పెరుగుతున్న డెంగీ కేసులు | Dengue cases are Rising | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న డెంగీ కేసులు

Published Mon, Jun 1 2015 5:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

పెరుగుతున్న డెంగీ కేసులు

పెరుగుతున్న డెంగీ కేసులు

వాతావరణంలో మార్పులు కారణం
అప్రమత్తమవుతున్న ఆరోగ్యశాఖ అధికారులు

 కోలారు : నగరంలో వాతావరణంలో ఏ ర్పడిన మార్పుల కారణంగా డెంగీ జ్వ రం పెరుగుతోంది. నగరంలోని అంబేద్కర్ నగర్‌తో పాటు ఇతర ప్రాంతాలలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతవరకు 13 డెంగీ కేసులు ధ్రువీకరిం చబడ్డాయి. ఒకటిన్నర నెల రోజు లు గా జిల్లాలో అడపా దడపా వానలు పడి, నీరు నిలువ ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతు న్న వారు కూడా ఎక్కువగానే ఉన్నా రు. బంగారుపేట సర్కల్ సమీపంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న పలువురికి డెంగీ సోకినట్లు అనుమానంతో ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తపరీక్షలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య త క్కువ కనపడితే డెంగీ అనే అనుమానంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

 స్వచ్ఛత కొరత
 అంబేద్కర్ నగర్‌లో స్వచ్ఛత కొరత వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. రోడ్డు పక్కనే చెత్తాచెదారం వేయడంతో వాన వచ్చిన  సమయంలో దోమలు ప్రబలుతున్నాయి. ఆరోగ్య శాఖ డెంగీ నివారణ గు రించి ఎంతగా ప్రచారం చేస్తున్నా పలువురు నీటిని ఎక్కువ కాలం నిలువ ఉంచడంతో కూడా డెంగీ కలిగించే దోమలు ప్రబలి స్థానిక ప్రజలు జ్వరాల బారిన ప డుతున్నారు. చెత్తను నగరసభ తీయక పోవడంతో దుర్వాసన, తద్వారా దోమలు అధిక మవుతున్నాయి.

 13 డెంగీ కేసులు  
 నగరంలో గత జనవరి నుంచి ఇంత వరకు 13 డెంగీ కేసులు మాత్రమే ధ్రు వీకరించబడ్డాయి. వానా కాలం మరింత అధిక మవుతుందేమో అనే ఆందోళనలో ప్రజలు ఉంది. కోలారులో 12, బంగారుపేటలో 1 డెంగీ కేసులు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీనికి తోడు చికెన్ గున్యా కూడా విజృంభిప్తోం ది. ఇంతవరకు 18 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. 5 మలేరియా కేసులు కూడా నమోదు కావడం గమనార్హం.

 ఇంటింటా సర్వే    
 జిల్లా వ్యాప్తంగా 5 నెలల కాలం పాటు ప్రతి ఇంటా లార్వా సర్వే కార్యాన్ని చేపట్టాం. ప్రతి తాలూకాలో 5 వేల ఇళ్లలో స ర్వే చేపట్టాము. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఇళ్లలో సర్వే నిర్వహిస్తున్నాం .
 - డాక్టర్ వినయ్‌ఫడ్, మలేరియా నియంత్రణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement