీ కేసులు నమోదయ్యారుు. పశ్చిమ బెంగాల్లో 11 వేల డెంగీ కేసులు నమోదు కాగా... 28 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 5,391 డెంగీ కేసులు నమోదు కాగా... 22 మంది చనిపోయారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో 12 మంది చొప్పున డెంగీతో మరణించారు. మలేరియా కేసులు దేశంలో అత్యధికంగా ఒడిశాలో నమోదయ్యారుు. ఆ రాష్ట్రంలో ఏకంగా 3.36 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా... 65 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో 22,030 కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. మేఘాలయలో 28,973 కేసులు రికార్డు కాగా.. 33 మంది మరణించారు. తెలంగాణలో మలేరియా కేసులు 1,765 నమోదు కాగా.. ఒక్కరూ చనిపోలేదని కేంద్ర నివేదిక వెల్లడించింది. -
ఖమ్మంలో 650 డెంగ్యూ కేసులు
► డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు బోనకల్ (ఖమ్మం జిల్లా): పారిశుద్ధ్యలోపంతోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులు నమోదయ్యయని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు అన్నారు. ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులో నమోదు కాగా అత్యధికంగా జోనకల్ మండలంలోనే ఉన్నాయన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టిఅంతా బోనకల్ మండలంపైనే ఉందన్నారు. పారిశుద్ధ్య లోపంవల్లే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. -
బెంగాల్ ను వణికిస్తున్న డెంగ్యూ
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రజలు డెంగ్యూ బారిన పడ్డారు. రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం నివారణ చేపట్టింది. ప్రభుత్వాసుపత్రులు డెంగ్యూ జ్వరం బాధితులతో నిండిపోయాయి. కోల్‌కతా, దక్షిణ బెంగాల్ లో అత్యధికంగా ఈ మహమ్మారి బారిన పడ్డారని సిలిగురి మేయర్ అశోక్ భట్టాచార్య తెలిపారు. డెంగ్యూ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య ఇబ్బందిని అప్రమత్తం చేశామని, రోగులకు అవసరమైన అన్ని సేవలు అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. -
బస్తీకి సుస్తీ!
సిటీబ్యూరో: నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాల లక్షణాలతో వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. బస్తీల్లో అపరిశుభ్ర వాతావరణం, వర్షం నీరు నిల్వ ఉండడం, దోమలు, ఈగలు పెరగడంతో ప్రజలు టైఫాయిడ్, డయేరియా, కలరా, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ైెహ దరాబాద్ జిల్లాలో 24 కలరా, 1500పైగా డయేరియా, 69 మలేరియా, 60పైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. మరోవైపు రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయని తెలిసినప్పటికీ ఆయా ఆస్పత్రుల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. వైద్యుల సంఖ్యా అంతంతమాత్రంగానే ఉంది. ఫీవర్‌కు పోటెత్తిన రోగులు రోగాలబారిన ప్రజలు చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడం, ఓపీలో తగినంత మంది వైద్యులు లేక పోవడంతో అస్వస్థతకు గురైన రోగులకు గంటల తరబడి ఓపీ క్యూలైన్లోనే పడిగాపులు తప్పడం లేదు. మధుమేహంతో బాధపడుతున్న రోగులు స్పృహ తప్పి పడిపోతుండగా, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే సమయంలో సహనం కోల్పొయిన కొంత మంది రోగులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన వైద్యాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిలోఫర్ ఓపీలో కన్పించని సీనియర్లు నిలోఫర్ ఆస్పత్రికి నవజాత శిశువులే కాకుండా 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా చికిత్సలు అందిస్తుంటారు. 550 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తగినన్ని వార్మర్లు, వెంటిలేటర్లు లేక మృత్యువాతపడుతున్నారు. ఇక జలుబు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, టైఫాయిడ్, డెంగీ, మలేరియాతో బాధపడుతున్న 12 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక పోవడంతో ఒక్కొ మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ఉదయం 8.30 గంట లకే ఓపీలో ఉండాల్సిన వైద్యులు 11 దాటినా రావడం లేదు. ఓపీ సహా అత్యవసర విభాగంలోనూ జూనియర్లు మినహా సీనియర్ వైద్యులు కన్పించడం లేదు. ఉస్మానియా, గాంధీలోనూ అదే పరిస్థితి.. ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు ఇటీవల కాలంలో రోగులు పోటెత్తుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఇన్‌పేషంట్ వార్డులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. వీరిలో జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారే అధికంగా ఉంటున్నారు. ఓపీలో వైద్యుడికి చూపించుకుని, ఆయన రాసిన టెస్టులు చేయించుకుని తిరిగి వచ్చే సరికి ఓపీ సమయం ముగిసిపోతోంది. శస్త్రచికిత్సల కోసం వచ్చిన రోగులే కాదు సాధారణ జ్వరాలతో వచ్చిన రోగులు సైతం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో పడిగాపులు గాయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరక్క పోవడంతో చాలా మంది చెట్లకిందే గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల శివారు ప్రాంతాల్లోని రైతులు, కూలీలు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వీరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో మృత్యువాతపడుతున్నారు. ఫీవర్‌లో డెంగీ కేసు నమోదు నల్లకుంట: వాతావరణంలో వస్తున్న మార్పులతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. దీంతో స్థానిక ఫీవర్ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసి పోతోంది. గురువారం ఓపీ విభాగంలో 1047 మంది రోగులు చికిత్సలు పొందారు. కాగా వీరిలో 37 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఓ డెంగీ కేసు.. రంగారెడ్డి పాత మల్లాపూర్‌కు చెందిన పార్వతదేవి(30) తీవ్రమరైన జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన అక్కడి వైద్యులు క్లినికల్ డెంగీగా నమోదు చేసుకుని ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. అబ్దుల్ బాబానగర్ కిషన్ బాగ్ నివాసిఅబ్దుల్ మాజిద్ కూతురు ఫర్హీన్ (9) తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లు బిగుసుకు పోతుంది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్సల కోసం ఫీవర్‌కు తీసుకు వచ్చారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యు టెటానస్గా నిర్ధారించి చికిత్సలు అందిస్తున్నారు. -
వ్యాధులపై అప్రమత్తం
- గ్రామాల వైద్య శిబిరాల ఏర్పాటు - వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన - డీఎంహెచ్ఓ సాంబశివరావు డెంగీపై ప్రత్యేక దృష్టి గత సంవత్సరం జిల్లాలో 244 డెంగీ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మకంగా గుర్తించిన హసన్‌పర్తి, గూడూరు, ఆజంనగర్, ములుగు, కంబాలపల్లి, వరంగల్ అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాం. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాం. ఎంజీఎం : వర్షకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన, ఆదివాసీలు నివసించే తండాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గత సంవత్సరం ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు చెపుతున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, క్షేత్రస్థాయిలో సేవలందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశామని అంటున్నారు. వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆదివారం డీఎం హెచ్ఓ ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రతీ సంవత్సరం గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు విస్తారంగా విజృంభించి ప్రజలు మంచం పట్టే పరిస్థితులు నెలకొంటున్నారుు. ఈ ఏడాది అలా జరుగకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా నివారణ మాసోత్సవంలో భాగంగా జూన్‌లో కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీలు, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా వ్యాధి- తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లో 1.50 లక్షల కరపత్రాలు పంపిణీ చేశాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు వైద్య శిబిరాలు... జిల్లాలో గతంలో వ్యాధులు విజృంభించిన ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేవాళ్లం. అయితే కలెక్టర్ వాకాటి కరుణ అదేశాలతో ప్రతి గురువారం ఆయా క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, సలహాలు, సూచనలతో పాటు అవసరమైన చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో గత ఏడాది 336 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 241 కేసులు ఏజెన్సీ ప్రాంతాల్లోనే. ఈ సంవత్సరం ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాం. 165 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తుగా స్ప్రే చేశాం. గ్రామ పంచాయతీ, పారిశుధ్య నిధులతోయాంటీ లార్వాల్ చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న 590 మంది సూపర్వైజర్లు, 1100 మంది ఏఎన్ఎంలు, 3174 మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నివారణ చికిత్సకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాం. ప్రతి శుక్రవారం డ్రై డే.. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నాం. డ్రమ్ములు, నిరుపయోగంగా ఉన్న కూలర్లు, తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకం.. ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతంలో 26 మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తారు. కలెక్టర్ అదేశాలతో ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రీయ బాల స్వస్తా కార్యక్రమంలో చేపట్టిన సిబ్బందితో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వైద్యచికిత్సలు అందిస్తున్నాం. వివిధ శాఖల సహకారంతో... సమస్యాత్మక గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు పీహెచ్సీ, పారామెడికల్ సిబ్బందితో పాటు శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారం తీసుకుంటున్నాం. ఈ శిబిరాల ద్వారా గర్భిణులు, బాలలకు పౌష్టికాహారం, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, దోమల నివారణ వంటి అంశాలపై వివరిస్తాం. -
ఢిల్లీలో 5,982 డెంగీ కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 26 నాటికి 5,982 డెంగీ కేసులు నమోదు అయినట్టు అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. డెంగీ వ్యాధి కారణంగా అధికారకంగా 17 మంది మృత్యువాత పడినట్టు సోమవారం అధికారికంగా పేర్కొంది. మరోవైపు అనాధికారికంగా డెంగీ మరణాల సంఖ్య 60కి చేరినట్టు మీడియా వెల్లడించింది. అయితే 2010 లో అత్యధికంగా డెంగీ కేసులు 6 వేలు నమోదు కాగా, 2011 లో 1,131 , 2012 లో 2,093, 2013 లో 5,574, 2014లో 995 కేసులు నమోదు అయ్యాయి. డెంగీ మరణాల సంఖ్య 2010లో 8, 2011లో 8, 2012 లో 4, 2013 లో 6, 2014 లో 3 గా నమోదయ్యాయి. -
‘గూడెం’లో ప్రబలుతున్న విషజ్వరాలు
గంగబిషన్ బస్తీలో రెండు డెంగీ కేసులు నమోదు {పభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య మున్సిపాలిటీ పాత్రపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు కొత్తగూడెం అర్బన్ : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 40 రోజులుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెతో వార్డుల్లో పేరుకపోయిన చెత్తాచెదారం, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న సిల్టుతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. స్థానిక గంగభిషన్బస్తీలో రెండు డెంగీ కేసులు బుధవారం నమోదయ్యాయి. వీరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు పట్టణంలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా విషజ్వరాల బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓపీ విభాగంలో చికిత్స కోసం రోజుకు 150 మంది వచ్చేవారు. ప్రస్తుతం దాదాపు 300 పైన రోగులు జ్వరాలతో వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మున్సిపల్ పాత్రపై అసహనం.. మున్సిపాలిటీలోని వార్డుల్లో విషజ్వరాలు ప్రబలుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో డైలీ లేబర్స్‌తో పనులు చేయిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తుందంటున్నారు. చెత్తాచెదారంతో విపరీతంగా ఈగలు, దోమలు ఇళ్లలోకి వచ్చి కుట్టడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వార్డులో దోమల నివారణకు ఫాగింగ్, దుర్వాసన రాకుండా బ్లీచింగ్ వంటివి కూడా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి వార్డుల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి నిర్వహించాలని, దీంతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
డెంగీలో జిల్లా ఫస్ట్
- రాష్ట్ర స్థాయిలో చిత్తూరులోనే అత్యధిక కేసులు - కేంద్ర, రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందం రాక - మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటన - ఏడిస్ ఈజిప్టై దోమపై ఢిల్లీలో పరిశోధనలు చిత్తూరు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసులతో పోలిస్తే మన జిల్లాలో ఈ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు, ప్రజల్లో చైతన్యం లేకపోవడంతోనే డెంగీ జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెప్పుకుంటున్నారు. అయితే ఎక్కడా లేనివిధంగా జిల్లాలో డెంగీ కేసులు విపరీతంగా నమోదవుతుండడంతో దీనిని పరిశీలించడానికి కేంద్ర భారత వైద్య మంత్రిత్వ శాఖ నుంచి డెప్యూటీ డెరైక్టర్ డాక్టర్ అమిత్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ అనురాధ మంగళవారం చిత్తూరుకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వర బాధితులను విచారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు దోమతెరలు అందించడం, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం, నిధుల విడుదలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రి సందర్శన డెంగీ జ్వరాల వ్యాప్తిపై పరిశోధన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై అనురాధ, అమిత్ ఈ నెల 7వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ కోటీశ్వరితో కలిసి డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల రూట్ మ్యాప్‌ను తీసుకున్నారు. ఈ ప్రాంతాలను సందర్శించడం, దోమల వ్యాప్తి, ఉత్పత్తి ఎలా జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎక్కువగా సమస్య ఉందని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. మంగళవారం కేంద్ర, రాష్ట్ర వైద్యాధికారులతో పాటు డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్ఎస్ సరళమ్మతో కలిసి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఇక్కడున్న చిన్నపిల్లల వార్డులో డెంగీ జ్వరాలతో బాధపడుతున్న ముగ్గురికి అందుతున్న వైద్య సేవలపై విచారించారు. అలాగే ఓ వృద్ధురాలికి సైతం డెంగీ జ్వరం ఉండడంతో ఆమెను సైతం విచారించారు. అనంతరం నగరంలోని భరత్‌నగర్ కాలనీని పరిశీలించారు. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో వ్యాప్తి మరోవైపు జిల్లాలో డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను వైద్యశాఖ గుర్తించింది. ఇందులో పీలేరు, చిత్తూరు, మదనపల్లె, రామసముద్రం మండలాల్లో 20 కంటే ఎక్కువ మందికి డెంగీ ఉన్నట్టు నిర్ధారించారు. గుర్రంకొండ, పెద్దమండ్యం, తిరుపతి అర్బన్, పలమనేరు, బంగారుపాళ్యం, నిమ్మనపల్లె, సోమల, కలికిరి, పులిచెర్ల, కేవీపల్లె, రొంపిచెర్ల, పెద్దపంజాణి, యాదమరి, ఐరాల మండలాల్లో 10 నుంచి 20 మందికి డెంగీ జ్వరాలు వచ్చాయి. బి.కొత్తకోట, కురబలకోట, చౌడేపల్లె, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, గుడిపాల, ఎస్ఆర్ పురం, తిరుపతి రూరల్, పాలసముద్రం ప్రాంతాల్లో సగటున 6-9 మందికి డెంగీ జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. దోమపై పరిశోధన ప్రత్యేక వైద్య బృందం జిల్లా పర్యటన పూర్తీ చేసుకుని వెళ్లేప్పుడు ఇక్కడ డెంగీ జ్వరాన్ని కలుగచేసే ఏడిస్ ఈజిప్టై దోమను, జ్వరంతో బాధపడుతున్న ఒకరి రక్తనమూనాను సేకరించి ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. అక్కడ దీనిపై పరిశోధన చేసి డెంగీ వ్యాప్తి నివారణ, బాధితులకు ఇవ్వాల్సిన మందులపై దృష్టి సారిస్తారు. -
జ్వరం.. భయం
- ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు - రోజూ వందల సంఖ్యలో జ్వర పీడితులు - 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు - రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారం - చేతులెత్తేసిన పట్టణ ఆరోగ్య శాఖ - వర్షం వస్తే పరిస్థితి మరింత దయనీయం - ఆందోళన చెందుతున్న వైద్యులు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఏ వీధిలో చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. రెండు వారాల నుంచి పడి ఉన్న వ్యర్థాలు విపరీతమైన దుర్గాంధాన్ని వెదజల్లుతున్నాయి. మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చాలా చోట్ల వీధుల్లో మురికి నీరు ప్రవహిస్తోంది. జనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టగానే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే ఇంటికో రోగి ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు తీవ్రంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పట్టణంలో వీధులన్నీ మురికి మయం కావడంతో డయేరియా, మలేరియా జ్వరాలు కూడా తీవ్రతరమవుతున్నాయి. పది రోజుల క్రితం వరకూ జిల్లా ప్రభుత్వాసుపత్రికి సాధారణ కేసులు మాత్రమే వచ్చేవి. జలుబు, స్త్రీల వ్యాధులు, వృద్ధుల కేసులు, ఒళ్లు నొప్పులు లాంటి వ్యాధులతో ప్రజలు ఆస్పత్రికి వచ్చేవారు. ప్రతి రోజూ 400 దాకా ఓపీ ఉండేది. వారం రోజులుగా ఓపీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ 600 మంది ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో మలేరియా జ్వరాలతో సుమారు 100 మందికి పైగా వస్తున్నారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నాలుగైదు రోజుల నుంచి ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో 20-25 మంది దాకా ఉంటున్నారు. మిగతా వారందరూ వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రికి వస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందడం వల్లే జ్వరాలు అధికమవుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారితో ల్యాబ్‌లు కిక్కిరిశాయి. పలువురికి డెంగీ అనుమానిత జ్వరాలు పట్టణంలో ఐదారు రోజులుగా డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో కూడా నాలుగు రోజుల నుంచి ప్రతి రోజూ ఒకటి, రెండు కేసులు డెంగీ అనుమానిత కేసులు వస్తున్నట్లు వైద్యులు చెప్పారు. రెండు రోజుల క్రితం రెడ్డిగారి వీధికి చెందిన ఆరేళ్ల బాలిక ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరింది. జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలికకు ప్లేట్లెట్స్ తగ్గడంతో రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. డీసీఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న బాషా అనే 23 ఏళ్ల యువకుడికి డెంగీ లక్షణాలు క న్పించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఐదారు రోజుల్లో సుమారు 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యుల సమాచారం. డెంగీ లక్షణాలున్న వారు కర్నూలు, తిరుపతిలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఇలాగే ఉంటే పరిస్థితి ప్రమాదకరం ఇప్పటికే కమలాపురం, కడప, పోరుమామిళ్ల, రాయచోటి, కొండాపురం ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దీనికి తోడు వర్షం వస్తే మాత్రం దోమల సమస్య తీవ్రతరమవుతుంది. అదే జరిగితే డెంగీ కేసులు మరిన్ని నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. జ్వరమొస్తే సొంత వైద్యం మాని ఆస్పత్రికి రావాలి’ అని పట్టణంలోని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి తెలిపారు. -
రాజధానిలో విజృంభిస్తున్న డెంగీ
న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీలో డెంగీ మళ్లీ పంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక నెల రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం జూలైలో అధిక కేసులు రికార్డయ్యాయి. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఒక వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించడంతో డెంగీ పీడితుల సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జెపీ నడ్డా వివిధ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డెంగీ వ్యాధికి సంబంధించి అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. అయితే వర్షాకాల ప్రభావంతోనే జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఆందోళన చెందాల్సిన అసరం లేదని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి మంగళవారం తెలిపారు. అన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. యాంటీ డెంగీ డ్రైవ్ చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఉండే వాతావరణం పరిస్థితులపైనే వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాగా గత ఐదేళ్లుగా డెంగీ వ్యాధి ఢిల్లీ ప్రజలను వణికిస్తోంది. 2008లో 1,300 కేసులు, 2009లో 1,153 కేసులు , 2011-12లో వెయ్యికి పైగా , 2013లో 5,500 కేసులు, 2014లో 1,000 కేసులు నమోదయ్యాయి. 2010 సంవత్సరంలో అత్యధికంగా ఆరువేల కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీంతో ఢిల్లీ నగరవాసుల్లో డెంగీ భయాందోళనలు కలిగిస్తోంది. -
అమ్మో.. డెంగీ!
చిత్తూరు (అర్బన్) : జ్వరంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్న డెంగీ జ్వరాలు ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు పాకాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి. దీనికితోడు జిల్లావ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త, కాలువల్లో నిలిచిపోయిన మురుగునీటి నుంచి దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. పగలు డెంగీ.. రాత్రి మలేరియా... డెంగీ జ్వరం ఈడిన్ ఎడిఫై అనే దోమ కాటు ద్వారా వస్తుంది. ఈ దోమ పగటి పూట మాత్రమే ఇళ్లలో సంచరిస్తూ మనుషుల్ని కుడుతుంది. నివాస ప్రాంతాల్లో నిల్వ చేసే మంచినీళ్లలో ఎడిఫై దోమలు ఉత్పత్తి అవుతూ డెంగీని వ్యాప్తి చేస్తున్నాయి. ఇక మలేరియాను కలిగించే అనాఫిలస్ దోమలు చీకటి పడితే వచ్చేస్తున్నాయి. మురుగునీటి కుంటలు, కాలువల్లో ఉంటే దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం గత ఏడు నెలల్లో 159 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే అధికారుల లెక్కల్లోకి రానివి 300లకు పైగానే ఉన్నాయి. జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు మునిసిపాలిటీలతో పాటు గుర్రంకొండ, గంగాధరనెల్లూరు, పలమనేరు ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిర్ధారణ కిట్ల కొరత ప్రభుత్వం నుంచి డెంగీ నిర్ధారణ కిట్లు సరఫరా కావడంలేదు. జిల్లాలోని 15 వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీని రెండో దశలో నిర్ధారించే కిట్లు ఉన్నాయి. మిలిగిన 94 పీహెచ్‌సీలు, 644 ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇవి లేవు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణ చేసే కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీ జ్వరాలపై విస్తృత ప్రచారం కోసం జిల్లా వైద్యశాఖలో ఎలాంటి నిధులు లేకపోవడంతో ప్రజల్లో అవగాహన రాహిత్యం నెలకొంది. అప్రమత్తంగా ఉండండి : జిల్లా కలెక్టర్ డెంగీ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరికైనా జ్వరాలు వస్తే అశ్రద్ధచేయకుండా వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్య శాలలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఏపీవీవీపీ అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని 15 ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్సెల్స్ ఏర్పాటుచేసి, వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్ధారించే పరీక్షలు చేయాలని తెలిపారు. రోగుల పరిస్థితి విషమిస్తే ఉన్నత వైద్యశాలలకు పంపి మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యశాఖ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. చైతన్యంతో నివారించండి ఇది ఏ ఒక్కరి వల్ల నివారించే వ్యాధికాదు. ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకురావాలి. ఇళ్లలో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేస్తున్నారు. వీటి నుంచి ఎడిఫై దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. గత మూడు రోజుల్లో చేసిన తనిఖీల్లో స్వయంగా నేనే చూసి, స్థానికులకు చూపించాను. ప్రతి శుక్రవారం నీళ్లను నిల్వ చేసుకోకుండా డ్రైడేను పాటించండి. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. వ్యాధిపై ఎలాంటి సందేహాలున్నా 24 గంటలు పనిచేసే ఫోన్-9849902379 కాల్ సెంటర్‌కు సంప్రదించండి. - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నివారణ చర్యలు డెంగీ జ్వరం నివారణకు ఇంటిలోపల, వెలుపల నీటి నిల్వలు లేకుండా చూడాలి. పనికిరాని కూలర్లు, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూల కుండీలు తొలగించాలి. నీటి ట్యాంక్‌కు మూతలుపెట్టాలి. జనవాసాల్లో సమష్టిగా నివారణ చర్యలు తీసుకోవాలి. దోమ తెరలు, వాడాలి. పొడుగు ప్యాంట్లు, చేదులు కనపడకుండా చొక్కాలు వేసుకోవాలి. చిన్న పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేలా దుస్తులు వేయాలి. డెంగీ లక్షణాలు కనబడితే సొంత చికిత్సలు చేసుకోరాదు. ఆస్ప్రిన్, బ్రూఫిన్, కాంబిప్లామ్, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోరాదు. - డాక్టర్ పవన్‌కుమార్, రేగళ్లు పీహెచ్సీ వైదాధికారి -
పెరుగుతున్న డెంగీ కేసులు
వాతావరణంలో మార్పులు కారణం అప్రమత్తమవుతున్న ఆరోగ్యశాఖ అధికారులు కోలారు : నగరంలో వాతావరణంలో ఏ ర్పడిన మార్పుల కారణంగా డెంగీ జ్వ రం పెరుగుతోంది. నగరంలోని అంబేద్కర్ నగర్‌తో పాటు ఇతర ప్రాంతాలలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతవరకు 13 డెంగీ కేసులు ధ్రువీకరిం చబడ్డాయి. ఒకటిన్నర నెల రోజు లు గా జిల్లాలో అడపా దడపా వానలు పడి, నీరు నిలువ ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతు న్న వారు కూడా ఎక్కువగానే ఉన్నా రు. బంగారుపేట సర్కల్ సమీపంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న పలువురికి డెంగీ సోకినట్లు అనుమానంతో ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపరీక్షలో ప్లేట్లెట్ల సంఖ్య త క్కువ కనపడితే డెంగీ అనే అనుమానంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వచ్ఛత కొరత అంబేద్కర్ నగర్లో స్వచ్ఛత కొరత వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. రోడ్డు పక్కనే చెత్తాచెదారం వేయడంతో వాన వచ్చిన సమయంలో దోమలు ప్రబలుతున్నాయి. ఆరోగ్య శాఖ డెంగీ నివారణ గు రించి ఎంతగా ప్రచారం చేస్తున్నా పలువురు నీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచడంతో కూడా డెంగీ కలిగించే దోమలు ప్రబలి స్థానిక ప్రజలు జ్వరాల బారిన ప డుతున్నారు. చెత్తను నగరసభ తీయక పోవడంతో దుర్వాసన, తద్వారా దోమలు అధిక మవుతున్నాయి. 13 డెంగీ కేసులు నగరంలో గత జనవరి నుంచి ఇంత వరకు 13 డెంగీ కేసులు మాత్రమే ధ్రు వీకరించబడ్డాయి. వానా కాలం మరింత అధిక మవుతుందేమో అనే ఆందోళనలో ప్రజలు ఉంది. కోలారులో 12, బంగారుపేటలో 1 డెంగీ కేసులు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీనికి తోడు చికెన్ గున్యా కూడా విజృంభిప్తోం ది. ఇంతవరకు 18 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. 5 మలేరియా కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. ఇంటింటా సర్వే జిల్లా వ్యాప్తంగా 5 నెలల కాలం పాటు ప్రతి ఇంటా లార్వా సర్వే కార్యాన్ని చేపట్టాం. ప్రతి తాలూకాలో 5 వేల ఇళ్లలో స ర్వే చేపట్టాము. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నాం . - డాక్టర్ వినయ్‌ఫడ్, మలేరియా నియంత్రణాధికారి -
వైద్యం.. దైన్యం
జిల్లాలో ఈ ఏడాది ప్రజా వైద్యం ఒడిదుడుకులకు లోనైంది. ఎన్నడూ లేనివిధంగా డెంగీకి ముగ్గురు చనిపోయారు. డయోరియా, మలేరియా, విజృంభించాయి. 27 మంది చనిపోయారు. వైద్యవిధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రులు ఓపీలకే పరిమితమయ్యాయి. వైద్య విద్యకు మాత్రం కలిసొచ్చింది. జిల్లా కేం ద్రంలోని వైద్య కళాశాలకు రెండవ సంవత్సరం ఎంబీబీఎస్‌కు అనుమతి లభించింది.ఉప ముఖ్యమంత్రి సందర్శించిన జిల్లా ఆస్పత్రి తీరుమారలేదు. విజృంభించిన డెంగీ వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది జిల్లాలో వ్యాధులు విజృంభించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగీ తీవ్రప్రభావం చూపింది. అధికారుల లెక్కల ప్రకారమే ముగ్గురు డెంగీ బారిన పడి చనిపోయారు. మొత్తం 115 కేసులు నమోదయ్యాయి. బోధన్‌లోని రాకాసిపేటలో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. గీత అనే మహి ళ ప్రాణాలు కోల్పోయింది. జిల్లాకేంద్రం, బాన్సువాడ, మోర్తాడ్, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, ఆర్మూర్ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి. 2013లో జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 115కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు వివిధ రకా ల వ్యాధులు గ్రామీణ ప్రజలను పీడించాయి. డయేరియా-61, మలేరి యా-216, విషజ్వరాలు-281, ఇతర వ్యాధులు నమోదయ్యాయి. వివిధ వ్యాధుల కారణంగా 27మంది చనిపోయారు. ఈలెక్క అనధికారికంగా 100కు పైగా ఉండొచ్చు. ప్రైవేటు ఆస్పత్రుల నిరసన ఈ ఏడాది పలు ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల శైలి వివాదస్పదంగా మారింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతిచెందడంతో, అనంతరం వారి రోగి బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. దీంతో ఆగ్రహించిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు నాలుగు రోజుల పాటు తమ సేవలను నిలిపివేసి, నిరసన తెలిపారు. దీంతో వైద్యం అందక ధర్పల్లికి చెందిన జ్యోత్స్న అనే బాలిక మృతి చెందింది. దీంతో ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల వారు వైద్యుల తీరుపై మండిపడ్డారు. వైద్యశాఖలో మార్పు లేదు జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 375 ఉపకేంద్రాలు ఉన్నాయి. 120 మంది వైద్యులు , 14 క్లస్టర్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఖాళీల కొరత తీవ్రంగా ఉండటం వైద్యసేవలపై ప్రభావం పడింది. తెలంగాణ ఏర్పడడం, కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని వైద్యశాఖకు చెందిన 430మంది భావించారు. కానీ వారి కల ఈ ఏడాదికి నెరవేరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవల కోసం చేపట్టిన 104 సేవలు నామమాత్రంగానే కొనసాగాయి. ఈ ఏడాది కొత్తగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తొమ్మిది సంచార వైద్యబృందాలు ఏర్పాటు చేశారు. కళాశాలకు కలిసొచ్చింది జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు 2014 కలిసొచ్చింది. ఈ ఏడాది కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరానికి అనుమతి లభించింది. ఫిబ్రవరి, మే నెలల్లో తనిఖీ చేసిన ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం జులై 16న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 సీట్లతో అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 6న డీఎన్బీ(డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డు) కోర్సుల ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ కళాశాలకు మెడిసిన్, గైనిక్, సర్జరీ, ఫిజిషియన్, మత్తుమందు వైద్య కోర్సుల ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. డిసెంబర్లో అదనంగా 50ఎంబీబీఎస్ సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎంసీఐ సానుకూలంగా స్పందించింది. కళాశాలకు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం కేటాయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగింది. నర్సింగ్‌కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి చేశారు. కానీ పోస్టుల భర్తీని మాత్రం ఇప్పటి వరకూ చేపట్టలేదు. వివిధ విభాగాల కోసం సుమారు 200 మంది ఉద్యోగుల నుంచి డిప్యూటేషన్ ఆప్షన్లు తీసుకున్నారు. కానీ విధుల్లో మాత్రం చేరలేదు. దీంతో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్లు, పీజీ వైద్యుల కేటాయింపు జరిగింది. దీంతో 200 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చినట్లయింది. సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు -109 మంది, కళాశాలకు కేటాయించబడిన-110 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేటాయించబడ్డారు. కానీ వైద్యులు మాత్రం ఆస్పత్రికి వచ్చి సేవలు అందించడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం 30 నుండి 35 మంది వైద్యులే అందుబాటులో ఉంటున్నారు. కలెక్టర్, డీఎంఈ హెచ్చరించినా వైద్యుల తీరులో మార్పు రాలేదు. వైద్య‘విధానం’ మారలేదు జిల్లాలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఆస్పత్రుల్లో ఈ ఏడాది మెరుగైన పరిస్థితులు నెలకొనలేదు. ఆస్పత్రులన్నీ కేవలం అవుట్ పేషెంట్ విభాగాలకే పరిమితమయ్యాయి. మెడికల్ కళాశాల ఏర్పడిన తర్వాత వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలో బదిలీ అవుతుందని ప్రకటించినా ఇప్పటికీ జరగలేదు. దీంతో మెడికల్ కళాశాల వైద్యులు , వైద్య విధాన పరిషత్ వారి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, మద్నూరు, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లోనూ ఖాళీల కొరత వేధిస్తోంది. జిల్లాలో 36 మంది వైద్యులు, 32 స్టాఫ్‌నర్సులు, 52 మంది నాల్గోతరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజీ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించి, అత్యవసర చికిత్సకు సంబంధించి సేవలు అందడం లేదు. ఏరియా ఆస్పత్రులకు రెగ్యులర్ డీసీహెచ్ఎస్ లేక రెండేళ్లు గడుస్తోంది. -
రక్తం ధర ఇష్టారాజ్యం..
సాక్షి, ముంబై: నగరంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో రక్తానికి డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని పలు బ్లడ్‌బ్యాంక్‌లు రక్తం ధరను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో సరిపడా రక్తం కొనుగోలు చేయలేక పలువురు డెంగీ వ్యాధిగ్రస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రక్తం ధరల నియంత్రణకు నడుం బిగించింది. ఈ మేరకు బీఎంసీ అడిషినల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎంసీ స్థిరీకరించిన రక్తం ధరలనే నగరంలోని అన్ని బ్లడ్బ్యాంకలు, ఆస్పత్రులు పాటించాలని సూచించారు. అలాగే ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు... బ్లడ్ డోనర్ల కోసం చూస్తున్న రోగుల బంధువుల నుంచి బ్లడ్ కోసం వత్తిడి చేయకూడదన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్, ప్లేట్లెట్ల కొరత లేదని దేశ్‌ముఖ్ తెలిపారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా బ్లడ్‌ను సిద్ధం చేస్తామన్నారు. అలాగే బ్లడ్ బ్యాంక్‌లు తమ ఆవరణలో బ్లడ్ యూనిట్ ధరలను అందరికీ కనబడేలా డిస్ప్లే చేయాలని బీఎంసీ సూచించింది. తాము నిర్ణయించిన దాని కంటే అధికంగా వసూలు చేయవద్దని ఆదేశించింది. తాము యూనిట్‌కు నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధర ఎవరైనా వసూలుచేస్తే.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి బ్లడ్ బ్యాంకుల లెసైన్సులు, ఎన్వోసీ లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్టేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ డాక్టర్ గోమారే, సైన్ ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ సుపే తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్‌కు చెందిన బ్లడ్ బ్యాంక్‌లో రక్తం యూనిట్ ధరను రూ.540 నుంచి రూ.1,050కు పెంచినట్లు చెప్పారు. అలాగే ప్రైవేట్, చారిటబుల్ బ్లడ్ బ్యాంకుల్లో రూ.850 నుంచి రూ.1,450 వరకు పెంచారు. -
ఒడిశాలో భారీగా డెంగ్యూ కేసులు
ఒడిశాలో ఈ ఏడాది భారీగా డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటివరకు 5,535 డెంగ్యూ కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా శనివారం మరో 31 డెంగ్యూ కేసులు నిర్దారణ అయినట్టు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ నమోదైన 11 డెంగ్యూ కేసులు జైపూర్ తీరప్రాంతంలోనని నివేదికలో వెల్లడైంది. దాంతోపాటు జగత్సింగ్పూర్ జిల్లాలో కూడా 8కేసులు నమోదైయ్యాయి. ఇప్పటికే డెంగ్యూ వైరస్ సోకిన 73మంది బాధితులు ప్రస్తుతం కటక్‌లోని చంద్ర బంజా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురికి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. అయితే గత ఏడాది 6వేల 753మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా వారందరికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. -
జిల్లాలో 34 డెంగీ కేసులు
దమ్మపేట/ములకలపల్లి: జిల్లాలో ఇప్పటివరకు 34 డెంగీ కేసులు నమోదయ్యాయని, మరణాలు మాత్రం సంభవించలేదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ములకలపల్లి మండలంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..జ్వరం వచ్చిన 24 గంటల వ్యవధిలోనే మలేరియా టెస్ట్ చేయించాలన్నారు. డెంగీ జ్వరమొస్తే 105, 106 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, వరుసగా ఐదు రోజులపాటు జ్వరమొస్తే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల కోసం ఏడు లక్షల డెంగీ పరీక్ష (ఆర్డీటీ) కిట్లు వచ్చాయని, మలేరియా నివారణకు ఈమాల్ ఇంజెక్షన్లు అందుబాటలో ఉన్నాయని తెలిపారు. ఏజ్వరమొచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయని, కంగారు చెందొద్దని తెలిపారు. 50వేలకుపైగా ప్లేట్లెట్లు తగ్గితేనే కొత్తగా ఎక్కించాల్సి ఉంటుందన్నారు. రూ.30 లక్షలతో మొదటి విడత 959 గ్రామాల్లో, రెండో విడత 600 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేసినట్లు వివరించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారి గోపాల్, హెచ్ఈఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది వున్నారు. గిరిజన గురుకుల పాఠశాల సందర్శన.. దమ్మపేటలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. పాఠశాల విద్యార్థి నరేందర్ డెంగీ జ్వరంతో చనిపోలేదని తెలిపారు. ఎలా చనిపోయాడనేది మమత ఆస్పత్రి నుంచి నింవేదిక రావాల్సి ఉందని తెలిపారు. పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఆయన వంఎట వైద్య, ఆరోగ్యశాఖ సత్తుపల్లి క్లష్టర్ ఇన్చార్జ్ భాస్కర్‌నాయక్, దమ్మపేట వైద్యాధికారి కిషోర్, రామారావు ఉన్నారు. -
విజృంభిస్తున్న డెంగీ
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే జంటనగరాల్లో డెంగీ విజృంభిస్తోంది. పింప్రి-చించ్వడ్ పట్టణాల్లో అత్యధికంగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో దోమల బెడద తీవ్ర రూపం దాల్చడంతో ఈ దుస్థితి దాపురించింది. వ్యాధి నివారణలో కార్పొరేషన్, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. రెండోస్థానంలో పింప్రి, చించ్వడ్ ముంబై నగరంలో 178 మంది డెంగీ రోగుల సంఖ్య నమోదు అయ్యాయి. పింప్రి, చించ్వడ్ నగరాలు రెండో స్థానాల్ని ఆక్రమించాయి. ఇక్కడ డెంగీ రోగుల సంఖ్య 58. ఠాణేలో 59 మంది డెంగీ రోగుల సంఖ్య నమోదైంది. డెంగీ రోగుల విషయంలో పుణే జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెంగీ కారణంగా నలుగురు మరణించారు. ఇందులో పుణేకు చెందిన ఒక రోగి కూడా ఉన్నారు. 2012లో పుణే నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాలతో కలిపితే డెంగీ రోగుల సంఖ్య 833 గా నమోదైంది. ఇందులో 8 మంది మరణించారు. 2013లో డెంగీ రోగుల సంఖ్య 833గా నమోదు కాగా, తొమ్మిది మంది మరణించారని రాష్ర్ట ఆరోగ్య సహాయక డెరైక్టర్ డాక్టర్ కాంచన్ జగతాప్ తెలిపారు. దోమల నివారణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పుణే కార్పొరేషన్ నగరంలోని హౌసింగ్‌సొసైటీలు, జోపడ్‌పట్టీల పరిసరాల్లో, ఇళ్లలోని నీటి ట్యాంకులతోపాటు పరిసరాల్లో పడిన వృథా సామగ్రి కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల వ్యాప్తికి ఇదే ప్రముఖ కారణంగా వైద్యులు పేర్కొన్నారు. దోమల నివారణలో భాగంగా ముందుగా పరిసరాలు, ట్యాంకర్లను శుభ్రపరచుకోవాలని కొర్పొరేషన్ ఆరోగ్య విభాగం తెలిపింది. నగరంలోని సహకార నగర్, తిలక్ మార్గంలో దోమల వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని కార్పొరేషన్ కీటక నాశక విభాగం తెలిపింది. నగరంలో ఇప్పటి వరకు 73,893 దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో 40,135 ప్రాంతాలు శాశ్వతంగా దోమలకు నిలయాలుగా మారాయి. 33,758 ప్రాంతాలు దోమల వ్యాప్తికి, వర్షాకాలంలో నిలిచే నీటి వల్ల ఉత్పత్తి అయ్యేవిగా గుర్తించినట్లు ఈ విభాగం అధికారి డాక్టర్ వైశాలీ జాధవ్ తెలిపారు. నగరంలో 24,900 నీటి ట్యాంకులలో డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు, 23,630 ప్రాంతాల్లో పనికిరాని వస్తువుల కారణంగా డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలో హడప్సర్లో 12,650 ప్రాంతాలు దోమలకు నిలయాలుగా మొదటి స్థానంలో ఉండగా, సహకార్ నగర్, తిలక్ మార్గం ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీటితోపాటు డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు, చెత్త కుండీలు, గుంతల్లో నీరు నిలిచిన ప్రాంతాలలో ఈ దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొదటగా విద్యార్థులకు అవగాహన డెంగీ రోగ కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొదటి సారిగా ప్రభుత్వ ఆరోగ్య విభాగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. డెంగీ రోగ నిరోధకంపై పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించనున్నారు. మొదటగా జిల్లా పరిషత్ పాఠశాల్లోని విద్యార్థులకు ఈ విషయాల గురించి తెలియజేయనున్నట్లు డాక్టర్ జగతాప్ తెలిపారు. పుణే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 600 పాఠశాలల్లో ఈ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించనన్నామన్నారు. -
జిల్లాలో డెంగీ విజృంభణ
17 డెంగీ కేసులు నమోదు ఆంధ్ర వైద్య కళాశాలలో 216 నమూనాల పరిశీలన 17 మందికి వ్యాధి సోకినట్లు నిర్థారణ జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు వెల్లడి మాడుగుల : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. 216 మందికి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ (కేజీహెచ్)లో రక్తపరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని జిల్లా మలేరియా అధికారి కేవీఎస్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం డి.గొటివాడలో పరిశీలనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వరుసగా ఐదు రోజుల తీవ్రంగా జ్వరం వచ్చి... కీళ్లనొప్పులు, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు ఉంటే డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించాలని సూచించారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆంధ్రా మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు లేకుండా చేసుకుంటే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. ఈయన వెంట ఎస్పీహెచ్వో శ్రావణ్‌కుమార్, వైద్యసిబ్బంది పరిశీలనలో పాల్గొన్నారు. -
రాష్ట్రంలో డెంగీ జోరు
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం మేర ఎక్కువగా నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో అంటువ్యాధుల జోరు పెరుగుతుందేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు.. చంద్రాపూర్ జిల్లాలో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 350 డెంగీ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాలు కురిసినపుడు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు బాగా వృద్ధి చెందుతాయని, అందువల్ల ఈ కాలంలోనే డెంగీ కేసులు ఎక్కువాగా నమోదవుతాయని జస్లోక్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఓం శ్రీవాస్తవ తెలిపారు. ఈ దోమల వృద్ధిని నిరోధించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన నగరప్రజలకు సూచించారు. విద్యార్థులకు కూడా నిల్వఉన్న నీటిలో దోమల వృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో డెంగీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రబలుతున్న వ్యాధిగా తేలిందని ఆయన వివరించారు. విద్యార్థులకు అవగాహన దోమల వృద్ధిపై పాఠశాల విద్యార్థులకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల అవగాహన కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలని, వీటి వల్లనే వీటి ద్వారా దోమలు వృద్ధి చెంది రోగాల బారినపడతామంటూ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద కార్పొరేషన్ వైద్యులు కొంతమంది ఇప్పటికే పాఠశాలలకు వెళ్లి మరీ అవగాహన కల్పిస్తున్నారు. దోమల వృద్ధిని ఎలా గుర్తించాలి? వాటిని ఎలా నియంత్రించాలి? తదితర అంశాలను విద్యార్థులకు వారు బోధిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా విస్తరించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. కాగా 55 శాతం డెంగీ కేసులు భవనాలలో నివాసముంటున్న వారికి అదేవిధంగా నాన్ స్లమ్ ఏరియాలో ఉంటున్న వారిలోనే నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా 85 శాతంమందికి ఇంటిలో పుట్టిన దోమల వల్లనే డెంగీ వ్యాపించిందని ఓ సర్వేలో తేలింది. కాగా 2013లో కార్పొరేషన్ ఆస్పత్రులలో 927 డెంగీ కేసులు నమోదుకాగా, వాటి బారినపడి 11 మంది మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి నగరంలో 168 డెంగీ కేసలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యాయి. -
జిల్లాకు జ్వరమొచ్చింది
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :అవును.. జిల్లాకు జ్వరమొచ్చింది. పట్టణం.. గ్రామీణ ప్రాంతాలనే తేడాలేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఎవరిని కదిపినా మలేరియూ.. టైఫాయిడ్ జ్వరమనే చెబుతున్నారు. అక్కడక్కడా డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. చికున్ గున్యా కేసులైతే లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధికులకు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం... జిల్లా మలేరియా నివారణ అధికారి ఎ.రామరాజు నవంబర్ 14న తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంలో వెల్లడించిన గణాంకాల ప్రకారం జిల్లాలో అప్పటివరకూ 607 మలేరియూ కేసులు నమోదయ్యూయి. 17 డెంగీ కేసులు సైతం నమోదైనట్టు ఆయన స్పష్టం చేశారు. తాళ్ళముదునూరుపాడులో డెంగీ లక్షణాలతోమృతి చెందిన వెలగల అనంతలక్ష్మి కుటుం బాన్ని ఆయన పరామర్శించారు. ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక నకళ్లను ఆ సందర్భంలో సేకరించారు. ఆ తరువాత 16 రోజుల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం నమోదైన మలేరియూ, డెంగీ కేసులు ఆందోళన కలిగిస్తుంటే.. అనధికారికంగా ఈ తరహా కేసులు అనేకం ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. డెంగీ అనుమానాస్పద కేసులు నమోదు అవుతున్నా వైద్యాధికారులు మాత్రం అవేమీ డెంగీ కాదని, సాధారణ జ్వరాలేనని కొట్టిపారేస్తున్నారు. పారిశుధ్య పరిస్థితులు క్షీణించడం వల్ల దోమలు పెరిగిపోరుు సాధారణ జ్వరాలు విజృంభిస్తున్నాయని తేల్చేస్తున్నారు. డెంగీ కేసులు తక్కువేమీ కాదు వైద్య అధికారులు జిల్లాలో డెంగీ జాడలు లేవంటున్నారు. మొన్నటివరకూ 17 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యూయని, ఇదేమీ ఆందోళన కలిగించే విషయం కాదని చేతులు దులిపేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారుు. జ్వరాల బారిన పడిన అత్యధికుల్లో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతోంది. తాడేపల్లిగూడెం పరిధిలో డెంగీ అనుమానాస్పద కేసులు 3 ఉన్నట్లు తెలుస్తోంది. తాళ్ళముదునూరుపాడులో రెండు డెంగీ అనుమానాస్పద కేసులు, తాడేపల్లిగూడెంలో ఒకటి ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెదతాడేపల్లి, జువ్వలపాలెం ప్రాంతాల్లో టైఫాయిడ్ విజృంభిస్తోంది. యాగర్లపల్లి, వీకర్స్కాలనీలోనూ ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. నిడదవోలులోనూ డెంగీ అనుమానాస్పద కేసులు రెండు నమోదు అయ్యాయి. ఏలూరు నగరంలో ఇద్దరు వ్యక్తులు డెంగీ బారిన పడినట్లు తెలుస్తోంది. జ్వరాలతో రోజూ కనీసం ఐదారుగురు తగ్గని జ్వరాలతో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య లెక్కకు అందనంత స్థాయిలో ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తణుకు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోనూ విషజ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ పడకేసింది ఏజెన్సీ గ్రామాలను మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కుదిపేస్తున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం 40నుంచి 50 మంది వరకు జ్వరాలతో మంచాలు పట్టారు. రేకులపాడు, రేపల్లె, చింతపల్లి, చింతకొండ, గుట్టాలరేవు, కన్నారప్పాడు వంటి గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభించడంతో గిరిజనులు విలవిల్లాడిపోతున్నారు. అధికారులెవరూ ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదు.